8, డిసెంబర్ 2020, మంగళవారం

తిలకధారణము

 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀తిలకధారణము🍀🍀🍀

యఙ్ఞోపవీతధారణము, శిఖాబంధనంహవలెనే తిలకధారణము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇది బ్రాహ్మణులు కే పరిమితమైనదిగా భావించడం పొరపాటు. క్షత్రియులు కూడా తిలకధారణము చేయడం మనం గమనిస్తూనే ఉన్నాంగదా! రాజులకు రాజ్యాభిషేక వేళలో రాజతిలకం దిద్ది మహోత్సవం జరిపేవారు. అందుకే దానిని రాజతిలకం అనేవారు. రాజతిలకం లేకుండా పీఠము ను అధిరోహించే అధికారం లేదని భావించేవారు. అక్కడ అధికారం తిలకం ద్వారానే గుర్తింపబడినది. ఈ తిలకధారణము ఈనాటిది కాదు. ప్రాచీనకాలం నుంచి ఉంది. శ్రీరామచంద్రమూర్తి కూడా ముఖానికి చందనతిలకం ధరించినట్లు వాల్మీకిమహర్షి వర్ణించాడు.

        ఏ దేవాలయానికి వెళ్లిన పూజారి మన ముఖానికి బొట్టుపెట్టి ఆశీర్వచనము చేయడం నేటికీ మనకు తెలిసిందే కదా! హోమాది వైదిక ప్రక్రియలలో బొట్టుపెట్టుకోవడం ఆవశ్యకమైన విధి. ఇంతకీ సారాంశం ఏమిటంటే శూన్యలలాటంతో దైవసంబంధమైన కార్యక్రమాలు ఏవైనా నిషిద్ధ మే!

వినాభస్మ త్రిపుండ్రేన వినా రుద్రాక్ఘమాలయా!

పూజితో పి మహాదేవీ నస్యాత్ తస్య ఫలప్రదహ!!


తిలకం(బొట్టు) అనేక విధాలుగా ఉంటుంది. మ్రుత్తిక, భస్మం, చందనం, కుంకుమ, సింధూరం, మొదలైనవి.

సంధ్యా తర్పణాదులకు పూర్వమే తిలకధారణము చేయడం పరమావశ్యకమైన విధిగా భావించబడింది. నొసటన తిలకం ధరించకుండా చేసే స్నానం, దానం, తపం, యఙ్ఞం, దేవ పితృ కర్మలు సర్వదా నిష్ఫలమవుతాయి. నుదుట బొట్టు పెట్టుకున్నాకనే బ్రాహ్మణులు సంధ్యా తర్పణములు నిర్వర్తించాలి. ఏ తిలకాన్ని ఏవిధంగా ధరించాలి అన్నది విశేషం గా పేర్కొనబడింది. ఊర్ధ్వపుండ్రాన్ని మ్రుత్తిక లో ధరించాలి. త్రిపుండ్రం ను భస్మము తో ధరించాలి. చందనం తోటి రెండు విధాలైన తిలకాన్ని అభ్యంగ, ఉత్సవరాత్రులలో ధరించాలి.

     ఆనామికలో చేసే తిలకధారణము వలన శాంతి, మధ్య వ్రేలు తో ఆయుః వ్రుద్ధి, అంగుష్టంతో పుష్టి, తర్జనితో మోక్ష ప్రాప్తి కలుగుతాయని పేర్కొన్నారు. సేకరణ 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: