///// ఆలోచనాలోచనాలు ///// -----౦౦౦ మనోవైఖరి ౦౦౦----- మనం A=1; B=2; C=3; D=4;- - - - - - - Z=26 అని అనుకొంటే, అదృష్టం(LUCK) = 12+21+ 3+ 11= 47;. జ్ఞానం ( KNOWLEDGE) = 11+ 14+ 15+ 23+ 12+ 5+4+7+5= 96;. పరిశ్రమ (HARD WORK) = 8+ 1+ 18+ 4+ 23+ 15+ 18+ 11= 98 ;. వైఖరి (ATTITUDE)= 1+20+20+ 9+ 20+ 21+ 4+5= 100 . కాబట్టి మన మనోస్థితి లేదా వైఖరి, అదే మన జీవితాన్ని సుసంపన్నం చేసేది. *****ఇక మనం ఏంచేయగలం అనేది మన సామర్థ్యం మీద, మనం ఏంచేస్తున్నాం అనేది మనకు లభించిన ప్రేరణ మీద, ఇక మనం దానిని ఎంతబాగా చెయ్యగలం అనేది మన దృక్పథం మీద ఆధారపడి ఉంటాయి. ***** కొండపైన నిలబడి క్రిందికి చూస్తే అన్నీ చిన్నవాటిగానే కన్పిస్తాయి. అదే మనం లోతైన లోయలో నిలబడి పైకి చూస్తే అన్నీ పెద్దవిగా కనుపిస్తాయి. మొదటిది మన అహంకారానికి, రెండవది మన ఆత్మన్యూనతకు సంకేతాలు. ఆ రెండింటి నడుమ ఉండేదే మన నిజమైన మనోస్థితి. ***** లోకంలో అల్పమైన పనులంటూ ఏవీ లేవు. ఏవైనా ఉన్నాయని మనం భావిస్తున్నామంటే అది నిజానికి మనలో దాగివున్న "అల్పత్వమే!" ***** మూర్ఖుడు చేసే ఘనకార్యం ఏమిటయ్యా అంటే తాను చెయ్యవలసిన పనులను వాయిదా వేసుకొంటూ, ఎదుటివారి పనులలో వంకలు వెతుకుతూ ఉంటాడు. ***** నీ కర్తవ్యాన్ని నీవు సరిగా నిర్వహించవు. జీవులను బాధించడం మానుకోవు. పూజలవలన, మొక్కులు తీర్చుకోవడం వలన దేవుళ్ళు వరాలను అనుగ్రహిస్తారనే భ్రమలో జీవిస్తావు. చిల్లుల బొక్కెనతో బావినుండి నీళ్ళను తోడడం సాధ్యమైన పనేనా? (ఆలోచించు!) తేది 5--10--2023, గురువారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి