అన్ని కోర్టులకన్నా ఈ రోజుల్లో ఫామిలీ కోర్టులోనే లిటిగెంట్ పబ్లిక్కుతో కిట కిట లాడుతున్నది. అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కోర్టులు వున్నాయి ఇంకా అదనంగా కొత్త అదనపు కోర్టులు వస్తున్నాయి. నిజానికి రోజు రోజుకి పెరుగుతున్న తగాదాలన్నీ కుటుంబ తగాదాలే అంటే ఏమాత్రం అతిసేయోక్తి కాదు. అది విజయవాడలోని ఫామిలీ కోర్టు. జడ్జి రంగారావు గారు ఒక నడివయస్కుడు తనవల్ల ఎవరి కుటుంబం వీడిపోకూడదని భావించే వాడు. అంతేకాదు తనకి చాతనైనంతవరకు భార్య భర్తలని అన్ని విధాలా కలపాలని చూసే మనస్తత్వం వున్నవాడు. చట్టానికన్నా మానవత్వానికి మంచితనానికి విలువనిచ్చే స్వభావం అతనిది. భార్య భర్తలు చిన్న చిన్న వివాదాలతో విడిపోకూడదన్నది అతని ఫిలాసఫీ. ఒకరోజు మధ్యాన్నం ఒక కేసు వచ్చింది అది భార్య భర్తల విడాకుల కేసు. భార్య భర్తనించి విడాకులు కావాలని వేసిన కేసు. ఇద్దరి మద్య కౌన్సిలింగ్ కోసం సాయంత్రం తన ఛాంబరులో కేసు ఉంచుకున్నాడు.
భార్య డాక్టర్ కిరణ్మయి దాదాపు ముప్పే సంవత్సరాల వయస్సు ఉంటుంది. చామనచాయ కానీ చూడగానే ఆకర్షించే ముఖ వర్చస్సు, అందరితోటి కలిమిడిగా మాట్లాడే నైపుణ్యం వున్న మనిషి. నిజానికి తాను చేస్తున్న డాక్టరు వృత్తికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా వున్నాయి ఆమెలో. అందుకే ఆమెకు తన క్లినిక్లో క్షణం తీరిక ఉండదు. కన్సల్టేషన్ 300 రూపాయలు తీసుకున్న ఎవ్వరు వెనకాడకుండా ఆమె వద్దకే వస్తారు అంటే ఆమె హస్తవాసి మంచిదని విజయవాడ వాళ్ల నమ్మకం. ఎటువంటి రోగమైన తగ్గిస్తుందని మంచి పేరు వున్నది. అంతేకాదు తనకు చేతగాని కేసుని మంచి హాస్పిటల్కి రెఫెర్చేస్తుంది. ఎంతలేదన్నా రోజుకి కనీసం రెండు వందల మందికన్నా ఎక్కువ పేటెంట్లనే చూస్తుంది. అంటే రోజు ఆదాయం ఆరువేల పైనే. వాయిదాకి కోర్టుకి రావాలంటే ఆమెకు ఇష్టం ఉండదు. కోర్టులో హాజరు కాకుండా పెటేషన్ వేయంగానే విడాకులు మంజురు చేస్తే బాగుండునుకదా అని అనుకుంటుంది. ఈ రోజుల్లో అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కదా ఈ కేసులు కూడా ఆన్లైన్లో విచారిస్తే బాగుండును అనుకుంటుంది. దుర్మార్గుడైన భర్తతో ఎలాగో కాపురం చేయలేము. విడాకులకోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు తిరగాలి అన్నది ఆమె అభిప్రాయం. స్త్రీలు యెంత చదువుకున్నా యెంత పెద్ద హోదాలో వున్నా ఏదో తెలియని ఒక అభద్రతా భావం ఉంటుంది. దానానికి కారణం ఏదో ఎవరు చెప్పలేరు. ఎక్కడో అరకొరగా కొద్దీ మంది మాత్రమే ఈ సమాజంలో ఎదురు తిరిగి మనగలుగుతారు అటువంటి స్త్రీలను సమాజం గవురవించకపోగా వారిమీద లేనిపోని నిందలు వేస్తారు. నిజాముకన్నా అబద్ధం వేగంగా వెళుతుంది. నిజం నడుచుకుంటూ వెళితే అబద్ధం విమానంలో వెళుతుంది. కాబట్టి చాలామంది స్త్రీలు ఈ సమాజానికి భయపడి వారిలోని వేక్తిత్వాన్ని మరుగున పెట్టుకుంటారు. "నః స్త్రీ స్వతంత్ర మర్హతే" అని ఆడవారిని ఈ సమాజం కాలరాయాలని చూస్తుంది. నిజానికి స్త్రీని చులకనగా చూడమని మన చెరిత్ర చెప్పలేదు. మన భారతీయ సంప్రాదాయాలు స్త్రీలని గావురావించేవే కానీ చులకన చేసేవి కావు. భార్య భర్తల అనుబంధాన్ని సరిగా అర్ధం చేసుకోక పోవటంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిజానికి అందరు స్త్రీలు కానీ అందరు పురుషులు కాని చెడ్డవారు కారు. ఈసంఘంలో రెండే తెగలు వున్నాయి అవి బాధించే వారు భాద పడేవారు. అందులో నీవు ఎటు వున్నావన్నదే సమస్య. కొంతమంది స్త్రీలు తన భర్త మంచివాడు కాదని అనుకుంటారు. కానీ తన భర్త కన్నా దుర్మార్గుడు కనపడితే అప్పుడు తన భర్తే ఇంద్రుడు చంద్రుడు లాగ కనపడతాడు. ఒక వ్యక్తి మీద సరిగా ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రావటము మంచిది కాదు. కొందరు వేరే వాళ్ళు చెప్పేది వినకుండా వారి నిర్ణయం వారు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళే కాదు ఎదుటివారు కూడా బాధపడతారు. నిజానికి మన డాక్టర్ కిరణ్మయి చాలా మంచి మనిషి కానీ చెంద్రునిలో మచ్చ ఉన్నట్లు ఆమెలో వున్న లోపం ఎదుటివారిని సరిగా అర్ధం చేసుకోక పోవటం మాత్రమే. నిజానికి దీన్ని మనం లోపం అనకూడదు కానీ ఏంచేద్దాం ఆమెలో వున్న ఈ బలహీనతే ఈ రోజు తన భర్తతో విడాకులు తీసుకునే దాక తీసుకు వచ్చింది.
తారనాధ్ నిజానికి పేరుకు తగ్గ రూపం మనిషిని చూడంగానే మాట్లాడాలనిపించే వర్చస్సు అంతేకాదు మాట్లాడినా కొద్దీ వినాలనిపించేలాంటి వాగ్ధాటి కలవాడు. వెతికి చూసినా కూడా ఎటువంటి చెడ్డ లక్షణం కనపడదు అని అనక తప్పదు. తారనాధ్ చెడ్డవాడు అంటే కళ్ళు పోతాయ్ అంటారు అతనిగురించి తెలిసిన వాళ్ళు. నిజానికి ఎర్రని వాడు రూపసి చూసినాకొద్దీ చూడాలనిపించే రూపంఅతను బీటెక్ కంప్యూటర్స్ చదివి ఒక సాఫ్ట్ వేరు కంపెనీలో ప్రోగ్రామరుగా పనిచేస్తున్నాడు. తన జాబ్ పట్ల వున్న అంకిత భావం అతనిని ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉంచింది. నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తాడు చేతినిండా డబ్బు వున్నా భార్యతో సఖ్యత లేక మనిషి చిక్కి సగం అయ్యాడు. పెళ్లి కాకముందు చుసిన వాళ్ళు ఇప్పుడు అతనిని పోల్చుకోలేరు అంటే అతిసేయోక్తి కాదు. డబ్బుతో అన్ని కొనొచ్చు అని కొందరు అనుకుంటారు కానీ నిజానికి డబ్బుతో ఆనందాన్ని కొనలేమని తారనాద్ ని చుస్తే తెలుస్తుంది. ముప్పిమూడు సంవత్సరాల వయసుగలవాడిలాగా కనపడనే కనపడడు ఇంకా పాతికేళ్ల వాడంటే నమ్ముతారు. డాక్టర్ కిరణ్మయి తార నాధ్ లను చూస్తే ఎవరికైనా మేడు ఫర్ ఈచ్ ఆథార్ అనిపిస్తుంది.
పెళ్లైన కొత్తల్లో వాళ్లిదరు ఎంతోఅన్యోన్యంగా వుండేవాళ్ళు నిజానికి చూసేవాళ్లకు కళ్ళు కుట్టేవి అంటే నమ్మచ్చు. కానీ పెళ్లైన ఒక ఎడుకే వారిద్దరిమద్య మనస్పర్థలు మొదలైయ్యాయి అది కూడా నిజానికి చిన్న చిన్న విషయాలగూర్చి. నీ ఆఫీస్ 6 గంటలకి వదిలితే ఎనిమిదింటిదాకా ఎందుకు రాలేదు అని ఆమె అనేది. నేనేంచేయనే ట్రఫిక్కులో ఇరుక్కో పోయా అనేవాడు తార నాధ్ కాదు నీకు నామీద మోజు పోయింది అందుకే కావాలనే ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు అనేది ఆమె. ఆలా మొదలైన వాక్యుద్ధం చిలికి చిలికి గాలివానగామారి ఇద్దరు యెడ మొహం పెడ మొహం పెట్టుకునేదాకా వచ్చేది. ఒక్కొక్క రోజు వాళ్ళ గొడవలతో తిండి తినకుండా పడుకునేవారు. బాగా అలసి వచ్చిన తార నాధ్ కి వెంటనే నిద్ర పట్టేది అదికూడా తప్పే ఎందుకంటె నేను పక్కనున్న నీకు నిద్ర ఎలా పడుతుంది అంటే నీకు వేరే ఎవరితోటో సంబంధం వున్నది అనేది. ఆ మాటలు కూడా వినే అంత స్పృహలో అతను లేడు నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు అతను పక్క మీద కెక్కగానే అలసటతో ఉండటంతో నిద్ర పట్టేది. ఆడవారికి వాళ్ళ మాటే చెల్లలి ఎదుటి వాళ్ళ మాటలు అస్సలు వినరు అన్నట్లు ఆమె ప్రేవర్తించేది. మరుసటి రోజు ఉదయం మాట్లాడేది కాదు అలక పునాది ఆటను నానా యాతన పడి ఆమె అలక తీర్చే వాడు. మొగవాడు యధాలాపంగా ఏమైనా మాట యిస్తే చచ్చాడన్న మాటే ఎందుకంటె ఏదో జసలో పది తన మాట ప్రకారం నడుచుకోక పోతే మూడవ ప్రపంచ యుద్ధమే. ఒక్కో రోజు ఆఫిసులో పని తొందరగా అయి ఇంటికి ఐదింటికే వస్తే అదికూడా ఆమె తప్పు పట్టేది. నీ ప్రేయసి వెంటనే వదిలి పెట్టిందే అనేది. అమ్మ నాకు నీవు తప్ప వేరే ఎవరితోటి ఎలాంటి సంబంధం లేదు అంటే వింటేనా ససేమీరా వినదు మళ్ళి గొడవ మొదలు. ఇంట్లో గ్లాసులు కంచాలు కూడా వల్ల చేతి వాటంతో కొట్టుకునేవి. ముఖ్యంగా ఆమె చేతి దురుసు చెప్పనక్కరలేదు. ఆలా ఒకఎడుకే వాళ్లకి నూరేళ్ళకు సరిపడా తగవులు ఏర్పడ్డాయి. చివరికి డాక్టర్ కిరణ్మయి వేరే ఇల్లు తీసుకొని వెళ్ళింది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందా అని తార నాధ్ ఎదురు చూసాడు. కానీ ఆమె తెరిగి రాలేదు కానీ ఒక రోజు ఒక లేడి అడ్వకెట్ నుండి శ్రీముఖం వచ్చింది అదేనండి లీగల్ నోటీసు. నోటీసు చదివి తార నాధ్ నివ్వెర పోయాడు అంతా అబద్ధాల పుట్ట లేని పోనీ కల్పనలు చేసి తార నాధ్ ఒక దుర్మార్గుడు, స్త్రీలోలుడు అని చిత్రీకరించి అల్లిన కధ నిజానికి ఆ నోటీసు ఎవరైనా చదివితే తార నాధ్ లాంటి దుర్మార్గుడు ఎక్కడ ఉండడు అని అనుకో వచ్చు. ఈ రోజుల్లో ఇటువంటివి చాల సాధారణం అయిపోయాయి. బతుకు జీవుడా అని తార నాధ్ తనతో చిన్నప్పుడు చదువుకున్న ఒక అడ్వాకేటు వద్దకి వెళ్లి తన గోడు వివరించాడు. అంతా విని ఆ అడ్వాకట్ ఆ నోటీసుకి రిప్లై ఇచ్చాడు. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు తన భార్య తన దగ్గరకు వస్తుంది కేవలం నోటీసు తనను బెదిరించటానికే ఇచ్చి ఉంటుంది అనుకున్నాడు. కానీ తన అంచనా తారు మరు అయ్యిన్ది ఒక వారం రోజుల్లోనే కోర్టు నోటీసు వచ్చింది. అప్పడి నుండి కోర్టుకి తిరుగు తున్నారు ఇద్దరు.

ఇంకా వుంది