3, అక్టోబర్ 2021, ఆదివారం

వైద్య చరిత్రలో ఇదో అద్భుతం

 doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్‌ యాపిల్‌ ఐఫోన్‌13ను ఉపయోగించి ట్రీట్మెంట్‌ అందిస్తున్నారు.ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస‍్తున్నారు. ట్రీట్మెంట్‌ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార‍్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్‌ మిరాకిల్‌ అని అంటున్నారు వైద్య నిపుణులు.  


అమెరికా కాలిఫోర‍్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్‌ సౌత్‌ వెస్ట్రన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్‌ ఇన్నోవేటర్‌(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు.


అయితే తాజాగా ఈయన,ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్‌ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప‍్చర్‌ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్‌ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్‌తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ తో కంటికి ట్రీట్మెంట్‌ ఎలా చేస్తున్నారో లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు.


మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ అంటే?

ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్‌ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్‌ ఉంటే చాలు.. సినిమాటిక్‌ మోడ్‌, మ్యాక్రోమోడ్‌ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్‌ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్‌ టామీ కార్న్‌ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్‌ ఉన్నా..మ్యాక్రోమోడ్‌ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్‌డ్‌ మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు.


ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్‌..

కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్‌ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్‌ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్‌ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్‌ టామీకార్న్‌ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్‌ విధానాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

మంగళంపేరుతో కొన్ని గ్రామాలున్నాయి

 . మంగళం కాదది మంగలం

---------------------------------------------------

మంగళంపేరుతో కొన్ని గ్రామాలున్నాయి. తిరుపతినగరానికి ప్రక్కనే మంగళం వుంది. ఇదే జిల్లాలో

గంగాధరనెల్లూరు మండలంలో మహాదేవమంగళం పేరుతో ఓ గ్రామమంది .

పుత్తూరు మండలంలో పరమేశ్వరమంగలం అనే గ్రామముంది.

మంగళంపల్లె అనే గ్రామం కడపజిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వుంది.

తెలంగాణాలో కరీంనగరు జిల్లాలో కోనారావుపేట మండలంలో మంగలంపల్లి గ్రామముంది.


మంగళమంటే స్త్రీ, పార్వతి, శుభం, క్షేమం అనే అర్థాలున్నాయి.

కనుక మంగళంపల్లి, మంగళం, పరమేశ్వరమంళం అనే గ్రామాలలోని మంగళం అనేమాట శుభం, క్షేమమనే అర్థాలను ఇస్తున్నట్లుగా భావించి, తమగ్రామం మంగళకరమైనదిగా కొందరు భావిస్తున్నారు.


నిజానికి ఆ పేర్లన్ని మంగలం అనేమాటకు సంబంధించినవే. మంగలమంటే 58 బ్రాహ్మణకుటుంబాలు నివాసమున్న గ్రామమని అర్థం.


అలాగే చతుర్వేదమంగలం పేరుతో కొన్ని గ్రామాలుండేవని కింది శాసనంవలన తెలుస్తోంది.


1205 ACE * కాలంనాటి శాసనంలో.... గంగ్గగొండ చోడవలనాట్టి ప్రోలునాణ్టి చుత్తమల్లి చతుర్వేదమంగలమున శ్రీ పురుషోత్తమపట్టనము (Sll V - 8) అనగా గంగకొండ చోడవలనాడు (రాష్ట్రానికి)కు చెందిన ప్రోలుమల్లి నాడు (జిల్లా)లోని చతుర్వేద మంగళానికి చెందిన శ్రీ పురుషోత్తమపట్టణమని అర్థం.


మంగలమంటే క్షురకర్మకు సంబంధించినదని, పలుకటానికి శుభప్రదంగా వుండదని మనం మంగలాన్ని మంగళంగా పిలుచుకొంటున్నాం. ఒకపేరులో నిందార్థముందని దానిని మార్చుకొని పిలవడం, వ్రాయడం, వ్యవహరించడం తప్పు. 

భారత గ్రామనామాల సంఘం (Place Names Society of India) ప్రకారం గ్రామానికున్న ప్రతిపేరు అక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను తెలియచేస్తాయి. పేరును మార్చడం వలన ఆ గ్రామనికున్న చారిత్రిక, సాంస్కృతిక విలువలు గతించిపోయే అవకాశముంది.

కనుక మంగలం అనే గ్రామాలను మంగళం అని పిలవడం తప్పు.

కనుక వాటిని మంగలమనే పిలుచుకొందాం.


ఇక ఆంగ్లభాషాపుణ్యాన కూడా కొన్ని గ్రామాలపేర్లు ఉనికిని కోల్పోతున్నాయి. ఉదా॥ గోళ్ళపల్లి గొల్లపల్లిగాను, గోళ్ళాపురం గొల్లపురంగాను, గోళ్ళను గొల్లగాను పిలుస్తూ వ్రాస్తున్నాము. గోళ్ళపల్లి, గోళ్ళాపురంలోని గోళ్ళ అనేమాటకు దృఢమైన గోడలు (కోటగోడలు ) వున్న గ్రామమని అర్థం.


ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు అనే సామెతకూడా వుంది. ప్రస్తుతతరం (Generation) వారు సామెతలు ఉపయోగించడం పూర్తిగా మర్చిపోయారనుకోండి.

మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. ఇదోవేపుడు చట్టి. సాధారణంగా పాతకుండను తీసుకుని దాని పైభాగాన్ని జాగ్రత్తగా పగులగొట్టి మిగిలిన కిందిభాగాన్ని వేయించుకొనేందుకు బాణలిగా పల్లెలలో వాడేవారు. మంగలంలో ఎండు మిరపకాయలు, వేరుశెనగపప్పు, ఎండుచేపలు,పేలాలు లాంటివి వేయించుతారు.పనైపోయిన తరువాత ఇంటి ముందర అరుగుపై ఆరబెట్టుకొంటారు. ఇక్కడ మంగలమంటే దాదాపుగా అత్యంత బలహీనమైన మట్టిపాత్ర కదా! దీనిపై అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మీద పడితే ఆ మంగలం ముక్కలై పెంకులైఎగిరిపోతుంది. 


బలవంతుడు బలహీనుడిపైబడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.


* క్రీ.శ.లేదా AD కి బదులుగా After common Era (ACE), క్రీ.పూ.లేదా BC కి బదులుగా Before Common Era (BCE) ఉపయోగించాలనే నిర్ణయం జరిగింది.

॥సేకరణ॥

-----------------------------------------------------------------

జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం

అమ్మవారి ప్రసాదములు

 దేవీ నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం 


1.! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !! 


మొదటి రోజు.


!! పొంగల్ !!!! కావలసినవి !!


పెసరపప్పు 150 గ్రాం

కొత్త బియ్యం 100 గ

మిరియాలు 15

పచ్చిమిరప కాయలు 6

పచ్చి కొబ్బెర 1 కప్

కాచిన నెయ్యి 1/4 కప్

జీడిపప్పు 15

జీర 1/2 టేబల్ స్పూన్

ఆవాలు 1/4 టేబల్ స్పూన్

ఎండుమిర్చి 3

మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్

కోత్తమిర , కరేపాకు , తగినంత

ఉప్పు రుచిని బట్టి

ఇంగువ 2 చిటికెళ్ళు.


!! చేయవలసిన విధానము !!


దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి

పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు

వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు,


అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి

జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర కోరి , జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం

పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో

కుక్కర్లో వుంచి 3 whistles / కూతలు వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.


చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,

శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసివేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి

భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .

 


2 .గాయత్రి దేవి !! 


రెండవ రోజు


!! పులిహోర !! కావలసినవి !!


బియ్యం 150 గాం

చింతపండు 50 గ్రాం

పసుపు1/2 స్పూన్

ఎండుమిర్చి 5

ఆవాలు 1/2 స్పూన్

మినపప్పు 1 స్పూన్

శనగ పప్పు 2 స్పూన్

వేరు శనగ పప్పు 1/2 కప్పు

కరివేపాకు 2 రెబ్బలు

ఇంగువ చిటికెడు

నూనె 1/4 కప్పు

ఉప్పు తగినంత

బెల్లం కొద్దిగా


!! చేయవలసిన విధానం !!


అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి

నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో )

వుడికిన గుజ్జు అన్నంలో కలిపండి .


బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము


3 .! అన్నపూర్ణా దేవి !! 


మూడవ రోజు


!! కొబ్బెరన్నం !కావలసినవి !!


బియ్యం 1/2 కిలో

తురిమిన పచ్చికొబ్బెర 1 కప్

పచ్చిమిర్చి 5

కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .

పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .

జీడి పప్పు 10

నూనె , 1/4 కప్

నెయ్యి 1 టెబల్ స్పూన్


!! చేయవలసిన పద్ధతి !!


అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .


అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర ,

అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .


శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులవుదాము.

 


  4 .లలితా దేవి !!


నాల్గవ రోజు


!! అల్లం గారెలు కావలసినవి !!


మినపప్పు2 కప్స్

అల్లం చిన్న ముక్క

పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

జీరా 1/4 స్పూన్

ఉప్పు రుచికి తగినంత

కరేపాక్ , కోత్తమిర తగినంత

నూనె గారెలు వేయించేందుకు


!!! చేసే విధానం !!!


మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .


నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .


దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి 

ఆశీర్వాదం పొందుదాము


  5 .! సరస్వతి పూజ !!


ఐదవ రోజు


!! పెరుగన్నం , దద్ధోజనం !!కావలసినవి !!


బియ్యం 1/4 కిలో

పాలు 1/2 లీ

చిక్కటి పెరుగు 1/2 లీ

నూనె 1/2 కప్పు

నెయ్యి 1 స్పూన్

కొత్తమిర , కరివేపాకు

చిన్న అల్లం ముక్క

పచ్చిమిర్చి

పోపు సామాగ్రి

జీడిపప్పు 20

ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి


!! చేసే విధానం !!


ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,


సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండిరుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.


6 !! శ్రీ మహాలక్ష్మిదేవి !!


ఆరవ రోజు


!! రవ్వ కేసరి కి కావలసినవి !!


రవ్వ 1 కప్

షుఘర్ 3/4 కప్

నెయ్యి 2 టెబల్ స్పూన్

కేసరి కలర్ / చిటికెడు.

యాలకులు 4

ఎండు ద్రాక్షా 6

జీడిపప్పు 10

మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )

వాటర్ 1/2 కప్


!!! చేసే విధానం !!!


ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .

మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో

కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి

 


7 .!! కదంబం ప్రసాదం !!


ఏడవ రోజు


!! కావలసినవి !!


కందిపప్పు 1/2 కప్

బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

1 వంకాయ

1/4 సొర్రకాయ

1 దోసకాయ

బీన్స్ తగినన్ని

1 పోటాటో

వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు

2 మొక్కజొన్నలు

1/2 క్యారెట్

2 టోమాటో

తగినంత కరివేపాకు

కోత్తమీర

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

4 పచ్చి మిర్చి

నూనె తగినంత

నెయ్యి చిన్న కప్పు

చింతపండు గొజ్జు తగినంత

కాస్త బెల్లం ( జాగిరి )

ఉప్పు , పసుపు తగినంత

3 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .


!!!! చేయవలసిన విధానము !!!!


ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి


కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి

పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతావుడికినరైస్లోవేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి

 


8.మహిషాసుర మర్ధిని !!


ఎనిమిదవ రోజు


!! బెల్లం అన్నం కావలసినవి !!


బియ్యం 100 గ్రాం

బెల్లం 150 గ్రాం 

యాలకులు 5

నెయ్యి 50 గ్రాం

జీడిపప్పు 10


!! చేసే విధానం !!!


ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపిదించేయడమే .

తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృప కు పాత్రులవుదాము.

 


9. !! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం 


తొమ్మిదవ రోజు


!! పరమాన్నం కావలసినవి !!


చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్

Sugar 1,1/2 కప్స్

ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్

ఏలకలుపౌడర్ 1/2 స్పూన్

నెయ్యి 5 టేబల్ స్పూన్స్


!! చేసే విధానం !!


ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి

తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి

ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి

( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )

అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి


10. ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి .


*ఓం శ్రీ మాత్రే నమః*

🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏

(సేకరణ)