: కవుల ఊహాశక్తి- వర్ణనావైభవం!
రెక్కలుంటే యెగిపోనా ?అన్నారెందరో!విచిత్రం రెక్కలు లేకపోయినా యెగిరే సామర్ధ్యంగలవాడు కవేనేమో, కవుల ఊహలు మింటికి మంచికి వారధులు విర్మిస్తాయి. ఊహాలోకాల సృష్టికిక అంతేలేదు. ప్రబంధ కవులలో రామరాజ భూషణుడనే కవిఉన్నాడు. ఊహాతీతమైన పాండిత్య వైభవ కాణాచి. ఆయన వసుచరిత్ర అనే ఒక నంచిప్రబంధాన్ని రచిచాడు. ప్రతిపద్య చమత్కృతికి పాత్రమైన ఆప్రబంధంనుండి నేడు మీకో పద్యరాజమును పరిచయం చేస్తా, చిత్తగించండి!
మ: జలజాతేక్షణ వెంటనంటిన వసుక్ష్మాపాలకాలోకమున్
ప్రతిరోధింపగ జాలవయ్యె, భవన ప్రాంతోరు కాంతార వ
ర్ధిత వల్లీ వలయంబు; తచ్చికురపాళీ నీరదాళీ మిళ న్
నృతి కేళీరస కేకిలోక గరు దున్మీలన్ మరుల్లోలమై;
యీగ్రంధంలో గిరిక- వసురాజులు కావ్య నాయికా నాయకులు. నాయకుడు వసురాజు వన విహారానికి వచ్చి, కోలాహల పర్వతాగ్రంలో ఒక కోనలో మణిమయ మందిర సమీపంలో వీణాపాణియైన గిరికను చూశాడు. ఆముగ్ధమోహనరూపం అతనిహృదయంలో నిలచిపోయింది. వివరాలు తెలిసి కొన్నాడు. వెనకకు మరలినాడు.
కానీ ,అతని చూపులు ఆమెయందే లగ్న మైనాయి. వెనకకు మాటికి తిరిగి చూచుచున్నాడు. కానీ ముందుకేగినకొలదీ, ఆభవనముకు సమీపమున దట్చముగా నల్లుకొనిన తీగెల వలన అడ్డు యేర్పడి ఆమెరూపము కనపడనిస్ధితి. అలాంటి పరిస్ధితిలో యేంజరుతున్నదో కవి చెపుతున్నాడు. వినండి!
భవనం చుట్టూ ఉన్నతీగెల అడ్డువల్ల రాజుగారి దృష్టికి అంతరాయం కలదగటంలేదూ! అని .యెందువల్ల? అంటే,
" కావ్యనాయిక గిరిక ముంగురులు దట్టమైన మేఘాలవలె ఉన్నవట. వాటిని జూచి మేఘభ్రాంతితో నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తునాట. వాటి రెక్కల వలన పుట్టిన గాలికి తీగెలు యిటూ నటూ ఊగుతున్నాయట. అదిగో ఆఊగులాట గాప్ లోవసురాజుగారు గిరికను కనులార,ఃమనసార, చూచి సంతసించు చున్నారని కవిభావన!
ఇంతకీ ఆమె ముంగురులు దట్టంగా మేఘాలను తలపిస్తునాయి. ఆమెభవనంముందు నెమళ్ళునాట్యం చేస్తున్నాయీ అని మనకు వివరించటం. అదీ అసలు విషయం!
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి