👇👇🙏👇👇వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత .... అసలు చట్టంలో ఏముంది?
ముందుగా బిల్లుకి చట్టానికి to తేడా తెలుసుకోవాలి. పార్లమెంటులో ఆమోదం పొందేవరకు, రాష్ట్రపతి సంతకం అయ్యి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేవరకు అది బిల్. నోటిఫికేషన్ వచ్చాక చట్టం.
ఈ చట్టం పేరు
The Farmers (Enpowerment And Protection) Agreement on Price Assurance And Farm Services Act 2020. Act 20 of 2020
ఈ బిల్లుని లోక్ సభలో సెప్టెంబరు 14న, రాజ్యసభలో సెప్టెంబరు 20న ప్రవేశపెట్టడం జరిగింది. చర్చలు లోక్ సభలో 17వ తేదీన, రాజ్యసభలో 20వ తేదీన జరిగాయి. అవి ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదం పొంది 24వ తేదీన గజెట్ నోటిఫికేషన్ విడుదల అవడం ద్వారా చట్ట రూపం పొందింది.
అదే విధంగా The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation) Act 2020 కూడా. Act 21 of 2020.
ఈ చట్టాలు ఏం చెబుతున్నాయి?
మొదటగా 20 of 2020 తీసుకుందాం.
ఇది retrospective effect తో అంటే 05-06-2020 నుండి అమలులోకి వస్తుంది. ఆ రోజున ఆర్డినెన్స్ విడుదల చేసింది కేంద్రం.
ముందుగా Farm Services అంటే ఏమేమి వస్తాయి?
విత్తనాల సరఫరా, ఫీడ్, దాణా, ఆగ్రో కెమికల్స్, ఆగ్రో మెషినరీ & టెక్నాలజీ, సలహాలు, నాన్ కెమికల్ ఆగ్రో ఇన్ పుట్స్ మరియు ఇతరములైన వ్యవసాయ సంబంధిత ఇన్ పుట్స్ ....
రైతు అంటే ఎవరు?
స్వయంగా కానీ, కూలీలతో చేయించేవారు కానీ, కౌలు ద్వారా చేయించే వారు, Farmer Producer Organizations.
అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ అందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
స్పాన్సర్ అంటే ఎవరు?
ఒక వ్యక్తి లేదా కంపెనీ లేదా భాగస్వామ్యం లేదా Farm Production Organization లేదా లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్యం లేదా కోఆపరేటివ్ సొసైటీ లేదా సొసైటీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ప్రత్యేకంగా ఇందుకోసం ఏర్పడిన అసొసియేషన్ ....
Farming Agreement అంటే వ్రాతపూర్వకంగా రైతుకి, స్పాన్సర్ మధ్య లేదా రైతుకి, స్పాన్సర్ కి, మూడవ పార్టీకి మధ్య జరిగే ఒప్పందం. ఈ ఎగ్రిమెంటు నాట్లు వెయ్యడానికి ముందు లేదా rearing of farming produce (In case of Live Stock) కు ముందు చేసుకోవాలి. ఈ ఒప్పందంలో నిర్ణీతమైన నాణ్యతను ముందుగానే రాసుకోవాలి. ఆ ప్రకారం ఒప్పందం మేరకు స్పాన్సర్ రైతు దగ్గర కొని తీరాలి. ఈ ధర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు తగ్గకుండా ఉండాలి. అలాగే ఫామ్ సర్వీసెస్ కూడా అందించే క్లాజులను కూడా చేర్చుకోవచ్చు. S.2(g)
ఈ Farming Agreement మూడు రకాలుగా విభజించారు
Proviso i - Trade and commerce agreement. ఇందులో ప్రొడక్షన్ అంతా రైతు చేతిలోనే ఉంటుంది. ముందుగా కుదుర్చుకున్న రేటుకి స్పాన్సర్ కు అమ్మవలసి ఉంటుంది.
Proviso ii - Production Agreement. ఇందులో స్పాన్సర్ అన్ని రకాల లేదా కొన్ని రకాల సేవలు రైతుకి అందిస్తాడు. దీనికి రైతు కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది.
Proviso iii - పై రెండు రకాలు కాకుండా ఏ ఇతరమైన ఎగ్రిమెంట్లు లేదా పై రెండు కలిపి కానీ రైతు, స్పాన్సర్ ల మధ్య కుదర్చుకోవచ్చు.
ఉదాహరణకు సాయిల్ టెస్టింగ్, విత్తన సరఫరా, ఎరువులు, పురుగు మందు, సస్య రక్షణ, సస్యరక్షణకు తగిన సలహాలు ఇవ్వడం వంటివి ఉంటాయి.
Farming Produce - నూనెలు, నూనె గింజల ఉత్పత్తి, వరి, గోధుమ, పప్పు దినుసులు, కూరలు, పండ్లు, గింజలు (వేరుశనగ వంటివి), మసాలా దినుసులు, చెఱకు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పందుల పెంపకం, మేకలు, గొఱ్ఱెలు! చేపల పెంపకం, డెయిరీ .... నేచురల్ లేక ప్రాసెస్డ్ రూపంలో కాని.
ఇంకా పశు దాణా, కాటన్, ginned or unginned, కాటన్ సీడ్స్, జౌళి ఉత్పత్తులు.
ఈ ఎగ్రిమెంటు కనీస కాల వ్యవధి ఒక పంట కాలం, గరిష్ట వ్యవధి ఐదు సంవత్సరాలు. పంట కాలం ఐదేళ్ళకన్నా ఎక్కువ ఉంటే రైతు, స్పాన్సర్ పరస్పర అంగీకారంతో ఎగ్రిమెంటు వ్యవధిని పెంచుకోవచ్చు.
అందరికీ ఉపయోగపడే విధంగా కేంద్రం ఒక నమూనా ఎగ్రిమెంటుని తయారు చేసి విడుదల చేస్తుంది.
ఎగ్రిమెంట్ ధర మార్కెట్ ధరకన్నా తక్కువ ఉంటే ఏం చెయ్యాలన్న విషయం కూడా ఎగ్రిమెంట్ లోనే పొందుపరుస్తారు.
స్పాన్సర్ పంటను రైతు వద్దనే తీసుకునేట్లయితే ఎగ్రిమెంటులో ముందుగా నిర్ణయించుకున్న సమయంలోగా రైతు వద్దకే వచ్చి తీసుకోవాలి S.6(1)(a)
ఒక వేళ రైతే పంటను స్పాన్సర్ వద్దకు చేర్చేట్లుగా ఒప్పందం అయితే స్పాన్సర్ ఆ పంటను రైతు తీసుకురాగానే accept చెయ్యాలి. ఆ తరువాత పంట తాలూకు బాధ్యత అంతా స్పాన్సర్ దే.S.6(1)(b).
పంట సొమ్ము రైతుకి ఎప్పుడు చెల్లించాలి?
S.6(3)(a)
Seed Production agreement అయితే 66% డెలివరీ సమయంలోనూ, మిగతా సొమ్ము Seed Certification అయిన తరువాత చెల్లించాలి. అయితే ఈ వ్యవధి 30 రోజులకు మించరాదు.
S.6(3)(b) మిగతా పంటలు లేదా లైవ్ స్టాక్ విషయంలో డెలివరీ సమయంలోనే మొత్తం చెల్లించాలి.
ఈ చెల్లించిన మొత్తాలకు రసీదులు ఇవ్వాలి.
సొమ్ము ఏ విధంగా చెల్లించాలి అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఎగ్రిమెంటు అమలు విషయంలో తగాయిదాలు వస్తే పరిష్కరించడానికి కన్సీలియేషన్ బోర్డు ఉంటుంది. ఇందులో రైతులకు, స్పాన్సర్లకు సమన్యాయం జరిగేలా ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ బోర్డు తన నిర్ణయాన్ని 30 రోజులలో తీర్మానించాలి. ఈ బోర్డు నిర్ణయం నచ్చని పక్షంలో ఏ పార్టీ అయినా అపీల్ చేసుకోడానికి Sub Divisional Magistrate (RDO) కు వెళ్తుంది. సదరు RDO అప్పిలేట్ బోర్డును నియమిస్తారు. ఇక్కడ కూడా 30 రోజుల వ్యవధిలోనే తీర్మానం చెయ్యవలసి ఉంటుంది.
ఈ తీర్మానం ఇరు పార్టీలను బైండ్ చేస్తుంది.
ఎగ్రిమెంట్ లో Conciliation board ప్రస్థావన లేకపోతే RDO బోర్డును ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు నిర్ణయం ఫైనల్. ఈ విషయంలో కోర్టుల జోక్యం ఉండదు. కానీ బోర్డుకు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
బోర్డు తీర్మానం ప్రకారం స్పాన్సర్ చెల్లించకపోతే ఎగ్రిమెంట్ ఎమౌంటుకు ఒకటిన్నర రెట్లు వసూలు చేసి రైతుకి ఇచ్చే అధికారం బోర్డుకి ఉన్నది.
ఒకవేళ రైతు చెల్లించవలసి వస్తే మాత్రం actual cost మాత్రమే చెల్లించాలి.
ఇక్కడ మనకు వచ్చే సందేహం .... force majere అంటే మన చేతుల్లో లేని పరిస్థితుల వల్ల నష్టం ఏర్పడితే ఏమిటి పరిస్థిత.?
రైతుకు జరిమానా విధించేందుకు ఎవరికీ ఎటువంటి అధికారం లేదు.
ఒకవేళ రైతు నష్ట పరిహారం చెల్లించవలసి వస్తే అతడి భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికీ లేదు.
ఈ చట్టంలోని S.3(4) ప్రకారం పంట నాణ్యతను, లైవ్ స్టాక్ నాణ్యతను పరిశీలించి ధృవీకరణ చెయ్యడానికి ఇరువురి ఒప్పందం మేరకు వ్యవసాయంలో నిష్ణాతులు అయిన వారిని నియమించుకోవచ్చు. (Qualified Assayers)S.4(4).
కానీ కొన్ని నిత్యావసరాలను Essential Commodities Act నుండి తొలగించారు.
ఎందుకు?
పంట బాగా పండిన చోట ధర తక్కువ ఉంటుంది. డిమాండ్ ఉన్నచోట పంట దొరకదు. అక్కడ రేటు విపరీతంగా ఉంటుంది. ఉదాహరణకు ఉల్లిపాయలు, టొమాటోలు, బంగాళ దుంపలు. వీటి ధరవరలు మనం సంవత్సరంలో ఒకసారైనా చూస్తూనే ఉంటాం. టొమాటో రైతులు పంట గిట్టుబాటు కాక రోడ్ల మీద పారబోసిన సందర్భాలు మనకు ప్రతి సంవత్సరం కనపడుతూనే ఉంటాయి. బుట్ట టొమాటోలు వంద రూపాయలు కూడా పలకని స్థితి. కానీ వినియోగదారులమైన మనకు మాత్రం కిలో నలభై, యాభై కు అమ్ముతారు. ఆక్కడ బాగుపడుతోంది ఎవరు? దళారీలు.
మరి స్పాన్సర్లు hoarding చెయ్యరా? అనే అనుమానం రావచ్చు.
పెట్టుబడి పెట్టి లాభం కోసం చూసేవాడు డిమాండ్ ఉన్నచోట అమ్ముకుంటాడు. మరి రైతే డిమాండ్ ఉన్నచోట అమ్ముకోవచ్చు కదా?
మన దేశంలో చిన్న, మధ్య తరగతి రైతులకు అంత శక్తి ఉండదు. Storage capacity ఉండదు. అలాగే holding capacity ఉండదు. అందువల్లనే అయినకాడికి అమ్ముకుంటున్నారు.
దేశంలోని అన్ని మార్కెట్లను అనుసంధానం చేసి సింగిల్ ప్లాట్ ఫామ్ ఏర్పరిచే బాధ్యత కేంద్రం తీసుకుంది. ఎక్కడ తమ పంటకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుస్తుంది.
అలా తెలియడం వల్ల రైతుకి లాభం ఏమిటి? ఎగ్రిమెంట్ ప్రకారం రైతుకి చెల్లించవలసిన సొమ్ము చెల్లించిన తరువాత ఆ పంటతో రైతుకు సంబంధం లేదు.
కానీ ఎగ్రిమెంట్ లోనే ఈ విషయంపై ఒక క్లాజు ఉంటుంది. (పైన పేర్కొన్నాను).
రేటులో మరీ ఎక్కువ వ్యత్యాసం ఉంటే రైతుకు బోనస్ లేదా ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది.S.5(b)
ఇప్పుడు ఆలోచించండి వ్యవసాయ చట్టం 20 of 2020 రైతుకు మేలు చేస్తుందా? చెఱుపు చేస్తుందా?
అంబేద్కర్ చెప్పిన విషయం గుర్తు చేసుకోండి.
Knowledge, Unite and Struggle
ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయ చట్టాల వ్యతిరేక ర్యాలీలలో పాల్గొనే వారిలో ఈ విషయంపై నాలెడ్జ్ ఎంతమందికి ఉంది?
పంట చేతికి వచ్చే దశలో రేటు బాగుంటుంది. కానీ మార్కెట్ యార్డుకి వచ్చే రోజుకి పడిపోతుంది.
రైతులు తమ ఉత్పత్తులను బళ్ళ మీద వేసుకుని మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి ఎండల్లో, వానల్లో, రాత్రనక, పగలనక తమ సరుకు ఎప్పుడు కొంటారో, ఎంతకు కొంటారో తెలియక అయిన కాడికి అమ్ముకునే పరిస్థితినుండి రైతుని రక్షించేందుకు ఈ చట్టం చేయబడింది.
గుంటూరు మిర్చి యార్డులో ఇలాంటి పరిస్థితి నా కళ్ళారా చూసాను. అలా ఆ మిరప కాయల బస్తాల మీద తుండు వేసుకుని పడుకునే రైతులు అనేకమంది. పైగా అలాంటి వారికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసామని గొప్పలు. రైతుకి మనం పెట్టేవాళ్ళమా?
ఈ చట్టం వచ్చిన తరువాత రైతులకు ఆ సమస్య ఉండదు.
ఇకపోతే కార్పొరేట్ సంస్థలు రైతుని దోచేస్తాయని గోల చేసేవారికి ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను,
మనం రోజూ వాడే వస్తువులలో నూటికి తొంభై శాతం ఆ కార్పొరేట్ సంస్థలు తయారు చేసినవే.
ప్రభుత్వాలు ఏ చట్టం చేసిన అంబానీ కోసం అంటారు.
అంబానీ ఇచ్చిన ఉచిత జియో ఫోను ఆఫర్ వాడుకోలేదా? ఉచితంగా వస్తే వాడుకోడానికి లేని అభ్యంతరం వ్యాపారస్థుడైన అంబానీ ప్రతి అవకాశాన్ని దొరకబుచ్చుకుని పైకి ఎదుగుతుంటే బాధ పడటం ఎందుకు? అదే హిపోక్రసీ. వాడి తమ్మడు చతికిల పడ్డాడు. మరి కేంద్రం ఇద్దరికీ సయోధ్య కుదర్చలేదే?
KG Basin విషయంలో ముఖేష్ అంబానీపై 72,000 వేల కోట్లు పెనాల్టీ విధించింది Directorate of Hydro Carbons. దాన్ని రద్దు చేయించలేదే?
ఏదైనా సమస్య మీద స్పందించాలంటే దాన్ని అధ్యయనం చెయ్యాలి. అర్ధం చేసుకోవాలి. లేకుంటే మౌనంగా ఉండాలి.
ఈ చట్టం వల్ల వేల కోట్లు నష్టపోతోంది కమీషన్ ఏజెంట్లు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలలోనే ఆది ఎక్కువగా ఉంది. అకాలీ దళ్ కు చెందిన కేంద్ర మంత్రి సిమ్రాన్ జిత్ మాన్ కౌర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసారు. ఎందుకంటే వారి స్వయానా బావ గారి ఆదాయం సంవత్సరానికి 2500 కోట్లు. కేవలం కమీషన్ల మీదే. అలాగే కనిమొళి. వ్యవసాయ భూములు లేకపోయినా వ్యవసాయ ఆదాయం కింద ఎంత చూపించిందో తెలిస్తే ముక్కున వేలేసుకోవడమే కాదు, మన ముక్కు కూడా ఊడిపోతుంది. అక్షరాలా పది వేల కోట్లు.
Act 21 of 2020 గురించి వేరే పోస్టులో రాస్తాను.
మరింత సమాచారం కావాలంటే loksabha.nic.in website లోకి వెళ్ళి Legislations అనే పాపప్ లో Agriculture ను select చేసుకుంటే ఈ రెండు చట్టాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు చదువుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి