*యజమాని క్షేమాన్ని కోరుకునే బ్రాహ్మణుడు వెంటనే దక్షిణ తీసుకోవాలి....🙏*
శ్లో౹౹దక్షిణా విప్రముద్దిష్య తత్కాలంచే న్నదీయతే౹
ఏక రాత్రే వ్యతీతేతు తద్దానం ద్విగుణం భవేత్౹౹
మాసే శత గుణం ప్రోక్తం ద్విమాసేతు సహస్రకం౹
సంవత్సరే వ్యతీతేతు స దాతా నరకం వ్రజిత్౹౹
దాత్రా న దీయతే మూర్ఖో గ్రహీతాచ న యాచతే౹
ఉభౌ తౌ నరకం యాతౌ దాతా వ్యాధియుతో భవేత్౹౹
విప్రాణాం హింసనం కృత్వా వంశహానిం లభేద్ధ్రువం౹
ధనం లక్ష్మిం పరిత్యజ్య భిక్షకశ్చభవేద్ర్వజన్౹౹
- బ్రహ్మవైవర్త పురాణం
తాత్పర్యం:-
బ్రాహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిన దక్షిణ వెంటనే ఇవ్వాలి.
ఒకవేళ అలా ఇవ్వకపోతే..
ఒకరాత్రి గడిస్తే ఆ ఇవ్వవలసిన దానం రెట్టింపు అవుతుంది.
నెలకు నూరు రెట్లు అవుతుంది.
రెండునెలలకు వేయి రెట్లు అవుతుంది.
సంవత్సరం గడిస్తే ఆ దాత నరకాన్ని పొందుతాడు.ఇది నిశ్చయం.
ధనం,లక్ష్మీ వీటిని పోగొట్టుకుని వెళుతూ భిక్షకుడౌతాడు.
మూర్ఖుడైన దాత ఇవ్వకపోయినా..తీసుకునే బ్రాహ్మణుడు అడగకపోయినా ఇద్దరూ నరకానికి వెళతారు.
చివరకు దాత రోగగ్రస్తుడౌతాడు. బ్రాహ్మణుని హింసిస్తే వంశహాని జరుగుతుంది.🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి