6, అక్టోబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 45*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 45*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *అరాళైస్స్వాభావ్యా దళికలభ సశ్రీభిరలకైః*

          *పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |*

          *దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే*

          *సుగంధౌ మాద్యంతి స్మరమధన చక్షుర్మధులిహః ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి ముఖమును గురించి ధ్యానము చేస్తున్నారు. 


సుగంధములు *అరాళ* వెదజల్లే అమ్మవారి ముఖ పద్మముపై ముంగురులు *అలకై:* పడుతుంటే అవి ఎలా వున్నాయంటే విచ్చుకున్న పద్మములపై వ్రాలే తుమ్మెదపిల్లలు *అలికలభ* వలె వున్నాయి. అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంటే ఆమె తెల్లని దంతములు  మెల్లగా విచ్చుకుంటున్న పద్మముల లోపలి కేసరములు *కింజల్కములు* వలె మెరుస్తున్నాయి.


తాంబూల సేవనం వల్ల సుగంధములు వెదజల్లుతున్న ఆమె ముఖపద్మముపై మన్మధుడిని దహించిన శివుని చూపులు సంచరిస్తూ ఆ సుగంధమును, మకరందమును ఆస్వాదిస్తున్నాయి. *సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః* అనగా పుష్పబాణములు వేసిన మన్మధుడిని దహించి వేసిన శివుడు కూడా అమ్మవారి ముఖ పద్మము యొక్క ఆకర్షణకు ఆ సుగంధ పరిమళములకు వశమయ్యాడు అని భావం. 


*శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా*, *కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా* అనే అమ్మవారి నామములు ఇక్కడ స్మరింపదగినవి.


ద్విజములు అంటే దంతములు అని ఒక అర్థం. అవి 

శుద్ధవిద్య 

బ్రహ్మవిద్య/షోడశి విద్య మొలకల (బ్రాహ్మణములు) వలె తెల్లగా వున్నాయట. అమ్మవారి తాంబూలములోని పచ్చకర్పూర కళికల పరిమళము దిక్కులన్నిటినీ ఆకర్షించుతూ ఆనందమును పంచుతున్నదట. అనగా అమ్మవారి శుద్ధవిద్య పలుకుల వల్ల జ్ఞానులందరికీ ఆనందము కలిగిందని భావం. షోడశి మంత్రము లోని శివ,శక్తుల బీజాక్షరముల దళములు 32

అమ్మవారి దంతములుగా ప్రకాశిస్తున్నాయని శ్రీవిద్యోపాసకులైన పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: