××××× ఆలోచనాలోచనాలు ××××× ------0 విజయానికి నాలుగే మెట్లు 0------ ఎనిమిదేళ్ళ బాలుడు బాగా తలనెరసిన, పేరుప్రఖ్యాతులు గడించిన ఒక వృద్ధుని వద్దకు వచ్చి,"" మీరు చాలా తెలివైనవారని ప్రపంచం అంతా మెచ్చుకోవడం గమనించాను. జీవితంలో విజయాలను సాధించడానికి ముఖ్యమైన అంశాలను నాకు సంక్షిప్తంగా తెలియజేయగలరా?"" అని ప్రశ్నించాడు. దానికామేథావి శాంతంగా ఆ జిజ్ఞాసువుతో ఇట్లా సంభాషించాడు. మొదటిది--- " ఆలోచించడం." ముందు జీవితపు విలువల గురించి బాగా ఆలోచించు. ఆ విలువలు సాధించడం గురించి ఒక ప్రణాళికను రూపొందించుకో!" రెండవది----" నీపై నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. నీవు ఆశించిన ప్రణాళికకు ఈ (నీ) ఆత్మవిశ్వాసాన్ని పెనవెయ్యి. లోకంలో ఎవరు, ఏమైనా అన్నా, అనుకొన్నా, నీ పట్టుదల ( సాధన) నుండి వైదొలగకు. మూడవది---" ఇది అతి ముఖ్యమైంది. నీవు సాధించబోయే ఘనకార్యాలపట్ల కలలుగను. ఆ కలలు సాకారమయ్యే అవకాశాల అన్వేషణలో నిరంతరం మునిగితేలుతూవుండు." చివరిది, అతి ముఖ్యమైనది సుమా! "అదే మొండి ధైర్యం." ఇప్పుడు ఈ నాల్గింటిని ఒక దృఢమైన తాడుగా పెనవెయ్యి. ఎవరు, ఏమైన అనుకోని, ఈ తాడుతో పైకి ఎగబ్రాకు. ఇక విజయం నీ స్వంతం." పై నాలుగు సూత్రాలను , నాలుగు సోపానాలుగ అమరుద్దాం అవి వరుసగా "" ఆలోచించు, విశ్వసించు, కలలుగను, ధైర్యంతో ముందుకు సాగు."" ప్రశ్నించిన ఆ బాలుని పేరు , మనకు చరిత్ర పుటలలో దొరకడం లేదు. ఇవి ప్రవచించిన మేథావి " వాల్టేర్ ఇ డిస్నీ." దీనివలన మనకేమైనా ప్రయోజనం ఉంటుందేమో ఆలోచించండి. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~. Sharpen your mind! 1* Which ring carries? 2* Slayer of regrets, old and new, sought by many, found by few.What am I? 3* Five add six is eleven, but six add seven is one. How is that possible? 4* What is the softest nut in the entire world? (For proper answers you have to wait 24 hrs only.). ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ అర్థబేధము గల దగ్గరిపదాలు! 1* అనలము =అగ్ని. అనిలము= వాయువు. 2* అనలుడు= అగ్నిదేవుడు. అనిలుడు= వాయుదేవుడు. 3* అబ్రము= ఆశ్చర్యము. అభ్రము= ఆకాశము 4* అభినందనము= సంతోషించుట లేదా ప్రశంసించుట. అభివందనము= నమస్కరించుట. 5* అలము=తృణము. ఆలము = యుద్ధము. 6* ఆలంబము = ఆధారము ఆలంభము = చంపుట 7* ఆహుతి = అగ్నిలో వేయుట. ఆహూతి = ఆహ్వానించుట లేదా ప్రేమతో పిలుచుట. 8* ఉద్ద్రతము = మిక్కిలి వేగము. ఉద్ధ్రతము = పైకి తీయబడినది. 9* ఉన్మాదము = పిచ్చి( మానసిక వ్యాధి) ఉన్మాధము = చంపుట. 10* ఉపాదానము = భిక్షవేయుట ఉపాధానము = (ఒకచోట) ఉంచుట. ( మరికొన్నింటి కొరకు ఒక వారం నిరీక్షిద్దాం!) తేది 6--10--2023, శుక్రవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి