6, డిసెంబర్ 2020, ఆదివారం

భగవద్గీత.గీతను

 మన లోపల ఒకడున్నాడు..అసలైన వాడు..

కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 మంది దొంగలు అడ్డుగా ఉన్నారు..కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్య అనే 6 దొంగలు..ఈ 6 మందిలో 4 దొంగల నుండి సులభంగా తప్పించుకోవచ్చు,కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించుకోవడం చాలా కష్టం..ఆ ఇద్దరు పెద్ద రౌడీలు..వాళ్ళే కామం,క్రోధం..ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..


" కామ ఏష క్రోధ ఏష రజో

  గుణ సముద్భవహ " 


ఈ కామం,క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు..ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి..అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor..ఇంకా మనం First floor కు రాలేదు..మనం Ground floor లో ఉన్నాం..


 మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.. అంటే మనం తమో గుణంలో ఉన్నాం..బద్దకం,అతి నిద్ర,ఆలస్యం,నిర్లక్ష్యం ఇవే తమో గుణం..ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..ఇంకా Ground floor లోనే ఉన్నాం..ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం..అలాంటిది ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 మంది దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది..


ఆ floor పేరు సత్వ గుణం..ఈ floor చాలా పెద్దగా ఉంటుంది..హాయిగా ఉంటుంది..ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..అయితే చిన్న సమస్య..ఇక్కడ ఒకే ఒక దొంగ ఉంటాడు..భయపడకండి..వాడు మంచి దొంగ..వాడు మీకు మంచి మాటలే చెబుతుంటాడు..మీకు Third floor కు దారి చూపిస్తాడు..ఆ floor పేరు శుద్ధ సాత్వికం..ఇదే చివరిది..ఇక్కడే మీరు అఖండమైన వెలుగులో కలిసిపోయింది..ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..అది వెలుగులకు వెలుగు,మహావెలుగు.చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift ఉంది.


ఆ Lift పేరే భగవద్గీత.గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ స త్వం వరకు మనం ప్రయాణం చేసి,చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..🌸🏵️🌸🏵️🌸

కామెంట్‌లు లేవు: