🍁🍁🍁🍁💐🍁🍁🍁🍁🍁
*విష్ణుసహస్రనామాలు సంస్కృతంలో ఉంటాయి కదా! మరి వాటి అర్థం తెలియకుండా చదువవచ్చునా?*
ఒక విష్ణు సహస్రనామమే కాదు, భగవంతుని అన్ని స్తోత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి.
భారతదేశ భాష, భారతీయుల భాష మొదట సంస్కృతమే. మనం ప్రపంచమంతా తిరుగుచు మన భాషను మరిచిపోతున్నాం. అర్థం తెలిసినా, తెలియకున్నా భగవంతుని నామాన్ని నోరార పలికితే చాలు అన్ని పాపాలు తొలగుతాయి. అన్ని కోరికలు తీరుతాయి. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుడు మందు వ్రాసిస్తారు. ఆ మాత్రను తెచ్చి వేసుకుంటాము.
ఆ మాత్ర ఎలా తయారుచేశారో, అందులో ఏయే ఔషదాలు ఉన్నవో మనకు తెలియవు. అయినా ఆ మాత్ర వేసుకుంటే మన జబ్బు నయమవుతుంది. అలాగే అర్థం తెలిసినా, తెలియకున్నా నామాన్ని పలికితే పాపం పోతుంది. కొన్ని రోజులు అదే పనిగా మందును వాడుతుంటే అందులో ఏమున్నదో తెలుసుకోవాలని అనుకుంటాం. అంతా కాకున్నా కొన్ని తెలుసుకుంటాం.
అలాగే కొన్ని రోజులు ఆ నామాలను పలుకుతుంటే దానికి అర్థమేమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. పెద్దలతో తెలుసుకుంటాం. భగవంతుని గుణాలను చెప్పేవే నామాలు.
‘యాని నామాని గౌణాని’ అని కదా చెప్పినది. నామమునకు అర్థము తెలిస్తే భగవంతుని గుణాలు తెలుస్తాయి.
ఆ గుణాలను భావించుకుంటూ నామాన్ని స్మరిస్తూ మరి కొంత ఆనందాన్ని పొందుతాం. భగవంతునిపై ప్రేమ కలుగుతుంది.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి