15, జూన్ 2021, మంగళవారం

లవకుశుల_తర్వాత_అయోధ్య_ను_ఎవరు #పాలించారు?

 #లవకుశుల_తర్వాత_అయోధ్య_ను_ఎవరు #పాలించారు?


మహాభారత యుధ్ధం లో రఘువంశ (సూర్య) రాజులు ఎవరైనా పాల్గొన్నారా?


రాముని వంశవృక్షం అని ఈమధ్య మనందరికీ సుపరిచితమైన విషయానికి కొనసాగింపే ఈ వ్యాసం.


రామునికి లవకుశులు కవల పిల్లలని ఆయన తర్వాత వారే రాజ్యపాలన చేశారని మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం.


రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నలకు ఇద్దరేసి సంతానం కలరు.


వారు ......


1⃣ రాముడు     -  లవ , కుశ

2⃣ లక్ష్మణుడు   -  చిత్రాంగదుడు , చంద్రకేతు

3⃣ భరతుడు     -  తున్నీలుడు , పుష్కరుడు

4⃣ శతృఘ్నుడు -  సుబాహు , శోరశేణుడు.


రాముని తర్వాతి తరం :-

""""""""""""""""""""""""""""""

రాముడు

కుశుడు

అతిథి

నిషాధ

నల

నభస

పుండరీక

క్షేమధన్వ

దేవనిక

అహినాగు

పరిపత్ర

దల

ఉన్నాభ

వజ్రనాభ

శంఖణ

వ్యుషిత్సువ

విష్వసాహ

హిరణ్యనాభ

కౌసల్య

బ్రహ్మిష్ఠ

పుత్ర

పుష్య

ధృవసంధి

సుదర్శన

అగ్నివర్ణ


కాళిదాస విరచిత " రఘువంశం " లో ఇంతటితో ముగుస్తుంది.


తర్వాతి వివరణ " పద్మపురాణం " లో దొరుకుతుంది.


అగ్నివర్ణ

మరు

ప్రసృత

సుసంధి

అమర్ష & సహస్వంత

విశృశ్వంత (అమర్ష)

బృహద్బల


బృహధ్బలుడు :-

"""""""""""""""""""""

మహాభారత యుధ్ధ సమయానికి ఇతను మధ్య & దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించేవాడు.

ఇతను పాండవులకు వ్యతిరేకంగా పోరాడి అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. భీష్ముని ప్రకారం ఇతను రథుడు మాత్రమే.


బృహధ్భలుడు

బృహత్క్షయ

ఊరుక్షయ

వాతక్షయ

ప్రతివ్యోమ

దివాకర

సహదేవ

బృహదశ్వ

భానురథ

ప్రతితశ్వ

సుప్రతీక

మరుదేవ

సునక్షత్ర

కిన్నెర

అంతరిక్ష

సువర్ణ

సుమిత్రఅమిత్రజిల

ధర్మిన

కృతంజీవ

సంజయమహాకోశల

ప్రసేనజిత

క్షుద్రక

కులక

సురథ

సుమిత్ర


సుమితృడు :-

""""""""""""""""""

ఇతను రఘువంశ రాజులలో ఆఖరివాడు. 

ఇతను నంద వంశ & మగధ దేశ రాజు మహాపద్మనందుని చేతిలో ఓడిపోతాడు.

దీనితో రఘువంశరాజుల పాలన సమాప్తమవుతుంది.


ఈ నందులను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.


శల్యుడు :-

""""""""""""

లవకుశుల తరంలోని వాడైన మద్రదేశాధిపతి అయిన శల్యుడు కుడా పాండవులకు వ్యతిరేకంగా యుధ్ధం చేస్తాడు.

ఇతను నకుల,సహదేవుల మేనమామ, తల్లి అయిన మాద్రి సహోదరుడు.


బృహధ్బలుడు :-

"""""""""""""""""""""

మహాభారత యుధ్ధ సమయానికి ఇతను మధ్య & దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించేవాడు.

ఇతను పాండవులకు వ్యతిరేకంగా పోరాడి అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. 


 నాడు - నేడు :- 

""""""""""""""""""""

➡ భరతుడు తక్షశిల ను ఏర్పాటు చేస్తాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రం లో ఇస్లామాబాద్ సమీపం లో ఉంది.


➡ లక్ష్మణుడు లక్ష్మణపురి ని ఏర్పాటు చేస్తాడు.అదే నేటి  ఉత్తరప్రదేశ్ లోని లక్నో. 🏙


➡ శతృఘ్నడు మధువనం అడవిలో నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే నేటి  ఉత్తరప్రదేశ్ లోని మధుర. 🏕


➡ లవకుశులు జన్మించిన వాల్మీకి అశ్రమం నేడు రామతీర్ధం . పంజాబ్ లోని అమృత్ సర్ సమీపం లో కలదు. 🏡


➡ లవుడు దక్షిణ కోసల రాజ్యాన్ని పాలిస్తాడు. నేడు ఛత్తీస్ ఘడ్ లోని భిలాస్ పూర్ ప్రాంతం గా చెప్తారు.🏥


➡ కుశుడు శ్రావస్తి నగర కేంద్రం గా ఉత్తర కోసల రాజ్యాన్ని పాలిస్తాడు.

నేడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ & ఖుషి నగర్ ప్రాంతం. 🏯🌁


➡ థాయ్ ల్యాండ్ లోని లావోస్ నగరం కూడా లవుని పేరు మీదుగా   ఏర్పడినదే. 🏯

బ్యాంకాక్ సమీపంలో కల లబ్ పురి ని తక్షశిల రాజైన కలవర్నదిశుడు ఏర్పాటు చేశారని అంటారు. 🌇


మహాభారత  కాలానికి కోసలరాజ్యం 5 భాగాలుగా విభజించబడింది.


మధ్య,తూర్పు, దక్షిణ - మగధ రాజ్యం గా జరాసంధుడు పాలించేవాడు.


*రాముడి వంశ వృక్షo*


*బ్రహ్మ కొడుకు మరీచి*


*మరీచి కొడుకు కాశ్యపుడు.*


*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*


*సూర్యుడు కొడుకు మనువు.*


*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*


*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*


*కుక్షి కొడుకు వికుక్షి.*


*వికుక్షి కొడుకు బాణుడు.*


*బాణుడు కొడుకు అనరణ్యుడు.*


*అనరణ్యుడు కొడుకు పృధువు.*


*పృధువు కొడుకు త్రిశంఖుడు.*


*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*


*దుంధుమారుడు కొడుకు మాంధాత.*


*మాంధాత కొడుకు సుసంధి.*


*సుసంధి కొడుకు ధృవసంధి.*


*ధృవసంధి కొడుకు భరతుడు.*


*భరతుడు కొడుకు అశితుడు.*


*అశితుడు కొడుకు సగరుడు.*


*సగరుడు కొడుకు అసమంజసుడు.*


*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*


*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*


*దిలీపుడు కొడుకు భగీరధుడు.*


*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*


*కకుత్సుడు కొడుకు రఘువు.*


*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*


*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*


*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*


*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*


*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*


*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*


*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*


*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*


*అంబరీశుడు కొడుకు నహుషుడు.*


*నహుషుడు కొడుకు యయాతి.*


*యయాతి కొడుకు నాభాగుడు.*


*నాభాగుడు కొడుకు అజుడు.*


*అజుడు కొడుకు ధశరథుడు.*


*ధశరథుడు కొడుకు రాముడు.*


*రాముడి కొడుకులు లవ కుశలు . .*

అజ్ఞాతకవి వ్రాసిన పద్యం

 (ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన పద్యం.)

*కం. అంచిత చతుర్ధ జాతుడు

పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్

గాంచి, తృతీయం బక్కడ

నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!

భావం: గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.

ఏమీ అర్థం కాలేదు కదా! ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం.

ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.

చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,

పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,

ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,

తృతీయము అంటే అగ్ని ,

ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి.

హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం

ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.

🙏🏻🙏🏻🙏🏻

*బాల్య స్నేహితుడు

 *బాల్య స్నేహితుడు*


మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని  వెళ్ళాం.


టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..

ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. నిడదవోలులో ఇంటర్లో క్లాస్ మేట్ అని..!


హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.


"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.


వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...


ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం...సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.


అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...

"ఎందుకురా" అంటే.. 

"ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్..అంతే గదరా.." 

అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!


"మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.

చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.


"మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..

అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి....ఇప్పటి వరకు  స్కూటర్ దాటి మరేం కొనలేదు" అంటూ దెప్పింది.


నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదే" అన్నాను.


ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" అని వెళ్లి పోయాడు.


ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.


"కాదులే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ..!" అన్నాను సాలోచనగా.


"అతను ఏ పొజిషన్ లో ఉన్నా..  స్నేహితుడు స్నేహితుడే..! అంది.


"కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నిశ్చయంగా..


సినిమా అయిపోయింది..


మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని, వాడి గురించి వాకబు చేస్తే...

అతను పై ఫ్లోర్ లోని  ఒక రూమ్ లోకి  తీసుకెళ్లాడు.


పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు... ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.


గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!


మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రిల్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు.


"ఎలా వచ్చార్రా.." అని అడిగితే..

"రిక్షాలో" అని చెప్పా.


డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.


దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....

స్నేహితుడు ముఖ్యం. 

అతడి స్టేటస్  కాదు.. 

ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు..." అంది ఒకింత కోపంగా...!!

పూరి_వంటగది_అద్భుతమైనది_ఆశ్చర్యమైనది

 #పూరి_వంటగది_అద్భుతమైనది_ఆశ్చర్యమైనది 

#500మంది_వంటవారు!!#300మంది_సహాయకులు!!!

#752చుల్హాల_తయారీ!!!!

#700మట్టి_కుండలతో_వంటలు

#ఆచారాలసమయంలో_6000మంది_పూజారులు!


#172సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని ఎకరంలో విస్తరించి ఉన్న 32 గదుల ఈ విశాలమైన వంటగదిలో (150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు), 752 చుల్హాలను దేవతకు అర్పించే మహాప్రసాద్‌ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు.


మరియు సుమారు 500 మంది వంటవారు మరియు వారి సహాయకులు 300 మంది పనిచేస్తున్నారు .... ఈ సమర్పణలన్నీ ఏడు వందల మట్టి కుండలలో వండుతారు, వాటిని 'అట్కా' అని పిలుస్తారు. సుమారు రెండు వందల మంది సేవకులు కూరగాయలు, పండ్లు, కొబ్బరి మొదలైన వాటిని కోసి, సుగంధ ద్రవ్యాలు రుబ్బుతారు .. ఈ వంటగదిలో ఏమైనా భోగ్ తయారవుతుందని నమ్ముతారు ......


 దీని నిర్మాణం మాతా లక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది.


ఈ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అంటారు.ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది.ఆహారం పూర్తిగా శాఖాహారం.తీపి వంటలను తయారు చేయడానికి, చక్కెర స్థానంలో మంచి నాణ్యమైన బెల్లం ఉపయోగిస్తారు.

 

ఆలయంలో బంగాళాదుంపలు, టమోటాలు మరియు కాలీఫ్లవర్ ఉపయోగించబడవు.  ఇక్కడ తయారుచేసిన వంటకాలకు '#జగన్నాథ్_వల్లభ్_లడ్డు', '#మఠపులి' అని పేరు పెట్టారు.భోగ్‌లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడటం నిషేధించబడింది.


 వంటగది దగ్గర #రెండు_బావులు ఉన్నాయి, వీటిని '#గంగా' మరియు '#యమునా' అని పిలుస్తారు.


 వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారవుతుంది.  ఈ వంటగదిలో 56 రకాల భోగా తయారు చేస్తారు.  మహాప్రసాద్ కాయధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపి పూరి, ఖాజా, లడ్డస్, పెడాస్, బూండి, చివ్డా, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిస్రి మొదలైన వాటి నుండి తయారవుతుంది ...


 వంటగది మొత్తం వంట సామగ్రిని సరఫరా చేస్తుంది.  రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు.


 ఎనిమిది లక్షల లడ్డస్‌ను కలిపి తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదు చేయబడింది.


 వంటగదిలో ఒకేసారి 50 వేల మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు.  ఆలయ వంటగదిలో ప్రతిరోజూ డెబ్బై రెండు క్వింటాళ్ల బియ్యం ఉడికించాలి.


వంటగదిలో, 

బియ్యం ఒకదానికొకటి 7 కుండలలో వండుతారు.  ప్రసాదం చేయడానికి, 

7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు.  పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు ...తరువాత ప్రసాదం కింది నుండి ఒకదాని తరువాత ఒకటి వండుతారు.  ప్రతిరోజూ కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు.


అన్నింటిలో మొదటిది, భోగ్ ను భగవంతునికి అర్పించిన తరువాత, ప్రసాదం భక్తులకు ఇవ్వబడుతుంది.


 జగన్నాథ్‌కు 'అబ్దా' అని పిలువబడే మహాప్రసాద్‌ను అర్పించిన తరువాత, దీనిని తల్లి బీమలకు అర్పిస్తారు ...

 అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది ...


మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామి కి రోజుకు ఆరుసార్లు అర్పిస్తారు.


రథయాత్ర రోజున, ఒక లక్ష పద్నాలుగు వేల మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ...


 ఆచారాలలో #6000_మంది_పూజారులు పనిచేస్తున్నారు.  ఒడిశాలో జరిగే పది రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల ప్రజలు ఉత్సాహంతో వస్తారు.


 ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు, కులం, మతం అనే వివక్ష లేదు.


 జై జగన్నాథ్ ....

అధ్భుతమైన దృశ్యం

 


మరో అధ్భుతమైన దృశ్యం...👇😍


ముంబై సెంట్రల్ స్టేషన్ లో #సునీల్ శర్మ అనే ఈ బ్రాహ్మణ బాలుడు తన ఆచారం ప్రకారం సంధ్యా వందనం చేస్తున్నాడు... 


వందల మంది తిరుగుతున్న ఒక బహిరంగ ప్రదేశంలో యే మాత్రం బిడియం,భయం లేకుండా వేద మంత్రాలను పఠిస్తూ సనాతన ధర్మాన్ని చాటుతున్నడు...


మామూలుగా అయితే ఇళ్లలో ఎంత సంప్రదాయాలు,ఆచారాలు ఉన్నా బయట జనాల్లో తిలకం, జంధ్యం ధరించడానికి సిగ్గు పడతారు చాలా మంది...


కానీ ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తన ధర్మాన్ని ,సంప్రదాయాన్ని గర్వంగా నిలబెట్టే ఇలాంటి వారే కదా మనకు స్ఫూర్తి... 👏👏🙏🚩


వీడియో  లేదు .  ఫోటో  పెట్టారు .  వీడియో తీసి  upload  చేసినట్లయితే  ఇంకా. బాగుండేది .

హిందూ  సైనిక్. వారి  సౌజన్యంతో

*అన్నీ అశాశ్వతమే

 సుఖినోభవంతు:🙏


🌸*శుభోదయం*🌸



          *అన్నీ అశాశ్వతమే*!

                      ✍️


*ఆత్మ జ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే!*


అలాంటి మానవ జన్మ లభించి కూడా ఆత్మ జ్ఞానాన్ని 

అలక్ష్యం చేసి లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకొని 

జీవితం గడిపినవారి గతి ఏమవుతుందో


*శంకరాచార్యులవారు* 

ఇలా వివరించారు:

 

*మాకురు ధన జన యౌవన గర్వం* 

*హరతి నిమేషాత్‌ కాలః సర్వం*

*మయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా*

 

*ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు.*               


*ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది.*


*ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని* 


*తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో, ఆత్మానుభూతిని చెందు! అని దీని అర్థం.*


*ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి.* 


*ఈ క్షణికమైన సంపదలను* చూసుకొని మనిషి *గర్విస్తాడు,అహంకరిస్తాడు.* 


కొందరికి ధనగర్వం, 

కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం, 

కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం.


కానీ ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు,ఆస్తులు నేలమట్టమై పోతాయి.


నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే 

ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. 


ఆ క్షణంలో 

ధనం, జనం ఏవీ రక్షించవు. 


అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.


వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చి కూర్చుంటుంది.


కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి.

 

*అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు.* 


వాటిని 

*అనుభవించడంలో తప్పు లేదు.*


కానీ, వాటితో అటాచ్‌మెంట్‌ పెట్టుకోకూడదు.


*అలా పెట్టుకుంటే,*

*అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు.* 


జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. 


*శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి.*


ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి 

బ్రహ్మంగా ఉండిపోవాలి. 


    పరమాత్మలో ఐక్యం కావాలి.


                   🌷🙏🌷


                      లోకా 

    🙏సమస్తా సుఖినోభవన్తు!🙏

SEVEN SHORT STORIES

 SEVEN SHORT STORIES shared by Satya Nadella [CEO Microsoft]...



🌾 *LOOKING BACK*

I interviewed my grandmother for part of a research paper I’m working on for my Psychology class. When I asked her to define success in her own words, she said, “Success is when you look back at your life and the memories make you smile."


🌾 *LOVE CONQUERS PAIN*

After I watched my dog get run over by a car, I sat on the side of the road holding him and crying. And just before he died, he licked the tears off my face.


🌾 *TOGETHERNESS*

As my father, three brothers, and two sisters stood around my mother’s hospital bed, my mother uttered her last coherent words before she died. She simply said, “I feel so loved right now. We should have gotten together like this more often.”


🌾 *AFFECTION*

I kissed my dad on the forehead as he passed away in a small hospital bed. About 5 seconds after he passed, I realized it was the first time I had given him a kiss since I was a little boy.


🌾 *JOY*

When I witnessed a 27-year-old cancer patient laughing hysterically at her 2-year-old daughter’s antics, I suddenly realized that I need to stop complaining about my life and start celebrating it again.


🌾 *KINDNESS*

A boy in a wheelchair saw me desperately struggling on crutches with my broken leg and offered to carry my backpack and books for me. He helped me all the way across campus to my class and as he was leaving he said, “I hope you feel better soon.”


🌾 *SHARING*

I was traveling in Kenya and I met a refugee from Zimbabwe. He said he hadn’t eaten anything in over 3 days and looked extremely skinny and unhealthy. Then my friend offered him the rest of the sandwich he was eating. The first thing the man said was, “We can share it.”


*Celebrate Life with Gratitude*...