ఃఃఃఃఃః ఆలోచనాలోచనాలు ఃఃఃఃఃః ***** చాలాకాలం క్రిందట "" కీ"" ఇస్తే నడిచే పెద్ద, పెద్ద గోడయారాలు ఇండ్లలో దర్శనం ఇస్తూ వుండేవి. వాటి దిగువ భాగంలో "ఒక పెండ్యులం" (లోలకం) అటూ, ఇటూ తిరుగుతూ భలే తమాషాగా ఉండేది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. జీవితం కూడా ఒక లోలక గడియారమే! నిరంతరం ఆశానిరాశల మధ్య ఊగిసలాటే! ఏదీ స్థిరంగా ఉండదు. ***** ఆశావాది కొత్త పెండ్లికొడుకులా, "" అప్పుడే తెల్లారిపోయిందా?"" బోలెడంత సంబరపడిపోతాడు. మరి నిరాశావాదేమో, ""అప్పుడే తెల్లవారి చచ్చిందా?"" అని తెగ నిరాశలో కృంగిపోతుంటాడు. ఆశావాది "" ఏది జరిగినా? అదంతా మన మంచికే!"" అని తీర్మానించి, నిబ్బరంగా వుంటాడు. నిరాశావాదికి "" అన్నీ మన చెడుకొరకే!""అనిపించి క్రుంగిపోతుంటాడు. ఆశావాది మరచిపోవడానికి నవ్వుతాడు. నిరాశావాదేమో నవ్వడమే మరచిపోతుంటాడు. ఆశావాది ప్రతి కష్టంలోను, ఒక అవకాశాన్ని వెతికే పనిలో ఉంటాడు. నిరాశావాదేమో ప్రతి అవకాశం లోనూ కష్టాల సంఖ్యలను గణిస్తూ కాలాన్ని గడుపుతుంటాడు. నిరాశావాది వలలో బంధింపబడి, ప్రాణం పోగొట్టుకొన్న చేపవలె ఉంటే, ఆశావాది బెస్తవాని తట్టనుండి అమ్మబడినా, నాకు ప్రాణభిక్ష పెట్టమని పోరాడే చేపలాగా గిలగిలా కొట్టుకొంటూ తన ప్రయత్నం తాను చేస్తూవుంటాడు. ***** సగం నీటితో కూడిన గాజుగ్లాసు వుంది. సగం నిండుగా ఉన్నందుకు, ఆశావాది సంతోషిస్తాడు. సగం వెలితిగా ఉన్నందుకు నిరాశావాది దుఃఖిస్తాడు. సూర్యోదయం అయినందుకు ఆశావాది సంతోషిస్తే, నిరాశావాది ఆ సూర్యోదయం శాశ్వతంగా అట్లే నిలచివుండనందుకు విచారసాగరంలో మునిగిపోతాడు. ఒకటి మాత్రం సత్యం. సూర్యోదయం అవుతుంది. అది శాశ్వతంగా అట్లాగే నిలచివుండదు. ఇది యదార్థ వాది విశ్లేషణ. మనం యదార్థవాదులుగ మన జీవితాలను కొనసాగిద్దాం. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~. Answers to sharpen your mind! 1* Bearing 2* Redemption 3* When you are looking at a clock 4* A Donut ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు) 1* పిట్ట కొంచెం, కూత ఘనం. 2* పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. 3* పిల్లకాకికేంతెలుసురా? ఉండేలు దెబ్బ! 4* పిల్లికి చెలగాటం; ఎలుకకు ప్రాణసంకటం. 5* పొమ్మనలేక పొగబెట్టినట్లు! 6* పెనంమీది నుండి పొయ్యిలో పడ్డట్లు; 7* పులిని చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు. 8* మనిషికొక మాట; గొడ్డుకొక దెబ్బ. 9* అడిగేవాడికెప్పుడూ చెప్పేవాడు లోకువ; 10* కాచిన చెట్టుకే కదా, రాళ్ళదెబ్బలు. తేది 7--10--2023, శనివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి