doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస‍్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార‍్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు.
అమెరికా కాలిఫోర‍్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు.
అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప‍్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్‌తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.
మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే?
ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్‌డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు.
ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్..
కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి