శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
వ్యాసమహర్షీ! దమయంతి నా వానరముఖాన్ని చూసి ఏనాడూ మథనపడలేదు గానీ, సేవలు
చెయ్యడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగివచ్చేది. అలాగే
రోజులు దొర్లుతున్నాయి.
ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడినుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు
చేస్తూ నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను.
దానిమీద కూర్చుని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకుని -
మామయ్యా! ఆవేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను.
రాకుమారిని చూస్తూంటే జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాపప్రక్షాళనం
చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాపవిమోచనం అనుగ్రహించాడు.
మేనల్లుడి సౌజన్యానికి నేనూ ముగ్ధుణ్ణి అయ్యాను. నేనిచ్చిన శాపమూ అలాగే మరలించాను.
యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను.
ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులూ దమయంతీ ఎంతగానో
సంతోషించారు. ధనకనకవస్తువాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు.
సత్యవతీనందనా! ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన
ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకింతవరకూ కనిపించలేదు. ఇక ముందు
కనిపించే ఆశలేదు.
(27-48)
సంసారేఽస్మిన్ మహాభాగ! మాయా గుణకృతేఽనృతే |
తనుభృత్తు సుఖీ నాస్తి న భూతో న భవిష్యతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి