*భగవంతుని స్మరణలోనే నిజమైన ఆనందం*
“మనం ఏ ఆనందాన్ని పొందాలనుకుంటున్నామో, అది (ఆ ఆనందం) ఈ భౌతిక వస్తువుల ద్వారా పొందలేము. కాబట్టి మళ్ళీ ఈ విషయాలలో నిమగ్నమవ్వడం వ్యర్థం” అనే ఆలోచన మనకు రావాలి. కాబట్టి, "నిజమైన ఆనందం దేనిలో ఉంది?" అని అడిగితే, “మనసులో భగవంతుని స్మరణ ఉంటే, మనసులో సాత్వికాలను గురించి ఆలోచిస్తే, మనందరం నిజమైన ఆనందాన్ని అనుభవించగలం” అని సమాధానం.
మిగతా విషయాలన్నీ మర్చిపోయి భగవంతుని సన్నిధిలో పది నిమిషాలు కూర్చొని ఇంకేమీ ఆలోచించకుండా భగవంతుని స్వరూపాన్ని మాత్రమే తలచుకుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుందని మన స్వంత అనుభవంలో చూడవచ్చు. మెదడులోకి చెడు ఆలోచనలను లేకుండా రాకుండా చేసే పరధ్యానాలను నియంత్రిచటమే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత భగవత్ ధ్యాన సమయంలో నిరంతరం ఉండాలి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి