🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 46*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*లలాటం లావణ్య ద్యుతివిమల మాభాతి తవ యత్*
*ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |*
*విపర్యాసన్యాసా దుభయ మపి సమ్భూయ చ మిథః*
*సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ‖*
అమ్మవారి లలాటము గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో.
ఆ లలాటము ఎలా వున్నది?
ఆమె లలాటము లావణ్యమై కాంతివంతంగా వున్నది. తెల్లని కాంతులను చిమ్ముతున్నది. ముత్యములోని తెల్లని కాంతినీ, నునుపుదనాన్నీ లావణ్యం అంటారు. అలాగే ఉప్పులోని తెల్లని కాంతిని కూడా. అందుకే లవణము అని పేరు.
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ = అష్టమినాటి చంద్రబింబం శుక్లపక్షం లోనూ, కృష్ణపక్షంలోనూ ఒక్కలాగే ఉంటుంది.
శివ, పార్వతులు లలాటంపై ధరించే శుక్ల తదియ నాటి చంద్రకళ యొక్క రెండు కొసలు కలిపితే ఎలా ఉంటుందో నీ లలాటము అలాగ వున్నదమ్మా అంటున్నారు ఇక్కడ. రెండవ సగభాగం అమ్మవారి కిరీటము క్రింది భాగంలో ఉండి, రెండూ కలిపి పూర్ణ చంద్రబింబంలాగా వున్నదమ్మా!
విపర్యాసన్యాసా దుభయమపి సమ్భూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః = ఈ రెండు అర్ధచంద్ర బింబములను అమృత లేపముతో అతికించినట్లుగా ఉందమ్మా! రాకా హిమకరుడు అంటే పూర్ణ చంద్రుడు.
*అష్టమీచంద్ర విభ్రాజదళికస్థలశోభితా* *ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా* అమ్మవారి సహస్రనామాల్లోనివి.అమ్మవారి లలాటము అష్టమి నాటి చంద్రుని కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆమె ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రునిలో మచ్చ వలె ఉన్నదట.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి