*1947*
*సర్వలఘుకందము*
కృత సుకృత ఫలము జనులకు
సుత సతి హిత గణముల యుత సుఖముల నొసగున్
కృతమగు నఘములు మనిషికి
వెతలిడు పరిజనుల నొసగు వితతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! చేసిన పుణ్యములు జనులకు భార్య,పిల్లలు, శ్రేయోభిలాషులు మొదలైన వారితో సుఖములు కలిగించును. చేసిన పాపములు మనిషికి కష్టాలు కలిగించే పరివారము నిస్తాయి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి