7, అక్టోబర్ 2023, శనివారం

Karivena satram


 

Panchaag


 

Kush rakneka


 

Ladder chair🪑


 

Marble cutting


 

Notiputa home remedy


 

For free motion home remedy


 

Trinetrudu


 

Anaapana sati


 

Continuous fountain


 

Sewing tequnic


 

Aneimia home remedy


 

Mokalla noppi


 

Sewing teqnic


 

Katha kali


 

విటమిన్ల ఉపయోగాలు - 2 .

 వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు  - 2 . 


 అంతకు ముందు పోస్టులో మీకు D విటమిన్ గురించి సంపూర్ణంగా వివరించాను . ఇప్పుడు మిగిలిన విటమిన్స్ గురించి కూడా వివరిస్తాను . వీటి గురించి సంపూర్ణ సమాచారం నేను రచించిన గ్రంథాలలో మరింత వివరణాత్మకంగా ఇచ్చాను . 


 *  C విటమిన్ - 


    C విటమిన్ మన శరీరానికి యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది . ఈ విటమిన్ లోపిస్తే ఐరన్ ను ప్రేగులు శోషించుకోలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . C విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉసిరికాయ , కొత్తిమీర , కలబంద , వెల్లుల్లి , ముల్లంగి , పైనాపిల్ , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులలో పుష్కలంగా లభ్యం అగును . 


 * A విటమిన్ - 


    ముఖ్యముగా ఈ విటమిన్ కంటిదృష్టి స్పష్టంగా కనిపించుటకు సహాయపడును . మునగాకు, మునగపువ్వు , మునగకాయ A విటమిన్ సమృద్ధిగా ఉండును . పైనాపిల్ , ముల్లంగి , ఆవునెయ్యి , గోధుమగడ్డి రసంలో , పచ్చిబఠాణీలో , క్యారెట్ లో ఈ A విటమిన్ సమృద్దిగా లభించును . 


 *  E విటమిన్ - 


    A ,C విటమిన్ లను , ప్రోటీయాసిడ్స్ ను శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న విటమిన్ E లో ఉంది . వేరుశెనగ , బాదం , కాయగింజలలో , సోయాచిక్కుడులో , గట్టిగా ఉండు గింజలలో E విటమిన్ లభ్యం అగును . 


 *  K విటమిన్ - 


    K విటమిన్ రక్తం త్వరగా గడ్డ కట్టుటకు ఉపయోగపడును . K విటమిన్ లోపించడం వలన రక్తం గడ్డకట్టదు . ఈ విటమిన్ పచ్చి బఠాణి , ఆవునేయ్యిలో అధికముగా ఉండును . 


 *  B6 విటమిన్ - 


    ఈ విటమిన్ తెల్ల రక్త కణాల తయారీకి ఉపయోగపడును . అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసులలో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ B6 విటమిన్ ఎక్కువుగా ఉండును. 


 *  B12 విటమిన్ - 


    విటమిన్ B12 లోపిస్తే పెదవులలో పగుళ్లు వస్తాయి . ఎర్రరక్త కణాలు ఏర్పడుటకు , నాడీమండల వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గడం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి . విటమిన్ B12 పాలఉత్పత్తులలో , సోయాచిక్కుడు పాలలో ఎక్కువుగా ఉండును . 


 

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

విటమిన్ల ఉపయోగాలు - 1

 వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 1


  ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యముతో ఇబ్బందిపడుతున్నారు . ఈ అనారోగ్యాలకు ముఖ్యకారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే . మనం తీసుకునే ఆహారం పురుగుమందులతో కలిసి ఎప్పుడో విషంగా మారిపోయింది . ఇలాంటి విషపూరిత ఆహారం మరియు సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం లేదో అప్పుడే శరీరం రోగగ్రస్తం అయిపోతుంది . 


     మన శరీర ఆరోగ్యం అనేది విటమిన్ల పైన ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు ఆయా రోగాలు సంభవిస్తాయి. రోగగ్రస్తం అయిన శరీరము నందు రోగాన్ని పారదోలుటకు ఒక్క ఔషధం వాడటమే కాదు ఆ రోగం రావడానికి ఏ విటమిన్ తక్కువ అయ్యిందో గమనించి ఆ విటమిన్ కలిగిన ఆహారాన్ని లోపలికి తీసుకోవడం వలన ఆ జబ్బు నుంచి త్వరగా బయటపడవచ్చు . 


 ఈ విషయము గురించి రోగికి చికిత్స చేయు వైద్యుడికి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవాలి . 


   ఇప్పుడు ఆ విటమిన్ల లోపం వలన కలుగు సమస్యల గురించి మీకు వివరిస్తాను . వీటి గురించి నా గ్రంధాలలో సంపూర్ణ వివరణ ఇచ్చాను . 



 *  విటమిన్ D - 


  సాధారణంగా మన శరీరం విటమిన్లను తయారుచేసుకోలేదు . వాటిని ఆహార రూపంలో బయట నుంచి లోపలికి తీసుకోవాలి . D విటమిన్ మన శరీరంలో తయారగును . దీన్ని మన శరీరం సూర్యరశ్మి నుంచి తయారుచేసుకుంటుంది . ఎముకలు బలంగా ఉండుటకు ఈ విటమిన్ అత్యంత ముఖ్యమైనది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . రక్తనాళాలు బలంగా ఉండుటకు తోడ్పడును . ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యముగా జరిగేలా చూస్తుంది . అలానే ఇన్సులిన్ శరీరం గ్రహించేలా చూస్తుంది . శరీరంలో కణవిభజన నియంత్రిస్తుంది ఫలితముగా క్యాన్సర్ రాకుండా కాపాడును . 


            విటమిన్ D లోపము వలన ప్రేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ , ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్ , క్లోమ క్యాన్సర్ సంభవించును . ఉదయం 6 నుంచి 7 సమయములో వచ్చు సూర్యరశ్మిలో విటమిన్ D ఎక్కువుగా ఉండును. ఈ సమయములో సూర్యనమస్కారాలు చేయుట ఉత్తమం . D విటమిన్ లోపిస్తే పిల్లల ఎదుగుదల లోపిస్తుంది . 


    ఈ D విటమిన్ పాలు , గోధుమలు మరియు దేశీవాళీ ఆవునెయ్యిలో ఎక్కువుగా ఉండును . బాదంలో కూడా ఈ విటమిన్ లభ్యం అగును. మెగ్నీషియం కూడా ఉండును . ఈ మెగ్నీషియం లోపించిన తలవెంట్రుకలు ఊడును . 


    తరువాతి పోస్టు నందు మిగిలిన విటమిన్ల గురించి వివరిస్తాను . 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

ఓర్పే గెలిపిస్తుంది

 *_మీ #ఓర్పే గెలిపిస్తుంది.....!!_*

===============




*అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది.*


*ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు.*


*అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు.* *వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు*. 


*అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి* *కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని ........*


*‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్.*

*మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు*. 

*ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే*. 

*నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు*. 

*నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి*. 

*అది గుర్తుపెట్టుకో.* 

అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్. 

ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.*


 *లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు*.  

*నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు.*


 *కానీ అదీ సంస్కారం అంటే..*

*అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే...*

*అదీ తుఫాన్ అలను*

*చాకచక్యంగా* *తప్పించుకోవడమంటే ....*..


*లింకన్ వెంటనే తేరుకుని .......*

*ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ*

*‘‘ఇంత పవిత్రమైన సభలో* *నా తండ్రిని గుర్తుచేసిన*

*మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.*


*నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే.* 

*మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు.*

*అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు.*

*నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా.*


*మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను.*


*ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు*. 


*అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు.*

*ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే.*

*ఇదీ.. మనల్ని ముంచడానికి వచ్చిన అలమీద* 

*స్వారీ చేయడమంటే*

*ఇవీ జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన మెళకువలు.....!!*

celebration of a significant milestone -

 GOOD NEWS TO ALL MY BUSINESS COMRADES*

 📍📍📍📍📍📍📍

 We are delighted to announce the upcoming celebration of a significant milestone - the our Esteemed Organisation (RVG) 4th Anniversary! It's hard to believe that we have come this far, and we owe our success to the dedication, hard work, and unwavering commitment of each one of you.


 As we celebrate this momentous occasion, we cordially invite you to join us for a memorable evening filled with camaraderie, appreciation, and a touch of nostalgia. Your presence will make this event truly special.

 🚩🚩🚩🚩🚩🚩🚩

 Date: October 12th, 2023

 Time: 9:00 AM onwards

 Venue: SHUBHAM CONVENTION - NAGOLE

 🚩🚩🚩🚩🚩🚩🚩

 We are excited to have all our associates and Dy. Directors &teammates to gather under one roof to reminisce about our success journey, share our accomplishments, and set our sights on a future filled with even greater achievements

 🪭🪭🪭🪭🪭🪭🪭

 *Thanks & Regards*

 *SURABHI NAGARAJA SHARMA -DIRECTOR SALES*

 90591-72000

Paata


 

⚜ శ్రీ యోగమాయ మందిర్

 🕉 మన గుడి : నెం 201





⚜ ఢిల్లీ : మెహరోలి


⚜ శ్రీ యోగమాయ మందిర్



💠 శ్రీకృష్ణ జన్మాష్టమి- ఈరోజు కృష్ణుడి పుట్టినరోజు మాత్రమే కాదు, యోగమాయ పుట్టినరోజు  కూడా.


💠 వసుదేవుడు మరియు దేవకి దంపతుల ఎనిమిదవ కుమారునిగా శ్రీకృష్ణుడు (అష్టమి నాడు అర్ధరాత్రి మథుర రాజు కంస చెరసాలలో జన్మించాడు), అదే సమయంలో జన్మించిన ఒక ఆడ శిశువు ఎలా జన్మించింది అనే పురాణం మనందరికీ తెలుసు..


💠 యోగమాయ అనేది భగవంతుని యొక్క దివ్యశక్తి, దీని ద్వారా సృష్టికి వీలు కలుగుతుంది.  

దేవకి యొక్క ఏడవ గర్భంలో పిండాన్ని రక్షించడం కోసం భగవంతుడు ఆమెకు నిర్దిష్టమైన పనులను అప్పగిస్తాడు.

వసుదేవుని భార్య దేవకి గర్భం లో పిండాన్ని  రోహిణి గర్భానికి బదిలీ చేయడం  మొదటిది. 

దానినే సంకర్షణం అంటారు... 

అందుకే బలరాముడ్ని సంకర్షణుడు అని పేరు.


💠 తదుపరి దేవకి ఎనిమిదవ సంతానంగా భగవంతుడు అవతారం మరియు యశోద మరియు నందల కుమార్తెగా యోగమాయ జన్మించడం వంటి లీలలు చేయబడ్డాయి.


💠 చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడిని గోకులంలో యశోద చెంతకు చేర్చి, యశోదకు జన్మించిన యోగమాయని( ఆడపిల్లని) చెరసాలలో ఉన్న దేవకి దగ్గరకు నందుడి ద్వారా చేర్చడం లాంటి లీలలు ఆ విష్ణు మాయ లో భాగమే.


💠 కంసుడు తన చిన్నారి మేనకోడలిని చంపడానికి ప్రయత్నించినప్పుడు, యోగమాయ అతని పట్టు నుండి తప్పించుకుని, భగవంతుని సోదరిగా అవతరించిన ఎనిమిది చేతుల దేవత రూపాన్ని ధరించింది.  

నిస్సహాయ శిశువులను చంపకుండా హెచ్చరించినప్పుడు ఆమె కంసుడిలో భయం యొక్క విత్తనాలను నాటింది, అతని శత్రువు వేరే చోట పుట్టాడని వెల్లడిస్తుంది.  


💠 ప్రపంచంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో వివిధ పేర్లతో దర్శనమిస్తూ, యోగమాయ తన భక్తులను కాపాడుతూనే ఉంది.


💠 పురాణాల ప్రకారం, మెహ్రౌలీని ముందుగా యోగమాయ దేవత పేరు మీద యోగినిపురం అని పిలిచేవారు.  

ఆమె విష్ణుమాయ మరియు కృష్ణ పరమాత్మ యొక్క సోదరి.

ఆమే మరలా శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర గా పునర్జన్మ ఎత్తింది.


💠 చరిత్ర ప్రకారం, మహాభారతం చివరిలో పాండవులు యోగమాయ ఆలయాన్ని నిర్మించారు. 

ఈ మందిరం నగరంలో మహాభారత కాలం నాటి ఐదు యోగ మాయ దేవాలయాలలో ఒకటిగా నమ్ముతారు. 

యోగమాయకు  చెందిన మిగిలిన 4 బార్మర్, జోధ్‌పూర్, బృందావన్ మరియు ముల్తాన్‌లలో ఉన్నాయి. 


💠 ఈ ఆలయంలో విగ్రహం నల్ల రాతితో తయారు చేయబడింది మరియు పాలరాయితో చేసిన బావిలో ఉంచబడింది. 

యోగమాయ దేవి గర్భగుడిలో 42 అడుగుల ఎత్తు  గోపురం ఉన్న విమానం ఉంది.


💠 ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం 

యోగమాయతో పాటు, ఈ ఆలయంలో రాముడు, శివుడు, గణేశుడు మరియు ఇతర విస్తృతంగా పూజించే హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో ఉన్న ఒక శివలింగం అమ్మవారిని ఉంచిన స్థాయికి కొద్దిగా పైన ఉంచబడింది.  శివుడు ఎల్లప్పుడూ శక్తి కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాడు.


⚜ ఆలయంలో ముఖ్య పండుగలు : 


🔅 మహాశివరాత్రి - 

ఇది ఫిబ్రవరి/మార్చిలో జరుపుకునే పండుగ. 

ప్రజలు  శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు మరియు శివుని పేరులో శ్లోకాలు మరియు స్తుతులు పాడతారు. 


🔅 నవరాత్రి పండుగ - 

ఈ పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు, ఒకసారి వేసవి ప్రారంభంలో మరియు మళ్లీ శీతాకాలం ప్రారంభంలో. 


⚜ ఆలయంలో పూజలు/ ఆచారాలు :


🔅 ప్రతి ఉదయం మరియు సాయంత్రం హరతి తరువాత అమ్మవారి విగ్రహాన్ని పాలతో అభిషేకం చేయడం ప్రధాన ఆచారం. 

దీని తరువాత, శ్లోక పఠనం జరుగుతుంది.


💠 ప్రత్యేక పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు మరియు పూజలు నిర్వహిస్తారు. 

నవరాత్రి పండుగలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరియు అవి:


👉 మహాషష్ఠి - 

నవరాత్రులలో ఆరవ రోజు దుర్గా షష్ఠి లేదా మహా షష్ఠిగా జరుపుకుంటారు. 

శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గా పూజలో భాగంగా షష్ఠి కాత్యయని పూజను జరుపుకుంటారు. 

ఈ రోజున అమ్మవారి విగ్రహం ముఖాన్ని ఆవిష్కరించడం ప్రధాన ఆచారం.


👉 మహాసప్తమి - 

మహాసప్తమి చంద్రుని వృద్ధి దశలో ఏడవ రోజు. మహా అంటే గొప్ప మరియు సప్తమి అంటే ఏడవ రోజు. 

ఈ రోజున తొమ్మిది రకాల మొక్కలను పూజించడం అమ్మవారికి ప్రతీక.


👉 మహాష్టమి - 

మహాష్టమి, మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు, ఇది దుర్గా పూజలో ముఖ్యమైన రోజులలో ఒకటి. భక్తులు సంస్కృత భాషలో వివిధ శ్లోకాలు పాడుతూ అమ్మవారికి పూజలు చేస్తారు.


👉 మహానవమి - 

శుక్ల పక్షం (చంద్రుని వృద్ధి దశ) తొమ్మిదవ రోజున మహానవమి జరుపుకుంటారు. 

తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో ఇది తొమ్మిదవ మరియు చివరి రోజు. 

నవమి భోగాన్ని అమ్మవారికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.


💠 యోగమాయ ఆలయ సమయాలు :

ఆలయం ఉదయం 06.00 నుండి రాత్రి 08.00 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

ఆలయంలోకి ప్రవేశం మరియు పూజలు ఉచితం.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



వ్యాసమహర్షీ! దమయంతి నా వానరముఖాన్ని చూసి ఏనాడూ మథనపడలేదు గానీ, సేవలు

చెయ్యడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగివచ్చేది. అలాగే

రోజులు దొర్లుతున్నాయి.

ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడినుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు

చేస్తూ నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను.

దానిమీద కూర్చుని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకుని -

మామయ్యా! ఆవేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను.

రాకుమారిని చూస్తూంటే జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాపప్రక్షాళనం

చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాపవిమోచనం అనుగ్రహించాడు.


మేనల్లుడి సౌజన్యానికి నేనూ ముగ్ధుణ్ణి అయ్యాను. నేనిచ్చిన శాపమూ అలాగే మరలించాను.

యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను.

ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులూ దమయంతీ ఎంతగానో

సంతోషించారు. ధనకనకవస్తువాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు.

సత్యవతీనందనా! ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన

ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకింతవరకూ కనిపించలేదు. ఇక ముందు

కనిపించే ఆశలేదు.

(27-48)

సంసారేఽస్మిన్ మహాభాగ! మాయా గుణకృతేఽనృతే |

తనుభృత్తు సుఖీ నాస్తి న భూతో న భవిష్యతి

దుర్గముడు దుష్టబుద్ధి కలవాడు

 దుర్గముడు దుష్టబుద్ధి కలవాడు..మూర్తీభవించిన తమోగుణ శ్రేష్టుడు.మిక్కిలి సోమరి.అహంకారి..క్రూరుడు.తిండిపోతు..చారుల ద్వారా దేవ దానవుల చరితమును తెలుసుకున్నాడు..దేవతల అహంకారానికి ,బలానికి  మూల కారణం వేదాలు అని గ్రహించాడు..ఆ వేదాలను తన స్వాధీనం లోకి తెచ్చుకున్నట్లు ఐతే దేవతలు బలహీనలై నశించి పోతారని భావించాడు..విధాత ఐన బ్రహ్మను గురించి గాలినే ఆహారంగా తీసుకుంటూ వేయి సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు..ఆ తపస్సునకు లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి..దుర్గముని  తపస్సునకు బ్రహ్మ ప్రసన్నుడై  "నీకు శుభం కలుగు గాక..ఏం వరం కావాలో కోరుకోమన్నాడు" ..బ్రహ్మ మాటలకు పరమానంద         భరితుడైన దుర్గముడు భక్తితో పూజించి వినమ్రుడై "చతురాననా ! విధాతా! నాకు వేద విజ్ఞానాన్ని ప్రసాదించు ..దేవతల దగ్గరా,బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేద మంత్రాలన్నీ నాకు ప్రసాదించు..ఆ మంత్రాలు నాకు రాగానే వారు వాటిని మరచి పోవాలి..దేవతలందరినీ జయించే బలం నాకు ప్రసాదించమని కోరాడు..బ్రహ్మ ఆశ్చర్యపోయి , వెను వెంటనే తేరుకుని తధాస్తు అన్నాడు.. ఆ క్షణం నుండి దుర్గమునికి సకల వేద మంత్రాలు స్వాధీన మయ్యాయి..విప్రులు వేదాలను మరచి పోయారు..దానితో స్నానం, సంధ్యావందనం,నిత్యాగ్ని హోత్రాలు,యజ్ఞాలు,జపాలు అన్నీ స్తంభించి పోయాయి..భూమండలం అంతా అల్లకల్లోలం ఐపోయింది.యజ్ఞాల ద్వారా వచ్చే హవిస్సులు అందకపోవడం వలన దేవతలు నిర్వీర్యులు అయ్యారు..జరారహితులు అయినప్పటికీ వారు జరాగ్రస్తులు అయ్యారు..సకాలంలో వర్షాలు కురవక పోవడంతో నేలలు బీటలు వారాయి..నూతులు, బావులు,చెరువులు,నదులు నీళ్ళు లేక ఎండి పోయాయి..భూమండలం అంతా అనావృష్టి ఏర్పండింది..అసంఖ్యాక ప్రజలు, పశు పక్ష్యాదులు దుర్మరణం పాలయ్యాయి..చివరకు కొందరు బ్రాహ్మణులు, ము,ఋషులు అమ్మవారి అనుగ్రహం తో బ్రతికిన వారు హిమాలయాలకు వెళ్లి ,కొండ గుహల యందు చేరి శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ప్రార్థిస్తూ" నీవే మాకు దిక్కు..ఈ ఘోర సంకటం నుంచి మమ్మల్ని ఉద్ధరించు..కరుణ చూపించు..నీవు తప్ప మమ్మల్ని  కాపాడే వారు ఎవరూ లేరు..మమ్మల్ని అనుగ్రహించు  తల్లీ ":అని కోరినారు..వీరి ప్రార్థనలను విని కరుణతో జగదాంబ ఐన మహేశ్వరి వారి ఎదుట ప్రత్యక్ష మైనది.. సర్వ శక్తులనూ సమకూర్చింది..దేవ బ్రాహ్మణులు జయజయ ధ్వానాలు చేశారు.. దుర్గమునితో జరిగిన యుద్ధ సమయంలో దేవి శరీరం నుండి కామాక్షి,మోహిని,చిన్నమస్త, గుహ్యకాళి అనే శక్తులు ఉద్భవించాయి..దుర్గముని సైన్యాన్ని  11 రోజులు యుద్ధం చేసి ఓడించింది.."ఈ వేదాలు నా దివ్య శరీరం.వేదాలున్న చోట నేనుంటాను..వీటిని మీరు నిరంతరం అభ్యసించినంత కాలం ఎవరూ ఈ వేదాలను అపహరించలేరని పలికి వారిని తన చల్లని చూపులతో ఆశీర్వదించి అదృశ్యమైంది..ఆది పరాశక్తి,పరాశక్తి ఐన దుర్గాదేవిని అందరం భక్తి శ్రద్ధలతో పూజించి ,మాత ఆశీస్సులను పొంది జీవితాలను పొంది ధన్యం చేసుకుందాము..సర్వే జనాః సుఖినో భవంతు..

కర్మాచరణంలో

 *1948*

*కం*

కర్మాచరణము నందున

కర్మంబుల మర్మమెరుగు కర్మము కన్నన్

కర్మను విధినిర్దిష్టపు

ధర్మ ముగా నెరుగు వారె ధన్యులు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! కర్మాచరణంలో ఆ కర్మ యొక్క మర్మం తెలుసుకోవడం కంటే అది కర్తవ్యధర్మంగా గా భావించేవారే ధన్యులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Pully system


 

Mechanical engineering


 

Knot


 

LED tube light making


 

Mokalla neppulu home remedy


 

Burning desire


 

Ganapati


 

Salvaar striching


 

Gaming P C


 

LED repair very easy


 

మహాభారతములో - ఆది పర్వము* *ప్రథమాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ప్రథమాశ్వాసము*


                      *16*



*ఖగముని వృత్తాంతం*


రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు. రురుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటి అని " అడిగాడు. అందుకు ఆ పాము నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా సహచరుడు ఖగముడు. ఒక రోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు. ఆసమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేసాను. అతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా ! నన్ను క్షమించ లేవా అని ప్రార్థించాను. నా ప్రార్థన మన్నించి ఖగముడు మిత్రమా ! నా మాట జరిగి తీరుతుంది. అయినా నీవు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది. అని చెప్పాడు. అయ్యా మీరు బ్రాహ్మణులు. దయాగుణం కలవారు. పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు. నీవు కూడా పాములను చంపడం ఆప లేవా !  అన్నాడు. రురుడు పాములను చంపడం ఆపివేసాడు. ఈ కథను వింటున్న మునులు  తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి. మాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు.

చేసిన పాపములు

 *1947*

*సర్వలఘుకందము*

కృత సుకృత ఫలము జనులకు

సుత సతి హిత గణముల యుత సుఖముల నొసగున్

కృతమగు నఘములు మనిషికి

వెతలిడు పరిజనుల నొసగు వితతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చేసిన పుణ్యములు జనులకు  భార్య,పిల్లలు, శ్రేయోభిలాషులు మొదలైన వారితో సుఖములు కలిగించును. చేసిన పాపములు మనిషికి కష్టాలు కలిగించే పరివారము నిస్తాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

భ్రమ పడుతున్నాము

 *సుభాషితం*

🌹🌹🌹🌹🌹


*లోకఃపృఛ్ఛతిసద్వార్తాం*

 *శరీరే కుశలం తవl* *కుతఃకుశలమస్మాక* *మాయుర్యాతిదినేదినేll*


 *తాత్పర్యము,మనం ఎవరైనాకనిపించినప్పుడు క్షేమంగా ఉన్నావా? అని అడుగుతాము ఇది లోకంలో పరిపాటి*.


 *కానీ లోకంలో మనుష్యులకు క్షేమం ఎక్కడ ఉన్నది. మనుష్యులకు రోజురోజు ఆయుష్షు తగ్గిపోతున్నది . అలాంటప్పుడు క్షేమం ఎక్కడ ఉన్నది? అయినా క్షేమంగా ఉన్నావా అని అడిగేవారు క్షేమంగా ఉన్నామని చెప్పేవారు కూడా ఈ విషయం మర్చిపోతున్నారు.ఈ శరీరం నశించిపోయేదనీ ,దీనికి క్షేమం అనేది లేదని తెలుసుకోలేకుండా ఉన్నారు. అందరం క్షేమంగా ఉన్నామని భ్రమ పడుతున్నాము*

Photo















 

అంతః కరణ శుద్ధి* *ఎట్లా వస్తుంది... ?*

 *అంతః కరణ శుద్ధి*

                 *ఎట్లా వస్తుంది... ?*

                    ➖➖➖✍️


```భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే తపస్సు అంటారు.


మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు.


ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక తపస్సుగా గ్రహిస్తాడు.


అలా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి.


శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి.


వాసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి.       ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన  మనస్సు చేకూరుతుంది.


శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించు కోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. ఉన్న ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? మోక్షాకాంక్ష ఉండబట్టి.


మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు.


మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అలా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి.


దేనికి? ఆనందం కోసం - మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.


ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం.


నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వ్యభిచారం కూడా లేకుండా చూసుకోవాలి.


మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచరిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.


ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతోంది… 

ఈ నిత్య ఈ మానసిక వ్యభిచారం! 

దాన్ని అన్ని విధాల అరికట్టాలి.


దాన్ని అరికట్టటానికి ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది.


అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షంకోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది.


సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది. కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి.


అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి.


సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి. 


ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది.


ఏ కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన వాళ్ళుయినా దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం సాధన చెయ్యాలి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

భక్తిపరుడు

 *భక్తిపరుడు..*


శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ ఆయన మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో అడుగుపెట్టారు..కుళాయిల వద్దకు వెళ్లి కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకొని..స్వామివారు త్రవ్వించుకున్న బావి లోంచి బకెట్ తో నీళ్లు తోడుకొని..వాటిని చేతిలో పోసుకొని తీర్ధం లాగా కళ్లకద్దుకొని తాగి..మిగిలిన కొద్దీ నీళ్లను తన తలమీద చల్లుకుని..మా సిబ్బంది వద్దకు వెళ్లి కూర్చున్నారు..ఆయనను చూడగానే.."గంగయ్య గారూ..ఎప్పుడు వచ్చారు?.." అంటూ మా సిబ్బంది ఆప్యాయంగా పలకరించుకున్నారు..అక్కడినుంచి లేచి నేను కూర్చున్న చోటుకి వచ్చి.."అయ్యగారూ బాగున్నారా?.." అంటూ నన్ను ప్రశ్నించి..నమస్కారం చేశారు..నేనూ ప్రతి నమస్కారం చేసి.."ఇప్పుడేనా రావడం గంగయ్య గారూ.." అని అడిగాను.."ఇప్పుడే అయ్యా..స్వామివారిని దర్శించుకొని వెళ్లాలని అనిపించింది..వచ్చేసాను..రేప్పొద్దున తిరిగి వెళ్లిపోతాను..వీలుంటే ఏదైనా ఒక రూము ఇప్పించండి..లేకపోయినా బాధలేదు..ఈ మంటపం లోనే పడుకుంటాను..ఆ స్వామి దయ ఎలా ఉంటే అలా.." అని చెప్పారు..రూములేవీ ఖాళీ లేవని చెప్పాను.."పర్లేదు స్వామీ.." అని తన చేతి సంచీని మా సిబ్బంది కూర్చున్న బల్ల ప్రక్కన పెట్టి..మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..


గంగయ్య గారు హైదరాబాద్ లో వుంటారు..వ్యాపారం చేసుకుంటూ వుంటారు..ముగ్గురు సంతానం..అందరికీ వివాహాలు చేసేసారు..ఆయన తన ముప్పయ్యవ ఏట తొలిసారిగా..అంటే..సుమారు 1978, 79 ప్రాంతంలో మొగిలిచెర్ల వచ్చి..స్వామివారి సమాధిని తొలిసారి దర్శించుకున్నారు..ఆరోజు ఆయన కోరుకున్న కోరిక..తాను హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేయాలని అనుకుంటున్నాననీ..తనకు ఏవిధమైన ఇబ్బందులూ కలుగకుండా..తానూ..తన సంసారం చల్లగా వుండేటట్టు చూడమని..స్వామివారి సమాధి వద్ద కోరుకున్నారు..గంగయ్య గారి మంచితనం కావొచ్చు..స్వామివారి ఆశీర్వాదం కావొచ్చు..ఆయన వ్యాపారం లో నిలద్రొక్కుకున్నారు..అక్కడే ఇల్లు కట్టుకున్నారు..పిల్లలను జాగ్రత్తగా పెంచుకున్నారు...వీటన్నింటికీ మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులే కారణం అని గంగయ్య గారి ప్రఘాఢ విశ్వాసం..అందుకనే ప్రతి ఏటా..మూడుసార్లు మొగిలిచెర్ల కు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతుంటారు..ప్రతిసారీ స్వామివారి మందిర అభివుద్ది కొఱకు కొంత విరాళం గా ఇచ్చి వెళుతుంటారు..


"అయ్యగారూ..పోయినసారి వచ్చినప్పుడు..ఒక చిన్న సమస్యతో వచ్చాను..చిన్నదైనా పెద్దదైనా ఈ స్వామివారికి చెప్పుకుంటే..ఇక భారం ఆయనే భరిస్తాడు కదా అనే నమ్మకం తో వచ్చానయ్యా..మా రెండోవాడి కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు..తరచూ జ్వరం వస్తోంది..హైదరాబాద్ లోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూపించాము..అన్ని పరీక్షలూ చేశారు..కొన్నాళ్ళు బాగానే ఉంటాడు..నాలుగైదు నెలల తరువాత మళ్లీ అదేరకంగా అనారోగ్యం తో ఉంటున్నాడు..అప్పుడు నా కుమారుడికి సలహా ఇచ్చాను..ఒక్కసారి పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల వెళ్లి..ఆ దత్తాత్రేయుడి పాదాలవద్ద నమస్కారం చేసుకొని రండి..ఏవైనా దోషాలుంటే పోతాయి..పిల్లవాడూ బాగుపడతాడూ..అని..నామాట వినలేదు..నేనే ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద గట్టిగా మొక్కుకొని..మీ దగ్గరనుంచి స్వామివారి విభూతి గంధం తీసుకెళ్ళాను..మా కోడలికి చెప్పి..ప్రతిరోజూ పిల్లవాడి నుదుటిన స్వామివారి విభూతి పెట్టమని చెప్పాను..ఆ తరువాత ఈరోజు దాకా వాడిలో అనారోగ్యం అనే మాటే లేదు..ఈరోజు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను.." అన్నారు.."గంగయ్య గారూ కల్మషం లేని భక్తి మీది..మీ కోరిక స్వామివారు తప్పక నెరవేస్తారు.." అన్నాను..ఆ మాట నిజం కూడా..గంగయ్య గారు త్రికరణ శుద్దిగా స్వామివారిని నమ్మారు..అందువల్ల వారిమీద స్వామివారి కృప ఉండటం లో ఆశ్చర్యం లేదు..


ఏనాటికైనా మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి దగ్గరలో ఒక ఇల్లు కట్టించుకొని..తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిరాడంబరంగా గడపాలని గంగయ్య గారి కోరిక..అది నెరవేరే రోజు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు..మరి స్వామివారు ఎప్పుడు కరుణిస్తారో చూడాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

అద్వితీయాలు

 అద్వితీయాలు


“మాత్రా సమం నాస్తి శరీరపోషణం 


చింతా సమం నాస్తి శరీరశోషణం


భార్యా సమం నాస్తి శరీర తోషణం  


విద్యాసమం నాస్తి శరీరభూషణమ్."


“శరీరపోషణ విషయంలో తల్లికి సాటియైనవారు లేరు. శరీరాన్ని శుష్కింపజేయటంలో చింతతో సమమైనది లేదు. శరీరానికి సంతోషం కలిగించటంలో భార్యతో సమానులు లేరు.శరీరాన్ని భూషింపజేయటంలో విద్యకు సాటివచ్చేది లేదు " అని ఈ శ్లోకానికి అర్థం.


సృష్టిలో ఏజీవియైనా ప్రథమంగా మాతృపోషణలోనే ఎదుగుతుంది. మాతృమూర్తి స్తన్యమే అమృతప్రాయమై పసి జీవుల ప్రాణదీపాలను నిలుపుతుంది. అందుకే తీర్చుకోలేని ఋణాలలో మాతృఋణం మొదటిది. తాను తిన్నా, తినకపోయినా తన బిడ్డతినటమే ఆమెకు ముఖ్యం. అన్నం తిననని మారాం చేసే బిడ్డను బ్రతిమాలి, లేదా దండించియైనా అన్నం పెడుతుంది అమ్మ. మల, మూత్రాలను తొలగించి , పరిశుభ్రమైన బట్టలు కట్టటంలో, బిడ్డకు అవసరమైన ఔషధాలు వాడి ఆరోగ్యాన్ని కాపాడటంలో తల్లి అనన్యమైన శ్రద్ధ తీసుకుంటుంది.


చింత మనిషిని క్రుంగదీస్తుంది.

 

“చితా చింతా సమా ప్రోక్తా బిందుమాత్రం విశేషతా, 


సజీవం దహతే చింతా, నిర్జీవం దహతే చితా " 


(చిత, చింత - రెండూ సమానమే. బిందువే భేదం. చింత – జీవించి ఉన్నవారిని దహిస్తుంది. చిత (చితి) నిర్జీవులను దహిస్తుంది.) అనేది అనుభవజ్ఞులమాట. మనోవ్యాధికి మందులేదంటారు.మనస్సులో ఒక చింత ఉంటే అది శరీరాన్ని రోజురోజుకూ శుష్కింపజేస్తుంది.


భార్య తన భర్తకు అవసరమైన వస్తువులను సమకూర్చి సంతోషాన్ని కలిగిస్తుంది. అతని ఇష్టానిష్టాలను బట్టి ఆహారాన్నిసిద్ధంచేస్తుంది. అలసిన, అధైర్యపడిన సమయాల్లో వానికి అండగా నిలబడుతుంది. ముఖ్యగృహ బాధ్యతలను తాను స్వీకరించి అతని శారీరక, మానసికారోగ్యాలను అనితర సాధ్యంగా సంరక్షిస్తుంది.


విద్య - జ్ఞానహేతువై ముక్తిని ప్రసాదిస్తుంది. ధర్మసాధనమైన దేహానికి విద్య చేకూర్చే పవిత్రతను మించిన భూషణం మరొకటి ఏముంటుంది ? అందుకే విద్య నరులకు అలంకారమని, ప్రచ్ఛన్నమైన గుప్త ధనమని, అది భోగాన్ని, కీర్తిని కలిగిస్తుందని, విద్యా విహీనుడు పశుతుల్యుడని భర్తృహరి చెప్పాడు.

జీవితం వృథా అవుతుంది

 ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. 

ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. 

వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. 

'అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. 

దయచేసి నన్ను కాల్చొద్దు. 

నన్నిలా వదిలెయ్‌. 

సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది' అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. 

కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు.


 ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. 

సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు' అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. 


అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే... అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు.


 ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను' అనుకుంది ఆ పచ్చి కుండ. 

బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. 

కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. 

తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. 

కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది


చివరికి సారాంశం:


'జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు'...

ఆలోచనాలోచనాలు

 ఃఃఃఃఃః ఆలోచనాలోచనాలు ఃఃఃఃఃః                              ***** చాలాకాలం క్రిందట "" కీ"" ఇస్తే నడిచే పెద్ద, పెద్ద గోడయారాలు ఇండ్లలో దర్శనం ఇస్తూ వుండేవి. వాటి దిగువ భాగంలో "ఒక పెండ్యులం" (లోలకం) అటూ, ఇటూ తిరుగుతూ భలే తమాషాగా ఉండేది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. జీవితం కూడా ఒక లోలక గడియారమే! నిరంతరం ఆశానిరాశల మధ్య ఊగిసలాటే! ఏదీ స్థిరంగా ఉండదు.                                    ***** ఆశావాది కొత్త పెండ్లికొడుకులా, "" అప్పుడే తెల్లారిపోయిందా?"" బోలెడంత సంబరపడిపోతాడు.             మరి నిరాశావాదేమో, ""అప్పుడే తెల్లవారి చచ్చిందా?"" అని తెగ నిరాశలో కృంగిపోతుంటాడు.                ఆశావాది "" ఏది జరిగినా? అదంతా మన మంచికే!"" అని తీర్మానించి, నిబ్బరంగా వుంటాడు.               నిరాశావాదికి "" అన్నీ మన చెడుకొరకే!""అనిపించి క్రుంగిపోతుంటాడు.               ఆశావాది మరచిపోవడానికి నవ్వుతాడు.                         నిరాశావాదేమో నవ్వడమే మరచిపోతుంటాడు.              ఆశావాది ప్రతి కష్టంలోను, ఒక అవకాశాన్ని వెతికే పనిలో ఉంటాడు.                నిరాశావాదేమో ప్రతి అవకాశం లోనూ కష్టాల సంఖ్యలను గణిస్తూ కాలాన్ని గడుపుతుంటాడు.                నిరాశావాది వలలో బంధింపబడి, ప్రాణం పోగొట్టుకొన్న చేపవలె ఉంటే, ఆశావాది బెస్తవాని తట్టనుండి అమ్మబడినా, నాకు ప్రాణభిక్ష పెట్టమని పోరాడే చేపలాగా గిలగిలా కొట్టుకొంటూ తన ప్రయత్నం తాను చేస్తూవుంటాడు.                   ***** సగం నీటితో కూడిన గాజుగ్లాసు వుంది. సగం నిండుగా ఉన్నందుకు, ఆశావాది సంతోషిస్తాడు.       సగం వెలితిగా ఉన్నందుకు నిరాశావాది దుఃఖిస్తాడు.      సూర్యోదయం అయినందుకు ఆశావాది సంతోషిస్తే, నిరాశావాది ఆ సూర్యోదయం శాశ్వతంగా అట్లే నిలచివుండనందుకు విచారసాగరంలో మునిగిపోతాడు. ఒకటి మాత్రం సత్యం. సూర్యోదయం అవుతుంది. అది శాశ్వతంగా అట్లాగే నిలచివుండదు. ఇది యదార్థ వాది విశ్లేషణ. మనం యదార్థవాదులుగ మన జీవితాలను కొనసాగిద్దాం.                         ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~.                         Answers to sharpen your mind!                      1* Bearing 2* Redemption 3* When you are looking at a clock 4* A Donut                   ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                           తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                          1* పిట్ట కొంచెం, కూత ఘనం.                                 2* పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.                            3* పిల్లకాకికేంతెలుసురా? ఉండేలు దెబ్బ!                     4* పిల్లికి చెలగాటం; ఎలుకకు ప్రాణసంకటం.         5* పొమ్మనలేక పొగబెట్టినట్లు!                      6* పెనంమీది నుండి పొయ్యిలో పడ్డట్లు;                7* పులిని చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు.           8* మనిషికొక మాట; గొడ్డుకొక దెబ్బ.                      9* అడిగేవాడికెప్పుడూ చెప్పేవాడు లోకువ;              10* కాచిన చెట్టుకే కదా, రాళ్ళదెబ్బలు.                       తేది 7--10--2023, శనివారం, శుభోదయం.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



వ్యాసమహర్షీ! దమయంతి నా వానరముఖాన్ని చూసి ఏనాడూ మథనపడలేదు గానీ, సేవలు

చెయ్యడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగివచ్చేది. అలాగే

రోజులు దొర్లుతున్నాయి.

ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడినుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు

చేస్తూ నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను.

దానిమీద కూర్చుని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకుని -

మామయ్యా! ఆవేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను.

రాకుమారిని చూస్తూంటే జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాపప్రక్షాళనం

చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాపవిమోచనం అనుగ్రహించాడు.


మేనల్లుడి సౌజన్యానికి నేనూ ముగ్ధుణ్ణి అయ్యాను. నేనిచ్చిన శాపమూ అలాగే మరలించాను.

యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను.

ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులూ దమయంతీ ఎంతగానో

సంతోషించారు. ధనకనకవస్తువాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు.

సత్యవతీనందనా! ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన

ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకింతవరకూ కనిపించలేదు. ఇక ముందు

కనిపించే ఆశలేదు.

(27-48)

సంసారేఽస్మిన్ మహాభాగ! మాయా గుణకృతేఽనృతే |

తనుభృత్తు సుఖీ నాస్తి న భూతో న భవిష్యతి

LED light repair


 

12 v energy


 

Smart idea


 

Muredesvar


 

Ayurveda chitka


 

OPCD Engine


 

Street lights


 

Sweing techniques


 

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 46*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 46*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

      

      *లలాటం లావణ్య ద్యుతివిమల మాభాతి తవ యత్*

       *ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |*

       *విపర్యాసన్యాసా దుభయ మపి సమ్భూయ చ మిథః*

        *సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ‖* 


అమ్మవారి లలాటము గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో.


ఆ లలాటము ఎలా వున్నది?

ఆమె లలాటము లావణ్యమై కాంతివంతంగా వున్నది. తెల్లని కాంతులను చిమ్ముతున్నది. ముత్యములోని తెల్లని కాంతినీ, నునుపుదనాన్నీ లావణ్యం అంటారు. అలాగే ఉప్పులోని తెల్లని కాంతిని కూడా. అందుకే లవణము అని పేరు.


ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ = అష్టమినాటి చంద్రబింబం శుక్లపక్షం లోనూ, కృష్ణపక్షంలోనూ ఒక్కలాగే ఉంటుంది. 

శివ, పార్వతులు లలాటంపై ధరించే శుక్ల తదియ నాటి చంద్రకళ యొక్క రెండు కొసలు కలిపితే ఎలా ఉంటుందో నీ లలాటము అలాగ వున్నదమ్మా అంటున్నారు ఇక్కడ. రెండవ సగభాగం అమ్మవారి కిరీటము క్రింది భాగంలో ఉండి, రెండూ కలిపి పూర్ణ చంద్రబింబంలాగా వున్నదమ్మా!


విపర్యాసన్యాసా దుభయమపి సమ్భూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః = ఈ రెండు అర్ధచంద్ర బింబములను అమృత లేపముతో అతికించినట్లుగా ఉందమ్మా! రాకా హిమకరుడు అంటే పూర్ణ చంద్రుడు.


*అష్టమీచంద్ర విభ్రాజదళికస్థలశోభితా* *ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా* అమ్మవారి సహస్రనామాల్లోనివి.అమ్మవారి లలాటము అష్టమి నాటి చంద్రుని కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆమె ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రునిలో మచ్చ వలె ఉన్నదట.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-67🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-67🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఈసన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్ష్ముణులతో కొలువై ఉన్నారు

ఇందుకు కారణమేమనగా;


దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమునకు "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని (విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది. 


ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట. 


ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడా వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలై లోని తిరువేంగడముడై యాన్ సన్నిధిలో వేంచేసింప చేసారు


. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.


ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధికై కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించారు.


 ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు చేయబడుచున్నది.


ఇట్లే "తిరుక్కురువై" అనే గ్రామంలో "కురువైనంబి" అనుకుమ్మరి శ్రీవేజ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు. 


అతడు పరమపదించు సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆ భక్తునకు దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట. 


ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆగ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదుల లేక సహజరూపంలో ఉండు శ్రీవేజ్కటాచలపతిని, ఆప్రక్కనే "కురువైనంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.


 ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.


శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట. 


ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట. 


మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామి పాదములు దర్శనమిచ్చినవి. 


శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్భుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడా అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించారు.


తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు


భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్దసంగ్రహమును ఉపన్యసించారు.


అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే

విసత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే

శ్రుతి శిరసి విదిప్తే బ్రహ్మణి శ్రీనివాసే

భవతు మమ నరస్మిన్ శేముషీ భక్తిరూపా||


అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈ ఆలయ ప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చు చున్నది. మరియు ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు.


 వీరు శ్రీవేంకటాచలాదీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!


ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్దులైన శ్రీవేదాన్త దేశికులవారి "దయాశతకమ్" అగ్రగణ్యమైనది

.తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకును కరుణైక పాత్రమ్" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళ మహామునుల అష్టదిగ్గజములలో నొకరైన "శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామిని గూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించారు.


 ఇవినేడును అనుదినం ఉష:కాల సేవలో స్వామియొద్ద అనుసంధింపబడును బహుళప్రచారం పొందియున్నవి.


శ్రీగోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు. 


శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీశ్రీశ్రీ పరకాల మఠం జీయర్స్వామివారు (మైసూర్) "అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీశ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు. 


పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు. 


తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి.దేవస్థానం వారు స్వర పరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించారు. 


పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించారు.


మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయేగాక స్వామి మహిమలను ప్రత్యక్షముగా నిరూపించింది.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 57*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 57*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేము. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రదావస్థలో జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరియైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం.


నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తన లాంటి తన 'కవల'ను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే!  అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా, నరేంద్రుడు చేసేదంతా ఆ 'కవల' కూడా చేసేవాడు. కొన్ని సమయాల్లో ఒక గంటసేపటి దాకా ఆ 'కవల' ఉండేవాడు. ఈ విషయాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కాని ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు; అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని మాత్రం ఆయన చెప్పారు. '


మరొక అనుభవం: ఒక రోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, "ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసివున్నాను! ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది, ఏం ఆశ్చర్యం!" అన్నాడు. తమాషా ఏమిటంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అదే మొట్టమొదటిసారి. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు:


"చిన్నతనం నుండే కొన్ని చోట్లను, వస్తువులను, వ్యక్తులను చూసినప్పుడు, వారిని మునుపే చూసాను, మెలగాను అనే భావన కొన్ని సమయాలలో కలగడం కద్దు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి రాదు. అలాగని వారిని అంతకు మునుపు చూడలేదనీ చెప్పలేను. ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతుంది. 


మిత్రులతో మాట్లాడుతూవుంటాను. హఠాత్తుగా వారిలో ఏదో ఒక మాట నా జ్ఞాపకాన్ని రగుల్కొల్పుతుంది. 'ఇదే విషయం గురించి వీరితో ఇదే ఇంట్లో మునుపు కూడా మాట్లాడివున్నాను. కచ్చితంగా ఈ మిత్రుడే అప్పుడూ ఇదే అభిప్రాయం వెల్లడించాడు' అని అనిపిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడ, ఎప్పుడు అని మాత్రం జ్ఞాపకానికి రాదు. 


పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకొన్నప్పుడు, ఈ చోట్లను ఈ వ్యక్తులను గత జన్మలలో కలుసుకొని ఉండవచ్చు, ఆ జ్ఞాపకాలే కాస్త అప్పుడప్పుడు వస్తున్నాయని సరి పెట్టుకొన్నాను. కాని ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు. ఇప్పుడు నాకు నిజం బోధ పడింది. నేను ఈ జన్మలో ఎవరెవరిని ఎక్కడ, ఎప్పుడు ఎలా కలుసుకోబోతున్నాను, మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునుపే చిత్రప్రదర్శనలా చూసివుండాలి; ఆ జ్ఞాపకాలే అప్పుడప్పుడు మనస్సులో మెదలుతున్నాయి.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 46*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 46*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

      

      *లలాటం లావణ్య ద్యుతివిమల మాభాతి తవ యత్*

       *ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |*

       *విపర్యాసన్యాసా దుభయ మపి సమ్భూయ చ మిథః*

        *సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ‖* 


అమ్మవారి లలాటము గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో.


ఆ లలాటము ఎలా వున్నది?

ఆమె లలాటము లావణ్యమై కాంతివంతంగా వున్నది. తెల్లని కాంతులను చిమ్ముతున్నది. ముత్యములోని తెల్లని కాంతినీ, నునుపుదనాన్నీ లావణ్యం అంటారు. అలాగే ఉప్పులోని తెల్లని కాంతిని కూడా. అందుకే లవణము అని పేరు.


ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ = అష్టమినాటి చంద్రబింబం శుక్లపక్షం లోనూ, కృష్ణపక్షంలోనూ ఒక్కలాగే ఉంటుంది. 

శివ, పార్వతులు లలాటంపై ధరించే శుక్ల తదియ నాటి చంద్రకళ యొక్క రెండు కొసలు కలిపితే ఎలా ఉంటుందో నీ లలాటము అలాగ వున్నదమ్మా అంటున్నారు ఇక్కడ. రెండవ సగభాగం అమ్మవారి కిరీటము క్రింది భాగంలో ఉండి, రెండూ కలిపి పూర్ణ చంద్రబింబంలాగా వున్నదమ్మా!


విపర్యాసన్యాసా దుభయమపి సమ్భూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః = ఈ రెండు అర్ధచంద్ర బింబములను అమృత లేపముతో అతికించినట్లుగా ఉందమ్మా! రాకా హిమకరుడు అంటే పూర్ణ చంద్రుడు.


*అష్టమీచంద్ర విభ్రాజదళికస్థలశోభితా* *ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా* అమ్మవారి సహస్రనామాల్లోనివి.అమ్మవారి లలాటము అష్టమి నాటి చంద్రుని కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆమె ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రునిలో మచ్చ వలె ఉన్నదట.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సాయి బాబా

 ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా*  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.

సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.


ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..

1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, 

మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..


1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. 

హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..


(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )


 *సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.

 *సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*

*సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  

  ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*


 విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..


1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..

ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..

కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 


దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..


 ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..


హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.

* *

సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),

ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 


శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "


ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43


సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 

(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )


" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 

 " పేజీ No. 103 &

" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 

" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )


సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.

               * *

సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,  

ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. 

తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. 

  * * *

ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. 

తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,

    **  

త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  

అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, 

విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.

విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,

అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,

కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?


ఇందులో నే   పెద్ద కుట్ర  ఉన్నది..


హిందువుల ఆహారపు అలవాట్ల పై  " హలాల్ " పేరుతో  దాడి.

(హలాల్ ఆంటే " అల్లా కు అర్పించి,,  ఇస్లాం  నిబంధనలు ప్రకారం  చేసిన  ఆహారం ).


ధార్గాలు ( సామాధులు / గోరీలు ) ల పేరు తో   హిందూ గ్రామ దేవాతలపై  దాడి,


ఇప్పుడు,    సాయిబాబా ( సాయిబు ) పేరుతో   హిందూ ప్రధాన  దేవాతలపై  దాడి,,


ఒక అల్లా ను ఆరాధించి, మసీదు లో  ఉండి  నమాజ్  చేసే  ఒక  సాయిబు ను  హిందూ ధర్మం లో  ఒక Plan ప్రకారం  ప్రవేశపెట్టినారు,,  first ధాత్తత్రేయ అవతారం  అన్నారు,  క్రమం గా,  సాయిరాం, సాయికృష్ణ  అంటూ  హిందూ ప్రధాన దేవుళ్ళ పై దాడి ప్రారంభించారు,,  ఇప్పుడు, ఏకంగా  విష్ణు సాయి సహస్ర నామాలు అంటూ  పుస్తకాలు కూడా వ్రాసినారు,, ఒక Plan ప్రకారం  అన్ని  ప్రాంతలలో  పెద్ద పెద్ద విగ్రహాలు ( కనీసం 20 అడుగులు ) కడుతున్నారు. 


ముస్లిం మేధావులు ఎప్పటినుంచో చెపుతున్నారు   , నమాజ్ చేసి, అల్లా మాలిక్ అంటూ   అల్లా  ను ఆరాధించిన   సాయిబాబా ను  పూజించడం ఆంటే, అల్లా ను ఆరాదించడమే అని,,


చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న  ఈ ప్రమాదం ను    అడ్డుకట్ట వెయ్యక పోతే, భవిష్యత్ లో  హిందూ ధర్మం నాశనం అవుతుంది......

👆🏼👆🏼👆🏼👇🏾👇🏾👇🏾

రామాయణ భారత భాగవతాలలో 

ముస్లిం కుటుంబాలలో

ఎక్కడా కనిపించని 

సాయి

సాయిరాం

సాయి కృష్ణ

హిందువుల కుటుంబాలలో

రాముడు 

కృష్ణుడు 

ఈశ్వరుడు 

వెంకటేశ్వరస్వామి లను

మించిన దైవముగా వెలుగొందుతున్నాడు.


ఎంతలా అంటే

రాముడు కృష్ణుడు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామిల కన్నా సాయిబాబానే అసలు సిసలైన దేవుడిగా నిత్యం సాయి స్మరణ చేసుకుంటూ కొంతమంది హిందువులు జీవిస్తున్నారు.

మరీ ముఖ్యంగా రామాయణ భారత భాగవత పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన బ్రాహ్మణ పండిత పూజారి ఉత్తమలు కూడా సాయి నామ స్మరణలో నిత్యం జీవిస్తున్నారు


సాయిబాబా అసలు హిందువా ముస్లిమా

హిందువు అయితే హిందువులందరి కుటుంబాలలో తండ్రి తాత ముత్తాతలు అందరూ పూజించాలి కదా

ముస్లిం అయితే ప్రతి ముస్లిం కుటుంబంలో ముస్లింలందరూ సాయిబాబాను పూజించాలి కదా

ముస్లిం ఐనా సాయిబాబా

ఒక్క ముస్లిం ఇంట్లో కూడా లేడు. 

సాయిబాబాను ముస్లింలందరూ బహిష్కరించారా


హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి


మీ తండ్రులు

మీ తాతలు

ముత్తాతలు

సాయిబాబాను పూజించారా

రామ కృష్ణ ఈశ్వర వెంకటేశ్వర తదితర హిందూ దేవుళ్లను పూజించారా

ఒక్కసారి లోతుగా ఆలోచించగలరని ఓ హిందువుగా నా మనవి

🚩🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🚩

*మీ*

*సగటు హిందూ అభిమాని*


*NOTE:-*

*ప్రపంచంలోHC హిందువులంత అమాయకులు మరియు మనం మోసపోయినంత ఈజీగా ఎవరూ ఉండరు......!!!


Disclaimer. The above message is not the opinion of this blogger. The message obtained from Watts app is pasted


భక్తిసుధ


ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం౹*

*వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం౹*

*వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


// *శివస్తుతి - 5* //


ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

కళ్ళు తెరువు ఇండియా

 _*అమెరికా - కళ్ళు తెరువు ఇండియా !*_

------------------------


అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధి మాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందు కొస్తున్నాయా అని తెగ పరిశీలించా చాలా సార్లు. వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. అవి, 


1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్. అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. 


2. ఆహారదోషాలు. అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.


3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి వివరీతంగా తీసుకోవడం.


4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.


5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం. 


6.. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.


ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టి పారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.


మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను.  వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితు లేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకోని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది.  ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది.  మొదటి రోజు నుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌ తున్నట్లు అనిపించింది.  అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున  మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రాడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు.


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి.చ చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యే సరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే బిత్తరపోయే నిజాలు బయటపడ్డాయి.


_ఇక్కడ స్టోర్స్ లో, 'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది._


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్  ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతి కరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.


ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !


_అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు.  వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు._


చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్  లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లిన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం  ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలై పోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్ అయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !

________________

సేకరణ        *బాబ్ లాల్*


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

*07-10-2023* *రాశి ఫలితాలు

 *శనివారం* 

  *స్థిర వాసరః* 

 *07-10-2023*

*రాశి ఫలితాలు*

*మేషం*

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

*వృషభం*

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. కీలక వ్యవహారాలలో ముఖ్యమైన  నిర్ణయాలు  వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. 

*మిధునం*

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.

*కర్కాటకం*

నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

*సింహం*

 సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు.  వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*కన్య*

ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.  కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది.

*తుల*

చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.  కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

*వృశ్చికం*

రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

*ధనస్సు*

పాత విషయాలు గుర్తుకు వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన  కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

*మకరం*

విలువైన వస్తు  లాభలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

*కుంభం*

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.  వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. 

*మీనం*

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. 

🕉

భక్తిసుధ


ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం౹*

*వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం౹*

*వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


// *శివస్తుతి - 5* //


ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

గుణ సంకేతపదం

 కృష్ణ ప్రసాద్ ఆలూ


* బ్రాహ్మణుడు" అంటే ఎవరు..?


'బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.


రాజులకు జన్మించిన వాడు రాజు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం, వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి.


బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల *బ్రాహ్మణత్వం *లభిస్తుంది.


బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు *బ్రాహ్మణుడు గా* జీవించడం గొప్ప


సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.


సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీ రాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీ కృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలేవి


బ్రాహ్మణత్వం కాదు.


(వేదాలలో ఎక్కడా కుల ప్రసక్తి లేదు )


జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం..


బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చేసుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు. సుఖాభిలాష ఉండరాదు. వికారాలు ధరించకూడదు. మద్యపానం చేయకూడదు. మాంసాహారం ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోను కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్దం చెప్పకూడదు. అనైతిక ధనాన్ని, అశుద్ధ సుఖాలను అభిలాషించకూడదు. స్త్రీల వంక నిశితంగా చూడకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించారాదు. ప్రాణులను కర్రతో కానీ, రాయితో కానీ కొట్టరాదు. ఏ విధమైన అధర్మ వ్యాపారాలు చేయకూడదు. సినిమాలు, నాటకాలు మున్నగునవి చూడకూడదు. సర్వజన శాంతి సుఖాలకోసం దేవుని ప్రార్థించాలి. దైవప్రార్థనలో తన స్వార్థం విడచి జనాహితాన్ని కోరాలి. మనసు, మాట, శరీరం, పని లోకహితార్థమై ఉండాలి. కోరికలను త్యజించాలి.


బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మ మూర్తినే బ్రాహ్మణుడు అని


భావించి గౌరవించాలి, నమస్కరించాలి.


ధార్మిక లక్షణాలున్న వారు ఎవరైనా బ్రాహ్మణులే!


భీష్మ పితామహుడు శ్రీ కృష్ణుడిని " సుబ్రహ్మణ్యం" అని అనేవాడు.


'బ్రాహ్మణ్యం' కుల సంకేతపదం కాదు. గుణ సంకేతపదం.. ఈ విషయాలన్నీ మీకు పరిపూర్ణంగా అర్ధం. అవ్వటం కోసం చెప్తున్నాను.


మీ మిత్రుడు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి