16, జులై 2024, మంగళవారం

జూలై 17, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

  🌷 *జూలై 17, 2024*🌷

     *దృగ్గణిత పంచాంగం*


          *ఈనాటి పర్వం* 

   *సర్వేషాం తొలి ఏకాదశి* 

          *శయనైకాదశి*

   ద్వాదశి పారణ: ఉ 05.44 -  

    08.20 లోపు ముగించాలి.


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : ఏకాదశి* రా 09.02 వరకు ఉపరి *ద్వాదశి*

వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : అనూరాధ* రా 03.13 తె వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : శుభ* ఉ 07.05 వరకు ఉపరి *శుక్ల*

*కరణం : వణజి* ఉ 08.54 *భద్ర* రా 09.02 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.30 - 10.30  సా 02.00 - 04.00*

అమృత కాలం :*సా 04.23 - 06.03*

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు*

*వర్జ్యం : ఉ 06.24 - 08.04*

*దుర్ముహుర్తం : ప 11.48 - 12.40*

*రాహు కాలం : మ 12.14 - 01.51*

గుళిక కాలం :*ఉ 10.36 - 12.14*

యమ గండం :*ఉ 07.21 - 08.59*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.44* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ ఉత్తరం దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.44 - 08.20*

సంగవ కాలం :*08.20 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.16 - 05.00*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

వరదండము పుస్తకములఁ

కరముల తిరముగ నిలిపిన కమలజురాణీ 

పరమును తెలిపెడి గతి భా~ 

సురముగనిడి కనికరించు సుతులను మాతా. 


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

        

        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

ఒక్క క్షణం విలువ

 Motivative Story


🌱ఒక్క క్షణం విలువ  🌱


🌱ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. 

చాలా చక్కని వాక్పటిమ గలవాడు. 

ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే 

వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.

ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.


 ☘☘

 🌱🌱 ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. 

ఆ ఊరు వెళ్ళే  బస్సు ఎక్కి  టికెట్ తీసుకున్నాడు. 

అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. 

పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. 

కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో, 

దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.


 ☘☘

🌱🌱🌱 కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 

🌱'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. 

🌱 ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! 🌱 ఎంత మంది తినటంలేదు? 

🌱 నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి? 

🌱 ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......' 

అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు. ☘


🌱 అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది. 

కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే 

తన ప్రమేయం ఏమాత్రం లేకుండా  అసంకల్పితంగా 

కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి 

"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. ☘


🌱 దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను  మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. 

మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా 

అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. ☘☘


🌱 పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 

'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో 

నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... 

నా అదృష్టం బాగుంది. 

నా మనస్సాక్షి  సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని 

నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.☘ 

 

🌱🌱🌱🌱 *జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా

సర్వనాశనం కావడానికి 

క్షణం చాలు.... 


🌱🌱 ఒకానొక సందర్భం లో మీ శత్రువులు కూడా మీద ప్రయోగం చేస్తారు... మీ మంచితనాన్ని నాశనం చేయడానికి.... మీకు సంబంధం లేకుండానే మీ గురించి ప్రచారం చేస్తుంటారు... ఆ ప్రచారం అవునా కదా అని తెలుసుకోకుండా వాళ్ళు  కళ్ళు ఉండి కూడా  గుడ్డిగా నమ్ముతారు... అది వాళ్ళ కర్మ... 


☘ కానీ మీరు మాత్రం జాగ్రత్త... గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగండి....


 ☘ మంచితనానికి ఎపుడు చావు లేదు.... ☘


 మీరు బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి.... 🌺

త్రిశుద్ధిగ నమ్ము భారతీ!*

 పద్యం:☝️

*కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల             ఏడ్చెదో*

*కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ               మదంబ! ఓ*

*హాటకగర్భురాణి! నిను ఆకటి కైకొనిపోయి                    అల్ల క*

*ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము             భారతీ!*


భావం: ఈ పద్యం పొతన భాగవతంలో లేని ఒక చాటుపద్యం. ఒక రోజు పోతన గారు భుక్తి కోసం దుక్కి దున్నుతూ చెమటలోడుస్తున్నారట. బావమరిది శ్రీనాథుడు పల్లకీలో పోతూ, “బావా! ఎందుకొచ్చిన శ్రమయ్యా! ఆ రాస్తున్న భాగవతం ఏ రాజుకో అంకితమిచ్చి నాలాగా సుఖపడ రాదుటయ్యా” అని సలహా పారేశాడుట. పోతన గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడుట.

సరస్వతీ దేవికి గుండెగుభేలు మందిట. ఆ శ్రీనాథుడి మాట విని, పోతనగారు తనని, ఏ రాజుకో అమ్ముతాడేమోనని సరస్వతి భయపడింది. ఆ రాత్రికి రాత్రి పోతనగారికి సరస్వతీ దేవి కలలో కనపడి, - 

_కాటుక కరిగిపోయేటంతగా కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చిందిట. ఆ సమయంలో పోతనగారు సరస్వతికి ఒట్టేసి భరోసా ఇచ్చాడుట. “తల్లీ! నేను భాగవతాన్ని ఎవ్వరికీ అమ్మను, నన్ను నమ్మవమ్మా,”_ అని భావం.

Panchaag

 


గాడిద

 🌹ఒక చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది... దాని యజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు...


ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది... ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది...


ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది... దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య గాడిదను ఓ గొడ్డలితో నరికేసింది...


ఇది చూసి కోపం ఆపుకోలేక సదరు గాడిద యజమాని ఆ రైతు భార్యను వేటకొడవలితో నరికేశాడు... ఆమె భర్త ఊరుకుంటాడా...? ఓ గునపం తీసుకొచ్చి ఆ గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు... వాడు వెంటనే చచ్చూరుకున్నాడు...


గాడిద యజమాని భార్య ఆగ్రహం పట్టలేక, కొంగు నడుంకు బిగించి కొడుకులను కేకేసింది... వాళ్లంతా కలిసి ఆ రైతు ఇంటికి నిప్పెట్టారు...


తన ఇంటిని మంటల్లో చూసి, ఆ బూడిదతో కళ్లు మండిపోయిన రైతు ఆ గాడిద యజమాని భార్యను, కొడుకులను వెంటాడి వెంటాడి చంపేస్తాడు...


తరువాత కాసేపటికి ఆవేశం తగ్గి, ఆ దెయ్యాన్ని అడుగుతాడు... ‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావు..?’’


దెయ్యం ఏమన్నదంటే..? ‘‘నన్ను అనవసరంగా నిందించకు... నేను ఒక్కరినైనా చంపానా..? చెట్టుకు కట్టేసి ఉన్న ఓ గాడిదను జాలితో విడిపించాను... అంతే... మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపుకున్నారు...’’


మీడియా, సోషల్ మీడియా కూడా అంతే... రోజుకో గాడిద కట్లు తెంపేసి

ఆధ్యాత్మికంగా ఎదగడానికి

 *సాధారణంగా ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి,

మూడు + మూడు మొత్తం ఆరు విషయాలు అవరోధంగా నిలుస్తున్నాయి.*

*ఈషణ త్రయములు:*


*1. ధారేషణ* - 'భార్య యందు మమకారం' ఉండాల్సిందే, అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను ప్రేమించాలి, గౌరవించాలి.

 కానీ పరిమితి మించితే దోషమే;


*2. ధనేషణ:* 'ధన సంపాదన యందు మమకారం' ఇదీ ఉండవలసినదే. ధనార్జన పురుషార్ధాములలో రెండవదిగా శాస్త్రమే చెప్పింది. కానీ, మితిమీరకూడదు.


*3. పుత్రేషణ:* 'బిడ్డల యందు మమకారం'. ఇదీ చాలా ఆవశ్యకమే. ఒక గృహస్థుగా సత్సంతానముతో భగవంతుని సృష్టి కార్యానికి సహకరించడమే ధర్మం. కానీ, ఇదీ పరిమితులకు లోబడే ఉండాలి.ఆదిత్యయోగీ..


మరొక మూడు - *తాపత్రయములు:* 

అనగా "మూడు తాపములు- మూడు రకముల దుఃఖములు" అని ఆర్థము. అవి 


1. *ఆది బౌతిక తాపము* - శారీరక సంబంధమైన దుఃఖములు - శారీరక లోపములు, రోగముల వలన కలిగే దుఃఖములు;  


2. *ఆది ఆత్మిక (ఆధ్యాత్మిక) తాపము:* మానసిక సంబంధమైన దుఃఖములు - కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల వలన కలిగే దుఃఖములు.


3. *ఆది దైవిక తాపములు:*

ఇవి దైవికములు - తుఫానులు, వరదలు, విపరీతమైన ఎండలు వంటివాని వలన కలిగే దుఃఖములు.


ఈ ఆరింటిని అధిగమించి, ప్రశాంతంగా జీవిస్తూ, భగవతత్వాన్ని అర్ధంచేసుకుని, *భగవంతుని చేరుటకు సులభమైన మార్గం - 'ధ్యానం'.* 

నిరంతర ధ్యానంతో 'గృహస్థాశ్రమంలో ఉంటూనే' వీటిని అధిగమించిన మహనీయులు ఎందరో ఉన్నారు.

కావున, నెమ్మది నెమ్మదిగా ఇష్టదేవతా స్మరణతో ప్రారంభించి నిరంతర ధ్యానం ద్వారా భగవంతుని తత్వము సులభంగా బోధపడుతుంది...

.

ఆత్మభావంతో ఆనంద జీవనం

మానవ జీవితం ఏ స్థాయిలో ఉన్నా ఉరుకులు పరుగులతో కూడి ఉంటుంది. ఆదిమ మానవుడు ఎలా జీవించాడో ఏమోగానీ ఆధునిక మానవుడు మాత్రం బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో ఆందోళనను గుండెల నిండా నింపుకొని పయనిస్తున్నాడు. నాటి మానవుడు పూట గడవడం కోసం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం, భద్రంగా జీవించడం కోసం తపనపడి ఉంటాడు. నేటి మానవుడు అన్ని సౌకర్యాలు అందివచ్చినా ఒత్తిడిని పుణికిపుచ్చుకొని హాయిగా జీవించలేకపోతున్నాడు. ఎన్ని చదువులు చదివినా ఎంత అనుభవం గడించినా జీవించడం ఎలాగో తెలియని అమాయకత్వంతో అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు. మనిషి జ్ఞానానికి, అజ్ఞానానికి చదువులు ఒక్కటే కారణం కాదని మహాపురుషుల జీవితాలు పరికిస్తే అర్థమవుతుంది. అక్షరజ్ఞానం లేకపోయినా ఆత్మజ్ఞానం తెలిసినవారు కష్టసుఖాలలో సమభావంతో జీవించడం సాధ్యమని మహాపురుషులు జీవించిన భారతావని సంస్కృతిని పరిశీలిస్తే బోధపడుతుంది.ఆదిత్యయోగీ..

నేను’ అనగానే మనిషికి బోధపడే అంశం ఒడ్డు- పొడుగు గల తన దేహపు బాహ్య దృశ్యరూపమే. ఆ రెండక్షరాల నేను అనే పదం అవ్యక్తంగా హృదయస్థానంలో కొలువై ఉండే ఆత్మకు సంబంధించినదని చెబుతారు వేదాంతులు. శ్రీకృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునుడికి బోధించిన పవిత్ర భగవద్గీతా సారం ఆ ‘నేను’తో ముడివడిఉన్న పాఠ్యాంశమే. నాశనమనేది దేహానికేగానీ ఆత్మకు కాదన్నది పరమాత్మ బోధ. ఆధునిక రుషి, మౌని, యోగి అయిన రమణ మహర్షి సైతం తన శరీరాన్ని సతతం ఆత్మ నుంచి వేరుచేసి చూశారు. చూపించారు. తన భక్తులకు బోధపరచారు. తన శరీరానికి సంక్ర మించిన మహావ్యాధిని సైతం తేలిగ్గా తీసుకున్నారే తప్ప వారు చింతపడలేదు.

ఓ భక్తుడు ఒక సంస్కృత గ్రంథానికి తమిళంలో వచనం రాశాడు. దాన్ని రమణులకు చూపవలసి ఉంది. అతడలా చేయకపోవడంతో రమణ మహర్షి ఒకరోజు అతడి గ్రంథరచన ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. భగవాన్‌ అస్వస్థులుగా ఉండటంతో ఆ భక్తుడు గ్రంథాన్ని చూపితే మార్పులు చేర్పులు చేస్తూ వారు మరింత అస్వస్థులవుతారని భావించి ఆయన దృష్టికి తేలేదు. రమణులు కారణం ఏమిటని ప్రశ్నించారు. అతడితో అన్నారు, ‘నా శరీరం అస్వస్థతతో ఉన్నమాట నిజమే. కానీ, నేను(ఆత్మ) బాగానే, ఖాళీగానే ఉన్నా కదా! నేను ఆ గ్రంథాన్ని సరిదిద్దుతాను’ అని చెప్పి ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. రమణుల దృష్టిలో తన శరీరం జబ్బుతో బాధపడుతున్నప్పటికీ ఆత్మ పరంగా ఆనందంగా, హాయిగానే ఉందికదా!

ఆత్మను శరీరానికి భిన్నంగా చూసేవారు మన మహర్షులు. అందువల్ల శరీరాలు వ్యాధితో బాధపడుతున్న సందర్భంలోనూ వారు నిశ్చింతగానే ఉండేవారు. ఆ భావం అందిపుచ్చుకొన్నప్పుడే ఆధునిక యుగంలోనూ మానవుడు శాంతి సౌభాగ్యాలతో జీవించగలుగుతాడని ఆశ కలుగుతుంది. నేటి మనిషి నిరంతరం సమయాభావంతో కుంచించుకుపోతూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. తానంటే బయటకు కనిపించే దేహం కాదు. లోపల ఆత్మ అనే దివ్యపదార్థం ఉంది. అది వెలుగుతో ప్రకాశమానమవుతూ శరీరాన్ని నడిపిస్తుంది. అదే లేకపోతే మనిషి జడపదార్థమే కాక మృతసమానుడు! ఆ సత్యాన్ని తెలుసుకుంటే దైవభావంతో జీవనం చేయడం సాధ్యమవుతుంది. కష్టసుఖాల్లో సమభావంతో జీవించడం నేర్చుకున్నాక దైవం చెంతనే జీవిస్తున్నానన్న స్ఫురణ కలిగి మనిషి ఇహ పరాల సర్వోన్నతికి అర్హత సాధిస్తాడు...

.

అరుణాచల మాహాత్మ్యాన్ని

 అరుణాచల మాహాత్మ్యాన్ని తెలిపే చిన్న సంఘటన:


అరుణాచల మాహాత్మ్యం నుంచి ఒక భాగం చదువబడింది. 'పంగున్ని' అనే సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడింది. ఆపై భగవాన్ దానిని ఇలా కొనసాగించారు (శ్రీరమణ భాషణములు, 05-03-1938: 473).


పంగున్ని అనే పేదవాడు, రెండుకాళ్ళు చచ్చుబడిన కారణంగా 'పనికిరానివాడు' అయ్యాడు. దమ్మిడీ ఆదాయంలేక కన్నవారికే గుదిబండగా తోచాడు. అనుదినం, అనుక్షణం అవమానాలే... అదీ అయినవారి నుంచి!


బ్రతుకు భారమైంది, నిరర్థకమైంది. ఎవరికీ చెప్పకుండా, కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరిప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి, దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు.


ఎటు చూసినా నిరాశా నిస్పృహలు రేపే తలపులే దృశ్యాలై, అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి.


అంతలో అతనికి ఎదురుగా ఓ సాధువు ... సాధువులకెందరికో అరుణాచలం నిలయం కదా ... ఇతనిని సమీపించాడు.


హఠాత్తుగా, “ఇలాంటివాడికి ఈ ఆభరణాలు కూడానా?” అంటూ పంగునికి ఊతమిచ్చే చేతికర్రలను లాగివేసాడు.


పంగున్ని అనుభవించిన అవమాన పరంపరలకు ఇది పరాకాష్ఠ. దానితో అసహనంతో ఊగిపోయి, సాధువుపైకి లంఘించాడు.


కానీ, అందుకొనేలోపే సాధువు మటుమాయం. అరే, ఇదేమిటీ! తాను నడువగలుగుతున్నాడు! చచ్చుబడ్డ తన రెండు కాళ్ళు చక్కబడి ... మరి ఆ సాధువు ఏదీ? కనిపించడే! ఆశ్చర్యోత్సాహాలతో పరుగులు పెట్టాడు.


ఆనందంగా గిరిప్రదక్షిణ పూర్తి గావించాడు.


అయినవారిచే ఆదరింపబడ్డాడు.


అరుణగిరీశ్వరుని అవ్యాజ కరుణకు సాక్ష్యమై, చరిత్రలో స్థిరంగా నిలిచాడు.


రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు.


భగవాన్ గురుమూర్తంలో వుండగా, 'కుప్పు అయ్యర్' అనే వృద్ధుని చూసారు. అతనికంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి, నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ, వేత్తావలం వెళుతున్నాడు.


హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, "ఏమిటా చట్టపై జరగటం? లేచి నడవవోయ్!" అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి, సులువుగా నడవసాగాడు. జరిగినదానిని నమ్మలేకపోయాడు. నాలుగడుగులు వేసాక చుట్టూ చూసాడు. ఎక్కడా ముసలివాడు. కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే, ఊరివారందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి, తాతలు దిగివచ్చినట్లయింది.


ఇది, భగవాన్ తిరువణ్ణామలై రావడానికి రెండు సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పు అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి, ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు.


🙏🏻🙏🏻ఓం అరుణాచల శివ🙏🏻🙏🏻

తొలి ఏకాదశి

 _*రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?*



హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.


తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.


తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.


*తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు*


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.


*ఉపవాస ఫలితాలు:*


ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 


అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 


ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 


అన్నదానం చేయడం చాలా మంచిది. 


*ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.*


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 


*తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..*


ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.


*ప్రాశస్త్యం*


ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

రామాయణం

 .రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?


ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. 


రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.

అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


ఆ శ్లోకం ఇది 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్


ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది.

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷


మొదటి అర్ధం:


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


రెండవ అర్ధం:


రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 


మూడవ అర్ధం:


రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.


కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.

ప్రాణి యైననూ చనిపోదు

 👌 సుభాషితము 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️ 


శ్లో.


న కాలే మ్రియతే జంతుః

విద్ధః శర శతైరపి | 

కుశాగ్రే నైవ సంసృష్టః

ప్రాప్తకాలో న జీవతి ||


కాలము సమీపించనిదే నూరు బాణములు తగిలిననూ ఏ ప్రాణి యైననూ చనిపోదు. కాలము దాపురించినచో గడ్డి పరక కారణముగా నైనా ప్రాణములు పోవును.


⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

భగవాన్

 ఒకసారి కేరళ నుండి వచ్చిన ఒక భక్తురాలు ఆశ్రమంలో అందరికీ ఒకపూట వండి పెడతానని పట్టుబట్టింది. ఎంతో సమయమూ, శ్రమా వెచ్చించి ముప్పై రెండు వంటకాలతో భోజనం సిద్ధం చేసింది. భగవాన్ మాత్రం అన్నిటినీ కలిపి ఒకే ముద్దగా చేసేసి తినేశారు.


   తర్వాత భగవాన్, ఆ భక్తురాలితో ఇలా సెలవిచ్చారు ...


 ఇన్ని పదార్థాలు వంటకోసం సేకరించడం, వండటం ఎంత శ్రమ పడ్డావో కదా! పొట్టను శుభ్రం చేసి, మలబద్ధకాన్ని పోగొట్టే ఒక్క కూర చాలదా ఈ అన్నంలోకి! ఇన్ని ఎందుకు చెయ్యడం? 


   ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. నువ్వు 32 రకాలు చేశావు కదా! అది తిందామా! ఇది తిందామా! అని తినే సమయంలో మనసు చెదురుతూ ఉంటుంది. అదే ఒక్క పదార్థం ఉంటే హాయిగా ఏ ఆలోచనా లేకుండా తినవచ్చు. 


 మనం ఆకలితో అలమటిస్తుంటే "నిరాడంబరులమనీ, సన్యాసులమనీ చెప్పుకుంటూ ఇన్ని రకాలు తింటున్నారే!" అన్న ఆలోచనలూ, అసూయలూ అన్నార్తులలో రేకెత్తించడము మంచిది కాదుకదా!


 అయినా "ఎంతోమంది తిండి దొరకనివాళ్ళు ఉండగా మనం ఇంత ఆర్భాటంగా, అట్టహాసంగా తింటే వాళ్ళందరికీ తిండి ఎలా దొరుకుతుంది?" 



    తర్వాత మళ్ళీ భగవాన్ ఇలా వివరణ ఇచ్చారు ...


 నేను ఏదో ఒక పదార్థాన్ని ముందు తింటే, వడ్డించేవారు సహజంగా ఏమనుకుంటారు? "ఆ! భగవాన్ మొదట ఇది తిన్నారు కాబట్టి భగవానుకు ఇదంటే ఇష్టం" అనుకుని దాన్ని ఇంకొంచెం ఎక్కవ వడ్డించడానికి ప్రయత్నిస్తారు! అందుకనే ఇలా జరగకూడదని అంతా కలిపేసి ఒకే ముద్దగా తినేస్తాను! అంతే.


రమణోదయం.

మహనీయుని మాట*

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


      *🌼🌺

       -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"చాలా మంది ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు.

కానీ ప్రయత్నించకపోతే ఆరోజు ఎప్పటికి రాదు అని కొందరే తెలుసుకుంటారు."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"కష్టం ఎవరూ కొనేది కాదు. ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు." 


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌷పంచాంగం🌷

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 16 - 07 - 2024,

వారం ...  భౌమవాసరే ( మంగళవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం -  శుక్ల పక్షం,


తిథి      :  దశమి సా5.05 వరకు,

నక్షత్రం  :  విశాఖ రా11.57 వరకు,

యోగం :  సాధ్యం ఉ6.03 వరకు,

                తదుపరి శుభం 

కరణం  :  గరజి సా5.05 వరకు

                తదుపరి వణిజ తె5.30 వరకు,


వర్జ్యం                :   ఉ.శే.వ. 5.53వరకు,

                               తె4.10 నుండి,

దుర్ముహూర్తము  :  ఉ8.12 - 9.04,

                              మరల రా10.59 - 11.43,

అమృతకాలం     :  మ2.29 - 4.12,

రాహుకాలం        :  మ3.00 - 4.30,

యమగండం       :  ఉ9.00 - 10.30,

సూర్యరాశి          :  మిథునం,

చంద్రరాశి            :  తుల,

సూర్యోదయం     :  5.37,

సూర్యాస్తమయం:  6.34,


              *_నేటి విశేషం_*


  *కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం* రా 11.09 నుండి


*పండుగలకు నెలవు దక్షిణాయనం*

       సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం "ఉత్తరాయణ పుణ్యకాలం." ఇక "దక్షిణాయనం" అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం. 


*దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే.*


    మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి, శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... *శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం."*


*దక్షిణాయన పుణ్యకాల నిర్ణయం*


 *రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది•.*


 ఈ దక్షిణాయన పుణ్యకాలంలో నెయ్యి, గోదానం శ్రేష్ఠమైన ఫలితాలనిస్తుంది, పితృదేవతలకు తర్పణాదులివ్వాలి. 


 దక్షిణాయన పుణ్యకాలంలో నదీస్నానం లేదా సంకల్ప సహిత స్నానం కానీ చేయాలి. 


*దక్షిణాయన పుణ్యకాలంలో చేసే జప, దాన, ఉపవాస, తర్పణాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి.*


 సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు *ఉత్తరాయణం* అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు *దక్షిణాయనం.* 


*సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.*


 తెలుగువారు ఋతువులను చైత్రాది మాసాలతో లెక్కిస్తారు. అయితే ఉత్తర, దక్షిణ అయనాల ఆరంభానికి మాసాలతో నిమిత్తం లేదు. మేషాయనం, కర్కాటకాయనం, మకరాయనం వంటివి మాసారంభంలో రావు. అంటే ఉదాహరణకు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్య సంక్రమణం జరగదు. కానీ, అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో సూర్యోదయం జరిగిన రోజున మేష సంక్రమణం జరుగుతుంది. పునర్వసు 4వ పాదంలో సూర్యోదయమైతే కర్కాటక సంక్రమణం గాను, ఉత్తరాషాఢ 2వ పాదమైతే మకర సంక్రమణంగాను లెక్కిస్తాం.


 *దేవతలకు రాత్రికాలం*


 రాశిచక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. కారణం ఏమంటే మకరం కంటే కర్కాటకం రాశిచక్రంలో ముందుగా వస్తుంది. కానీ, మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనం చెబుతారు. ఎందుకంటే.... _*మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది. పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి.*


దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్న మాట తరచుగా వింటూఉంటాం. అయితే, మన కాలమానంలో మనం ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏయే దేవతలు స్వీకరిస్తారో జ్యోతిర్విజ్ఞానం ఆధారంగా తెలుసుకోవచ్చు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సూర్యోదయం, నాలుగో రాశిలో మధ్యాహ్నం, ఏడో రాశిలో సాయంత్రం, పదోరాశిలో అర్ధరాత్రి సహజంగా ఏర్పడతాయి. రాశిచక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మానవుల కాలమానం ప్రకారం ఉదయవేళ మేషరాశి, మధ్యాహ్నవేళ కర్కాటక రాశి, సాయంత్రవేళ తుల, అర్ధరాత్రి మకరరాశి ఉండాలి. ఈ పరిస్థితి మనకు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది.


 ఇప్పుడు దక్షిణాయనంలో అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం కూడా కర్కాటకంలోనే జరుగుతుంది. అపరాహ్ణవేళ లో మనం ఆచరించేది పితృదేవతారాధనలే కనుక దక్షిణాయనంలో శ్రాద్ధాదులు శ్రద్ధగా ఆచరిస్తాం. _*ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు, దక్షిణాయనం ఉగ్రదేవతారాధనకు ప్రసిద్ధి వహించింది.*_


*దక్షిణాయన ప్రశస్తి*


 శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. శక్త్యారాధనా ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. ఉగ్రదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. మన పండుగల్లో దక్షిణాయన సంక్రమణం ఒకటి. ఇది పెద్దలను స్మరిస్తూ చేసే తర్పణాదులకే పరిమితం కావడం చేత అధిక ప్రాధాన్యతను సంతరించుకోలేదు. 


 ఉత్తరాయణంలోని మకరసంక్రాంతి శోభ దక్షిణాయనంలో కానరాదు. మకరసంక్రాంతి వేళకు పంటలు చేతికి అందివస్తాయి. దక్షిణాయన సమయంలో రైతులు పొలంపనుల్లో నిమగ్నమవుతారు. దక్షిణాయనం రాత్రికాలం ప్రారంభం కావడం చేత భోగి, కనుమ వంటివి లేవు. విశేష ఉత్సవాలు చేయరు. కానీ పితృదేవతారాధన ప్రధానంగా చేస్తారు.


               *_🌷శుభమస్తు🌷_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సప్తైతామోక్షదాయకాః

 శ్లోకం।అయోధ్యా మధురా మాయా కాశీ  కాంచీహ్యవంతికా,పురీద్వారావతీచైవ సప్తైతామోక్షదాయకాః.b

తొలి ఏకాదశికి

 🙏🌹🙏🌹🙏

తొలి ఏకాదశికి స్పెషల్

( శ్రీనివాసుడి పెళ్లి భోజనాలు )

(పూర్తిగా చదివి తెలుసుకోండి.)

పెళ్లి విందు తయారీ : 


స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది . 

 

#కుబేరుడు నుండి అప్పు దొరికి, అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా ? ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు ? అనుకున్నారు . 

#స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి ! ” అన్నాడు . కానీ వంటపాత్ర సామానులేవి ? అన్నాడు అగ్నిదేవుడు. 


 #అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.


#నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. #అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.


#అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు . 


#ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. 


#స్వామి పుష్కరిణిలో @ అన్నం, 

#పాపనాశనంలో @ పప్పు, ఆకాశగంగలో @ బెల్లం పరమాన్నం,

#దేవతీర్థంలో @ కూరలు,

👉తుబురతీర్ధంలో @ పులిహోర, 

👉కుమార తీర్ధంలో @ భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), 

👉పాండుతీర్ధంలో @ పులుసు, 

👉ఇతర తీర్ధాల్లో @ లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. 


#అలన్నిటిలోనూ పప్పులు , పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో రకాల పొంగళ్ళు , పులిహోర పొంగళ్ళు చేసారు .

వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు .  


#భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .


#భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.


#నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.

 "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. 

#మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. 

#మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.   

 

#ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. 

#సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.


#(తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. #శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. 


#ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి,

నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. 


#చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. #పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. #ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.


 #భోజనాలు వడ్డన :


 #ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.

 #వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.


 #అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.


#అందరూ భోజనాలు చేసి , బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు . అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత  శ్రీనివాసుడు,వకులమాత, మన్మథుడు,  లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.


#అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి,తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. ...!


సేకరణ 

🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏

*భక్తి- విశ్వాసం

 


                *భక్తి- విశ్వాసం!*

                  ➖➖➖✍️

```

ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.


తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.


అప్పుడా వ్యక్తి ‘నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది?’ అని బాధపడ్డాడు


ఆ తర్వాత ‘తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని’ మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు.


ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు.


కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది.


కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు.


దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు.


గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది.


ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశ నిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు.


అంతలో అకస్మాత్తుగా ఒక పడవ                 ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది.


పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు.


కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో  ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు.


అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించ లేక పోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించు కున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు.```

 


 *ఈ కథలోని నీతి:* ```


“సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు.


సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది.                   ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని.


కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

మన సాహిత్య మకరందం!*

 0201b-6.2401c-6.160724-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *మన సాహిత్య మకరందం!*

                 ➖➖➖✍️



*ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,*

*మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,*

*యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు*

*విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు*

```

ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగపర్వంలోనిది. తిక్కన రచన.


సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడలేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడంలేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు.


ఆ సందర్భంగా విదురుడు కుఱుమహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ...!


ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది!


ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.


పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...


ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం(ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత (ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ(త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి,సంధి,విగ్రహము,యానము, ఆసనము,ద్వైదీభావము,సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను (స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.


దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేశారు.


ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...


బుద్ధిని కలిగి ఉండి, వాక్కు , క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ, వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి, పాదము, వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన, యాజన, అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

భగవంతుని స్మరణ

 *భగవంతుని స్మరణలోనే నిజమైన ఆనందం* 


“మనం ఏ ఆనందాన్ని పొందాలనుకుంటున్నామో, అది (ఆ ఆనందం) ఈ భౌతిక వస్తువుల ద్వారా పొందలేము.  కాబట్టి మళ్ళీ ఈ విషయాలలో నిమగ్నమవ్వడం వ్యర్థం” అనే ఆలోచన మనకు రావాలి.  కాబట్టి, "నిజమైన ఆనందం దేనిలో ఉంది?"  అని అడిగితే, “మనసులో భగవంతుని స్మరణ ఉంటే, మనసులో సాత్వికాలను గురించి ఆలోచిస్తే, మనందరం నిజమైన ఆనందాన్ని అనుభవించగలం” అని సమాధానం.  

మిగతా విషయాలన్నీ మర్చిపోయి భగవంతుని సన్నిధిలో పది నిమిషాలు కూర్చొని ఇంకేమీ ఆలోచించకుండా భగవంతుని స్వరూపాన్ని మాత్రమే తలచుకుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుందని మన స్వంత అనుభవంలో చూడవచ్చు. మెదడులోకి చెడు ఆలోచనలను లేకుండా రాకుండా చేసే పరధ్యానాలను నియంత్రిచటమే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత భగవత్ ధ్యాన సమయంలో నిరంతరం ఉండాలి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

_నేటి విశేషం_

 *_నేటి విశేషం_*


  *కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం* రా 11.09 నుండి


*పండుగలకు నెలవు దక్షిణాయనం*

       సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం "ఉత్తరాయణ పుణ్యకాలం." ఇక "దక్షిణాయనం" అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం. 


*దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే.*


    మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి, శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... *శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం."*


*దక్షిణాయన పుణ్యకాల నిర్ణయం*


 *రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది•.*


 ఈ దక్షిణాయన పుణ్యకాలంలో నెయ్యి, గోదానం శ్రేష్ఠమైన ఫలితాలనిస్తుంది, పితృదేవతలకు తర్పణాదులివ్వాలి. 


 దక్షిణాయన పుణ్యకాలంలో నదీస్నానం లేదా సంకల్ప సహిత స్నానం కానీ చేయాలి. 


*దక్షిణాయన పుణ్యకాలంలో చేసే జప, దాన, ఉపవాస, తర్పణాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి.*


 సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు *ఉత్తరాయణం* అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు *దక్షిణాయనం.* 


*సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.*


 తెలుగువారు ఋతువులను చైత్రాది మాసాలతో లెక్కిస్తారు. అయితే ఉత్తర, దక్షిణ అయనాల ఆరంభానికి మాసాలతో నిమిత్తం లేదు. మేషాయనం, కర్కాటకాయనం, మకరాయనం వంటివి మాసారంభంలో రావు. అంటే ఉదాహరణకు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్య సంక్రమణం జరగదు. కానీ, అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో సూర్యోదయం జరిగిన రోజున మేష సంక్రమణం జరుగుతుంది. పునర్వసు 4వ పాదంలో సూర్యోదయమైతే కర్కాటక సంక్రమణం గాను, ఉత్తరాషాఢ 2వ పాదమైతే మకర సంక్రమణంగాను లెక్కిస్తాం.


 *దేవతలకు రాత్రికాలం*


 రాశిచక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. కారణం ఏమంటే మకరం కంటే కర్కాటకం రాశిచక్రంలో ముందుగా వస్తుంది. కానీ, మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనం చెబుతారు. ఎందుకంటే.... _*మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది. పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి.*


దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్న మాట తరచుగా వింటూఉంటాం. అయితే, మన కాలమానంలో మనం ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏయే దేవతలు స్వీకరిస్తారో జ్యోతిర్విజ్ఞానం ఆధారంగా తెలుసుకోవచ్చు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సూర్యోదయం, నాలుగో రాశిలో మధ్యాహ్నం, ఏడో రాశిలో సాయంత్రం, పదోరాశిలో అర్ధరాత్రి సహజంగా ఏర్పడతాయి. రాశిచక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మానవుల కాలమానం ప్రకారం ఉదయవేళ మేషరాశి, మధ్యాహ్నవేళ కర్కాటక రాశి, సాయంత్రవేళ తుల, అర్ధరాత్రి మకరరాశి ఉండాలి. ఈ పరిస్థితి మనకు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది.


 ఇప్పుడు దక్షిణాయనంలో అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం కూడా కర్కాటకంలోనే జరుగుతుంది. అపరాహ్ణవేళ లో మనం ఆచరించేది పితృదేవతారాధనలే కనుక దక్షిణాయనంలో శ్రాద్ధాదులు శ్రద్ధగా ఆచరిస్తాం. _*ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు, దక్షిణాయనం ఉగ్రదేవతారాధనకు ప్రసిద్ధి వహించింది.*_


*దక్షిణాయన ప్రశస్తి*


 శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. శక్త్యారాధనా ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. ఉగ్రదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. మన పండుగల్లో దక్షిణాయన సంక్రమణం ఒకటి. ఇది పెద్దలను స్మరిస్తూ చేసే తర్పణాదులకే పరిమితం కావడం చేత అధిక ప్రాధాన్యతను సంతరించుకోలేదు. 


 ఉత్తరాయణంలోని మకరసంక్రాంతి శోభ దక్షిణాయనంలో కానరాదు. మకరసంక్రాంతి వేళకు పంటలు చేతికి అందివస్తాయి. దక్షిణాయన సమయంలో రైతులు పొలంపనుల్లో నిమగ్నమవుతారు. దక్షిణాయనం రాత్రికాలం ప్రారంభం కావడం చేత భోగి, కనుమ వంటివి లేవు. విశేష ఉత్సవాలు చేయరు. కానీ పితృదేవతారాధన ప్రధానంగా చేస్తారు.