6, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆలోచనాలోచనాలు

 {{{{{ ఆలోచనాలోచనాలు }}}}}} ***** అవధాన మధురిమలు *****                      00000 పంచసహస్రావధాని శ్రీజంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి 00000       సమస్యాపూరణములు         1* " బలివాకిటివాడొ, బాణువాకిటివాడో." పూరణము;--- "" కం. వెలయాలితోడి నెయ్యము/ కలుగగనే రాదు తప్పి, కలిగినొ దానిన్ / నిలుపగ రావలె నజుడో/ బలివాకిటివాడొ, బాణువాకిటివాడో!""              2* "రాతిరి సూర్యుండు సంబరమ్మున దోచెన్." పూరణము;---"" కం. ఆతత కాసారము ల/ జ్ఞాత మనోజ్ఞంబులయ్యె,జక్రము లెల్లన్/ గావరముడిగెన్/ రాతిరి, సూర్యుండు నంబరమ్మున దోచెన్.""          3* "పచ్చి మాంసంబు దినువాడు బ్రాహ్మణుండు." పూరణము;--- ""తే.గీ. బ్రహ్మవిజ్ఞాన హేతు భావప్రబోధి/ నిత్యకర్మాభి నిరతుడే ద్విజుడు కాని/ యగునె కలుద్రావ జందెమ్ము లవలద్రోసి/ పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు.""                4* "భరతున్ దునిమె రాఘవుండు భామిని కొఱకై" పూరణము;--- "" కం.హరిసుతుని బరిమార్చెను/ సిరిగురు నొప్పించె శమముచెడి రావణునిన్/ హరపదసేవనారం/ భ రతుం దునిమె రాఘవుండు భామిని కొఱకై.""                                  5*" ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో." పూరణము;--- "" కం. ధరణీ ప్రవాహవేగ / స్ఫురణంబునకోడి మొక్క భూమికి వంగన్/ మరియున్ లేచుటకొఱకే / ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో.""                దత్తపది---పెట్టె -- బెట్టు -- దిట్ట -- గట్టు -- వెద్ది  పదములతో పద్యం.             తే. గీ. " పెట్టెలోనిడి తాళంపు బెట్టువైతె / ధనము బుధులడ్గ? దిట్టవు! ఘనగుణమణి/ గణములకు రోహణంపు బెన్గట్టువెద్ది / ఘనకలాబ్ధికి జెలియలిగట్టు చెపుమ?""      వర్ణనాంశములు--- 1* లక్ష్మీ సరస్వతీ సంవాదము---        సీ. పదివేసములవాఁడు పడతి నీ మగఁడన్న చతురాస్యుఁడగు నటే చామ యనియె.                     అన్యకాంతాలోలుఁడగు నీదు మగఁడన్న, తననోట సతి నుంచుకొనునె యనియె                              పాముపానుపుమీఁదఁ బండు నీ మగఁడన్న, పూరేకులొత్తునే బోఁటి యనియె.                              నటరాజనృత్తనందనుఁడు నీ మగఁడన్న , కర్నశౌంకారోక్తికరుఁడె యనియె                                తే. గీ. సృష్టిలేకున్న నెవనిఁబోషించునన్న / సృజనగావించి యెట్లు రక్షించుననియె/ ఇట్టు లన్యోన్యవాద ప్రవృత్తలైన / వాగ్ధనాత్మక మాతలఁ బ్రస్తుతింతు.                          2* శక్తిత్రయము---                పంచ!! సురాసురేంద్రగేయ గానశోభిచారితన్ సతిన్./     సరోజనేత్ర రంజనైక చాతురీధురన్ రమన్ / వరప్రదాన కౌశలస్వభావయుక్త భారతిన్/ స్థిరస్థితిన్ శుభంబు గూర్పఁ జిత్తమందు నెంచెదన్.            3* "అయిదు భాషల మాటలతో పద్యము"----        ఉ. టైమయిపోయె ధూమశకటంబిఁక నేగు చలోరెహా కదా/ గీమునఁ గాలయంత్ర నహికెం కడునాలస మేలచేసెదో/ జామున నూరికింజని విచారణ సత్సభ నిల్వనేరమో/ యేమి యనర్థ మేర్పడు నొహేసఖ చాంగ్ల యనంగ వింటివే?        ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         తేది 4--10--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: