🕉️ *ఆధ్యాత్మిక సాధన ఇలా...* 🕉️
నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.
నీ మనసును మాత్రం
ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...
నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన
వాళ్ళుగానే వ్యవహరించు.
నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.
ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.
తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది.
కాని, ఆమెకు తెలుసు,
ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.
తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.
అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.
నీ మనసును మాత్రం,
ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.
ఈ ప్రపంచంలో జీవించటానికి ఇదే ఉత్కృష్టమైన మార్గము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి