గాలి మోసం
ఇదేమిటి గాలి మోసం అని మీరనుకుంటున్నారా మీరు చదివింది అక్షరాలా నిజం. నేను నా అనుభవంలో తెలుసుకున్న అనుభవించిన మోసాలలో ఈ గాలి మోసం కూడా ఒకటి. నేను ఇది రాయటానికి కారణం ఇది చదివిన మిత్రులు కొంతమందైయినాఇటువంటి మోసాల పల పడకుండా కాపాడుకోగలుగుతారని ఇది వ్రాస్తున్నాను.
ఒకసారి నేను నా ద్విచెక్రవాహనానికి పెట్రోలు పోయించుకోవటానికి నేను వెళ్లే దారిలోని పెట్రోలు బ్యాంకుకు వెళ్లి పెట్రోలు పోయించుకొని ఒకసారి ఎందుకైనా మంచిది టైరులో గాలికూడా నింపుకొందామని ఆ బ్యాంకులోని గాలి మిషను వద్దకు వెళ్ళాను. ఆటను గాలి ఏకించినట్లే ఎక్కించి ముందరి టైరు నిప్పలువద్ద గాలి లీకు అవుతున్నది దీని వాల్వు మార్చాలి లేకపోతె టైరులో గాలినిలవదు అని చెప్పి నిప్పలులోని వాల్వు తీసి ఇంకో వాల్వు వేసి నా దగ్గర తగినంత డబ్బు వసులు చేసాడు. ఇది మొదటి అనుభవము. తరువాత నేను బండిమీద పోతూ ఆలోచిస్తే నాకు తట్టిన విషయం ఏమిటంటే నిజంగా నిప్పలులోని వాల్వు పాడు అయితే నా బండి బంకు దాకా యెట్లా వచ్చింది మధ్యలోనే టైరు గాలి పూర్తిగా పోవాలి కదా. అంటే అతను నన్నుమోసగించాడు అని తెలుసుకున్నాను.
ఇంకొక పర్యాయము నేను ఉదయం లేచి బయట ఉంచిన నా కారుని చుస్తే ముందరి ఒక టైర్ పూర్తిగా నెలకు అనుకోని వుంది అంటే టైరులో గాలి పూర్తిగా దిగిపోయింది. అంటే టైర్ పంచరు పడి వుంది ఉండవచ్చు అని భావించి వేరే టైరు బిగించి దానిని గాలి మిషను వానివద్దకు తీసుకొని వెళ్లాను. దానిని వాడు పరీక్షించినట్లు చేసి దీనికి పంచరు లేదు అని చెప్పాడు బతుకు జీవుడా అని అయితే గాలి నింపి ఇవ్వు అన్నాను. నేను పంచరు లేదు అని అన్నాను కానీ టైరు బాగుందని చెప్పనా దీని నిప్పలు పోయింది రూ. 250 అవుతుందని చెప్పి రిమ్మునుంచి టైరు తీసి నిప్పులు బలవంతంగా తీసి ఇంకొక నిప్పులు వేసాడు. వానికి డబ్బులు ఇచ్చి మరల కారులో ఇంటికి వస్తుంటే నా ట్యూబులైటు చిన్నగా వెలిగింది అదేమిటంటే నిప్పలు లోని వాల్వు ఏమాత్రము లూజు అయినా కూడా గాలి దిగి పోవచ్చు కదా దానికి నిప్పులు మార్చాల్సిన అవసరం లేదు కదా అంటే వాడు కావాలనే నన్ను ఏమార్చి నిప్పులు మార్చాడు అని తెలుసుకున్నాను. కానీ చేసేది ఏముంది తెల్లమొహం వేయటం మినహా.
మరోక సారి నా కారు టైరు పూర్తిగా గాలి పోయింది అప్పుడు జాగ్రత్తగా జాకీటు టైరుని తీసి వాల్వును కొంచం బిగించి నా దగ్గ్గర వున్న సైకిలు పంపుతో గాలి నింపి కొంత నిండిన తరువాత బ్యాంకు దగ్గరకు తీసుకొని వెళ్లి పూర్తీ ప్రెషర్ నింపాను. పర్వాలేదు నా బుర్ర కొంచం కొంచం పనిచేస్తున్నది అని సంతోషపడ్డాను.
ఒకసారి నేను నా శ్రీమతి కలిసి ఏదో బ్రాహ్మణ సమ్మేళనము అంటే ఆ సభకు కారులో వెళుతున్నాము. కొంతదూరం వెళ్లిన తరువాత నాకు టైరుల్లో గాలి సరి చూసుకుందాం అని దారిలో రోడ్డు ప్రక్కన ఒక గాలి షాపులో గాలి నింపమని చెప్పను. దానికి వాడు మూడు టైరుల్లో గాలి నింపి ఒక టైరుకు నీటిలో పరీక్షించినట్లు చేసి దీనికి పంచరు ఉందని పంచారు సూదిని తీసుకొని వచ్చాడు నాయనా దీనికి పంచరు లేదు నీవు పోసిన నీరుతో గాలి ఎక్కడ రావటం లేదన్న వినిపించుకోవడం లేదు నన్నే యెదార్చించి మీకు చెపితే తెలియదా అదే టైరుతో వెళతారా అని నన్ను అన్నాడు నా అంతరాత్మ చెప్పేది విన్నా కూడా వాడి బలవంతానికి తలవంచే పరిస్థితి. అప్పుడు నాకు లైటు వెలిగింది నీవు పంచరు వేయనవసరం లేదు కానీ నా స్పెరు టైరు బిగించు అని అన్నాను. వాడు టైరు మార్చి 100 రూపాయలు తీసుకున్నాడు.
మిత్రులకు చెప్పేది ఏమిటంటే ఇవి నా అనుభవాలు మీకు కూడా ఇలాంటి గాలి మోసాలు అయ్యాయా తెలుపగలరు. "బ్రహ్మమాణో ఉత్తర పాస్చాత్తే " అన్నట్లు మనం తరువాత బాధపడి లాభం లేదు. ఏది ఏమయినా ఈ రోజుల్లో సగటు మనిషి సమాజంలో బ్రతకటం దినగండం నూరేళ్ల ఆయిస్సు లాగ వుంది. అవునా కాదా?
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి