6, డిసెంబర్ 2020, ఆదివారం

దేవుడి నైవేద్యం

 *దేవుడి నైవేద్యం.. ప్రతిఫలం*

దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.


 *చిన్న అరటి (యాలకి అరటి)* :


నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.


 *అరటిగుజ్జు* :


రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగి వస్తుంది. పెండ్లి తదితర శుభ కార్యాలయాల కు సకాలంలో నగదు అందుతున్నది. హఠాత్తుగా నగదు మంజూరవుతున్నది.


 *పూర్ణఫలం/కొబ్బరికాయ* :


పనులు సులభ సాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి.


 *సపోటా పండు* :


వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి.


 *కమలా ఫలం* :


చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు.


 *మామిడి పండు* :


ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి.బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.

ఇైష్టదైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచిమీరు కూడా సేయిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతున్నది. ఇష్టదైనానికి మామిడి పండు అంజూరపండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావంటారు.


 *అంజూర పండు* :


అనారోగ్య సమస్యలు తీరతాయి.స్వల్పరక్తపోటు (లోబీపీ) ఉన్న వారికి మంచిది.కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారు.


 *నేరేడుపండు* :


నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడుపండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు.


 *పనస పండు* :


శతృజయం కలుగుతుంది. శత్రవులు, మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి.


 *యాపిల్ పండు* :


సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు.


 *ద్రాక్షపండ్లు* :


దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి.


 *జామపండు* :


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. పెడ్ల్లికాని యువతులతో ముత్తయిదువులకు పెడితే పెండ్లి ఆటంకాలు సమసిసోతాయి. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది.


సేకరణ ÷

ఋణం:

 *ఋణం:-*


తన ధర్మాన్ని తాను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నా చాలా మంది కష్టనష్టాలు పడుతూ ఉంటారు. ఒక్కో సారి జాతక రీత్యా దశ, అంతర్థశలను అనుసరించి జపం, దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకు కారణం *ఋణాలు* అంటే అప్పులు కాదు .



ఆ ఋణాలు :- 


పితృఋణం. మాతృఋణం , పుత్రికా ఋణం , స్త్రీ ఋణం, సోదర ఋణం , దైవ ఋణం , ఋషి ఋణం , దాన ఋణం, గురు ఋణం , 


ఈ తొమ్మిది ఋణాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి . ఈ ఋణాలను తీర్చుకొనకపోతే ఆ వ్యక్తి మీద ఆ ఋణ బాధల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు, హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండదు. ఎంత కష్టపడినా జీవితం లో ఉన్నత శిఖరాలకు ఎదగలేక నిరాశ నిస్పృహలకు లోనౌవుతారు .


ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఋణబాధలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసి ఏ ఋణ బాధ అతనికి కష్టాలు కలుగచేస్తోందో గ్రహించాలి. దానితో పాటుగా గ్రహసంబంధ విషయాలను గుర్తించాలి . గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయటానికి ముందుగా ఈ తొమ్మిది ఋణాలు నుంచి అతడిని విముక్తుడిని చేసే మార్గాలు సూచించి అతను పాటించే నియమాలు, విధి విధానాలు తెలుసుకుని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయించడం ద్వారా తగిన విధంగా ఫలితం ఉంటుంది.


*పితృఋణం :-* మరణించిన తండ్రి , తల్లి లేక అందుకు సమానమైన రక్త సంబంధీకులు మరణించిన తరువాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం ఆబ్దికం, సంవత్సరీక , తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలను నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి ఋణపడి ఉంటాడు . ఇందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఆటంకాలు, తీవ్ర నష్టాలు చూడటం జరుగుతున్నది. అకారణ శత్రువులు, అవమానాలు, నిందలు, కోర్టు వ్యవహారాలు, చెరసాల వంటి కష్టనష్టాలు పితృఋణం వల్ల కలుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పితృఋణం క్షయం చేయించుకోవాలి ‌ . ఆ తర్వాత మిగిలిన పరిహారం త్వరగా ఫలిస్తాయి.


*మాతృఋణం :-*


ఏ వ్యక్తి అయినా తెలిసీ , తెలియక తన తల్లికి కోపాన్ని, వేదనను కలిగించడం , ఆమేను తిట్టడం, కొట్టటం, ఆమెపట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం , ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం లేక కుటుంబానికి యజమానురాలిని దూరం చేయడం మాతృశాపం గురిచేస్తుంది.దీని వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధనం తీవ్రంగా నష్టపోతారు , గృహం లో మనఃశాంతి లోపిస్తుంది. భూ, పశు సంపద వివాదాలు మొదలైన నష్టాలు చవిచూస్తారు . ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా మాతృఋణ శుద్ధి చేయించుకుని మిగిలిన పరిహారాలు ఆచరించాలి. 


*పుత్రికా ఋణం:-* 


స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించడం , వారిని అకారణంగా బాధించడం వలన వారికి వేడుకలు చేయకపోవడం వల్ల వారి నుంచి ధనం , వస్తువులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రికా ఋణం ఏర్పడుతుంది. కొంత మంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్థిని ఇవ్వకుండా మగ పిల్లలకి మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం వల్ల కూడా కలుగుతుంది. ఈ విధమైన ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు, సంతానంతో విభేదాలు కలగటం తో పాటు ధనం నష్టం, అవమానాలు, ఒక్కో సారి ఒంటరిగా జీవించడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పుత్రికా ఋణం తప్పకుండా తీర్చుకోవడం తప్పనిసరి. 


*స్త్రీ ఋణం :-* 


భార్య , పర స్త్రీ వీరిద్దరి విషయం లో ప్రియురాలు. ఉంపుడు గత్తె విషయంలో కూడా చేసే దుర్మార్గం స్త్రీ ఋణంగా పీడిస్తుంది.


భార్యను కొట్టడం , తిట్టడం, ఆమే స్వర్జితం దొంగిలించడం , భయపెట్టి లాక్కోవడం, ఆమెను పస్తులుంచడం, మానరక్షణకు వస్త్రాలు సమకూర్చక పోవడం , కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం, ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్లి పోయేలా చేయడం , భార్యాభర్తలను లేని పోని అనుమానం తో , లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం , పరస్ర్తీని కామించడం , ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఆమె మీద నిందలు ప్రచారం చేయడం, ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం , భయపెట్టడం , ఉంపుడుగత్తెగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం , అనుమానం తో వేధింపులు పెట్టడం , మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివి అన్ని స్త్రీ ఋణంగా పరిగణనలోకి వస్తాయి. ఈ ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు. గృహ శాంతి ఉండదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తొడు వ్యసనాలకు బానిస అవుతాడు. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మానసిక అశాంతిని పొందుతారు. దారిద్ర్యం తో పాటు శరీరం రోజురోజుకూ శుష్కించి పోవడం జరుగుతుంది. అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు జీవితం లో ఒక్క పని కూడా ముందుకు రావడం జరుగదు. ఈ స్త్రీ ఋణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు.


*సోదర ఋణం:-*


తన రక్త సంబంధీకులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకు వాడుకోవడం లేక వారికి చెందవలసిన ధన, కనక, వస్తు, వాహన, భూ, గృహ, లాంటి వాటిని తీసేసుకోవఠం వల్ల సోదర ఋణం ఏర్పడుతుంది. ఈ ఋణం కలిగిన వ్యక్తి దారిద్ర్యం పొందుతారు. తన జీవిత కాలం అంతా కష్టపడినా కూడా మనశాంతి పొందడు. అతని కుటుంబంలో భార్య లేక భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యము అధికంగా ఉంటుంది. జీవితం చివరి దశకు వచ్చే సరికి హీనమైన, దీనస్థితి పొందుతారు.


*దైవ ఋణం :-*


తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ ఋణానికి కారణం అవుతాయి. ఈ ఋణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తానూ దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మణా ఆరాదించడు, అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు ..వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒక వేళ చేయించినా ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పౌరోహితుడు వీరితో అనేక ఇబ్బందులు పడతాడు... 


ఇక భ్రుణ హత్య, పుత్రుడిని చంపడం, పెంపుడు జంతువులను చంపడం , గోహత్య వంటి పంచమహపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ ఋణం పాలవుతారు..వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు.


ఈ ఋణం వలన ప్రప్రథమంగా సంతాన హీనత కలుగుతుంది.. లేక అంగవైకల్యం తో సంతానం కలుగుతుంది. ఆ సంతానం పై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ ఋణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి. మానసిక అశాంతిని కలిగి ఉంటారు..వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలను చేసి ప్రభావితం చేస్తారు . 


*ఋషి ఋణం:*


తమ వంశానికి మూలపురుషుడు ఋషిని సేవించలేకపోవడం , సాదు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం, ఋషిప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయడం వల్ల, తీసుకున్న మంత్రాన్ని సరిగా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువ చూడటం , ఋషి ఋణం కిందకు వస్తాయి.ఋషి ఋణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఆవేశం వల్ల అనేక కష్టనష్టాలను పాలవుతుంటారు. ఏం చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటాడు . ఇటువంటి వారు ఋషి ఋణం తీర్చుకోవాలి.


*దాన ఋణం :-* 


ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతి ఫలం కోరటం, పనికి రాని దానం చేయడం, దానం చేసిన వానిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన ఋణం కలిగిస్తాయి.


ఈ ఋణం పొందిన వారు తరచుగా వివాదాలు పాలవుతారు. ధనం , కుటుంబ జీవనం నష్టపోయినపుడు, వ్యసనాల పాలు అవుతారు. దారిద్ర్యం , ఋణ బాధలు, బంధు , మిత్రుల నిరాదరణకు పొందటం తో పాటు అవమానాలు అపకీర్తిని భరించవలసి వస్తుంది.


*గురు ఋణం:-* 


గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురు ఋణం గా బాధిస్తాయి.తరచు తగవులు, మిత్రులతో విభేదాలు, ఉపాధిని కోల్పోవడం  , వివేకాన్ని కోల్పోయి సమాజం లో అపకీర్తిని భరించవలసి వస్తుంది. 


ఈ 9 రకాల ఋణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం లోతుగా పరిశీలిస్తే అర్దం అవుతుంది. 


సశేషం


9542552784

జగద్గురు బోధలు - 76*_

 _*జగద్గురు బోధలు - 76*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*మన వేదములు - శాస్త్రములు    వ్యాకరణము*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



షడంగాలలోని శిక్ష వేదభగవానునికి నాసికాస్థానం. వ్యాకరణం ముఖం. అనగావాక్కు. వ్యాకరణా లెన్నోవున్నా, ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి వరరుచివార్తికమూ పతంజలిమహరి భాష్యము వ్రాశారు. వ్యాకరణానికీ, ఇతర శాస్త్రాలకూ భేదమేమిటంటే ఇతరశాస్త్రాల భాష్యాలకన్నా సూత్రాలకేగౌరవం. వ్యాకరణవిషయం అట్లాకాదు. సూత్రాల కన్నా వార్తికానికీ, వార్తికానికన్న భాష్యానికీ గౌరవం అధికం. 


''సూచనాత్‌ సూత్రమ్‌'' పాణిని వ్యాకరణం సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే మహాభాష్యమన్న గౌరవం. 


చోళమండలంలో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో 'వ్యాకరణదాన మంటపాలు' అని మంటపాలుంటవి. శివాలయానికిన్నీ, వ్యాకరణానికిన్నీ ఏమి సంబంధం? 


నృత్తావసానే నటరాజరాజో 


ననాద ఢక్కాం నవపంచ వారమ్‌. 


ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా 


నేతద్విమర్శే శివసూత్రజాలమ్‌ || 


పరమేశ్వరుడు మహానటుడు. ఆయన ఢక్క నుండి సూత్రాలేర్పడినవి. వానికి మాహేశ్వరసూత్రాలని పేరు. 


బొంబాయిలో నిర్ణయసాగర ప్రెస్‌ అనే ముద్రణాలయం ఒకటివుంది. వారు కావ్యమాల అని పేరుపెట్టి వరుసగా ప్రాచీనకావ్యాలను ప్రకటించేవారు. ఆ గ్రంథాలలో కొన్ని వెనుకటి సంస్కృతి శాసనాలనుగూర్చి వేంగినాటికి చెందిన తామ్రశాసనాన్నిగూర్చి, ప్రకటించినగ్రంథం చదవటం తటస్థించింది, కృష్ణా కావేరీ మధ్యప్రదేశమే వేంగినాడు. తెనుగు చోళులకున్నూ, తంజావూరు చోళులకున్నూ వియ్యమూ నెయ్యమూ ఉండేది. బృహదీశ్వరాలయం నిర్మించిన రాజరాజ నరేంద్రుడు చోళుడే. వేంగినాటికి చెందిన కులోత్తుంగచోళుడు చోళరాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో వేదాన్ని మరింత ప్రచారంలోనికి తేదలచి చోళదేశపు ద్రావిడ బ్రాహ్మణులలో 500 కుటుంబాలను తనతోపాటు వేంగినాటికి తీసుకొనిపోయి కాపురం పెట్టించాడట. ఆంధ్రదేశంలో ద్రావిడశాఖకు చెందిన బ్రాహ్మణులు ఈ కుటుంబపరంపరలోనివారే. 


నిర్ణయసాగరంవారు ప్రచురించిన గ్రంథంలోని శాసనం ఈ ఐదువందల బ్రాహ్మణకుటుంబాలవారి గోత్రాలేమిటో ఆ కుటుంబాలలోనివారు ఏఏ శాస్త్రాలలో నిపుణులో వారు ఏ ఏ కార్యాలు చేయవలసియుండిరో వారికి ఏ ఏ చోట భూవసతులు కల్పింపబడెనో విశదీకరించినది. కోరినవారికి వేదములూ, శాస్త్రములూ చెప్పడమే వారి పని. ''రూపావతారవక్తుః ఏకో భాగః'' అన్న వాక్యం ఆ శాసనంలో కనిపించింది. ''రూపావతారం'' చెప్పేవారికి ఒకభాగం అని దీని అర్థం. రూపావతారం అనేది ఒక వ్యాకారణశాస్త్రం. 


ప్రస్తుతం వ్యాకరణగ్రంథాలలో అధికప్రచారం కలది 'సిద్ధాంతకౌముది'. అప్పయదీక్షితులవారి శిష్యుడైన భట్టోజీ దీక్షితులు దీనిని వ్రాసినవారు. ఇదిపాణినిసూత్రాలకు వ్యాఖ్యానం. భట్టోజీదీక్షితులు అద్వైతమతానుసారియైన 'తత్వకౌస్తుభం' అనేమరొక గ్రంథం, అప్పయదీక్షితులవారి ఆజ్ఞానుసారం మధ్వమతం ఖండిస్తూ 'మధ్వమత విధ్వంసన' మన్న ఇంకొక గ్రంథమున్నూ వ్రాశారు. 


సిద్ధాంతకౌముది వ్యాప్తికికాకముందు రూపావతారమే ప్రచారంలోవున్న వ్యాకరణం. రూప మనగా శబ్దంయొక్క మూలస్వరూపమే. రూపావతారమనగా శబ్దముయొక్కమూలస్వరూపవ్యక్తీకరణం. నిర్ణయసాగరంవారుప్రచురించిన తామ్ర శాసనం వేగినాటిలో రూపావతార వైయాకరణులకు కల్పించిన భూవసతులను పేర్కొన్నది. ఆరోజులలో వ్యాకరణానికి అంత ప్రాధాన్యం. వేగినాటికి వలసవెళ్ళిన బ్రాహ్మణులలో కొందరికి 'షడంగవిదు' లన్న బిరుదులున్నవి. వారిపేళ్ళుసహితము అరవపేర్లే. 'అంబలకూత్తాడువన్‌ భట్టన్‌' ''తిరువరంగముడై యాన్‌ భట్టన్‌' అన్న ద్రావిడనామములను ఇందు చూడవచ్చును. 


వీరందరూ స్మార్తులే. కాని పైన చెప్పిన పేళ్ళలో మొదటిది శివనామం, రెండవది వైష్ణవం. తిరువంగముడై యార్‌ పేరు వైష్ణవమేగాని నామధారి స్మార్తుడే. ఆ పేరుకు సంస్కృతము రంగస్వామి. తిరువంబల కూత్తాడువన్‌ అన్న పేరు నటరాజ శబ్దానికి తమిళం. కుత్తాడుట అనగా నాట్యంచేయటం. మనం చేయవలసిన నాట్యాలన్నీ ఈనటరాజేచేస్తున్నట్లున్నది. నటరాజునృత్యం అందరూ చూడలేరు. తపోధనులైన సనకాదులు పతంజలి, వ్యాఘ్రపాదులు దైనీసంపద కలవారు కనుక, దివ్యచక్షువులతో దానిని విలోకిస్తున్నారు. ఒక్కజ్ఞానచక్షువు లున్నవారే, ఆనటరాజతాండవాన్ని దర్శించగలరు. కృష్ణభగవానుల విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడు, సంజయుడుమాత్రం చూడగలిగినవారు. సంజయునకు వ్యాసభగవానుల ప్రసాదం, అర్జునునకు ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్‌'' అని కృష్ణపరమాత్మయే దివ్యచక్షువు ప్రసాదించాడు. 


మనకండ్లలో లెన్సువంటి సాధన మొకటివున్నదనిన్నీ, దానిసాయంచేతనే మనంచూడగల్గుచున్నామనిన్నీ శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. వస్తువులన్నీ ఒక నిర్ణీతపరిమాణంలో మనకు కనబడటానికి ఆ కళ్ళలోని లెన్సే కారణం అన్నమాట. ఈ దృశ్యప్రపంచంలోని వస్తువులను మరింత ఘనపరిమాణంలో చూడాలని మనం తలచుకొంటే దానికి తగ్గ లెన్సు మన చక్షువులకు అమర్చుకోవాలి. అందుచే మనము చూచేదంతా సత్యమే అని చెప్పగలమా? రూపంయొక్క ఘనపరిమాణం మనదృష్టిని అనుసరించి ఉంది. దీనినే వేదాంతం దృష్టి, సృష్టివాదమని అంటున్నది. 


సనకాదులది సత్యదృష్టి, అందుచేతనే నటరాజునాట్యం చూచి ఆనందిస్తున్నారు. ఆనృత్యంలో ఉదయించిన శబ్దాలు, శివస్వరూపాన్ని ఏకభోగంగా అనుభవించడానికి వీలుగా ఉన్నవి. వానిభక్తిసూత్రాలుగా నందికేశ్వరుడు గ్రహించి భాష్యం చేశాడు. ఆనృత్య సందర్భంలో పాణిని కూడా ఉన్నాడట. 


పాణినికథ బృహత్కథలో ఉన్నది. ప్రాకృతభాషలు ఆరు. వానిలో పైశాచి ఒక్కటి. బృహత్కథ పైశాచిలో గుణాఢ్యుడు వ్రాశాడు. 


'చిత్రార్థాం న బృహత్కథా మచకథమ్‌'కువలయానందము. ఈబృహత్కధను క్షేమేంద్రుడు సంస్కృతములో సంక్షిప్తంగా రచించాడు. దీని ననుసరించి సోమదేవభట్టు కథాసరిత్సాగరం సంతరించాడు. 


మగధదేశంలో పాటలీపుత్రంలో (ప్రస్తుతం పాట్నా) వరోపాధ్యాయులు, ఉపవరోపాధ్యాయులని ఇరువురు పండితులుండేవారు. వీరిలో ఉపవరోపాధ్యాయులు చిన్న. అతని కొమారై ఉపకోసల. వరోపాధ్యాయులవారిశిష్యులే వరరుచి, పాణిని, ఈశిష్యద్వయంలో పాణిని మందబుద్ధి. చదు వెక్కలేదు. వరోపాధ్యాయు లాతని జూచి'నాయనా నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఈశ్వరానుగ్రహం పొందితేకాని, నీకు చదువు ఎక్కేటట్టు లేదు. అందుచే వెళ్ళి తపస్సుచెయ్యి' అని ఆదేశించారు. అంతటితో హిమాలయాలకు వెళ్లి పాణిని ఉగ్రతపస్సుచేత ఈశ్వరునిమెప్పించిఈశ్వరప్రసాదం పొందాడు. పై పెచ్చు నటరాజు తాండవాన్ని చూడగల పుణ్యంకూడా సంపాదించుకొన్నాడు. నృత్తావసానసమయంలో పుట్టిన శబ్దాలను పదునాలుగు సూత్రాలుగా గ్రహించి అష్టాధ్యాయి. 


'అఇఉణ్‌, ఋఈక్‌, ఏఓజ్‌, ఐఔచ్‌, హయవరట్‌, లణ్‌, ఞమఞణనమ్‌, ఝభఞ్‌, ఘఢధష్‌, జబగడదశ్‌, ఖఫఛఠధ, చటతవ్‌, కపయ్‌, శషసర్‌, హల్‌-' అనేవి ఈపద్నాల్గు సూత్రాలు. 


అచ్చులకు ఆకారము ఆది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్‌' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్‌' అ్సనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం. లోకములో శబ్దశాస్త్రాలను ఏర్పరచినది పరమేశ్వరుడుకనుక శివాలయాలలో వ్యాకరణదానమంటపాలు నిర్మించే వాడుక ఏర్పడినది. 


దాదాపు నాలుగువందల సంవత్సరములకు పూర్వం తంజావూరు రఘునాథుడనే నాయకవంశమునకు చేరిన రాజు పాలించేవాడు. అతనికాలములో యజ్ఞనారాయణదీక్షితులు అన్న శివభక్తులొక రున్నారు. వారు 'సాహిత్యరత్నాకరం' అనే గ్రంథం వ్రాశారు. అందలి శివస్తోత్రమిది. 


అజ్ఞాతప్రభవై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా(థా) 


హేతుత్వం వివిధాధ్వరక్రమకృతి ష్వేకాయన శ్చోదనైః. 


తేషా మధ్వరకర్మణా మధిపతిం త్వా మీశ నారాధయన్‌ 


ధర్మా నర్జయితుం న శ క్ష్యతి జనో దక్షో ప్యదక్షోథవా|| 


మనం ధర్మాన్ని అనుష్ఠించాలన్నా, చేసిన కర్మలు ఫలించాలన్నా భగవంతుని కృప అవసరం. వేదవాక్కుఎక్కడ ప్రభవమైనదో ఎవరికీ తెలీదు. ఆవేదం 'ధర్మం ఇది' అని నిర్ధారిస్తున్నది. అనేక అధ్వరాలనూ, నానావిధకర్మలనూచేయుమని ఆజ్ఞ ఇస్తున్నది. యజ్ఞకర్మాధిపతివి నీవు. యజ్ఞేశ్వరుడవు నీవు. నిన్ను ఆరాధించకపోతే ఇవన్నీ ఇట్లా ఫలితాన్ని ఇస్తవి? 


''ఆవో రాజాన మధ్వరస్య రుద్రం హోతారం'' అని తైత్తిరీయ సంహిత. ఎవడు ఎంత కుశలుడైనా, దక్షుడైనా పరమేశ్వరుని ఆరాధన లేకపోతే వానికౌశలం నిరుపయోగమై పోతుంది. వానికి ఏ కార్యమూ సిద్ధించదు. దీనికి దక్షుడే సాక్ష్యం. 


ఈ శ్లోకానికి ముందున్నది వ్యాకరణమును గూర్చి. 


అదౌ పాణినినా(వా) దతొక్షర సమామ్నాయోపదేశేనయః 


శబ్నానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ సూత్రాత్మనా, 


భాష్యంతస్యచ పాదహంసకరవైః ఫ్రౌఢాశయం తం గురుం 


శబ్దార్థప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడంభజే|| 


అక్షర సమామ్నాయము వ్యాకరణము. వేదములు ఈశ్వరనిశ్వాసాలు. ఈశ్వరునిచేతిలోని ఢక్కానాదమేశబ్దాను శాసనం. 


నీవు చేయి ఆడించావు; సూత్రా లేర్పడినవి. పాదవిన్యాసం చేశావో లేదో భాష్య మేర్పడినది. 


వ్యాకరణభాష్యం వ్రాసిన పతంజలి ఆదిశేషుని అవతారం. ఆయన పరమేశ్వరుని మ్రోల పాదాక్రాంతుడైయున్నందున ఆయన వ్రాసిన భాష్యం మహేశ్వర పాదవిన్యాసములో నుంచి పుట్టింది. ఇట్లా శబ్దార్థాలు రెండున్నూ పరమేశ్వరునిచే సృష్టింపబడినవి. వ్యాకరణం పరమేశ్వరుని సృష్టి, ''శబ్దార్థ ప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడం భజే.''

స్నానం

 *ఇంతకీ మీది ఏ స్నానం* 

🕉️🌞🌎🏵️🌼🚩


🔴రుషి స్నానం, 

🔴దేవ స్నానం, 

🔴మానవ స్నానం, 

🔴రాక్షస స్నానం... 


ఇంతకీ మీది ఏ స్నానం...? 


బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.


 అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.


సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.

 కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?

 దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో... 

 

 🚿తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 


🚿5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.


🚿 ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. 


🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. 

ఇది అధమాతి అధమం. 


కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.

 

🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.


 🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.


 🚿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం. 


🚿వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

 

🚿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు. 


కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.

 షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.

 ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

 

 ⛱ *పురాణాలలో స్నానం :*

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.

 అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. 

 

⛱ *మంత్ర స్నానం:*

 వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

 

⛱ *భౌమ స్నానం :*

 పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".

 

⛱ *ఆగ్నేయ స్నానం:*

 సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"


 

⛱ *వాయువ్య స్నానం:* ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"

 

⛱ *దివ్య స్నానం:*

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".

 ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

 

⛱ *వారుణ స్నానం:*

 పుణ్య నదులలో స్నానం ఆచరించడం 

"వారుణ స్నానం".

 

⛱ *మానస స్నానం :*

 నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం

 "మానస స్నానం".

 ఇది మహత్తర స్నానం. 

మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.


 🎊 *స్నానాలు రకాలు*


🌧 *మానస స్నానం:*

 దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.


🌧 *క్రియాంగ స్నానం:*

 జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.


🌧 *దైవ స్నానం:*

 ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *మంత్ర స్నానం:*

 వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.


🌧 *రుషి స్నానం:*

 ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *మానవ స్నానం:*

 ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.


🌧 *రాక్షస స్నానం:*

 ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.


🌧 *ఆతప స్నానం:*

 ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.


🌧 *మలాపకర్షణ స్నానం:*

మాలిన్యం పోవుటకు చేయు స్నానం.

*శ్రద్ధ చాలాఅవసరం

 *శ్రద్ధ చాలాఅవసరం..*


వేరువేరు కర్మలు వేరువేరు ఫలాలనిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజుల్లో పలువురు తామాచరించిన కర్మలకు తామనుకున్నట్లు ఫలితాలు కలగకపోవటంతో శాస్త్రాల ప్రామాణికతను సందేహిస్తున్నారు . గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు .


" అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ !

  అసదిత్యుచ్యతే పార్ధ నచ తత్ప్రేత్య నో ఇహ !! "


శ్రద్ధ లేని కర్మ కోరిన ఫలాన్నివ్వదు . అందువలన మీరు చేసిన ఏకర్మఅయినా కోరిన ఫలములివ్వలేదంటే ఆ కర్మను మీరు శ్రద్ధతో చేయలేదని అర్ధం . శ్రద్ధ లేకుండ కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు . సర్వకాలాలలోను సందేహాతీతమైన ప్రామాణ్యం కలవి శాస్త్రాలు . అందువలన శ్రద్ధతో కర్మలనాచరించాలనేది చాలా ముఖ్యం .


అయితే శ్రద్ధ అంటే ఏంటి ? అనే ప్రశ్నకు ఆదిశంకరులు ఇలా సమాధానమిచ్చారు .


" శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుధ్యాసవధారణా !

  సాశ్రద్దా కథితా సద్భి: !! "


శాస్త్రాలలో గురువాక్యంలో అచంచలమైన నమ్మకమే శ్రద్ధ అని . ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి .


పురాణాలలో దక్షప్రజాపతి ఈశ్వరద్వేషంతో యజ్ఞం చేయ తలపెట్టాడు . యజ్ఞం సత్ఫలితాలనివ్వకపోగా , అది ఘోరమైన విధ్వంసంతో ముగిసింది .


గురువుగారి ఉపదేశాన్ని శ్రద్ధతో గ్రహించేవానికే జ్ఞానం లభిస్తుంది . 


" శ్రద్దావాన్ లభతే జ్ఞానం " - అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు .


అందువలన మనిషి జీవితంలో శ్రద్ధ చాలా అవసరం . అందరు శ్రద్ధతో కర్మలనాచరించి శ్రేయస్సును పొందుదురుగాక .


   - జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు.

భగవద్గీత.గీతను

 మన లోపల ఒకడున్నాడు..అసలైన వాడు..

కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 మంది దొంగలు అడ్డుగా ఉన్నారు..కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్య అనే 6 దొంగలు..ఈ 6 మందిలో 4 దొంగల నుండి సులభంగా తప్పించుకోవచ్చు,కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించుకోవడం చాలా కష్టం..ఆ ఇద్దరు పెద్ద రౌడీలు..వాళ్ళే కామం,క్రోధం..ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..


" కామ ఏష క్రోధ ఏష రజో

  గుణ సముద్భవహ " 


ఈ కామం,క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు..ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి..అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor..ఇంకా మనం First floor కు రాలేదు..మనం Ground floor లో ఉన్నాం..


 మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.. అంటే మనం తమో గుణంలో ఉన్నాం..బద్దకం,అతి నిద్ర,ఆలస్యం,నిర్లక్ష్యం ఇవే తమో గుణం..ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..ఇంకా Ground floor లోనే ఉన్నాం..ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం..అలాంటిది ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 మంది దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది..


ఆ floor పేరు సత్వ గుణం..ఈ floor చాలా పెద్దగా ఉంటుంది..హాయిగా ఉంటుంది..ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..అయితే చిన్న సమస్య..ఇక్కడ ఒకే ఒక దొంగ ఉంటాడు..భయపడకండి..వాడు మంచి దొంగ..వాడు మీకు మంచి మాటలే చెబుతుంటాడు..మీకు Third floor కు దారి చూపిస్తాడు..ఆ floor పేరు శుద్ధ సాత్వికం..ఇదే చివరిది..ఇక్కడే మీరు అఖండమైన వెలుగులో కలిసిపోయింది..ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..అది వెలుగులకు వెలుగు,మహావెలుగు.చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift ఉంది.


ఆ Lift పేరే భగవద్గీత.గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ స త్వం వరకు మనం ప్రయాణం చేసి,చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..🌸🏵️🌸🏵️🌸

*పెళ్లి వేడుకల సమయంలో

 *పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం తెలుసుకుందాం* 🙏


రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సద్దలు, రావులు, తైదులు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.


పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో

తెలియడం లేదు.వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.


అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని, పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము

లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ 🙏

అదౄష్యవాణి

 *అదౄష్యవాణి* 

ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు.. “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.


నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.


ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.


అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.


అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.

🌿🌿🌿🌿🌿🌿

అనాయాసేన మరణం

 *గుడి మండపంలో కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన...*

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.

అది ఏమిటంటే..!


"అనాయాసేన మరణం

వినా దైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.


*"అనాయాసేన మరణం"*

నాకు నొప్పి లేక బాధ కానీ లేని

మరణాన్ని ప్రసాదించు.


*"వినా ధైన్యేన జీవనం"*

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,

నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


*"దేహాంతే తవ సాన్నిధ్యం"*

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను

నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


*"దేహిమే పరమేశ్వరం"*

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ ....నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


3.  నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా

ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.


దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ🙏🙏🙏🙏🙏

మంచి నీల మొక్కటి చాలు


4.నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు 

దళుకు బెళుకు రాళ్లు తట్టెడేల? చాటు పద్య మిలను చాలదా యొక్కటి

విశ్వదాభిరామ వినుర వేమ! 

తా:-మంచి జాతి కలిగిన యింద్రనీల మణి ఒక్కటైనను చాలా విలువ చేయును. మెరసెడి రాళ్లు తట్టెడు ఉన్నను దాని విలువ కు సరిపోవునా? సందర్భ శుద్ధి కలిగిన అందమైన చాటు పద్యము ఒక్కటైనను లక్షల విలువ చేయును. గాని వట్టి చప్పని పద్యములు వందయున్ననూ ఏమి లాభము? 

🍁🌳🍁🌳🍁🌳🍁🌳

ధ్వనియొక్క అద్భుత విశేషం

 🌳🍁🌳🍁🌳🍁🌳🍁🌳మంత్రమును ఉచ్చరించేటప్పుడు వాయుమండలంలో ఒక విధమైన ప్రకంపనం ఉత్పన్నమవుతుంది. ఈ కంపన తరంగాలు వాయుమండలంలో ఈధర్ తత్వమాధ్యమంలో క్చణమాత్రం లోనే బ్రహ్మాండమంతా పరిభ్రమించి తనకు అనుకూలమైన తరంగాలలో సమ్మిలితమై ఒక పుంజంగా(ఒక రాశిగా) యేర్పడతాయి. ఈ పుంజం అత్యంత శక్తిశాలీనంగా ఉండి దీని ప్రభావం వల్ల అనుకున్న కోరిక నేరవేరటంగాని లేదా కార్యసాపల్యంగాని తేలిక అవుతుంది. మనం పలికే పదాలు కూడా ప్రేమతో పిలిచేటప్పుడు ఒకరకంగా, ఒక్కొక్క వ్యక్తిని విశేషం గా పిలిచేటప్పుడు ఇంకొకరకంగా వివిధ సమయాల్లో వివిధమైన ప్రభావం కలుగుతుంది. ఇదంతా ధ్వని యొక్క అద్భుతమే.

           ధ్వనియొక్క ఈ అద్భుత విశేషం మనకి పాటల లో విశేషం గా కనిపిస్తుంది. ఈ ధ్వని ప్రభావం వలన సీల్, డాల్ఫిన్ వంటి చేపలు ఆకర్షింపబడి వేటగాళ్ళ బారిన పడతాయి. ఆ వలలో చిక్కుకుంటాయి. సంగీతం లో గోవుల క్చీరం అభివృద్ధి అవుతుంది. ఇది కూడా ప్రత్యక్షంగా జరుగుతున్నదే. పాములు, ఎలుకలు ఇంకా ఇతర వన్యప్రాణులు కూడా సంగీత ప్రభావం తో స్తబ్ధమై వశీభూతవుతాయి. 🍁🌳🍁🌳🍁🌳🍁🌳🍁🌳🍁

సంగీతం సంబంధ 32 పుస్తకాలు

 *సంగీతం సంబంధ 32 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


32  పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/sangeethamu-pdf


               (OR)


క్రొత్త సంగీత విద్యాదర్పణము www.freegurukul.org/g/Sangeethamu-1


రాగ తాళ చింతామణి www.freegurukul.org/g/Sangeethamu-2


సంగీత మార్తాండము-తాళాధ్యాయము www.freegurukul.org/g/Sangeethamu-3


సంగీత ప్రధమ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-4


సంగీత లక్షణము www.freegurukul.org/g/Sangeethamu-5


సంగీత శాస్త్ర సుధార్ణవము www.freegurukul.org/g/Sangeethamu-6


ముక్తాయి సూత్ర భాష్యము www.freegurukul.org/g/Sangeethamu-7


ఆంధ్రుల సంగీత కళ www.freegurukul.org/g/Sangeethamu-8


సంగీత విద్యా ప్రకాశిక www.freegurukul.org/g/Sangeethamu-9


పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచనలు www.freegurukul.org/g/Sangeethamu-10


గాన భాస్కరము www.freegurukul.org/g/Sangeethamu-11


శతరాగరత్న మాలికా www.freegurukul.org/g/Sangeethamu-12


సంగీత కళా ప్రదర్శిని-1 www.freegurukul.org/g/Sangeethamu-13


మృదంగ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-14


సంగీత నక్షత్ర మాల www.freegurukul.org/g/Sangeethamu-15


గంధర్వ కల్పవల్లి www.freegurukul.org/g/Sangeethamu-16


సంగీత సిద్ధాంత సోపానములు-1 www.freegurukul.org/g/Sangeethamu-17


సిరి మువ్వలు www.freegurukul.org/g/Sangeethamu-18


జాతీయ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-19


సంగీత శబ్దార్ధ చంద్రిక www.freegurukul.org/g/Sangeethamu-20


ప్రాచీనాంధ్ర మహాకవుల సంగీత ప్రతిపత్తి www.freegurukul.org/g/Sangeethamu-21


సంగీత విద్యా భోదిని www.freegurukul.org/g/Sangeethamu-22


ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు సంగీత వాగ్మయం www.freegurukul.org/g/Sangeethamu-23


గాన శాస్త్ర ప్రశ్నోత్తరావళి www.freegurukul.org/g/Sangeethamu-24


సంగీత వాయిద్యాలు www.freegurukul.org/g/Sangeethamu-25


అష్టోత్తర శత రాగాంగాది వర్ణమాల www.freegurukul.org/g/Sangeethamu-26


గాన విద్యా వినోదిని www.freegurukul.org/g/Sangeethamu-27


సంగీత సాంప్రదాయ ప్రదర్శిని-1 నుంచి 4 www.freegurukul.org/g/Sangeethamu-28


సంగీత శాస్త్ర వాచకములు - గాన విషయము-1,2 www.freegurukul.org/g/Sangeethamu-29


సంగీత సౌరభం-1,3,4 www.freegurukul.org/g/Sangeethamu-30


గాంధర్వ వేదము www.freegurukul.org/g/Sangeethamu-31


మనోధర్మ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-32



సంగీతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

దీపదానం చేస్తే

 దీపదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట..!


కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితోగానీ, గోధుమపిండితోగానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే... పసుపునుపూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు... 


"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం"

"దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ"-


అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే.. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.


"దీపదానం మహిమను గురించి వివరించే కథ" 

పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్నఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ... తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేదికాదు. పరమలోభి.


శుచిశుభ్రత లేకుండా జీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. 


అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

మనోనిగ్రహం

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

🕉️🕉️🕉️🕉️🕉️

(మనోనిగ్రహం)

🕉️🕉️🕉️🕉️🕉️

పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు. అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి.


"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."


శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు...


"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం.

ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. "కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."


నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోర్మెలు దాగి ఉంటాయి. ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా.. అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది.


ఆ విధంగా కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొటే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి."


ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. రామకృష్ణుల మనస్సులో కూడా అవి మెదలకపోలేదు. ఆయన ఇలా జ్ఞాపకం చేసుకున్నారు..


"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు. భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."


ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు. ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..


రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...


"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి.. హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి, 'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు...

🕉️🕉️🕉️🕉️🕉️

ఓం నమః శివాయ 

🕉️🕉️🕉️🕉️🕉️

విష్ణుసహస్రనామాలు

 🍁🍁🍁🍁💐🍁🍁🍁🍁🍁


*విష్ణుసహస్రనామాలు సంస్కృతంలో ఉంటాయి కదా! మరి వాటి అర్థం తెలియకుండా చదువవచ్చునా?*



ఒక విష్ణు సహస్రనామమే కాదు, భగవంతుని అన్ని స్తోత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి. 


భారతదేశ భాష, భారతీయుల భాష మొదట సంస్కృతమే. మనం ప్రపంచమంతా తిరుగుచు మన భాషను మరిచిపోతున్నాం. అర్థం తెలిసినా, తెలియకున్నా భగవంతుని నామాన్ని నోరార పలికితే చాలు అన్ని పాపాలు తొలగుతాయి. అన్ని కోరికలు తీరుతాయి. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుడు మందు వ్రాసిస్తారు. ఆ మాత్రను తెచ్చి వేసుకుంటాము. 


ఆ మాత్ర ఎలా తయారుచేశారో, అందులో ఏయే ఔషదాలు ఉన్నవో మనకు తెలియవు. అయినా ఆ మాత్ర వేసుకుంటే మన జబ్బు నయమవుతుంది. అలాగే అర్థం తెలిసినా, తెలియకున్నా నామాన్ని పలికితే పాపం పోతుంది. కొన్ని రోజులు అదే పనిగా మందును వాడుతుంటే అందులో ఏమున్నదో తెలుసుకోవాలని అనుకుంటాం. అంతా కాకున్నా కొన్ని తెలుసుకుంటాం. 


అలాగే కొన్ని రోజులు ఆ నామాలను పలుకుతుంటే దానికి అర్థమేమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. పెద్దలతో తెలుసుకుంటాం. భగవంతుని గుణాలను చెప్పేవే నామాలు.



‘యాని నామాని గౌణాని’ అని కదా చెప్పినది. నామమునకు అర్థము తెలిస్తే భగవంతుని గుణాలు తెలుస్తాయి.


 ఆ గుణాలను భావించుకుంటూ నామాన్ని స్మరిస్తూ మరి కొంత ఆనందాన్ని పొందుతాం. భగవంతునిపై ప్రేమ కలుగుతుంది.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అంతా రామమయం

 ఆనందంతో ఆశ్చర్యపోతారు


అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!


ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.


ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !


మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.


మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం రాముడు.


ధర్మం పోత పోస్తే - రాముడు !


ఆదర్శాలు రూపుకడితే - రాముడు !


అందం పోగుపోస్తే - రాముడు !


ఆనందం నడిస్తే - రాముడు !


వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !


మంత్రమూర్తి - రాముడు !


పరబ్రహ్మం - రాముడు !


లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !


ఎప్పటి త్రేతాయుగ రాముడు ? 

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.


వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.


భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.


కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.


విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !


వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !


తిరుగులేని మాటకు - రామబాణం.


సకల సుఖశాంతులకు - రామరాజ్యం.


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.


ఆజానుబాహుడి పోలికకు - రాముడు.


అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.


రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.


ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.


గొప్ప కొడుకు - రాముడు.


అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.


గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).


మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).


మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).


సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).


నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.


నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.


చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు.


చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.


జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.


చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.


కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.


వికారంగా ఉంటే - శూర్పణఖ.


చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.


పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.


మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.


పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.


ఎంగిలిచేసి పెడితే - శబరి.


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.


అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.


పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.


యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !


కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.


బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.


ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.


ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.


ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.


ఒంటిమిట్టది ఒక కథ..


భద్రాద్రిది ఒక కథ...


అసలు రామాయణమే మన కథ.


అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

జై శ్రీ సీతారామ చంద్ర హనుమాన్ కీ జై

🙏🙏🙏🙏🙏🙏🙏

ధార్మికగీత - 101*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 101*

                                    *****

      *శ్లో:-దానం భోగో నాశ స్త్రిస్రో ౹*

             *గతయో  భవన్తి  విత్తస్య ౹*     

             *యో న దదాతి న భున్క్తే౹*

             *తస్య తృతీయా గతి ర్భవతి౹౹*

                                     *****

*భా:- "ధనమూల మిదం జగత్" ; "సర్వే గుణాః కాంచన మాశ్రయంతి" అని ఆర్యోక్తులు వింటుంటాము. విత్తానికి అంతటి మహత్తర ప్రతిపత్తి ఉన్నది. అంతటి ప్రధానమైన విత్తానికి మూడంటే మూడు గతులు ఉన్నాయి. 1"భోగము" :- ధనం పుష్కలంగా ఉన్నవాడు  భార్యాబిడ్డల సకల అవసరాల నిమిత్తం తృప్తిగా ఖర్చుపెట్టాలి.స్థలాలు,పొలాలు,నగ- నట్రా, విద్య- ఉపాధి,పెండ్లి-పేరంటం, విందు-వినోదం కోసం వెచ్చించి విలాసవంతంగా జీవించాలి. 2. "దానము" :- మానవుడు పైన తెలిపిన విధంగా తృప్తిగా జీవిస్తూ, ఉదారగుణంతో పరోపకారం కోసం కొంత దాన ధర్మాలు చేయాలి. పేద  సాదలను, అంగవికలురను, అనాథలను,నిరాశ్రయులను ఇతోధిక సాయంతో ఆదు కుంటూ, దైవకార్యాలకు, ధార్మికకర్మలకు వియోగించవచ్చును. ఆ పుణ్యఫలం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. 3."నాశము":- పైన చెప్పిన విధంగా తాను అనుభవించక, పరులకు పిసరంత దానం చేయక పిసినారితనంతో, స్వార్థంతో కూడబెట్టిన సొమ్ముకు మూడవగతే పడుతుంది. అదే నాశము. చివరికి అలాంటి సొమ్ము దొరలపాలో, దొంగలపాలో అవుతుంది.  అకృత్యాలకు, ఆరాచకాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. "దురాశ దుఃఖమునకు చేటు" అని అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లవుతుంది. కాన మనం కడుపు నిండా తినాలి. పరులకు ఇంత  పెట్టాలి. సమాజ ఋణం తీర్చుకోవాలి. "మానవసేవయే మాధవసేవ" అని, "జనసేవయే జనార్దనసేవ" అని, "నరుని సేవయే నారాయణ సేవ" అనే నిరంతర స్ఫురణలో పురోగమించాలని సారాంశము*.

                               *****

                *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహాత్మ్యము 


సర్వ సంపద లారీతి సమసిపోయి 

కూర్మి పుత్రులు యందఱు గూలిపోగ 

యధిపు కవగత మయ్యెను యంత నపుడు 

సత్యదేవుని ఘోరమౌ శాపఫలము    171

                                      

"గొల్లవాళ్ళిచ్చి రనియును కోపగించి 

దివ్యమైన ప్రసాదంబు తీసికొనక 

దైవద్రోహంబు జేసితి దర్పమునను"

యనుచు పరితాప మొందెను యధిపు డపుడు 172


అంత తుంగధ్వజునృపుడు యడవికరగి 

గొల్లలను గూడి తనయొక్క గోడు దెలిపి 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

చేయ వేడెను తానును చేరి చేయ       173


పిదప భూపతి గొల్లల పిలుచు కొనియు

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

చేసి సద్భక్తి తోడను చేతులార 

దివ్యమైన ప్రసాదంబు స్వీకరించె .     174


తనదు తప్పు లెఱిగి ధరణీశు డారీతి 

సత్యవ్రతము జేసి సన్నుతించ 

సకల వరదు డంత సంతుష్టు డయ్యును 

కామితములు దీర్చి కాచె నతని         175


శత సుతులను బ్రతికించెను 

యతి సంపద లిచ్చి మఱల యధిపతి జేసెన్ 

వెత లన్నియు దీర్చి యతని 

గతియించిన యశము గూర్చి  కాపాడెనిలన్ 176


ధరణిపతి సత్యదేవుని దయను పొంది 

వఱలుభక్తితొ ప్రతినెల వ్రతము జేసి 

యవని సౌఖ్యంబు లెల్లను యనుభవించి 

సాగె నంత్యంబునందున సత్యపురికి"      177



                                       సశేషము …. 


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మౌనం - వాక్కు

 🌷 *మౌనం - వాక్కు * 🌷


🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷


*మౌనం అంటే మూగబోవాల్సింది మనస్సేగాని వాక్కు కాదు* అని గ్రహించాలి. 

 

అసలు *వాక్కు నాలుగువిధాలు. అవే 


🌷 పరా


🌷 పశ్యంతి


🌷 మధ్యమ


🌷 వైఖరీ ... అని. 


*ఇక ఐదవరకం లేదు*. 


🌷*వైఖరి* 🌷


ఎల్లప్పుడూ లోకవ్యవహారాలు, వ్యర్థప్రసంగాలు, చెప్పిందే చెప్పి సాగదీయటాలు - *ఇవన్నీ 'వైఖరీ' అంటారు. లోకంలో వీరే ఎక్కువ*. వీరు వాక్కును వ్యర్థం చేయటమే గాక, అనేక అబద్ధాలు మాట్లాడటం జరుగుతుంది. 


🌷 *మధ్యమ* 🌷


కొందరు ప్రాపంచికవిషయాలు, వ్యర్థప్రసంగాలతో బాటు అప్పుడప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు కూడా మాట్లాడుతారు. వీరి వాక్కులనే 'మధ్యమ' అంటారు. 


🌷 *పశ్యంతి* 🌷


భగవత్ సంబంధవిషయాలు గాని, ప్రాపంచిక విషయాలు గాని ఏవైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారి వాక్కులు 'పశ్యంతి'. 


🌷 *పరా* 🌷


పూర్తిగా ఆత్మకు సంబంధించిన విషయాలు, పరమాత్మ తత్త్వాన్ని తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడితే ఆ వాక్కును 'పరా' అంటారు*. 

 

*మనం వైఖరీ వాక్కును మధ్యమ వాక్కునందు, మధ్యమ వాక్కును, పశ్యంతినందు, పశ్యంతి వాక్కును పరావాక్కునందు లయంజేసి 'ఆ పరబ్రహ్మను నేనే' అని గ్రహించి అలా ఉండిపోవటమే నిజమైన మౌనం.*



🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷

రామాయణమ్ .146

 రామాయణమ్ .146

.........

మరణించబోయేవాడికి ఇచ్చిన ఔషధములవలె ,చవట నేలలో వేసిన విత్తనములవలె మారీచుడి హితోక్తులు నిష్ఫలమైపోయాయి.

.

రావణుడు రాముడి పట్ల అభిప్రాయమేమీ మార్చుకోలేదు ,పైగా అతడు మానవమాత్రుడు నన్నేమీ చేయజాలడు అన్నట్లుగా పరుషముగా మాట్లాడాడు .

.

ఖరుడి హత్యకు ప్రతీకారముగా ఆతడి భార్యను ఎత్తుకొని రావలసిందే అని పట్టుబట్టాడు .

.

నేను చేయాలనుకున్న పని యొక్క గుణ దోష విచారము చెయ్యి అని నిన్ను అడుగలేదు .

.

నీకు రాజుతో మాటలాడే పద్ధతి తెలియకున్నది ,దోసిలి ఒగ్గి అతనికి ప్రతికూలముకాని హితకరములైన విషయాలను వినయముగా, మృదువుగా చెప్పవలె! 

.

ఎంత హితకరములైనా గౌరవము లేకుండా తిరస్కార బుద్ధితో  చెప్పినచో రాజు హర్షించడు..

.

రాజు అనగా అయిదుగురు దేవతల తెజోంశలు కలగలసినవాడు .

అగ్ని,ఇంద్ర,వరుణ,యమ,చంద్ర అంశలవి.

.

నీవు ఆ జ్ఞానము కోల్పోయి నీ ఇంటికి సహాయము నిమిత్తము స్వయముగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావు.

.

ఇది మంచిదా ,లేక చెడ్డదా నాకు ఈ పని చేయగల సామర్ధ్యమున్నదా లేదా అని నేను నిన్ను అడుగలేదు .

.

నేను తలపెట్టిన ఈ మహా కార్యమునకు నీ సహాయము అత్యంత ఆవశ్యకము కావున నీవు చేసి తీరవలె !

.

 ఇది నా ఆజ్ఞ!

.

నీవు చిత్రవిచిత్ర వర్ణములగల బంగారు లేడి రూపము ధరించు ,ఆ లేడి వంటి మీద వెండి చుక్కలు మెరుస్తూ ఉండాలి సుమా !

.

వారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించు ,నిన్ను చూసి ఆవిడకు ఆశ్చర్యము కలుగవలె !

.

.నిన్ను పట్టితెమ్మని ఆవిడ రాముని  పంపుతుంది ,నీవు అతనిని ఆశ్రమానికి బహు దూరముగా తీసుకొని పోయి "అయ్యో లక్ష్మణా ,అయ్యో సీతా " అని అరుపులుకూడా అరువు.

.

అది విని  సీత లక్ష్మణుని రాముని కొరకు పంపగలదు .వారిరువురూ ఆవిధముగా దూరముగా వెళ్ళిన పిదప అనాయాసముగా ఆమెను నేను ఎత్తుకొని రాగలను.

.

మారీచుడా నీవు ఈ పని చేసినట్లైన ఎడల నా రాజ్యములో సగ భాగము నీకిచ్చెదను. 

ఆలస్యముచేయక  బయలుదేరు నీ వెనుక రధముపై కూర్చుండి నేను అనుసరిస్తాను. 

.

ఈ విధముగా రాముని వంచించి యుద్ధము చేయకుండగనే సీతను పొంది కృతకృత్యుడనై లంకకు తిరిగి వెళ్ళేదను, 

.

నా ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసినట్లైనచొ ఇప్పుడే నిన్ను చంపి వేస్తాను ,రాజుకు ప్రతికూలముగా ఉండేవాడు సుఖముగా అభివృద్ది చెందజాలడు. 

.

నీచే బలాత్కారముగా నైనా ఈ పని చేయిస్తాను . నీ ఇష్టాయిష్టములతో నాకు పని లేదు..

.

నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును ,లేక మరణించకపోవచ్చును  కానీ నాతొ విరోధము పెట్టుకుంటే తక్షణమే మరణిస్తావు కావున నీకేది మంచిదో ఆలోచించి నిర్ణయించుకో! 

.

అని బెదిరించాడు రావణుడు!

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్..145

 రామాయణమ్..145 

.........

నేను ఒకప్పుడు వేయి ఏనుగుల బలముతో,పర్వతమంత ఆకారముతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్లి వారివారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని .

.

ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవము చెపుతాను విను .

.

ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్ధము దశరథ మహారాజు వద్దకు వెళ్లి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు .అందుకు ఆ రాజు వీడింకా పసిబాలుడు ,నా చతురంగబలాలు తీసుకొని నేనే వస్తాను అని అన్నాడు.

అందుకు మహర్షి నిరాకరించి ,నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులుకారు ,వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముని పంపు అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముని తెచ్చుకుని కాపలా పెట్టుకున్నాడు.

.

 రాముడికి అప్పటికింకా పసితనపు చాయలు పోలేదు విశాలమైన నేత్రాలు,శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా మొలవలేదు ,

.

ఒకటే వస్త్రము చుట్టుకొని ,జుట్టుముడిపెట్టుకొని బంగారుమాల ధరించి ,చిత్రముగా ఉన్న ధనస్సును చరుచుకుంటూ ఆశ్రమము వాకిట అటూఇటూ తిరుగుతున్నాడు.

.

నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏ మాత్రమూ తొట్రుపాటు,భయమూ లేకుండా ధనస్సుకు నారి కట్టాడు .

.

ఆ! వీడేమిచేస్తాడు బాలుడు అని లక్ష్యపెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక వద్దకు వెళ్ళాను .

.

 నాకు ఇప్పటికీ గుర్తు ! ఒకేఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నూరు యోజనముల దూరములోఉన్న సముద్రములో నన్ను పడవేసినది .

.

ఆ కరుణా సముద్రుడు ఎందుకు దయతలచాడో కానీ !నాకు తెలియదు ,నన్ను మాత్రము ప్రాణాలతో విడిచిపెట్టాడు.

.

సముద్రములో పడ్డ నేను కొంతసేపటికి తేరుకొని బ్రతుకుజీవుడా అని లంకకు చేరుకున్నాను.

.

అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని యుండలేదు.

.

ఈ మధ్య కాలములో జరిగిన సంఘటన ఒకటి చెపుతాను విను .

.

నేను మనవాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగ రూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను .

.

భార్యా ,తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటము చూశాను .

.

వాళ్ళను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానము గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమ ప్రాంతములోనికి చేరుకున్నాము.

.

ఎట్లా పసిగాట్టాడో పసిగట్టాడు రాముడు !

.

మూడు బాణాలు ధనస్సుకు తొడిగాడు 

.

అవి మాకోసమే అని అర్ధమయ్యింది

.

 అవి ధనుస్సు నుండి వెలువడేలోగానే నేను తప్పించుకున్నాను .

.

పాపము వారిరువురికీ రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారినపడి మృతులయ్యారు.

.

కాబట్టి రావణా ,హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన ఎందుకు పెట్టుకుంటావు ,నీవాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ ప్రతి రోజూ ఆనందముగా ఉంటున్నారు ,వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు .

.

నిష్కారణముగా రాముడికి అపకారము చేసి ఆయన కోపానికి గురి కాకు .

.

అవివేకంతో వ్యవహరించి మొత్తము రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు !అని పలికాడు మారీచుడు.

.

వూటుకూరు జానకిరామారావు

EFFECTIVE DECISION MAKING FO R " GUESTS" to Your House. (

 "EFFECTIVE  DECISION MAKING  FO R " GUESTS"  to Your House.  ( సమర్ధవంతమైన నిర్ణయాన్ని (తీర్మానము) అతిధులు మీ ఇంటికి వచ్చి సమయంలో ).                "సమర్పణ: "మజుందార్, బెంగుళూరు" సెల్: 87925- 86125.        "నేడు ఆధునిక యుగంలో సంప్రదాయాలు -- సనాతన ధర్మం యొక్క లక్షణాలు మేళవింపుతో మార్పు చేర్పులతో నూతన పందాలతో కూడి ఒక సమర్థవంతమైన నిర్ణయాన్ని ప్రకటించుటకు ముందు నేను తీసుకునే చర్యలు,  జాగర్తలు బాధ్యతలు ప్రవర్తనా నియమావళి ఎలా ఏర్పాటు చేసుకుంటే అతిథులను మనం మెప్పించే విధంగా ఆనందించగలిగే  , ఈ విధంగా వ్యవస్థతో కూడిన " ఆత్మసంతృప్తి" , ఆనందము, అక్షరాలతో, మాటలతో, చెప్పలేనిది.   ఇది మీ యొక్క ఉన్నత విలువలు, ఆడంబరాలు , మీ సంప్రదాయ రీతులు, మీ శ్రద్ధ మీ కుటుంబ సభ్యులు,  నడవడి, క్రమశిక్షణ, కలుపుగోలుతనం, ఆప్యాయతలను, ప్రతిబింబింప చేసిన, వారు మీ కుటుంబ సభ్యులను అంచనా వేయగలరు.   వారి హృదయ ఫలక మందు, గుర్తు నుండులాగున, ప్రవర్తన, సృజనాత్మకత, వెలువడు లాగున మీరు ప్రవర్తించిన, శైలి, అతిథులను కట్టి పడవేయును.   వచ్చే బంధువులకు ఎటువంటి, వంటలు చేయాలి, "Conflict" (సంఘర్షణ) మీ మదిలో, మీ జీవిత భాగస్వామి మది యందు ప్రారంభమగును.  వారికి స్వీట్ అంటే ఇష్టమా? హాట్ అంటే ఇష్టమా? అమెరికాలో దొరకనివి చెయ్యాలని, వాళ్లకు ఇష్టమైనవి, తినిపించాలని, ఆరాటం, తపన, అన్వేషణ ప్రారంభం అవుతుంది.  బంధు వర్గాల నుండి సమాచారం సేకరించుట చేస్తాము కదా!   ఈ క్రింది విధముగా మీ మనసు, మీ మైండ్ సెట్, పని చేయును.  వాటి గురించి వివరంగా విశధంగా కొన్ని ముఖ్య విషయాలు ముచ్చటించుకుందాం!    1)"వచ్చేవారు రక్త బంధువులా?  లేదా స్నేహితులా?  వారు ఎన్ని రోజులు ఇండియాలో గడపగలరు.   వారు మన ఊరి వైపు వచ్చే అవకాశం ఉన్నదా? లేదా  ఆ తేదీన యందు మీరు ప్రత్యేకంగా లేక ఏమైనా ట్రైన్ టికెట్స్ కొనుక్కుని వెళ్లి పోవడం లేదు కదా!   వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు?  రాత్రి మజిలి చేస్తారా?  పగలు లంచ్ చేసి ఈవెనింగ్ వెళ్ళిపోతారా? రాత్రికి ఉంటారా?  "సంఘర్షణ"మీ మనసు పడగలదు.  మీ భార్యకు ముందు చెప్పి అనుమతి పొంది ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని రూఢీ అయిన తరువాత ఆలోచించి ,పరిశీలించి, మీ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా నిర్ణయాలు  ఉదయం పూట ప్రశాంత వాతావరణంలో చేయండి, నిర్ణయాలు ప్రకటించండి.             2) " మీ కుటుంబ సభ్యులు అందరూ కలసి ముందుగా వాళ్ల గురించి మాట్లాడుకోండి, వారితో మీ బంధువర్గము (స్నేహితుల) వారి పేర్లు, పిల్లల పేర్లు అన్ని చెప్పుకుని మాట్లాడుకోండి.  అవసరమైన మీ  పిల్లలు  క్రియేటివిటీ గా "వెల్కమ్ బోర్డు" "తయారు చేయగలరు  కూడా!                       3)" మీ మనసుకు భీమా రక్షణ గా  --  మీ "మైండ్ "ను పెట్టుకోండి. ఒకసారి మీ నిర్ణయాలకు  ప్రకృతి, టెక్నాలజీ, సహకరించాలి  కూడా! "తుఫానులు ,వరదలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఉంటే  వాటికి ప్రత్యేయ మార్గాలు అన్వేషించండి (కరెంటు ఉదయం పూట ఉంటుందా? లేదా మిక్సి, గ్రైండర్, గ్యాస్, గ్రీజర్ ,నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటే వాటిని అధిగమించడం ఎలా) మీరు, మీకు అనువైన మార్గాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు" మీరు ice-cream,Fooding, లాంటివి చేద్దాం అనుకుంటారు  కరెంటు ఉండదు ఎలా?  అప్పుడు మీరు చేయు పదార్థాలకు, వేరేవి మార్చి చేసుకోవలెను. నిర్ణయాలను మార్చుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 4)" Menu" నిర్ణయించుకున్నాక ఫిక్స్ అవ్వండి.  వాటిని మార్చకండి, అవసరము అయినా యాడ్ చేయవచ్చు By chance.                  .5)"low cost quality" వాడకండి, మీ బడ్జెట్ కు తగిన విధంగా ఏర్పాటు చేసుకోండి. మీ చిరునవ్వు మందహాసం, మీ విలువైన ఆభరణం అని గుర్తుంచుకొని ప్రవర్తించండి.               6)" విసుగు ,కోపం, హడావడి, వాదులాడుకొనుట, చేయరాదు.  అలాగని అతి వినయము పనికిరాదు.   అవసరమైన చుట్టుపక్కల వారి సహాయ, సహకారములు పొందండి, మీరు ఖాళీ సమయంలో కూడా ఎవరికైనా సహాయం చేయుటకు సిద్ధంగా ఉండండి.                     7)"మీ  ఇంటిని చూసి తరువాత ఇల్లాలిని చూడమన్నారు.   కనుక మీ ఇంటిని రూమ్ స్ప్రే చేయండి , "Flower Vas," ect., వస్తువులను ఎక్కడ వాటిని అక్కడ వుండే లాగున మీప్రత్యేకత శైలి లో కనపరచండి.  (మీరు Interior decor)   8)"మీ Plan, Clarity గా ఉండాలి.   ఎవరినీ బాధ , ఇబ్బంది పెట్టేది గా  కూడదు,".  Convinent  గా, అధికార స్వరంతో కాకుండా ఆప్యాయతతో, మీ భార్యతో కలసి డిస్కస్ చేసి బోధ పరచి ఒప్పించి, మెప్పించి, ఈ విధంగా నిర్ణయాలు ఉండాలి.  ఇష్టంతో చేస్తే కష్టంగా ఏది ఉండదు.  9)" మీరు ఒక "conclusion వచ్చి తీరాలి.  ఎందుకంటే మీకు "options" చాలా ఉండును.                  10)" మీ నిర్ణయాలలో ఎప్పుడు భయపడి కానీ, కోపంతో కానీ, ఆవేశంలో కానీ, సంతోషము లో కానీ, ఒత్తిడితో కానీ, దుఃఖం లో కానీ, మొహమాటపడి, వాగ్దానాలు ఎప్పుడూ చేయకండి.  ఒకవేళ బంధాలు తెగిపోతాయి అంటే తప్ప, దానికి బాధ్యులు మీరే అవుతారని అనిపిస్తే, ఆలోచించండి,.            11)" communications లో ఎలాంటి లోపాలు ఉండరాదు.  మీ భాష, ఉచ్చారణ, స్పష్టంగా తగిన విధంగా చెప్పాలి, అది ఎదుటి వారికి అర్థమయ్యేలా!              12)" మీరు మీ కుటుంబ సభ్యులు డ్రెస్ కోడ్ ముందే సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి.  అది సంప్రదాయబద్దమైనది.  మీ శరీర రంగును బట్టి,  ఆకారములో బట్టి, ప్రత్యేక ఆకర్షణ గా ఉండు లాగున, ఎలాంటి మేకప్ లేకుండా, ఉండండి,"Simple dress high  Thinking" .                 13)"మీరు ఉన్నత విలువలు పాటిస్తున్నారు ,మీరు ఆదర్శ జీవితం గడిపేవారు, సమయపాలన, ఆత్మస్థైర్యం, పట్టుదల, సమయస్ఫూర్తి, సందర్భానుసారంగా మాట్లాడే మాట, ఆచితూచి వేసే, మృదుస్వభావం లు, మీ పిల్లల పెంపకంలో తీసుకున్న క్రమశిక్షణ చెప్పుకోతగ్గవి, వాటిని మీరు చెప్పకుండానే ఎదుటివారు అర్ధం చేసుకునే రీతిలో మీ ప్రవర్తన ఉండాలి.         14)" ఇతరులు ఎవరిని నిందించకండి, ఒకవేళ వాళ్ళు ఎవరి గురించి అయినా చెడుగా చెప్పినా మీరు ఆ చెడును పెద్దది చేసి చెప్పకండి.   మౌనంగా ఉండండి, తటస్థంగా ఉండండి, ఎటువంటి పరిస్థితులలోనూ మీరు "నెగిటివ్ థింకింగ్" చేయుట గాని, ఆచరించుట గానీ చెయ్యకండి. " మంచిని గట్టిగా చెప్పండి చెడును చెవిలో చెప్పమన్నారు"  15)"మీ పిల్లలు సంగీతం, నృత్యం, శ్లోకాలు, డ్రాయింగ్, క్రియేటివిటీ ఆటలు, వాళ్ల గోల్స్ వారిని వారితో పాలు పంచుకునే విధంగా "Involve" చేయండి. వారిచే కాఫీ ,మంచినీరు, ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు సహాయపడే లాగున చేయించండి.               16)" వచ్చిన వారి నుండి మీకు ఉపయోగపడే  విషయ సేకరణ, information collect,.          Gyaadaring information, Technology,  knowledge, సంబంధించినది తెలుసుకోండి.           17)"మోటివేషనల్"  గా ఉండేవి అంతర్గత ప్రేరణ ద్వారా బహిర్గత ప్రేరణ గలవి ఉండగలవు. Empathy తో ఎదుటి వారి మనసు అర్థం చేసుకుని వారి స్థితి నుండి మీరు ఆలోచించుట చాలా ముఖ్యము.              18)" కొత్త చోటినుండి ఇప్పుడు మన ఇంటికి వారు వచ్చారు వారిని, x" ray copy మీరు తీయగలగాలి.  వారు వీకెండ్లో ఏమి చేస్తారు అనే విషయం కాదు, వారి నుండి మనము ఏమి నేర్చుకున్నాము అనేది ముఖ్యం! ఏ విషయాలు వదలాలి, కూడా ముఖ్యం.           19)" వచ్చినవారికి "రిటర్న్ గిఫ్ట్స్" రూపంలో మీ స్థాయిని బట్టి మన సంస్కృతి ప్రతిబింబించేలా, తక్కువ బరువు గల వి, సృజనాత్మకమైన వి, కళాత్మకమైన వి, గుర్తించి ఇచ్చిన వారు తీసుకెళ్ళు ట కు ఇబ్బంది పడరు.          20)" అతిధిని మన ఇంటికి వచ్చిన వారిని పంపుటకు ఎంత వరకు వెళ్లి వదిలి పెట్టాలి అనేది మన శాస్త్రముల ప్రకారము ఆలోచించండి,  దానికి తగిన విధముగా మీరు దగ్గర ఉండి కారు వరకు వెళ్ళి, చిరునవ్వుతో పంపిన వారు మీ యందు ప్రత్యేక ముగా, అభిమానము పెట్టు కుం టారు సుమా!   (సశేషం)          "సర్వేజనా సుఖినోభవంతు"  జై భారత్,

*శిక్ష*

 *శిక్ష*    


*ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు* 


*15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు* 


*ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు*


*అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు.*


*దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.*


*20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.*


*అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.*


*దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...*


*ఒకరోజు దొరికిపోయాడు.*


*మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.*


*మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ    రోజును చెప్పేసారు*


*చివరగా  అతని కోరిక ఏమని అడగగా*


 *తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు*  


*అతని కోరిక మేరకు వారిని పిలిపించారు* 


*కన్నవాళ్ళు కదా  కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు*  


*పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు తల్లి తండ్రులు*


*అప్పుడు అతను వారు కాదు* *నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు* 


 *నా పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు    మండలించాడని చెప్పగానే బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు.* *14 ఏళ్ల వయసు లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు వచ్చారు.*

*అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.*


*అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం*


*ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు*


 *చిన్నప్పుడు తప్పు చేయగానే  ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు*  


*చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి* *అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..*

*పిల్లల్ని చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వారి అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు.*

కాలభైరవ జయంతి

 *డిసెంబర్ 7 ...*


*కాలభైరవ జయంతి విశిష్టత*


ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. 


ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు.


 సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది.


 కాలభైరవుని విశిష్టత అనేది ప్రస్తుత రోజుల్లో తెలియదు.


 కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.


 ఆయనను పూజించినచో కాలమును మార్చ లేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.


ముఖ్యంగా 

అసితాంగ భైరవుడు....

రురు భైరవుడు...

చండ భైరవుడు ...

క్రోధ భైరవుడు...

ఉన్మత్త భైరవుడు ...

కపాల భైరవుడు ....

భీషణ భైరవుడు ...

సంహార భైరవుడు...

 అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.


*కాలభైరవ వృత్తాంతం*


పరమశివుడిని అవమాన పరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.


 క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. 


అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు. 


తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.


శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే 

సకల గ్రహదోషాలు... అపమృత్యు దోషాలు... తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.


దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.


*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*

*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*


*పూజా విధానం:*


శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు.


 కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. 


శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. 


శనివారం , 

మంగళవారాలు 

కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. 


పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి.


 కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. 


శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.


పూజను చేయలేనివారు 


*శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు* పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.



*కాలభైరవాష్టకం*



*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*

*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*


*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*

*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*


*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*

*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*


*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*

*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*


*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*

*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*


*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*

*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*


*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*

*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*


*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*

*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*


*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*

*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*



*కాలభైరవ అష్టమి – భైరవ పూజ ఫలితాలు*

 

సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.


కాలము  అనబడే కుక్కను వాహనంగా  కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు.


 నుదుటున విభూతి రేఖలను ధరించి , 

నాగు పాముని మొలత్రాడుగా చుట్టుకుని…  

గద , 

త్రిశూలం , 

సర్పం , 

పాత్ర చేత బట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం.  


ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.


శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో  అభిశేకము చేయించి ,

 గారెలతో మాల వేసి… 

కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో 

జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో  ఆయుష్షు పెరుగును.


అంతేకాక  ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , 

భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల 

అష్టమ , 

అర్ధాష్టమ , 

ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.


శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి . భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం  తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.



*కాలభైరవ గాయత్రి …..*


*ఓం కాల కాలాయ విద్మహే*

*కాలాతీతాయ ధీమహి*

*తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥*



*కాలభైరవ జయంతి పై ముఖ్యమైన  సమయాలు*


సూర్యోదయం

డిసెంబర్ 07, 2020 

6:47 అపరాహ్నం


సూర్యాస్తమయం

డిసెంబర్ 07, 2020 

5:37 అపరాహ్నం


అష్టమి తిథి ప్రారంభమైంది డిసెంబర్ 07, 2020 

6:47 అపరాహ్నం


అష్టమి తిథి ముగుస్తుంది డిసెంబర్ 08, 2020 

5:17 అపరాహ్నం



మీ దగ్గరగా ఉన్న బ్రహ్మణోత్తములను కలవాలని కోరుతూ


మీ

జగదీష్

70759 66111


*_రేపు కాలభైరవ జయంతి_* 

🕉️🌞🌎🏵️🌼🚩


*కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం | పూజా విధానం*


 *ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది* *కుక్క(శునకం)* అని *తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.* 


 *ముఖ్యంగా* 

 *అసితాంగ భైరవుడు , రురు భైరవుడు ,* 

 *చండ భైరవుడు ,* 

 *క్రోధ భైరవుడు ,* 

 *ఉన్మత్త భైరవుడు ,* 

 *కపాల భైరవుడు ,* 

 *భీషణ భైరవుడు ,* 

 *సంహార భైరవుడు , అనే* *ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు* *దర్శనమిస్తూ ఉంటాడు.* 



*కాలభైరవ వృత్తాంతం*



 *పరమశివుడిని* *అవమానపరచిన* *బ్రహ్మదేవుడిపై శివుడు* *ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.* 


 *శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యు దోషాలు తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.* 


 *దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.* 


*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*

*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*


*పూజా విధానం:*


 *శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం , మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.* 


 *పూజను చేయలేనివారు* *శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు* *పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.* 



*కాలభైరవాష్టకం*



*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*

*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*


*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*

*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*


*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*

*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*


*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*

*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*


*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*

*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*


*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*

*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*


*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*

*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*


*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*

*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*


*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*

*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*



*కాలభైరవ అష్టమి – భైరవ పూజ ఫలితాలు*

 

 *సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.* 


 *కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక. ఈయనను* *కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి , నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని… గద , త్రిశూలం , సర్పం , పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.* 


 *శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిశేకము చేయించి , గారెలతో మాల వేసి… కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్షు పెరుగును.* 


 *అంతేకాక ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ , అర్ధాష్టమ , ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.* 


 *శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి . భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.* 



*కాలభైరవ గాయత్రి …..*


*ఓం కాల కాలాయ విద్మహే*

*కాలాతీతాయ ధీమహి*

*తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥*




*కాలభైరవ జయంతి పై ముఖ్యమైన సమయాలు*


 *సూర్యోదయం డిసెంబర్* *07,2020 6:47 అపరాహ్నం* 

 *సూర్యాస్తమయం డిసెంబర్ 07, 2020 5:37 అపరాహ్నం* 

 *అష్టమి తిథి ప్రారంభమైంది డిసెంబర్ 07, 2020 6:47 అపరాహ్నం* 

 *అష్టమి తిథి ముగుస్తుంది డిసెంబర్ 08, 2020 5:17 అపరాహ్నం* 




🕉️🌞🌎🏵️🌼🚩

మనోనిగ్రహం

 మనోనిగ్రహం.....


🍁🍁🍁🍁


పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు. అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి.


"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."


శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు...


"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం.

ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. "కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."


నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోర్మెలు దాగి ఉంటాయి. ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా.. అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది.


ఆ విధంగా కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొటే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి."


ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. రామకృష్ణుల మనస్సులో కూడా అవి మెదలకపోలేదు. ఆయన ఇలా జ్ఞాపకం చేసుకున్నారు..


"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు. భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."


ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు. ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..


రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...


"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి.. హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి, 'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు...



🍁🍁🍁🍁

దేవల మహర్షి*

 *📖 మన ఇతిహాసాలు 📓*



*దేవల మహర్షి*



దేవల మహర్షి హిందూమతం లోని, ఋషులు యందు ఒక గొప్ప ఋషి.


*జన్మవృత్తాంతము*



దేవ మనువు నకు ప్రజాపతి అను కుమారుడు కలిగెను. ఈ ప్రజా పతికి ధూమ్ర, బ్రహ్మవిద్య, మనస్విని, రతి, శ్వాస, శాండిలి, ప్రభాత అను ఏడుగురు భార్యల వలన ధరుడు, ధృవుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు మరియు ప్రభానుడు అను ఎనమండుగురు కుమారులు కలిగారు. ఈ ఎనమండుగురు పుత్రులు తదుపరి అష్టవసువులుగా ప్రసిద్ధి చెందినారు.

ప్రజాపతి మరియు ప్రభాత లకు కలిగిన పుత్రుడు ప్రత్యూషుడు. ప్రత్యూషునకు వివాహము చేసుకొనిన తదుపరి ఇరువురు కుమారులను పొందెను. అందులో పెద్దవాడు దేవలుడు, రెండవ సంతానము విభువు.

దేవలుడు శరీరము నలుపు వర్ణము కలిగి ఉండుటచే అతనికి అసితుడు అని పేరు కూడా తదుపరి వచ్చింది.

ఋక్సంహితను దర్శించాడు.


*మహాభారతం*


ఆవిధముగా తపస్సు చేస్తున్నధృతరాష్ట్రుడి వద్దకు నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజాయనుడు అను మహర్షులు వచ్చారు. వారితో శతాయువు కూడా వచ్చాడు. కుంతి వారికి అతిథిసత్కారాలు చేసింది. తరువాత వారు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు వారికి సంభ్రమంతో నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించాడు.


*దేవల మహర్షి శాపం*


యోऽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్

ముక్తో దేవలశాపేన హూహూర్గన్ధర్వసత్తమః


దేవల మహర్షి శాపం వలన హుహు అనే పేరు గల గంధర్వుడు మొసలిగా పుట్టాడు.


*ప్రస్తావన*


దేవల మహర్షి నారదుడు మరియు వ్యాసుడు వంటి వారి ద్వారా ఒక గొప్ప అధికారికంగా గుర్తించబడటమే కాకుండా మరియు భగవద్గీతలో అర్జునుడు ద్వారా కూడా దేవల మహర్షి పేరు పేర్కొన బడింది.


సంప్రదాయం ప్రకారం, దేవల మహర్షి పత్తి వస్త్రం నేత నేసిన మొదటి వ్యక్తి మరియు దైవము శివుడుకు ఇచ్చిన వాడు. అప్పటి వరకు ఎవరయిననూ సరే ఈ సమయంలో వరకు వస్త్రముగా జంతు చర్మం ఉపయోగిస్తూ ఉండే వారు. దేవల మహర్షి ఒకనాడు మహారాజుకు వస్త్రం తీసుకొని వెళ్ళుతున్నప్పుడు, రాక్షసులు గుంపు అతనిని దాడి చేసేందుకు వచ్చింది.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కథ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*🐠చేప పాట్లు🦈*


అనగనగా ఒక చెరువులో కొన్ని చేపలు ఉండేవి. ఒక రోజు ఒక అబ్బాయి ఆ చేపలలో నుంచి చిన్నచేపను పట్టుకున్నాడు. దానిని తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న తొట్టెలో కొంతకాలం పెంచాడు. అది సహజమైన వాతావరణంలో పెరిగితేనే సంతోషంగా ఉంటుందని ఎవరో చెప్పడంతో దానిని తిరిగి అదే చెరువులో వదిలేశాడు. ఆ చేప పిల్ల తిరిగి తనకు స్వేచ్ఛ దొరికినందుకు, తనవాళ్లను కలుసుకున్నందుకు చాలా సంతోషించింది. కానీ అది తిరిగి వచ్చిన కొన్నిరోజులకే ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. వేసవి కాలంలో ఎండలు గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో వేడికి నీరు ఆవిరై చెరువులో నీళ్లు బాగా తగ్గాయి.


చేపపిల్లకు ఆ వేడిని తట్టుకోవడం కష్టమైంది. మిగిలిన చేపలు మాత్రం వేడిని తట్టుకోగలిగాయి. ‘‘నేను నీడ పట్టున హాయిగా ఉండేదాన్ని. అనవసరంగా మళ్లీ ఈ చెరువులో వచ్చి పడ్డాను. అక్కడే ఉంటే చల్లగా, హాయిగా ఉండేదాన్ని’’ అని బాధ పడసాగింది. అది గమనించిన ఒక పెద్దచేప, దాని బాధనంతా ఓపికగా విని అర్థం చేసుకుంది. ‘‘ఏదో ఒక రకంగా నన్ను తిరిగి ఇంతకు ముందు ఉన్న చోటికే పంపించేయండి’’ అని పెద్దచేపను బతిమిలాడింది చిన్నచేప.


‘‘ఈ వేడి ఎంతో కాలం ఉండదు. కొన్నిరోజులు కష్టపడవలసి వస్తుందని నువ్వు జీవితమంతా ఎక్కడో బందీగా ఉంటావా? స్వేచ్ఛ కోసం ఈ మాత్రం ఇబ్బందులను కూడా భరించలేని నువ్వు మా మధ్య ఉండక్కర్లేదు’’ అని చివాట్లు పెట్టింది. అప్పుడు చిన్న చేప ‘‘అయితే నేను వెళ్లను. ఇక్కడే ఉంటాను’’ అంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వర్షాలు కురిశాయి. చెరువులో నీళ్లు పెరిగాయి. వేడంతా తగ్గిపోయింది. తొందరపడి వెళ్లిపోకుండా అక్కడే ఉన్నందుకు చిన్నచేప చాలా సంతోషించింది.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

consuming poisons

 You might be surprised to know that unknowingly you are consuming poisons in your daily meal. Forget getting nutrients from these items, you end up troubling your health by consuming these food items. White rice, pasteurized cow milk, refined salt and refined sugar are the 4 white poisons, which are not good for your health. As they don’t have the right amount of protein, vitamins or minerals to keep your body healthy. Moreover, they increase the risk of developing other diseases like hypertension and diabetes. It has also been found via research that eating white rice increases the risk of diabetes by 17 percent.


Pasteurized Cow Milk: The only good thing about this milk is that it has a longer life. The process of pasteurization keeps the milk good for a longer period, but harms its nutritive value. It removes enzymes, vitamin A, B 12 and C from the milk. The process also transfers hormones and antibiotics into the milk. Researchers have found that the process also destroys essential and good bacteria like lactobacillus acidophilus. Moreover, about 20% of iodinegets removed from the milk and thus after consuming it, you are more likely to develop constipation.


White or Refined Rice: The process of refining rice leads to the removal of the outer layer and germ from it. The rice is left with endosperm, only. This layer contains starch in a huge quantity which can increase your blood sugar or glucose levels to a great extent.


Refined Sugar: White sugar or refined one is full of chemicals. It has no nutritional value. The chemical is derived from sugar cane or beet. Then, the juice of this substance is extracted to get fibre free sugar. The juice is mixed with lime during the refining process. This kills all vitamins present in the juice. Calcium sulphate and sulphuric acid are also used for bleaching of the sugar. This is done to make the sugar look more white than natural.


Refined Salt: Normal table salt contains iodine. This is needed for a healthy body. But refining of salt removes iodine from the salt. Fluorides are added during the process of refining. The fluorides are bad when consumed in excess. Consumption of refined salt also increases blood pressure.


🙏 Jai Gaumata 🙏

www.kynmtrust.org

www.mylo.co.in

అంబరీషుడు

 "అంబరీషుడు"  మహారాజు పాత్ర  గురించి తెలుసుకుందామా!  సేకరణలు:- "Mazumdar, బెంగుళూరు" cell:87925- 86125.         " వైవా సత్వ మనువు యొక్క కొడుకైనా నాభా గుడికి భాగవతం పుణ్య "అంబరీష మహారాజు" జన్మించెను.   సప్త దీపముల చే  కూడిన భూమండలాన్ని పరిపాలించు ఇస్తూ ప్రజల సుఖదుఃఖాలను చూస్తుండేవాడు.    అలాగే భగవంతు డన్న భగవద్ భక్తుల న్న, ఉత్తమమైన భక్తి శ్రద్ధ కలిగిన వాడు.   ఇత్తడి ప్రతి ఒక్క అవయము కూడా భగవంతుడు సేవకై యున్న వి.    ఈ రకంగా అంబరీష మహారాజు తన అన్ని కర్మలను యజ్ఞం నామక పరమాత్మునికి చేయు చుండెడి వాడు.   జ్ఞాని అయిన రాజు వశిష్ఠ గౌతమాది మహర్షి సరస్వతీ నదీ తీరాన, భగవంతుని అశ్వమేధ యాగములు చేసి ఆరాధించేవాడు.    ఇతడి రాజ్య ప్రజలు కూడా పరమాత్ముని గుణ గానము చేస్తూ స్వర్గాన్ని కూడా ఇష్టపడేవారు కాదు.   అంబరీషుడు శ్రీకృష్ణుని విశేషముగా ఆరాధించుటకు తన భార్యతో కూడా ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించచేను.    అలా ఒక నాడు ద్వాదశి రోజున ఈ అంబరీషుడు భగవంతుడిని నిష్ఠగా పూజించి అనేక మంది బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన భోజనము పెట్టి వారి ఆజ్ఞ చే పారాయణ చేయుటకు సిద్ధమై నాడు.  (భోజనం చేయుటకు).  అంతలో దుర్వాసముని ఆగ మించిరి.   వచ్చినటువంటి వారిని ఆధ్య పద్యముల చే ఆదరించి అతిథి సత్కారము ఆహ్వానించను.   అందుకు వారు మేము కాళింది నదికి పోయి వచ్చాము అని చెప్పి పోయిరి.    పరబ్రహ్మ ని (శ్రీహరిని ) ధ్యానం చేస్తూ కాలమును మరిచిపోయి నారు దుర్వాసులు.   ఎంతకీ తిరిగి రాని దుశ్వాసులను గూర్చి  ఎదురు చూచును  "అంబరీషుడు".   ద్వాదశి యొక్క అర్థ ముహూర్తము  మిగిలి ఉండగా బ్రాహ్మణులు చెప్పినట్లుగా జలపానము చేశాను.   ఏకాదశి ఉపవాస ఫలము ద్వాదశినాడు సరి అయిన సమయంలో పారాయణ చేస్తే నే లభించును.   అనంతరం కాళింది నది నుండి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన యొక్క దివ్య దృష్టి చే  అతిధి ని విడిచి పారాయణం చేసిన అంబరీషుడు ని చూసి కోపముతో " క్రూరియైన ఈ రాజు నేనే భగవద్భక్త డు అనే  గర్వము కలవా డు.   ఇతడు ఈ అధర్మమును చూడండి." అని తమ జాట జుటం నుండి ఒక అభిచారి  దేవతను సృష్టించి ,  అంబరీషుని సంహరించుటకు పంపిరి.   అంబరీషుడు ఖడ్గమును ధరించి ఎదురుగా వస్తున్న ఆ కృత్య దేవతను  చూసి భయపడక,. భగవత్ ధ్యానం చేశాను.    అప్పుడు శ్రీహరి చక్రాయుధ ము తన అగ్ని ద్వారాలతో ఈ దేవతను సంహరించి దుర్వాసుడి కూడా సంహరించుటకు బయలుదేరాను.   అది చూసి ఫాలో అయిన దుర్వాసుల దిక్కు ఆకాశం భూమి మొదలైన లోకాలను గూర్చి దానినుంచి ఆగకు స్వర్గలోకమున అనంతరం కైలాస పర్వతమున శివుడు అని ప్రార్ధించెను.    శివుడు కి ఆ సామర్ధ్యము లేనందున బ్రహ్మదేవుడు ని, చివరకు పరమాత్ముడిని ప్రార్ధించిరి.   అందులకు శ్రీహరి" నేను భక్త పరాధీనుడు కాబట్టి నీవు  ఆ Ambareeshudu నే" శరణు పొందుము"  అని పలికెను.   పరమాత్ముడు డీ మాటలు విని నా దుర్వాసులు  రాజునే శరణు పొందిరి.  ఆ అంబరీషుడు సుదర్శనము ను నానా విధములు గా  స్తుతించి, నమస్కరించి ఆ సుదర్శనము చే దుర్వాసుల కి విముక్తి కలిగించే ను.   తర్వాత దుర్వాసులు  భాగవతము డైన అంబరీ షుడు ని" నా ప్రాణములను రక్షించినందుకు కృతజ్ఞ డను నా అపరాధమును మన్నిచమని కో రెను. రాజు ఆ మునికి భోజనము చేయించి సాధరణముగా పంపెను.  అనంతరము ఇతడు కూడా భోజనము చేసి రుషి ని రక్షించిన సామర్ధ్యము నాదే అని చింతించక, అంతయు భగవంతుడిని క్రియనే అని తలచను.    ఇటువంటి భగవోత్తముడిని నిత్యము ప్రాతఃకాలమున మందు స్పం రిన్చిన వారి దుఃఖము లు నాశనమై , పరమాత్ముని అనుగ్రహ పాత్రులవుతారు.   ఇది అంతయు "ఏకాదశి" ప్రభావము వలననే మరువకూడదు సుమా!

గీర్వాణవాణి

 గీర్వాణవాణి 

  వ శ్లోకం.

 భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏


111. గురుపత్నీ రాజపత్నీ జ్యేష్ఠపత్నీ తథైవ చ

పత్నీ మాతా స్వమాతా చ పంచైతే మాతరస్మృతాః.


గురుని భార్య , రాజుగారి భార్య , అగ్రజుని భార్య , అత్తగారు , కన్నతల్లి ఈ ఐదుగురూ మాతృ పంచకం.

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 22 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 22 / Sri Devi Mahatyam - Durga Saptasati - 22 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 7 🌻*


122–123. దూత పలికెను: దేవీ ! నీవు గర్వంతో ఉన్నావు నా ఎదుట అలా మాట్లాడవద్దు. ఈ మూడులోకాలలో ఏ మగవాడు శుంభనిశుంభుల ఎదుట నిలువగలడు?


124. ఇతర రాక్షసుల ఎదుట కూడా దేవతలందరూ యుద్ధంలో నిలువజాలరే! ఇక దేవీ! నీ సంగతి ఏమి చెప్పను- స్త్రీవి. ఒంటరిదానవు!


125. ఇంద్రాది దేవతలందరూ శుంభాదుల ఎదుట నిలిచి పోరాడ జాలకపోయారు. స్త్రీవి నీవు ఎలా వారి ఎదుట నిలువగలవు?


126. మాట మీదనే శుంభనిశుంబుల వద్దకు పొమ్ము, తలపట్టి ఈడువబడే గౌరవం పొందకుందువు గాక!”


127-128. దేవి పలికెను : 

నీ మాటలు నిజమే. శుంభుడు బలవంతుడు; నిశుంభుడును మిక్కిలి పరాక్రమశాలి. (కాని) అనాలోచితంగా పూర్వమొనర్చిన శపథం ఉండగా నేను ఏం చేయగలను?


129. తిరిగి పోయి నేను ఇప్పుడు చెప్పినదంతా జాగ్రత్తగా రక్కసులటేనికి చెప్పు. ఏదియుక్తమో అది అతడు చేయు గాక.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో "దేవీ మాహాత్మ్యము" లో “దేవీ దూతసంవాదం” అనే పేరిటి పంచమాధ్యాయం సమాప్తం. 


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పురాణం

 _*🚩కార్తీక పురాణం🚩*_

 🚩 _*21 వ అధ్యాయము🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘


*పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట*


🕉️☘☘☘☘☘☘🕉️


ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు , కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను , అశ్వసైనికుడు అశ్వసైనికునితోను , గజసైనికుడు గజసైనికునితోను , పదాతులు పదాతి సైనికులతోను , మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ , గద , బాణ , పరశువు మొదలగు ఆయుధాలు ధరించి , ఒండొరుల ఢీ కొనుచు హుంకరించుకొనుచు , సింహ నాదములు చేసుకొనుచు , శూరత్వవీరత్వములను జూపుకోనుచు , భేరీ దుందుభులు వాయించుకొనుచు , శంఖములను పూరించుకొనుచు , ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు , తెగిన మొండెములు , తొండలు , తలలు , చేతులు - హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల , గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమై పోయెను. అయినను , మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో , పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.


దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి *"రాజా ! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే ఈ యుద్దమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఏరంగియు , నీవు చింతతో కృంగి పోవుటయేల ? శత్రురాజులను యుద్దములో జయించి , నీరాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేని , నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీకమాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన , స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి , భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు , శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక , రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకీ అపజయము కలిగినది ? గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు"* మని హితోపదేశము చేసెను.



*అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా |*

*యః స్మరే *త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ||*



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩