8, ఏప్రిల్ 2023, శనివారం

పుట్టినరోజు

 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండుగ చేసుకోను’ అని అనకూడదు.


🌸జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది…..


🌿అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు.

ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది….


🌸కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ…

తను పుట్టిన రోజు కూడా ఉంటుంది.


🌿‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని డాక్టర్లు  అమ్మకు చెప్పినా… బిడ్డ బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని అంటుంది.


🌸మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు అమ్మకది. అంటే అమ్మకు అది మరో పుట్టిన రోజేగా…


🌿అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు… అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది.

అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి?


🌸అమ్మకు కొత్త చీర పెట్టి…నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం.

అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె..🙏బ్రహ్మ.


🌿తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె ..స్థితికర్త.


🌸ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు.

బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్‌’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది.


🌿గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి… లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది.


🌸అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది.

ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో..


🌿 పరమ ప్రేమతో… అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు.. ఆ కొలోస్ట్రమ్‌ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం.. బయటకు వచ్చేసి బిడ్డ..ఆయుర్దాయం పొందుతాడు.


🌸అందుకే అమ్మ స్థితికర్త.

అమ్మ ప్రళయ కర్త(శివుడు).. కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం. స్వల్పకాలిక ప్రళయం.


🌿బ్రహ్మ, విష్ణువు, శివుడు… ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ.


🌸అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అమ్మకు అందుకుంటుంది..స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*సృష్టి రహస్య విశేషాలు*..!!

 *సృష్టి రహస్య విశేషాలు*..!!


1  *సృష్టి* ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  *కాల చక్రం  ఎలా నడుస్తుంది?*

3  మనిషిలో  *ఎన్ని  తత్వాలున్నాయి?*


( సృష్ఠి )  ఆవిర్బావము:


1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2  శివం యందు  శక్తి

3  శక్తి యందు నాధం

4  నాధం యందు బిందువు

5  బిందువు యందు సదాశివం

6  సదాశివం యందు మహేశ్వరం

7  మహేశ్వరం యందు ఈశ్వరం

8  ఈశ్వరం యందు రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు   అనగా సమస్త జీవజాలం పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం.

*పరాశక్తి ఆదీనంలో* నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు *వైవస్వత  మనువు*లో ఉన్నాం. 

*శ్వేతవరాహ కల్ప*. యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం


( *పంచ భూతంలు ఆవిర్భావం*: )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు


1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.


( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధంలు.


5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు


5  ( పంచ ప్రాణంలు )

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన


5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )

1  మనస్సు

3  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం


1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం


6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం


3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం


3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త


6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట


6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  మరణం


.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం


3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు


3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు


5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద


3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం


9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష


10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )

      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ


10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ


7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం


(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం


*జైగురుదేవ్*


*లోకా సమస్తా సుఖినోభవంతు*.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

అకాలమరణం

 🌹🙏అకాలమరణం.....!!


🌸ఓక రోజు కైలాసం లో పార్వతీదేవి ఈశ్వరుని తో  నాధా చావు అనునది ఏమి  దాని స్వరూపము ఏమిటి అని అడిగారు.


🌸అప్పుడు పరమశివుడు దేవి ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనము చేత రోగముల చేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఆ దేహమును వదిలి పోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక.

కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్పారు. పార్వతీ దేవి.. నాధా.. బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి.. అని అడిగారు పార్వతి మాత.. 


🌸ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు దేవీ ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం, తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది.

 పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పారు ఈశ్వరుడు. పార్వతీదేవి పరమేశ్వరా మనిషికి ఆయుష్షు ఎందు వలన పెరుగుతుంది.. ఎందు వలన తగ్గుతుంది.. అని అడిగారు.


🌸పరమేశ్వరుడు.. పార్వతీ మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయ కలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తి కలిగి ఉండాలి. వీటన్నింటిని వల్లా మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది.


🌸అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటి వలన ఆయువు క్షీణిస్తుంది.

పార్వతీ.. తపస్సు చేతనూ, బ్రహ్మచర్యము చేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. 


🌸ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. 

వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములో తిరిగి జన్మిస్తాడు. 


🌸అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పారు.

సరస్వతి ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 


🙏 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* 🙏

సుమంగళి కోరిన వైధవ్యం

 సుమంగళి కోరిన వైధవ్యం


ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓ వృద్ధ సువాసిని వచ్చి, స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.


"స్వామీ ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరానిది జరిగి ఆయువు చెల్లితే, అది నేను ఉండగానే జరిగేలా ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు, నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.


వెంటనే మహాస్వామి వారు చిరునవ్వుతో, "అలాగే అవుగాక" అని దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.


ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారితో, “స్వామీ! పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచి భర్త రావాలని, పెళ్ళైన తరువాత చేసే సమస్త పుణ్యకర్మలూ భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో తను పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా! మరి ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం. . .” అని ఆశ్చర్యoగా అడిగారు.


అందుకు స్వామివారు చిరునవ్వుతో "వారిది అన్యోన్య దాంపత్యం. భర్త మీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి. ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధాప్యం మరో బాల్యం అంటారు కదా! ఈ వృద్ధాప్యంలో ఆ భర్తకు ఈవిడే అన్నీ. ఆయన్ని చoటి పిల్లాడిలా సాకుతోంది. పైగా ఆయనకు జిహ్వచాపల్యo కాస్త ఎక్కువ. మరి ఆవిడే ముందు కాలo చేస్తే ఆయన్నెవరు చూసుకుoటారు, ఆయన అవసరాలను పట్టిoచుకోనేదేవరు అని బెoగ ఆ తల్లికి. అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.


భర్తకోసం పద్నాలుగేళ్ళు కారడవులను సైతం లెక్కచేయక ఆయన తోడిదే నా స్వర్గం అని సమస్త భోగాలను త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి ఎoదరో మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.


భర్తే తన దైవoగా భావిoచి "శ్రీవారు" అని పిలుస్తూ గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది. వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?


అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణి ఆ తల్లిపై.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తెల్పు

 సీ॥ పార్వతీపతి తెల్పు పాలసంద్రము తెల్పు

కామధేనువు తెల్పు కంచు తెల్పు

    నారదముని తెల్పు శారదాభ్రము తెల్పు

శారదాంబిక తెల్పు సంకు తెల్పు

   ఐరావతంబు తెల్పమృతపూరము తెలు

పాదిశేషుడు తెల్పు హంస తెల్పు

   కల్పవృక్షము తెల్పు కైలాసగిరి తెల్పు

మల్లెపూలు తెల్పు మంచు తెల్పు

వేటూరి ప్రభాకరశాస్త్రి (1922)

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు

 🙏ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు🙏


అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు .


నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . 


అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  


మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ మునిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందిలొ ఒకరిద్దరు గుర్తించినా  సార్ధకత పొందినట్టే. . 🙏

అవధూత లీల*

 

               *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం  11

                 అవధూత వైద్యం

                  భాగము 02


శ్రీస్వామివారి దివ్య మహిమను గూర్చి ముదిగేడు గ్రామస్థులు వినియున్నారు. ఆ గ్రామస్థుల ప్రార్థనను మన్నించి శ్రీస్వామివారు మొదటి సారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు. ఆ గ్రామంలో చాకలి రోశయ్య బుగ్గలూటి కురుపుతో చాలాకాలంగా బాధపడుతున్నాడు. అవతల నుండి ఇవతల వరకు పూర్తిగా రంధ్రం పడింది. ఎప్పుడూ చీము కారుతూ దుర్వాసన వచ్చేది. ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారము తినలేడు. ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే బొళ బొళ చీము కారేది. ఏ డాక్టర్లు, నాటు వైద్యులూ మానలేక పోయారు.

అతని దయనీయమైన స్థితిని గూర్చి విన్న శ్రీస్వామివారు తన కాలి ఎడమబోటినవేలితో భూమిలోని మట్టిని కాస్తలేపి దానిని గుడ్డలో మూటకట్టి చేతెడు పొడవు ఇచ్చి 'ఆ మట్టి నూరి రంధ్రానికి పెట్టి కట్టు. మణికట్టు లావు వుండే మూడు చిటి కేసిరి కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి కంప బడీగా నాటి నీళ్ళు పొయ్యయ్యా నీ కురుపు మానుతుంది' అని సెలవిచ్చారు. వారం రోజులలోపు ఆ కొమ్మలు చిగిర్చే సరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది.

 దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా వున్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేసింది. అనేక మంది భజనలతోను,. ఆతిధ్యాలతోను శ్రీస్వామివారిని శ్రద్ధగా సేవించారు. కొల్లా జయరామరాజు చెలిది వ్యాధితోను, చలిజ్వరంతోను బాధపడుతున్నాడు. ఈ విషయం శ్రీస్వామివారికి విన్నవించుకోగా శ్రీవారు. అతని చేత ఒక్క కేరు పచ్చి వేరు శనగకాయలు బలవంతంగా తినిపించి, మజ్జిగ త్రావించి ఏట్లో మునిగి రమ్మని ఆజ్ఞాపించారు. అతడలానే చేశాడు. తన చెలిది వ్యాధి, చలిజ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీస్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి. టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తునిచేత సాయి పాలలో ఉడకబెట్టిన పిస్తాపప్పు తినిపించి, విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తునిచేత వేరు. శెనగపప్పు తినిపించి, నీరు త్రావించి వారి రోగాలను మాన్చడానికి పైలీల పోలివుంది. నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరకు మూలపురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల, అందుకే అవధూత అందరూ దత్తాత్రేయ స్వామియొక్క రూపాలని శ్రీ దత్తభాగవతం చెబుతుంది.

ఒకప్పుడు ఐదు సం||ల వయస్సు గల బిడ్డకు పొట్టలోపల గడ్డలేచి. విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆ బిడ్డను వారు. శ్రీస్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ పాపను శ్రీస్వామివారు తమ చేతులపై బోర్లా పడుకోబెట్టుకొని దిగుడు బావిలోని నీటి యొద్దకు తీసుకుపోయారు. ఆ బిడ్డను బావిలోని నీటి నుండి ఒక మీటరు ఎత్తునకు పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు. వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్టమీద కాలేసి మృదువుగా త్రొక్కారు. ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటిగుండ, ఆసనం గుండా వెళ్ళిపోయింది. ఏ మందులు లేకుండానే ఆ రోజులలో ఆరోగ్యవంతురాలైంది.

శ్రీస్వామివారు తాటిపర్తిలోవుండగా 1975 లో ఒక పిచ్చి పట్టిన యువకుని త్రాళ్ళతో బంధించి శ్రీస్వామివారి వద్దకు తీసుకు వచ్చారు. అతనికి గుండం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు. నలుగురు మనుషులు బలంగా పట్టుకొని 1-30 గం||ల సేపు గుండంలోని పొగపట్టారు. తెల్లవారింది మొదలు క్రమేణ తగ్గి ఒకవారం రోజులలో పూర్తి స్వస్థత మిగిలిన భాగము రేపటికి...

*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదుకలను శరణు కోరుతూ 🙏🙏


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*భక్తుని శరణాగతి - భగవంతుని అనుగ్రహము*


*ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం.*

ఇది మనిషిలోని చింతలన్నింటినీ  ఏరిపారేస్తుంది. 

మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది. 

" ఓ భగవంతుడా!!... కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం...

ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే, నేను నీ వాడను, నీవు నా వాడవు. 

నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు. 

నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను. 

ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను. 

"దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి" అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. 

ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి. 

ఇదే నిజమైన శరణాగతి... ఇట్టి శరణాగతులను దైవము స్వయానా తన భుజాలపై మోస్తాడు. 

అత్యున్నతమైన స్థానములో కూర్చుండబెడతాడు.


             *_🪷శుభంభూయాత్🪷_*

      🙏సమస్త లోకా సుఖినోభవంతు..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹



పూజ్యశ్రీ మాస్టరుగారి లీలలు


లీల -2


జై సాయి మాస్టర్ !

                                                               

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !

                                        

శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలుమంగమ్మ సహిత భరద్వాజ మహరాజ్ కీ జై !!


పూజ్యశ్రీ భరద్వాజ గురుదేవుల ఆరాధనా మహోత్సవ సందర్భంగా వారి లీలావైభవాన్ని ఒంగోలు వాస్తవ్యులైన శ్రీ మేడా జయరాంగారు ఈవిధంగా తెలియచేస్తున్నారు…

                                                                  


 1980 వ సంవత్సరంలో  నాకు మొట్టమొదట కె.వి.రంగారావుగారి ద్వారా పూజ్యశ్రీ మాస్టరుగారి దర్శనభాగ్యం కలిగింది. రెండుసార్లు ప్రింటింగ్ ప్రెస్ దగ్గర వారిని దర్శిద్దామనుకుంటే కుదరలేదు. మూడవసారి వారి ఇంటికి రాత్రి దాదాపు 8:30 గంటలకు వెళ్ళాము. వారు అప్పుడు వాకిట్లో ఒక సత్సంగసభ్యుడితో మాట్లాడుతున్నారు. మేము వెళ్లి ఆయనకు నమస్కారం చేసుకున్నాము. 


మరుసటిరోజే మళ్ళీ పూజ్యశ్రీ మాస్టరుగారి దర్శనానికి వెళ్లాను. నాకు ఏమి మాట్లాడాలో కూడా తెలియదు. కానీ మాటల సందర్భంలో, "మీరు మా ఇంటికి ఒకసారి రావాలి!"  అని వారిని ప్రార్థించాను. వారు అంగీకరించి ఒకరోజు మా ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో పెద్దగా ఎవరూ బాబాను పూజించేవారు కాదు. నేను పూజ్యశ్రీ మాస్టరుగారిని ఇంటికి తీసుకువచ్చేసరికి అందరికీ, 'మనిషిని పూజించడమేమిటి?' అనిపించింది. కానీ నేను, నా శ్రీమతి వారికి పాదపూజ చేసుకున్నాము.  వారు వెళ్లే ముందు, "నన్ను కాపాడమని బాబాకు చెప్పండి!" అని కోరాను. వారు సరేనన్నారు. ఇక అప్పటినుంచి ప్రతి ఆదివారము తప్పకుండా అయ్యవారి దగ్గరకు వేళ్ళేవాడిని. నేను పూజ్యశ్రీ మాస్టరుగారిని 'అయ్యవార'ని పిలిచేవాడిని.

                                                కొంతకాలంలోనే వారు సామాన్యులు కారని, సాక్షాత్తూ శిరిడీ సాయినాథులేనని అర్థమైంది. శ్రీ సాయిలీలామృతము చదువుతున్నప్పుడు సాక్షాత్తూ బాబాయే వీరి రూపంలో వుండి తమ చరిత్ర చెప్తున్నారనిపించేది. మనకు కావలసిన విషయాలు నోరుతెరిచి అడగలేకపోయినా, ఏదో సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూనే  మన మనస్సులోని విషయాలు వారికై వారే చెప్పేవారు! వారి వాక్కు వేదవాక్కు. వారు ఏం  చెప్పినా జరిగితీరేది! 


ఒకసారి నా స్నేహితుడొకడు అయ్యవారితో, "మన జయరాంకి ఏలినాటి శని నడుస్తోంది" అని అంటే, "ఆఁ! అది మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందోయ్?!"అన్నారు. నిజంగానే నాకేమీ కాలేదు! 


ఒకసారి నేనూ, రంగారావుగారు అరుణాచలం వెళ్లాలనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితులవల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆ విషయం నేను అయ్యవారితో చెప్తే, "నువ్వు రోజూ ఒక్కసారి నా దగ్గరికి వచ్చిపోతే  అరుణాచలం వెళ్లినట్లు!" అన్నారు. అప్పుడు నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేసుకున్నాను. 

                                   

మా చిన్నాన్న మా షాపు విషయంలో ఒక అభ్యంతరం పెట్టాడు– 'ఒరేయ్ నువ్వు కొట్లో ప్రతివారికీ అప్పులిచ్చేస్తున్నావు. అలా ఇవ్వవద్దని, ఇందాక ఆరతి సమయంలో బాబా నాతో చెప్పారు'  అన్నాడు. "అయితే  ఈవిషయం అయ్యవారితో చెప్పి ఆయన ఏమి చెప్తే అది చేద్దాం, రా!" అని అతనిని కూడా తీసుకుని రాత్రి 9:30 గంటలకు అయ్యవారి దగ్గరికి వెళ్లి ఈసంగతి అడిగాను. అప్పుడు అయ్యవారు, "అవునా! జైరాంకి అప్పులు ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? అయినా నేను బాబాను అడుగుతాను. బాబా నాకు చెప్తారు. ఒరేయ్! అంతవరకూ  నీ పని నువ్వు చేసుకో!" అని చెప్పి పంపించేశారు. నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. ఆ తరువాత ఆయన ఏమీ చెప్పనూ లేదు…నేను మార్చుకోవలసిన అవసరమూ రాలేదు.


ఒకసారి బాబా మందిరం కమిటీలో నన్ను అయ్యవారు ట్రెజరర్ గా నియమించారు. ఈవిషయం ఇంట్లో చెప్తే, 'ఆ డబ్బుల వ్యవహారాలన్నీ మనకెందుకు? వద్ద'న్నారు. మళ్ళీ ఈ సంగతి అయ్యవారికి చెప్పాను. అప్పుడు వారు, "ఎవరేమన్నా పట్టించుకోకు. నేను చెబుతున్నాను.. నీకేమీ కాదు. నువ్వు వచ్చి అందులో చేరు!" అన్నారు. నాకు వారి మాట బాగా ధైర్యాన్ని ఇచ్చింది. అయినా వారు చెప్పాక ఇక తిరుగేముంది? సరేనని చేరిపోయాను. 


అప్పట్లో మేము అద్దెకున్న ఇంట్లోకి ఎక్కువగా పాములు వచ్చేవి. బాగా ఇబ్బందిగా వుండి అయ్యవారికి చెప్తే, వారు విభూది పొట్లం కట్టి ఇచ్చారు. అది తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటినుంచి మా ఇంట్లోకి పాములు రానేలేదు! వారి ఆజ్ఞను సకల జీవరాశీ శిరసావహించవలసిందే! అంతేకాదు, మహాత్ముల దర్శనానికి అయ్యవారి దగ్గర  ఆశీస్సులు పొంది వేళితే  వారి దర్శనము, అనుగ్రహము ప్రత్యేకంగానూ, అద్భుతంగానూ వుండేవి. ఆ మహాత్ములు అయ్యవారంటే ఎంతటి గౌరవమో!

                                           

ఒకరోజు రాత్రి సత్సంగం అయ్యాక మేము ఇంటికి బయలుదేరుతుంటే కొంతసేపు వుండి వెళ్ళమన్నారు అయ్యవారు. కానీ మేము తొందరపడి బయలుదేరాము. రిక్షా ఎక్కి కొంత దూరం వెళ్ళాక మా రిక్షా తిరగబడింది! కానీ మాకేమీ కాలేదు! అలా కాకుండా చూసుకున్నది కూడా అయ్యవారే! వారు యధాలాపంగా  మనకు చాలా సూచనలిస్తారు, కానీ వాటిని గ్రహించి, అనుసరించేది ఎంతమంది?   ఒకసారి అయ్యవారి ఆశీస్సులు, విబూది తీసుకుని నేను శిరిడీకి బయలుదేరాను. కొద్దిసేపటికి మా తమ్ముడి ద్వారా అయ్యవారు మళ్ళీ విబూది పంపించారు! అదేరోజు రాత్రి మా షాపులో నాలుగు లక్షలు విలువచేసే సరుకు దొంగతనం జరిగింది. కానీ సరుకంతా వెంటనే పట్టుబడింది. ఈ విషయం నాకు ఫోనులో చెప్తే నేను వెనుకకు తిరిగి వచ్చేశాను. పోయిన సరుకు అంత తక్కువ వ్యవధిలో పట్టుబడటం అయ్యవారి కరుణకు నిదర్శనం. మనకు జరగబోయే ప్రతిదీ అయ్యవారికి నిరంతరం తెలుస్తుందని, వారు మనలను  ఎప్పుడూ కాపాడుతూ వుంటారనడానికి గుర్తు పై రెండు ఉదాహరణలే !


అయ్యవారు సమాధి చెందే ముందురోజు రాత్రి నేను వారింటికి వెళ్లాను. అప్పుడు వారు చాలా మామూలుగా, "ఏమీ లేదు, కొంచెం చెయ్యి నొప్పిగా వుంది అంతే!" అన్నారు. చక్కగా మాట్లాడారు. కానీ మరునాడు ఉదయమే సమాధి చెందారని తెలిసింది. మా కళ్లెదురుగానే లీలావిలాసంగా వారు దేహం వదిలిపెట్టేశారు! ఆ క్షణంలో ప్రతి ఒక్కరమూ ఆ నిజాన్ని నిజమని జీర్ణం చేసుకోలేకపోయాం. మాలో ఒకరిగా వుంటూ వారి గొప్పతనాన్ని కొంచెం కూడా తెలియనివ్వకుండా మరుగునపరచారు. 


వారు సమాధి చెందిన కొద్దిరోజులలోనే పరాడ్ సింగానుంచి అనసూయామాత ఒంగోలులోని బాబా మందిరానికి  వచ్చి, ఇప్పుడు బాబా వున్న ప్రదేశంలో కొంతసేపు పడుకున్నారు. అప్పటికి ఇంకా విగ్రహప్రతిష్ఠ జరగలేదు. తరవాత అయ్యవారి బృందావనం దర్శించుకుని, వారికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నారు! అప్పుడు అయ్యవారు మనకు తెలిసినకంటే ఎంతో గొప్పవారని అర్థమైంది. గొప్పగొప్ప అవధూతలే నమస్కరిస్తున్నారంటే, సేవిస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవారో సామాన్యులమైన మనకు ఎలా తెలుస్తుంది? తరువాత అనసూయమాత పూజ్యశ్రీ అమ్మగారి దర్శనానికి కూడా వెళ్లారు. 


అయ్యవారు సమాధి అనంతరం కూడా మమ్మల్నందరినీ కంటికి రెప్పలా కాపాడుతూనే వున్నారు. వారిది సంపూర్ణమైన ప్రేమతత్త్వం. అపారమైన కరుణ. వారి కరుణ పొందినవారికి వారిని తలచుకోగానే  కళ్ళవెంట నీళ్లు రాకుండా వుండవు. మనం బాగా పారాయణ చేసి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారి దర్శనానికి వెళితే, నేటికీ వారు చూపించే అపారప్రేమ అనుభవమౌతుంది. మానవజన్మ ఎత్తినందుకు అయ్యవారిని కళ్లారా చూడగలగటమే మహద్భాగ్యం. అటువంటిది మాలో ఒకరిగా కలసిపోయి మాకు వారి సన్నిధిని ప్రసాదించిన వారి సహృదయతకు కృతజ్ఞతతో  శిరస్సువంచి అంజలి ఘటించి నమస్కరిస్తున్నాను. 


ఓం కృపాకటాక్ష స్వరూపాయ శ్రీ భరద్వాజ సద్గురవే నమః! 

                                                                     

 🙏🌹జై సాయి మాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*ఉచిత సత్సంగం ..భజన*🌹🌹🌹🌹🌹🙏🙏🙏

*పూజ్య భరద్వాజ మాస్టర్ గారి స్వప్న దర్శనం మరియు ప్రత్యేక ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాలలోనూ వీలైతే ఇతర రాష్ట్రాల్లోనూ ఉచితంగా సాయి మార్గంలో సత్సంగాలు భజన నిర్వహించాలని అనుకుంటున్నాము..*

*మీ సహాయ సహకారాలు కోరుతున్నాము*

1. *మీ ఊరు మీ ఇంటికి రావడానికి ఎటువంటి దారి ఖర్చులు ఇవ్వనవసరం లేదు. సుమారుగా ఎంతమంది వస్తారో చెప్తే.. వీలైతే సాధారణ  ప్రసాదాలు కూడా మేమే ఇవ్వగలము*

*2)మీరు కోరిన తేదీల్లో మీరు కోరిన సమయంలో సాధ్యమైనంత వరకు నిర్వహించబడును.. లేదా ఒకరోజు అటు ఇటుగా నిర్వహించబడును*

*3) వీలైతే ఉచితంగా సాయి లీలామృతము శ్రీ గురు చరిత్ర మరియు పూజ్య భరద్వాజ మాస్టర్ గారి రచనలు, ఇతర మహాత్ముని జీవిత చరిత్రలు ఉచితముగా సత్సంగము నందు ఇవ్వబడును*

*4) శ్రీ  సాయి లీలామృతం , శ్రీ గురుచరిత్ర , శ్రీ సాయి ప్రబోథామృతం , మాస్టారి ప్రవచనములు, ఏది నిజం, విజ్ఞానవీచికలు, ధ్యాన యోగ సర్వస్వమ్ వంటివి వివరిస్తూ సత్సంగం భజన సుమారు రెండు నుండి మూడు గంటలు చేయడం జరుగుతుంది*

*5.మా సత్సంగాలు వివరణలు ఎలా ఉంటాయో  తెలుసుకోవటం కోసం ఈ లింక్ క్లిక్ చేయగలరు*

*https://youtube.com/@Jai_sai_master*

*6. పూర్తిగా ఈ ప్రయత్నం పూజ్య మాస్టారి సేవగా భావించటం జరుగుతుంది*

*7. ఉచిత సత్సంగం భజన కోరువారు ...వారి పేరు ఊరు మొబైల్ నెంబర్ ..కావాల్సిన తేదీ వివరాలు తో ఈ క్రింది నంబర్స్ కి వాట్సాప్ చేయ కోరుచున్నాము*


*8919698019*

*9492120314*

*7330856225*

*73824 46829*

జీవన్ముక్తి

 


*జీవన్ముక్తి సాధ్య వస్తువు*


*జన్మరాహిత్యం సిద్ధ వస్తువు..*. 


*బ్రహ్మ జ్ఞానం సాధ్య వస్తువు*


*బ్రహ్మము సిద్ధ వస్తువు...*


*సాధనతో సాధ్య వస్తువుని పొందినప్పుడు సిద్ధి లభిస్తుంది...* 


*అదే అంతిమ ఫలం..*


🙏🙏🙏🙏🙏

కర్మ సిద్ధాంతమునకు

 .

         _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*సుఖస్య దుఃఖస్య న కోsపి దాతా* 

*పరో దదాతీతి కుబుద్ధిరేషా*

*అహం కరోమీతి వృథాభిమానః* 

*స్వకర్మసూత్ర గ్రథితో హి లోకః ।।*


తా𝕝𝕝 *సుఖమును గానీ, దుఃఖమును గానీ ఎవడూ కలిగించడు*..... *ఈ సుఖ దుఃఖాలనేవి బుద్ధి చేత కలుగును....నేను చేస్తున్నాను అనే స్వాభిమానం వ్యర్థమైనది....*


*ఈలోకంలో అందరూ కర్మ సిద్ధాంతమునకు కట్టుబడినవారే*...

నిజమైన పండితుడు

 శ్లోకం:☝️

*ఆత్మజ్ఞానం సమారంభః*

 *తితిక్షా ధర్మనిత్యతా ।*

*యమర్థాన్నాపకర్షంతి*

 *స వై పండిత ఉచ్యతే ।।*


భావం: ఎవడు తన సామర్థ్యమును తెలుసుకొని తదనుగుణముగా ధర్మ కార్యములు చేయునో, ప్రతికూల పరిస్థితులలో కూడా ధర్మము నుండి వైదొలగడో వాడే నిజమైన పండితుడు.