8, ఏప్రిల్ 2023, శనివారం

అవధూత లీల*

 

               *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం  11

                 అవధూత వైద్యం

                  భాగము 02


శ్రీస్వామివారి దివ్య మహిమను గూర్చి ముదిగేడు గ్రామస్థులు వినియున్నారు. ఆ గ్రామస్థుల ప్రార్థనను మన్నించి శ్రీస్వామివారు మొదటి సారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు. ఆ గ్రామంలో చాకలి రోశయ్య బుగ్గలూటి కురుపుతో చాలాకాలంగా బాధపడుతున్నాడు. అవతల నుండి ఇవతల వరకు పూర్తిగా రంధ్రం పడింది. ఎప్పుడూ చీము కారుతూ దుర్వాసన వచ్చేది. ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారము తినలేడు. ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే బొళ బొళ చీము కారేది. ఏ డాక్టర్లు, నాటు వైద్యులూ మానలేక పోయారు.

అతని దయనీయమైన స్థితిని గూర్చి విన్న శ్రీస్వామివారు తన కాలి ఎడమబోటినవేలితో భూమిలోని మట్టిని కాస్తలేపి దానిని గుడ్డలో మూటకట్టి చేతెడు పొడవు ఇచ్చి 'ఆ మట్టి నూరి రంధ్రానికి పెట్టి కట్టు. మణికట్టు లావు వుండే మూడు చిటి కేసిరి కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి కంప బడీగా నాటి నీళ్ళు పొయ్యయ్యా నీ కురుపు మానుతుంది' అని సెలవిచ్చారు. వారం రోజులలోపు ఆ కొమ్మలు చిగిర్చే సరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది.

 దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా వున్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేసింది. అనేక మంది భజనలతోను,. ఆతిధ్యాలతోను శ్రీస్వామివారిని శ్రద్ధగా సేవించారు. కొల్లా జయరామరాజు చెలిది వ్యాధితోను, చలిజ్వరంతోను బాధపడుతున్నాడు. ఈ విషయం శ్రీస్వామివారికి విన్నవించుకోగా శ్రీవారు. అతని చేత ఒక్క కేరు పచ్చి వేరు శనగకాయలు బలవంతంగా తినిపించి, మజ్జిగ త్రావించి ఏట్లో మునిగి రమ్మని ఆజ్ఞాపించారు. అతడలానే చేశాడు. తన చెలిది వ్యాధి, చలిజ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీస్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి. టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తునిచేత సాయి పాలలో ఉడకబెట్టిన పిస్తాపప్పు తినిపించి, విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తునిచేత వేరు. శెనగపప్పు తినిపించి, నీరు త్రావించి వారి రోగాలను మాన్చడానికి పైలీల పోలివుంది. నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరకు మూలపురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల, అందుకే అవధూత అందరూ దత్తాత్రేయ స్వామియొక్క రూపాలని శ్రీ దత్తభాగవతం చెబుతుంది.

ఒకప్పుడు ఐదు సం||ల వయస్సు గల బిడ్డకు పొట్టలోపల గడ్డలేచి. విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆ బిడ్డను వారు. శ్రీస్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ పాపను శ్రీస్వామివారు తమ చేతులపై బోర్లా పడుకోబెట్టుకొని దిగుడు బావిలోని నీటి యొద్దకు తీసుకుపోయారు. ఆ బిడ్డను బావిలోని నీటి నుండి ఒక మీటరు ఎత్తునకు పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు. వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్టమీద కాలేసి మృదువుగా త్రొక్కారు. ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటిగుండ, ఆసనం గుండా వెళ్ళిపోయింది. ఏ మందులు లేకుండానే ఆ రోజులలో ఆరోగ్యవంతురాలైంది.

శ్రీస్వామివారు తాటిపర్తిలోవుండగా 1975 లో ఒక పిచ్చి పట్టిన యువకుని త్రాళ్ళతో బంధించి శ్రీస్వామివారి వద్దకు తీసుకు వచ్చారు. అతనికి గుండం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు. నలుగురు మనుషులు బలంగా పట్టుకొని 1-30 గం||ల సేపు గుండంలోని పొగపట్టారు. తెల్లవారింది మొదలు క్రమేణ తగ్గి ఒకవారం రోజులలో పూర్తి స్వస్థత మిగిలిన భాగము రేపటికి...

*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదుకలను శరణు కోరుతూ 🙏🙏


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*భక్తుని శరణాగతి - భగవంతుని అనుగ్రహము*


*ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం.*

ఇది మనిషిలోని చింతలన్నింటినీ  ఏరిపారేస్తుంది. 

మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది. 

" ఓ భగవంతుడా!!... కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం...

ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే, నేను నీ వాడను, నీవు నా వాడవు. 

నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు. 

నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను. 

ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను. 

"దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి" అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. 

ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి. 

ఇదే నిజమైన శరణాగతి... ఇట్టి శరణాగతులను దైవము స్వయానా తన భుజాలపై మోస్తాడు. 

అత్యున్నతమైన స్థానములో కూర్చుండబెడతాడు.


             *_🪷శుభంభూయాత్🪷_*

      🙏సమస్త లోకా సుఖినోభవంతు..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹



పూజ్యశ్రీ మాస్టరుగారి లీలలు


లీల -2


జై సాయి మాస్టర్ !

                                                               

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !

                                        

శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలుమంగమ్మ సహిత భరద్వాజ మహరాజ్ కీ జై !!


పూజ్యశ్రీ భరద్వాజ గురుదేవుల ఆరాధనా మహోత్సవ సందర్భంగా వారి లీలావైభవాన్ని ఒంగోలు వాస్తవ్యులైన శ్రీ మేడా జయరాంగారు ఈవిధంగా తెలియచేస్తున్నారు…

                                                                  


 1980 వ సంవత్సరంలో  నాకు మొట్టమొదట కె.వి.రంగారావుగారి ద్వారా పూజ్యశ్రీ మాస్టరుగారి దర్శనభాగ్యం కలిగింది. రెండుసార్లు ప్రింటింగ్ ప్రెస్ దగ్గర వారిని దర్శిద్దామనుకుంటే కుదరలేదు. మూడవసారి వారి ఇంటికి రాత్రి దాదాపు 8:30 గంటలకు వెళ్ళాము. వారు అప్పుడు వాకిట్లో ఒక సత్సంగసభ్యుడితో మాట్లాడుతున్నారు. మేము వెళ్లి ఆయనకు నమస్కారం చేసుకున్నాము. 


మరుసటిరోజే మళ్ళీ పూజ్యశ్రీ మాస్టరుగారి దర్శనానికి వెళ్లాను. నాకు ఏమి మాట్లాడాలో కూడా తెలియదు. కానీ మాటల సందర్భంలో, "మీరు మా ఇంటికి ఒకసారి రావాలి!"  అని వారిని ప్రార్థించాను. వారు అంగీకరించి ఒకరోజు మా ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో పెద్దగా ఎవరూ బాబాను పూజించేవారు కాదు. నేను పూజ్యశ్రీ మాస్టరుగారిని ఇంటికి తీసుకువచ్చేసరికి అందరికీ, 'మనిషిని పూజించడమేమిటి?' అనిపించింది. కానీ నేను, నా శ్రీమతి వారికి పాదపూజ చేసుకున్నాము.  వారు వెళ్లే ముందు, "నన్ను కాపాడమని బాబాకు చెప్పండి!" అని కోరాను. వారు సరేనన్నారు. ఇక అప్పటినుంచి ప్రతి ఆదివారము తప్పకుండా అయ్యవారి దగ్గరకు వేళ్ళేవాడిని. నేను పూజ్యశ్రీ మాస్టరుగారిని 'అయ్యవార'ని పిలిచేవాడిని.

                                                కొంతకాలంలోనే వారు సామాన్యులు కారని, సాక్షాత్తూ శిరిడీ సాయినాథులేనని అర్థమైంది. శ్రీ సాయిలీలామృతము చదువుతున్నప్పుడు సాక్షాత్తూ బాబాయే వీరి రూపంలో వుండి తమ చరిత్ర చెప్తున్నారనిపించేది. మనకు కావలసిన విషయాలు నోరుతెరిచి అడగలేకపోయినా, ఏదో సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూనే  మన మనస్సులోని విషయాలు వారికై వారే చెప్పేవారు! వారి వాక్కు వేదవాక్కు. వారు ఏం  చెప్పినా జరిగితీరేది! 


ఒకసారి నా స్నేహితుడొకడు అయ్యవారితో, "మన జయరాంకి ఏలినాటి శని నడుస్తోంది" అని అంటే, "ఆఁ! అది మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందోయ్?!"అన్నారు. నిజంగానే నాకేమీ కాలేదు! 


ఒకసారి నేనూ, రంగారావుగారు అరుణాచలం వెళ్లాలనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితులవల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆ విషయం నేను అయ్యవారితో చెప్తే, "నువ్వు రోజూ ఒక్కసారి నా దగ్గరికి వచ్చిపోతే  అరుణాచలం వెళ్లినట్లు!" అన్నారు. అప్పుడు నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేసుకున్నాను. 

                                   

మా చిన్నాన్న మా షాపు విషయంలో ఒక అభ్యంతరం పెట్టాడు– 'ఒరేయ్ నువ్వు కొట్లో ప్రతివారికీ అప్పులిచ్చేస్తున్నావు. అలా ఇవ్వవద్దని, ఇందాక ఆరతి సమయంలో బాబా నాతో చెప్పారు'  అన్నాడు. "అయితే  ఈవిషయం అయ్యవారితో చెప్పి ఆయన ఏమి చెప్తే అది చేద్దాం, రా!" అని అతనిని కూడా తీసుకుని రాత్రి 9:30 గంటలకు అయ్యవారి దగ్గరికి వెళ్లి ఈసంగతి అడిగాను. అప్పుడు అయ్యవారు, "అవునా! జైరాంకి అప్పులు ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? అయినా నేను బాబాను అడుగుతాను. బాబా నాకు చెప్తారు. ఒరేయ్! అంతవరకూ  నీ పని నువ్వు చేసుకో!" అని చెప్పి పంపించేశారు. నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. ఆ తరువాత ఆయన ఏమీ చెప్పనూ లేదు…నేను మార్చుకోవలసిన అవసరమూ రాలేదు.


ఒకసారి బాబా మందిరం కమిటీలో నన్ను అయ్యవారు ట్రెజరర్ గా నియమించారు. ఈవిషయం ఇంట్లో చెప్తే, 'ఆ డబ్బుల వ్యవహారాలన్నీ మనకెందుకు? వద్ద'న్నారు. మళ్ళీ ఈ సంగతి అయ్యవారికి చెప్పాను. అప్పుడు వారు, "ఎవరేమన్నా పట్టించుకోకు. నేను చెబుతున్నాను.. నీకేమీ కాదు. నువ్వు వచ్చి అందులో చేరు!" అన్నారు. నాకు వారి మాట బాగా ధైర్యాన్ని ఇచ్చింది. అయినా వారు చెప్పాక ఇక తిరుగేముంది? సరేనని చేరిపోయాను. 


అప్పట్లో మేము అద్దెకున్న ఇంట్లోకి ఎక్కువగా పాములు వచ్చేవి. బాగా ఇబ్బందిగా వుండి అయ్యవారికి చెప్తే, వారు విభూది పొట్లం కట్టి ఇచ్చారు. అది తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటినుంచి మా ఇంట్లోకి పాములు రానేలేదు! వారి ఆజ్ఞను సకల జీవరాశీ శిరసావహించవలసిందే! అంతేకాదు, మహాత్ముల దర్శనానికి అయ్యవారి దగ్గర  ఆశీస్సులు పొంది వేళితే  వారి దర్శనము, అనుగ్రహము ప్రత్యేకంగానూ, అద్భుతంగానూ వుండేవి. ఆ మహాత్ములు అయ్యవారంటే ఎంతటి గౌరవమో!

                                           

ఒకరోజు రాత్రి సత్సంగం అయ్యాక మేము ఇంటికి బయలుదేరుతుంటే కొంతసేపు వుండి వెళ్ళమన్నారు అయ్యవారు. కానీ మేము తొందరపడి బయలుదేరాము. రిక్షా ఎక్కి కొంత దూరం వెళ్ళాక మా రిక్షా తిరగబడింది! కానీ మాకేమీ కాలేదు! అలా కాకుండా చూసుకున్నది కూడా అయ్యవారే! వారు యధాలాపంగా  మనకు చాలా సూచనలిస్తారు, కానీ వాటిని గ్రహించి, అనుసరించేది ఎంతమంది?   ఒకసారి అయ్యవారి ఆశీస్సులు, విబూది తీసుకుని నేను శిరిడీకి బయలుదేరాను. కొద్దిసేపటికి మా తమ్ముడి ద్వారా అయ్యవారు మళ్ళీ విబూది పంపించారు! అదేరోజు రాత్రి మా షాపులో నాలుగు లక్షలు విలువచేసే సరుకు దొంగతనం జరిగింది. కానీ సరుకంతా వెంటనే పట్టుబడింది. ఈ విషయం నాకు ఫోనులో చెప్తే నేను వెనుకకు తిరిగి వచ్చేశాను. పోయిన సరుకు అంత తక్కువ వ్యవధిలో పట్టుబడటం అయ్యవారి కరుణకు నిదర్శనం. మనకు జరగబోయే ప్రతిదీ అయ్యవారికి నిరంతరం తెలుస్తుందని, వారు మనలను  ఎప్పుడూ కాపాడుతూ వుంటారనడానికి గుర్తు పై రెండు ఉదాహరణలే !


అయ్యవారు సమాధి చెందే ముందురోజు రాత్రి నేను వారింటికి వెళ్లాను. అప్పుడు వారు చాలా మామూలుగా, "ఏమీ లేదు, కొంచెం చెయ్యి నొప్పిగా వుంది అంతే!" అన్నారు. చక్కగా మాట్లాడారు. కానీ మరునాడు ఉదయమే సమాధి చెందారని తెలిసింది. మా కళ్లెదురుగానే లీలావిలాసంగా వారు దేహం వదిలిపెట్టేశారు! ఆ క్షణంలో ప్రతి ఒక్కరమూ ఆ నిజాన్ని నిజమని జీర్ణం చేసుకోలేకపోయాం. మాలో ఒకరిగా వుంటూ వారి గొప్పతనాన్ని కొంచెం కూడా తెలియనివ్వకుండా మరుగునపరచారు. 


వారు సమాధి చెందిన కొద్దిరోజులలోనే పరాడ్ సింగానుంచి అనసూయామాత ఒంగోలులోని బాబా మందిరానికి  వచ్చి, ఇప్పుడు బాబా వున్న ప్రదేశంలో కొంతసేపు పడుకున్నారు. అప్పటికి ఇంకా విగ్రహప్రతిష్ఠ జరగలేదు. తరవాత అయ్యవారి బృందావనం దర్శించుకుని, వారికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నారు! అప్పుడు అయ్యవారు మనకు తెలిసినకంటే ఎంతో గొప్పవారని అర్థమైంది. గొప్పగొప్ప అవధూతలే నమస్కరిస్తున్నారంటే, సేవిస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవారో సామాన్యులమైన మనకు ఎలా తెలుస్తుంది? తరువాత అనసూయమాత పూజ్యశ్రీ అమ్మగారి దర్శనానికి కూడా వెళ్లారు. 


అయ్యవారు సమాధి అనంతరం కూడా మమ్మల్నందరినీ కంటికి రెప్పలా కాపాడుతూనే వున్నారు. వారిది సంపూర్ణమైన ప్రేమతత్త్వం. అపారమైన కరుణ. వారి కరుణ పొందినవారికి వారిని తలచుకోగానే  కళ్ళవెంట నీళ్లు రాకుండా వుండవు. మనం బాగా పారాయణ చేసి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారి దర్శనానికి వెళితే, నేటికీ వారు చూపించే అపారప్రేమ అనుభవమౌతుంది. మానవజన్మ ఎత్తినందుకు అయ్యవారిని కళ్లారా చూడగలగటమే మహద్భాగ్యం. అటువంటిది మాలో ఒకరిగా కలసిపోయి మాకు వారి సన్నిధిని ప్రసాదించిన వారి సహృదయతకు కృతజ్ఞతతో  శిరస్సువంచి అంజలి ఘటించి నమస్కరిస్తున్నాను. 


ఓం కృపాకటాక్ష స్వరూపాయ శ్రీ భరద్వాజ సద్గురవే నమః! 

                                                                     

 🙏🌹జై సాయి మాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*ఉచిత సత్సంగం ..భజన*🌹🌹🌹🌹🌹🙏🙏🙏

*పూజ్య భరద్వాజ మాస్టర్ గారి స్వప్న దర్శనం మరియు ప్రత్యేక ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాలలోనూ వీలైతే ఇతర రాష్ట్రాల్లోనూ ఉచితంగా సాయి మార్గంలో సత్సంగాలు భజన నిర్వహించాలని అనుకుంటున్నాము..*

*మీ సహాయ సహకారాలు కోరుతున్నాము*

1. *మీ ఊరు మీ ఇంటికి రావడానికి ఎటువంటి దారి ఖర్చులు ఇవ్వనవసరం లేదు. సుమారుగా ఎంతమంది వస్తారో చెప్తే.. వీలైతే సాధారణ  ప్రసాదాలు కూడా మేమే ఇవ్వగలము*

*2)మీరు కోరిన తేదీల్లో మీరు కోరిన సమయంలో సాధ్యమైనంత వరకు నిర్వహించబడును.. లేదా ఒకరోజు అటు ఇటుగా నిర్వహించబడును*

*3) వీలైతే ఉచితంగా సాయి లీలామృతము శ్రీ గురు చరిత్ర మరియు పూజ్య భరద్వాజ మాస్టర్ గారి రచనలు, ఇతర మహాత్ముని జీవిత చరిత్రలు ఉచితముగా సత్సంగము నందు ఇవ్వబడును*

*4) శ్రీ  సాయి లీలామృతం , శ్రీ గురుచరిత్ర , శ్రీ సాయి ప్రబోథామృతం , మాస్టారి ప్రవచనములు, ఏది నిజం, విజ్ఞానవీచికలు, ధ్యాన యోగ సర్వస్వమ్ వంటివి వివరిస్తూ సత్సంగం భజన సుమారు రెండు నుండి మూడు గంటలు చేయడం జరుగుతుంది*

*5.మా సత్సంగాలు వివరణలు ఎలా ఉంటాయో  తెలుసుకోవటం కోసం ఈ లింక్ క్లిక్ చేయగలరు*

*https://youtube.com/@Jai_sai_master*

*6. పూర్తిగా ఈ ప్రయత్నం పూజ్య మాస్టారి సేవగా భావించటం జరుగుతుంది*

*7. ఉచిత సత్సంగం భజన కోరువారు ...వారి పేరు ఊరు మొబైల్ నెంబర్ ..కావాల్సిన తేదీ వివరాలు తో ఈ క్రింది నంబర్స్ కి వాట్సాప్ చేయ కోరుచున్నాము*


*8919698019*

*9492120314*

*7330856225*

*73824 46829*

కామెంట్‌లు లేవు: