6, అక్టోబర్ 2023, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సంగీతంలో మూర్ఛనలనూ తానమార్గాలను ఆలకించి ఆనందించనివాడే నిజమైన పశువు.

హరిణాలు పశువులు కానేకావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం, చెవులుండీ

సంగీతాన్ని ఆస్వాదించలేని మానవులకన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ

కేజింతలుకొడతాడు పసిబాలుడు. ఏళ్ళువచ్చినవాళ్ళకన్నా వీడు నయం కాదూ! ఎందుకొచ్చిన పెద్దరికాలు?!

అమ్మా! తండ్రిగారికి తెలియదంటావా నారదుడి గొప్పదనం ముల్లోకాలలోనూ నారదుడికి

సాటివచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయాలలో గానానికి గుణాలకూ

ముగ్దురాలినయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిలో ఏదో శాపం కారణంగా వానరముఖడయ్యాడే కానీ

అంతకుముందంతా అందగాడే. ఇవ్వేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనస్సులో రవ్వంత

కలతచెందానే తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పులేదు. ఏమీ, గుర్రపుముఖాల

కిన్నరులు అందరికీ నచ్చడంలేదూ? తమ గానవిద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తూనే ఉన్నారుగదా! ముఖం

ఎలా ఉంటే ఏమిటమ్మా? గుణం ముఖ్యం. విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు

నారదుడికిచ్చి వివాహం జరిపించమను.

దమయంతి ఇంత కచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేస్తే మహారాజ్ఞి మారుమాట్లాడలేక

యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనసా వరించింది కనక అతడికే ఇచ్చి వివాహం

చెయ్యడం సమంజసమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక

శుభముహూర్తాన నాకూ దమయంతికి మహావైభవంగా ఉద్వాహం జరిపించాడు

కామెంట్‌లు లేవు: