26, మార్చి 2020, గురువారం

గుడ్డిలో మెల్ల



ఇప్పుడు మన మున్న ఈ సంక్లిష్ట పరిస్థితి ఎండాకాలంలో రావటం ఒకందుకు ఎంతో మేలు. ఎందుకంటె ఎండాకాలంలో ఎండ వేడికి భూమిమీద వున్నా సూక్ష్మ క్రిములన్ని నశించి పోతాయ్ కాబట్టి మనం చాల వరకు సీజనల్ అనారోగ్యాలకు లోనుగాము. ఇక పోతే ఎండలో తిరిగితే వేడి చేయటం జరుగుతుంది.  కానీ మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఫ్యాన్ క్రింద, ఎసిలో ఉంటున్నాము కాబట్టి వేడి చేసే ప్రమాదం లేదు. కేవలం మనం మన తిండి, నిద్ర చూసుకుంటే సరిపోతుంది.  ఎండాకాలంలో వేరే శారీరిక ఎక్సరసైజ్ చేయకుండానే ఎండ వేడికి చెమటతో మన శరీరం అలసిపోతుంది. కాబట్టి మనం తిన్నది అరిగిపోతుంది, మళ్ళి రాత్రి కాగానే ఆకలి వేస్తుంది. ఇదే పరిస్థితి ఏ శీతాకాలంలోనో, లేక వర్షా కాలంలోనో వస్తే అప్పటి స్థితి చాల దారుణంగా ఉండేది. ఏతా వాత తెలిసేది ఏమిటంటే మనం చాలా సేఫ్గా వున్నాము. కేవలం ఇంట్లోంచి బైటకు రావటంలేదనేది తప్ప. ఆశా వాదీ ఎప్పుడు కష్టాలలో సుఖాన్ని, దుఃఖంలోఆనందాన్ని చూసుకోవాలి.  మన సనాతన హిందూ ధర్మము కుడా ఇదే చెప్పుతుంది.  ఈశ్వరార్పణగా కర్మలు చేసే ఈ భారత దేశంలో ఎప్పుడు శాంతి ఉంటుంది.  అందుకే ఇతర దేశాలలో ఎంతో వేగంగా ప్రాకుతున్న ఈ మహారమారి మన దేశంలో చాలా వరకు అదుపులో వుంది. గుడ్డిలో మెల్ల అంటే యిదే. 

మనమంతా ఆ దేవ దేవుడిని ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాము 
సర్వై జానః సుఖినో భవంతు,  లోకా  సమస్త సుఖినో భవంతు,  
ఓం శాంతి శాంతి శాంతిః 



ప్రమాదాన్ని గుర్తించండి



మన ప్రభుత్వం ఎన్నోవిధాలుగా చెపుతున్నా యందరో పెడచెవి పెట్టి రోడ్లమీదికి వస్తున్నారు.  దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా కొత్త కేసులు.  మనమంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలిసిన సమయం.  ఏరకమైన భేషజాలకు పోకుండా ప్రతి  కాలనీ వాళ్లంతా ఇంటికే పరితమై ఉండాలని మరి మరి కోరుతున్నా . ఇంకా పని లేకపోయినా తిరిగే వాళ్ళు గుంపులు, గుంపులుగా తిరిగి  పిచ్చాపాటి మాట్లాడే వాళ్ళు, ప్రస్తుత పరిస్థితిని గుర్తించి  వాళ్ళ దినచర్యని మార్చుకొని ఇంటికే పరితం కావాలి.  లేకపోతే ఈ కరోనా వ్యాధి ప్రబలే ప్రమాదం వున్నది.  తప్పకుండ ఇల్లు వదలకుండా వుండండి. తెలియని వాళ్ళకి ఒక సారి చెపితే వింటారు. తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన పనిలేదు.  కానీ అన్ని తెలుసు అని అనుకునే మూర్కులకు మళ్ళి మళ్ళి చెప్పాల్సి వస్తుంది.  మనం తెలివితో మెలగాలి. మనల్ని మన కాలనీ వాళ్ళని కాపాడుకోవాలి  అని ప్రతివారు భావించాలి. మనం రోజు టివిలో చూస్తున్నాం ముందు మన పోలీసులు మర్యాదగా మందలించారు.  కానీ ఇప్పుడు ప్రతి వారికీ బడితెపూజ  చేస్తున్నారు. దయచేసి ప్రతి కాలనీ వాళ్ళు అటువంటి పరిస్థితి తీసుకో రావద్దు. ఇప్పుడు పోలీసులు రహదారిలో పని చేస్తున్నారు. మన కాలానికి ఎవరు వస్తారు మనం ఏదేశ్చగా తిరగొచ్చు అని కొందరు అనుకో  వచ్చు. ప్రతి కాలనీ వాసికి తనను తాను కాపాడుకోవటం కాకుండా మొత్తం కాలనీని కాపాడ వలసిన భాద్యత వున్నది.  ప్రతి వారు తన కాలానికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. కొత్తవారు ఎవరు ఎవరింటికి వచ్చారు.  ఆ వచ్చినఁ వాళ్ళు మన దేశంలోంచి వచ్చారా లేక విదేశం నుంచి వచ్చారా తెలుసుకొని ఒక వేళ విదేశం నుండి వస్తే వెంటనే ఆ విషయం పోలీసుకు విషయం తెలపాల్సిన భద్యత ప్రతి కాలనీ వాసికి వున్నది. మీరు మిమ్మలిని కాపాడుకోండి, మన కాలనీని కాపాడండి అనే నినాదం ప్రతి వక్కరు చేయాలి. 
మన దేశం సరైన సమయానికి స్పందించి సత్వర నిర్ణయం తీసుకొని లాక్డౌన్ ప్రకటించటంతో మన  దేశంలో కేసుల వృద్ధి చాల తగ్గింది.  మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి చుస్తే గుండె జారిపోతుంది.  మన మంతా మన గౌరవ ప్రధాని గారి వెంట ఉండి మన దేశాన్ని కాపాడు కుంటామని ప్రమాణము చేద్దాం. 

సంయమం పాటించాలి


మనిషి ఏ పని లేకుండా ఊరికే కూర్చని ఉండమంటే ఉండటం ఒకరకంగా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. empty mind is devils work shop అని ఊరికే అనలేదు. నడిచే వాళ్ళు నడవకుండా ఎప్పుడు తీరిక లేకుండా పనిలో బిజిగా వుండే వాళ్ళు ఒక్కసారిగా ఏ పని లేకుండా, సంపాదన లేకుండా కూర్చోటం అంటే ఎంతో ఓపిక కావాలి.  కానీ ఇప్పడి పరిస్థితిలో మనం సహనం కోల్పోకూడదు. ఏది ఏమైనా మనం ఇల్లు వదలకూడదు. సంయమం వహించటం తప్ప మనం చేయగలిగేది ఏమిలేదు.