🌳🍁🌳🍁🌳🍁🌳🍁🌳మంత్రమును ఉచ్చరించేటప్పుడు వాయుమండలంలో ఒక విధమైన ప్రకంపనం ఉత్పన్నమవుతుంది. ఈ కంపన తరంగాలు వాయుమండలంలో ఈధర్ తత్వమాధ్యమంలో క్చణమాత్రం లోనే బ్రహ్మాండమంతా పరిభ్రమించి తనకు అనుకూలమైన తరంగాలలో సమ్మిలితమై ఒక పుంజంగా(ఒక రాశిగా) యేర్పడతాయి. ఈ పుంజం అత్యంత శక్తిశాలీనంగా ఉండి దీని ప్రభావం వల్ల అనుకున్న కోరిక నేరవేరటంగాని లేదా కార్యసాపల్యంగాని తేలిక అవుతుంది. మనం పలికే పదాలు కూడా ప్రేమతో పిలిచేటప్పుడు ఒకరకంగా, ఒక్కొక్క వ్యక్తిని విశేషం గా పిలిచేటప్పుడు ఇంకొకరకంగా వివిధ సమయాల్లో వివిధమైన ప్రభావం కలుగుతుంది. ఇదంతా ధ్వని యొక్క అద్భుతమే.
ధ్వనియొక్క ఈ అద్భుత విశేషం మనకి పాటల లో విశేషం గా కనిపిస్తుంది. ఈ ధ్వని ప్రభావం వలన సీల్, డాల్ఫిన్ వంటి చేపలు ఆకర్షింపబడి వేటగాళ్ళ బారిన పడతాయి. ఆ వలలో చిక్కుకుంటాయి. సంగీతం లో గోవుల క్చీరం అభివృద్ధి అవుతుంది. ఇది కూడా ప్రత్యక్షంగా జరుగుతున్నదే. పాములు, ఎలుకలు ఇంకా ఇతర వన్యప్రాణులు కూడా సంగీత ప్రభావం తో స్తబ్ధమై వశీభూతవుతాయి. 🍁🌳🍁🌳🍁🌳🍁🌳🍁🌳🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి