6, అక్టోబర్ 2023, శుక్రవారం

Automatic water fountain


 M

Sewing machine technique


 

Chandrayan 3


 

Segway master painting


 

Useful knots


 

Killa noppulaku home remedy


 

Who is a Hindu

 


Siva kesava puja


 

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 45*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 45*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *అరాళైస్స్వాభావ్యా దళికలభ సశ్రీభిరలకైః*

          *పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |*

          *దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే*

          *సుగంధౌ మాద్యంతి స్మరమధన చక్షుర్మధులిహః ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి ముఖమును గురించి ధ్యానము చేస్తున్నారు. 


సుగంధములు *అరాళ* వెదజల్లే అమ్మవారి ముఖ పద్మముపై ముంగురులు *అలకై:* పడుతుంటే అవి ఎలా వున్నాయంటే విచ్చుకున్న పద్మములపై వ్రాలే తుమ్మెదపిల్లలు *అలికలభ* వలె వున్నాయి. అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంటే ఆమె తెల్లని దంతములు  మెల్లగా విచ్చుకుంటున్న పద్మముల లోపలి కేసరములు *కింజల్కములు* వలె మెరుస్తున్నాయి.


తాంబూల సేవనం వల్ల సుగంధములు వెదజల్లుతున్న ఆమె ముఖపద్మముపై మన్మధుడిని దహించిన శివుని చూపులు సంచరిస్తూ ఆ సుగంధమును, మకరందమును ఆస్వాదిస్తున్నాయి. *సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః* అనగా పుష్పబాణములు వేసిన మన్మధుడిని దహించి వేసిన శివుడు కూడా అమ్మవారి ముఖ పద్మము యొక్క ఆకర్షణకు ఆ సుగంధ పరిమళములకు వశమయ్యాడు అని భావం. 


*శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా*, *కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా* అనే అమ్మవారి నామములు ఇక్కడ స్మరింపదగినవి.


ద్విజములు అంటే దంతములు అని ఒక అర్థం. అవి 

శుద్ధవిద్య 

బ్రహ్మవిద్య/షోడశి విద్య మొలకల (బ్రాహ్మణములు) వలె తెల్లగా వున్నాయట. అమ్మవారి తాంబూలములోని పచ్చకర్పూర కళికల పరిమళము దిక్కులన్నిటినీ ఆకర్షించుతూ ఆనందమును పంచుతున్నదట. అనగా అమ్మవారి శుద్ధవిద్య పలుకుల వల్ల జ్ఞానులందరికీ ఆనందము కలిగిందని భావం. షోడశి మంత్రము లోని శివ,శక్తుల బీజాక్షరముల దళములు 32

అమ్మవారి దంతములుగా ప్రకాశిస్తున్నాయని శ్రీవిద్యోపాసకులైన పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Panchaag


 

శ్రీ ప్రాచీన శని మందిర్

 🕉 మన గుడి : నెం 200






⚜ ఢిల్లీ : గుర్గావ్, అసోలా


⚜ శ్రీ ప్రాచీన శని మందిర్ 


💠 గుర్గావ్ సెక్టార్ 45లో ఉన్న ప్రాచీన్ శని మందిర్ శనిదేవుని శక్తిపై విశ్వాసం ఉన్నవారికి ప్రసిద్ధి చెందిన ప్రార్థనా స్థలం.  

ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీత, కాళీకా దేవి, శివుడు , గణేష్, హనుమంతుడు,  మరియు దుర్గాదేవి దేవతలు ఉన్నారు.  

శని మందిరం పక్కనే దక్షిణ ముఖి కాళి ఆలయం ఉంది, దీని ప్రధాన పీఠం ఖాట్మండులో ఉంది;  ప్రాచీన్ శని మందిరానికి వచ్చే భక్తులు దక్షిణ ముఖం వద్ద కూడా ప్రార్థనలు చేస్తారు.


💠 ఢిల్లీలోని అసోలా సమీపంలో ఉన్న శని ధామ్ ఆలయంలో శని భగవానుడి సహజ శిలా విగ్రహం ఉంది.  

ఈ విగ్రహం చాలా ప్రకాశవంతమైనది మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుని విగ్రహం.  

ఈ విగ్రహాన్ని అనంత్ శ్రీ విభూషిత్ జగత్ గురు శంకరాచార్య స్వామి మాధవశరమ్ జీ మహారాజ్ 31-మే, 2003న ఆవిష్కరించారు.


💠 శని యొక్క ప్రతికూలత కారణంగా ఏర్పడిన అన్ని కష్టాలు మరియు సమస్యలన్నీ ఇక్కడ పూజించడం ద్వారా మరియు శనికి తైలం (తైలాభిషేకం) సమర్పించడం ద్వారా క్షణాల్లోనే నశిస్తాయి అని గట్టి నమ్మకం


💠 రెండు శని విగ్రహాల కుడి వైపున, హనుమంతుని విగ్రహం అక్కడ ఉంచబడింది. ఇది దక్షిణం వైపు ఉంది. ఈ విగ్రహానికి ఎడమ వైపున కొలను ఉంది. 

ఈ కొలనుకు దక్షిణం వైపు తొమ్మిది గ్రహాల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. దీనికి సరిగ్గా ఎదురుగా భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసారు. 

ఇక్కడ భక్తులు స్నానం చేసి తడి బట్టల్లో ఉండి పూజలు మరియు తైలాభిషేకం (ఎరుపు 'లుంగీ' ధరించి) చేస్తారు. 

ప్రతి మంగళవారం ఇక్కడ హనుమాన్  మరియు  జగదంబని కూడా శని దేవుడిని పూజించడంతో పాటు పూజిస్తారు. 


💠 శని ధామ్ ఆలయంలో నిర్వహించే పూజలు మరియు ఆచారాలు-

కింది మంత్రాలను పఠిస్తూ శని దేవుడికి ఆవాల నూనె (తేలాభిషేకం) సమర్పించడం:


ఓం శం శనైశ్చరాయ నమః

ఓం ప్రమ్ ప్రీం ప్రోం సే శనైశ్చరాయ నమః

ఓం శం శనైశ్చరాయ నమః


ఆలయంలోని విగ్రహం (శిలా మూర్తి) చుట్టూ తిరిగేటప్పుడు భక్తులు శని మంత్రాన్ని పఠనం   చేస్తారు.


శనికి ఆవాల నూనె (తైలాభిషేకం) సమర్పిస్తారు.

ప్రతి శనివారం మరియు శని అమావాస్య నాడు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


💠 భక్తులు  శని మందిరం వద్ద నూనెను సమర్పిస్తారు. కొందరు వ్యక్తులు 101 నూనె పెట్టెలు లేదా 1 క్వింటాల్ నూనెను అందిస్తారు మరియు కొందరు వ్యక్తులు శని దేవునికి మొత్తం ట్యాంకర్ నూనెను కూడా సమర్పిస్తారు.


⚜ శ్రీ శని ధామ్ ట్రస్ట్ : 

ఇది  ఒక  లాభాపేక్ష లేని , ప్రభుత్వేతర సాంఘిక సంక్షేమ స్వచ్ఛంద సంస్థ. 

ట్రస్ట్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో  సాంఘిక సంక్షేమ కార్యకలాపాలకు కట్టుబడి ఉంది కానీ ప్రధానంగా రాజస్థాన్‌పై దృష్టి సారించింది మరియు కరువుతో ప్రభావితమైన రాజస్థాన్ ప్రాంతాలలో ఎక్కువగా పని చేస్తుంది.

వారి సామాజిక కార్యాలలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి:


కరువు బారిన పడిన ప్రజలను ఆదుకుంటున్నారు.


పశువులకు ఉచితంగా మేత అందిస్తోంది.


అవసరమైన వారికి ఆహారం, బట్టలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం.


రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం.


వృద్ధులకు, నిరుపేదలకు పింఛన్లు.


ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.అందజేస్తోంది.


రాజస్థాన్‌లోని అంతర్గత గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిని ఏర్పాటు చేయడం.


💠 శని ధామ్ ఆలయ సమయాలు:

ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మళ్ళీ 3 PM నుండి 10 PM వరకు.


💠 రైలు: ఢిల్లీలోని  మూడు ముఖ్యమైన రైల్వే స్టేషన్లు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ (23.2 కిమీ), పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ (26.5 కిమీ) మరియు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ (22.0 కిమీ).

మహానుభావులు

 ఎంతటి మహానుభావులు! ఎంతటి కరుణాసముద్రులు!!


మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి (మాయవరం పెరియవ) చాలా బాధ పడుతూ ఏడుస్తూ శ్రీ మఠం వచ్చారు. ఆయన చేసే ‘భాగవత సప్తాహం’ మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయవరం శాస్త్రి గారు ఎప్పుడు సప్తాహం చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు.


మేనేజరు వారు శ్రీ కణ్ణన్ మామతో “శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలాగ చెయ్యాలి” అని అన్నారు.


శ్రీ కణ్ణన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిసారు. మహాస్వామి వారు “ఏమిటి” అని అడిగారు. మామ శాస్త్రి గారి విషయం చెప్పారు. 

అందుకు మహాస్వామి వారు “అతను కార్ లో వచ్చాడు కదా?” అని అడిగారు. అవును అన్నారు మామ. ”సరే అతన్ని పాద ప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గుమ్మం వైపు నుండి రమ్మను” అని అన్నారు.


మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చుని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామి వారికి వందనం చేసి బాధపడుతూ “పెరియవ నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్స్ రే తీయిస్తే అతని రెండు ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు. అతను ఒక నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు.” అని వాపోయాడు


శాస్త్రి గారు అలా చెప్తూ మాహాస్వామిని ప్రార్థిస్తూ “ఒకవేళ జరగరానిది జరిగినా కానీ ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను” అని అన్నారు. (మనలో ఎవరు ఇలా ప్రార్థించగలరు, ఒక్క జ్ఞానులు/పండితులు తప్ప). శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామి తో “ఈ శరీరం వెళ్ళీపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు” అని అన్నారు.


అప్పుడు కణ్ణన్ మామ “అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు” అనుకున్నారు. మహాస్వామి అది విని ఒక విచిత్ర మైన ప్రశ్న వేసారు ”ఒకవేళ ఆ యంత్రములు తప్పు చెప్తున్నయేమో కదా?” అని.


అప్పుడు శాస్త్రి గారు ”మేము 27 ఎక్సరేలు తీయించాము అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువుచేస్తున్నాయి. ఇక 20-25 రోజులకంటే ఎక్కువ బ్రతకడు అని”. అప్పుడు మహాస్వామి వారు “నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా అందులో ‘భగవాన్ భయ నాశనః’ అని ఉంది కదా ఆయననే శరణువేడు” అన్నారు. ఆ మాటలను విని శాస్త్రి గారు తేలిక పడ్డ మనసుతో ప్రసాదమును స్వీకరించి వెళ్ళిపోయారు. కానీ 15 రోజుల తరువాత చాలా ఆత్రుతతో మఠానికి తిరిగివచ్చారు.


కణ్ణన్ మామ వారిని చూసి “ఆ రోజు చాలా చాలా బాధపడ్డాడు” అనుకున్నారు

మేనేజరు మామతో, “చూస్తూ ఉంటే వారి అల్లుడు మరణించినట్టు ఉన్నది త్వరగా తీసుకువెళ్ళు” అన్నారు.


కణ్ణన్ మామ మహాస్వామి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని “ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించాడా? ఖచ్చితంగా అంత్యసంస్కారములు అన్నీ పూర్తి అయి ఉంటాయి. అంతా అయిపోయిన తరువాతనే ఇక్కడకు వచ్చుంటాడు. అతను పండితుడు కదా ఇవన్నీ బాగా తెలిసుంటాయి” అన్నారు.


మామ అవునన్నట్టు తల పంకించి ఆరోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తి లాగా మాట్లాడుతున్నారే అనుకున్నాడు. శాస్త్రి గారు మహాస్వామిని సమీపించి “ఈశ్వరా మీ నోటీనుండి వచ్చిన మాటలు నిజము అయ్యాయి. అన్ని యంత్రములు అబధ్ధం చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు. మా అల్లుడు కూడా బాగున్నాడు” అని అన్నారు. అదే ఉసిరికాయ చెట్టు, అదే మహాస్వామి వారు, అదే శాస్త్రి గారు. కానీ సందర్భము వేరు.


మహాస్వామి నవ్వుతూ “ఓ యంత్రములు కూడా అబద్దాలు చెప్తాయా. మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నాను” అని, అన్ని వివరములు కనుక్కుని శాస్త్రి గారికి ప్రసాదమును ఉత్తరీయాన్ని ఇచ్చారు”. తరువాత మాయవరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకములో ఆ సంఘటన గురించి చెప్తూ “మహానుభావుల నోటి నుండి వచ్చు మాటల వలన ఏమైనా జరుగవచ్చు” అని వ్రాసుకున్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

లవ్_జ్8హాద్

 🙏💪👍👏🙂


#లవ్_జ్8హాద్

రకీబుల్ హసన్ అనే వాడు  రంజిత్‌ కోహ్లి అనే పేరుతో జాతీయ స్థాయి షూటర్‌ అయిన తారా సహదేవ్  తో స్నేహం ప్రారంభించి 2014లో అమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వాడు హిందూ రంజిత్‌ కోహ్లి కాదు, రకీబుల్  హసన్ అనే ముస్లిం అని ఆమెకు తెలిసింది.


పెళ్లి అయిన మొదటి రాత్రి, రకీబుల్ 20-25 మంది హాజీలను పిలిచి తన్ను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు అని, రకీబుల్ ఆమెను ఒక నెలపాటు నిర్బంధంలో ఉంచాడు అని,  తనను ఆకలితో అలమటించేలా చేసాడు అని, తన పేరును "సారా"గా మార్చారు అని  తారా ఆరోపించింది. తాను ఇస్లాంలోకి మారడానికి నిరాకరిస్తే తనని కొడతానని బెదిరించాడు  కాల్చివేస్తానని బెదిరించాడని కూడా తారా ఆరోపించింది


రకీబుల్ ఒక్కడే కాక అతని తల్లి కౌషర్  రాణి మరియు ముస్తాక్ అహ్మద్ అనే హైకోర్టు రిజిస్ట్రార్ కలసి తనను మతం మార్చుకోవాలని, వారి నమ్మకాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసి, వేధించి బాగా హింసించి  మతం మార్చుకునేలాగా చేశారు అని తారా ఆరోపించింది.


అయితే, ఈ హింసను భరిస్తూ తారా అందరి హిందూ అమ్మాయిలు లాగా భయపడి  వారికి లొంగి ఉండిపోలేదు. తిరగబడింది. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే లాగా కేసు ఫైల్ చేసింది. ఈమె ఫిర్యాదు చేసింది అని తెలుసుకొని తల్లి, కొడుకు ఢిల్లీ పారిపోయారు. అయితే ఢిల్లీ పోలీసులు రాంచీ పోలీసులు కలిసి వీళ్ళని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 


 రాజకీయ వత్తిడి ఎక్కువ అవ్వడంతో 2015లో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కి అప్ప చెప్పింది. 2018లో జార్ఖండ్ హై కోర్ట్ తారాకి విడాకులు మంజూరు చేసింది.


అన్ని విచారణలు తరువాత ఈరోజు సీబీఐ కోర్టు రకీబుల్ హసన్‌కు జీవిత ఖైదు, కౌషర్ రాణికి 10 సంవత్సరాలు జైలు శిక్ష మరియు వీరికి సహకరించిన హై కోర్ట్ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్‌కు 15 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.


ఇటువంటి తీర్పు ఈ #లవ్_జిహాద్ కేసుల్లో చిక్కుకున్న ఇతర హిందూ అమ్మాయిలకు నైతిక బలం ఇస్తుంది.  బాధితులు తమ హక్కుల కోసం  పోరాడితే న్యాయం పొందవచ్చని ఈ తీర్పు తెలియచేసింది.


చాడా శాస్త్రి సర్ పోస్ట్...

ఆకాశరాజు వృత్తాంతము:*

 *ఆకాశరాజు వృత్తాంతము:* 


పూర్వకాలములో సుధర్ముడనే చంద్రవంశపురాజు వుండేవాడు. ఆ రాజు నారాయణపురము రాజధానిగా రాజ్యమేలుతుండేవాడు. 


ఆయనకు యిద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఆకాశరాజు, చిన్నకొడుకు తొండమానుడు, సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకము చేసి తపస్సునకు వెళ్ళిపోయాడు. 


ఆకాశరాజు భార్య ధరణీదేవి, వారికి అన్నీ వున్నా సంతాన లోపముండెను. సర్వవిధ పుణ్యకార్యములు వారు చేసిరి.


ఒకరోజున ఆకాశరాజు తన కులగురువయిన శుకమహర్షిని ఆహ్వానించి వారిని వుచిత రీతిని పూజించాడు. 


తరువాత సంతానము లేకపోవుటను, ఆ దిగులుచే తాను తన భార్య కృశించుటయు తెలియజేశాడు.


అంతా శ్రద్ధగా విని శుకముని 


‘రాజా! పూర్వము దశరధుడు చేసిన విధముగా నీవున్నూ పుత్రకామేష్టి యజ్ఞము చేయుము. నీ కోరిక నెరవేరుతుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు.


పద్మావతి లభించుట

ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి క్రింద యేదో తగినట్లయినది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనబడింది. 


ఆ పెట్టెలో ఒక సహస్రకమల పుష్పమున్నూ, ఆ పుష్పము మధ్య అందాల పాపయు కనబడినది. 


ఇంతలో ఆకాశవాణి ‘ఓ ఆకాశరాజా! నీవు ధన్యుడవు. నీకు పూర్వజన్మాంతర సుకృతము కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. 


ఈమెను నీవు పెంచుకొనవలసియున్నది. నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచుకొనడము కారణమవుతుంది’ అని యన్నది.  ఆకాశరాజుకు అపరిమితమయిన ఆనందము కలిగినంది. 


నేటికి కదా! నా జన్మ, నా వంశము సార్ధకమయినవని అనుకున్నాడు. బుగ్గ పై చిరునవ్వు వికసించే ఆ పసిపాపను యెత్తుకొని తనివితీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణిదేవి చేతికిచ్చి విషయము తెలిపినాడు. ఆమె ఆ పాప నెత్తుకొని అవ్యక్తానందము ననుభవించినది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణముగా భావించుకొని పెంచసాగినది. 


సద్ర్బాహ్మణులులను రావించి, వారిని గౌరవించి, బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తము పెట్టుడనగా వారు ముహూర్తము పెట్టిరి. 


ఆ ముహూర్తమున సహస్ర పత్రకమలములో లభ్యమయిన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినది. 


లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందించుచుండిరి. 


ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందనవనములో పువ్వులా అల్లారు ముద్దుగా పెరగసాగింది.


 *పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము:* 


పూర్వకాలమున వేదవతి అని ఒక అందమయిన కన్య వుండేది. ఆ కన్య అందచందాలను వినినవారయి, ఎందరెందరో రాజులు యామెను వివాహము చేసుకొనుటకు యిచ్చజూపుతూ రావడము, విఫలులై వెడుతూండడము జరుగుతూండేది. ఒక్క శ్రీహరిని తప్ప ఎవ్వరినీ వివాహము చేసుకోనని భీష్మించుకు కూర్చుంది వేదవతి. ఆమెకు తపస్సు యెడల అనురక్తి అంతా ఇంతా కాదు. 


ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు చూడడము జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయినాడు. చెంతకు వెళ్ళి ‘సుందరాంగీ నేను రావణుడను, పదునాలుగు లోకాలను అవలీలగా జయించిన వాడను, నేను కళ్ళెఱ్ఱజేస్తే సూర్యుడు వేడిమిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. 


నేను రమ్మనమంటే, వెంటనే వచ్చి చంద్రుడు వెన్నెలను ప్రసరిస్తాడు. ఇంద్రుడయినా సరే నా ముందు తలవంచవలసినదే. దేవతలందరూ నా సేవకులే. మూడు లోకాలకీ సర్వాధిపతినైన నేనే నిన్ను ప్రేమించుచున్నానన్నచో నీకు గర్వకారణము కాదా! నీవునూ నన్ను ప్రేమించుము. అందాలరాశివయిన నీకు కష్టతరమయిన తపస్సు అవసరమా! నీ యవ్వనము అంతా యీ విధముగా వ్యర్ధము చేసుకోవడము నీకు తగదు. చూస్తూ వూరుకోవడము నాకు తగదు. 


నా లంకారాజ్యానికి రాణివి కమ్ము! అన్నాడు. 


రావుణుని మాటలకు భయపడినది వేదవతి. ఎలాగో ధైర్యము చిక్కబట్టుకొని 

‘దశాననా! రావణా! నేను ఒక్క శ్రీహరిని తప్ప యెప్పటికినీ, యెవరినీ వివాహము చేసుకొనను. అని లోగడనే శపధము చేసి వుంటిని. 


ఆ శ్రీహరి గూర్చియే తపస్సు చేస్తూయున్నాను. ఆ విష్ణుమూర్తి గనుక నా కోరిక కాదంటే ప్రాణాలయినా పోగొట్టుకుంటాను’ అని తన ధృఢ నిశ్చయాన్ని కోమలముగా చెప్పింది.


 అది విన్న రావణుడు హేళనగా నవ్వాడు నవ్వి ‘ఓసి అమాయకురాలా! ఎవరినీ? విష్ణువునా నీవు ప్రేమించడము! బాగుంది! ఆ విష్ణువు నా పేరు వింటేనే భయముతో గజగజలాడిపోతాడు. అటువంటి అల్పుడిని పెళ్ళాడతానంటావేమిటీ? నీకేమయినా మతిపోయిందా? అన్నాడు. 


‘మీరు వేయి చెప్పండి, లక్ష చెప్పండి. నేను విష్ణువును తప్ప మరొకరు వారెంతవారయినా సరే వివాహము చేసుకోను. దయచేసి మీదారిన మీరు వెళ్ళండి’ అని గద్గద స్వరముతో చెప్పింది వేదవతి.


రావణునికి కోపము హెచ్చింది. నన్నే నిరాకరిస్తావా? అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు రావణుడు. మానభంగము చేస్తాడేమోనని భయపడి వేదవతి ‘అన్యకాంతాభిమానీ! కామాంధకారములో నీకు కళ్ళు కనబడుట లేదు ఇష్టము లేని నన్ను కష్టపెట్టి మానభంగము చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్నికి గురి యయ్యెదవుగాక!

నేనిదే అగ్నిలో ఆహుతియయి భస్మమై పోతాను.నీ కారణముగా నేనిప్పుడీ దేహముతో నాశనమయిపోతున్నాను. గనుక నీవూ నీ వంశమూ, ఒక స్త్రీ మూలమున సర్వనాశనమై పోదురుగాక! నా వుసురు ననుభవించి తీరుదువుగాక!’ అని శపించినది. శపించి శక్తిమంతురాలైనది, కాబట్టి యోగాగ్నిన తనలో సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధము అయి బూడిదగా మారిపోయినది.


చాలా సంవత్సరాల తర్వాత రావణుడు సీతను అపహరించడం జూచి అగ్ని ఆమెను రక్షించాలనుకున్నాడు. 


అగ్ని అడ్డు వెళ్ళి ‘రావణా! శ్రీరాముడు నిజమయిన సీతను నాచెంత దాచి, మాయ సీతనే ఆశ్రమమున వుంచినాడు.


నీవు తీసుకొనిపోవుచున్నది మాయసీతనే’ అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మి రావణుడు ‘అయినచో వెంటనే అసలు సీతను యిచ్చి మాయసీతను నీ చెంత నట్లే పెట్టుకొను’ మనగా అగ్నితనయందు ఎప్పుడో దగ్డమయిన వేదవతిని రావణునికిచ్చి, అతని నుండి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు.


ఆ తరువాత రామరావణ యుద్ధము, రావణ సంహారము జరిగాయి. 


శ్రీరామచంద్రుడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. మాయసీతగా వున్న వేదవతి అగ్నిలో దూకినది. అగ్నిదేవుడు సీతనూ, వేదవతినీ, యిద్దరనూ తీసుకొనివచ్చి జరిగిన విషయము విశదీకరించి సీతాదేవితో పాటు, శీలవతి అయిన వేదవతిని కూడా ఏలుకోవలసినదిగాకోరాడు. 


‘అగ్నీ! నేను ప్రస్తుతము ఈ అవతారములో ఏకపత్నీ వ్రతుడను కనుక, మరొక స్త్రీ నాకు భార్యయగుట యనునది జరుగుటకు వీలులేనిది. కలియుగమున యీ వేదవతిని వివాహమాడెదను’ అన్నాడు 


శ్రీరామచంద్రప్రభువు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజునకు దొరికిన పద్మావతియే వేదవతి.


||కస్తూరితిలక గోవిందా కాంచనాంబర గోవిందా, గరుడవాహన గోవిందా, గానలోల గోవిందా||

ఓం నమో వేంకటేశాయ!!

Hydraulic car moving


 

Powered paragliding


 

Liquid latex synthetic rubber


 

Amazing tricks


 

Heart decease


 

Useful knots


 

Free energy


 

Big Trishul


 

Striching technique


 

Shivatandavam


 

Eye cataracts simple home remedy


 

Needle threading machane


 

River


 

Sliding house gates


 

Human anatomy


 

PM speech


 

Gallbladder stone home remidey


 

Mechanical engineering


 

Mimicri

 


Steem train


 

Munagaaku juce for health


 

Bangladesh border


 

Bike side stand spring fitting technique


 

Digestive problem simple home remedy


 

Secret camara


 

Bangladesh harder


 

Home experments


 

Rameshwar bridge


 

కాఫీ కథ:

 #కాఫీ కథ:

రచన - గొల్లపూడి మారుతీరావు గారు


ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని రాశాను. దాని పేరు ‘కాఫ్యాంతం కావ్యం’. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత... 


7వ శతాబ్దంలో ఇథియోపియాలో ఓ గొఱ్ఱెల కాపరి పొలంలో పచ్చగడ్డిని తింటున్న గొఱ్ఱెలు ఉన్నట్టుండి మత్తుగా ఉండటాన్ని గమనించాడట. కారణం- ఒకంతకిగాని అర్థం కాలేదు. చెట్లకి కాసిన ఏవో వింత పళ్లు తినడం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని కని పెట్టాడట. తనూ తిన్నాడు. తనకీ మత్తుగా అనిపించింది. ఆ విధంగా మొదటి కాఫీ గింజల రుచి మనిషికి అందింది.


క్రమంగా సంపన్న కుటుంబాల వారికి ఈ మత్తు అందింది. ఇస్లాం దేశాలలో ఈ గింజలతో ‘గావా’ అనే వైన్‌ని తయారు చేసేవారట. ఈ వైన్‌ని ‘వైన్ ఆఫ్ అరేబియా’, ‘డెవిల్స్ డ్రింక్’ అనేవారట. అయితే మత్తు రుచిగా, సుఖంగా ఉంది కదా? ఈ కారణానికే క్రైస్తవ దేశాలలో ఈ గింజల ద్రావకాన్ని వింతగా చూశారు. మరి దీన్ని నిషేధించాలా వద్దా? ఎవరు నిర్ణయించాలి? పోప్‌గారి దగ్గరికి ఈ ధర్మ సందేహం చేరింది. ఆయనా కాఫీని రుచి చూశారు. చూసి తన్మయుడయిపోయాడు. నిషేధించడానికి మనసు రాలేదు. కాగా, తమ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్లూరింది. దాన్ని నిషేధిం చకపోగా ఈ ద్రావకానికి మతాన్ని ఇచ్చి ‘పెద్దల ద్రావకం’గా అంగీకరించారు. అప్పటి నుంచీ వాటికన్‌లో ఈ కాఫీ జొరబడింది.


టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రాధాన్యం సంపాదించుకుంది. సమాజ ధర్మంలో భాగమయిపోయింది. పెళ్లికి ఫలానా అమ్మాయి వరుడుకి తగిన భార్య అవునా కాదా ఎలా నిర్ణయించాలి? ఆ పిల్ల కాఫీ తయారు చేయాలి. ఆ కాఫీ రుచిని బట్టి ఆ అమ్మాయిని ఎంపిక చేసేవారట. అది ఆ అమ్మాయి మొదటి అర్హత. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఏ కారణం చేతయినా అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ తయారు చేసే ఒడుపుని నష్టపోతే- భర్త కోర్టుకి వెళ్లి విడాకులకి అర్జీ పెట్టుకోవచ్చు. టర్కీ ఆడపిల్ల ఏదయినా నష్టపోవచ్చుకానీ, కాఫీ తయారు చేసే పనివాడితనాన్ని పోగొట్టుకోకూడదు.


భారతదేశంలో కాఫీ కథ ఇంకా విచిత్రమైనది. బాబూ బూడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవక్త 16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకి వెళ్లి తిరిగి వస్తూ యెమన్ నుంచి ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి తీసుకువచ్చాడు. ఏడు గింజలే ఎందుకు? ఇస్లాంకి 7 చాలా పవిత్రమైన అంకె కనుక. వాటిని కర్ణాటకలో చిక్ మగుళూర్ కొండల్లో నాటాడు. అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అనేవారట. దరిమిలాను కర్ణాటక, నాగినహళ్లి ప్రాంతంలో కొండల్ని ఇప్పటికీ బాబూ బుదం గిరి - అని అంటారు. 7 గింజలతో దిగుమతి అయిన కాఫీని ప్రస్తుతం 107 దేశాలకు భారతదేశం ఎగుమతులు చేస్తోంది.

ఈ కాఫీ పంటకీ అరకు లోయకీ బంధుత్వముంది. 1890 ప్రాంతంలో అరకు లోయ పొలాల్లో 3 సంవత్సరాల దిగుబడి ఇచ్చే పంటల తర్వాత పోడు వ్యవసాయానికి  ప్రత్యామ్నాయంగా ఈ కాఫీ పంటని అప్పటి జయపూర్ మహారాజు, బ్రిటిష్ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో వేశారట. ఇప్పటికీ యూరోపు ‘మార్నింగ్ కాఫీ’కి అరకులో పండిన కాఫీ గింజలనే శ్రేష్ఠంగా చెప్పుకుంటారు. 


అసలు వినడానికే ఇబ్బందిగా, కాస్త వెగటుగా, కాని వాస్తవమయిన విచిత్రమైన కాఫీ ఒకటుంది. అది ఇండోనేసియాలో తయారవుతుంది. చాలా ఖరీదయిన, ఎంతో రుచికరమైన కాఫీ అది. ఇండోనేిసియాలో ‘సివిట్’ అనే పిల్లికి కాఫీ పళ్లు తినిపిస్తారట. కాఫీ గింజలమీద ఉన్న పొట్టుకోసం పిల్లి తింటుంది. పొట్టు ఊడి, గింజలు పిల్లి శరీరంలో ప్రయాణం చేసి, దాని పేగులలోంచి వెళ్తూ కొన్ని రసాయనికమైన మార్పులకు లోనవుతాయి. తర్వాత పిల్లి ఆ గింజల్ని విస ర్జిస్తుంది. వాటిని ఏరి, శుభ్రం చేసి, వేయించి కాఫీ చేస్తారు. ఈ కాఫీ చాలా విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది. ఒక కప్పు 5 డాలర్ల నుంచి వంద డాలర్లు ఉంటుంది. దీని పేరు ‘సివిట్ షిట్ కాఫీ’ (తెలుగులో ‘సివిట్ పెంట కాఫీ’).


మా ఆవిడ చెప్పిన కథ - దాదాపు 65 సంవత్సరాల కిందట రాజమండ్రిలో ఆమె నాయనమ్మ - అంటే శ్రీపాద కామేశ్వరరావుగారి సతీమణి రూలు ప్రకారం కాఫీని చిన్న పిల్లలు తాగకూడదు. ఎందుకని? మత్తు రుచులు మరిగి చెడిపోతారని. మా అత్తగారు - అంటే ఆవిడ పెద్ద కోడలు - తన అత్తగారికి తెలియకుండా పిల్లలకి చిన్న గ్లాసుల్లో కాఫీ అందించేదట. వీళ్లు తలుపు చాటున నక్కి - దొంగతనంగా కాఫీ తాగి ఆనందించేవారట. ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ‘.... జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని వాపోయాడు శ్రీనాథుడు. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. అలాగే ఆలోచనలోకయినా రాని ఒకప్పటి ద్రావకం ఇవాళ నిత్యావసరమైపోయింది. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి.


అక్టోబర్ 1 అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ☕

amazing electric Trycicle

Amazing electric Tricycle 

Medical uses of budida gummadi

Budida gummadi juce for strength 

Manasuna mallelu

Manasuna mallelu  

ఉపాధ్యాయుల ఆస్తి ..

 *"ఉపాధ్యాయుల ఆస్తి ..."*


వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. 

పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు..ఒకరు గోవింద్ ..ఇంకొకరు శ్రీనాథ్..

 ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..

 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ స్కూల్ టీచర్.

 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం... ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది... 


జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు..


పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో... 


గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధ పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు..


ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు... వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  


శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దాన ధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపద ను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి...  లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 

ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...  లక్ష్మి కి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...


అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..


ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..


స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...


ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..


వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..


రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..


ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..


సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.


శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.


సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.


తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...


సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..


అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 


ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..


ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..

మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..


పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...


ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు... 


కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 

జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 


జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 

మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..


నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..


పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.

ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 


అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 


శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..


చివరగా గోవింద్ మాట్లాడాడు..

పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

 

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..


పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును.. 


ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...


ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...


భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....


నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .


శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..

వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.. 


సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..


*ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  ఆస్తి పిల్లల అభిమానమే...*

గాంధారి విద్య..

 




గాంధారి విద్య.. అబ్బురపరిచే మనోశక్తులని ఆవిష్కరించే విద్య. సనాతన ధర్మంలో ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడిపి మానవాళి కోసం తమ శక్తులను దారబోసిన ఋషి సంప్రదాయానికి సంబంధించిన విద్య. గాంధారి మాత కళ్ళకు గంతలు కట్టుకొని తన జీవితాన్ని గడిపింది అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఆవిడ ఈ విద్యలో నిష్ణాతురాలు. ఈవిడ తన చర్మం తోటి మొత్తం ప్రపంచాన్ని అంతా చూడగలిగేది. సామాన్యమైన పిల్లలకు కేవలం పది రోజులపాటు శిక్షణలో స్టేజ్ 1 పూర్తి చేసుకొని ఎన్ని అద్భుతాలు కళ్ళకు గంతలు కట్టుకొని చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఈ విద్యలు అరిషడ్వర్గాలతో నిండిన మనసుకు అంటే పెద్దవారికి తొందరగా అబ్బవు. చిన్నపిల్లలకు చాలా తొందరగా ఏడు రోజులలో... పెద్దవారికి ఈ విద్య అబ్బాలంటే ప్రకృతితో గడపడం తప్పించి వేరే మార్గం లేదు. ఇటువంటి అద్భుతమైన విద్యలన్ని గురువుగారు ఏర్పాటు చేయనున్న పంచశీల వేదిక యూనివర్సిటీలో భాగాలు.

ఆధ్యాత్మిక సాధన ఇలా

 🕉️ *ఆధ్యాత్మిక సాధన ఇలా...* 🕉️


నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.

నీ మనసును మాత్రం

ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...


నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు  నీకెంతో ప్రియాతిప్రియమైన

వాళ్ళుగానే వ్యవహరించు.


నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.


ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.


తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 

కాని, ఆమెకు తెలుసు,

ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.


తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.


అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.

నీ మనసును మాత్రం,

ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.


ఈ ప్రపంచంలో జీవించటానికి ఇదే ఉత్కృష్టమైన మార్గము.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సంగీతంలో మూర్ఛనలనూ తానమార్గాలను ఆలకించి ఆనందించనివాడే నిజమైన పశువు.

హరిణాలు పశువులు కానేకావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం, చెవులుండీ

సంగీతాన్ని ఆస్వాదించలేని మానవులకన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ

కేజింతలుకొడతాడు పసిబాలుడు. ఏళ్ళువచ్చినవాళ్ళకన్నా వీడు నయం కాదూ! ఎందుకొచ్చిన పెద్దరికాలు?!

అమ్మా! తండ్రిగారికి తెలియదంటావా నారదుడి గొప్పదనం ముల్లోకాలలోనూ నారదుడికి

సాటివచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయాలలో గానానికి గుణాలకూ

ముగ్దురాలినయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిలో ఏదో శాపం కారణంగా వానరముఖడయ్యాడే కానీ

అంతకుముందంతా అందగాడే. ఇవ్వేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనస్సులో రవ్వంత

కలతచెందానే తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పులేదు. ఏమీ, గుర్రపుముఖాల

కిన్నరులు అందరికీ నచ్చడంలేదూ? తమ గానవిద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తూనే ఉన్నారుగదా! ముఖం

ఎలా ఉంటే ఏమిటమ్మా? గుణం ముఖ్యం. విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు

నారదుడికిచ్చి వివాహం జరిపించమను.

దమయంతి ఇంత కచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేస్తే మహారాజ్ఞి మారుమాట్లాడలేక

యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనసా వరించింది కనక అతడికే ఇచ్చి వివాహం

చెయ్యడం సమంజసమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక

శుభముహూర్తాన నాకూ దమయంతికి మహావైభవంగా ఉద్వాహం జరిపించాడు

రుద్ర "శబ్దమునకు శివ పురాణం నందు

 "రుద్ర "శబ్దమునకు శివ పురాణం నందు ఉన్న అర్థం;-

శివుని యొక్క అష్ట మూర్తులు గురించి బ్రహ్మ దేవుడు "నీవు సర్వ భూత స్వరూపుడవు" అని అభినందించి,


"నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు.


1.రుద్రుడు: 

"యాభి రాదిత్య స్తపతి రశ్మిభి |

స్తాభిః పర్జన్యో వర్షతి ||"


అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) జగత్కారణ కర్త. సస్యానుకాల వర్ష కారకుడు. 'సూర్య ఆత్మా జగత సస్థుషశ్చ' అనే స్మృతి వాక్యానుసారం ఈ జీవజాలాన్నంతటినీ ప్రభావితం చేయ గలడు. కనుక-రూపం రౌద్రం. భార్య సువర్చల. కొడుకు శని.


2.భవుడు:

'యోప్సునావం ప్రతిష్టితాం వవేద-ప్రత్యేవతిష్ఠతి' అని శ్రుతి లోకాలన్నీ నీళ్లలో ఓడల్లా తేలు తున్నవని గ్రహించే వాడే భవుడు.కనుక శరీరం నారము. (అపో నారా ఇతి ప్రోక్తాః!) నీటి యందు నీ ఉనికి పట్టు గలదు. ఈ మూర్తిలో నీకు భార్యా పుత్రులు ఉష - ఉశనులు


3.శివుడు:

శర్వుడు అనే నామాంతరంతో గూడ పిలువ బడతావు.శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్ట బడి ఆధారభూతమై నిలుస్తాయో, ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తి యందు నీ ఉనికి పట్టు భూమి.శరీరము - శార్వము.భార్య - వికేశి. కొడుకు - అంగారకుడు.


4.పశుపతి:

"అహం వైశ్వానరో భూత్వా |

ప్రాణి్నాం దేహ మాశ్రితః ||"

అని గీతా ప్రవచనం.


అన్ని జీవుల శరీరం లోనూ జఠరాగ్ని అనేది జీర్ణ క్రియ కు దోహద కారి. కనుక ఈ మూర్తి లో నీ స్థానం అగ్ని. శరీరం - వైశ్వానరం.భార్య - స్వాహా దేవి. కొడుకు - స్కందుడు.


5.ఈశ్వరుడు: ప్రాణుల శరీరం లోని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింప చేస్తావు. కనుక ఈ మూర్తి యందు నీ స్థా నం- వాయువు.'ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వరస్సర్వ భూతానాం' అని శ్రుతి. కనుక శరీరం - ఈశానం. భార్య - శివ. కొడుకు - మనోజవుడు.


6.భీముడు: ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) వ్యాపించి ఉంటావు. నీ శరీరం భీమము. దశ దిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు.


7.ఉగ్రుడు : యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి యందు వశించెదవు. యజ్ఞదీక్ష యందుండు యజమానుడు - నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సంతుష్టి చేయు వాడవు. నీ శరీరం ఈ మూర్తిలో ఉగ్రము. భార్య దీక్ష. కొడుకు సంతానుడు.


8.మహా దేవుడు : "సోమ ఓషధీనా మధిపతిః" అని శ్రుతి వాక్యము. కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై, వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి దాతవు కూడా అయ్యెదవు. కనుక నీ శరీరము - చాంద్రమాసం. భార్య - రోహిణి. కొడుకు - బుధుడు.


ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయూ సృష్టి వైచిత్ర్యమే! శివుని అష్ట మూర్తులను, ఆయా మూర్తి తత్వాలను గ్రహించిన వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవు తారు.


అంతే కాదు


"శివనామాష్టకం (శివుని ఎనిమిది పేర్లు) కూడా ఎంతో పుణ్య ఫల దాయకం! ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, (ఈ ఐదు పంచ సాధకులకు ప్రియమైనవి). సంసార భిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః (ఈ మూడు మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు.) ఉభయ తారక మైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్ప బడనిది. కనుకనే నేను ఈ శివ పురాణం మీకు వినిపింప ప్రారంభిస్తూ - రుద్ర స్తుతి పఠించడం జరిగింది." అని చెప్పాడు సూతుడు.


మహర్షులంతా కూడా సూత మహాముని ఆదేశానుసారం రుద్ర స్తుతి చేశారు.


అనంతరం ...


తిరిగి సూత పౌరాణికుడీ విధంగా సెలవిచ్చాడు 


"యోవై భ్రహ్మాణం విదధాతి - యో దేవానాం 

ప్రథమం పురస్తాత్ - విశ్వాధిపో రుద్రో మహర్షిః " అని శ్రుతి


దీని ప్రకారం - ఈ వస్తు (గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన )సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.


"ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ - చిన్న గానీ - సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు - అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది!"

అవమానించుటవల్ల

 

         *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* 


॥శ్లోకం॥


*అత్యున్నత పదారూఢః*

*పూజ్యాన్నైవావమానయేత్ |*

*నహుషః శక్రతామేత్య*

*చ్యుతో గస్త్యావమాననాత్ ॥*


॥భావము॥

గొప్పస్థానాన్ని పొందినప్పటికీ గౌరవించదగినవారిని గౌరవించాలి, అవమానించరాదు. నహుషుడు ఇంద్రపదవిని పొంది పూజించదగిన అగస్త్య మహర్షిని అవమానించుటవల్ల పతనమయ్యాడు గదా!

మహాత్ముల మాటలు

 https://youtu.be/L2QpO7kNvAw?feature=shared


నవగ్రహ పురాణం - 72వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 72వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*కుజగ్రహ చరిత్ర - 2*


భూదేవి చిరునవ్వు నవ్వింది. *"నువ్వు ఆ తల్లి వద్దకు వెళ్ళడం కాదు , ఆమే నీ ముందు సాక్షాత్కరించాలి. కరుణనూ , వరాలనూ సముపార్జించుకునే సన్మార్గం అదే ! శరీరాన్ని ఈడ్చుకుంటూ కైలాసానికి శారీరకంగా వెళ్ళడం కాదు , నువ్వు చేయాల్సింది ! నువ్వు చేయాల్సింది మానసిక సాధన. శరీరాన్ని అదుపులో ఉంచి , నియమ నిష్ఠలతో ఇంద్రియాల వ్యాపారాలను నియంత్రించి , ఏకాగ్రతతో , ఏకైక దీక్షతో ఆ పరాశక్తిని ధ్యానిస్తూ తపస్సు చేయి. నీ ఆత్మ భావనా తరంగాలతో ఆ దేవిని ఆహ్వానించు !"* కుజుడు మౌనంగా , ఉద్రేకంతో చూశాడు.


ప్రశాంత వాతావరణం నిత్యవిహారం చేస్తున్న అందమైన అరణ్యప్రాంతంలో కుజుడు తపస్సు ప్రారంభించాడు. నియమం , నిష్ఠ , ఏకాగ్రత , ఏకైక దీక్ష... భూమాత చేసిన సూచనలు కుజుడిలో మారుమ్రోగుతున్నాయి.


కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు భూదేవి సూచనలు అతనికి వినిపించడంలేదు. *“ఎండిపోయిన ఆకులు గాలికి ఎగురుతూ వచ్చి తపస్సులో ఉన్న కుజుడి మీద తేలికగా వాలుతున్నాయి.


కాలచక్రం తిరుగుతోంది. తిరుగుతూ వర్తమానాన్ని గతంలోకి తోస్తోంది. భవిష్యత్తును వర్తమానంలోకి లాగుతోంది. నిరంతర కాలగమన విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ , ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది.


ఇప్పుడు చిగురాకులూ , మొగ్గలూ , పువ్వులూ గాలిలో నాట్యం చేస్తూ , కుజుడి మీదా , చుట్టూ వాలుతున్నాయి. కుజుడికి నీడనిస్తున్న చెట్టు రెమ్మల్లోంచి పిందెలు తొంగిచూస్తున్నాయి.


కాలం తన మంత్ర విద్యను ప్రదర్శిస్తూనే ఉంది. చెట్టు రెమ్మలోంచి తొంగిచూస్తున్న పిందెలు ముదిరి కాయలయ్యాయి.


కైలాసం...


పార్వతీ పరమేశ్వరుడు మానససరోవర తీరంలో ఆహ్లాదకరంగా విహరిస్తున్నారు. ఆదిదంపతులైన ఆ ఇద్దర్ని అనుకరిస్తూ , సరోవరంలో హంసల జంట ఒకదాన్నొకటి ప్రేమగా రాసుకుంటూ జల విహారం చేస్తున్నాయి....


*"స్వామీ..."* పార్వతి నడక ఆపి , అంది.


శివుడు ఆమె వైపు చూశాడు. ఆయన మూడవ కంటి క్రింద అందమైన కనుబొమలు , అందంగా కలుసుకున్నాయి.


*"చూశారా ? మీ పుత్రుడు 'కుజుడు' తపస్సు చేస్తున్నాడు"* అంది పార్వతి.. 


*"అలాగా ? ఎవరి గురించి దేవి ?"* శివుడు అమాయకంగా అడిగాడు. *“నా గురించే...”*


*"నీ గురించి తపస్సు చేస్తే , చూడాల్సింది నువ్వు నేను కాదు !"* పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు. 


*"మీ కుమారుడు నా గురించి తపస్సు చేయడం ఏమిటి ?"* పార్వతి చిరునవ్వు నవ్వింది.


పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. *"నా కళ్ళల్లోకి చూస్తూ , చెప్పు ! నా పుత్రుడు. నీ పుత్రుడు కాడా ? కాలేడా ? కానివ్వవా ?"* 


పార్వతి మనోహరంగా నవ్వింది. *"ఎందుకు కాడు ? ఎందుకు కాలేదు ? ఎందుకు కానివ్వను ?"*


*“అయితే నన్ను...”*


*"ఎందుకు అడిగానంటే , నేను రానప్పుడు మీరు కన్న కొడుకు కదా ! ఏమి వరం ఇవ్వమని ఆజ్ఞాపిస్తారో తెలుసుకుందామని అడిగాను !"* పార్వతి నవ్వుతూ అంది.


*“తండ్రి చెప్పడం తల్లిని చిన్నబుచ్చడమే ! తన బిడ్డలకు ఏమివ్వాలో తల్లికి తెలిసినంతగా తండ్రికి తెలీదు. తన బిడ్డలకు అమ్మ అడిగినవన్నీ ఇస్తుంది ; అడగనివి ఎన్నో ఇస్తుంది !"* 


పార్వతి ఒక్కసారిగా పరమేశ్వరుడిని తన బాహులతలతో బంధించింది. *"తల్లి తత్వాన్ని ఎంత గొప్పగా చెప్పారు !”* అంది.


*"తల్లి లేని వాణ్ణి కదా ! అందుకే అంత గొప్పగా చెప్పగలిగాను !"* శివుడు నవ్వుతూ అన్నాడు. *“అన్నట్టు 'నేను కన్న' కుజుడిని ఎప్పుడు అనుగ్రహిస్తావు ?”*


*"అది రహస్యం ! అతి రహస్యం !”* పార్వతి నవ్వింది.


వాహ్యాళి ముగించి పార్వతీ పరమశివులు మందిరం వైపు తిరిగారు. సరస్సులో విహరిస్తున్న హంసలు రెండూ వెంటనే నీళ్ళలోంచి ఇవతలకి వచ్చి , వాళ్ళ వెనకనే నడవసాగాయి.


హంసలు చేస్తున్న సవ్వడి విని శివుడు వెనుదిరిగి చూశాడు.


*"పార్వతీ , ఆ హంసలు ఎందుకు నడుస్తున్నాయో తెలుసా ?”*


*"ఊహూ ! నాకు 'హంస హృదయం' తెలీదు !"* పార్వతి నవ్వుతూ అంది. 


*“నాకు తెలుసు !”* శివుడు ఆమెనే చూస్తూ అన్నాడు. *“చెప్పనా ?”*


*“చెప్పండి !”* పార్వతి కుతూహలంగా అడిగింది.


*"నీ నడకను చూస్తూ , నీలా నడవడం నేర్చుకోవడానికి !"* శివుడు చిరునవ్వుతో అన్నాడు.


పార్వతి కిందికి వంగి , మానస సరోవరంలోని నీటిని దోసిటీతో తీసుకుని శివుడి మీదికి చల్లింది , చిలిపిగా.


కుజుడి మీద నీడ పరుస్తున్న చెట్టు మీది నుంచి కాయ , పండై , రాలింది. కుజుడు తదేక ధ్యానంలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఎవరో తనలో ఏదో స్పందన కలుగజేస్తున్నారు. సున్నితంగా , సుఖకరంగా , చాలా నెమ్మదిగా ఎవరో తనను ధ్యానం నుండి మేల్కొలుపు తున్నారు. ఏదో అవ్యక్తానందాన్నీ , అద్భుత స్పర్శ సుఖాన్నీ కలిగించే మలయమారుతం తన శరీరాన్ని స్పృశిస్తూ ఉల్లాసాన్ని అందిస్తోంది. మధురాతి మధురమైన ఏదో పిలుపు లీలగా తన సర్వస్వానికీ వినిపిస్తోంది. ఏదో మహా సుగంధం తనను చుట్టుముట్టింది.


తదేక ధ్యానముద్రలో నిత్యనిమీలితంగా ఉండిపోయిన కుజుడి నేత్రాలు అసంకల్పితంగా విచ్చుకున్నాయి. కుజుడి శరీరం ఒక్కసారిగా జలదరించింది. ఎదురుగా మెరుపుతీగ ! కాదు... మెరుపుతీగలాంటి మహా సౌందర్యం ! కళ్ళెదుట చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ... పార్వతి , శివాని , త్రిలోక సుందరి ! త్రిజగన్మోహనమూర్తి ! దుర్గ ! చండిక !


*"అమ్మా...'*


*“ఆ పిలుపు వినిపించే వచ్చాను. ఏం కావాలో కోరుకో !"*


*"అమ్మా !”*


పార్వతి ముఖం చిరునవ్వుతో వికసించింది. *"అమ్మనే ! అడుగు , మంగళా ! ఏం కావాలి ?"* 


*'మంగళా !' అన్న సంబోధన కుజుడిలో ఆలోచనల్ని రేపుతోంది. కుజుడి పెదవులు 

కదిలాయి. అప్రయత్నంగా అడిగాడు.

గీర్వాణవాణి

 గీర్వాణవాణి 

  వ శ్లోకం.

 భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏


4. దూరస్థోపి న దూరస్థో యో యస్య మనసి స్థితః


యో యస్య హృదయే నాస్తి సమీపస్థోపి దూరతః.


ఎవడు మన మనస్సులో ఉంటాడో వాడు భౌతికంగా దూరంగా ఉన్నా దూరస్థుడు కాడు.ఎవడు మన మనస్సులో లేడో వాడు మనకు సమీపంలో ఉన్నా దూరస్థుడే.

మసకబారుతున్న పండగ సంప్రదాయాలu




 మసకబారుతున్న పండగ సంప్రదాయాలలో #బొమ్మలకొలువు ఒకటి. బొమ్మ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయం.


ఈ సంప్రదాయం ప్ర‌స్తుత త‌రం వారికి పెద్ద‌గా తెలియ‌దు అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదాగా ఉండేది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది. చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, అమెరికాలో కొన్న బొమ్మల వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరాల్సిందే.


జమునగారి ఉత్సాహానికి అప్ప‌ట్లో ఆమె తల్లిగారి ప్రోత్సాహం కూడా జత అయ్యేది. ఇద్దరూ ఎన్నో రకాల బొమ్మలను సేకరించేవారు. రామాయణ ఘట్టాలకు సంబంధించిన రామాయణం బొమ్మల సెట్, ఇంకా గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కైలాసం సెట్... అలాగే కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు, తిరుపతి చెక్క బొమ్మలు, ఇంకా చిన్నప్పుడు తను ఆడుకున్న పొయ్యి బొమ్మ, పూజించిన సరస్వతీదేవి బొమ్మ... ఇలా ఎన్నో రకాల బొమ్మలతో శోభాయమానంగా, విజ్ఞానదాయకంగా కొలువును ఏర్పాటు చేసేవారు శ్రీమతి జమున.


ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించి అందరికీ పంపేవారు. క్రమం తప్పకుండా ఎందరో ప్రముఖులు వచ్చేవారు. ఎందుకంటే జమునంటే ఇష్టం. జమున ఇంట పేరంటమన్నా ఇంకా ఇష్టం. నవరాత్రులప్పుడు రోజూ ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మలకొలువు పేరంటం... ఇలా తన ఆరో యేట మొదలు గత ఏడు దశాబ్దాలుగా అలుపెరగకుండా జమున బొమ్మల కొలువు పెడుతూనే ఉండేవారు. జమున గారి బొమ్మలకొలువును చూడటానికి ప్రముఖ నటీమణులందరూ విచ్చేసేవారు.అప్ప‌ట్లో ఉన్న హీరోయిన్లంద‌రూ కూడా త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యేవారు, సావిత్రి, వాణిశ్రీ, కృష్ణ‌కుమారి ఇలా ఎంతో మంది వ‌చ్చేవారు. ఆమెతో క‌లిసి పూజ‌లో పాల్గొని పేరంటానికి హాజ‌య్యేవారు.


సేకరణ

నవగ్రహా పురాణం🪐* . *45వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *45వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 8*


బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నాడు. చెట్టు గుబురులో దాక్కున్న చిలక , ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి , ప్రణవం ప్రారంభించింది. 


*'ఓమ్!' 'ఓమ్!' 'ఓమ్ ! '*

విద్యార్థులను పాఠానికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ చిలక చేస్తున్న ఓంకార నాదం !


బృహస్పతి చిరునవ్వుతో చెట్టు గుబురు వైపు చూశారు. విద్యార్థులకు తీసిపోకుండా నేర్చుకొంటోందీ చిలక ! ఆశ్రమాల్లో చిలకలు వేదాలు పఠించాలి. సింహాలు జింకలతో ఆడుకోవాలి ! గుంపులుగా వచ్చిన విద్యార్థులు , వరసలుగా కూర్చుంటున్నారు. బృహస్పతి. చూపులు విద్యార్థుల ముఖాలను పరిశీలనగా చూస్తున్నాయి. అందరూ ఉన్నారు... చంద్రుడు ?


బృహస్పతి కళ్ళు మరోసారి విద్యార్థులను కలియజూశాయి. చంద్రుడు వచ్చినట్టు లేడు. ఏదో అడగడానికి ఆయన నోరు తెరిచాడు...


*“స్వామీ...”* పుంజికస్థల పిలుపు విని బృహస్పతి పక్కకు చూశాడు. పుంజికస్థల ఆయన వైపు వినయంగా చూసింది. *"గురుపత్ని... ఆశ్రమంలో లేరు... " "తార ఆశ్రమంలో లేదా ?"* బృహస్పతి ఆమెకు అడ్డు తగిలాడు.


*"లేరు... విద్యార్థులకు ఆహారం సిద్ధం చేయనా ?!"* పుంజికస్థల వినయంగా అడిగింది. 


*"తార ఎక్కడికెళ్ళింది , పుంజికా ?”*


*"తెలియదు ! నిన్న మీరు ఇంద్రసభకు వెళ్లినప్పట్నుంచీ గురుపత్ని కనిపించలేదు. మీతో వెళ్ళి ఉంటారనుకున్నాను..."* పుంజికస్థల వినయంగా అంది. 


*"ఔను , గురువుగారూ ! మేమూ అలాగే అనుకున్నాం ! మీ వెంట చంద్రుణ్ణి కూడా తీసుకువెళ్ళి ఉంటారనుకున్నాం..."* ఒక విద్యార్థి లేచి , నిలబడి అన్నాడు.


బృహస్పతి కళ్ళు చిట్లించాడు. చంద్రుడా ! అంటే చంద్రుడు ఇక్కడ లేడా ?


*"చంద్రుడెక్కడ ?”* అప్రయత్నంగా ప్రశ్నించాడు బృహస్పతి.


*"మీరూ , గురుపత్నిగారూ , చంద్రుడూ - ఒకే సమయంలో ఆశ్రమంలో లేకుండా పోయారు...గురువుగారూ... అందుకని... కలిసే దేవలోకానికి..."* సనాతనుడు అనే విద్యార్థి వివరిస్తున్నాడు.


*"పుంజికా ! చంద్రుడు కూడా లేడా ?”* బృహస్పతి పరిచారికను ప్రశ్నించాడు.


*"లేడు...”*


*“ఇద్దరూ మళ్ళీ నదీస్నానానికి..."* బృహస్పతి సాలోచనగా అన్నాడు. *“నదీస్నానానికి వెళ్ళకూడదని చంద్రుణ్ణి ఆజ్ఞాపించానే !”*


*"నదిలో ఏదైనా ప్రమాదం...”* బృహస్పతి అనుమానంగా అన్నాడు. 


*"నది వైపు వెళ్ళలేదు...వాళ్ళు...”* పుంజికస్థల మెల్లిగా అంది.


వాళ్ళు ? బృహస్పతి పుంజికస్థల వైపు అర్ధం కానట్టు చూశాడు. వాళ్ళు... తారా , చంద్రుడూ కలిసి తిరుగుతున్నారా ?! ఆయనలో ఏవో ఆలోచనలు ఆందోళనలు పుట్టిస్తూ , సాగుతున్నాయి. ఏ సమిథలకో అడవిలోకి వెళ్ళి ఉంటారా ?


*"సనాతనా ! సునీతుడూ , నువ్వూ - ఇంకాకొందరూ అరణ్యంలో చూడండి ! తారకూ , చంద్రుడికీ ఏదైనా ప్రమాదం..."* వాక్యం పూర్తి చేయకుండానే ఆగాడు బృహస్పతి.


*"స్వామీ... విద్యార్థులకూ , మీకూ... ఆహారం...”*. 


*"సిద్ధం చేయి, పుంజికా..."* బృహస్పతి నిట్టూర్చాడు.


వయసులో పెద్దవాళ్ళైన విద్యార్థులు చాలా మందే అరణ్యం వైపు బయలుదేరారు. అప్పుడే తన వైపే చూస్తున్న విద్యార్థుల వైపు అన్యమనస్కంగా చూశాడు బృహస్పతి. 


*"నిన్నటి పాఠం వల్లె వేసుకోండి !"* అన్నాడు.


*"రా , చంద్రా !”* చెట్టు మీది చిలక ఉన్నట్టుండి అంది. బృహస్పతి చిలకవైపు ఆశ్చర్యంగా చూశాడు.


*"ఇలా రా , చంద్రా !”* తార పిలుపు కోకిల గానంలా చంద్రుడి చెవుల్ని తాకింది.


మందిరం ముందు నిలుచున్న చంద్రుడు లోపలికి నడిచాడు. తార పిలుపు మళ్ళీ ఒకసారి శయనాగారం లోంచి వినిపించింది. చంద్రుడు శయ్యాగారంలోకి అడుగులు వేసి , హంసతూలికా తల్పం ముందు నిలుచున్న తార పక్కనే నిలుచున్నాడు. అతని చెయ్యి తీగలా సాగి , సన్నటి తార నడుముని చుట్టింది. తార తలని చంద్రుడి భుజం మీద వాల్చింది.


*"ఈ తల్పం ఎంత బాగుందో , చూశావా ?"* అంది తార.


*"విశ్వకర్మ సృష్టి !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు. *“నీకోసమే!”*


*"కాదు"* తార వెంటనే అంది. *"మన కోసం !"*


*"నేను... శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను !"* తార పారవశ్యంతో అంది. *"ఈ మందిరం , ఈ హంసతూలికా తల్పాలు , తూగుటుయ్యాలలు , ఇవన్నీ కావాలి , నాకు !"* 


చంద్రుడు ప్రేమగా ఆమె నడుము చుట్టూ తన చేతులతో బిగించాడు. *“ఎందుకూ అంత ఆశ ?"* చిరునవ్వుతో అడిగాడు.


*"దర్భాసనాలు , కృష్ణాజినాలూ , ఆకులూ , అలములూ - వీటితో అలసిపోయాను ; విసిగిపోయాను !"* అంటూ తార సున్నితంగా చంద్రుడి చేతిని తప్పిస్తూ కొంచెం ఎడంగా జరిగింది. చంద్రుడి వైపు తిరిగి , వయ్యారంగా నిలబడింది.


*"ఇలా నా వైపు చూడు !"* అంది తార.


చంద్రుడు పూర్తిగా ఆమె వైపు తిరిగి , చూశాడు.


*"నన్ను చూడు , చంద్రా !”* అంది తార. తన ముఖంలోకి చూస్తున్న చంద్రుడితో.. చంద్రుడు రెండు చేతుల్నీ నడుం మీద ఆన్చుకుని , తారను నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు కనిపించని సున్నితమైన కుంచెల్లా తార శరీరాన్ని స్పృశిస్తూ ఉండిపోయాయి.


తార - నిలువెత్తు సౌందర్యం ! రూపం ధరించి తన ముందు నిలుచున్న అందం ! 'అందగత్తె' అంటే ఇలా ఉండాలి అని చెప్పే శరీరం ! రెండు వైపులా ఉన్న చెవుల్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్నట్టున్న సోగకళ్ళు...


*"మళ్ళీ చూడు !"* తార చిరుకోపంతో అంది. *“నన్ను చూడమంటే నా కళ్లలోకి చూస్తావేం , చంద్రా ? చెప్పినట్టు చెయ్ ! నన్ను... చూడు !"* చంద్రుడు గుడ్లప్పగించి మంత్రముగ్ధుళ్ళ చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లోకి


*"ఎలా ఉన్నాను ?"* తార ప్రశ్న అతన్ని హెచ్చరించింది.


*"ఎలా ఉన్నావంటే... చక్కటి - తీగలా ఉన్నావు ! ఆ తీగ అల్లుకుపోవడానికి వీలుగా స్తంభంలా నీ పక్కన నిలబడా లనిపిస్తోంది !"* చంద్రుడి కంఠంలో ఆరాధనా భావం శబ్దించింది.


*“ఇంత సౌందర్యం , ఇంత సౌకుమార్యం దర్భాసనాలకీ , కృష్ణాజినాలకీ బలైపోతే...”* తార మధ్యలో ఆపింది.


*"ఈ చంద్రుడు అలా కానివ్వడు ! అందుకే ఇక్కడకి తీసుకువచ్చేశాడు.”* 


తార వినిపించుకోనట్టు చూసింది. *“ఈ అందం , ఈ యౌవనం - ఎక్కడుండాలి ?"* చంద్రుడు హంసతూలికా తల్పాన్ని చేత్తో చూపించాడు. *“అక్కడ !”*


తార చిరునవ్వుతో వయ్యారంగా అడుగులు వేస్తూ చంద్రుడి ముందుకు నడిచింది. *"కాదు... అక్కడ కాదు , ఇక్కడ !"* అంటూ అతని హృదయం మీద చెంపని ఆన్చి , మెడ చుట్టూ చేతుల్ని దండలా ఆన్చింది.


చంద్రుడు తలవాల్చి చూశాడు. తార కొద్దిగా తల పైకెత్తి , చంద్రుడి కళ్ళల్లోకి చూసింది. ఆమె విశాల నేత్రాల్లో ప్రేమ జ్యోతుల్లా వెలుగుతోంది. చంద్రుడి చేతులు ఆమెను పొదివి , పట్టుకున్నాయి.


*"చంద్రా... నా కోరిక చెప్పనా ?”*


*"ఊ..."*


*"నీ అందం నా కొడుకుగా పుట్టాలి!"*


 *"తారా !"* చంద్రుడు పులకించిపోతూ అన్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 56*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 56*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*మాయ భీతిల్లే జ్ఞానం* 


నరేంద్రుడు శివాంశ సంభూతుడు. చిన్నతనం నుండే ధ్యానం, ఆత్మజ్ఞానం అతడిలో సహజసిద్ధంగానే విలసిల్లింది. ణ"లోకాన్నే సమ్మోహింపజేయగల మహామాయ శక్తి కూడా నరేంద్రునికి పది అడుగుల దూరంగామాత్రమే నిలువగలదు" అని అతడి జ్ఞానాన్ని గురించి  శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు.లౌకికపరమైన కోర్కెలన్నీ ఏకమొత్తంగా తెగ నరికి, భగవద్భావనలో లయించడానికి సిద్ధంగా ఉన్నాడు నరేంద్రుడు. 


తక్కిన శిష్యుల కోసం జగజ్జననిని "అమ్మా, లోకాన్ని సమ్మోహింపజేసే శక్తియైన ఆవరణను వీరి నుండి తొలగించు" అంటూ ప్రార్థించే శ్రీరామకృష్ణులు, నరేంద్రుని కోసం, "అమ్మా, నీ మాయాశక్తిని కించిత్తు నరేంద్రునిలో నిలిపివుంచు" అంటూ ప్రార్థించేవారు!


భక్తికి పరాకాష్టయైనా ప్రేమ భక్తి  ఎంతటిదైనప్పటికీ రాధాకృష్ణుల ప్రేమను నరేంద్రుడు అంగీకరించలేక పోయాడు.  శ్రీరామకృష్ణులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ రాధాకృష్ణుల తత్త్వాన్ని నరేంద్రునికి ఆకళింపు చేయలేకపోయారు. 


 అనుభవైకవేద్యం కానిదేదీ నరేంద్రుడు అంగీకరించడు గదా! కనుక శ్రీరామకృష్ణులు అతడికి అనుభవాన్ని అనుగ్రహించారు. ఒక రోజు నరేంద్రుని కలలో శ్రీరామకృష్ణులు కనిపించి, "రా, గోపికయైన రాధను నీకు చూపు తాను" అంటూ అతణ్ణి కాస్తదూరం తీసుకొని వెళ్లారు. తరువాత వెనుకకు తిరిగి, “రాధను ఎక్కడ అన్వేషిస్తావు?" అని అడిగి, సాక్షాత్తు తామే రాధగా మారి పోయారు. రాధ సౌందర్యం వర్ణనాతీతమై ఉండడాన్ని నరేంద్రుడు గాంచాడు. ఈ కల నరేంద్రుని జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*ఆచార్యుల అనుభవాలలో తిరుమల*


భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు (రామానుజాచార్యుడు) తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు.


 ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు.


 కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడా పితామహుడై నారు)


*తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు.* 


వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. 


వీరు ఆనాడు పెంచి పోషించిన నందనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది.


 వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. 


ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.


*భగవద్రామానుజుల కైంకర్యములు*


భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు.


 అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి.


 వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. 


కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు.


పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచానూరు" (తిరుచ్చుగనూరు) లో జరిగేవట-


కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.


ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు.


 ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.


ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించారు.


 స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసారు.


ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల " అళగప్పిరానార్" " అను బావియందు ప్రవేశించినారట.


శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల " అళగప్పిరానార్" " అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. 


ఈ బావికి "అళగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.


ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట.


 ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. 


రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.


మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట.


ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట.


 ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.


స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. 


కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా యుండె వారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట.


 ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.


శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై ఆదివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.


అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. 


ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అలగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 45*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 45*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *అరాళైస్స్వాభావ్యా దళికలభ సశ్రీభిరలకైః*

          *పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |*

          *దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే*

          *సుగంధౌ మాద్యంతి స్మరమధన చక్షుర్మధులిహః ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి ముఖమును గురించి ధ్యానము చేస్తున్నారు. 


సుగంధములు *అరాళ* వెదజల్లే అమ్మవారి ముఖ పద్మముపై ముంగురులు *అలకై:* పడుతుంటే అవి ఎలా వున్నాయంటే విచ్చుకున్న పద్మములపై వ్రాలే తుమ్మెదపిల్లలు *అలికలభ* వలె వున్నాయి. అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంటే ఆమె తెల్లని దంతములు  మెల్లగా విచ్చుకుంటున్న పద్మముల లోపలి కేసరములు *కింజల్కములు* వలె మెరుస్తున్నాయి.


తాంబూల సేవనం వల్ల సుగంధములు వెదజల్లుతున్న ఆమె ముఖపద్మముపై మన్మధుడిని దహించిన శివుని చూపులు సంచరిస్తూ ఆ సుగంధమును, మకరందమును ఆస్వాదిస్తున్నాయి. *సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః* అనగా పుష్పబాణములు వేసిన మన్మధుడిని దహించి వేసిన శివుడు కూడా అమ్మవారి ముఖ పద్మము యొక్క ఆకర్షణకు ఆ సుగంధ పరిమళములకు వశమయ్యాడు అని భావం. 


*శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా*, *కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా* అనే అమ్మవారి నామములు ఇక్కడ స్మరింపదగినవి.


ద్విజములు అంటే దంతములు అని ఒక అర్థం. అవి 

శుద్ధవిద్య 

బ్రహ్మవిద్య/షోడశి విద్య మొలకల (బ్రాహ్మణములు) వలె తెల్లగా వున్నాయట. అమ్మవారి తాంబూలములోని పచ్చకర్పూర కళికల పరిమళము దిక్కులన్నిటినీ ఆకర్షించుతూ ఆనందమును పంచుతున్నదట. అనగా అమ్మవారి శుద్ధవిద్య పలుకుల వల్ల జ్ఞానులందరికీ ఆనందము కలిగిందని భావం. షోడశి మంత్రము లోని శివ,శక్తుల బీజాక్షరముల దళములు 32

అమ్మవారి దంతములుగా ప్రకాశిస్తున్నాయని శ్రీవిద్యోపాసకులైన పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Music for yoga


 

27 years


 

రెక్కలుంటే యెగిపోనా


: కవుల ఊహాశక్తి- వర్ణనావైభవం! 


                       రెక్కలుంటే  యెగిపోనా ?అన్నారెందరో!విచిత్రం రెక్కలు లేకపోయినా యెగిరే సామర్ధ్యంగలవాడు కవేనేమో, కవుల ఊహలు మింటికి మంచికి వారధులు విర్మిస్తాయి. ఊహాలోకాల సృష్టికిక అంతేలేదు. ప్రబంధ కవులలో రామరాజ భూషణుడనే కవిఉన్నాడు. ఊహాతీతమైన పాండిత్య వైభవ కాణాచి. ఆయన వసుచరిత్ర అనే ఒక నంచిప్రబంధాన్ని రచిచాడు. ప్రతిపద్య చమత్కృతికి పాత్రమైన ఆప్రబంధంనుండి నేడు మీకో పద్యరాజమును పరిచయం చేస్తా, చిత్తగించండి! 


           మ: జలజాతేక్షణ  వెంటనంటిన  వసుక్ష్మాపాలకాలోకమున్ 

                 ప్రతిరోధింపగ  జాలవయ్యె, భవన  ప్రాంతోరు కాంతార వ 

                 ర్ధిత వల్లీ వలయంబు; తచ్చికురపాళీ  నీరదాళీ  మిళ న్ 

                 నృతి కేళీరస  కేకిలోక  గరు దున్మీలన్  మరుల్లోలమై; 


                          యీగ్రంధంలో గిరిక- వసురాజులు కావ్య నాయికా నాయకులు. నాయకుడు వసురాజు వన విహారానికి వచ్చి, కోలాహల పర్వతాగ్రంలో ఒక కోనలో మణిమయ మందిర సమీపంలో వీణాపాణియైన గిరికను చూశాడు. ఆముగ్ధమోహనరూపం  అతనిహృదయంలో  నిలచిపోయింది. వివరాలు తెలిసి కొన్నాడు. వెనకకు మరలినాడు. 


                       కానీ ,అతని చూపులు ఆమెయందే లగ్న మైనాయి.  వెనకకు మాటికి తిరిగి చూచుచున్నాడు. కానీ ముందుకేగినకొలదీ, ఆభవనముకు సమీపమున దట్చముగా నల్లుకొనిన తీగెల వలన అడ్డు యేర్పడి ఆమెరూపము కనపడనిస్ధితి. అలాంటి పరిస్ధితిలో యేంజరుతున్నదో  కవి చెపుతున్నాడు. వినండి! 


                      భవనం చుట్టూ ఉన్నతీగెల అడ్డువల్ల  రాజుగారి దృష్టికి అంతరాయం  కలదగటంలేదూ! అని .యెందువల్ల? అంటే, 

  " కావ్యనాయిక  గిరిక ముంగురులు దట్టమైన మేఘాలవలె ఉన్నవట. వాటిని జూచి మేఘభ్రాంతితో  నెమళ్ళు పురివిప్పి  నాట్యం చేస్తునాట. వాటి రెక్కల వలన పుట్టిన గాలికి తీగెలు యిటూ నటూ ఊగుతున్నాయట. అదిగో ఆఊగులాట గాప్ లోవసురాజుగారు గిరికను కనులార,ఃమనసార, చూచి సంతసించు చున్నారని కవిభావన! 


                      ఇంతకీ  ఆమె ముంగురులు దట్టంగా మేఘాలను తలపిస్తునాయి. ఆమెభవనంముందు నెమళ్ళునాట్యం చేస్తున్నాయీ అని మనకు వివరించటం. అదీ అసలు విషయం!


                                      స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌🌷🌷🌷🌷🌷

పితృదేవతలు

 శ్లోకం:☝️

*ఆషాఢ్యాః పంచమే పక్షే*

  *కన్యాసంస్థే దివాకరే ।*

*యో వై శ్రాద్ధం నరః కుర్యాత్*

   *ఏకస్మిన్నపి వాసరే ।*

*తస్య సంవత్సరం యావత్*

  *తృప్తాస్యుః పితరో ధ్రువమ్ ॥*


భావం: మహాలయ పక్షం సమయంలో పాడ్యమి నుండి క్రింది శుక్ల పక్ష పాడ్యమి వరకు 16 రోజుల పాటు ప్రతిరోజూ శ్రాద్ధం చేయాలని సూచించబడింది. అది సాధ్యం కాకపోతే, కనీసం ఒకరోజు అయినా  శ్రాద్ధం చేసిన యడల, అతని పితృదేవతలు ఖచ్చితంగా ఒక సంవత్సరం మొత్తం సంతృప్తి చెందుతారు.🙏

పంచాంగం 06.10.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 06.10.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: సప్తమి తిధి భృగు వాసర: ఆర్ధ్ర నక్షత్రం పరిఘ యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.

సప్తమి ఉదయం 06:35 వరకు.

ఆర్ధ్ర రాత్రి 09:34 వరకు.

సూర్యోదయం : 06:10

సూర్యాస్తమయం : 05:57

వర్జ్యం : తెల్లవారుఝామున 04:46 నుండి ఉదయం 06:29 వరకు

దుర్ముహూర్తం : పగలు 08:31 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:27 నుండి 01:14 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం : మద్యాహ్నం  03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*అత్యున్నత పదారూఢః*

*పూజ్యాన్నైవావమానయేత్ |*

*నహుషః శక్రతామేత్య*

*చ్యుతో గస్త్యావమాననాత్ ॥*


*భావము* :- 


*గొప్పస్థానాన్ని పొందినప్పటికీ గౌరవించదగినవారిని గౌరవించాలి, అవమానించరాదు. నహుషుడు ఇంద్రపదవిని పొంది పూజించదగిన అగస్త్య మహర్షిని అవమానించుటవల్ల పతనమయ్యాడు గదా!*


🧘‍♂️🙏🪷 ✍️🙏

శుక్రవారం, అక్టోబరు 6, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం, అక్టోబరు 6, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి ఉ9.10 వరకు  

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:ఆర్ద్ర రా12.45 వరకు

యోగం:వరీయాన్ ఉ9.40 వరకు

కరణం:బవ ఉ9.10 వరకు తదుపరి బాలువ రా9.37 వరకు

వర్జ్యం:ఉ8.19 - 10.00

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.03 &

మ12.12 - 1.00

అమృతకాలం:మ2.13 - 3.54

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:  కన్య

చంద్రరాశి: మిథునం 

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం: 5.44


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*



*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - అష్టమి - ఆర్ధ్ర -  భృగు వాసరే* (06.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/tsBLGsQfv8U?si=6wxICAd3HNaWoOpK


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Story


 

తొలగిన వేదన..

 *తొలగిన వేదన..*


"దాదాపు నలభైఏళ్ళు దాటింది..అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు..చాలా మారిపోయింది..అప్పుడు ఈ సమాధి మందిరం మాత్రం ఉండేది..ముందు వైపు ఒక తాటాకుల పందిరి..అందులోనే తలదాచుకునే వాళ్ళం..పర్లేదు ఇప్పుడు వసతులు ఏర్పడ్డాయి.."అన్నారు ఈశ్వరయ్య గారు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణం అంతా తిరిగి చూసిన తరువాత.."బాబూ..నేను మా ఆవిడ మరో రెండురోజులు ఇక్కడ ఉంటాము..మాకు వసతి చూపించు.." అని అడిగారు..సరే అన్నాను..మా సిబ్బందికి చెప్పి ఒక గదిని వాళ్లకు కేటాయించాము..ఆరోజు గురువారం..ఈశ్వరయ్య దంపతులు స్వామివారి సమాధిని దర్శించుకొని..మంటపం లో కూర్చున్నారు..కొద్దిసేపటి తరువాత నా వద్దకు వచ్చి.."ఆరోజుల్లో ఇక్కడ ఇలా ఆహారపు ఏర్పాటు లేదు..మాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారని తెలిస్తే..మీ అమ్మా నాన్న గార్లు భోజనం పెట్టేవారు..మీ అమ్మగారి చేతి ప్రసాదం తిన్నవాళ్ళలో మేము కూడా ఉన్నాము..నువ్వు మంచిపని చేస్తున్నావు..ప్రతిరోజూ ఈ మందిరానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశావని ఇక్కడి వాళ్ళు చెప్పుకుంటున్నారు..ఈ మారుమూల ప్రదేశం లో ఆకలితో బాధపడకుండా చేస్తున్నావు.." అన్నారు..


"మీరు స్వామివారు జీవించి ఉండగా చూసారా?.." అని అడిగాను ఈశ్వరయ్య గారిని.."లేదు బాబూ..ఆ అదృష్టానికి నోచుకోలేదు..1978 లో మా వివాహం జరిగింది..మా నాన్నగారు పట్టుబట్టి మా దంపతులను ఇక్కడికి తీసుకొచ్చారు..అప్పటికి స్వామివారు సిద్ధిపొంది సుమారు ఒకటిన్నర సంవత్సరం అయింది అని చెప్పారు..ఆరోజు స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..జీవితం లో స్థిరపడాలి..అన్ని విధాలా బాగుండాలి.." అని కోరుకున్నాను..మరుసటి నెలలోనే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం లో చేరాను..ఆ ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు..ఉద్యోగరీత్యా దేశంలో చాలా ప్రాంతాల్లో వున్నాను..నిజాయితీగా పనిచేశాను..మూడేళ్ల తరువాత మొదటి సంతానంగా కుమారుడు పుట్టాడు..ఆ తరువాత అమ్మాయి పుట్టింది..ఇద్దరినీ చదివించాను..అబ్బాయికూడా మంచి ఉద్యోగం లోనే వున్నాడు..వాడికి ఇద్దరు పిల్లలు..అమ్మాయి అల్లుడూ ఢిల్లీ లో వుంటున్నారు..ఒకరకంగా చెప్పాలంటే..స్వామివారిని నేను కోరుకున్న కోరికను..స్వామివారు తీర్చారు..ఆ కృతజ్ఞత చూపించుకునే అవకాశం ఇంతవరకూ కలుగలేదు..రిటైర్మెంట్ అయిన తరువాత చాలా క్షేత్రాలు చూసాము..ఈలోపల మా అమ్మాయి కాపురం లో కలతలు వచ్చాయి..అదొక దిగులు పట్టుకుంది..ఆ సమయం లో ఒక నెల రోజుల క్రితం ఈ క్షేత్రం గురించి గుర్తుకు వచ్చింది..పెళ్ళైన కొత్తలో వెళ్ళాము..మళ్లీ వెళ్ళలేదు..ఒక్కసారి చూసివద్దాము..ఆరోజు మీరు ఆ స్వామిని కోరుకున్న కోరిక నెరవేర్చాడు కదా..?..ఈరోజు మన బిడ్డ గురించి ఆ స్వామినే వేడుకుందాము..ఫలితం ఉంటుందేమో..అని మా ఆవిడ కూడా చెప్పింది..ఇలా బయలుదేరి వచ్చాము.." అన్నారు..


ఆరోజు సాయంత్రం ఆ దంపతులు స్వామివారి మందిరం లోనే నిద్ర చేశారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు స్వామివారి సమాధి మందిరం తో సహా మొత్తం ప్రాంగణం శుభ్రం చేసే కార్యక్రమం చూసి..ఈశ్వరయ్యగారు కూడా పాల్గొన్నారు..మరుసటిరోజు ఉదయాన్నే మాలకొండ క్షేత్రానికి వెళ్లి మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వచ్చారు..శనివారం నాటి సాయంత్రం జరిగే పల్లకీసేవ లో పాల్గొనడానికి తమ దంపతుల పేర్లు నమోదు చేసుకున్నారు..పల్లకీసేవ వద్ద అర్చన చేయించుకొని..ఒక ప్రదక్షిణ అయ్యేవరకూ పల్లకీ మోసి ఇవతలికి వచ్చి కూర్చున్నారు..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."బాబూ ప్రసాద్..చాలా తృప్తిగా వుందయ్యా..ఈ మూడురోజుల నుంచీ ఏదో ఒక సేవలో పాల్గొన్నాము..మనసుకు ప్రశాంతం గా ఉన్నది..మా ఇద్దరికీ మనసులో ఉన్న వేదన స్వామివారికి నివేదించుకున్నాము..కూతురు సంసారం బాగుంటే అదే చాలు..మాకు ఈ వయసులో ఆ ఒక్క దిగులూ లేకుండా చెయ్యి నాయనా..అని వేడుకున్నాము..ఆ ఒక్క దిగులూ తీరి పోయి..దాని సంసారం గాడిన పడితే..వాళ్ళను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తాము.." అన్నారు..ఆదివారం ఉదయం ప్రభాతసేవ కూడా చూసి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వెళ్లారు..


మరో రెండు నెలల తరువాత..ఈశ్వరయ్య గారు ఫోన్ చేసి.."బాబూ ప్రసాద్..వచ్చేవారం మేమందరమూ మొగిలిచెర్ల కు వచ్చి..దత్తాత్రేయ స్వామివారి సమాధి దర్శించుకుంటాము..ముఖ్యంగా మా కూతురు అల్లుడూ వస్తున్నారు..అన్ని సమస్యలూ తీరిపోయాయి..అల్లుడూ కూతురూ ఇప్పుడు హాయిగా వున్నారు..అందుకే వాళ్ళను తీసుకొని వస్తున్నాము..స్వామివారు మా దంపతుల మొర ఆలకించారు..స్వామివారి మంటపం లోనే నిద్ర చేస్తాము..ప్రత్యేకంగా రూమ్ లేకున్నా పర్వాలేదు..మేము శని, ఆదివారాలు అక్కడ ఉంటాము కనుక..ఆ రెండురోజులూ అన్నదానానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాము..ఈరకంగా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుని మా మొక్కు చెల్లించుకుంటాము.." అన్నారు..


స్వామివారి అనుగ్రహాన్ని పొందిన ఈశ్వరయ్య దంపతులు ఆ విధంగా స్పందించడం లో ఆశ్చర్యం లేదు..గత మూడేళ్ళుగా ఆ దంపతులు స్వామివారి ఆరాధన రోజు ఈ క్షేత్రానికి వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

అశాశ్వత భోగాలను కోరుకుంటున్నాడు.

 గీర్వాణ వాణి 


యథా వ్యాళ గళస్థో ఽపి, భేకో దంశానపేక్షతే

తథా కాలాహినా గ్రస్తః, జనో భోగానశాశ్వతాన్.


పాము నోటికి చిక్కి తాను చనిపోయే దశలోకూడా , కప్ప - ఈగలను పట్టి తినాలని ఆశపడుతుంది. అలాగే కాలమనే సర్పం చే మ్రింగబడే మానవుడు కూడా అశాశ్వత భోగాలను కోరుకుంటున్నాడు.

ఆలోచనాలోచనాలు

 ××××× ఆలోచనాలోచనాలు ×××××                                  ------0 విజయానికి నాలుగే మెట్లు 0------                           ఎనిమిదేళ్ళ బాలుడు బాగా తలనెరసిన, పేరుప్రఖ్యాతులు గడించిన ఒక వృద్ధుని వద్దకు వచ్చి,"" మీరు చాలా తెలివైనవారని ప్రపంచం అంతా మెచ్చుకోవడం గమనించాను. జీవితంలో విజయాలను సాధించడానికి ముఖ్యమైన అంశాలను నాకు సంక్షిప్తంగా తెలియజేయగలరా?"" అని ప్రశ్నించాడు.                         దానికామేథావి శాంతంగా ఆ జిజ్ఞాసువుతో ఇట్లా సంభాషించాడు.                   మొదటిది--- " ఆలోచించడం." ముందు జీవితపు విలువల గురించి బాగా ఆలోచించు. ఆ విలువలు సాధించడం గురించి ఒక ప్రణాళికను రూపొందించుకో!"                  రెండవది----" నీపై నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. నీవు ఆశించిన ప్రణాళికకు ఈ (నీ) ఆత్మవిశ్వాసాన్ని పెనవెయ్యి. లోకంలో ఎవరు, ఏమైనా అన్నా, అనుకొన్నా, నీ పట్టుదల ( సాధన) నుండి వైదొలగకు.                             మూడవది---" ఇది అతి ముఖ్యమైంది. నీవు సాధించబోయే ఘనకార్యాలపట్ల కలలుగను. ఆ కలలు సాకారమయ్యే అవకాశాల అన్వేషణలో నిరంతరం మునిగితేలుతూవుండు."       చివరిది, అతి ముఖ్యమైనది సుమా! "అదే మొండి ధైర్యం." ఇప్పుడు ఈ నాల్గింటిని ఒక దృఢమైన తాడుగా పెనవెయ్యి. ఎవరు, ఏమైన అనుకోని, ఈ తాడుతో పైకి ఎగబ్రాకు. ఇక విజయం నీ స్వంతం."                              పై నాలుగు సూత్రాలను , నాలుగు సోపానాలుగ అమరుద్దాం అవి వరుసగా "" ఆలోచించు, విశ్వసించు, కలలుగను, ధైర్యంతో ముందుకు సాగు.""                ప్రశ్నించిన ఆ బాలుని పేరు , మనకు చరిత్ర పుటలలో దొరకడం లేదు. ఇవి ప్రవచించిన మేథావి " వాల్టేర్ ఇ డిస్నీ."                     దీనివలన మనకేమైనా ప్రయోజనం ఉంటుందేమో ఆలోచించండి.                       ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~.                            Sharpen your mind!          1* Which ring carries?    2* Slayer of regrets, old and new, sought by many, found by few.What am I?                3* Five add six is eleven, but six add seven is one. How is that possible?                   4* What is the softest nut in the entire world?                                  (For proper answers you have to wait 24 hrs only.).                           ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                              అర్థబేధము గల దగ్గరిపదాలు!                       1* అనలము =అగ్ని.             అనిలము= వాయువు.           2* అనలుడు= అగ్నిదేవుడు.                        అనిలుడు= వాయుదేవుడు.                     3* అబ్రము= ఆశ్చర్యము.      అభ్రము= ఆకాశము             4* అభినందనము= సంతోషించుట లేదా ప్రశంసించుట.                        అభివందనము= నమస్కరించుట.                  5* అలము=తృణము.          ఆలము = యుద్ధము.            6* ఆలంబము = ఆధారము                            ఆలంభము = చంపుట          7* ఆహుతి = అగ్నిలో వేయుట.                              ఆహూతి = ఆహ్వానించుట లేదా ప్రేమతో పిలుచుట.          8* ఉద్ద్రతము = మిక్కిలి వేగము.                                 ఉద్ధ్రతము = పైకి తీయబడినది.                        9* ఉన్మాదము = పిచ్చి( మానసిక వ్యాధి)             ఉన్మాధము = చంపుట.         10* ఉపాదానము = భిక్షవేయుట                           ఉపాధానము = (ఒకచోట) ఉంచుట.                              ( మరికొన్నింటి కొరకు ఒక వారం నిరీక్షిద్దాం!)                  తేది 6--10--2023, శుక్రవారం, శుభోదయం.

ఆశీస్సులూ..అండదండలూ..

 *ఆశీస్సులూ..అండదండలూ..*


"మరో పదిరోజుల్లో మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది..వెళ్లే లోపల ఒకసారి స్వామివారి వద్దకు వెళ్ళొద్దామని అడిగింది..అందుకని ఈరోజు అమ్మాయిని వెంటబెట్టుకొని తీసుకొచ్చాము..మళ్లీ మధ్యాహ్నం తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు రాజేశ్వరి గారు.."అలాగా..బాగా హడావుడిలో ఉన్నట్టుగా వున్నారు.." అన్నాను.."అవునండీ.." అన్నారు..ఆరోజు ఆదివారం..భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువగానే ఉన్నది..రాజేశ్వరి గారు తన కూతురిని తీసుకొని ఒక ప్రక్కగా కూర్చున్నారు..మరో అరగంట లోపల..స్వామివారి సమాధి దర్శించుకునే భక్తుల హడావుడి తగ్గిపోయింది..రాజేశ్వరి గారిని లోపలికి వెళ్ళమని చెప్పాను..కూతురిని తీసుకొని స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చి స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..అర్చకస్వామి వారు ఇచ్చిన తీర్ధ ప్రసాదాలు తీసుకొని నా వద్దకు వచ్చి కూర్చున్నారు..


"ఏమిటో ప్రసాద్ గారూ..ఏ పని మొదలుపెట్టాలని అనుకున్నా..ముందుగా ఈ మొగిలిచెర్ల కు వచ్చి..స్వామివారి సమాధి వద్ద మొక్కుకున్న తరువాతే ఆ పని చేస్తాము..గత ముప్పై ఏళ్లుగా అలవాటు అయింది.." అన్నారు రాజేశ్వరి గారు..నిజమే..రాజేశ్వరి గారి వివాహం కాక ముందు..ఆవిడ తల్లిదండ్రులతో కలిసి మొదటిసారి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..అందుకు కారణం కూడా ఉంది..రాజేశ్వరి గారికి వివాహం చేద్దామని ప్రయత్నాలు మొదలుబెట్టారు ఆమె తల్లిదండ్రులు..ఆరేడు సంబంధాలు వచ్చాయి..ప్రతి సంబంధమూ వెనక్కు పోతోంది..జాతకరీత్యా ఏ దోషము లేదు..కానీ ఒక్క సంబంధమూ కుదరడం లేదు..రాజేశ్వరి గారి నాయనమ్మ గారు.."ఒక్కసారి అమ్మాయిని తీసుకొని మొగిలిచెర్ల వెళ్లి..ఆ అవధూత దత్తాత్రేయుడి సమాధి మందిరం వద్ద నిద్ర చేసిరండి..ఏదైనా దోషం వున్నా తొలగిపోతుంది.." అని కొడుక్కు సలహా ఇచ్చారు..తల్లిమాట కాదనలేక అమ్మాయిని తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజుల్లో..స్వామివారి మందిరం వద్ద కనీస వసతులు కూడా లేవు..ఉన్న ఒక్క మంటపం లోనే..కూతురిని పెట్టుకొని..ఆ తల్లీదండ్రీ నిద్ర చేసారు..తెల్లవారి లేచి..స్వామివారి సమాధి ని దర్శించుకొని..తమ కూతురు కు వివాహం కుదరాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని వెళ్లారు..వాళ్ళ మొక్కుబడి ఫలితమో..స్వామివారి అనుగ్రహమో..తెలీదుకానీ..సరిగ్గా నెల లోపల రాజేశ్వరి వివాహం జరిగిపోయింది..ఆరోజు నుంచీ రాజేశ్వరి గారికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి మీద అపరిమిత భక్తి భావం కుదిరింది..ఆమె భర్తకు కూడా స్వామివారి పై అచంచల విశ్వాసం..


"ఈసారి అమ్మాయి అమెరికా నుండి రాగానే వివాహం చేయాలని అనుకున్నామండీ..స్వామివారి వద్ద కోరుకున్నాను..ఇప్పటికే దీనికి ఇరవై నాలుగేళ్ల వయసు..ఇక ఎక్కువ ఆలస్యం చేయకూడదని నా భావన..ఇక ఆ స్వామివారి దయ..ఆ సమాధి లో కూర్చున్న ఆ స్వామివారిదే భారం అంతా.." అని చెప్పి..మరొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని కూతురిని తీసుకొని వెళ్లిపోయారు..


మరో వారం తరువాత రాజేశ్వరి గారు ఫోన్ చేశారు..తమ కూతురు వివాహం కుదిరిందని..పెళ్లికూడా మరో పదిరోజుల్లోనే జరుపుతున్నామని..అమ్మాయి అమెరికా ప్రయాణం పూర్తిగా రద్దు చేసుకున్నామని..తమ కూతురికి అన్నివిధాలా తగిన వరుడు  లభించాడనీ..చెప్పారు.."అమ్మా..మీరు అమ్మాయి అమెరికా నుంచీ వచ్చిన తరువాత వివాహం చేస్తానన్నారు కదా..మరి సంబంధం ఎలా కుదిరింది?" అని అడిగాను.."అంతా స్వామిదయ అండీ..అమ్మాయిని తీసుకొని ఇంటికొచ్చిన ప్రక్కరోజే ఈ సంబంధం వాళ్ళు మాకు తెలిసిన వారిద్వారా అడిగించారు..మావారు వాళ్ళ గురించి విచారించారు..చాలా మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబం అని తెలిసింది..మా అమ్మాయిని అడిగాము.."అబ్బాయిని చూసిన తరువాత చెపుతాను.." అన్నది..పెళ్లిచూపులు ఏర్పాటు చేసాము..అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు..ఇద్దరూ ఇష్టపడ్డారు..ముహూర్తం పెట్టుకున్నాము..అంతా ఒక కల లాగా జరిగిపోయింది..పెళ్లి కాగానే..వధూవరులను తీసుకొని స్వామివారి సన్నిధికి వచ్చి..ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాము..దాని పెళ్లి కావాలని కోరుకున్నాను..కాకుంటే అమెరికా నుంచి వచ్చిన తరువాత అని అనుకున్నాము..కానీ..ఆరోజు ఒకమాట అనుకున్నాను.."స్వామీ దీనికి ఇరవై నాలుగేళ్లు వచ్చాయి..ఎక్కువ ఆలస్యం లేకుండా వివాహం జరిగేటట్టు చూడు తండ్రీ..అని..ఆమాట స్వామివారు విన్నారు..వెంటనే స్వామివారు మా అమ్మాయికి తగిన వరుణ్ణి సిద్ధం చేసి ఉంచారు..అంతా ఆయన కరుణ..మా ప్రాప్తం.." అన్నారు..


రాజేశ్వరి గారు త్రికరణ శుద్దిగా స్వామివారినే నమ్ముకున్నారు..అందుకే ఆవిడ కు అడుగడుగునా స్వామివారి ఆశీస్సుల తోపాటు వారి అండదండలూ ఉంటాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

చిన్న కథ..

 ఒక చిన్న కథ...


ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు..


పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు..


 ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. 


కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పి ఆశగా చూసింది.. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి.


అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది.. 


కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది.. అది రాలేదు. ...


మరోసారి ప్రయత్నించింది అమాయకంగా..


దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది..


ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరి పోయింది.


 ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది.


 కాకి తెలివితక్కువ తనానికి నవ్వుకుంది.


ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా..,


మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. 


మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 


'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది.. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు.. కాగితంలో కాకి చిత్రం..' అనే ముక్క చేర్చలేదు. 


ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ..' అంటూ మరో మాట చేర్చింది. 


ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.


వాటిలో ఓ కాకి అయితే.. 'కాకి కన్ను పొడిస్తే ... పాపం..! రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. 


మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి.. 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను 'అంటూ వాపోయింది.


మరో కాకి.. 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.. 


అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్ర వేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. 


ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులను స్నేహంగా చూసింది. 


అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి . 


కాకికి ఏమి అర్థం కాలేదు.. రెండు రోజులుగా అన్ని కాకులు వెలి వేసినట్టుగా దూరంగా మసులు తున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.. 


'"ఒక్కోసారి అంతే..! మన ప్రమేయం ఏమి లేకుండానే మనల్ని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. అపనిందలు, పుకార్లమయం ఈ లోకం.. 


మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు.. అలాంటి వందల మంది నీకేలా.?" అంటూ ఓదార్చింది కొమ్మ మీద కోయిలమ్మ..


*సూక్తి..*


ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసు కోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతను అన్ని సందర్భాల్లో ఎలా ఉంటాడో పరిశీలించకుండా... పుకార్లు నమ్మటం, చెడుగా మాట్లాడటం, చెడ్డవాడు అని నిర్దారణకు రావడం వల్ల ఒక మంచి సన్నిహితుణ్ణి కోల్పోవటమే కాదు.., అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నవనే విషయాన్ని  గ్రహించండి...


🙏🙏