6, డిసెంబర్ 2020, ఆదివారం

EFFECTIVE DECISION MAKING FO R " GUESTS" to Your House. (

 "EFFECTIVE  DECISION MAKING  FO R " GUESTS"  to Your House.  ( సమర్ధవంతమైన నిర్ణయాన్ని (తీర్మానము) అతిధులు మీ ఇంటికి వచ్చి సమయంలో ).                "సమర్పణ: "మజుందార్, బెంగుళూరు" సెల్: 87925- 86125.        "నేడు ఆధునిక యుగంలో సంప్రదాయాలు -- సనాతన ధర్మం యొక్క లక్షణాలు మేళవింపుతో మార్పు చేర్పులతో నూతన పందాలతో కూడి ఒక సమర్థవంతమైన నిర్ణయాన్ని ప్రకటించుటకు ముందు నేను తీసుకునే చర్యలు,  జాగర్తలు బాధ్యతలు ప్రవర్తనా నియమావళి ఎలా ఏర్పాటు చేసుకుంటే అతిథులను మనం మెప్పించే విధంగా ఆనందించగలిగే  , ఈ విధంగా వ్యవస్థతో కూడిన " ఆత్మసంతృప్తి" , ఆనందము, అక్షరాలతో, మాటలతో, చెప్పలేనిది.   ఇది మీ యొక్క ఉన్నత విలువలు, ఆడంబరాలు , మీ సంప్రదాయ రీతులు, మీ శ్రద్ధ మీ కుటుంబ సభ్యులు,  నడవడి, క్రమశిక్షణ, కలుపుగోలుతనం, ఆప్యాయతలను, ప్రతిబింబింప చేసిన, వారు మీ కుటుంబ సభ్యులను అంచనా వేయగలరు.   వారి హృదయ ఫలక మందు, గుర్తు నుండులాగున, ప్రవర్తన, సృజనాత్మకత, వెలువడు లాగున మీరు ప్రవర్తించిన, శైలి, అతిథులను కట్టి పడవేయును.   వచ్చే బంధువులకు ఎటువంటి, వంటలు చేయాలి, "Conflict" (సంఘర్షణ) మీ మదిలో, మీ జీవిత భాగస్వామి మది యందు ప్రారంభమగును.  వారికి స్వీట్ అంటే ఇష్టమా? హాట్ అంటే ఇష్టమా? అమెరికాలో దొరకనివి చెయ్యాలని, వాళ్లకు ఇష్టమైనవి, తినిపించాలని, ఆరాటం, తపన, అన్వేషణ ప్రారంభం అవుతుంది.  బంధు వర్గాల నుండి సమాచారం సేకరించుట చేస్తాము కదా!   ఈ క్రింది విధముగా మీ మనసు, మీ మైండ్ సెట్, పని చేయును.  వాటి గురించి వివరంగా విశధంగా కొన్ని ముఖ్య విషయాలు ముచ్చటించుకుందాం!    1)"వచ్చేవారు రక్త బంధువులా?  లేదా స్నేహితులా?  వారు ఎన్ని రోజులు ఇండియాలో గడపగలరు.   వారు మన ఊరి వైపు వచ్చే అవకాశం ఉన్నదా? లేదా  ఆ తేదీన యందు మీరు ప్రత్యేకంగా లేక ఏమైనా ట్రైన్ టికెట్స్ కొనుక్కుని వెళ్లి పోవడం లేదు కదా!   వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు?  రాత్రి మజిలి చేస్తారా?  పగలు లంచ్ చేసి ఈవెనింగ్ వెళ్ళిపోతారా? రాత్రికి ఉంటారా?  "సంఘర్షణ"మీ మనసు పడగలదు.  మీ భార్యకు ముందు చెప్పి అనుమతి పొంది ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని రూఢీ అయిన తరువాత ఆలోచించి ,పరిశీలించి, మీ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా నిర్ణయాలు  ఉదయం పూట ప్రశాంత వాతావరణంలో చేయండి, నిర్ణయాలు ప్రకటించండి.             2) " మీ కుటుంబ సభ్యులు అందరూ కలసి ముందుగా వాళ్ల గురించి మాట్లాడుకోండి, వారితో మీ బంధువర్గము (స్నేహితుల) వారి పేర్లు, పిల్లల పేర్లు అన్ని చెప్పుకుని మాట్లాడుకోండి.  అవసరమైన మీ  పిల్లలు  క్రియేటివిటీ గా "వెల్కమ్ బోర్డు" "తయారు చేయగలరు  కూడా!                       3)" మీ మనసుకు భీమా రక్షణ గా  --  మీ "మైండ్ "ను పెట్టుకోండి. ఒకసారి మీ నిర్ణయాలకు  ప్రకృతి, టెక్నాలజీ, సహకరించాలి  కూడా! "తుఫానులు ,వరదలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఉంటే  వాటికి ప్రత్యేయ మార్గాలు అన్వేషించండి (కరెంటు ఉదయం పూట ఉంటుందా? లేదా మిక్సి, గ్రైండర్, గ్యాస్, గ్రీజర్ ,నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటే వాటిని అధిగమించడం ఎలా) మీరు, మీకు అనువైన మార్గాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు" మీరు ice-cream,Fooding, లాంటివి చేద్దాం అనుకుంటారు  కరెంటు ఉండదు ఎలా?  అప్పుడు మీరు చేయు పదార్థాలకు, వేరేవి మార్చి చేసుకోవలెను. నిర్ణయాలను మార్చుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 4)" Menu" నిర్ణయించుకున్నాక ఫిక్స్ అవ్వండి.  వాటిని మార్చకండి, అవసరము అయినా యాడ్ చేయవచ్చు By chance.                  .5)"low cost quality" వాడకండి, మీ బడ్జెట్ కు తగిన విధంగా ఏర్పాటు చేసుకోండి. మీ చిరునవ్వు మందహాసం, మీ విలువైన ఆభరణం అని గుర్తుంచుకొని ప్రవర్తించండి.               6)" విసుగు ,కోపం, హడావడి, వాదులాడుకొనుట, చేయరాదు.  అలాగని అతి వినయము పనికిరాదు.   అవసరమైన చుట్టుపక్కల వారి సహాయ, సహకారములు పొందండి, మీరు ఖాళీ సమయంలో కూడా ఎవరికైనా సహాయం చేయుటకు సిద్ధంగా ఉండండి.                     7)"మీ  ఇంటిని చూసి తరువాత ఇల్లాలిని చూడమన్నారు.   కనుక మీ ఇంటిని రూమ్ స్ప్రే చేయండి , "Flower Vas," ect., వస్తువులను ఎక్కడ వాటిని అక్కడ వుండే లాగున మీప్రత్యేకత శైలి లో కనపరచండి.  (మీరు Interior decor)   8)"మీ Plan, Clarity గా ఉండాలి.   ఎవరినీ బాధ , ఇబ్బంది పెట్టేది గా  కూడదు,".  Convinent  గా, అధికార స్వరంతో కాకుండా ఆప్యాయతతో, మీ భార్యతో కలసి డిస్కస్ చేసి బోధ పరచి ఒప్పించి, మెప్పించి, ఈ విధంగా నిర్ణయాలు ఉండాలి.  ఇష్టంతో చేస్తే కష్టంగా ఏది ఉండదు.  9)" మీరు ఒక "conclusion వచ్చి తీరాలి.  ఎందుకంటే మీకు "options" చాలా ఉండును.                  10)" మీ నిర్ణయాలలో ఎప్పుడు భయపడి కానీ, కోపంతో కానీ, ఆవేశంలో కానీ, సంతోషము లో కానీ, ఒత్తిడితో కానీ, దుఃఖం లో కానీ, మొహమాటపడి, వాగ్దానాలు ఎప్పుడూ చేయకండి.  ఒకవేళ బంధాలు తెగిపోతాయి అంటే తప్ప, దానికి బాధ్యులు మీరే అవుతారని అనిపిస్తే, ఆలోచించండి,.            11)" communications లో ఎలాంటి లోపాలు ఉండరాదు.  మీ భాష, ఉచ్చారణ, స్పష్టంగా తగిన విధంగా చెప్పాలి, అది ఎదుటి వారికి అర్థమయ్యేలా!              12)" మీరు మీ కుటుంబ సభ్యులు డ్రెస్ కోడ్ ముందే సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి.  అది సంప్రదాయబద్దమైనది.  మీ శరీర రంగును బట్టి,  ఆకారములో బట్టి, ప్రత్యేక ఆకర్షణ గా ఉండు లాగున, ఎలాంటి మేకప్ లేకుండా, ఉండండి,"Simple dress high  Thinking" .                 13)"మీరు ఉన్నత విలువలు పాటిస్తున్నారు ,మీరు ఆదర్శ జీవితం గడిపేవారు, సమయపాలన, ఆత్మస్థైర్యం, పట్టుదల, సమయస్ఫూర్తి, సందర్భానుసారంగా మాట్లాడే మాట, ఆచితూచి వేసే, మృదుస్వభావం లు, మీ పిల్లల పెంపకంలో తీసుకున్న క్రమశిక్షణ చెప్పుకోతగ్గవి, వాటిని మీరు చెప్పకుండానే ఎదుటివారు అర్ధం చేసుకునే రీతిలో మీ ప్రవర్తన ఉండాలి.         14)" ఇతరులు ఎవరిని నిందించకండి, ఒకవేళ వాళ్ళు ఎవరి గురించి అయినా చెడుగా చెప్పినా మీరు ఆ చెడును పెద్దది చేసి చెప్పకండి.   మౌనంగా ఉండండి, తటస్థంగా ఉండండి, ఎటువంటి పరిస్థితులలోనూ మీరు "నెగిటివ్ థింకింగ్" చేయుట గాని, ఆచరించుట గానీ చెయ్యకండి. " మంచిని గట్టిగా చెప్పండి చెడును చెవిలో చెప్పమన్నారు"  15)"మీ పిల్లలు సంగీతం, నృత్యం, శ్లోకాలు, డ్రాయింగ్, క్రియేటివిటీ ఆటలు, వాళ్ల గోల్స్ వారిని వారితో పాలు పంచుకునే విధంగా "Involve" చేయండి. వారిచే కాఫీ ,మంచినీరు, ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు సహాయపడే లాగున చేయించండి.               16)" వచ్చిన వారి నుండి మీకు ఉపయోగపడే  విషయ సేకరణ, information collect,.          Gyaadaring information, Technology,  knowledge, సంబంధించినది తెలుసుకోండి.           17)"మోటివేషనల్"  గా ఉండేవి అంతర్గత ప్రేరణ ద్వారా బహిర్గత ప్రేరణ గలవి ఉండగలవు. Empathy తో ఎదుటి వారి మనసు అర్థం చేసుకుని వారి స్థితి నుండి మీరు ఆలోచించుట చాలా ముఖ్యము.              18)" కొత్త చోటినుండి ఇప్పుడు మన ఇంటికి వారు వచ్చారు వారిని, x" ray copy మీరు తీయగలగాలి.  వారు వీకెండ్లో ఏమి చేస్తారు అనే విషయం కాదు, వారి నుండి మనము ఏమి నేర్చుకున్నాము అనేది ముఖ్యం! ఏ విషయాలు వదలాలి, కూడా ముఖ్యం.           19)" వచ్చినవారికి "రిటర్న్ గిఫ్ట్స్" రూపంలో మీ స్థాయిని బట్టి మన సంస్కృతి ప్రతిబింబించేలా, తక్కువ బరువు గల వి, సృజనాత్మకమైన వి, కళాత్మకమైన వి, గుర్తించి ఇచ్చిన వారు తీసుకెళ్ళు ట కు ఇబ్బంది పడరు.          20)" అతిధిని మన ఇంటికి వచ్చిన వారిని పంపుటకు ఎంత వరకు వెళ్లి వదిలి పెట్టాలి అనేది మన శాస్త్రముల ప్రకారము ఆలోచించండి,  దానికి తగిన విధముగా మీరు దగ్గర ఉండి కారు వరకు వెళ్ళి, చిరునవ్వుతో పంపిన వారు మీ యందు ప్రత్యేక ముగా, అభిమానము పెట్టు కుం టారు సుమా!   (సశేషం)          "సర్వేజనా సుఖినోభవంతు"  జై భారత్,

కామెంట్‌లు లేవు: