24, జులై 2020, శుక్రవారం

చండి అమ్మవారి విశిష్టత...

ఎలుగు బంట్ల రూపంలో వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్న మహర్షులు

ఛత్తీస్ గడ్ లోని గుచాపాలి అనే గ్రామంలో ఉన్న చండీ అమ్మవారి ఆలయంలో జరిగే హరతికి ఎలుగు బంట్లు వస్తుంటాయి.ఎవరికి ఏ హాని చేయకుండా హారతి దర్శించుకుని ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతాయి.భక్తులు వేసే ఆహారాన్ని కుడా స్వీకరించి వారితో ప్రేమగా మేలుగుతాయి.

ఒక కధనం ప్రకారం ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని ఇక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారని వారు చండీ అమ్మవారి దర్శనానికి ఇలా భల్లూకాల ( ఎలుగు బంట్ల ) రూపం లో వస్తుంటారని చెబుతారు.

మహర్షులు ఎలుగు బంట్ల రూపంలో రావడంలో అంతరార్ధం ఎమై ఉంటుంది ?

ఇది తెలుసుకోవాలంటే భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. మన కర్మలను అనుసరించి మన మనస్సు ప్రేరేపిమ్పబడుతుంది , మనస్సు బుద్ధిని ప్రేరేపిస్తుంది.కనుక పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి.పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య కర్మల వలెనే మనం ఇలాంటివి తెలుసుకోగలుగుతున్నాం.

అందరూ ఇలాంటి ఆలయాలని దర్శించుకోలేరు.వారి పాప కర్మలే అందుకు కారణం.ఎవరైనా దర్శించుకుందాం అనుకున్నా అక్కడ ఎలుగు బంట్లు ఉన్నాయట ఎందుకు అపాయాన్ని కొని తెచ్చుకోవడం , దేవుడు ఎక్కడైనా ఒకటే కదా అని మానేసేవారు ఉంటారు.అలాంటి వారికి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఈ జన్మలో లేకపోవచ్చు.కొన్ని సార్లు కొంత మందికి అమ్మవారి మీద భక్తితో ఎలుగు బంట్లు ఏమి చేయవు అమ్మవారు రక్షిస్తారనే దృఢమైన భక్తీ కలిగి ఉంటే వారి నమ్మకాన్ని బలపరుస్తూ అమ్మవారు తప్పక కాపాడతారు.ఎలుగు బంట్లు ఏమి చేయవు.

దేవీ దేవతలను పూజించే పాములు , సాలె పురుగులు , ఏనుగులు , కోతులు , నక్కలు , ఎలుగు బంట్లు ఇవేవీ కూడా కేవలం జంతువులు అనుకోవడం మన అజ్ఞానమే ... అవి చూపుతున్న అసామాన్య భక్తీ మనల్ని ప్రేరేపింపజేయడం లేదా ...

ఇటువంటి నిదర్శనాలు ఎన్నో చోట్ల చూస్తూనే ఉన్నాం , వీటిని నమ్మాలా వద్దా అనేది వారి వారి భక్తి నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది . " యద్భావం తద్భవతి "

ఛత్తీస్‌గఢ్‌లోని గుచాపాలిలోని ఆలయానికి ప్రత్యేక అతిథులుగా ఎలుగుబంట్లు వస్తాయి. ప్రతీ రోజు దుర్గాపూజ సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో వెలువడే సువాసనను పసిగట్టి ఆ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు ఆలయాన్ని సందర్శిస్తాయి. ఆ క్రమంలోనే తొమ్మిది రోజుల ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆలయ సమీపానికి భారీగా ఎలుగుబంట్లు వస్తాయని, ప్రసాదాలు సమర్పించగా ఆరగించి వెల్తాయని పురోహితులు తెలిపారు.

ఈ ఎలుగుబంట్లను అమ్మవారి భక్తులని స్థానికులు బలంగా విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఎలుగుబంట్లు రాగానే భక్తులు భయపడకుండా ఆనందంగా వాటిని స్వాగతిస్తారని డీఎఫ్‌వో మహసముంద్ మాసి తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎలుగుబంట్లు వచ్చిపోతున్నాయి గానీ.. ఇప్పటివరకు ఎవరికీ హాని తలపెట్టలేదని ఆయన వివరించారు. ఆహారం విస్తారంగా లభ్యమవ్వడం, జంతువుల పట్ల ప్రజలు ఆదరణ కురిపించడం వల్ల ఎలుగుబంట్లకు, అక్కడి ప్రజలతో మంచి బంధమేర్పడిందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా ?

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లలో గుచ్చపాలి అనే పల్లెటూరులోని కొండపైన ఈ చండీ మాత ఆలయం ఉన్నది.

**************************

కామెంట్‌లు లేవు: