కృష్ణ ప్రసాద్ ఆలూ
* బ్రాహ్మణుడు" అంటే ఎవరు..?
'బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.
రాజులకు జన్మించిన వాడు రాజు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం, వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి.
బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల *బ్రాహ్మణత్వం *లభిస్తుంది.
బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు *బ్రాహ్మణుడు గా* జీవించడం గొప్ప
సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.
సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీ రాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీ కృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలేవి
బ్రాహ్మణత్వం కాదు.
(వేదాలలో ఎక్కడా కుల ప్రసక్తి లేదు )
జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం..
బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చేసుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు. సుఖాభిలాష ఉండరాదు. వికారాలు ధరించకూడదు. మద్యపానం చేయకూడదు. మాంసాహారం ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోను కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్దం చెప్పకూడదు. అనైతిక ధనాన్ని, అశుద్ధ సుఖాలను అభిలాషించకూడదు. స్త్రీల వంక నిశితంగా చూడకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించారాదు. ప్రాణులను కర్రతో కానీ, రాయితో కానీ కొట్టరాదు. ఏ విధమైన అధర్మ వ్యాపారాలు చేయకూడదు. సినిమాలు, నాటకాలు మున్నగునవి చూడకూడదు. సర్వజన శాంతి సుఖాలకోసం దేవుని ప్రార్థించాలి. దైవప్రార్థనలో తన స్వార్థం విడచి జనాహితాన్ని కోరాలి. మనసు, మాట, శరీరం, పని లోకహితార్థమై ఉండాలి. కోరికలను త్యజించాలి.
బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మ మూర్తినే బ్రాహ్మణుడు అని
భావించి గౌరవించాలి, నమస్కరించాలి.
ధార్మిక లక్షణాలున్న వారు ఎవరైనా బ్రాహ్మణులే!
భీష్మ పితామహుడు శ్రీ కృష్ణుడిని " సుబ్రహ్మణ్యం" అని అనేవాడు.
'బ్రాహ్మణ్యం' కుల సంకేతపదం కాదు. గుణ సంకేతపదం.. ఈ విషయాలన్నీ మీకు పరిపూర్ణంగా అర్ధం. అవ్వటం కోసం చెప్తున్నాను.
మీ మిత్రుడు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి