పద్యం:☝️
*కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో*
*కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ*
*హాటకగర్భురాణి! నిను ఆకటి కైకొనిపోయి అల్ల క*
*ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!*
భావం: ఈ పద్యం పొతన భాగవతంలో లేని ఒక చాటుపద్యం. ఒక రోజు పోతన గారు భుక్తి కోసం దుక్కి దున్నుతూ చెమటలోడుస్తున్నారట. బావమరిది శ్రీనాథుడు పల్లకీలో పోతూ, “బావా! ఎందుకొచ్చిన శ్రమయ్యా! ఆ రాస్తున్న భాగవతం ఏ రాజుకో అంకితమిచ్చి నాలాగా సుఖపడ రాదుటయ్యా” అని సలహా పారేశాడుట. పోతన గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడుట.
సరస్వతీ దేవికి గుండెగుభేలు మందిట. ఆ శ్రీనాథుడి మాట విని, పోతనగారు తనని, ఏ రాజుకో అమ్ముతాడేమోనని సరస్వతి భయపడింది. ఆ రాత్రికి రాత్రి పోతనగారికి సరస్వతీ దేవి కలలో కనపడి, -
_కాటుక కరిగిపోయేటంతగా కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చిందిట. ఆ సమయంలో పోతనగారు సరస్వతికి ఒట్టేసి భరోసా ఇచ్చాడుట. “తల్లీ! నేను భాగవతాన్ని ఎవ్వరికీ అమ్మను, నన్ను నమ్మవమ్మా,”_ అని భావం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి