25, అక్టోబర్ 2024, శుక్రవారం

*3 - భజగోవిందం

 *3 - భజగోవిందం / మోహముద్గర*

💙💙💙💙💙💙💙💙💙💙💙💙


*భజగోవిందం శ్లోకం:-1*


*భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే।*

*సంప్రాప్తే సన్నిహితే కాలేనహి నహి రక్షతి డుకృఞ౯ కరణే॥ భజ ॥ 1.*


*ప్రతిపదార్థం:-* 


గోవిందమ్ = గోవిందుని; భజ = సేవించు; గోవిందమ్ = గోవిందుని; భజ= సేవించు; .మూఢమతే= అజ్ఞానముచేత ఆవృతమైన తెలివి కలవాడా; సన్నిహితే కాలే= నిర్ణీతమైనకాలము( మరణమునకు నిశ్చితమైన సమయము); సంప్రాప్తే= ప్రాప్తించినప్పుడు; డుకృఞ్ కరణే = వ్యాకరణ శాస్త్రాధ్యాయనము; నహి నహి రక్షతి = రక్షించనే రక్షించదు; గోవిందమ్ = గోవిందుని; భజ = సేవించు; గోవిందం = గోవిందుని; భజ = సేవించుము.


*భావం:-*


సేవించు గోవిందుడిని, సేవించు గోవిందుడిని, గోవిందుడినే సేవించ వోయి మూఢమతీ! మృత్యువు ఆసన్నమయినప్పుడు నీ యీ "డుకృఞ్ కరణే'' అనే వ్యాకరణ పాఠం ముందుకు వచ్చి నిన్ను రక్షించుటయనునది జరగనే జరగని పని సుమా!.


*వివరణ:-*


‘‘భజగోవిందము’’లో ప్రప్రథమానవున్న యీ శ్లోకం పాటలోని పల్లవిగా పరిగణింపబడుతోంది. ఆ తరువాత వచ్చే ప్రతి శ్లోకాంతంలో కూడా మరల మరల యీ శ్లోకం పల్లవిగా చెప్పబడటం మామూలు సామూహిక ప్రసంగాల్లోను సత్సంగా ల్లోనూ భజగోవిందము, చేయబడటం సర్వ సాధారణ మైనట్టిది. అలాటి సమయాల్లో పాటనుపక్రమించిన గురువు ఒక్కొక్క శ్లోకమే ఫణితి తప్పక చెపుతూ వుంటే మిగతా అందరూ అందుకొని ఈ శ్లోకాన్ని మాత్రం పల్లవిగా"భజగోవిందం భజగోవిందం గోవిందం మూఢమతే" అంటూ చర్విత చర్వణం చేస్తూ వుంటారు.


ఈ శ్లోకంలో గురువు శిష్యులకు ఇలా ప్రవచిస్తున్నారు.


"వత్సా! నీ హృదయాన్ని గోవింద పరమైన ఆలోచనలతో పూరింప జెయ్యి. తదితర సంబంధమైన యోగ్యతలను ఫలాలను సాధించాలని, పొందాలని నీ యధీనముతో వాటిని పట్టి వుంచుకోవాలని నానా యాతనలతో సతమతమగుట కన్నా తత్పరమైన ఆలోచనలతో హృదయాన్ని సేవించటం యెంతో శుభమైనట్టిది" అని.


ఇందులో చెప్పిన "వ్యాకరణ సూత్రము"భౌతిక సంబంధమైన జ్ఞానమంతటినీ, వాంఛలన్నిటినీ భౌతిక వస్తుజాలాన్నంతటినీ కూడా స్ఫురింప జేయటానికి ఉద్దేశింప బడినది ఆ భౌతిక వస్తుజాల మంతా కూడా "డుకృఞ్ కరణే' అనే వ్యాకరణ సూత్రంలాగానే నిష్ప్రయోజనమైనదని ధ్వనింప చేశారిక్కడ.'


మనిషి ప్రపంచంలో కొద్దికాలం మాత్రం వుంటాడు. అతడి జీవన పరిధి చాలా చిన్నది. మృత్యువు ఎప్పుడో హఠాత్తుగా యీ పరిధిలో నుంచి అతనిని లాగి కబళించి వేస్తుంది. అలాంటప్పుడు యీ వ్యక్తికి పెద్దవ్యాకరణ గ్రంథాలు నోటికి వచ్చినవై నా,ఎన్నో సైన్సుకు సంబంధించిన విజ్ఞాన విశేషాలు తెలిసివున్నవయినా- పాపం - అవేవీ మృత్యు ముఖాన్నుండి అతనిని తప్పించలేవు. ఇదీ ఇక్కడి సూచన.


ఈ సూచన ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన ఒకానొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తోంది.అక్కడనారదుడు సనత్కుమార మహర్షి దగ్గరకు చేరి ప్రార్థిస్తాడు. తనకు జ్ఞానోదయం కలుగజేయవలసిందని ప్రార్థించును. అందుకు ఋషి నారదునితో సరే అలాగే కాని నీకు ఇంతవరకు తెలిసినదేమిటో వివరించు, నీకు తెలియని దేదయితే మిగిలివుంటుందో దానిని చెపుతాను, అంటాడు. వెంటనే నారదుడు తనకు తెలిసిన విషయాలు ఒక బ్రహ్మాండమైన జాబితా ఆయనముందు ఏకరువు పెట్టుతాడు. అబ్బో- అందులోని విషయాలు అంతులేనన్ని, అన్నీ మహత్తరమైన శాస్త్రజ్ఞాన విష యాలే. జ్యోతిషం, ఖగోళశాస్త్రం, వాఙ్మయం, శిల్పం, గాంధర్వం, నృత్యం --- యింకా వివిధమైన ఎన్నెన్నో చాలా చెపుతాడు. వీటిలోని విషయాలన్నిటినీ నేను ఆమూలాగ్రం తెలిసికొన్నా నంటాడు. అప్పుడు ఋషి " అవన్నీ ఆయాశాస్త్రాలకు సంబంధించిన వట్టి పేర్లు మాత్రమే. "భూమ"మైన ఆ "అనంతాన్ని' తెలియనేర్వాలి. అది వీటన్నిటినీ అధిగమించి వుంటుంది, అంటాడు. 


 (మహర్షి పాణిని వ్రాసిన "ధాతు పాఠముల'నే వ్యాకరణగ్రంథములో వున్నది. సిద్ధాంతకౌముదిలో.)


ఈ సందర్భంలో నారదుడు తన యోగ్య తలుగా యిచ్చిన జాబితాలో వ్యాకరణం శాస్త్రం కూడా ఒకటి ప్రత్యేకంగా చెప్ప బడింది. ఆ సంగతియీ సందర్భంలో జ్ఞాపకం చేసుకొంటే సరళమైన అనుభూతి కలుగు తుంది.


అయితే- మరి వ్యాకరణం తెలియనక్కర్లేదా? అని శంక రావచ్చు. తెలియవలసిందే. కాని అది ఒకానొక ఆశయాన్ని పొందటానికి యేర్పడ్డ మార్గం మాత్రమేనని గమనించటం ముఖ్యం. శాస్త్రం ఏమి చెపుతున్నదో నిర్దిష్టంగా తెలిసికోవటానికి వ్యాకరణం కావలసినదే. గురువు చెప్పిన వాక్యాలు పూర్తిగా తెలిసి హృదయగతం చేసుకోటాని కి దాని ప్రయోజమెంతో వుంది. కాని ఆజన్మాంతమూ యీ మార్గాన్ని మాత్రమే పరి శీలిస్తూ అపముఖమైన శీర్ణవిషయాలు వెతుక్కుంటుపోయి ఏది మనిషిని అసంపూర్ణత నుండి ఉద్దరిస్తుందో ఆ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని తెలిసికొనుట మనేది చేపట్టకుండా కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ఆచార్య శ్రీ శంకర భగవత్పాదులు ఆ ఖండించారు.


వ్యక్తమైవున్న యీ ప్రపంచంలో నీ ఉనికిని తుడిచివేయటానికి మృత్యువు నీ దగ్గరకు వచ్చిన క్షణాన నీ యీ విజ్ఞాన శాస్త్రాలు నీకు ఏం ప్రయోజనమీయగలవు? నీవు కరతలామలకం చేసికొన్న శిల్పం నీకేమంత సుఖసంతోషాల నిస్తుందప్పుడు? నీ యీ వ్యాకరణ సూత్రాల విజ్ఞానం ఎంతవరకు సహాయం చేయగలుగుతుంది? ఇక్కడ జీవించి యున్నంతవరకూ మనిషియొక్క పరమోత్తమైన ఆశయం ఏమిటనుకొంటున్నావు? తన జీవిత పరమావధిని తెలిసి, దాన్ని హృదయగతము చేసి కొనటం సృష్టి వెనుకనున్న వాస్తవాన్ని సత్యాన్ని తెలియటం ఆ సత్యంతో తానేకమై ఆ ఐక్యతతో సంపూర్ణత్వాన్ని పొందటమున్నూ. అయితే అలాంటి వానికి మృత్యువు రాదా? అనవచ్చు. వస్తుంది. అతడూ మృత్యువువాత పడుగాక, అయితే అందరివలె నికృష్టమైన సర్వనాశన మనే దాన్ని ఆక్షణాన పొందటం మాత్రం కాదు. స్ప్రింగు పలకల మీదనించొని ఆకాశం లోనికి రాకెట్టు లాగినట్లు మృత్యువు నాసరా చేసికొని శాంతి మయమైన దివ్యమయిన అనంత సత్యంలోనికి నిర్గమిస్తాడు.


కొందరుంటారు వాళ్ళకు అశేషమైన పుస్తక పరిజ్ఞానం వుంటుంది. మాట్లా డుతూ మాట్లాడుతూ భగవద్గీతను ఉదహరిస్తూ కూడా వాళ్ళుంటారు. "మోక్షా నికి గాను పెద్దగ చింతపడనక్కరలేదు. దానికి ఒకే ఒక సులువైన మార్గముంది. అదేమిటంటే చనిపోయేసమయాన మాత్రం భగవంతుని జ్ఞాపకానికి తెచ్చుకుంటేచాలు.


అంతే దానితో సర్వతోముఖమైన కార్యసిద్ధిని పొందుతాము''. అని అందుకు ఆధారంగా *"అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ యః ప్రయాతి సమచ్చానం”* అనే భగవద్వాక్యాన్ని గీతనుంచి ఉదాహరిస్తారు. వాళ్ళు ఒక సంగతి గమనించక పోవటం శోచనీయం. నిశితమైన ధర్మసూత్రం ఎన్నడు మనలను దయతలచి మెత్తబడి పోవడం జరగదని వారెఱుగరు. ధర్మ సూత్రాలే భగవంతుడు.


అంతేకాదు గీత చెప్పిందేమని? "అంతకాలే చ" అని ఈ "చ" అనే శబ్దం లోని నైశిత్యం విడమరచి తెలిసికోడం ముఖ్యం. శంకరులు వారి వ్యాఖ్యానంలో యీ శబ్దానికి అర్థం ఇలా చెప్పారు. "జీవిత మంతానూ పైగా శరీరం త్యజించే సమయంలో కూడానూ భగవంతుని అను సంధానం చెయ్యాలి'' అని.


‘భజగోవిందమ్’’ అన్నప్పుడు “భజ” అంటే భజించుట. అర్పించుట, సేవించుట అని అర్థము. కాని, గానుగెద్దు గాడిలో పడి తిరిగినట్టు ఒకానొక ఆచారమనే త్రోవలో పడిచేతులతో పూలు విసురుతూ నోటికి అలవాటయిన మంత్రాలు పలికేస్తూ మనసెక్కడో పెట్టుకొని అర్పిస్తున్నామంటే సరిపోదు. భజించడమంటే అలాంటి ఊహకే తావులేదు. పరమేశ్వరుడితో మనమెలా అనుబంధింపబడి ఐక్యమైవున్నామో ఆ ఊహను అను సంధానం చెయ్యటం కావలసింది. అలా ఆయన్ను సేవించుటయే నిజమైన భజనం. నిజమైన సేవ.


ప్రజల ఉన్నతి కొరకు ఏర్పాటు చేయబడ్డ దేవాలయాల్లో గాని, కుటుంబ శ్రేయస్సు కోసమై ప్రత్యేకించబడిన యిండ్లలోని పూజా మందిరాల్లోగాని సర్వమత సంప్రదాయాల్లోనూ-ఈ పూజా విధానాలు, భగవత్సేవనములు ప్రత్యేకమయిన ఒక పద్ధతిలో క్రమబద్ధం చేయబడినవి. దీనివల్ల దేశంలో సర్వమతైక్యము సర్వ మత సామరస్యము సుస్థిర మగును. ఆ పద్దతిలో ఆరాధించడం మత సంబంధమైన ఆచారం చేయడం మాత్రమే అవుతుంది. అదే దాని ప్రయోజనం. అలాకాక ఆ కర్మను నెఱవేర్చేటప్పుడు మనం ఆత్మసమర్పణం చేసుకొన్న ట్లయితే, ప్రేమ ప్రపత్తులతో భగవంతుని సేవించినట్ల యితే అదే అసలైన, సిసలైన, నిజమైన భజనం.


ఈ ఆత్మ సమర్పణం ఏవరికి? భగవంతుడికి, అతడెక్కడు న్నాడని, భక్తుడు ఆ భగవంతుని సాన్నిహిత్యం యే పవిత్ర ప్రదేశంలో వున్నట్లు తన ఊహలో సాక్షాత్కారించుకొంటాడో ఆ ప్రదేశంలోనే వున్న ఆ భగవంతుని పాదాల దగ్గర ఆత్మ సమర్పణం చేసికొంటాడు. అలాటి ప్రదేశాలే యీ దేవళాలు.


ఆత్మసమర్పణ అంటే భగవంతుని పాద సాన్నిధ్యంలో భక్తుడు కరిగి పోయిభక్తుడు నశించి భక్తి మాత్రం మిగిలిందన్నట్లు ద్రవీభూతుడు కావడమే, ఇలాంటి స్థితికి దోవలు తొమ్మిది. ఆయా అన్వేషణా మార్గాలనుబట్టి యీ వైవిధ్యాలు చెప్పబడినవి. అవేవంటే- 1)శ్రవణం; భగవదైశ్వర్యములను వినటం, 2) కీర్తనం; వాటిని గానం చెయ్యటం, 3) స్మరణం; నిరంతరం భగవంతుని స్వభావ సౌందర్యాన్ని మననం చేయటం,4) పాదసేవనం; ఆయన పాదాల్ని మనఃపుష్పాలతో అలంకరించటం; 5) అర్చనం; మంత్రములతోనూ దేవుని పవిత్రములైన వేదఋక్కులతోనూ అందుకు సేవించటం. 6) వందనం; అనుషంగికమైన తంత్రముతోనూ దేవుని నమస్కరించుతూ వుండటం. 7) దాస్యం; దాసునివలె సేవించటం. 8)సఖ్యం; భగవంతుని స్నేహితునిగా ఉపాసించి అంతటి ప్రేమతో ప్రవర్తించటం. 9) ఆత్మ నివేదన; అంతరింద్రియాలు భౌతిక దేహంతో సహా భగవంతునికి పూజా పుష్పంగా ఉపాసింపబడిన మూర్తి ఎదుట వినమ్రుడై సంపూర్ణముగా తన్ను తాను సమర్పించుకొనడం వీటన్నింటి లోనూ కూడ నేను అనే ది వున్నది. అన్ని చోట్ల కూడ మనసు యొక్క ఆ ఉపాసనా స్థితిని ఉపయోగించ వలసి వున్నది. పూజ అనే దాని ఆంతర్యమైన ఉద్దేశ్యం యీ స్థితిలో వుండి సేవ చేయుటయే ఈశ్వరుని గూర్చి యీ స్థితిలో సేవ చేసినట్లయితే అది ఈశ్వర భజన అవుతుంది. అంతేకాదు అలాగే చేసిన జనసేవ కూడా జనార్దన సేవే అవుతుంది.


‘‘గోవింద’’ అనేది విష్ణుమూర్తికి పేరు. విష్ణు సహస్రనామాల్లో రెండుచోట్ల వస్తుంది ఆ నామం. శంకరులు తమ వ్యాఖ్యానంలో యీ శబ్దాన్ని శభోత్పతి శాస్త్ర రీత్యా తరిచి వివిధ మార్గాల్లో అర్థం చెప్పారు. పరమ సత్యాన్ని అనంతమైన బ్రహ్మ పదార్థాన్ని సూచిస్తూ క్రింది నాలుగువిధాలుగా చెప్పారు. 1)భూమినియెవడయితే కనుగొన్నాడో లేదా తెలిసికొన్నాడో అతడు అని- అంటే ఈ చరాచర ప్రపంచ కార్యకలాపం దేనిమీదయితే నడుస్తూవుందో దాని అంతరాంతరాల్లో కూడా తెలిసిన వాడని అర్థం. భూమి పుట్టుకముందు నుంచి వున్నవాడు కనుక దాని పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన వాడనవచ్చును.


2) పశుసంపదకు ఎవరు స్వామియై వున్నాడో అతడు గోకులంలోని గోపాలకుడైన గొల్లపిల్లవాడనే కాదు. పశుసంబంధమైన జీవ సంబంధమైన మనోవాంఛలన్నిటికీ ఆధారంగా వెనుక నున్న శక్తి అని అర్థం. 3) ఎవడైతే వాక్శక్తికి ఆధార భూతుడో అతడు. జీవికి తన భావాన్ని మాటలద్వారా లేదా అరుపుల ద్వారా ఇతరులకు తెలియచేయడానికి యే శక్తి వుందో అది అని అర్థం. ఓండ్రపెట్టే గాడిద కావచ్చు. అరిచే కుక్క కావచ్చు అనర్గళంగా వుపన్యసించే మేధా సంపన్నుడు కావచ్చు. అలా తమ భావాల్ని వ్యక్తీకరించడానికి ఆధారం ఆ శక్తే. 4) ఎవడు వేద ఋక్కుల ద్వారా తెలిసి కొనబడుచున్నాడో అతడు. ఆ మహావాక్యాలు ఏ పరమార్థాన్ని సూచిస్తున్నాయో ఆ పరమార్ధమే ఆ మహాసత్యమే అతడు. 


సంగ్రహంగా చెప్పాలంటే గోవిందుడన్నప్పుడు- మన చుట్టూ వున్న యీ స్థావర జంగమాలన్ని యిలా క్షణక్షణాన మారిపోతూ వున్న స్థితిలో వాటి వెనుక నిత్యమై నిరంతరం నిలిచివుండే సంబంధం. శాశ్వతత్వం సారమేదయితే వుందో ఆయాత్మే అతడని చెప్పాలి. గోవిందుడే ఉపనిష ద్రహ్మము. అతడే పరమోత్కృష్ట సత్యము ప్రభువులకు ప్రభువు. అందువల్ల భజగోవిందమ్ అన్నపుడు అర్థం యేమిటంటే "గోవిందుడితో మన ఐక్యత యేదో” అది తలచి దాన్ని సేవించమని అర్థం. గడచిపోయే అనుభవముల గూర్చిగాని ఆ సమయాలను గూర్చిగాని తాత్కాలిక కీర్తి ప్రతిష్ఠల గూర్చి గాని ప్రాపంచిక వస్తు సంగ్రహాన్ని గూర్చిగాని, కాలం వ్యర్థం చేస్తారు. ఇహపరానికి భిన్నమైన జ్ఞానం కోసం ప్రాకు లాడటం వట్టి నిష్ప్రయోజన మైనట్టిది. అలాంటి వానిని అన్వేషణంలో, వ్యాకరణ సూత్రాల వెంబడి వేటాడుతూ మీ సమయాన్ని వ్యర్థం చేయవద్దు సుమా అని యర్థం.

*సశేషం*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

*2 - భజగోవిందం మోహముద్గర*

 *2 - భజగోవిందం మోహముద్గర*

     

      *ఉపోద్ఘాతం*


దారిలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ వుండడం విన్నారు. వృద్ధాప్యము వచ్చినా యింకా, లౌకిక జ్ఞానానికై కాలాన్ని వృధా పరుస్తూ, ఆత్మ సాధనకి ప్రయత్నించని అతనిని చూచి శ్రీ శంకరులు హృదయం లోంచి ఈ మోహముద్గర శ్లోకాలు వెలువడినాయి అని అంటారు. దీనినే భజగోవిందం అని పిలుస్తారు. వ్యాకరణ సూత్రాలు ఎవరినికూడ మృత్యుసమయంలో రక్షించవు. జీవించి యుండగానే పవిత్రము, పరిపూర్ణము అయి దేశకాలా తీతమైన అమృతత్వాన్ని పొందడానికి త్వరపడు”.


మొదటి శ్లోకం పల్లవి. ప్రతి చరణం చివర తిరిగి దానిని పాడాలి. దాని తర్వాత వచ్చే పన్నెండు శ్లోకాలు శ్రీశంకరులు స్వయంగా చెప్పినవని ప్రథ. ఇవి ద్వాదశ మంజరికా స్తోత్రమనే పేరుతో ఉన్నవి. ఈ శ్లోకాలు చెప్పిన వెంటనే, ఆయన వెంటనున్న శిష్యులు గురుదేవుల ఫణితి నందుకుని, వెల్లువలా హృదయాల్లోంచి భావాలు పొంగిరాగా, ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా శ్లోకాలు చెప్పారు. ఈ పధ్నాలుగు శ్లోకాలు చతుర్దశ మంజరికాస్తోత్రమని అన బడతాయి. శిష్యులు చెప్పిన శ్లోకాలు విన్న తరువాత శ్రీ శంకరులు తిరిగి నాలుగు శ్లోకాలు చెప్పి; తద్వారా సర్వకాలం ముముకు జనావళిని అనుగ్రహించి, ఆశీర్వదించారు. 


ఈ ముప్పయ్యొక్క శ్లోకాలు కలిసి "మోహముద్గరమనే పేరుతో ప్రసిద్ధి పొందాయి. చాలా కాలం నుండి ఇవి పాడబడుతున్నవవడం చేత అనేకసార్లు అచ్చు అయినవి. పాఠాంతరాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యానంలో అక్కడక్కడ పాఠాంతరాలు కూడ సూచింప బడినాయి.


ఈ మోహముద్గరము యొక్క కొన్ని ప్రచురణలలో అన్ని శ్లోకములు లేవు. కొన్నింట్లో ఈ వరుసగాక ముందువి వెనక, వెనకవి ముందు వున్నవి. కొన్ని టియందు శ్లోకం లోని ఒకపాదం, యింకో శ్లోకంలోని రెండో పాదంతో కలిసి వున్నది. కొన్నిచోట్ల పాదాలు తికమక అయినవి, కొన్ని చోట్ల మాటలే మారాయి. ఏది ఏమైనా ఎక్కడా ఈ శ్లోకాలయొక్క ముఖ్యార్థం మాత్రం మారలేదు


మొదటి పన్నెండు శ్లోకాలని "ద్వాదశమంజరికా స్తోత్ర'' అని అంటారు. వికసించిన పండ్రెండు పూవులున్న గుత్తి దూరంనుండే అందంగా కన్నుల పండువుగా వుంటుంది. అలాగే యీ పండ్రెండు శ్లోకాలు వింటుంటూనే పులకల తోడి ఆనందం కలుగుతుంది. నిరంతరం పనిచేసే తేనెటీగలు పూలచుట్టూ తిరిగి వాటిలోనికి ప్రవేశిస్తే, వాటికిమంచి తేనె అందు తుంది. ఆలాగే సాధకులు లయ బద్దమైన శ్లోకాల అర్థంలోకి ప్రవేశించితే వేదాంతామృతాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు. భజగోవిందం నుండి ఊరడించే వేదాంతం, సంతృప్తినిచ్చే జీవన విధానం లభిస్తాయి.


ఇది స్తోత్రమని, స్తుతుల తరగతిలో చేర్చబడినప్పటికినీ, దీనిలోని పల్లవి మాత్రమే స్తోత్రం. మిగిలిన ముప్పై శ్లోకాలు శాస్త్రీ యమైనవి. మనిషిలోని విలువయిన సత్యపదార్థాన్ని కప్పివేసే తెలివి మాలినతనాన్ని - అజ్ఞానాన్ని- మూఢత్వాన్ని విశ్లేశించి, నిపులంగా విశదపరుస్తాయి. ప్రపంచంలో వ్యక్తి ఏర్పరచుకొన్ని అక్రమ సంబంధాన్ని, దాని కాధారమైన మూర్ఖతని వ్రేళ్ళతో పెకిలించి పారేస్తాయి. ఈ శ్లోకాలని వేదాంత శాస్త్రంలో ప్రక్రియ గ్రంధం అనవచ్చును.


ఆత్మబోధ, వివేక చూడామణి పంచదశివంటి వేదాంత గ్రంధములకు భిన్నంగా, తన పరిధిమేరలో భజగోవిందము” భగవత్సాక్షాత్కార నిమిత్తమై సంపా దించుకోవలసిన విలువలని, దానికి విఘ్నాలుగా ఉండే మానవ బలహీనతలని చక్కగా విపులీకరిస్తుంది. సాధకునికి జీవిత గమ్యాన్ని, సాధనోపాయాలు బోధించడమే కాక ఇప్పటి జీవితంలోని బాధాకరమైన న్యూనతని, నేటి జీవితంలోని భయంకరమైన విలువలని, వాటిని ఇలాగే కొనసాగిస్తే పర్యవసానంగా లభించే దుష్ఫలితాలని భజగోవిందం స్పష్టంగా వివరిస్తుంది. అహం కారము, కోరికలతో కూడుకున్నది యిప్పటి జీవితం.


ఈ స్తోత్రము తనతో సమానులైన వేదాంత వేత్తలకు గాని తర్క పండితులకు గాని చెప్పినట్టిది కాదు. అందుచేత ఇందులో తర్కాలు లేవు. దుష్టమతాలని, దురభిప్రాయాలని ఖండించడంలో ఆయన శక్తిని వ్యర్థపరచలేదు. సిద్ధాంతాలు కూడా చేర్చబడలేదు.


అద్వైత వ్యతిరేకుల తర్కాలు లేనంత మాత్రాన భజగోవిందం సున్నితమైన భావాలతో హృదయాన్ని కదిలిస్తూ తాత్కాలిక దివ్యానుభూతులనిచ్చే మధుర సంగీతం అనుకోరాదు. ఈ శ్లోకాలు కొరడా ఝళిపింపులవలె ఉంటాయి. తప్పుదారిన నడిచే సాధకుని నెమ్మదిగా మంచిదారికి నడిపించే సున్నితత్వం లేదు. మానవుడి వీపు మీద వాతలు పడే కొరడా దెబ్బలు తగిలిస్తాయి.


యీ బోధ ఉపదేశగ్రంథంగాని వాదసంయుతమైనదిగారు. భజగోవిందములో హృదయాంతరాళములోని రహస్యాన్ని ప్రేమతో, శిష్యులకు బోధించే గురువునే దర్శిస్తాము. శిష్యుడెవరంటే (1) శిక్షింపబడేవాడు శిష్యుడు ( శిక్షతే ఇతి శిష్య:) అనిగాని లేదా (2) బాహ్యప్రపంచ దృష్టిని వదలి అంతర్దృష్టిని పొందడం చేత ఇంతకు పూర్వమున్న స్థితికంటే ఉత్తమతరమైన స్థితిని పొందినవాడు శిష్యుడు (శిష్యాత్ విశిష్యతే శాస్త్రాది పరిజ్ఞానేన బహిర్ముఖం అనపేక్ష్య ఇతి శిష్యః) అనిగాని లేదా (3) జ్ఞానేంద్రియ ఔద్ధత్యాన్ని నియమించి వశపరచుకునేవాడు శిష్యుడని (ఇంద్రియాది ప్రవృత్తిం శిష్యతి ఇతి శిష్య:)


కనుక, నిజమైన శిష్యుడెవరంటే గురువులచేత బోధింపబడుచున్న వాడును, ఆ బోధవలన బాహ్య ప్రపంచదృష్టిని మార్చి అంతర్దృష్టి నలవరచుకొనిన వాడును, ఉద్రేక ములను, బాహ్యదృష్టి కలిగించే ఆలోచనలను నియమించిన వాడును అని విశదపరిచిరి. అటువంటి శిష్యులకే " భజగోవిందం” చెప్పబడినది.


ఈ శ్లోకములు ప్రతివాది భయంకరాలై లేవన్నంత మాత్రాన అవియేమో చాలా మృధువై; సుతిమెత్తనై పసివాళ్ళు, ఆలోచన చేయలేనివాళ్ళు, యేదో ఫణితిలో కూనిరాగాలు తీయడానికి మాత్రమే పనికివచ్చేవనే దురభిప్రాయం పడరాదు. అవి పాడి నంత మాత్రముననే మొదట దివ్యభావం కలిగి, తరువాత యే ఫలితమూ యివ్వనట్టి బోధకాదిది. అలాంటి మెతకతనం ఈ శ్లోకాల్లో లేదు. ఈ ముప్పది శ్లోకాలు కూడ ఒక్కొక్క కొరడాదెబ్బను కొట్టి నప్పటి ఫలితాన్ని తప్పు చేస్తే మనసు మీద పడవేస్తవి. కొరడాతో కొట్టడమేమి? మనిషి వీపుమీద చళ్ళున తట్టడమేమి? అన్ని ఝళిపింపు లూ చేస్తవి. ఇదంతా అవుసరం కొద్ది చేయవలసి వచ్చినపని. కొంప అంటు కున్నప్పుడు అందులో వున్న వాళ్ళనెలా మేల్కొల్పడం? వెంటనే మేల్కొనకపేతే యికవాళ్ళు దక్కరు కదా? మనిషిని కుదిపి తట్టిలేపాలి- పూజ్యపాదులైన తల్లిదండ్రులు, ప్రేమ పాత్రులైన భార్యాబిడ్డలు - ఆ సమయంలో మర్యాదలు పాటించుతారా? ఇందులో తీయని విసుర్లున్నాయి. దయాపూర్ణతతో కూడిన తీవ్రమయిన ఆక్షేపణలున్నాయి. నీవు తెముల్చుకొని ఎప్పుడో ఏదో చేద్దామంటే వినే సహనం కనబర చే స్థితికాదు. శిష్యుల సంక్షేమం కోసం, వాళ్ళను ప్రేమతోనే కసిరి అసహించుకొనడం జరగాల్సి వచ్చింది. ఇంకా యీ సంసారంలో – దుఃఖాల్లోపడి నిద్రించడం- మృత్యువనే అగ్నితో ఒక ప్రక్క కొంప అంటుకుంటుంటే సహించేదెలా?


*సశేషం*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

శనివారం*🍁 🌹 *26, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

         🍁 *శనివారం*🍁

🌹 *26, అక్టోబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి : దశమి* రేపు (27) తె 05.23 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం : ఆశ్లేష* ఉ 09.46 వరకు ఉపరి *మఖ*


*యోగం  : శుక్ల* రేపు (27) తె 05.27 వరకు 

*కరణం : వణజి* సా 04.19 రేపు (27) తె 05.23 వరకు


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*ఉ 08.01 - 09.46*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*


*వర్జ్యం : రా 11.05 - 12.51*

*దుర్ముహూర్తం:ఉ 06.03 - 07.36*

*రాహు కాలం : ఉ 08.57 - 10.24*

గుళికకాళం : *ఉ 06.03 - 07.30*

యమగండం : *మ 01.18 - 02.45*

సూర్యరాశి : *తుల*

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 06.03*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.03 - 08.22*

సంగవ కాలం     :*08.22 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.01*

అపరాహ్న కాలం: *మ 01.01 - 03.20*

*ఆబ్ధికం తిధి:ఆశ్వీజ బహుళ దశమి*

సాయంకాలం  :  *సా 03.20 - 05.40*

ప్రదోష కాలం  :  *సా 05.40 - 08.08*

రాత్రి కాలం : *రా 08.08 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.24 - 05.14*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


వందారులోకవరదానవచోవిలాస

రత్నాఢ్యహార-పరిశోభిత-కంబుకంఠ 

కేయూరరత్న-సువిభాసి-దిగంతరాల

శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ 


    🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

********************************

         🍁 *జై హనుమాన్*🍁


ఔస్తుభ్య స్థిర హనుమంత

కవివర నాయక హనుమంత

జయ బజరంగబలి 

జయజయ జయ బజరంగబలి


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Panchaang


 

శుక్రవారం*🌹 🪷 *25, అక్టోబర్, 2024*🪷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

        🌹 *శుక్రవారం*🌹

🪷 *25, అక్టోబర్, 2024*🪷

      *ధృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి     : నవమి* రా 03.22 వరకు ఉపరి *దశమి*

*వారం : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం  : పుష్యమి* ఉ 07.40 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం  : శుభ* (26) తె 05.27 వరకు 

*కరణం  : తైతుల* మ 02.35 *గరజి* రా 03.22 తె వరకు


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*


*వర్జ్యం         :  రా 09.35 - 11.19*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.09 మ 12.15 - 01.01*

*రాహు కాలం   : ఉ 10.24 - 11.51*

గుళికకాళం      : *ఉ 07.30 - 08.57*

యమగండం    : *మ 02.46 - 04.13*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *కర్కాటకం* 

సూర్యోదయం :*ఉ 06.03* 

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.03 - 08.22*

సంగవ కాలం   :      *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.01*

అపరాహ్న కాలం: *మ 01.01 - 03.21*

*ఆబ్ధికం తిధి       : ఆశ్వీజ బహుళ నవమి*

సాయంకాలం  :  *సా 03.21 - 05.40*

ప్రదోష కాలం  :  *సా 05.40 - 08.09*

రాత్రి కాలం     :  *రా 08.09 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.24 - 05.13*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷


*ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /*

*ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా //*


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🌷🌹🌷🌷🌹 🌷🌹

కాళిదాసు సమయస్ఫూర్తి

 కాళిదాసు సమయస్ఫూర్తి - భోజారాజు ఔదార్యమ్


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

... బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణగారు ...

@@@@@@@@@@@@@@@@@@@ 


భోజుడు కేవలం పండితులనే కాక నిరక్షరకుక్షులను కూడా బీదవారైతే ఆదరించేవాడు. సహాయం చేసే వాడు.


ఆ విషయము చాలా మందికీ తెలియదు. 

అది తెలియని ఒక బీదబ్రాహ్మణుడు ఒకదినము కాళిదాసు దగ్గరకు వచ్చాడు.

తాను నిరుపేదనని రాజుగారికి చెప్పి తనకేదయినా దయచేయించుడని ప్రాధేయ పడ్డాడు.


కాళిదాసు:- నీవేమైనా చదువుకున్నావా?


బ్రాహ్మణుడు:- ఏదో వానాకాలం చదువు చదువుకున్నాను. మీరే ఆధారము.


కాళిదాసు:- నేనొక శ్లోకమును వ్రాసి ఇస్తాను.దానిని రాజు దగ్గర చదువుతావా?


బ్రాహ్మణుడు:- చదువలేను కాళ్ళు వణుకుతాయి. దడ పుడుతుంది.


కాళిదాసు:- సరే రేపు రాజుగారికి ఏదయినా కానుక తీసుకొని ఆస్థానమునకు రమ్మని చెప్పి పంపెను.


సరే అని ఆ బ్రాహ్మణుడు యింటికి బోయి తన దగ్గరనున్న రెండు పైసలతో రెండు చెరుకుగడలను కొని తన తువ్వాలులో చుట్టి ఆస్థానమునకు వచ్చాడు. ఇంకనూ ఆస్థానము తెరచు సమయము కానందున 

అక్కడ దగ్గరలోనున్న చెట్టు క్రింద ఆ చెరుకు గడలమూట పక్కన పెట్టుకొని పడుకున్నాడు. చల్లగాలికి బాగా నిద్ర పట్టేసింది. ఇంతలో ఒక దొంగ వచ్చి ఆ చెరుకుగడలను తీసుకొని ఆ తువ్వాలులో అక్కడే చెట్టు క్రింద ఉన్న రెండు కాలిన కర్రముక్కలను పెట్టి వెళ్లిపోయాడు.


ఆ బ్రాహ్మణుడికి మెలుకవ వచ్చి సమయమై పోయిందని హడావుడి గా ఆ మూటను తీసుకొని ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ రాజుగారిని చూడగానే భయపడి పోయాడు. 

ఆ తువ్వాలును రాజుగారికి సమర్పించాడు. అందులోని కాలిన కట్టెలను చూసి రాజుగారు ఏమిటిది?అని గద్దించారు.

వాడు వణికి పోయాడు.

చెరుకుముక్కలకు బదులు ఆ కొరువులు ఎలా వచ్చాయో అర్థం కాక అలాగే నోరు తెరుచుకొని చూస్తూండి పోయాడు.


అప్పుడు కాళిదాసు ఏమి జరిగి వుంటుందో ఊహించి "రాజా..ఈ కొరకంచులను ఈ విప్రుడు ఎందుకు తెచ్చాడో నేను చెప్తాను అని ఈ క్రింది శ్లోకం చెప్పాడు.


    దగ్ధం ఖాండవమర్జునేన చ వృధా దివ్యద్రుమైర్భూషితం

    దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకాపురీ స్వర్గభూఃl

    దగ్ధ స్సర్వ ఖాస్సదశ్చ మదనో హా హా వృధా శంభునా 

    దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపివా దహ్యతేll


తా:--పూర్వము అర్జునినిచే వ్యర్థముగా ఖాందవవనము దహింపబడి అచ్చటి దివ్య వృక్షములన్నియు నాశన మయ్యెను. స్వర్గనగర తుల్యమైన లంకానగరమును హనుమతుడు వృథాగా తగులబెట్టేను. ఈశ్వరునిచే ఏ పాపమెరుగని మన్మథుడు దహించ బడినాడు.

కానీ ఈ దరిద్రమును తగులబెట్టుటకు ఎవ్వరూ పుట్టలేదు. నీవైనా దారిద్ర్యానికి నెలవైన ఈ కర్రలను దహించి వెయ్యి.

(అంటే నీవు నాకు ధనమును యిచ్చి నా దారిద్ర్యాన్ని పోగొట్టుము).


భోజరాజు ఆ బ్రాహ్మణుడికి లక్షసువర్ణవరహాలను యిచ్చి పంపించెను. పిమ్మట కొంత కాలమునకు ఈ చమత్కారము కాళిదాసే చేసినాడని ఎరిగి అతని సమయస్ఫూర్తికి చాలా సంతసించెను.


ఈ శ్లోకమునే ఎవరో అజ్ఞాత కవి తెలుగులో యిలా వ్రాశాడు.


              నరుడను వాడు ఖాండవ వనంబు వృధా దహనంబు జేసే, వా 

             నర వరుడైన పవన నందనుడూరక లంక గాల్చె నా 

             హరుండు పురంబు లార్చేనన నంతియే కాని మహాదారిద్ర్య వి 

            స్ఫురణను గాల్చు వాడొకడు భూమి జనింపక బోయె భూవరా !


అర్థము:--- అర్జునుడు ఖాండవ వనాన్ని వృధాగా కాల్చి వేశాడు,హనుమంతుడు పనీ పాటా లేనట్టు వృధాగా సుందర నగరమైన లంకను కాల్చాడు,శివుడు విద్యున్మాలి,తారకాక్షుడు, కమలాక్షుడు అనే రాక్షసుల పట్టణాలను కాల్చాడు. ఈ మూడు దహన కాండలకు ఏవో కారణాలు వుండ వచ్చు. కానీ రోజు రోజుకు అధికమవుతున్నఈ దారిద్ర్యాన్ని దహించే వాడు భూమిలో యింత వరకు పుట్టలేదు కదా! 

అని ఒక బీదకవి ఆవేదన.


                                      .... సేకరణ

ఆసుపత్రి మొత్తం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*ఆసుపత్రి మొత్తం వైశాల్యం 133 ఎకరాలు* 


*అమృత మయి హాస్పిటల్ ఫరీదాబాద్*


*నిర్మాణ ప్రాంతం : 10 మిలియన్ చ.అ. పడకల సంఖ్య : 2,600 వైద్యుల సంఖ్య: 800 పారా మెడికోల సంఖ్య: 4,000 ఆపరేషన్ థియేటర్ల సంఖ్య: 64*


*మొత్తం ఖర్చు: రూ. 6,000 కోట్లు*


*మా సెయింట్,*"🇮🇳 *మాతా అమృతమయి అమ్మ*🇮🇳"*ఖచ్చితంగా నోబెల్ బహుమతికి అర్హురాలు, మదర్ థెరిసా కంటే ఎక్కువ!*


*ఏకైక అనర్హత: ఆమె క్రైస్తవురాలు కాదు*


*ఆమె నిస్వార్థ సనాతన హిందూ సన్యాసి మాత్రమే! (PS : ప్రారంభోత్సవానికి కూడా విస్తృతమైన మీడియా కవరేజీ లేదు!) మీరు హిందువు అయితే దయచేసి ఫార్వార్డ్ చేయండి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

56. " మహా దర్శనము

 56. " మహా దర్శనము "--యాభై ఆరవ భాగము---చెరువు ఆసరాతో భావి


56.   యాభై ఆరవ భాగము-- చెరువు ఆసరాతో భావి



          ఆశ్రమపు ఒక మూల విశాలముగా పెరిగిన మర్రి చెట్టొకటి ఉంది. దాని మొదట్లో ఒక మూర ఎత్తుతో రాళ్ళగోడలపై ఫలకములతో కట్టిన అరుగు వంటి కట్ట ఒకటి. లోకవ్యాపారముల వలన ఆయాసమైతే భగవానులు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సామాన్యముగా అటువైపుకు ఎవరూ వెళ్లరు. ఇక భగవానులు అక్కడుంటే మాత్రము ఒక్కరు కూడా ఆ వైపే చూడరు. 


        ఇప్పుడు భగవానులు అక్కడ కాత్యాయనితో పాటూ కూర్చున్నారు. ఒక ఘడియ విశ్రామము తరువాత భగవానులే భగవతిని అడిగినారు. " కాత్యాయినీ , నీకేమి ఆశ ఉంది ? "


ఆమె అన్నది , " మీ సేవ చేయుట ఒకటి తప్ప వేరే ఆశేమీ లేదు. "


        " మైత్రేయి అయితే బ్రహ్మ వాదిని. ఆమె నోటిలో ఇటువంటి మాట శోభిస్తుంది. కానీ నువ్వలాగ కాదు. నీకు ఏదో ఆశ ఉండే ఉంటుంది. పోనీ , స్త్రీ సహజమైన పుత్రాపేక్ష కూడా లేదా ? "


          కాత్యాయని పకపకా నవ్వింది. ఆపుకోలేక ఆపుకుంటూ అన్నది. గొంతులో తారుణ్యపు సరళత్వము లేదు. ప్రౌఢత్వపు గాంభీర్యము నిండి ఉంది," నిజంగా చెప్పవలెనంటే నాకు పిల్లలు కలుగుతారేమోనని గాబరా. పిల్లలయితే నేను వారిని చూచుకొనేదా ? మీ సేవ చేసేదా ? పిల్లలవుతే నాకు రెంటికీ చెడిన రేవతి గతి తప్పదు. కాబట్టి నాకు పిల్లలు వద్దు. కొడుకూ వద్దు , కూతురూ వద్దు. మీ చేయి పట్టి మీ ఇంటికి రాగానే నాకేదో తృప్తి వచ్చేసింది. తమరు గురుకులపు అధిపతి అయిన దగ్గర నుండీ నా తృప్తికి హద్దే లేదు. కాబట్టి నాకు ఏమీ వద్దు. అలాగని చిన్న చిన్న ఆశలు లేకపోలేదు, బెండకాయ పులుసు , బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు , వడియాలు , అప్పడాలు...ఇటువంటి ఆశలింకా ఉన్నాయి. అయితేనేమి ? అవి తీరితే ఎంత సంతోషమో , తీరకున్నా అంతే సంతోషము. "


" ఇదేమిటి , నేను మాట్లాడుతున్నది మైత్రేయితోనా , కాత్యాయని తోనా ? "


        " బాగుంది మీ హాస్యము. లోకాంతరములలో ఉన్న వాటినన్నిటినీ సంయమము చేసి తెలుసుకొనే వారికి ఎదురుగా గూటము వలె కూర్చున్నది సరిగ్గా కనబడక పోతే నేనేమి చెప్పవలెను ? "


        " దేహమేమో కాత్యాయనిదే, సందేహము లేదు. కానీ , ఆశ్రమపు అధిరాజ్ఞియై లౌకిక వ్యాపార మగ్నురాలై యున్న కాత్యాయనికి ఆశలు లేవు, ఆమె వైరాగ్య సంపన్నురాలు అంటే నమ్మేదెలాగ ? ధర్మపత్ని సాధ్య విషయములను గురించి చెప్పితే సరి. భవిష్యత్తును అలాగ రూపించుకోవలెను , ఇలాగ రూపించుకోవలెను అంటే మాకు అర్థమవుతుంది . అది వదలి , మోక్షపత్ని వలె , నాకేమీ వద్దు , పిల్లలూ వద్దు అంటే ఎలా నమ్మమంటావు ? కాబట్టి అలాగ అడిగినాను. నీకు నెమరు వేసే ఆవును పాలు పిండుటకు లేపునట్లు ఒక దెబ్బ కొట్టినాను. "


         " నేనన్న మాట వలన మీకింత నొప్పి కలిగితే , ఇదిగో , కాళ్ళు తాకుతున్నాను. మాటల జోరులో సంయమము పేరు తెచ్చినాను. ఆ మాత్రానికే మీకు నొప్పి కలిగినదా ? అదెలాగ ? మేము నీటిలోకి రాయి విసరితే ఆ నీరు రాతిని మింగునట్లు , మిమ్మల్ని మేము కావాలని నొప్పించినా , ఆ నొప్పి మీకు తగులుటే ఆలస్యము, ఆనందముగా మారిపోతుంది. కాబట్టి దాని గురించి మేము కూడా అంతగా నొప్పి పడే అవసరము లేదు . " 


       " అదికాదు కాత్యాయినీ , భూమికి దేనిని విసరినా అది దానిని తనలో కలుపుకొని తనవలె ఆత్మసాత్ చేసుకుంటుంది. అలాగే , నాకు వచ్చినదంతా నేను కూడా నాలో కలుపుకుని ఆత్మసాత్ చేసుకుంటే ఆశ్చర్యమేముంది ? ఆత్మ అంటే ఆనందము కదా ? కాబట్టి ప్రతియొక అనుభవమూ ఆనందమే కావలెను కదా ? "


      " దేవా , ఇవన్నీ మైత్రేయికి ప్రత్యేకము. నేను సేవకోసమే పుట్టినదానిని. ఆమె విచారములకు చర్చలకూ జన్మనెత్తినది. ఆమె మీవలెనే తానుకూడా చెరువు కావలెను అనునది. నాకు ఆ ఆలోచనే లేదు. నేను చెరువు ఆసరాతో ఉన్న భావిని. కాబట్టి అన్నాను. నాకు ఎప్పుడూ దేనికీ దారిద్ర్యము లేదు. ఎల్లపుడూ నా హృదయములో అంతా నిండి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ నిండుదనము ఎక్కడిది అంటారా ? అది తమరిది. తమరి హృదయములో అదికావలెను , ఇది కావలెను , అది లేదు , ఇది లేదు అను ఆశ ఉండి ఉంటే  నా హృదయములోనూ ఉండి ఉండేది. మాటిమాటికీ మీరు ’ కిమ్ తేన మర్మ..’ దానివలన  ’ మాకేమికావలెను ’ అనుచున్నారు. కాబట్టి నాకూ అదే భావము వచ్చినది. అంతే ! " 


          " భలే , కాత్యాయినీ , ఈ దినమేమో మా కాత్యాయని సరస్వతి యైనది. మాట బహుబాగుంది. నేను చెరువు , నువ్వు భావి, ఈ ఉపమానమును ఇలాగే ముందుకు కొనసాగిస్తే నా గతి యేమి ? ఏక్కడినుండో ఏమేమో కొట్టుకొని వచ్చు మురికి నీరు నేను , తేటనైన , శుద్ధమైన నీరు నువ్వు. భలే బాగా తిడుతున్నావే "


        కాత్యాయని పడీ పడీ నవ్వింది. " మీరు చెప్పింది నిజము. లాగితే ఆ అర్థము కూడా వస్తుంది. కానీ నాకా అభిప్రాయము లేదు. సరే , అదలా ఉంచుదాము , ఒక వరము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కావాలంటే ఆ ఆశ ఉంది "


" ఏమిటి , చెప్పు " 


        " నెలకు మూడు నాలుగు దినములు నాకు మీ సేవ తప్పుచున్నది . దానిని నివారించగలిగితే చెప్పండి , నిరంతరాయంగా మీ పాద సేవ చేసుకుంటూ పడి ఉంటాను. " 


       " అదేమంత పెద్ద విషయము కాదు. అయితే కాత్యాయనీ , ఆడదాని దేహము అలాగ అగుట దాని ధర్మము. కాబట్టి దానికి అడ్డు రాకూడదు. సరే , ఇప్పుడు గుర్తొచ్చింది , నువ్వు గోవులు కావలెను అన్నావు కదా ? "


          " సరిపోయింది , అది ఆకాశానికి నిచ్చెన వేయుట వంటిది. ఒకానొక కాలములో మనవి అని చెప్పుకొనుటకు ఒక వేయి ఆవులు ఉండవలెను అను పిచ్చి ఉండినది. ఇప్పుడది అవివేకము అనిపిస్తుంది. వేయి గోవులంటే , వాటిని కట్టివేయుటకు ఎంతపెద్ద కొట్టము కావలెను ? వాటికి నీరు, పచ్చి గడ్డి వేయుట అటుంచి , ఆ కొట్టము కడుగుటకు నీరు ఎవరు మోసుకొని వస్తారు ? అని తలనిండా ఆలోచనలు వచ్చి , అన్ని ఉంటే పాలు పిండువారు ఎవరు ? అనిపించి , అది ఒక అవివేకము అను ఘట్టమునకు వచ్చినాను. " 


" ఒక వేళ నీకా యోగముంటే ? "


         " అప్పుడు దానిని అనుభవించక తప్పదు. ఇప్పుడే మన ఆశ్రమములోని ఇళ్ళలో ఉన్నవన్నీ కలిపితే సుమారు ఐదునూర్లు గోవులు లేవా ? వాటిని పంచినందువల్ల మనకు అంత ఇబ్బంది లేదు. అన్నీ ఒకచోటే ఉంటే ? అబ్బ! అదెక్కడాలేని కష్టము. మీ నోటిలో వచ్చిందంటే , ఏ పనిఅయినా జరగక పోదు. కాబట్టి వేయి ఆవులు వచ్చు యోగముంది అనిపిస్తున్నది. రానివ్వండి , అది సుఖయోగమగుటకు ఏమి చేయవలెను అని ఇప్పటినుండే ఆలోచిస్తాను. " 


" అప్పుడే అన్నావు కదా , ఆశ్రమ వాసులందరికీ పంచివేయుట అని ? అలాగే చేస్తే సరిపోతుంది. "


         " కష్టము తప్పించుకొనుటకు అది మంచి ఉపాయము. ఇప్పుడు నేను పిల్లలకు అదే ఉపాయము చేసినాను. తెల్లటి పాపడిని ఎత్తుకోవాలనిపిస్తే , తెల్లటి పాపడున్న ఇంటికి వెళతాను. వాడిని ఎత్తుకొని ఆటాడుకొని ఇంటికి వస్తాను. ఇలాగే ఎర్రటి పాప , నల్లటి పాప , అందమైన పాప, కురూపి పాపాయి , అంతేనా ? ఈ ఆశ్రమములోనున్న పిల్లలందరినీ నావాళ్ళుగా చేసుకొని సుఖముగా ఉన్నాను. అయితే ఆవుల విషయము అలాగ కాదు. మనవి అంటే మనవే కావలెను. వాటి స్వామిత్వపు విషయములో , వినియోగపు విషయములో ఇంకొకరు చేయి వేయునట్లు ఉండకూడదు. సరే , రానివ్వండి , చూద్దాము. " 


" వచ్చిన తరువాత ఆలోచించుట వద్దు. వచ్చేలోపే ఆలోచించుకొని ఉండు. " 


        " అది న్యాయమే. మీరు వస్తాయంటే వచ్చేతీరుతాయి. కానీ మీరు వస్తాయి అనలేదు కదా ! ’ రావాలి ’ అని నేను కూడా బలవంతము చేయుట లేదు కదా " 


        " అలాగ కాదు , పుణ్యాత్మురాలా , ఇక్కడ చూడు , నువ్వు కోరినది నెరవేర్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. నువ్వు పిల్లలు వద్దన్నావు. పోనీ ధనము కావాలా అంటే అది కూడా వద్దన్నావు. కాబట్టి నీ వెనుకటి కాంక్షయైన వేయి గోవులను కట్టివేసుకొను విషయము వచ్చింది. దేవతలు ఇస్తారంట , కావాలి అను. " 


" తమరి అనుజ్ఞకు ఎప్పుడూ ప్రతి లేదు. కావాలి అంటాను. అయితే వచ్చునపుడు ఒక నిబంధనతో రావలెను. " 


" ఈ నిబంధన ఏమిటి , చెప్పు . " 


         " ఏమీ లేదు , వేయి ఆవులు వస్తే మనకు సంతోషము అగునట్లే , అవి కూడా తమకు తాముగా ఇష్టముగా ,  మనము అడిగినందుకు కాదు , - తమకు తామే ఇష్టముగా రావలెను. అంతే కాదు, అవి వచ్చినందుకు మనకు కొంచము కూడా శ్రమ కలుగకూడదు. ఇక్కడ సంతోషమంటే , మీ సంతోషము , మీరనుకునే సంతోషము కాదు , నేను , ఈ కాత్యాయని చెప్పు సంతోషము. ఆ వేయి ఆవులు వచ్చినాయి అని మనకళ్ళలో ఒకచుక్క కూడా నీరు రాకూడదు. మన శరీరాలకు ఆవగింజంత కూడా ఆయాసము కలుగరాదు. " 


" భలే ! మంచి నిబంధనలాగానే ఉంది. దేవతలు నీ నిబంధనకు ఒప్పుకొని వేయి గోవులనిస్తే అప్పుడేమి చేస్తావు ? " 


         " ఔను, చూడండి , మీరు ఈ మాట అడిగినందుకు గుర్తొచ్చింది , ఆ పశువులు మన దగ్గర ఉండు వరకూ అవిగానీ , వాటి దూడలు గానీ రోగములూ , వ్యాధులతో బాధ పడరాదు. వాటికి ఎప్పుడూ గడ్డీ , నీరూ సమృద్ధిగా ఉండవలెను. అంటే ఏమిటి ? ఒకమాటలో , వాటి వల్ల మనకు గానీ , మనవల్ల వాటికి గానీ ఏ రీతిలోనూ ఆవగింజంత కూడా ఇబ్బంది కలుగరాదు. " 


" మీ నిబంధనలన్నీ అయినాయా , ఇంకా ఉన్నాయా ? " 


        " అంతే! అప్పుడే అన్నాను కదా , మననుండీ వాటికీ , వాటి నుండీ మనకూ పరస్పర సంతోషము కలగవలెనే కానీ ఏ రీతిలో కూడా పరస్పర కష్టము కలుగరాదు. " 


" ఇంకా ఆలోచించి చూడు "  


" ఏమిటి ? మీరే వరము నిచ్చునట్లు అడుగుతున్నారే ? "


" ఔను. దేవతల పరముగా నేను తథాస్తు అంటాను. "


" అలాగయితే అనెయ్యండి " 


కాత్యాయని లేచి సాష్టాంగ నమస్కారము చేసి లేచి నిలబడి చేతులు జోడించినది. 


 భగవానులు కూడా లేచి నిలచి గంభీరముగా ’ తథాస్తు ’ అన్నారు. 

Janardhana Sharma

శ్రీ హరి నిద్ర!

 


శ్రీ హరి నిద్ర! 

      కవి చమత్కారం!!


కలశపయోధిమీద తరగల్ మరి"హో"యనిమ్రోయ,వేయిభం/

గుల తలపాన్పుపాముబుసకొట్టగ,నేగతినిద్రచెందెదో?

అలసత తండ్రి!చీమచిటుకన్ననునిద్దురరాదుమాకు ఓ

బలవదరీ!దరీకుహర భాస్వదరీ! యదరీ!దరీ!హరీ!//

చాటుపద్యం:అజ్ఙాతకర్తుకం.

           చివరిపాదంపద్యావికి మకుటంలాకనిపిస్తోంది.అర్ధంమాత్రం సులభంగా బోధపడటంలేదు.మహావిష్ణువును సంబోధించుచున్నట్లున్నది.


ఒకవంకపాలసముద్రపుకెరటాలహోరు.

మరియొకవంక ఆదిశేషువు బుస,

 ఈరెండూ మహాధ్వనిచేస్తుంటే,యింతగడబిడలో యెట్లానిదురపడుతున్నదయ్యా !స్వామీ!నీకు.

మరి మాకేమోచీమచిటుక్కుమన్నా మెళకువ వచ్చేస్తుంది.ఇకనిదుర పట్టమన్నాపట్టదు.అనిమొత్తుకుంటున్నాడీకవిగారు.

"నిద్రసుఖమెరుగదు ఆకలిరుచియెరుగదు"-అంతేమరి.ఎవరికైనా.


చివరిపాదంసంగతిచూద్దాం!

బలవదరీ-బలవంతుడైనశత్రువుగలవాడా(హిరణ్యకశ్యపుడు)

దరీకుహర-పర్వతబిలంలో;

భాస్వత్+హరీ-ప్రకాశించు విష్ణుమూర్తీ!

అదరీ-భయరహితుడా!(చక్రధారీ!)

దరీ-శంఖహస్తుడా!

హరీ!-హేనృహరీ!

అనియర్ధం;

"అహోబిలక్షేత్రలోవెలసిసిన శంఖచక్రధారీ!ఓనృహరీ! యని సంబోధన.

                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పోతనగారి కవితా చిత్రపటం!

 


పోతనగారి కవితా చిత్రపటం!!

    "ప్రాచీన పద్యకవులలో పోతనదొక విలక్షణమైన బాణి.అతడుచెప్పదలచిన కవితావస్తువు నొకచక్కని దృశ్యముగా మలచి పాఠకులముందుంచుట పోతనలోనిప్రత్యేకత!

   మకరిచేతజిక్కిన గజేంద్రుని రక్షించుటకు బోవు నాశ్రీహరి రాకను భక్తితో ననురక్తితో వీక్షించుచున్న దేవతల

 దిదృక్షా సంరంభమును వర్ణించిన ఈపద్యములొక చక్కని అక్షరచిత్రపటమును రచియించినవి.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్, సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు, యోగీంద్రహృ

ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృంద ప్రభవాలంకరి

ష్ణు, నవోఢల్లస దిందిరాపరిచరిష్ణున్, జిష్ణు,రోచిష్ణునిన్;

భాగ-8స్కం.105 ప.

"చనుదెంచెన్ ఘను డల్లవాడె,హరి, పజ్జంగంటిరేలక్ష్మి,శం

ఖనినాదంబదె, చక్రమల్లదె, భుజంగద్వంసియున్వాడె, క్ర

య్యన నేతెంచె నటంచు, వేల్పులు "నమోనారాయణాయేతి" ని స్వనులై మ్రొక్కిరి, మింట హస్తిదురవస్థావక్రికిన్ చక్రికిన్!! 

       భాగ-8స్కం.107ప.


మొదటిపద్యంలో పోతన తన శబ్దాలంకారప్రియత్వంవెల్లడిస్తో అసమాపకక్రియాప్రయోగాలతో , శ్రీహరి యెంతవేగంగా వెళుతున్నాడో సూచించాడు.

     రెండవ పద్యంలో పోతన తనచిత్రీకరణమారంభించాడు.ఆకవితాదృశ్యాన్ని మీరుగూడా ఒకసారి మనోనేత్రాలతో వీక్షించండి.

  " , అదిగదిగో శ్రీహరిసరిగాచూడండి, అదిగోఅతనిప్రక్కనున్నఆమెయే లక్ష్మి, అదో శంఖము, అదిగో చక్రము, అడుగో గరుత్మంతుడు.అంటూఆకాశంలో నిలచి దేవతలందరూ ఆశ్రీమన్నారాయణునకు ఫాలవిన్యస్త హస్తులై నమస్కరిస్తున్నారట!!.

     అపూర్వమైన ఆదృశ్యమును పోతన తొలుత తానుదర్శించి,పిదపమనచే దర్శింపజేయుచున్నాడు.అహో!మనదెంతటి మహాభాగ్యము!!

ఇట్టి మనోజ్ఞకవితాదృశ్యములు నాన్యతోదర్శనీయములనుట యదార్ధమేకదా??.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

55. " మహాదర్శనము

 55. " మహాదర్శనము " --యాభై అయిదవ భాగము --అక్కాచెళ్ళెళ్ళు


55. యాభై అయిదవ భాగము -- అక్కాచెళ్ళెళ్ళు



        ఎండవేడిమి తగ్గుతూ , ఎండ ఉంటే బాగుండును అను ఘట్టమునకు వచ్చినది. భగవాన్ ఆదిత్యదేవుడు తన కిరణములను వెనక్కు లాగుకొనుటకు ఆరంభించినాడు. పొద్దువాలు సమయము దగ్గరైంది. భగవానులు వచ్చి అరుగుమీద కూర్చున్నారు. కనులు అంతర్ముఖములై పంచభూత సంఘాతమైన ప్రపంచ చిత్రమును పరిభావిస్తున్నవి. ఆశ్రమ వాసులందరూ అక్కడక్కడా కూర్చొని చింతన చేస్తూ , ఆవృత్తి చేస్తూ , తమ తమ వ్యాపారములలో మగ్నులై ఉన్నారు. భగవానులు వారందరిచేతా వారి వారి కార్యములు చేయించు మాతరిశ్వుడి వలె ఉండి తూష్ణీ భావముతో కూర్చున్నారు. 


        ఆశ్రమవాసి యొకడు వచ్చినాడు. కాలి శబ్దము దగ్గరవగానే భగవానులు కనులు తెరచి , ’ ఏమిటి ? ’ అన్నారు. వచ్చినవాడు భయభక్తులతో రాజదూత ఒకడు వచ్చినాడని తెలియజేసినాడు. వారు లేచి వెళ్ళి అతిథి శాల లో ఉన్న రాజదూతను చూచినారు. అతడు తాను తెచ్చిన రాజ శాసనమును అందించినాడు. దానిలో , ’ భగవానులు వచ్చి తమరి పాదధూళిచే మా రాజభవనమును పవిత్రము చేయవలెను . తమరికి అనుకూలమైన దినము తెలిపితే ఆగమనమునకు కావలసిన వన్నిటినీ సిద్ధము చేయగలము" అని రాసి ఉంది. భగవానులు దానిని అక్కడే విప్పి చదువుకొని " మహారాజులకు తెలుపు , వారు రాసిన విషయమును ఆదిత్య దేవునికి తెలిపి ఉత్తరమును పంపించెదము అని. " అని చెప్పి రాజదూతకు యథా యోగ్యమైన ఉపచారములను చేయుటకు ఆశ్రమవాసి ఒకరికి ఆదేశమునిచ్చి తాము వచ్చేసినారు. 


          వారికి ఈ దినము ఏదో విశేషము జరుగుతుందని తెలుసు. అయితే అటు తిరిగి చూచి అది యేమిటి అని తెలుసుకొనెడు కుతూహలము లేదు. సరే , రాజదూత ఆగమనమే ఆ విశేషము అనుకున్నారు. స్నానానికి ఇంకొంత సేపు ఉందని మరలా వెళ్ళి అరుగుపై కూర్చొని కళ్ళు మూసుకున్నారు. భగవానులు అక్కడున్నారంటే , పక్షులే కాదు , క్రిమి కీటకాలు కూడా గట్టిగా శబ్దము చేయవు. 


         అలాగే వారు కొంతసేపు కూర్చున్నారు. వారు లోపల చూస్తున్న నిస్తరంగ చిదాంబుధి వలెనే బయట కూడా ప్రశాంతముగా ఉంది. చెవిలో ఎప్పుడూ వినిపించే గుంయ్ మనే నాదముకూడా వినిపించనంత దూరముగా వున్న వారు హఠాత్తుగా కన్నులు తెరచినారు. ఎదురుగా భగవతి. 


" వచ్చి ఎంత సేపైనది ? " భగవానులు అడిగినారు. 


" ఇప్పుడే వచ్చినాను. సంధ్యాస్నానపు పొద్దు. ఎందుకో రాలేదే , చూద్దామని వచ్చినాను. "


" చూడు , స్నానానికి పొద్దయింది అని నాకు ఎవరైనా వచ్చి జ్ఞాపకము చేయవలెను. ఇటువంటి పిచ్చివాళ్ళ మెడను కావలించుకుంది ఈ ఆశ్రమము. "


" మా తాత చెప్పునది నిజమయితే , ఆశ్రమము మాత్రమే కాదు , ఈ జగత్తంతా మిమ్మల్ని కావలించు కొనవలెను " 


" అలాగయితే మేము పెద్ద జోలె పెట్టుకోవలెను " 


" ఇంతకీ మీరేమనుకుంటున్నారు ? చేసేవారు వేరే ఉన్నారు , చేసుకుంటారు . అంతేనా ? "


          " చిలికి తీసుకున్న అర్థాలన్నీ అంతే. నువ్వు రాను రానూ మాటల నైపుణ్యము బలే చూపిస్తున్నావే ? పదవే పద స్నానానికి పోదాం. ఆలస్యము కావలసినది , అయింది. ఈ దినమేమో ఇంట్లోనే స్నానము చేయాలనిపిస్తున్నదే ? "


" గంగ ఇంటికే వచ్చింది. అంతా సిద్ధముగా ఉంది. రాండి " 


          ఆ వేళ భగవానులు ఇంటిలోనే స్నానము చేసినారు. స్నానము చేసిన భగవతి, వారికి స్నానము చేయించి , సంధ్యావందనమునకు అన్నీ పెట్టి తాను అగ్నిగేహమునకు వెళ్ళింది. భగవానులు సంధ్యావందనము చేసి అగ్నిహోత్రమును ముగించినారు. 


          ఆ వేళకు నడిమింట్లో దీపము వెలిగింది. బయట నక్షత్రములు బాగా కనిపిస్తున్నాయి. కన్నులు ఉండీ ఏమీ కనిపించనంతగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. చంద్రుడు ఇంకా ముఖము చూపించలేదు. భగవానులు వచ్చి నడిమింట్లో వేసిన ఆసనము పైన గోడకానుకొని కూర్చున్నారు. వారు ఈ దినమెందుకో ’ అగ్నే నయ సుపథా..’ మంత్రమును చెప్పుతున్నారు. మనస్సు దాని అర్థమును పరిభావిస్తున్నది. " యుయోధ్యస్మజ్జుహురాణమేనః " అను ’ మన కుటిలమైన పాపములను నాశనము చేయుటకు ’ అనే అర్థము ఉన్న మూడవ పాదము పైన ఒక ఘడియ నిలిచింది. " అంటే , మనలను తప్పుదారికి లాగు పాపము ఒకటుంది. ఆ పాపమేది ? మన అపూర్ణత. అపూర్ణతయే అశక్తత. దాని వలననే మనము పలు దారులగుట" అని అనేక రకాలుగా ఆలోచనలు పరచుకున్నాయి. 


          ఎవరో వచ్చి నమస్కారము చేసినారు. భగవానులకు అదేమీ కొత్తది కాదు. కానీ ఆ సమయములో వచ్చేది ఎవరు ? మనసు ఎక్కడికో పోయి ఉండినది. దీపము తగ్గిపోయి కనులు తమ పనిని సరిగ్గా చేయుట లేదు. వచ్చినవారు ఆడవారు అని చెప్పినాయే కానీ ఎవరు అని చెప్పలేదు. 


భగవానులు చిన్నగొంతుతో ’ ఎవరు ’ అన్నారు. 


వచ్చినామె కూడా అదే గొంతును అనుసరించి చిన్నగా ’ నేను మైత్రేయిని ’ అన్నది. 


" ఏమి వచ్చినావు ? "


" ఇప్పుడైతే భగవానులు ప్రసన్నముగా ఉంటారు , అడిగిన వరమునిస్తారు అని వచ్చినాను. " 


" ఆలాపినీ దేవి గారికి ఇష్టమైన కోడలివి. నువ్వు అడిగినదానిని ఎప్పుడూ కాదనము. అదినీకు తెలుసా ? "


" తెలుసు దేవా , అయితే అడిగే వరము నా యోగ్యతను మించినదేమో అని దిగులు. " 


" అదేమిటో చెప్పు "


" నేను కూడా ఈ ఆశ్రమములోనే ఉండాలనుకుంటున్నాను " 


" తప్పకుండా ఉండవచ్చును. నీకు ఇక్కడ ఉండుటకు అధికారము లేదా ? నన్ను అడిగి , అనుమతి పొంది ఉండవలెనా ? " 


" అటుల కాదు , నేను ఉంటే , నా రక్షణ , పోషణ , మార్గ దర్శనము అన్నీ మీ బాధ్యతలవుతాయి. "


" ఇప్పుడు ఆశ్రమవాసులందరికీ ఇవన్నీ లభ్యము కాలేదా ? " 


" నేను ఇతరులవలె అడుగుట లేదు " 


" సమస్య జటిలమన్నమాట. అప్పుడే మాట ఇచ్చినాను. ఏమైనా కానీ , వహించుటకు సిద్ధముగా ఉన్నాను. బెదరకుండా చెప్పు. " 


" నేను కోరుతున్నది వట్టి శిష్యత్వము కాదు " 


" మరి, ఇంకేమిటి ? "


" మార్గదర్శనము తో పాటూ...."


" సహ బ్రహ్మచారిణి అవుతానంటావా ? "


" ఔను "


" నాకు అప్పుడే పెళ్ళి అయినది నీకు తెలియదా ? " 


" దేవా , నేను అడుగుతున్నది ధర్మ పత్నీత్వము కాదు " 


" మరింకేమిటి ? " 


" మోక్ష పత్నీత్వమును. గురువుగా , పతిగా , నానుండీ తమరు సేవలందుకోవలెనని " 


భగవానులు ఒక్క ఘడియ ఊరకే ఉన్నారు . " అంటే, ఐహికమైన ధనాపేక్ష ఏమీ లేదనా ? "


" ఔను . నాకు కావలసినది ఆముష్మిక ధనము "


         భగవానులు ఒక ఘడియ ఆలోచించినారు. " తప్పేమీ లేదు. ఇలాగ చేస్తే అర్థము లేకుండా ఆడిపోసుకొను వారి నోటికి తాళము వేసినట్లే , సరే " అని నిశ్చయించుకొని, " కాత్యాయని అనుమతి లేకుండా మేము ఏమీ చేయుటకులేదు మైత్రేయీ .." 


" ఈ వేళకు వెళితే భగవానులు నిశ్శంకగా వరప్రదానము చేస్తారని చెప్పినది ఆమెయే. " 


భగవానులు తలాడించినారు, " అట్లయిన కావచ్చును . " 


మైత్రేయి లేచి నమస్కారము చేసినది. భగవానులు నవ్వినారు. 


Janardhana Sharma

*గు రు వు*

 *గు రు వు* 

గురువు ముఖతః పొందిన జ్ఞానం మాత్రమే ఫలిస్తుంది. గురువు లేకుండా మనం ఎన్ని పుస్తకాలు చదివినా జ్ఞానోదయం పొందలేము. మనం ఏ విషయం తీసుకున్నా, ఆ విషయానికి సంబంధించిన అతి ప్రాచీనమైన అభ్యాసాన్ని గురువు ద్వారానే తెలుసుకోగలం. గురువుగా ఉండేందుకు ఎవరు అర్హులు? శ్రీ శంకర భగవత్పాదుల వారు “గురువు ఎక్కడ ఉన్నారు?” అని అడిగారు. అనే ప్రశ్న ఎన్నో అనుమానాలు లేవనెత్తుతుంది.  దీని అర్థం "గురువు ఎవరు?"  అని అడుగుతారు.  ఆ ప్రశ్నకు దానికి తానే సమాధానం ఇచ్చారు. 

*అధిదతత్వం:*  

 *శిష్యహితయోత్యతః సతతం* ఈ రెండూ గురువు యొక్క ఆదర్శాలు మొదటిది *అధికదత్త్వం: -* గురువుకు శాస్త్రం మరియు సంప్రదాయం తెలుసు. అలాగే తత్త్వ జ్ఞాని కూడా అవుతాడు. రెండవ సంకేతం...

 *శిష్యహితయోత్యతః సతతం*

 గురువు ఎల్లప్పుడూ శిష్యుని పురోగతి కోసం ప్రయత్నిస్తాడు. ఒకడు పండితుడై ఉండి, ఇతరులకు బోధించాలనే ఆసక్తి లేకుంటే, అతని పాండిత్యం వల్ల ఇతరులకు ఉపయోగం ఏమిటి? అయితే తన వద్దకు సరిగ్గా చేరిన శిష్యునికి తత్త్వాన్ని ఉపదేశించడం గురువు కర్తవ్యం. కావున భగవత్పాదులచే చెప్పబడిన ఈ రెండు గుణములను కలిగియున్నవాడే నిజమైన “ గురువు”.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - నవమి - పుష్యమి -‌‌ భృగు వాసరే* (25.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మొండి నడుము నొప్పి

 అతి భయంకరమైన , మొండి నడుము నొప్పి నివారణకు నేను ప్రయోగించిన ప్రాచీన యోగం - 


    ఎండు ఖర్జురాలు తీసుకుని ఒక వైపు నుంచి రంధ్రం చేసి లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి గోధుమ పిండి తడిపి ముద్దలా చేసి ఆ రంధ్రం మూసివేసి అదేవిధంగా కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి కర్రబొగ్గుల నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజలు అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో ఇచ్చాను . 


      అలాగే నువ్వుల నూనె ఒక స్పూన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి బాగా వ్రేలితో కలిపినప్పుడు తెల్లటి ద్రవం లా మారిన తరువాత ఆ ద్రవంతో పై నుంచి కిందికి ఒక పది నిమిషాలు మర్దన చేయించాను . 


       కేవలం 40 రోజుల్లొ మార్పు వచ్చింది.


 గమనిక - 


      కొంతమంది తెల్ల గుగ్గిలం బదులు గవ్వపలుకు సాంబ్రాణి అని చెప్తున్నారు . దానిని ఈ యోగంలో ఉపయోగించటం వలన నొప్పి నివారణ కాదు.  


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

పంచాంగం 25.10.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 25.10.2024 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష నవమి తిథి బృగు వాసర: పుష్యమి నక్షత్రం శుభ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 నవమి రాత్రి 03:24 వరకు.

 పుష్యమి ఉదయం 07:40 వరకు.


సూర్యోదయం : 06:15

సూర్యాస్తమయం : 05:45


వర్జ్యం : రాత్రి 09:36 నుండి 11:20 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 01:09 వరకు.


అమృతఘడియలు : ఈరోజు లేదు


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

.


శుభోదయ:, నమస్కార: