24, జులై 2020, శుక్రవారం

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి


1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
4.రోహిణి
ప్రజా ప్రజవృధ్యై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ .....
ఇప్పుడున్న విష(మ)జ్వరాల ప్రభావం బారిన పడకుండా సకలజనుల శ్రేయస్సు కోరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తెలియజేసిన మంత్రతుల్య మార్గాలు. దీనిని ఉపదేశంగా గ్రహించి మనందరం మననం చేసుకుందాం. మనతో పాటుగా విశ్వమంతా బాగుండాలని ప్రార్థిద్దాం.

శ్రీరామరక్ష.

💥తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతటా వ్యాపించింది. కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది.. సామాజిక వ్యాప్తి బలంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండగలరు.. తెలంగాణ వైద్య శాఖ అధికారులు..💥

💥రాబోయే నాలుగు నుండి ఐదు వారాలు చాలా సంక్లిష్టమైనది. అత్యంత జాగ్రత్తగా ప్రజలంతా ఉండాలని తెలంగాణ వైద్య అధికారులు తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి క్షేమంగా ఉండండి అని తెలియజేశారు.

💥మిత్రులారా ఆ జిల్లా ఈ జిల్లా ఏమీ లేదు తెలంగాణలో అన్ని జిల్లాలలో.. ముఖ్యంగా పట్టణాలలో కమ్యూనిటీ స్ప్రెడ్ సామాజిక SPREAD కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ల వ్యాపించింది.. అత్యంత భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి..

💥తప్రభుత్వం ఎటువంటి వైద్య సదుపాయం చేయడం లేదు, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ లో రక్త పిశాచి, రాక్షసుల మాదిరిగా రక్తం తాగుతూ దొంగతనంగా లక్షల రూపాయల బిల్లులు వేస్తూ బ్రతికుండగానే మనుషులను చంపేస్తున్నారు.

💥సకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించినప్పుడు దేశము, మనము ఎంతో సురక్షితంగా ఉన్నారు..

💥చక్కటి కొనసాగిన అద్భుతంగా లాక్డౌన్ ని అనవసరంగా వలస కార్మికుల దొంగ ఏడుపు ఏడ్చే పనికిరాని చెత్త  నాయకుల వల్ల, దొంగ  మీడియా వల్ల లాక్డౌన్ బలవంతంగా ఎత్తి వేయవలసి వచ్చింది. ఈరోజు  దేశంలో, రాష్ట్రంలో మరియు జిల్లాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

ఇంతటి భయంకర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వాలు

💥మిత్రులారా బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎవరిని కాపాడే పరిస్థితి లేదు. మీ కుటుంబం లోపల ఏ ఒక్కరూ కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ బారిన పడ్డ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది.

💥కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండగలరు, ఇంట్లోనే క్షేమంగా ఉండగలరు. లాక్ డౌన్ లో పాటించిన పూర్తిస్థాయి క్రమశిక్షణతో ఉండడమే మనందరికీ శ్రీరామరక్ష.

Tapadia Diagnostic cente, RTC cross road,

Tapadia Diagnostic cente, RTC cross road, Ln Dr Radheshyam Tapadia  have started portable oxygen concentrator facilities for needy pts.They can use this for 2 or 3 days, in an emergency,esp those needing oxygen support when at home quarantine/ or till there is bed availability.
This facility is totally free of cost.
U can suggest to any needy pt.
contact Ln Vijaylaxmi
9666654647
Ln Umesh Agarwal
9246195444
Ln Vibha Bharti
9393079342
Ln Nilesh Chheda
9392248002
LIONS CLUB OF HYDERABAD EAST.
********************

తెలుగు అనువాదం

తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్,

తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఎల్ఎన్ డాక్టర్ రాధేశ్యం తపాడియా అవసరమైన పిటిల కోసం పోర్టబుల్ ఆక్సిజన్ సాంద్రత సౌకర్యాలను ప్రారంభించారు. వారు దీనిని 2 లేదా 3 రోజులు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు, ఇంటి దిగ్బంధంలో ఉన్నప్పుడు / లేదా ఉన్నంత వరకు ఆక్సిజన్ మద్దతు అవసరం ఉన్నవారు మంచం లభ్యత.
ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం.
మీరు ఎవరైనా వ్యాధి గ్రేసులకు  సూచించవచ్చు.
Ln విజయలక్ష్మిని సంప్రదించండి
9666654647
ఎల్ఎన్ ఉమేష్ అగర్వాల్
9246195444
ఎల్ఎన్ విభ భారతి
9393079342
ఎల్ఎన్ నీలేష్ ఛేడా
9392248002
హైదరాబాద్ ఈస్ట్ యొక్క లయన్స్ క్లబ్.
*********************

లంఘనం

श्लोकम् :
अतीव बलहीनं हि लङ्घनं नैव कारयेत् ।
ये गुणा लङ्घने प्रोक्तास्ते गुणा लघुभोजने ।।

శ్లోకం:
అతీవ బలహీనం హి లఙ్ఘనం నైవ కారయేత్ ।
యే గుణా లఙ్ఘనే ప్రోక్తాః తే గుణా లఘుభోజనే ॥
        
ప్రతిపదార్థం:
అతీవ = మిక్కిలి, బలహీనం హి = బలహీనముగా ఉన్న వానికి నే,  (హి = indeed), లఙ్ఘనం = లంఖణం, న ఏవ కారయేత్ = చేయించకూడదు, యే = ఏవైతే, గుణా = గుణములు, లఙ్ఘనే = లంఘనములో, ప్రోక్తాః = చెప్పబడినవో, తే = అవే, గుణా = గుణములు, లఘుభోజనే = మిత ఆహారమందునూ ఉన్నవి.

Meaning:
Skipping a meal should not be got implemented for a person who is very weak. Whatever good qualities were advocated in skipping a meal are also available in the limited and controlled meal. 

తాత్పర్యం:
చాలా నీరసించి ఉన్న వానిని లంఘనం (లంఖణం) చేయించకూడదు. లంఘనములో ఏవైతే మంచి గుణములు ఉన్నవి అని చెప్పబడినవో ఆ మంచి గుణములన్నీ లఘు భోజనము అంటే మితాహారములో కూడా ఉన్నవి.

లంఘనంలో చెప్పిన గుణాలన్నీ లఘు భోజనంలో కూడా ఉన్నవి కావున తేలికగా భోజనం చేయించాలి.

లంఘనం అంటే గెంతుట. అంటే ఆంగ్లంలో skipping అంటారు. Skipping a meal occasionally is always good for health అంటారు. లంఘనం ప్రకృతి భాషా ప్రయోగం. లంఖణం వికృతి భాషా ప్రయోగం.

అప్పుడప్పుడు మన జీర్ణకోశానికి జీర్ణ వ్యవస్థకి కొంత విరామం ఇవ్వడం అనేది శ్రేయస్కరం అని మన పెద్దలు చెపుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్ర రీత్యా కూడ ఇది ఆచరణ యోగ్యం. అందుచే మన పూర్వీకులు మనని అప్పుడప్పుడు లంఘనం చేయమంటూ ఉంటారు లేదా ఉపవాసం చేయమంటారు. ఉపవాసం అంటే నిత్యమూ తినేట్టుగా పూర్తి భోజనం కాకుండా, మితాహారం తినడం. పర్వదినాలని ఉపయోగించుకుని మనం ఆ విధంగా చేస్తూ ఉంటాము. పూర్తి లంఖణంలోనూ, మితాహారములోనూ అంటే ఉపవాసములోనూ అవే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధముగా అవకాశం ఉంటే ఆ విధముగా చేసుకో వచ్చును.

లంఘనం పరమౌషధం అనేది తరచుగా వాడ బడుతూ ఉండే నానుడి. అంటే ఒకపూట భోజనం మానివేయడం అనేది అన్నిటికంటే మంచి ఔషధం అని అర్థం.

నేను – నా కరోనా

అది జూన్‌ 28వ తేదీ. సాయంత్రం నాలుగు గంటలు. ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో మబ్బులు    కమ్ముకొచ్చాయి. చినుకు చినుకుతో మొదలైన వాన భారీ వర్షంగా మారింది. ఆఫీసు సమయం దాటిపోతోంది. సాయంత్రం ఆరు అయ్యింది. బాస్‌కు ఫోన్‌ చేసి ఆఫీసుకు రాలేనని చెప్పాను. ఇంటి దగ్గర నుంచే న్యూస్‌ ఫాలోఅప్‌ చేస్తానని చెప్పాను. ఇంతకీ చెప్పలేదు కదూ! నేను జర్నలిస్టుని. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్ల నెట్‌వర్కుకు ఇన్‌చార్జిని. ఎప్పుడూ వార్తలు రాసేందుకు మాత్రమే ఉపయోగించే వర్కు ఫ్రం హోమ్‌ అనే పదం కరోనా పుణ్యమా అని మా పత్రికల్లోని అన్ని విభాగాల్లోకి జొర బడింది. మాకు ఈ పదం, మా కోసం ఉపయోగించడం కాసింత గర్వంగా,  ఫ్యాషన్‌గా ఉందనుకోండి. 
రాత్రి 9 దాటింది. ఆఫీసు పని దాదాపు పూర్తయింది. కొంచెం ఒళ్పు నొప్పులుగా అనిపించింది. ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమనిపించింది. ఆరు పదులు దాటిన వయస్సు నాది. బీపీ, షుగర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధులేమీ లేవు. తలనొప్పి, జ్వరం, ఇతర ఆరోగ్య కారణాలతో గత నాలుగైదేళ్ళలో ఆఫీసుకు సెలవు పెట్టిన సందర్భం కూడా లేదు. మంచి ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పలేను కానీ, నా వయస్సుకు నా ఆరోగ్యంపట్ల కొంచెం గర్వంగానే ఉంటా. కానీ కరోనా కథలు, అది పెట్టే వెతలు బాగా తెలిసి ఉండడంతో ఆ కాస్త ఒళ్ళు నొప్పులకే చిన్న జడుపు ప్రవేశించింది. రేపు ఆదివారమే కదా! విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందిలే అనుకున్నా. కానీ ఏదో అనుమానంగానే  ఉంది. 
తెల్లవారింది. అనుమానం అణువణువుకీ ప్రవేశించడం ప్రారంభించింది. నాలుగు సార్లు విరోచనాలయ్యాయి. ఒళ్ళు నొప్పులు తెలుస్తున్న స్థాయికి వచ్చాయి. లో జ్వరం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆ రోజంతా ఇంట్లో వాళ్ళకు దూరంగా, మా మనవడికి అంటీ ముట్టనట్లుగా వ్వవహరించా. ఇంట్లో నా శ్రీమతితోపాటు, మా పెద్దమ్మాయి, అల్లుడు, మనవడు ... మొత్తం అయిదుగురుం ఉంటాం. చిన్న కూతురు అమెరికాలో. ఎంఎస్‌ పూర్తి చేసి ఫ్లోరిడాలో ఉద్యోగం చేస్తోంది. 
 నా పరిస్థితి అప్పటికి ఎవరికీ తెలియదు. సాయంత్రానికి మరో రెండు సార్లు లూజ్‌ మోషన్స్‌ అయ్యాయి. రాత్రి 8.30కి తొలిసారిగా భయం ప్రవేశించింది. ఇక దాచుకోవడం కరెక్ట్‌ కాదనిపించింది. ఇలాంటి సందర్భంలో మొదట గుర్తుకు వచ్చేది మంచి మిత్రులే కదా! ఇద్దరు మిత్రులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. వారిలో ఒకరు సహచరుడు, సహ పాత్రికేయుడు (మాజీ). రెండవ మిత్రుడు యూనివర్సిటీలో బ్యాచ్‌మేట్‌. ‘‘ముందు అజిత్రోమైసిన్‌ వేసుకో, రేపు డాక్టర్‌తో మాట్లాడదాం’’ అని చెప్పారు. మేమున్నాం అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసా గొప్పదా? కరోనా భయం గొప్పదా? అంటే నేను సమాధానం చెప్పలేను కానీ, ఆ భరోసానే ఆ రాత్రికి ఊపిరిగా పని చేసింది.
మా అల్లుడు వెళ్ళి టాబ్లెట్స్‌ తీసుకు వచ్చాడు. డోలో 650, అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ. రాత్రికి నేను బెడ్‌ రూమ్‌లో పడుకోలేదు. హాల్‌లో ఒంటరిగా పడుకున్నా. నిద్ర సరిగా పట్టలేదు. వేకువ జామయ్యింది. పరిస్థితిలో మార్పు లేదు. ఒళ్ళు నొప్పులు, లోజ్వరం కొనసాగుతున్నాయి. ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వాడిన బెడ్‌షీట్లు, దిండు గలీబు తీసి సర్ఫు నీళ్ళలో వేశాను. హాల్‌లో డెట్టాల్‌ వాటర్‌ స్ర్పే చేశాను. నాలుగు జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, రైటింగ్‌ పేడ్లు, మందులు అప్పటికే వాడుతున్న పొడులు (దాల్చిన చెక్క, మిరియాలు, మెంతులు  వాము, సోంపు, జీలకర్ర గ్రయిండ్ చేసిన పొడులు) సర్దుకున్నాను. ఈ పొడులు అంత రెగ్యులర్‌ కాకపోయినా గత ఆరు నెలలుగా అడపాదడపా కషాయాలుగానో, ఇతరత్రానో వాడుతూనే ఉన్నాం. డి విటమిన్‌ – టాయో 60కె గత సంవత్సరంగా వాడుతున్నాం. జింకోవిట్‌ 50 ఎంజి, విటమిన్‌ సి 1000 ఎంజి, బికాంప్లెక్సు టాబ్లెట్లు కూడా నాలుగు నెలలుగా రోజూ ఒకటి (మధ్యలో డుమ్మాలున్నా) వాడుతున్నాం.   
మేముండేది ఇండిపెండెంట్‌ ఓన్‌ హౌస్‌. ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ డూప్లెక్సు. మా అయిదుగురి నివాసం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇటీవలే ఖాళీ అయ్యింది. మా టెనెంట్‌ది మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామం. నాగపూర్‌కు మూడు గంటల ప్రయాణం. కరోనా ఆంక్షలు ఇంకా 48 గంటల్లో ప్రారంభమవుతాయనగా కుటుంబంతో సహా సొంతూరు వెళ్ళాడు. వర్కు ఫ్రం హోం చేస్తుండగానే ఆయన పనిచేసే కంపెనీ హైదరాబాద్‌ విభాగం మూతపడింది. ఆ వార్త తెలియజేసి, త్వరలో వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానన్నాడు. నెల రోజుల్లోనే గుర్‌గావ్‌లో ఉద్యోగం వచ్చిందతనికి. తాను అక్కడ నుంచి వచ్చి ఇల్లు ఖాళీ చేయడం (ఇన్ని ఆంక్షల మధ్య రాష్ట్రాలు దాటుకుని ....) ఇబ్బందంటూ ఒక రోజు కాల్‌ చేశాడు. ఒక వెహికల్‌ మాట్లాడి తన సామాను నన్నే పంపమని కోరాడు. ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు. మరు క్షణం ఆలోచిస్తే అతను చెప్పింది నిజమేననిపించింది. ఒక ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీతో మాట్లాడి, ఇంటి తాళం పగులగొట్టి సామాను పంపాను. ప్యాకింగ్‌ చేసే దృశ్యాలు, వెహికల్‌కి లోడ్‌ చేసే దృశ్యాలు ఆయన అడగకుండానే వీడియో తీసి పంపించాను. చాలా సంతోషపడ్డాడు. నా శ్రీమతి వెంటనే ఇల్లు అద్దంలా శుభ్రం చేయించింది. టులెట్‌ బోర్డు తగిలించాం. పది రోజుల్లో నలుగురు వచ్చారుగాని, ఇద్దరు మాకు నచ్చలేదు. మరో ఇద్దరు అద్దె మెచ్చ లేదు. అలా ఖాళీగా ఉన్న ఇల్లు నాకు హోమ్‌ క్వారంటైన్‌ అవడానికి ఉపయోగపడింది. నా కుటుంబ సభ్యులను ప్రమాదం బారిన పడకుండా తక్షణ చర్య తీసుకోవడానికి దోహదపడింది. 
గ్రౌండఫ్లోర్‌లోకి వచ్చి తెచ్చుకున్న సామాను సర్దుకున్నాను. సెల్లార్‌లో అద్దెకున్న వారి ఇండక్షన్‌ స్టౌ, ఇంట్లో అదనంగా ఉన్న నవారు మంచం, పక్క బట్టలు, దిండ్లు కూడా వచ్చి నాతో  చేరాయి. ఇల్లు శుభ్రంగానే ఉంది. తక్షణం చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. ఒకటి ఒక్కడ్నే నవారును టైట్‌ చేసుకుంటూ మంచాన్ని సిద్ధం చేసుకున్నా. (దీనిలో కష్టం, టెక్నిక్‌ అనుభవం ఉన్న వారికే అర్ధమవుతుంది. రెండవ మనిషి తోడుంటేనే ఈ పనికి ఆపసోపాలు పడతారు. అలాంటిది ఒక్కడినే ... పని పూర్తయింది. నవారులో బిర్రుతనం వచ్చింది.) అదే ఊపులో ఒంటరిగా ఉండేందుకు మనస్సును కూడా సిద్ధం చేసుకున్నా. 
నా మిత్ర ద్వయం సహకారంతో సోమవారం, జూన్‌28 ఉదయాన్నే ఒక డాక్టర్‌ను సంప్రతించాను. పెద్దగా లక్షణాలు లేవు కదా! రెండు రోజులు ఆగండి, ఎక్సరే తీద్దాం అన్నారు. మిత్రులిద్దరూ సూచనలు, జాగ్ర త్తలు చెబుతూనే ఒక ప్రైవేటు ల్యాబ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌కి బుక్‌ చేశారు. పరీక్ష చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా ఉంది. అంత తేలిక కాదు. వాళ్ళు ఇంటికి వచ్చి స్వాబ్‌ టెస్ట్‌ తీసుకునేట్లు మాట్లాడారు. బుధవారం, (జూలై ఫస్ట్‌) వస్తారని చెప్పారు. స్వయంగా వెళ్ళి క్యూలో నిలబడి టెస్ట్‌ చేయించుకోవల్సిన పరిస్థితి తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నాను.  అయితే నాలో ఉన్న భయానికి, ఆందోళనకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వారు ఎలా వస్తారో తెలియదు. ఎలా టెస్ట్‌ తీసుకుంటారో తెలియదు. డ్రెస్‌లో ఉంటారా? టువీలర్‌లో వస్తారా? ఫోర్‌ వీలర్‌లో వస్తారా? ఇంటి చుట్టు పక్కల వాళ్ళకు తెలుస్తుందేమో? పని అమ్మాయిని రానివ్వరేమో! ఇంట్లో వాళ్ళను బయట తిరగనివ్వరేమో? ఇంటి సెల్లార్‌లో ఒక కుటంబం ఉంది. టెర్రస్‌ మీద ఉన్న సింగిల్‌ రూమ్‌లో ఒక బ్యాచిలర్‌ అద్దెకుంటున్నాడు. వీరందరికీ ఇబ్బందే. ఇవి ఆ ఆందోళనకు కొన్ని కారణాలు.
మధ్యాహ్నం 12.30 అయ్యింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక గంటలో వస్తానన్నాడు. టు వీలర్‌లో        వస్తున్నాడని, డ్రెస్‌లో ఉండడని, మన ఇంటికి వచ్చిన తర్వాతనే పీపీ కిట్‌ ధరిస్తాడని తెలుసుకున్నాను. కాస్త కుదుటపడ్డాను. రెండు గంటల సమయంలో ఇంటికి దగ్గరలో మెయిన్‌ రోడ్‌కి వచ్చి ఫోన్‌ చేశాడు. అక్కడే ఉండమని మా అల్లుడ్ని పంపించాను. (అతను అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చి ఇంటి చుట్టు పక్కల వాళ్ళను విచారించడం నాకు ఇష్టం లేదు .... ఎందుకో మీకు తెలుసు.) వచ్చి వాకిలి బయటే వరండాలో నిలబడి తన కిట్స్‌ సిద్ధం చేసుకోవడానికి ఉపక్రమించాడు. లోపలకు రమ్మన్నాను. మేము రాకూడదన్నాడు. రాకూడనిది నాకోసమా? తన కోసమా? ఇద్దరి భద్రత దానిలో ఉందిలే అనుకున్నాను. బయట నుంచి ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించాను. మధ్యాహ్నం రెండు దాటడంతో ఎవరి గుహల్లోకి వాళ్ళు వెళ్శినట్లున్నారు. ఎవరూ కనిపించలేదు.
కిట్‌  రెడీ  చేసుకుని పీపీఈ కిట్‌ నుంచి (వ్యక్తిగత రక్షణ వస్తు సముదాయ కిట్‌) తీసిన డ్రె స్‌ వేసుకున్నాడు. నన్ను ఒక చైర్‌ తెచ్చుకుని కూర్చోమన్నాడు. గొంతు, ముక్కు ద్వారా స్వాబ్‌ తీసుకుని ఒకే కంటైనర్‌లో రెండూ వేసుకుని క్లోజ్‌ చేశాడు. (కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్వాబ్‌ స్టిక్‌ మీద ఉన్న గుర్తు ముక్కు లోపలకు వెళ్ళేవరకు పంపిస్తారు. అర నిమిషం ఓర్చుకోవాలి). తను వేసుకున్న డ్రెస్‌ తీసి ఒక వేస్ట్‌ కవర్‌లో వేసి క్లోజ్‌ చేసి దానిని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. పేరు, ఇతర  వివరాలు అడిగి నోట్‌ చేసుకున్నాడు. అతనికి 3,100 రూపాయలు పే చేయమని మిత్రులు ముందే చెప్పారు. అతని ఫోన్‌పే అకౌంట్‌కి 3,300 బదిలీ చేశాను. థాంక్యూ అని వెళ్ళాడు. వాళ్ళ సర్వీస్‌ మీద నాకున్న గౌరవం ఎందుకో పెరిగింది. మొత్తంపై ఒక ఘట్టం ముగిసింది. 
ఇక మళ్ళీ నా భయం అనే గుహలోకి వచ్చాను. ఇక్కడ మీకు భయం గురించి ఒక విషయం చెప్పాలి. నాకు సంబంధించినంత వరకు భయానికి నాలుగు కారణాలున్నాయి. 
మొదటిది : నాకే ఈ కష్టం ఎందుకు రావాలి అనుకోవడం. జీవితమంటే కష్ట సుఖాల మేలు కలయిక అనే గ్రహింపు లేకపోవడం. ఈ రెండు కారణాలతో ఈ భయం ప్రవేశిస్తుంది. కష్టాలు ఎక్కువగా ఉండి సంతోషాలు తక్కువగా ఉంటే జీవితం కష్టమయంగా ఉందని అర్ధం. సంతోషాలు ఎక్కువగా ఉండి, కష్టాలు తక్కువగా ఉంటే జీవితం సుఖమయంగా ఉందని. అయితే ప్రతి విషయాన్ని కష్టంగానే భావించే వారిని మనం ఏమీ చేయలేం. ‘’ఏడీ సూర్యుడు లేడని ఏడుస్తూ కూర్చుంటే మిణుగురుని సైతం కనలేవు’’ అన్న డాక్టర్‌ సినారేని గుర్తు తెచ్చుకుని వారి ఖర్మకు వారిని వదిలేయాలి. నాకు ఈ రకం భయం లేదు.
రెండవది: మన ఆరోగ్యం..... ఆహార, విహార, వ్యవహారాలు సక్రమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారం కాసేపు పక్కన బెడదాం. ఆహార, విహారాల సంగతి చూద్దాం. ‘‘అక్షరమ్ములిన్ని కుక్షిలోనిడినంత / చదువటంచు దాని చాటరాదు; జ్ఞానమొకటే ధాత్రి చదువన చెల్లురా .......’’ అని ఒక పండితుడి ప్రవచనం. మనం వినడం, తెలుసుకోవడం ఎక్కువ, ఆచరించడం తక్కువ. 45, 50 ఏళ్ళు లోపు వయస్సులో ఓకే. అంగీకరించవచ్చు. రుచులకు, అభిరుచులకు పెద్దపీట వేయవచ్చు. 50 దాటిన తర్వాతైనా జాగ్రత్త ఉండాలిగా. వందల విషయాలు తెలుసుకుని, వాటిని మధించి, చర్చించి, పలువురికి బోధించి చివరకు ఒకటి రెండు ఆచరించడం ఎక్కువగా జరుగుతోంది. ఇదే ప్రమాదం. నాలుగు విషయాలు తెలుసుకున్నా నాలుగు నెలలు క్రమంతప్పకుండా పాటిస్తే అదే ఆరోగ్యానికి ఆలంబన అవుతుంది. నడక, నడతలు కూడా దీనికి తోడు అయితే ఈ ఆలంబనకు ఆడంబరత వస్తుంది. కాస్త శారీరక వ్యాయామం, శ్వాసపై ధ్యాస చాలా సమస్యలకు పరిష్కారం.  (అనుబంధం ఒకటిలో ఆహార, ఔషధాల వివరాలు పొందుపరిచాను. చూడవచ్చు.....) ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం ... అన్నిటికంటే విలువైన ఆ ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే ఆహార, విహార, వ్యవహారాల్లో మనం ఎన్ని విలువలు పాటించాలి? నా వరకు ఈ రెండవ రకం భయం కూడా లేదు. 
ఇక మూడవది : అండదండలు ............ మిత్రులు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు ఈ కోవలోకి వస్తాయి. ఇవి లేకపోయునా, చాలకపోయినా భయం మనల్ని కమ్మేస్తుంది. కరోనాపై నాలో అనుమానం అలా మొగ్గ తొడగగానే ఇలా గుర్తుకు వచ్చింది ఒక మిత్ర ద్వయం. స్వాంతన వచనాలతో వారు నన్ను సమాధానపరచలేదు. ఆచరణాత్మక సలహాలు, అవసరమైతే రంగంలోకి దిగుతామన్న భరోసా ఇచ్చారు. అదే నాకు ధీమాను, నమ్మకాన్ని కలగజేసింది. మరో వైపు కుటుంబం. బెంబేలెత్తకుండా బలంగా నిలబడదాం అన్న క్రియాశీలతే అందరిదీ. మా అల్లుడు పైకి కనిపించకపోయినా కాస్త కంగారుపడతాడు కానీ పెద్దమ్మాయి, శ్రీమతి మాత్రం ... ‘ఏముంది ఎదుర్కుందాం’ అన్న ధోరణిలోనే ఉంటారు. ఫ్లోరిడా నుంచి మా చిన్నమ్మాయిది పెద్ద పాత్ర. ప్రణాళికలో, ఆచరణలో అడుగడుగునా పక్కనే ఉంది. రోజూ రెండు పూటల బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు తను చేస్తూ, నాచేత చేయించేది. 15 నిమిషాలతో ప్రారంభించి అరగ ంటకు తీసుకెళ్లింది.  ఒక్క మాటలో చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని తనుండే ఫోర్ట్‌లాడర్‌ డేల్‌ను నా క్వారంటైన్‌ ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక మా ఎండీ, ఎడిటర్‌ ఇతర కొలీగ్స్‌ పలకరింపులు, ఏమీ కాదన్న భరోసాలు సరేసరి. మొత్తంపై రెండు, మూడు రోజులు మాత్రమే సెలవులో ఉన్నా. ఎడిటర్‌ సున్నితమైన హెచ్చరికతో (నిజానికది ఉన్నతమైన సూచన) వర్క్‌ ఫ్రం హోం చేయడం ఈ సమయంలో నా భయాందోళనల నుంచి ఎక్కువ సమయం బయటపడడానికి దోహదపడింది.
ఇక బంధువుల అనుబంధ రాగ మాలికలు నన్ను ఒక్కసారి కమ్మేశాయి. అందిన సమాచారం మేరకు నగరంలోనే ఉన్న మా అక్కయ్య మ్రాన్పడిపోయింది. రోజంతా ఎవరితో మాట్లాడలేదు. కరోడాల్లా ఉండే మా ఇద్దరి మేనల్లుళ్ళ కళ్ళు వర్షించాయి. కూతుళ్ళు, కొడుకులు తల్లడిల్లారు. వదినలు నిజంగానే వగచారు. చిన్న మరదలు భోరు భోరున ఏడ్చేసింది. (మంచి నటి. మనిషి కూడా సావిత్రి పోలికే...). అల్లుళ్ళు, తోడళ్ళళ్ళు, కజిన్స్‌ ఏ అవసరం తీర్చేందుకైనా సిద్ధమయ్యారు. పెద్ద మరదలు దాదపు ఫెయింట్‌ అయ్యింది. తేరుకున్న తర్వాత వెంటనే  ఫోన్‌ చేసింది. ‘‘బావగారూ, ఖర్చు ఎంతైనా ఫరవాలేదు. ఎంత అవసరమైతే అంత సిద్ధం చేస్తాను. దాని గురించి మీరు ఆలోచించకండి.  మిగిలిన విషయాలు చూసుకోండి’’ అంది. డబ్బు ముఖ్యం కాదని మాటల్లో చెబుతాం కానీ, ఆచరణలో అది అవసరమే. రూపాయి గుప్పెట్లోకి మనం వెళితే పతనం అవుతాం. కానీ మన గుప్పెట్లో ఆ రూపాయి లేకపోతే ఎలా!? లండన్‌ నుంచి మా కోడలు (నాలుగో అన్నయ్య కోడలు) పంపిన కన్సోల్‌ మెసేజ్‌ కూడా ఈ సందర్భంగా మీతో పంచుకోవాలి. ఆ మెసేజ్‌ కాస్త సుదీర్ఘమైనదే. ఆ మెసేజ్‌లో ముందుగా తన బాధ వ్యక్తమవుతుంది. తర్వాత హాస్యం తొంగి చూస్తూంది. ఆపై ఆప్యాయిత పొంగుతుంది ..... ‘‘ఇలా జరిగినందుకు బాధగా ఉంది. అయునా ఆసుపత్రిలో కాక హోం క్వారైంటైన్‌లో ఉండడం కాస్త సంతోషకరమైన విషయం. ఈ క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులకు పరీక్ష అనుకోండి. ఎవరెంత అండగా ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ  మనవరాలు (మూడు నెలల వయస్సు) మీకు గాఽఢాలింగనం ఇస్తోంది. ఆ స్పర్శతో వచ్చే తరంగాలతో (వైబ్రేషన్లు) తాతకు స్వస్థత చేకూరుతుందట .... ’’ ఇదీ ఆ మెసేజ్‌ సారాంశం. (మీరు కోలుకున్న తర్వాత మీ అనుభవాన్ని రాయాలన్న సూచన కూడా ఆ కోడలిదే ....) ఇవి అన్నీ నా గుండెల్లో తడిని కనుగూటిలోకి తెచ్చాయి. ‘నా గుహలో, కుటిలో ...’ ఉన్నానేగానీఇంకా చీకటి ఎక్కడిది? ఇలా ఈ భయం కూడా కొండెక్కింది.
నాల్గవ భయం: సామాజికపర మైనది, పాలనాపరమైనది. సామాజికపరమైన ఇబ్బందులు ముందే ప్రస్తావించాను. ఇక ప్రభుత్వపరమైన, పాలనాపరమైన విషయానికి వస్తే భయం స్వరూపం ఎంత భీకరంగా వుంటుందో కోవిడ్‌ చూపిస్తోంది. మనకు మిత్రులున్నారు. ఆఫీసు అండ వుంది. ఆదుకునే బంధుగణం ఉన్నది. అంతో  ఇంతో ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ జరగరానిది జరిగితే? కరోనా ఏదో ఒక అవయవాన్ని కమ్మేస్తే? అర్ధరాత్రి ఆపద చుట్టేస్తే? ఆదుకునేది ఎవరు? పలికే డాక్టర్‌ ఎవరు? మనకు గేటు తె రిచే ఆసుపత్రి ఏది? ఇంటికి అరగంటలో వచ్చే అంబులెన్స్‌ ఉందా? పోనీ 108 వస్తుందా? సర్కార్‌ దవాఖానాకు వెళితే సశేషంగా ఉంటామా? ఏ కుటుంబ సభ్యుడి, ఏ ఆప్తుడి ఆరోగ్యాన్ని  ఫణంగా పెట్టి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతాం? సమస్య తీవ్రమైతే, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బెడ్‌    ఇస్తామని హామీ ఇచ్చిన ఆసుపత్రుల పీఆర్‌ఓలు ఆ సమయానికి చేతులెత్తేస్తే? 
ఈ భయాన్ని గౌరవించాలా? వద్దా? ఈ భయాన్ని భయం, భయంగా అంగీకరించాలా? వద్దా? నేను ఈకథనం రాస్తున్న రోజుకు ఏక్టివ్‌ కోవిడ్‌ కేసులు రాష్ట్రంలో కేవలం 10,891. ప్రభుత్వాలకు ప్రాణాల విలువ తెలిస్తే ...... 33జిల్లాలు, ఒక అంతర్జాతీయ మహానగరం ఉన్న రాష్ట్రంలో పదకొండు వేలమందిని అక్కున చేర్చుకుని ఆదరించడం చేతకాదా? ఆసుపత్రుల తలుపులు తడుతూ అంబులెన్సు ‌లు, ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ, తిరుగుతూనే ప్రాణాలు వదలాలా? ప్రభుత్వాసుపత్రులంటే యమకూపాలన్న భావాన్ని ఈ ఆపద వేళకూడా తొలగించలేరా? విలువల గురించి మనకు అవసరమైనప్పుడు మాట్లాడడం సరికాక పోవచ్చు. కానీ ఇప్పుడు కూడా మౌనంగా ఉండడం నేరం కావచ్చు. భయ కారణాల్లో చివరిదైనా ఈ ఒక్క భయంతోనే నా క్వారంటైన్‌ మొదటి వారం పూర్తి భయం, భయంగా ... రెండవ వారం భారంగా గడిచింది. 
జూలై ఒకటిన టెస్ట్‌కు ఇచ్చాను. మూడవ తేదీ రాత్రి పది గంటలకు ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. రెండవ తేదీ సాయింత్రం నాలుగు  గంటలకు చివరిసారిగా నాకు జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. డోలో 650 ఒకటి వేసుకున్నాను. రెండూ తగ్గాయి. జూన్‌ 29 నుంచి జూలై రెండు వరకు లో జ్వరం ఉన్నప్పటికీ మొత్తంపై నేను నాలుగైదుకు మించి డోలో 650 వాడలేదు. 28 నుంచి వరుసగా  ఆరు రోజులు ఆరు అజిత్రోమైసిన్‌  వాడాను. పాజిటివ్‌ వచ్చిన మరుసటి రోజు నాల్గవ తేదీ మొత్తం నలుగురు డాక్టర్లను సంప్రతించాను. పరిస్థితి ఇదీ అని చెప్పాను. ‘‘మీకు సింప్టమ్స్‌ వచ్చి ఏడు రోజులు, వైరస్‌ ప్రవేశించి అంత కు ముందు నాలుగు రోజులు లెక్కలోకి తీసుకుంటే పదకొండు రోజులు .... ఆల్‌ మోస్ట్‌ మీ వైరస్‌ పీరియడ్‌ అయిపోయినట్లే’’ అని ఒక  డాక్టర్‌ చెప్పారు. ఆయన మాటతో చాలా ధైర్యం వచ్చింది. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం ‘‘ఇక దగ్గు, జలుబు స్టార్ట్‌ అవుతాయి. ఆక్సిజన్‌ అందకపోయే అవకాశాలు ఉంటాయి, అప్రమత్తంగా వుండాలి’’ అని చెప్పారు. పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. మరో డాక్టర్‌ను సంప్రతిస్తే డి డెన్వర్‌, ఐరన్‌ సంబంధిత, ఇతర కొన్ని బ్లడ్‌ టెస్ట్‌లు చేయించుకోమని సూచించారు. పాజిటివ్‌ వచ్చి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఉన్న నాకు ఈ టెస్ట్‌లు ఎలా చేయించుకోవాలన్నది ఆందోళన. ల్యాబ్‌ వాళ్ళు ఇంటికి రాకపోతే ఎలా వెళ్ళాలన్నది పెద్ద సమస్య. (ఈ సమస్య రాగానే రెండు పీపీఈ కిట్స్‌ తెప్పించుకుని ఇంట్లో ఉంచుకున్నాను. ఒకవేళ తప్పనిసరైతే అవి ధరిస్తే, మా అల్లుడో, కాబోయే అల్లుడో డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకెళతారన్నది నా ఆలోచన....)
అప్పుడు గుర్తుకు వచ్చాడు డాక్టర్‌ రాము. మా మిసెస్‌ వాళ్ళ ఊరు. బంధువు కూడా. పదవ తరగతి సర్టిఫికెట్‌లో పేరు తప్పు పడిందని తొలిసారిగా వాళ్ళ నాన్నతో మా ఇంటికి వచ్చాడు. మరలా అమెరికాలో ఎంఎస్‌ (ఆర్థో)చేసి మలిసారి మా ఇంటికి  వచ్చాడు. నిరాడంబరుడు. కూల్‌గా ఉంటాడు. ఎంఎస్‌ చేసేటప్పుడు ఎమర్జన్సీ విభాగంలో పని చేయడం వల్ల అన్ని విషయాలపైనా పట్టు ఉంది. మంచి డాక్టర్‌. వెంటనే ఆయనను సంప్రతించాను. (వెంటనే అంటే తక్షణమే అనుకునేరు. ఒక మంచి డాక్టర్‌తో మాట్లాడాలి అంటే కనీసం ఆరునుంచి 12గంటలు వ్యవధి అవసరమవుతుంది.) మీరు ఉన్న పరిస్థితికి ఆ పరీక్షలు అవసరం లేదులే అని తను చెప్పాడు. ఊరట చెందాను. కానీ, పక్క రాష్ట్రంలో ఉంటాడు. ఏదైనా సమస్య తీవ్రమైతే ఫాలోఅప్‌ ఎలా? అందుకే మంచి ఆసుపత్రికూడా ఉన్న తొలి రోజు ఫోన్‌లోకన్సల్ట్‌ చేసిన డాక్టర్‌ కుమార్‌ను మరలా సలహా అడిగాను. తమ ఆసుపత్రిలోని ఒక కోవిడ్‌ స్పెషలిస్ట్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన ఫాబ్‌ఫ్లూ 200 ఎంజీ టాబ్లెట్స్‌ వాడాలి అని చెప్పారు. వాటి తీవ్రత కూడా తెలియజేశారు. ‘‘మా ఆసుపత్రిలో ఎనిమిదిమంది కోవిడ్‌ రోగులకు వాడుతున్నాను. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు. మీరు కూడా వాడడం అవసరం’’అని చె ప్పారు. ఆ టాబ్లెట్స్‌ షెడ్యూల్‌ తెలిస్తే గుండె ఆగుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం 9, రాత్రికి 9 మొత్తం 18 టాబ్లెట్లు (3600 ఎంజీ), రెండవ రోజునుంచి మధ్యాహ్నం 4, రాత్రికి నాలుగు చొప్పున 8 టాబ్లెట్లు .... 21 రోజులు లేదా కనీసం 14 రోజులు వరుసగా వాడాలి అని చెప్పారు. అలాగే అని మరలా మా డాక్టర్‌ రామును ఆశ్రయించాను. అవసరం లేదు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఖచ్చితంగా వుంటాయి అని చెప్పాడు. క్వారంటైన్‌ అంటే ఒంటరిగా వుండడమే కాదు. ఒంటరిగానే భయాలను ఎదుర్కోవాలి. పంచుకోవడానికి, ఫాలోఅప్‌ చేయడానికి భౌతికంగా పక్కన ఎవరూ వుండ రు. ఇదే పెద్ద సమస్య. 
దూరం చేద్దామనుకుంటున్న భయం ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ వెంటాడుతూనే వుంది. మరుసటి రోజు డాక్టర్‌ కుమార్‌ తనే స్వయంగా ఫోన్‌ చేశారు. తమ డాక్టర్‌ ఏమి చె ప్పారని అడిగారు. ఫాబ్‌ ఫ్లూ వాడమన్నారు. దొరకలేదని అన్నాను. మా ఆసుపత్రిలో ఉన్న మెడికల్‌ షాపులో ఉన్నాయి. ఎవరినైనా పంపి తెప్పించుకోండి అన్నారు. చిన్నగా నసుగుతూ .... కాదు సార్‌, ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ అని వివరించాను. గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు కూడా లేవు, ఆ టాబ్లెట్స్‌ తప్పనిసరిగా వాడాలా ? అన్నాను. ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. మరు క్షణం .... ‘‘ వద్దు లెండి. అవసరం లేదు. అంతా స్టిగ్మా మయం అయ్యింది. ప్రభుత్వానిది ఒక రకమైన స్టిగ్మా. మా డాక్టర్‌ది ఒక రకమైన స్టిగ్మా .... అమ్మో, మన కృష్ణ ప్రసాద్‌ ... మన, మన .... ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన స్టిగ్మాతో నడుస్తోంది ...’’ అన్నారు. ఆయనతో నా గత పరిచయం అంత ఎక్కువేమీ కాదు. అయినా ఆయన అలా మాట్లాడడం నన్ను చలింపజేసింది. ఆయన గొప్పతనానికి, నిజాయితీకి మనస్సులోనే అభినందనలు తెలియజేసుకున్నాను. ఇక కొంత నిశ్చింతగా వున్నాను. నాగపూర్‌లో మా మేనకోడలు కూతురు డాక్టర్‌ స్నేహ (ఎండి, అనస్తీయషన్‌) కూడా విలువైన సలహాలు ఇస్తుండేది. విజయవాడలో ఉన్న మా వియ్యపురాలు డాక్టర్‌ అరుణ (యానిమల్‌ హజ్‌బెండరీ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ డీఈ) రోజూ ఉదయాన్నే నా క్వారంటైన్‌ వార్డుకు రౌండ్స్‌కు వచ్చిన చందంగా పలకరింపు, పరామర్శ వుండే వి. ఏది ఏమైనా రాత్రి అయితే ఏదో తెలియని భారం గుండెలపై కూర్చునేది. నిద్ర నిండుగా వుండేది కాదు. నాలుగు గంటల నిద్ర పడితే, ఖచ్చితంగా గంట కొట్టినట్లు మెలకువ వచ్చేది. (రోజూ నిద్రమాత్ర జోలాఫర్‌ 5 ఎంజీ కూడా వాడేవాడ్ని.) మెలకువ వచ్చిన సమయంలో అమెరికాలో ఉన్న మా చిన్నమ్మాయితో కాసేపు చాట్‌ చేసి, ఆన్‌లైన్‌లో రెండు పేపర్లు చదివి మరలా పడుకుంటే మరో గంటన్నర లేదా రెండు గంటలు నిద్ర పట్టేది. ఈ ఒక్క ఇబ్బంది మినహా నా క్వారంటైన్‌ సవ్యంగానే గడిచినట్లు. 
ఒకటవ తేదీ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ వచ్చింది. మరలా 19వ తేదీ రిపీట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించాను. 21వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ఫలితం వచ్చింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ అభినవ్‌ రిపోర్ట్‌ పంపడంతోపాటు నెగటివ్‌ అని మెసేజ్‌ కూడా పెట్టాడు. నాకు ఈ 25 రోజుల్లో అత్యంత ఆమోదయోగ్యమైన, ఆనందదాయకమైన మెసేజ్‌ అదే. మొదటిగా నా మిత్ర ద్వయానికి తెలియజేశాను. అడుగడుగునా అండగా వుండటమే కాదు. పూటకు రెండుసార్లు అయినా రిజల్ట్‌ గురించి వాకబు చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్లకు, ప్రాణప్రదమైన మిత్రులు, కొలీగ్ లు, బంధువులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. క్వారంటైన్‌ ఇంటిని శుభ్రం చేసి బట్టలు, కొన్ని వస్తువులు అక్కడే వదిలేసి తాళంవేసి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇంటికి వచ్చేశాను. దూరం 20 మెట్లే అటు అయినా, ఇటు అయినా! కానీ 25 రోజులు వాకిలి దాటకుండా నాలుగు గోడల మధ్య ఉండే ఈ అనుభవం నాకెప్పటికీ వద్దనే కోరుకుంటున్నాను. నేనే కాదు ఎవరూ కూడా కోరుకోరు. ఎత్తుపల్లాలతో ఉండేదే జీవితం. ఒక్కోసారి పల్లం అనుకున్నది చిన్న లోయ కావచ్చు, పెద్ద  లోయ కావచ్చు. బయటపడే ప్రయత్నం అందరం చేస్తాం. కానీ ఆ సమయంలో భయం, ఆందోళనలు ఎంత తక్కువగా ఉంటే ఆ లోయను జయించే సామర్థ్యం అంత ఎక్కువగా వుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరించగలిగే వారు, సంజీవ్‌దేవ్‌ వంటి తాత్వికులు కొందరే ఉంటారు .... అలాంటి వారి నుంచి స్ఫూర్తిని పొందగలిగితే అగాథాల నుంచైనా అంచుకు చేరుకోగలుగుతాం ..... థాంక్యూ.
అనుబంధం : 
1. మా ఇంటిపైన మిద్దె తోట వుంది. చిన్నదే కానీ ఆకు కూరలు బాగా వస్తాయి. పాలకూర, తోటకూర, గోంగూర, బెంగుళూరు బచ్చలి,    మునగాకు, కరివేపాకు, వామాకు, తులసి, కొత్తిమీర, పుదీనా ..... వీటిలో ఎవరికి నచ్చిన కాంబినేషన్‌తో వారు .... ఒక్కొక్కటి నాలుగేసి ఆకులు, అర అరటిపండు, రెండు ఖర్జూరాలు, చిన్న అల్లం ముక్క బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రయిండు చేసి మజ్జిగ (పాలు అయినా ఓకే) కలుపుకుని స్మూతీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం. 
2. నిద్ర లేవగానే గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు. అరగంట తర్వాత మరో గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో పసుపు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, నిమ్మ రసం కలుపుకుని తాగడం. ఽ
3. ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, లవంగాలు, ఏలుకల పొడులు, ఇంగువ ఎలా వీలైతే అలా ... ఏదో ఒక పద్దతిలో (కూరల్లోగాని, కషాయాలుగా గాని) వాడుకోవడం. 
3. రెండు స్పూన్లు మొలకలు కట్టిన పెసర, శనగ గింజలు.
4. ఇడ్లీ, దోశెలకు వాడే బియ్యం స్థానంలో 20 శాతం లోపు బియ్యాన్ని వాడి, 80 శాతం సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఇతర మిల్లెట్లు వాడడం.
5. క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరా పచ్చి ముక్కలుగాని, జ్యూస్‌ రూపంలోగాని, ఉడకబెట్టిగాని (వారానికి రెండు, మూడు రోజులైనా) తీసుకోవడం. 
6. లంచ్‌ని కప్పు అన్నం (బియ్యం, గోధుమలకు దాదాపు స్వస్తి. కొర్రలు ఇతర మిల్లెట్స్‌ ఎక్కువగా), కప్పు కూర, కప్పు ఆకుకూర పప్పు, కప్పు పెరుగుతో ముగించడం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఒకటి, రెండు ముద్దలతో సరిపెట్టడం. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఆనియన్‌ పచ్చివి తీసుకోవడం కూడా అవసరం. వంటకాల్లో కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, కుసుమ, నెయ్యి ఎక్కువగానే నువ్వులు, వేరుశెనగ, ఇతర గానుగ నూనెలు మాత్రమే వాడడం.
7. సాయంత్రం పండ్లు, డ్రై ఫ్రూట్లు ..... అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ, ఆపిల్‌, ఫైనాపిల్‌, ద్రాక్ష ఏదో ఒకటి లేదా రెండు రకాలు. జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రూట్‌, వాల్‌నట్‌ వంటివి. లేదా వేరుశెనగ గుళ్ళు నానబెట్టి (మూడు టేబుల్‌ స్పూన్లు మాత్రమే) ఉల్లిపాయలు కలుపుకుని తినడం.
8. డిన్నర్‌ లంచ్‌లో సగం లేదా బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకోవడం. 
9. రోజుకు మూడు సార్లు ... ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల తర్వాత కషాయాలు తీసుకోవడం. (కషాయం – పేరు పెద్దదేగాని, విషయం చిన్నదే. ఆకులైనా, పొడులైనా గంటలు గంటలు కాచాల్సిన అవసరం లేదు. మూడు నుంచి అయిదు నిమిషాలు కాచి వడగట్టుకుని తాగితే సరిపోతుంది. అల్లం అరంగుళం ముక్క, పావు స్పూను మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి బేస్‌ మెటీరియల్‌గా, కామన్‌గా వాడుతూ ఏదో ఒక ఆకులు నాలుగు తుంచి వేసుకుని అయిదు నిమిషాలు మరగపెడితే సరిపోతుంది. తులసి, మునగాకు, మునగ పూత, వామాకు, గోంగూర, పారిజాతం, జామాకు, లెమన్‌గ్రాస్‌ ఏది అందుబాటులో ఉంటే అది .... కొంచెం ఆరనిచ్చి అర చెక్క నిమ్మరసం కలుపుకుంటే బెటర్‌.
10. రోజుకు రెండుసార్లు గార్గిలింగ్‌ .... వేడి నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు కలపుకుని పుక్కిలిస్తే సరిపోతుంది. లేదా బె టాడైన్‌ మౌత్‌ వాష్‌ అయినా సరే.
11. రెండుసార్లు ముఖానికి ఆవిరి (కొబ్బరి నూనె ముఖానికి రాసుకుని, తర్వాత ....) పట్టడం.
12. 30 నిమిషాలు నడక, 20 నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, పది నిమిషాలు ఏదో ఒక వ్యాయామం.
ఆవేశకావేషాలు అదుపులో ఉంచుకోవడం .... మన చుట్టూ అందరూ సంతోషంగా ఉంటేనే మన సంతోషం నిండుగా ఉంటుంది కాబట్టి ఇంటా, బయటా అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం.  ఆచరిస్తే ఇవి చాలు ......

*కౌసల్యానందనరామ కమలాప్తకులరామ* పాట

ఓం నమో వేంకటేశాయా 
   
                     
*పాడిన వారు: నేదునూరి కృష్ణ మూర్తి*
రాగము: సాళంగనాట
రేకు: 0157-06
సంపుటము: 2-275
॥పల్లవి॥
కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయ పరిపూర్ణరామ

మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటివి

సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయమృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటివి

సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా

*ఓం నమో వేంకటేశాయా*

*సేకరణ: సూర్య ప్రకాష్.*

హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్

హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్
చేతులు జోడించి చేస్తున్న అభ్యర్థన
*5 ఆగస్టు 2020 బుధవారం*మీ *ఇల్లు,షాపు, ఆఫీసు,పనిప్రాంతం,ఫ్యాక్టరీ* ఎక్కడ ఉంటే అక్కడ 
ఉదయం సుముహూర్త సమయానికి సీతారాముల పటం‌ ,మీ ఇంట్లో పూజాగదిలో ,దేవీ దేవతల పటాలముందు.దీపాలు వెలిగించండి పసుపు , కుంకుమ,అక్షింతలు,పుష్పాలుసమర్పించండి,అవకాశం ఉన్నచోట ,దేవాలయాలలోపూజలో పాల్గొనండి ,పూజ చేయండి.
రాత్రి7.00గంటలకుసాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ* దీపాలను వెలిగించండి.*మహిమాన్విత రోజుకు, ఆ క్షణాలకు మిమ్మల్ని మీరు సాక్షిగా చేసుకోండి*.
హిందువులారా మీరు హిందులమని గర్వంగా  భావించండి.*ఈ 500 సంవత్సరాలలోఅదృష్ట వంతులు మీరు**హిందూ ఆత్మాభిమాన పునరుద్ధరణ స్వయంగా. మీ కళ్ళతో చూసే భాగ్యం, మీ చెవులతో  వినే భాగ్యం ,మీ చేతులతో పూజచేసే భాగ్యం. మీ నోటీత స్మరించే భాగ్యం మీకు కలిగింది.మీ కలలను సాకారం చేసుకున్న అవకాశం పొందిన అదృష్ఠవంతులు మీరు.ఆరోజుమర్యాద పురుషోత్తముడైన  శ్రీరాముని జన్మస్థలమైన సరయూ నదిఒడ్డున వున్న  అయోధ్య యొక్క పుణ్య భూమిలో మన ఆరాధ్య దైవం * మర్యాద పురుషోత్తముడు .రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి ప్రతీక ఐన రాజా రామచంద్ర ప్రభువు మన ఆయోధ్య శ్రీ రాముడికి అద్భుతమైన నవ్య భవ్య  రామమందిరం నిర్మాణం యొక్క భూమి పూజ జరుగుతుంది * హిందువులారా శ్రీ రాముడిఅద్భుత మందిరంలో దివ్య స్వరూపుడైన రాముడివిగ్రహాన్ని ఆయన రాజ్యాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు*దయచేసి మీ అందరిని అభ్యర్దిస్తున్నాము.ఈ పవిత్రమైనరోజు దీపం వెలిగించాలి * యావత్ భారతాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని హిందూ సమాజాన్ని  దీపశక్తికాంతితో  పరిచయం చేయాలి.*
శ్రీరామ జయరామ జయజయ రామ విజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
*జై శ్రీరామ్ జైజై శ్రీరామ్* భారత్  మాతా కీ జై
గంగా మాతా కీ జై ,
గోమాతా కీ జై
తులసీ మాతా కీ జై .
రాజా రామచంద్ర మహరాజ్ కీ జై
పవనసుత హనుమాన్ కీ జై

మళ్ళీ శ్రీ మరాజ్య స్థాపనలో
అందరితో కలసి మన మందరము అడుగులో అడుగు కలిసి ముందుకు వేద్దాం

Infectious Disease Clinic,

Now something practical and honest from the :
Head of the Infectious Disease Clinic, University of Maryland, 
USA:

1. We may have to live with C19 for months or years. Let's not deny it or panic. Let's not make our lives useless. Let's learn to live with this fact. 

2. You can't destroy C19 viruses that have penetrated cell walls, drinking gallons of hot water - you'll just go to the bathroom more often.

3. Washing hands and maintaining a 
two-metre physical distance is the best method for your protection. 

4. If you don't have a C19 patient at home, there's no need to disinfect the surfaces at your house.

5. Packaged cargo, gas pumps, shopping carts and ATMs do not cause infection. 
Wash your hands, live your life as usual.

6. C19 is not a food infection. It is associated with drops of infection like the ‘flu. There is no demonstrated risk that C19 is transmitted by ordering food.

7. You can lose your sense of smell with a lot of allergies and viral infections. This is only a non-specific symptom of C19.

8. Once at home, you don't need to change your clothes urgently and go shower! 
Purity is a virtue, paranoia is not! 

9. The C19 virus doesn't hang in the air. This is a respiratory droplet infection that requires close contact. 

10. The air is clean, you can walk through the gardens (just keeping your physical protection distance), through parks.

11. It is sufficient to use normal soap against C19, not antibacterial soap. This is a virus, not a bacteria.

12. You don't have to worry about your food orders. But you can heat it all up in the microwave, if you wish.

13. The chances of bringing C19 home with your shoes is like being struck by lightning twice in a day. I've been working against viruses for 20 years - drop infections don't spread like that!

14. You can't be protected from the virus by taking vinegar, sugarcane juice and ginger! These are for immunity not a cure. 

15. Wearing a mask for long periods interferes with your breathing and oxygen levels. Wear it only in crowds. 

16. Wearing gloves is also a bad idea; the virus can accumulate into the glove and be easily transmitted if you touch your face. Better just to wash your hands regularly. 

17.  Immunity is greatly weakened by always staying in a sterile environment.  Even if you eat immunity boosting foods, please go out of your house regularly to any park/beach. 
Immunity is increased by EXPOSURE TO PATHOGENS,  not by sitting at home and consuming fried/spicy/sugary food and aerated drinks.

Original article

******************
తెలుగు అనువాదం

టు వ్యాధి క్లినిక్,

ఇప్పుడు దీని నుండి ఆచరణాత్మక మరియు నిజాయితీ ఏదో:
మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం, ఇన్ఫెక్షియస్ డిసీజ్ క్లినిక్ హెడ్, 
USA:

1. మేము C19 తో నెలలు లేదా సంవత్సరాలు జీవించాల్సి ఉంటుంది. దానిని తిరస్కరించవద్దు లేదా భయపడవద్దు. మన జీవితాలను నిరుపయోగంగా చేసుకోనివ్వండి. ఈ వాస్తవంతో జీవించడం నేర్చుకుందాం. 

2. మీరు సెల్ గోడలకు చొచ్చుకుపోయిన C19 వైరస్లను నాశనం చేయలేరు, గాలన్ల వేడి నీటిని తాగుతారు - మీరు తరచుగా బాత్రూంకు వెళతారు.

3. చేతులు కడుక్కోవడం మరియు నిర్వహించడం a 
మీ రక్షణ కోసం రెండు మీటర్ల భౌతిక దూరం ఉత్తమ పద్ధతి. 

4. మీకు ఇంట్లో సి 19 రోగి లేకపోతే, మీ ఇంటి వద్ద ఉపరితలాలను క్రిమిసంహారక చేయవలసిన అవసరం లేదు.

5. ప్యాకేజీ చేసిన కార్గో, గ్యాస్ పంపులు, షాపింగ్ బండ్లు మరియు ఎటిఎంలు సంక్రమణకు కారణం కాదు. 
చేతులు కడుక్కోండి, యథావిధిగా మీ జీవితాన్ని గడపండి.

6. సి 19 ఆహార సంక్రమణ కాదు. ఇది 'ఫ్లూ' వంటి ఇన్ఫెక్షన్ చుక్కలతో సంబంధం కలిగి ఉంటుంది. C19 ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా సంక్రమించే ప్రమాదం లేదు.

7. మీరు చాలా అలెర్జీలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లతో మీ వాసనను కోల్పోతారు. ఇది C19 యొక్క నిర్దిష్ట-కాని లక్షణం మాత్రమే.

8. ఇంట్లో ఒకసారి, మీరు మీ బట్టలు అత్యవసరంగా మార్చుకొని షవర్ చేయవలసిన అవసరం లేదు! 
స్వచ్ఛత ఒక ధర్మం, మతిస్థిమితం కాదు! 

9. సి 19 వైరస్ గాలిలో వేలాడదీయదు. ఇది శ్వాసకోశ బిందువుల సంక్రమణ, దీనికి దగ్గరి పరిచయం అవసరం. 

10. గాలి శుభ్రంగా ఉంది, మీరు ఉద్యానవనాల ద్వారా తోటల ద్వారా (మీ శారీరక రక్షణ దూరాన్ని ఉంచడం) నడవవచ్చు.

11. యాంటీ బాక్టీరియల్ సబ్బు కాకుండా సి 19 కి వ్యతిరేకంగా సాధారణ సబ్బును ఉపయోగించడం సరిపోతుంది. ఇది వైరస్, బ్యాక్టీరియా కాదు.

12. మీరు మీ ఆహార ఆర్డర్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కోరుకుంటే, మీరు మైక్రోవేవ్‌లో ఇవన్నీ వేడి చేయవచ్చు.

13. మీ బూట్లతో సి 19 ను ఇంటికి తీసుకువచ్చే అవకాశాలు రోజుకు రెండుసార్లు మెరుపులతో కొట్టడం లాంటిది. నేను 20 సంవత్సరాలుగా వైరస్లకు వ్యతిరేకంగా పని చేస్తున్నాను - డ్రాప్ ఇన్ఫెక్షన్లు అలా వ్యాపించవు!

14. వినెగార్, చెరకు రసం మరియు అల్లం తీసుకోవడం ద్వారా మీరు వైరస్ నుండి రక్షించలేరు! ఇవి రోగనిరోధక శక్తికి నివారణ కాదు. 

15. ఎక్కువసేపు ముసుగు ధరించడం మీ శ్వాస మరియు ఆక్సిజన్ స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. జనసమూహంలో మాత్రమే ధరించండి. 

16. చేతి తొడుగులు ధరించడం కూడా చెడ్డ ఆలోచన; వైరస్ చేతి తొడుగులో పేరుకుపోతుంది మరియు మీరు మీ ముఖాన్ని తాకినట్లయితే సులభంగా వ్యాపిస్తుంది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మంచిది. 

17. ఎల్లప్పుడూ శుభ్రమైన వాతావరణంలో ఉండడం ద్వారా రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని మీరు తింటున్నప్పటికీ, దయచేసి మీ ఇంటి నుండి క్రమం తప్పకుండా ఏదైనా పార్క్ / బీచ్‌కు వెళ్లండి. 
రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇంట్లో కూర్చోవడం మరియు వేయించిన / కారంగా / చక్కెర కలిగిన ఆహారం మరియు ఎరేటెడ్ పానీయాలు తినడం ద్వారా కాదు.
*************

**BEING A BRAHMIN IN INDIA*


 Is being a Brahmin  good or bad in India?

This is what Adhoot Mohite, B.Tech ( civil  engineering) recently wrote : 

I'm not a Brahmin, I'm a Maratha but I think I can give answer based on my observations of last few years.

Being a Brahmin in today's India is like being a Jew in 1930s Germany.

Jews were a very small percentage of Germany's population, and were blamed for all problems of the german society.

Today in India same thing is happening. Brahmins are being made scapegoat for all problems of society, despite being a very small percentage of the population.

Brahmins are not even rich or powerful. Most of them are middle class like everybody else and many are poor priests who earn living by religious ceremonies like marriage. Brahmins do not have any reservations nor they are given any special subsidies by government. Yet they are blamed for everything.

Communists, Islamic radicals and all anti-Hindu groups of are constantly bashing and hating Brahmins. They are being made scapegoats for everything like the jews were made in germany.

Adi Shankaracharya, A brahmin from Kerala, revived the Vedic religion with his sheer will, intelligence and debating power. It was the Brahmins who preserved and saved the knowledge of Vedas, Upnishads, Brahma Sutras, Bhagvad Gita through a 1000 year slavery of Islamic invaders and British colonialists. It was the Brahmins who kept (and are still keeping) the Sanskrit language alive. The person who spread the Maratha empire to it’s largest size and destroyed the Mughal empire was a Brahmin (Bajirao Peshwa).

Brahmins are the links that are connecting us to the ancient Vedic civilization. Without Brahmins, the Vedic civilization would have died out like the Persian, Greek, Egyptian, Roman and many other dead civilizations. Hindus of all castes fought to save our religion, but Brahmins were the ones who saved the core texts and traditions of Vedic Dharm.

There is a saying in english “To kill a snake, cut it's head off.” Similarly, to kill Hindu religion, destroy all Brahmins.

The anti-Hindu forces in India know this and that is why they are going after Brahmins like Nazis went after Jews in the 40s.

A lot of people are bringing up that low castes have been mistreated by Brahmins in the past. That's true and I oppose caste discrimination. But everyone ignores that all Hindus, Buddhists, Jains have been treated worse by Islamic rulers. Brahmins never led genocidal campaigns against anyone like the Islamic invaders did.

Brahmins were only powerful in the early Vedic period 2500 years ago. After birth of Buddhism in 500 BC, Indians rejected the authority of Brahmins and slowly converted to Buddhism. Buddhism was majority religion for a long time until 8th century when Shankaracharya revived the Vedic religion. Only 200 years after that the Islamic invasions started and india bacame a colony of Islamic rulers. After end of Mughal empire, the British colonialists quickly took over all the power.

Brahmins have not been in position of power for last 1000 years in India. All political, economical and administrative power was consolidated in the hands of Islamic emperors and then the British. Most of the poverty and inequality in today's India is result of colonialism and capitalism. Why Brahmins are blamed for the conditions created by Foreign invaders and colonialists?.....

The current generation Brahmins are least bothered about what others feel about Brahmins since they mind their own business. They have become successful worldwide sans India. They have even earned a niche in Massachusetts.  The Brahmins of Boston is a popular adage to address the upper echelons.  They are very successful entrepreneurs.  They are in key positions in numerous parastatals and innumerable MNCs.The new gen Brahmins migrate to the various corners of the world and carve their own niche in their field of expertise.
Keep going guys

తెలుగు అనువాదం
లై 23, 2020 గురువారం
** భారతదేశంలో బ్రాహ్మణుడు కావడం *

 భారతదేశంలో బ్రాహ్మణుడు కావడం మంచిదా, చెడ్డదా?

అధూత్ మోహైట్, బి.టెక్ (సివిల్ ఇంజనీరింగ్) ఇటీవల ఇలా రాశారు:

నేను బ్రాహ్మణుడిని కాదు, నేను మరాఠానుని అయితే గత కొన్నేళ్లుగా నా పరిశీలనల ఆధారంగా సమాధానం ఇవ్వగలనని అనుకుంటున్నాను.

నేటి భారతదేశంలో బ్రాహ్మణుడు కావడం 1930 ల జర్మనీలో యూదుడు లాంటిది.

జర్మనీ జనాభాలో యూదులు చాలా తక్కువ శాతం ఉన్నారు, మరియు జర్మన్ సమాజంలోని అన్ని సమస్యలకు కారణమయ్యారు.

ఈ రోజు భారతదేశంలో ఇదే జరుగుతోంది. జనాభాలో చాలా తక్కువ శాతం ఉన్నప్పటికీ, బ్రాహ్మణులను సమాజంలోని అన్ని సమస్యలకు బలిపశువులుగా చేస్తున్నారు.

బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కూడా కాదు. వీరిలో చాలా మంది అందరిలాగే మధ్యతరగతి వారు మరియు చాలామంది వివాహం వంటి మతపరమైన వేడుకల ద్వారా జీవనం సంపాదించే పేద పూజారులు. బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేవు లేదా వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వదు. ఇంకా వారు అన్నింటికీ నిందించబడ్డారు.

కమ్యూనిస్టులు, ఇస్లామిక్ రాడికల్స్ మరియు అన్ని హిందూ వ్యతిరేక సమూహాలు బ్రాహ్మణులను నిరంతరం దెబ్బతీస్తున్నాయి మరియు ద్వేషిస్తున్నాయి. జర్మనీలో జ్యూస్ తయారు చేయబడిన ప్రతిదానికీ వారిని బలిపశువులుగా చేస్తున్నారు.

ఆది శంకరాచార్యుడు, కేరళకు చెందిన బ్రాహ్మణుడు, తన సంపూర్ణ సంకల్పం, తెలివితేటలు మరియు చర్చా శక్తితో వేద మతాన్ని పునరుద్ధరించాడు. ఇస్లామిక్ ఆక్రమణదారులు మరియు బ్రిటిష్ వలసవాదుల 1000 సంవత్సరాల బానిసత్వం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత జ్ఞానాన్ని పరిరక్షించి భద్రపరిచినది బ్రాహ్మణులు. సంస్కృత భాషను సజీవంగా ఉంచిన (ఇంకా ఉంచుతూనే) బ్రాహ్మణులు. మరాఠా సామ్రాజ్యాన్ని దాని అతిపెద్ద పరిమాణానికి విస్తరించి మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి బ్రాహ్మణుడు (బాజీరావ్ పేష్వా).

ప్రాచీన వేద నాగరికతకు మనల్ని అనుసంధానించే లింకులు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేకపోతే, వేద నాగరికత పెర్షియన్, గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ మరియు అనేక ఇతర చనిపోయిన నాగరికతల వలె చనిపోయేది. అన్ని మతాల హిందువులు మన మతాన్ని కాపాడటానికి పోరాడారు, కాని వేద ధర్మం యొక్క ముఖ్య గ్రంథాలను మరియు సంప్రదాయాలను కాపాడినది బ్రాహ్మణులు.

ఆంగ్లంలో ఒక సామెత ఉంది “ఒక పామును చంపడానికి, దాని తల కత్తిరించండి.” అదేవిధంగా, హిందూ మతాన్ని చంపడానికి, బ్రాహ్మణులందరినీ నాశనం చేయండి.

భారతదేశంలోని హిందూ వ్యతిరేక శక్తులకు ఇది తెలుసు, అందుకే నాజీల వంటి బ్రాహ్మణులు 40 వ దశకంలో యూదుల వెంట వెళ్ళారు.

తక్కువ కులాల వారు గతంలో బ్రాహ్మణులచే దుర్వినియోగం చేయబడ్డారని చాలా మంది తీసుకువస్తున్నారు. అది నిజం మరియు నేను కుల వివక్షను వ్యతిరేకిస్తున్నాను. కానీ హిందువులు, బౌద్ధులు, జైనులందరినీ ఇస్లామిక్ పాలకులు దారుణంగా చూశారని అందరూ విస్మరిస్తున్నారు. ఇస్లామిక్ ఆక్రమణదారుల మాదిరిగా బ్రాహ్మణులు ఎవ్వరికీ వ్యతిరేకంగా జాత్యహంకార ప్రచారానికి నాయకత్వం వహించలేదు.

2500 సంవత్సరాల క్రితం ప్రారంభ వేద కాలంలో మాత్రమే బ్రాహ్మణులు శక్తివంతులు. క్రీస్తుపూర్వం 500 లో బౌద్ధమతం పుట్టిన తరువాత, భారతీయులు బ్రాహ్మణుల అధికారాన్ని తిరస్కరించారు మరియు నెమ్మదిగా బౌద్ధమతంలోకి మారారు. 8 వ శతాబ్దం వరకు శంకరాచార్యులు వేద మతాన్ని పునరుద్ధరించినంత వరకు బౌద్ధమతం మెజారిటీ మతం. 200 సంవత్సరాల తరువాత మాత్రమే ఇస్లామిక్ దండయాత్రలు ప్రారంభమయ్యాయి మరియు భారతదేశం ఇస్లామిక్ పాలకుల కాలనీగా మారింది. మొఘల్ సామ్రాజ్యం ముగిసిన తరువాత, బ్రిటిష్ వలసవాదులు త్వరగా అన్ని అధికారాన్ని చేపట్టారు.

భారతదేశంలో గత 1000 సంవత్సరాలుగా బ్రాహ్మణులు అధికారంలో లేరు. అన్ని రాజకీయ, ఆర్థిక మరియు పరిపాలనా శక్తి ఇస్లామిక్ చక్రవర్తుల చేతిలో మరియు తరువాత బ్రిటిష్ వారి చేతుల్లో ఏకీకృతం చేయబడింది. నేటి భారతదేశంలో చాలా పేదరికం మరియు అసమానతలు వలసవాదం మరియు పెట్టుబడిదారీ విధానం ఫలితంగా ఉన్నాయి. విదేశీ ఆక్రమణదారులు మరియు వలసవాదులు సృష్టించిన పరిస్థితులకు బ్రాహ్మణులను ఎందుకు నిందించారు? .....
ప్రస్తుత తరం బ్రాహ్మణులు తమ సొంత వ్యాపారాన్ని చూసుకున్నందున ఇతరులు బ్రాహ్మణుల గురించి ఏమనుకుంటున్నారో కనీసం బాధపడరు. వారు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమయ్యారు. వారు మసాచుసెట్స్‌లో ఒక సముచిత స్థానాన్ని కూడా సంపాదించారు. బోస్టన్ యొక్క బ్రాహ్మణులు ఎగువ స్థాయిలను పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ సామెత. వారు చాలా విజయవంతమైన వ్యవస్థాపకులు. వారు అనేక పారాస్టాటల్స్ మరియు అసంఖ్యాక MNC లలో కీలక స్థానాల్లో ఉన్నారు. కొత్త తరం బ్రాహ్మణులు ప్రపంచంలోని వివిధ మూలలకు వలస వెళ్లి వారి నైపుణ్యం యొక్క రంగంలో తమ సొంత సముదాయాన్ని చెక్కారు.
అబ్బాయిలు కొనసాగండి

రామాయణమ్ 9


...
కుశిక వంశీయుడు,గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుక పరచండి! మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన పలుకులివి.
.
ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణకిపోయి దశరధసముఖమునకు శీఘ్రమే చేరి మహర్షివిశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు!.
.
అంతటి పరమపూజనీయుడయిన మహర్షి తన నగరుకు రావటాన్ని తన పుణ్యఫలంగా భావించి, దశరధుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, ఒక ఉచిత ఆసనం అలంకరింపచేసి అంజలిఘటించి నిలుచున్నాడు.

మహారాజు వినయ విదేయతలకు సంతసించిన మహర్షి దశరధుడిని కుశలప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు!.
.
మహర్షి ఎదుట నిలుచున్న దశరధుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై ,మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు ,మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేస్తున్నాను మీ కేమికావాలో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్ధించాడు.
.
అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు !
.
మహర్షికోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులూ కృంగిపోయి ,జవసత్వాలుడిగినవానిలాగా నీరసించాడు దశరధుడు! .
.
ఆ కోరిక ఏమై ఉంటుంది? .
.
మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు ,
కానీ ఆయన అడిగింది ! శ్రీరాముని తనతో పంపమని !
.
 క్రూర,ఘోర రాక్షసులైన మారీచ ,సుబాహులనుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దుబిడ్డడిని పంపాలట!
.
మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరధుడు!
.
మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువునా కత్తితో చీల్చినట్లయినది ,తన ముద్దులమూట,ముక్కుపచ్చలారని పసికూన ,నిండా పదహారు నిండనివాడు ,అరవిచ్చినతామరల వంటి కన్నులుగల తన గారాలపట్టిని ఈ మహర్షివెంట అడవులకు పంపడమా! మనసు ససేమిరా అంటున్నది!.
.
మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి !
దశరధా !
రాముని గురించి నీ కేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు!
.
అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్
వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః.
.
రాముడెవరో నాకు తెలియును,నీ కుల గురువైన వసిష్ఠునకు తెలియును, ఈ ముని సంఘాలకూ తెలియును!
.
రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్ధ్యము లేదు! రాముని ఎదుట మారీచ,సుబాహులు ఏవిధముగనూ నిలువజాలరు!
.
న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథం చన!.
.
అని ఇంకా చెపుతున్నారు మహర్షి!..
..

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

సం స్కృ తి లో 8, 18 అం కె ల కు ప్రా ధా న్య త


అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం
❤❤❤❤❤ ❤❤ ❤ ❤

అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.
💙💙💙 💙💙 💙💙 💙💙

అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము
💛💛💛 💛💛 💛💛 💛💛

అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం
❤❤❤ ❤❤ ❤❤ ❤❤

అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము
💜💜💜 💜💜 💜💜 💜💜

అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి
☸☸☸ ☸☸ ☸☸ ☸☸
జయతు     హిందూ     సంస్కృతి
జయతు     భారతీయ  సంస్కృతి

పత్ర హరితం



*"ప్రేమ అంటే చిన్నపాటి నది కాదు, కాస్తంత ఎత్తైన కొండ కాదు అది అవధుల్లేని అహంకారం లేని మహా సముద్రం" అంటాడు సూఫీ కవి మౌలానా జలాలుద్దీన్ రూమి. సహసవంతులు ఈ సముద్రంలోకి దూకి ఈదులడతారు, మునకలేస్తారు, సహా జీవనం సాగిస్తారు. ఇతరులు ఆ ఒడ్డు చెంతకు వెడతారు. కాళ్ళు తడుపుకుని బయటకు వస్తారు. అనేకులు ఆ సముద్రపు హోరుని చూసి భయంతో,  విస్మయంతో ఒడ్డు నే ఉండిపోతారు. ఆనంతాకాసాన్ని తాకే ఆ సముద్రం వారికి ఒక కలగా, జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కలలు కనడం సులువు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి అసిధారవ్రతం పూనాలి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి. జయాపజయాలుతో సంబంధం లేకుండా ప్రేమ సముద్రంలోకి ప్రయాణించాలి. ఈ సాహసం, ధైర్యం, తెగువ ఉన్నవారు ప్రేమలోనే కాదు జీవితంలో కూడా రాణిస్తారు. దేనికి వెరవని ధీరగుణాన్ని సంతరించుకుంటారు. వీరినే ప్రేమ వరిస్తుంది. ప్రేమలోని తేజస్సు వారి జీవనయానాన్ని కాంతివంతం చేస్తుంది. ఇలాంటి ప్రేమ అడిగితే వచ్చేదికాదు. ప్రాధేయపడితే ప్రసాదించేదికాదు. త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అంకితమవ్వాలి. బలంగా తపించాలి. ఎలాంటి సంసయాల్లేకుండా ప్రేమని విశ్వసించాలి. చాలామంది ప్రేమని విభ్రమంతో చూస్తారు. ముచ్చట పడతారు. తన్మయులవుతారు. హృదయాన్ని విప్పార్చి ఆవాహన చేసుకోవాలంటే జంకుతారు. లోకరీతులు, నీతులు, లౌకిక వ్యవహారాలు అడ్డుగా నిలుస్తాయి. వీటికి ప్రాధాన్యమిచ్చేవారు ప్రేమ అంచులని సైతం తాకలేరు. లోకం మీద సమస్త ధిక్కారం ప్రకటించే చేవ ఉండాలి. అదే సమయాన కరుణాంతరంగంతో లోకాన్ని చూడగలగాలి. ఎందుకంటే ప్రేమ వినా జీవితానికి మరేదీ శాంతినివ్వదు. ఈ ప్రేమే ప్రపంచ మనుగడకి ఆలబనంగా నిలిచే ప్రాణవాయువు, పత్రహరితం!!*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....24.07.2020....శుక్రవారం....🙏🙏🙏🙏🙏*

*మరొక అంశంతో రేపు మీ ముందుకు....🙏🙏🙏

పూజగదిలో దేవతామూర్తులు - చిన్నకథ

అదో చిన్న పల్లెటూరు.  పట్టుమని పది బ్రాహ్మణ ఇళ్ళు కూడా లేవు.  ఉన్నవాళ్లందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడి పోయారు.  శాస్త్రిగారు ఆ ఊరి పండితులు.  పరమ నిష్ఠాగరిష్టుడు.  వాళ్ళ తాతముత్తాతల నుంచి వస్తున్న శివపంచాయతనం వుండేది.  శాస్త్రిగారు రోజూ నమక చమకములతో శివునికి అభిషేకముచేసి శ్రద్దగా పూజచేస్తూ వుండేవారు.  ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. 


అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు.  ఆమె వండిన పదార్థం తినని వాడు ఆ ఊరిలోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.  వారికి అష్టైశ్వర్యాలూ ఉన్నాయి.  తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయి పోయాడు.

పూజగదిలో సామాను సిద్ధం చేస్తోంది శ్రద్ధాదేవి.  ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు.  పూజా మందిరం లోని వస్తువులు, బొమ్మలు అన్నీ పాతబడి పోయాయి.  వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు.  "ఈ సారి తీర్థం లో అన్నీ కొత్త బొమ్మలు, సామాన్లు కొనుక్కుందాము శ్రద్ధా!" అంటున్నాడు భార్యతో..

సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.  ఆయన రూపురేఖలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.  తొలుత ఆయనను చూసి భయపడింది శ్రద్ధాదేవి.  అంతలో ఆ వచ్చిన అతిథి 'అమ్మా!  నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతోంది' అని గట్టిగా అడిగాడు. 

'అలాగే స్వామీ!  ఇదిగో సిద్ధం చేసేస్తున్నాను.  పిండి వంట (గారెలు) సిద్ధం చేస్తున్నాను.  కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామీ' అని సమాధాన పరచింది ఆ ఇల్లాలు.  శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనను ఇంటిలోనికి రమ్మన్నాడు. 

రాలేను, ఇక్కడే ఈ అరుగుమీద కూర్చుంటాను.  ఇక్కడే నాకు భోజనం పెట్టండి' అన్నాడు ఆ స్వామి.  సరేనన్నాడు శర్మగారు.  వంట అవుతోంది.  ఆమె వీలయినంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశ్యంతో కంగారు పడుతోంది.  పిండివంట మొదలు పెట్టింది.  గారెలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది. 

బయట అరుగుమీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి, వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది.  భోజనం మొదలు పెట్టాడు స్వామి.  ఒక్కొక్క పదార్థామూ దగ్గర ఉండి అపర అన్నపూర్ణా దేవిలా వడ్డిస్తోంది ఆమె.  మీరు అక్కడ కూర్చోండి అమ్మా!  శర్మగారు వడ్డిస్తారులే' అన్నా వినకుండా ఆమే వడ్డిస్తోంది.

వండి వడ్డించిన పదార్థాలన్నీ సుష్టుగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు స్వామి.  ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మ గారు.  వృద్ధాప్యంలో లేడు, కానీ వంటినిండా - జడలు కట్టిన పొడవైన జుట్టుతో - చూడడానికి వికృతంగా ఉన్నాడు, భాషలో కూడా మర్యాద లేదు, తినే పద్ధతికూడా సభ్యతగా లేదు, తిన్న తరువాత ఎవరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్లిపోరు.  ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకొన్నాడు. 

ఒక్క మాట స్వామీ!  మీరు ఎక్కడి వారు?  ఇక్కడికెందుకు వచ్చారు?  నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చుని ఎందుకు తింటానన్నారు?  తిన్న వెంటనే ఎందుకు వెళ్లిపోదామనుకుంటున్నారు? దయచేసి చెప్పండి" అన్నారు శర్మగారు.   

నేనెవరో నీకు చెప్పినా నీకు అర్థం కాదిప్పుడు.  ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి.  పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి.  ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది  అని అనిపించింది.  అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను.  ఇంతకంటే నేనేమీ చెప్పలేను' అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు ఆ స్వామి. 

ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు.  సరే భోజనం ముగించారు.  ఎందుకో ఓ సారి వారి పూజగదిలోని సామానును మళ్ళీ చూసుకున్నారు.  ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  ఆ వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి.  ఇంతక్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాము.  ఆ స్వామి 'మీ మాటలు విని భోజనానికి వచ్చాను' అన్నాడు.  అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామగ్రిని తీయివెయ్యడం ఇష్టం లేదన్న మాట. 

అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట.  సామగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట.  అందుకే లోనికి రాలేదు" అనుకొని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల చూశాడు.  స్వామి కనపడలేదు.  ఆ వీధుల్లో ఉన్నవారిని అడిగాడు.  అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పారు. 

శాస్త్రిగారి గుండె గుభేలుమన్నది.  అప్పుడు అర్ధమైనది.  ఇంట్లో పూజా మందిరములోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో, వాటివలనే గదా ఇన్నాళ్లూ ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు!  ఇన్నాళ్ళు నాకు తెలియలేదు.  పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని అనుకోని తన పూజామందిరము లోనికి వెళ్లి ఆ పరమశివుని విగ్రహం ముందు ప్రణమిల్లి, కృతజ్ఞతతో

“ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః”అని చెంపలువేసుకొన్నాడు.  భగవంతునిపై నమ్మకము శ్రద్ధఅవసరము.  పూజా మందిరములో వున్న విగ్రహాలు ఎంత పాతవైనా, అరిగిపోయినా వాటిని ముందు వెనుకా ఆలోచించకుండా తీసివేయ్యకూడదు.  మన తాత ముత్తాతలు పూజించినవి అవి. 

వాటిలో ఎంతో మంత్ర శక్తి దాగి వుంటుంది.  వాటిని పారేయకండి.  భక్తితో ఒక్క పుష్పం పెట్టండి, అవి చైతన్య వంతమౌతాయి.  మిమ్మల్ని మీకుటుంబాన్ని కాపాడుతాయి.  ఒకవేళ ఆ వస్తువులు మరింత జీర్ణమై (అరిగి) పోతే (బంగారు, వెండి విగ్రహాలు) వాటిని కరిగించి, లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి.

అలాగే ఫోటోలు గానీ, పాత్రలు గానీ పాడయిపోతే మంచిరోజు చూసి వాటి తో బాటుగా అవే వస్తువులు కొత్తవి కొని, రెండింటినీ కలిపి ఒకటి, రెండు రోజులు పూజ చేసుకొని, ఒక శుభ దినాన వాటిని తీసుకెళ్లి ప్రవహించే నదిలో గానీ, సముద్రంలో గానీ విడిచిపెట్టండి.  రహదారి పక్కన ఉంచరాదు.  వాటిపై జంతువులు మలమూత్రములు విసర్జించే ప్రమాదం ఉంది.  లేదా దొడ్డిలో లోతుగా గొయ్యి తీసి వాటిలో పాతిపెట్టండి.

నా జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!" అని ఎప్పుడూ అనుకోండి. 
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్నిఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యంవహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను - భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చేసే భావన అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి వాటిని అధిగమించమన్నాడు.

నేను నన్ను మరచి పోకుండా సదా కాపాడు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయనను గుర్తుంచుకోమన్నాడు.

నేను చేసిన పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితంలో నేనుకోరుకున్నదేదీ పొందలేదు. కానీ నేను కోరుకున్నదానికంటే అతి గొప్పవి నాకు ప్రసాదించాడు ఆ పరమాత్మ.

ఈవిధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటన నుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నామంచికే అని అర్ధం చేసుకున్నాను.

ఓం నమోభగవతే వాసుదేవాయ 

#కేదార్_నాథ్ ప్రసాదం #ఆన్_లైన్ లో లభ్యమవుతోంది.




ఈరోజు నుండి కేదారనాథుని ప్రసాదం ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా పంపడం ప్రారంభమైంది.  onlineprasad.com అనే ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా లభ్యమౌతుంది.

            రుద్ర ప్రయాగ కలక్టర్ దీనిని లాంఛనంగా ప్రారంభించి , రుద్రప్రయాగ MLA కి ఆన్ లైన్ లో
 Book now బటన్ ని నొక్కి ఆర్డర్ ఇచ్చారు.

₹451 ఈ ప్రసాదం వెలగా నిర్ణయించారు. ఇందులో....

1.లడ్డూప్రసాదం (8లడ్లు)
2. బిల్వపత్రప్రసాదం
3. కేదారనాథుని హోమ ప్రసాదం.
4. రుద్రాక్ష.
5. భస్మము.
6. కేదార్_బదరీ ఫొటో       ..........ఉంటాయి.

 onlineprasad.com అనే వెబ్ సైట్ ఇంకా 50 మందిర ప్రసాదాలను ఆన్ లైన్ లో అందిస్తోంది.

మంచిమాట


*_పండు తింటే అరిగిపోతుంది._*
*_తినకపోతే ఎండిపోతుంది._*
*_జీవితం కూడా నువ్వు ఖుషీగా గడిపినా,_*
*_భయపడుతూ గడిపినా కరిగిపోతుంది.._*
*_బాగా వికసించినప్పుడే,_*
*_పూలు కోసుకోవాలి లేకపోతే వాడిపోతాయి.._*
*_అదేవిధంగా,_*
*_అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి.._*

*_ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెలివి, పట్టుదల..._*
*_ఇలా వీటన్నింటిని కప్పి ఉన్న,_*
*_భయం,బిడియం అనే పొరలను,_*
*_ఎవరైతే, ఎప్పుడైతే తొలగిస్తారో,_*
*_వాళ్ళ జీవితంలో అభివృద్ధి మొదలైనట్లే.!_*
*_వ్యక్తుల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ ఎప్పుడూ బాధపడకండి.._*
*_ఎందుకంటే ఈ రెండూ కూడా,_*
*_మీరు స్పందించనంతసేపూ బలహీనమైనవే.._*
*_అలాగే_*
*_జీవితంలో ముందుకు  వెళ్ళాలి_* 
*_అనుకున్నప్పుడు కాలం నిన్ను_*
*_వెనక్కు లాగేస్తున్నదని  బయపడకు_*
  *_వెనక్కు లాగబడిన   బాణమే_* 
*_వేగంగా చాలా దూరం  వెళ్లగలదు_*
 *_నమ్మకాన్ని కోల్పోకు_* 
*_విజయం మనదే  అవుతుంది_*🏵️👏
*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*💐🙏

మూడవ నేత్రం


మూడవ నేత్రం అందరికీ యుంది.కానీ దానిని సవ్య మార్గమునకు ఉపయెూగిచుటే ఙ్ఞానం జీవన్ముక్తి.లేనిచో అజ్ఞానము. యీ నేత్ర లక్షణము కాంతి వలన మనస్సు మనస్సువలన బుధ్ది మారు చుండుట. మంచి ఆలోచనలు చేయుటే యెగిరి. అది మానవ ఆరోగ్య జీవన మనుగడకు మాత్రమే ఉపయెూగపడవలె. లేదా జీవ నాశనమే. దీనినే ఫాలనేత్రుడు. యిది యే ఆజ్ఞా చక్రము. దానినుండి కమాండ్ అనగా ప్రేరణ కలుగును. ఫ అను లక్షణము phఫల్గుణీ కాంతి దానికి పూర్వాపరాలు అనగా ముందు వెనుక లుగా అనగా కాంతి కిరణములు లలాటమందున్నప్పుడు పూర్వ భాగంలో తెలియును .అది అణుశక్తి ఆత్మ శక్తి యే అది పరమేశ్వరుని లలాట శక్తి దానిని ప్రత్యక్షంగా చూచుట అసంభవం.అందుకే అది ప్రకృతిని కళావిహీనం చేసినది. అది ఉత్తర భాగంలో అనగా మార్పు చెందిన గాని కాంతి లక్షణం. అదియే జీవ సంబంధమైన తేజో లక్షణము. E అనే ఆంగ్ల అక్షరం యెుక్కయెుక్క స్త్రీ శక్తి  అనగా జీవ శక్తి ఫల్గుణీ ఎఫ్ గా మార్పు. యిది కూడా వేద మూలము. ఎప్పుడో వేద భాగములు వలస వెళ్ళే యని ఎందుకనగా మన ప్రాంతంలో అసుర ప్రవృత్తి పూర్తిగా ఆవరించుట వలన. అసుర ప్రవృత్తి అనగా ఙ్ఞానాన్ని మరుగున పరచుట. సత్యం యెుక్క లక్షణము మనకు అవసరం లేదు. అందువలననే యిప్పటి కైనా అది రక్షించబడాలి.మనిషి ద్వారానే రక్షణ. ఎవరో రారు. భూమిపై మానవుని ద్వారానే యిది జరుగ వలెనను. భూమధ్యరేఖకు దగ్గరగా యున్న సింహరాశిలో సుమారుగా 12 డిగ్రీలడిగ్రీల మఘ నక్షత్ర  మాగ్నెట్ కాంతియే రెండుగా మారి పూర్వ ఉత్తర ఫల్గుణీ గా ప్రకాశవంతమైన భూమికి చేరుట. దీని లక్షణము ఉదాహరణకు అర్జున తత్వం. ఫలగుణీ కాంతియే పాశుపతాస్త్రం అనగా త్రిశూలశక్తి అది మహా విస్ఫోటన కాంతిని మనకు  తెలియును. అందుకే అంత సైన్యమను అంత బలవంతులను సంహరించి ధర్మ స్ధాపనయని.ఆశక్తిని ఉప సమీపం నుండి కృష్ణ రూపంలో నడిపించుట. మూల శక్తి కృష్ణ తత్వమే ఆటమ్  అని అదియే ఆత్మ యని తెలి యును.

*ఏంటొదినాసంగతులూ* !

       *" వదినా! వదినా!"*

     " వచ్చే.. వచ్చే.. ఈరోజేంటో నెట్ సరిగ్గా లేదొదినా! అందుకే లేటయింది రావడం.  మీ ఇంట్లో వైఫై ఎప్పుడూ బానే ఉంటుందేమో?  అందుకే చటుక్కున వచ్చేస్తావు. ఏంటొదినా సంగతులూ!

     " అయ్యో! వదినా!ఇది వాయిస్ కాలు కాదు.. వీడియో కాలు.. ఇది ఆపి, అది తెరువు."

     " ఔనా! నా మతిమండా! చూసుకోనేలేదు.. అక్కడే ఉండు, వీడియో కాలు తెరుస్తా! ఆ.. బానే కనిపిస్తోందా? చెప్పు, చెప్పు.. అదేంటొదినా అలా చిక్కిపోయావూ? నిన్న చూసినప్పుడు బానే దిట్టంగా ఉన్నావూ.. ఒక్కరోజుకే అలా చిక్కిపోయావూ? "

    " అదేం లేదులే.. నిన్న టీవీ లో పెట్టుకుని చూసుకున్నాం మనం. మర్చిపోయావా?  ఇప్పుడు ఫోన్ లో చూసేసరికి అలా కనిపిస్తున్నానులే.. "

  " ఓ, అదా సంగతీ! సరే ఏంటి చెప్పు? ఎందుకు ఫోన్ చేసావూ? "

      " శ్రావణ శుక్రవారం పేరంటానికి పిలుద్దామని వచ్చాను వదినా! ఇదిగో బొట్టు పెట్టించుకో. ఆ రోజు సాయంత్రం ఐదింటికల్లా జూమ్ పేరంటానికి వచ్చెయ్యి. అదేదో కలర్స్ వేసే యాప్ పెడతానంది మా అమ్మాయి.. మీరు కాస్త కాళ్లు, మెడ చూపిస్తే, గంధం కలరూ, పసుపు రంగూ బ్రష్ తో పూసేయొచ్చుట. . "

     " అలాగే , వదినా ! తప్పకుండా వస్తాను.  మీ ఇంటికొచ్చే దారిలోనేగా మా మూడోఆడబడుచు తోడికోడలి వియ్యపురాలి ఇల్లు. మీ ఇంటి జూమ్ కి వచ్చి ఆవిడ జూమ్ కి వెళ్ళకపోతే అలుగుతుంది. ముందు అటెళ్ళి తర్వాత మీ జూమ్ కి వస్తాను.
అదవగానే మా జూమ్ కి వచ్చెయ్యి.. మీ అమ్మాయి ని కూడా తీసుకురా..
వాయినాలు ఆ అమెజాన్ వాడికి ఆర్డరిచ్చేసింది మా కోడలు. వాడే శుభ్రంగా రాళ్లు ఏరి, శెనగలు నానబోసి, కవరు లో పండూ తాంబూలం, రిటర్న్ గిఫ్ట్ పెట్టి పంపుతాడట. మీ అడ్రసు లు అన్నీ ఇచ్చేసింది మా కోడలు. శుక్రవారం సాయంత్రం ఆరింటికల్లా శెనగలు డెలివరీ అవుతాయట. "

      " ఔనా! వదినా!  ఎంచక్కా వాయినాల పని కూడా సులువయిపోయింది. ఔనూ! ఇంతకీ  వాడు మడి కట్టుకుని నానపోస్తాడంటావా?  "

     " భేషుగ్గా పోస్తాడట. బరంపురం పట్టుపంచె కట్టుకుని.. మంచి శెనగలే పుచ్చులూ చచ్చులూ లేకుండా.. ఇంత పసుపు కూడా వేసి నానపెడతాడట.  వాడికి ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఉందట. అన్నీ చూసే ఆర్డర్ ఇచ్చింది
మా కోడలు. "

     " అయితే సరే.. బానేవుంది.ఇంతకీ కొత్తగా ఏం  నగ చేయించుకున్నావూ వరలక్ష్మి వ్రతానికి. "

     " అయ్యో, నీకు చెప్పనేలేదు కదూ.. మామిడిపిందెల నెక్లేసు.. ఆన్ లైన్ లోనే చేయించేసాను. మరి నువ్వో.. "

      " ఆన్లైన్ లో బంగారం వద్దని మా ఆయన ఐదు లక్షలు ఇచ్చేసాడొదినా! "

      " ఎవరన్నారూ? ఆన్లైన్ లోది మంచిది కాదనీ.. బంగారం లాంటి బంగారం. అయినా మీ ఆయన అభిప్రాయం ఆయనది. నాకెందుకులే.  సరేకానీ.. ఆ మీనాక్షి వజ్రాల ముక్కుపుడక చేయించుకున్నానని మెసేజ్ పెట్టింది. నిజమేనంటావా?"

  " ఔనొదినోయ్! నాకూ డౌటే.. ఆ మాస్కు వెనకాల ఏ ముక్కు పుడకుందో.. మనం చూడొచ్చేమా? ఏంటి?  వజ్రమైనా అంటుంది.. వైఢూర్యమైనా అంటుంది .. ఎవడికి తెలుసూ? "

 " ఆ.. మనకెందుకులే వదినా! ఉంటామరి.  మర్చిపోకు. జూమ్ కి రావడం. "
                   😜 
వాట్సాప్ లో నాకు వచ్చిన సందేశం.

*మొసలి గజేంద్రుని పట్టుకొనుట*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

*2.10 (పదియవ శ్లోకము)*

*సర్వతోఽలంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమైః|*

*థమందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః॥6368॥*

*2.11 (పదకొండవ శ్లోకము)*

*చూతైః ప్రియాలైః పనసైరామ్రైరామ్రాతకైరపి|*

*క్రముకైర్నాలికేరైశ్చ ఖర్జూరైర్బీజపూరకైః॥6369॥*

*2.12 (పండ్రెండవ శ్లోకము)*

*మధూకైః శాలతాలైశ్చ తమాలైరసనార్జునైః|*

*అరిష్టోదుంబరప్లక్షైర్వటైః కింశుకచందనైః॥6377॥*

*2.13 (పదమూడవ శ్లోకము)*

*పిచుమందైః కోవిదారైః సరలైః సురదారుభిః|*

*ద్రాక్షేక్షురంభాజంబూభిర్బదర్యక్షాభయామలైః॥6371॥*

*2.14 (పదునాలుగవ శ్లోకము)*

*బిల్వైః కపిత్థైర్జంబీరైర్వృతో భల్లాతకాదిభిః|*

*తస్మిన్ సరః సువిపులం లసత్కాంచనపంకజమ్॥6372॥*

ఆ పర్వతముపై మందారములు, పారిజాతములు, కలిగొట్టుచెట్లు, అశోకవృక్షములు, సంపంగిచెట్లు, పలువిధములైన మామిడిచెట్లు, వివిధములగు ద్రాక్ష మొక్కలు, పనసచెట్లు, అంబాలపుచెట్లు, పోకచెట్లు, కొబ్బరిచెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏఱుమద్ది, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మారేడు, గంధపు చెట్లు, వేము చెట్లు, రక్తకాంచన వృక్షములు, తెల్ల తెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరేడు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మానేరు, వెలగ, నిమ్మ, జీడి, మామిడి మొదలగు చెట్లు గలవు. ఆ  ఉద్యానములో సువిశాలమైన సరస్సుగలదు. అందులో బంగారురంగులో ప్రకాశించెడు పద్మములు గలవు.

*2.15 (పదునైదవ శ్లోకము)*

*కుముదోత్పలకహ్లారశతపత్రశ్రియోర్జితమ్|*

*మత్తషట్పదనిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనైః॥6373॥*

*2.16 (పదహారవ శ్లోకము)*

*హంసకారండవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి|*

*జలకుక్కుటకోయష్టిదాత్యూహకులకూజితమ్॥6374॥*

*2.17 (పదిహేడవ శ్లోకము*

*మత్స్యకచ్ఛపసంచారచలత్పద్మరజఃపయః|*

*కదంబవేతసనలనీపవంజులకైర్వృతమ్॥6375॥*

ఆ సరస్సు తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామరపువ్వులు శోభతో కనువిందు గావించుచుండెను. అవి పక్షుల మధుర స్వనములతో మత్తెక్కిన తుమ్మెదల యొక్క ఝంకారములతో ప్రతిధ్వనించుచుండెను. ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, జక్కవ, బెగ్గురు పక్షులతో నిండి చూడముచ్చట గొల్పుచుండెను. నీటికోళ్ళు, గ్రుడ్డి కొంగలు, భరత పక్షుల గుంపులు మొదలగు వాటి కూజితములు వినసొంపుగా ఉండెను. చేపలు, తాబేళ్ళు అటునిటు సంచరించుచుండెను. పద్మముల పుప్పొడులతో ఆ సరోవర జలములు దాని శోభలను ఇనుమడింప జేయు చుండెను. కడిమి చెట్లు, నీటి ప్రబ్బలిచెట్లు, కిక్కసిగడ్డి, మంకెనచెట్లు, పినాకచెట్లతో ఆ సరస్సు పరివృతమై యుండెను.

*2.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*కుందైః కురబకాశోకైః శిరీషైః కుటజేంగుదైః|*

*కుబ్జకైః స్వర్ణయూథీభిర్నాగపున్నాగజాతిభిః॥6376॥*

*2.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*మల్లికాశతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః|*

*శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః ॥6378॥*

ఆ సరస్సు తీరము నందు గన్నేరు, గోరంట, కంకేళి (అశోక), దిరిసెన, అవిసె, గార, ఉత్తరేణు, ఎర్ర టెంకాయ, అడవిమొల్ల, పొన్న, సురపొన్న, ఉసిరిక, గురువింద, అరటి మొదలగు చెట్లతో, మల్లెతీగలు, తామరమొక్కలతో అది శోభిల్లుచుండెను. ఆ చెట్లు అన్ని ఋతువులలో పూవులతో, ఫలములతో అలరారుచుండెను.

*2.20 (ఇరువదియవ శ్లోకము)*

*తత్రైకదా తద్గిరికాననాశ్రయః  కరేణుభిర్వారణయూథపశ్చరన్|*

*సకంటకాన్ కీచకవేణువేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్ వనస్పతీన్॥6378॥*

ఆ పర్వతమునందలి అడవులలో పెక్కు ఆడ ఏనుగులతో గూడి ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది గొప్ప శక్తిమంతములైన ఏనుగుల నాయకుడు. ఆ మత్తగజము ఒకనాడు ఆ పర్వతముపై ఆడ ఏనుగులతో విహరించు చుండెను. అది ముళ్ళ చెట్లను, సువిశాలమైన వెదురు, వేము డొంకలను ఛిన్నాభిన్న మొనర్చుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*బమ్మెర పోతనామాత్యులవారి గజేంద్రమోక్షం


*బమ్మెర పోతనామాత్యులవారి గజేంద్రమోక్షం లోని త్రికూటపర్వత వర్ణనము*

8-28 కంద పద్యము

తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.

*తాత్పర్యము*

ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుట కైన వెనుదీయవు. సింహాలకైన వెనుదీయ కుండ ఎదిరించి నిలబడతాయి. చివరకి పిడుగులకు కూడ బెదరవు.
రహస్యార్థం: కొండలంత కష్టాలు వచ్చినా, ధైర్యం విడనాడకుండా, కామాదులను జయించుటకు సింగము వంటి పట్టుదల కలవి అయి ఎదుర్కుంటాయి. పిడుగుల వంటి ఆపదలు మీద పడినా తట్టుకుంటాయి కాని చలించవు. అంతటి అవిద్యావృత పారమార్దిక జీవులు అవి.


8-29 సీస పద్యము

పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు;
ఘోరభల్లూకముల్ గుహలు జొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు;
హరిదంతముల కేఁగు హరిణచయము;
మడువులఁ జొరఁబాఱు మహిషసంఘంబులు;
గండశైలంబులఁ గపులు ప్రాఁకు;
వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు;
నీలకంఠంబులు నింగి కెగయు;

8-29.1-తేటగీతము

వెఱచి చమరీమృగంబులు విసరు వాల
చామరంబుల విహరణశ్రమము వాయ
భయదపరిహేల విహరించు భద్రకరుల
గాలివాఱిన మాత్రాన జాలిఁ బొంది.

*తాత్పర్యము*

ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి, పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టి పోతాయి. అడవిదున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్ళపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి.
రహస్యార్థం: బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయి అనే చక్కటి స్వభావాలంకారం అలరిస్తుంది. కాని ఆయా జంతువుల రహస్య సంజ్ఞా భావం తీసుకుంటే; కామ,క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య మున్నగునవి వాటి అధిదేవతల యందు అణగి ఉన్నాయి అని భావం.

8-30-కంద పద్యము

మదగజ దానామోదముఁ
గదలని తమకములఁ ద్రావి కడుపులు నిండం
బొదలుచుఁ దుమ్మెదకొదమల
కదుపులు జుం జుమ్మటంచు గానము చేసెన్.

*తాత్పర్యము*

పడచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మదజల ధారలు కమ్మగా కడుపులనిండా తాగి సంతోషంతో జుం జుమ్మని పాడుతున్నాయి.

8-31 కంద పద్యము

తేటి యొకటి యొరు ప్రియకును
మాటికి మాటికిని నాగ మదజల గంధం
బేటి కని తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోఁటు దనమునన్.

*తాత్పర్యము*

గండుతుమ్మెద ఒకటి తనతో క్రీడిస్తున్న ప్రియురాలైన ఒక ఆడ తుమ్మెదకి అస్తమాను ఆ ఏనుగుల మదజలం ఎందుకులే అని నిండుమగతనంతో అందించింది.
రహస్యార్థం: మనస్సు సమాధి స్థితిలో ఉన్న ఆనందమును మరిగి, జగదాకార వృత్తులను వదలి, సంపప్రజ్ఞతా సమాధి యందలి ఆనందమును పొందింది.

8-32 కంద పద్యము

అంగీకృత రంగ న్మా
తంగీ మదగంధ మగుచు దద్దయు వేడ్కన్
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్.

*తాత్పర్యము*

తుమ్మెద కదుపులు ఇంపైన మదగజాల మదజలగంధా లెంతో వేడుకతో ఆస్వాదిస్తూ చెవులు గింగిర్లెత్తేలా ఝంకారం చేస్తున్నాయి.
రహస్యార్థం: “తృష్ణా హృత్పద్మషట్పదీ” (హృదయ పద్మంలో ఉండే తుమ్మెద అంటే తృష్ణ). అలా హృదయ పద్మంలో ఉండే సంకల్పాలు అను తుమ్మెదల గుంపు, మాతంగీ అంటే పరాప్రకృతి సంబంధమైన నిర్వికల్పానందంచే, నిశ్చేష్టముగా ప్రణవనాదం చేశాయి.

8-33 కంద పద్యము

వల్లభలు పాఱి మునుపడ
వల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు
లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్.

*తాత్పర్యం*

ఆడతుమ్మెదలు ఆత్రంగా పోయి ప్రియులని ముసురు కొన్నాయి. మగ తుమ్మెదలు ఏనుగుల మదజల ధారలకు ఆశపడకుండా నిండుగా తమ మనసులలో సంతోషపడ్డాయి.
రహస్యార్థం: జీవులు, అవిద్యా ఉపాధులతో కూడి పృథక్కుగా ఉండే గజగంధము అను విషానందమును గైకొనక, సహజ ఆనందమును, తాదాత్మ్య ఆనందమును ఆస్వాదిస్తున్నాయి.

8-35 .మత్తేభ విక్రీడితము

కలభంబుల్ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్
ఫలభూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్ వడిన్ మేయుచుం
బులులం గాఱెనుపోతులన్ మృగములం బోనీక శిక్షించుచుం
గొలఁకుల్ జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్భిళ్ళు గోరాడుచున్.

*తాత్పర్యము*

గున్నేనుగులు చెర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళచెట్లని రాసుకు పోతు చిగుళ్ళు గబగబ మేసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలని, జింకల్ని తప్పించుకు పోనీయక నిలిపి శిక్షి స్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి.
రహస్యార్థం: జీవులు జీవన్ముక్తి విహారాలతో ఆనందిస్తూ, మధ్య మధ్య జలభ్రాంతితో ఎండమావులను జలం అని మోసపోతూ, వివేకంతో సంసార పాదపాలను నిర్లక్షిస్తూ, విషయాది అను చివుళ్ళు భక్షిస్తూ, కామాది క్రూరమృగాల ఉద్రేకాలను అణచేస్తున్నారు.

8-36 కంద పద్యము

తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ఘట్టన చేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.

*తాత్పర్యము*

తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్ళతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకొంటుంటే కొండలు తలకిందులౌతాయి దిక్కులు బద్ధలౌతాయి. లోకాలు భయపడిపోతాయి. (ఎంతచక్కటి అతిశయోక్తి అలంకారం)
రహస్యార్థం: జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారలకు ఆజ్ఞలను ఇచ్చే స్థానం ఆజ్ఞా చక్రం. గండస్థలం అను ఆజ్ఞా చక్రం. అందుండే మదజలం, మదించిన చలం అంటే పట్టుదల. అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్వాసం అంటే ప్రాణాయామం. అలా ప్రాణాయామంతో అహంభావాన్ని ఘట్టన అంటే నిరోధం చేస్తుంటే, జగములు అంటే శరీరం గగుర్పాటు పొందింది.

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః
*42వ నామ మంత్రము*  24.7.2020

*ఓం ఐం హ్రీం శ్రీం గూడగుల్ఫాయై నమః*🙏🙏🙏నిండైన, సుందరమైన, నిగూఢంగా ఉండే చీలమండలు గలిగిన పరాశక్తికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి  *గూఢగుల్ఫా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం గూడగుల్ఫాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణతో నిగూఢతత్త్వమైన పరాశక్తి తత్త్వమును పరిపూర్ణముగా గ్రహించి, బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకొని ఆత్మానందమునందును🌻🌻🌻ధ్యానించు వారిని రక్షించు స్వభావం గలిగినదని ఈ నామ మంత్రములోని అంతరార్థము🌺🌺🌺గూడ (లావైన, ఇంపైన) గుల్ఫా (చీలమండలు గలిగినది)🌸🌸🌸లావైన లేదా అందమైన లేదా ఇంపైన చీలమండలు గలిగినది🌹🌹🌹గూఢ అనగా రహస్యమైన, గాన అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి; స్త్రీలు సాధారణంగా పాదములు కనబడనట్లు చీర కుచ్చెళ్ళను పాదములవరకూ జారవిడుస్తారు, అనగా కాలిమట్టెలు కూడా కనబడనంతగా చీర కప్పబడి ఉంటుంది; శ్రీమాత కూడా ఆ సాంప్రదాయం పాటించునది ఎందుకంటే  *కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా*  అనగా వివాహితయొక్క సౌందర్యము భర్తకు మాత్రమే అంకితము, ఆ అవయవ సొంపులు భర్తకు మాత్రమే తెలియనగును🌻🌻🌻 అయితే అమ్మవారి చీలమండలు కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కుర్చుని ఉంటుంది గదా అప్పుడు చీలమండలు కనబడవు అలాగే ఒక కాలు పీఠం మీద, రెండోకాలు పద్మాసనస్థితిలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పి ఉంటుంది కాని చీలమండల పైకి ఉండదు గాన ఈ *రహస్య* (గూఢ) అర్థాన్ని బట్టి ఈ నామమంత్రాన్ని అర్థం చేసుకోవాలి🌺🌺🌺గుహ్యము - రత్నమణి సూచికము. చీలమండలము సంధిస్థానము - నవార్ణవ మంత్రమునందలి మధ్య వర్ణము చింతామణి గుర్తుగలది; మిగిలిన ఎనిమిది వర్ణములు అష్టప్రకృతులు అనబడును🌸🌸🌸 గూఢగుల్ఫా యని నామప్రసద్ధిమైన తల్లికి నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం  శ్రీం గూఢగుల్పాయై నమః* అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ స్వీకరించడమైనది🙏🙏నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము🚩🚩🚩🕉🕉  🌺🌻🌹🌻🌸 🕉🕉🕉🕉🕉
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః 
*619వ నామ మంత్రము* - 24.7 2020

*ఓం ఐం హ్రీం శ్రీం పావనాకృతయే నమః*🙏🙏🙏పవిత్రమైన ఆకృతులకు మూలమై, జ్ఞానరూపిణియై, లోకములో పవిత్రతనంతయూ రూపుకట్టుకొనిన ఆకారము గలిగినదై, పరమ పవిత్రస్వరూపిణియై విరాజిల్లు పరాశక్తికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పావనాకృతిః* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం పావనాకృతయే నమః* అని ఉచ్చరించుచూ జగన్మాతను ఉపాసించు సాధకులు పరమపవిత్రతను ఆ తల్లి కరుణచే ప్రాప్తింపజేసుకుని, నిరంతరము జగన్మాత పాదసేవయే పరమావధిగా జీవించి తరించుదురు🌻🌻🌻పావనకృతి అనగా స్మరించినంతనే  పరమేశ్వరి మనను పావనముచేయును🌺🌺🌺అను నిత్యము ఖడ్గమాలా స్తోత్రపారాయణము, లలితాసహస్రనామస్తోత్రము ప్రథమోఽధ్యాయము, ద్వితీయ, తృతీయోఽధ్యాయములు చక్కని ఉచ్చారణతో, ఏకాగ్రతతో, అవకాశమైతే గురుసమక్షంలో సాధనచేసి నిత్యము పారాయణచేసి, యథాశక్తి నివేదన సమర్పించి, ఆ ప్రసాదము స్వీకరించి, మంచి ఆలోచనలతో, అందరి మంచిని కోరుతూ, పదిమందికి జగన్మాత కథాశ్రవణమును చేయగలిగితే మనంకూడా పావనమౌతాము🌸🌸🌸వ్యాసభగవానుడు, శంకరాచార్యులవారు, కంచి పరమాచార్యులవారు, నడిచే దేవుడైన మహాస్వాములు చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు మొడలైన పీఠాధిపతుల వంటి పావనాకృతులకు జగన్మాతయే ములకారణము, సర్వాంతర్యామి అయిన భగవంతుడు పవిత్రస్వరూపములుగా, జ్ఞానరూపములుగా చుస్తూనే ఉన్నాము🌹🌹🌹 అందుకే  పరమాత్మ అయిన శ్రీమాత *పావనాకృతి* అని స్తుతింపబడుతున్నది🌻🌻🌻ఆ పవిత్రత అంతా రూపుకట్టుకొనిన ఆకారము జగన్మాతదే🌺🌺🌺 *పావయతీతి పావనః* పవిత్రతను కలుగజేయునది గనుకనే జగన్మాత *పావనాకృతి* అని నామప్రసిద్ధమైనది🌹🌹🌹అటువంటి పావనాకృతి యైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం పావనాకృతయే నమః* అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము🚩🚩🚩🕉🕉  🌺🌻🌹🌻🌸 🕉🕉🕉🕉🕉
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శాంతి మంత్రములు వాటి వివరములు


ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో బ్రాహ్మణులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వ జీవులు రక్షింప బడు గాక... సర్వ జీవులు పోషింప బడు గాక... అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి (సమాజ ఉద్ధరణ కోసం)... మన మేధస్సు వృద్ది చెందు గాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం భవతు..

తాత్పర్యం:
సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..
సర్వులకు శాంతి కలుగు గాక..
సర్వులకు పూర్ణ స్థితి (completeness) కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..

3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:
సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..
సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..
అందరికీ ఉన్నతి కలుగు గాక..
ఎవరికీ బాధలు లేకుండు గాక..

4. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:
మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశము లో ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక. 

5. ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ..
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము (మిధ్య) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. (అజ్ఞానం అనే) అంధకారము నుండి (జ్ఞానస్వరూపమైన) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

6. స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు...

తాత్పర్యం:
ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గం లో పాలింతురు గాక. గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.

7. ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణో, నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక.. బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను. సత్యము, బ్రహ్మము నన్ను రక్షించు గాక, నా గురువును, సంరక్షకులను రక్షించు గాక.

8. ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి:
పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి:
వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి:
బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి:
సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకము లందలి దేవతల యందు, బ్రహ్మ యందు, సర్వ జనుల యందు, శాంతి నెలకొను గాక. ( పంచభూతముల వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక ) శాంతి యందె శాంతి నెలకొను గాక. నాయందు శాంతి నెలకొను గాక.

పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్ధించడం మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం.

* * * సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు * * *