27, మే 2023, శనివారం

విలువలు అంటే ఇవీ*

 *విలువలు అంటే ఇవీ*


" సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట " ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.


"ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రితో రెండు నిమిషాలు మాట్లాడారు.."


" ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి

"మనం ప్రధానమంత్రితో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి " అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశ్చర్యంతో మరోమారు అటల్జీని అడిగి నిర్ధారణ చేసుకున్నాడు కార్యదర్శి..


" సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ? నసిగాడు కార్యదర్శి "


వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ " నిక్షేపంగా " అన్నారు.."


" ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీలోనూ పెద్ద దుమారం సృష్టించింది..రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు..సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి వెళుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు..కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు ..


కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. "అన్ టోల్డ్ వాజపేయి" అనే పుస్తకం ద్వారా..అదీ ఆయన మాటల్లోనే..


"1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది..డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు..ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు..ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు..కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ "అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి "..అని చెప్పారు..ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే..నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే "


పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు.....Great people with ethics 👍👍🙏

ఆచార్య సద్బోధన:*

 


            *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


                 

*ఒక మేకును గోడకు కొట్టి అనేక అవసరాలకు ఉపయోగిస్తూవుంటారు.*


*మేకు గోడలో దిగడానికి దానిని సుత్తితో కొడతారు.*


*సద్గురువు సుత్తిలాంటివాడైతే శిష్యుడు మేకువంటివాడు.*


*శిష్యుడు లక్ష్యాన్ని చేరువరకు ఎంతో శ్రమిస్తూ అతనిని తనంతవాడిగా చేయడానికే సద్గురువు ప్రయత్నిస్తాడు.*


 *గోడకు కొట్టిన మేకు ఎన్నోవిధాలుగా ఉపయోగపడినట్లు లక్ష్యసాధనలో పరిపూర్ణుడైన తన శిష్యుడు సమాజానికి, దేశానికి ఉపయోగపడాలన్నదే సద్గురువు యొక్క ఆశయము,లక్ష్యము కూడా.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

దేవ రహస్యం

 దేవ రహస్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


ఒకసారి యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు

భూలోకానికి వచ్చాడు ఆ దూత ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది ఆ బిడ్డను చూస్తే వాడికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నది, అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు, ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ అవిటి బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు, యమదూత వెళ్లిపోయినా ఆమె కర్మఫలం కొద్దీ ఆవిడ మరణించింది.


ఇదంతా తెలుసుకోలేని యమదూత, ఆ పుట్టిన పిల్లాడి పరిస్థితి యమధర్మరాజుకు వివరించి, వారిపైన జాలితో ఆవిడ ప్రాణాలు తీయకుండానే వచ్చిన విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా  దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు 

యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు 

తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు 

యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది 


యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది 

అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు 

అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది, అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత  మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది, మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు, యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివ్వమని చెప్పి అప్పటికే కుట్టి ఉన్నవి తీసుకుని వెళ్ళిపోతాడు 


అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు 

మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్విన ప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు 


జరిగిన విషయం చెప్పి మొదటి సారి మీ భార్య అన్నం లేదు అని చెప్పింది అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని  రెండవ సారి ఆ పిల్లాడి తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను, అయినా కర్మానుసారం ఆవిడ మరణించింది, కానీ అతనికి తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే పెంపుడుతల్లి దొరికింది, అతనికి తన అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆవిడ బిడ్డతో సమానంగా చూడగలిగే గుణమున్న అమ్మని దగ్గర చేసాడు అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని 


ఇక మూడోసారి అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు, మన జీవితం శాశ్వతం కాదు, ఏ క్షణాన ఎవరం పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు, ఎవరు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు అక్రమంగా సంపాదించి గుట్టలుగా మార్చేస్తుంటారు ఆశతో నమ్మకంతో బతికేస్తుంటారు కానీ నమ్మకం వెనుకున్న నిజాన్ని గ్రహించలేరు, అని చెప్పి ఈ దేవరహస్యాలను తెలుసుకున్నాను కాబట్టే శాప విమోచనమై వెళ్లిపోతున్నాను అని వెళ్లిపోతాడు..  


అందుకే మన నమ్మకం వేరు కర్మఫలం వేరు అని గ్రహించి, ప్రతి సంఘటనను, దైవానుగ్రహ ఫలము అని భావించాలి మిత్రులారా!

🙏🙏👏https://chat.whatsapp.com/Emm3knQIrJA2rlMnRRXFjF

ఆలయాలలో దానం

 *ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు*


👉ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. 


👉దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.


👉ఆలయ గోడలకు సున్నం కొట్టించడం,

👉ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి

👉శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు.

👉అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

👉ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు.

👉గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు.

👉గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.


👉చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి,

👉ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.

👉పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు.

👉చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు.

👉ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. 


👉మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని,

👉నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.

👉కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది.

👉వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి.

👉ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం.

👉చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.


👉దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది.

👉పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం.

👉ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

👉దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు.

👉దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.


👉దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది.

👉ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు.

👉వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు.

👉పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి,

👉బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి.

👉మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.


👉వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది.

👉పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.

👉నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి.

👉ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి.

👉శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి,

👉దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.


👉దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది.

👉ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది.

👉వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే.

👉పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి,

👉జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.


*👉దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.*

గాలి మోసం

 గాలి మోసం 

ఇదేమిటి గాలి మోసం అని మీరనుకుంటున్నారా మీరు చదివింది అక్షరాలా నిజం. నేను నా అనుభవంలో తెలుసుకున్న అనుభవించిన మోసాలలో ఈ గాలి మోసం కూడా ఒకటి.  నేను ఇది రాయటానికి కారణం ఇది చదివిన మిత్రులు కొంతమందైయినాఇటువంటి మోసాల పల పడకుండా కాపాడుకోగలుగుతారని ఇది వ్రాస్తున్నాను. 

ఒకసారి నేను నా ద్విచెక్రవాహనానికి పెట్రోలు పోయించుకోవటానికి నేను వెళ్లే దారిలోని పెట్రోలు బ్యాంకుకు వెళ్లి పెట్రోలు పోయించుకొని ఒకసారి ఎందుకైనా మంచిది టైరులో గాలికూడా నింపుకొందామని ఆ బ్యాంకులోని గాలి మిషను వద్దకు వెళ్ళాను. ఆటను గాలి ఏకించినట్లే ఎక్కించి ముందరి టైరు నిప్పలువద్ద గాలి లీకు అవుతున్నది దీని వాల్వు మార్చాలి లేకపోతె టైరులో గాలినిలవదు అని చెప్పి నిప్పలులోని వాల్వు తీసి ఇంకో వాల్వు వేసి నా దగ్గర తగినంత డబ్బు వసులు చేసాడు.  ఇది మొదటి అనుభవము.  తరువాత నేను బండిమీద పోతూ ఆలోచిస్తే నాకు తట్టిన విషయం ఏమిటంటే నిజంగా నిప్పలులోని వాల్వు పాడు అయితే నా బండి బంకు దాకా యెట్లా వచ్చింది మధ్యలోనే టైరు గాలి పూర్తిగా పోవాలి కదా. అంటే అతను నన్నుమోసగించాడు అని తెలుసుకున్నాను. 

ఇంకొక పర్యాయము నేను ఉదయం లేచి బయట ఉంచిన నా కారుని చుస్తే ముందరి ఒక టైర్ పూర్తిగా నెలకు అనుకోని వుంది అంటే టైరులో గాలి పూర్తిగా దిగిపోయింది.  అంటే టైర్ పంచరు పడి వుంది ఉండవచ్చు అని భావించి వేరే టైరు బిగించి దానిని గాలి మిషను వానివద్దకు తీసుకొని వెళ్లాను. దానిని వాడు పరీక్షించినట్లు చేసి దీనికి పంచరు లేదు  అని చెప్పాడు బతుకు జీవుడా అని అయితే గాలి నింపి ఇవ్వు అన్నాను.  నేను పంచరు లేదు అని అన్నాను కానీ టైరు బాగుందని చెప్పనా దీని నిప్పలు పోయింది రూ. 250 అవుతుందని చెప్పి రిమ్మునుంచి టైరు తీసి నిప్పులు బలవంతంగా తీసి ఇంకొక నిప్పులు వేసాడు. వానికి డబ్బులు ఇచ్చి మరల కారులో ఇంటికి వస్తుంటే నా ట్యూబులైటు చిన్నగా వెలిగింది అదేమిటంటే నిప్పలు లోని వాల్వు ఏమాత్రము లూజు అయినా కూడా గాలి దిగి పోవచ్చు కదా దానికి నిప్పులు మార్చాల్సిన అవసరం లేదు కదా అంటే వాడు కావాలనే నన్ను ఏమార్చి నిప్పులు  మార్చాడు అని తెలుసుకున్నాను.  కానీ చేసేది ఏముంది తెల్లమొహం వేయటం మినహా. 

మరోక సారి నా కారు టైరు పూర్తిగా గాలి పోయింది అప్పుడు జాగ్రత్తగా జాకీటు టైరుని తీసి వాల్వును కొంచం బిగించి నా దగ్గ్గర వున్న సైకిలు పంపుతో గాలి నింపి కొంత నిండిన తరువాత బ్యాంకు దగ్గరకు తీసుకొని వెళ్లి పూర్తీ ప్రెషర్ నింపాను. పర్వాలేదు నా బుర్ర కొంచం కొంచం పనిచేస్తున్నది అని సంతోషపడ్డాను. 

ఒకసారి నేను నా శ్రీమతి కలిసి ఏదో బ్రాహ్మణ సమ్మేళనము అంటే ఆ సభకు కారులో వెళుతున్నాము. కొంతదూరం వెళ్లిన తరువాత నాకు టైరుల్లో గాలి సరి చూసుకుందాం అని దారిలో రోడ్డు ప్రక్కన ఒక గాలి షాపులో గాలి నింపమని చెప్పను. దానికి వాడు మూడు టైరుల్లో గాలి నింపి ఒక టైరుకు నీటిలో పరీక్షించినట్లు చేసి దీనికి పంచరు ఉందని పంచారు సూదిని తీసుకొని వచ్చాడు నాయనా దీనికి పంచరు లేదు నీవు పోసిన నీరుతో  గాలి ఎక్కడ రావటం లేదన్న వినిపించుకోవడం లేదు నన్నే యెదార్చించి మీకు చెపితే తెలియదా అదే టైరుతో వెళతారా అని నన్ను అన్నాడు నా అంతరాత్మ చెప్పేది విన్నా కూడా వాడి బలవంతానికి తలవంచే పరిస్థితి. అప్పుడు నాకు లైటు వెలిగింది నీవు పంచరు వేయనవసరం లేదు కానీ నా స్పెరు టైరు బిగించు అని అన్నాను. వాడు టైరు మార్చి 100 రూపాయలు తీసుకున్నాడు.  

మిత్రులకు చెప్పేది ఏమిటంటే ఇవి నా అనుభవాలు మీకు కూడా ఇలాంటి గాలి మోసాలు అయ్యాయా తెలుపగలరు. "బ్రహ్మమాణో ఉత్తర పాస్చాత్తే " అన్నట్లు మనం తరువాత బాధపడి లాభం  లేదు. ఏది ఏమయినా ఈ రోజుల్లో సగటు మనిషి సమాజంలో బ్రతకటం దినగండం నూరేళ్ల ఆయిస్సు లాగ వుంది. అవునా కాదా? 

మీ 

భార్గవ శర్మ

మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:

 172వ రోజు: (శని వారము) 27-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


చెట్టు నీడ నిచ్చి సేదదీర్చుచునుండు 

ఫలము లిచ్చిచెట్టు బలము పెంచు 

చెట్లు పెంచినపుడు, చిక్కులు దీరురా 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


చెట్లు పెంచినపుడు అవి పెరిగి పెద్దవయ్యి మనకు ఫలములు (పండ్లు) తో పాటు ఆశ్రయము (నీడ)ను కూడా ఇచ్చును. ఆ విధముగా బాటసారులు (ప్రయాణీకులు) ఆకలి దప్పికల వల్ల సేద తీరుటకు ఉపయోగపడును కదా.


ఈ రోజు పదము. 

భద్ర గజము  (Elephant): 

పంచభద్రము, పంచమంగళము, పక్షము, పట్టపుటేనుగు, పట్టపుదంతి.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 72*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 72*


పాంచాల రాజ్యమంతటా వున్నట్టుండి వదంతి ఒకటి వ్యాపించింది. 


'రాజధాని వృషపాల నగర సమీపంలో ఉన్న ఒక వనంలో రాజకుమారుడు ఒకడు నిద్రిస్తుండగా సింహరాజమొకటి వచ్చి అతని శిరస్సును స్ప్రుశించి వెళ్లి పోయిందట....' ఆ పుకారు క్షణాల్లో నగరమంతటా వ్యాపించింది. "ఎవరా రాజకుమారుడు ? అతనిది ఏ రాజ్యము ?" అంటూ జనులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.


ఆ మన్నాడు మరొక ఉదంతం నగరమంతటా వ్యాప్తి చెందింది. ' క్రితం రోజు సింహం చేత ఆశీర్వాదం పొందిన రాకుమారునికి మదగజేభం వొకటి మోకరిల్లి అభినందనాలు సలిపి అతనిని తనపై ఆశీనుని గావించుకున్నదంట..'

 

అలా చాణక్య శిష్యులు పుకారులను వ్యాపింప చేస్తున్న సమయంలో చాణక్య చంద్రగుప్తులు వృషపాలనగరంలో ప్రవేశించారు. చాణక్యునిచే ముందుగానే పథకం ప్రకారం నియమితుడైన శిష్యుడు ఆగమసిద్ధి వారి వెనక అనుసరిస్తూ..


"ఆహా ! ఏమి ఆ దర్జా... ! ఏమి ఆ రాజఠీవి... ! భావి భారత సార్వభౌముని లక్షణాలు ఈ రాకుమారుని వదనంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. సింహస్పర్శ, గజవాహనం సందర్భాల్లో నేను చూసింది ఈ యువకుడినే..." అంటూ దారి పొడుగునా కనిపించిన వాళ్లకందరికీ చెప్పసాగాడు. పాంచాల పౌరులందరూ వీధుల వెంబడి గుంపులు గుంపులుగా చేరి గురుశిష్యులను వింతగా చూడసాగారు. 


ఆ వార్త క్రమక్రమంగా పాంచాల ప్రభువు పురుషోత్తముడికి చేరింది. అదే సమయంలో చాణక్య శిష్యుడైన శార్జరవుడు రాజదూతోచితమైన దుస్తులను ధరించి పురుషోత్తముని దర్శించి "పాంచాల భూపతులకు జయము... జయము... మగధ సింహాసనా వారసులు, మహానందుల వారి కుమారులు మౌర్య చంద్రగుప్తుల వారు తమ గురుదేవులు ఆర్య చాణక్యుల వారితో వృషపాలమునకు విచ్చేసి రాజ్యతిధి గృహమునందు బస చేశారు. వారు తమరిని దర్శించవలెనని కుతూహలపడుతున్నారు..." అని మనవి చేశాడు. 


మౌర్య చంద్రగుప్తుని పేరు వినగానే పురుషోత్తముడికి మతిపోయినట్లయ్యింది. నందులు తనకి కప్పం చెల్లించడానికి నిరాకరిస్తూ వర్తమానం పంపినప్పటి నుండీ వారిపై పగ సాధించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ మగధవిశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు పురుషోత్తముడు. మగధకి అసలైన వారసుడు మురా-మహానందుల వారి కుమారుడు చంద్రగుప్తుడు జీవించే ఉన్నాడన్న వార్త అతనికి చేరిన కొద్ది రోజులకే - వెదకబోయిన తీగ కాళ్ళకే తగిలినట్లు చాణక్య చంద్రగుప్తులు తనని వెతుక్కుంటూ రావడం ఈతనికి చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. పైగా బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించడం వల్ల అతనికి స్వేచ్ఛ లభించినట్లయి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. 


ఇక చాణక్యుని గురించి అలెగ్జాండర్ నోటి ద్వారా అనేకసార్లు వినివున్నాడు. 'చాణక్యుడి వంటి మహామేధావి చంద్రునికి అండగా వున్నాడంటే వాళ్లకి విజయం తప్పదు. ఆ విజయంలో తానే పాలుపంచుకుని, వీలైతే చంద్రగుప్తునికి బంధువుగా మారితే హిందూదేశంలో తమకి తిరుగుండదు.' 


ఆ విధంగా ఆలోచించిన పురుషోత్తముడు చంద్రగుప్తునికి సార్వభౌమోచిత లాంఛనాలతో స్వాగతం పలికాడు. చాణుక్యునికి పూర్ణకుంభంతో, వేదపఠనంతో స్వాగతం చెప్పి స్వయంగా అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

చదివి చూడండి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

మూడింటిని నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 

👆అందమైన నా మాతృభాషను ఆస్వాదిద్దాం...

మెచ్చుకోలులో మతలబు!

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌷మెచ్చుకోలులో మతలబు!🌷* 


"మెచ్చుడు మెచ్చవచ్చునెడ,మెచ్చకుడిచ్చకు మెచ్చురానిచో,/

మెచ్చియు మెచ్చుమ్రింగకుడు,మెచ్చక మెచ్చితిమంచుగ్రుచ్చలై/

మెచ్చకు,డిచ్చమెచ్చుగనిమెచ్చుడు,మెచ్చనుమానమైనచో /

మెచ్చియు,మెచ్చకుండకయు,మెచ్చుడు,

సత్కవులారమ్రొక్కెదన్!


"ఆంధ్రభాషాభూషణము-మూలఘటిక కేతన.

              తెనుగు భాషకు పద్యాలలో తొలివ్యాకరణం రచించబూనినదిట్ట మూలఘటిక కేతన.ఆకాలంలో విద్యాలయాలను ఘటిక లనేవారు.అలాంటి విద్యాలయానికాతడు అధికారి.తిక్కనకు ప్రియశిష్యుడు.దండి దశకుమార చరిత్రము ననువదించి తిక్కనకు కృతినొసంగినమహనీయుడు.

"తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును,

దానివలన కొంతగానబడియె,

కొంత తానగలిగె నంతయునేకమై

తెనుగుబాసనాగ వినుతికెక్కె;-అంటూ తెలుగు సంస్కృత జన్యమని నొక్కి వక్కాణించినవాడు. 


ప్రస్తుతానికివద్దాం.

సత్కవులకు మ్రొక్కుతూ అవతారికలో కవిచెప్పిన మాటలే పైపద్యం.


భావం:నాగ్రంధంలో నచ్చినవిషయంమీకు కనిపిస్తే మెచ్చుకోండి.మీమనస్సుకు నచ్చకపోతే మెచ్చుకోకండి.మనస్సులో మెచ్చుకుంటున్నా పైకి గాంభీర్యంనటిస్తూమెచ్చనట్లు ప్రవర్తించకండి.నచ్చకపోయినా కుటిలురై నచ్చినదని మెచ్చుకోకండి.మనఃపూర్వకంగా మెచ్చుకోండి.మీకు మెచ్చు అనుమానమైతే మెచ్చిమెచ్చనట్లుమెచ్చుకోండి. సత్కవులారా! మీకిదే నాప్రణామములు.

            మెచ్చు అనే క్రియను వృత్యనుప్రాసముగా నుపయోగించి అశేషవిమర్శకుల యభిప్రాయములెట్లుండునో సద్విమర్శయెటులుండవలెనో కేతన నిపుణముగా సూచించినాడు.నేడిట్టికవులొక్కరైననుగలరా? సంశయమే!


                స్వస్తి!🙏🙏🙏🌷🌷

*సేకరణ:-* *చొప్పకట్ల సత్యనారాయణ గారు.*

కడుపులో నులి పురుగుల నివారణ -

 చిన్న పిల్లల కడుపులో నులి పురుగుల నివారణ  -


      కడుపులో క్రిములు , నులిపురుగులు వంటివి ఉంటే చిన్న పిల్లలు నిద్రలో పండ్లు కోరుకుతారు. అందువల్ల ఆవాలని దోరగా వేయించి దంచి జల్లించి నిలువ ఉంచుకోవాలి . ఈ ఆవాల పొడి అరగ్రాము మోతాదుగా అరకప్పు పెరుగులో ఉదయం పూట సాయంత్రం పూట కలిపి తినిపిస్తుంటే పిల్లల కడుపులో ఉండే క్రిములు మూడు రొజుల్లొ మలం ద్వారా  పడిపోయి పిల్లలు నిద్రలో పండ్లు కొరకడం ఆపివేస్తారు.



 

     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

మిడిల్ క్లాస్..కాబట్టి.!

 *


▪ రూపాయి బియ్యం తినలేం.. 

       50 రూపాయలకి బియ్యం కొనలేం 

▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం.. 

       మినరల్ వాటర్ కొనలేం

▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..

      కలల ఇల్లు కట్టుకోలేం

▪ ప్రభుత్వ బడికి పంపలేం..

      కార్పొరేట్ ఫీజులు కట్టలేం

▪ సర్కారు దవాఖానా కు పోలేం..

       కార్పొరేట్ బిల్లులు కట్టలేం

▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..

      బండికి పెట్రోలు కొనలేం


ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!


👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..

👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..

👋🏻అవినీతి పోవాలనేది మనమే..

👋🏻అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే..

👋🏻ఇంటికో భగత్ పుట్టాలని చెప్పేది మనమే..

👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..

👋🏻మార్పు రావాలని చెప్పేది మనమే..

👋🏻అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..

అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........

వెర్రి గొర్రెలు..



 *✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని

 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*


✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.


✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.


✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.


✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.


✅ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.


✅ దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.


✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.


ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.! 

నిజమె కదా.....👍👍



ఐహికాముష్మిక విషయములు :-*

 *-: ఎల్లరూ తెలుసుకోతగిన  ఐహికాముష్మిక విషయములు :-*

           *( కలగూరగంప )*

💐💐👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐



 *ఏడుగురు అప్సరసలెవరు..?*


 1.రంభ. 2.ఊర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6.ఘృతాచి

 7.మంజుగోష .


 *సప్త సంతానములు అంటే ఏమిటి..?*

 

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 

3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రబంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

 

*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి..?*


 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 

3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానాత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 

9. సకలాత్మ.


 *పదిరకాల పాలు ఏవి..?*


 1. చనుబాలు. 2. ఆవుపాలు . 

3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు.

 9. ఏనుగు పాలు.10. లేడి పాలు.


 *యజ్ఞోపవీతంలో ఎన్నిపోగులు ఉంటాయి..?*


 యజ్ఞోపవీతం లో 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 

9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 

4. చంద్రుడు . 5. పితృ దేవతలు .

 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి..?*


 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 

4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 

7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. భృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12.వరాహసంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.


 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు..?*


 1. ఈశాన్యంలో పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యంలో  స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుబేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.


 *వివిధ ఫలాల నైవేద్యఫలితాలు:-*


 *కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) :-*

 భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.


 *అరటి పండు:-* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిధ్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.


 *నేరేడుపండు:-* శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి  ఆప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.


 ద్రాక్ష పండు:-*  భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 

*మామిడి పండు:-*

 మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. 

నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకంచేసిన తేనెలో కలిపి నైవేద్యంగా  పెట్టి అందరికీ పంచి, తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.


 *అంజూరపండు:-* 

భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జూరపండును అందరికీ పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్నీ తొలగి ఆరోగ్య వంతులు అవుతారు.

 

*సపోటా పండు:- సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి.

 

*యాపిల్ పండు:-* 

భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 

*కమలా పండు:-*

  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.


 *పనసపండు:-*  

పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.


 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి..?*


 1.జన్మ సూతకము. 

2. మృతసూతకము. 

3. రజః సూతకం . 

4.అంటు (రోగ ) సూతకం . 

5 శవదర్శన సూతకం . 


 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా..?*


 శివాలయానికి నూరు బారుల దూరం లోపల, విష్ణాలయమునకు వెనుక ఇరవై బారుల దూరం లోపల, 

శక్తి ఆలయముకు సమీపం లోను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేకంగా గృహ నిర్మాణం జరిగితే సకల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు 

ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.


 *తాంబూలం సేవించేటప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి..?*


 తాంబూలం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబూలం వేసుకోవడం ఆరోగ్యకరం.  అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుధ్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక.


 *శ్రీగోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు..?*


 తిరుపతిలో  శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధిలో కుంచం ఉండటం నిజమే.. దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీవెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేశాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచంతో కొలిచి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గోవింద రాజస్వామి ఈకార్యమును సాగించారని ఒక కధ ప్రచారంలో ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నారు అని ప్రతీతి.


 *నవగ్రహాలకు సంబంధించిన సమిధలు ఏవి..?*


 1. సూర్యుడు - జిల్లేడు. 

2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 

4. బుధుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 

6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 

8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .


  *ఎటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు..?*


 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లోను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4.ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5.ఎల్లప్పుడూ నీటి వూటలు గల ప్రదేశాలలోను .

 6.రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7.చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు.. అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .


 *పుజాంగాలు  ఎన్ని రకాలు..?*


 పుజాంగాలు  5 రకాలు.

 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3. ఇజ్య - ధూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4. స్వాధ్యాయము - తనకు తానుగా మంత్రోఛ్ఛారణతో స్తుతించడం.

 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

  

 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి..?*


 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధాన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలో ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుభప్రదంగా ఉండును. ఆ తరువాత 

ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును. కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని పెద్దలమాట.


 *గృహ నిర్మాణంలో ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి..?*


 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలో ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలోను ఉండాలి. అలమరాల గురించి శాస్త్రంలో ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలోనో పెట్టుకోవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు.. కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహంలో ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.


 *వివిధ జన్మలు ఏవి..?*


 1. దేవతలు . 2. మనుష్యులు. 

3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 

6. జలచరములు.

 7. వృక్షములు .


 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు..?*

 

1.శేషాద్రి 

2. నీలాద్రి. 

3. గరుడాద్రి. 

4. అంజనాద్రి. 

5.వృషభాద్రి

6. నారాయణాద్రి.

7. వేంకటాద్రి.


 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి..?*


  ( 1 )విష్ణుమూర్తి యొక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులో చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రధ్ధలతో వినయంగా నమస్కరించాలి.


( 2 ) ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.


 ( 3 ) గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.


 ( 4 ) మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.


 ( 5 ) తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.


  ( 6 ) తల్లికి ఉదరంపై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.


  *శ్రీచక్రం నందు గల దేవతలు ఎవరు..?*


 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .


 *ధర్మము యొక్క  లక్షణములు ఏవి..?*

 

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే *"ధర్మము"*


 *సహంపక్తి భోజనాల సమయంలో అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు..?*


 సహంపక్తి భోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి భోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలో మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తిలో కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.


 *దేవతా లక్షణాలు ఏవి..?*


 1. రెప్పపాటు లేకుండుట . 

2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.

3. వ్యసనం లేకుండా ఉండుట.


 *నవ వ్యాకరణాలు అనగా ఏవి..?*


 1. పాణి నీయం . 

2. కలాపం. 

3. సుపద్మం. 

4. సారస్వతం. 

5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 

7. వ్యాఘ్ర భౌతికం. 

 8. శాఖటా టా యానం . 

9.శాకల్యం .


 *శ్రీరాముడు ఎప్పుడు జన్మించెను..?*


 శ్రీ రాముడు చైత్ర మాసం , 

నవమి తిధిలో 

కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .


 *పర్వ దినాలలో వడపప్పును ఎందుకు పెడతారు..?* 


 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .


 *శ్రీవేంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు..?*


 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రభాతాన్ని రచించిన వారు 

శ్రీప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీమనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు 

క్రీ .శ . 1361వ,సం.లోజన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం. వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో 

శ్రీస్వామివారి సుప్రభాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందినది.


 *పంచ కోశాలు అనగా ఏవి..?*


1. అన్నమయ కోశం. 

2. ప్రాణమయ కోశం .

3. మనోమయ కోశం . 

4. విజ్ఞానమయ కోశం .

5. ఆనందమయ కోశం .


 *శౌచమంటే ఏమిటి..?*


 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత బాహ్య అంతరములలో పరిశుధ్ధతని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 *1. బాహ్య శౌచం.*

 *2. అంతః శౌచం .*


 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధంగా ఉండేందుకు పూసే సుగంధ ద్రవ్యాలు వంటివి. వీటిని బాహ్య శౌచం అంటారు.


 *అంతః శౌచం:-*

  మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతఃకరణను కలిగి ఉండటమే అంతఃశౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంబంధించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.


 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితంఉంటుంది..?*


 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కానీ ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిధ్యము నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.


 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి..?*


1. వైద్యనాధ లింగం. 

2. వక్రేశ్వర నాద లింగం.

3. సిద్ధినాద లింగం. 

4. తారకేశ్వర లింగం.

5. ఘటేశ్వర లింగం. 

6. కపిలేశ్వర లింగం.


 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు..?*


 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లోను ఉంటారు.

 

 నాల్గవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లోకంలో కల్పాంత జీవులు ఉంటారు.


 అయిదోవది అయిన జనలోకంలో బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.


 ఆరవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉండెదరు. 


*అరిషడ్వర్గములు అనగా ఏవి..?*

1 కామం

2 క్రోధం

3 లోభం

4 మోహం

5 మదం

6 మాత్సర్యం



 *భగవంతుడికి నివేదించే సమయంలో గుర్తుంచుకోవలసినవి ఏవి..?*


 భగవంతుడికి నివేదించేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చేసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేదించేటప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .


 1. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు . పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు . చల్లారాక పెట్టాలి .

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.


 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు..?*


 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రిపుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రములు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడాన్నే ఊర్ధ్వ పుండ్ర ధారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రణవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరూపడైన శ్రీమహావిష్ణువును , ఉకారం - చిత్ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేఖలుగా నుదుట ధరిస్తారు .


    తిరుమణి మట్టికి సంబంధించినది . కావున అది మట్టి నుండి కలిగిన 

ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సూచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి ధారణ కూడా 

ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.


  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రములు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర ధారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఊర్ధ్వ పుండ్రంలో ఉపయోగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.


 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి..?*

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రుని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి..


 * రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.


 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయంలో ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయోగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 * అభ్యంగన స్నానం అంటే కుంకుళ్ళు , షాంపులు మొదలయిన వాటిని ఉపయోగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలమూత్రాలు విసర్జించరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం వస్తుంది.


 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దోషం..


 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు..

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి.

 మామూలు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి..!

                *--- 0 ---*

*సర్వం..! పరబ్రహ్మార్పణమస్తు..!*

*శ్రీరామ..! జయరామ..!*

*జయ..! జయ..! రామ..!*

💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐