19, ఆగస్టు 2024, సోమవారం

అలనాటి సర్వారాయుళ్లు

 ఏరీ అలనాటి సర్వారాయుళ్లు? 


          "శ్రీ లక్ష్మీ కాఫీ హోటల్"

"పరమేశ్వర బ్రాహ్మణ కాఫీ హోటల్"  

"ధనలక్ష్మీ ఆర్యవైశ్య కాఫీ హోటల్"

"సుబ్బారావుగారి కాఫీ భోజన హోటల్"


వీధిలోకి వెళ్ళగానే కనిపించే  హోటల్లోకి అడుగుపెట్టగానే  ముందు గదిలో టేబుల్ మీద పెద్ద సైజ్ రేడియో,  బిల్లులను గుచ్చడానికి దబ్బనం  లాంటి ఒక పరికరం, ఒకటో రెండో చాకోలెట్స్  సీసాలు  పెట్టుకుని కుర్చీలో ఒక పెద్దమనిషి కూర్చుని కనిపిస్తాడు.  అతని కుర్చీ వెనుక పదిరకాల దేవుళ్ళ ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి.  అగరొత్తులు సుగంధాలు విరజిమ్ముతాయి.   లోపలకి వెళ్ళగానే హాల్లో  మూడు నాలుగు వరుసల్లో టేబుళ్లు, టేబుల్ కు అటూ ఇటూ రెండు కుర్చీలు కనిపిస్తాయి.  మనం ఏదొక కుర్చీలో కూర్చోగానే  బట్లర్ లేదా సర్వర్ వస్తారు.  "టేబుల్ క్లీన్" అని కేకపెడతాడు.  క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తడిగుడ్డతో టేబుల్ మొత్తాన్ని కసకసా తుడిచేసి వెళ్ళిపోతాడు.


  "ఏమున్నాయి?" ప్రశ్నిస్తాము.  "ఇడ్లీ వడ ఉప్మా పూరి ఉల్లిదోసె సాదాదోస పెసరట్టు ఉప్మా పెసరట్టు" అని ఫుల్ స్టాప్, కామాలు లేకుండా ఆరనిముషంలో ఇరవై రకాల టిఫిన్ల దండకాన్ని చదువుతాడు.  అలా ఒకసారి కాదు...రోజుకు కనీసం రెండు వందలసార్లైనా ఆ దండకాన్ని చదువుతాడు.   అన్నీ విని సరిగా వినపడనట్లు ముఖం పెట్టి కొంతమంది మళ్ళీ అడుగుతారు.  ఏమాత్రం విసుక్కోకుండా  మళ్ళీ చెబుతాడు.    ఆర్డర్ ఇవ్వగానే వెళ్లి రెండు మూడు నిముషాల్లో ప్లేట్ లో తీసుకుని వస్తాడు.  


కొన్నిసార్లు ఉదయం వేళల్లో రద్దీగా ఉన్న సమయంలో ఒకేసారి నాలుగైదు  ప్లేట్లను కూడా ఒకదానిమీద మరొకదాన్ని పెట్టి  తీసుకొస్తాడు.  నలుగురి దగ్గర ఆర్డర్ తీసుకుని కిచెన్ లోకి అన్నీ తెచ్చి ఎవరెవరు ఏమి అడిగారో వారికి కచ్చితంగా  వాటినే ఇస్తాడు.  చిన్నపొరపాటు కూడా జరగదు.  


ఇడ్లీ సాంబార్  చాలా ఫేమస్.  దానికి సాంబార్ ఇడ్లీ అని చెప్పాలి.  మామూలు ఇడ్లీ అంటే  ఇడ్లీ ప్లేట్ లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కొద్దిగా కారప్పొడి తో తెస్తాడు.  సింగిల్ సాంబార్ ఇడ్లీ అని చెబితే పెద్ద ప్లేట్ లో ఒక్క ఇడ్లీ తీసుకొచ్చి పెద్ద లోటాతో సాంబార్ తెచ్చి పళ్లెం నిండా పోస్తాడు. పావు లీటరు పైగానే ఉంటుంది.  కొంతమంది ఆ ఒక్క ఇడ్లీకే మళ్ళీ సాంబార్ వేయించుకుంటారు.  


తిన్న తరువాత "ఇంకేమి కావాలి సార్" అడుగుతాడు. "కాఫీ" అనగానే గ్లాసులో నురగలతో కాఫీ తెచ్చి ఇచ్చి చెవి పైభాగంలో  దోపుకున్న పెన్సిల్ తీసుకుని జేబులొనించి చిన్న కాగితం ముక్క తీసి ఎంత అయిందో రాసి ఇస్తాడు. నేను తొలిసారి హోటల్లో తిన్నపుడు రెండు ఇడ్లీ పావలా.  పూరీ రెండు అర్ధరూపాయి.  కాఫీ ఇరవై పైసలు అని గుర్తు.   ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, తిని కాఫీ తాగితే తొంభై అయిదు అయిదు పైసలు అయ్యేది.  రూపాయి నోటు ఇచ్చి "మిగిలింది ఉంచుకో" అనేసి వెళ్ళిపోయేవారు కొందరు.  


  

1975 ప్రాంతంలో ఆంధ్రాలో కానీ,  తెలంగాణాలో కానీ, తమిళనాడులో కానీ  చిన్న చిన్న ఊర్లలో  రెండు ఇడ్లి పావలా,  రెండు పూరి అర్ధ రూపాయి, ఉల్లిపాయ దోసె అర్ధ రూపాయి ఉండేవి.  స్వీట్ యాభై గ్రాముల బరువున్న ముక్క యాభై పైసలు.

  

అయితే ఈ సర్వర్లు కొందరు యజమానులు మోసం చేసేవారు.   ఎలాగంటే వీరు విధుల్లో లేనపుడు వ్యాపారులు,  ఉద్యోగస్తుల ఇళ్లకు వెళ్లి అయిదు రూపాయలు, పదిరూపాయలు అప్పుగా తీసుకునేవారు.  వాటిని తీర్చడం వాళ్ళ వల్లయ్యేది కాదు.  అందుకని వారు  హోటల్ కు వచ్చినపుడు టిఫిన్ బిల్ రెండు రూపాయలు అయితే రూపాయిన్నర వేసి ఇచ్చేవారు.  వంటవాళ్లు లోపల ఎక్కడో ఉండేవారు.  యజమాని ముందుగదిలో గల్లా పెట్టె   దగ్గర  ఉండేవాడు.  చిన్న చిన్న ఊళ్లు  కావడం వలన అందరూ ఒకరికొకరు  పరిచయం కలిగి ఉండేవారు.  అందువలన వారు ఏమి తిన్నారు ఎంతయింది అనే విషయాలు పట్టించుకునేవారు కారు.  ఈ సర్వర్లు చేసే మోసాల కారణంగా కొంతమంది యజమానులు దివాళా తీసి హోటల్ ను మూసెయ్యాల్సి వచ్చేది.  తొందరగా మేలుకున్న యజమాని ఆ సర్వర్ ను నాలుగు తన్ని బయటకు గెంటేసేవాడు.   


1995  వరకు మన రాష్ట్రాల్లో దాదాపు అన్ని హోటల్స్ ఇలా సర్వర్లతో కళకళలాడేవి.  కానీ, ఆ తరువాత సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్ వచ్చేసాయి.  రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని టిఫిన్స్ అమ్మే పధ్ధతి వచ్చింది.  హోటళ్లలో అయిదు రూపాయలు ఉండే దోశ బయట బండిమీద ఒక్క రూపాయి ఉండేది.  2000  ప్రాంతంలో అనుకుంటాను..దిల్సుఖ్నగర్ వేంకటాద్రి టాకీస్ ముందు వరుసగా పది బండ్లు ఉండేవి. వారు ఒక్క రూపాయితో దోసెను అమ్మటం స్టార్ట్ చేశారు.  వారి దెబ్బకు అక్కడే ఉన్న హరిద్వార్ హోటల్ దివాళా తీసి మూతపడింది.  హరిద్వార్ లో అప్పుడు దోశ అయిదు రూపాయలు!   


సర్వర్లను పోషించడం ఆర్థికభారం అని భావించిన హోటళ్ల యజమానులు సెల్ఫ్ సర్వీస్ హోటళ్లను ప్రారంభించారు. వీటిలో ముందుగానే టోకెన్ తీసుకోవాలి.  టోకెన్ చూపిస్తేనే మనకు టిఫిన్ ప్లేట్ ఇస్తారు.  కూర్చోడానికి కుర్చీలు తీసేసారు.  గోడకు కొట్టిన ఒక పొడవాటి చక్క మీద ప్లేట్ పెట్టుకుని నిలుచుని తినాలి.  చట్నీ మళ్ళీ కావాలంటే మనమే వెళ్లి వేయించుకోవాలి.   ఈ సంప్రదాయం కారణంగా వేలాదిమంది సర్వర్లు ఉపాధిని కోల్పోయారు.  


ఏ మాటకామాటే చెప్పుకోవాలి.  పెద్ద పెద్ద కార్పొరేట్ హోటళ్లలో టిఫిన్లకన్నా బయట బండ్ల మీద అమ్మే టిఫిన్లే నాకు నచ్చుతాయి.  మన కళ్ళముందే చేస్తారు.  ఉప్పుకారాలు మన అభిరుచికి తగినట్లుగా ఉంటాయి.  నిన్న జూబిలీ హిల్స్ లో ఒక పెద్ద హోటల్ కు వెళ్ళాము టిఫిన్ చేద్దామని.  అక్కడ రెండు ఇడ్లీ 120  రూపాయలు.  రెండు పూరి 180  రూపాయలు.  ఉల్లిపాయ దోశ 200  రూపాయలు.  ఇడ్లీ గోరువెచ్చగా ఉన్నాయి.  సాంబార్ ఉగ్గుగిన్నెతో తెచ్చాడు.  నాలుగుసార్లు మళ్ళీ అడగాల్సివచ్చింది.   చట్నీ ఎంత పల్చగా ఉన్నదంటే దానికన్నా మంచినీళ్లు చాల చిక్కగా ఉంటాయి.  ఉప్పు కారం అనేవి అనే రెండు పదార్ధాలు ఈ ప్రపంచంలో ఆ ఉంటాయని ఆ హోటల్ యజమానులకు తెలుసో తెలియదో తెలియదు.    ఇద్దరం తిని అయిదు వందల బిల్లు కట్టి వెంటనే NTV  ఆఫీస్ సమీపంలో ఒక బండి హోటల్ ఉంటే వెళ్ళాము.  సాంబార్ పెద్ద గంగాళంలో కుతకుత ఉడుకుతుంది.  దానిలో పాతిక వడలు మునకలు వేస్తున్నాయి.  పొగలు కక్కుతున్న ఆ సాంబార్ ను చూడగానే ప్రాణం లేచివచ్చింది.  ఇడ్లీ అడిగాం.  పెద్ద పేపర్ కప్పులో ఇడ్లీ వేసి నిండా సాంబార్ పోసి, ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి  ఇచ్చాడు.  అమృతం కూడా అంత రుచిగా ఉండదేమో!  ఒక్క ఇడ్లీకే పావు లీటర్ సాంబార్ అయిపోగా మళ్ళీ బౌల్ నిండా పోశాడు.  ఇద్దరం చెరో రెండు ఇడ్లీ తింటే ముప్ఫయి అయిదు రూపాయలు అయింది బిల్! .   


*మళ్ళీ ఆ పాత రోజులు  వస్తాయా?  అలాంటి వాతావరణాన్ని మళ్ళీ చూడగలమా*?


👏💎🌼💝

Forwarding 

Sweet Memories 

Recd.from 

Other Group 

💝🏐❤️🌼  🌼❤️🏐❤‍🩹

Call 1930*

 *Call 1930*


హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు ఈ నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.


తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది.


బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని  ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. 


దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి *‘‘1930’’* కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ *1930* నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది.


*దయచేసి అందరికీ Share చేయగలరు*

గుండె బలహీనత పోగొట్టు

 గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు -


 * తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .


 * కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.


 * బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.


 * గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .


 * మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.


 * పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.


 * 12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.


 * మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.


 * కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .


 * మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .


 * ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .


 * మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.


 * గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .


 * రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును.


            పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు . 


      గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా గుండెకు సర్జరీలు చేయించుకున్నవారు మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం చాలా మంచిది . గుండె సమస్య వాత దోషం వలన వస్తుంది . అందుకే హృదయవాతం అని పిలుస్తారు . మలబద్ధకం రావడం ఈ జబ్బులో సహజం . మలం సరిగ్గా బయటకు వెడలక గట్టిగా ముక్కడం వలన అది హృదయం మీద ఒత్తిడి పెరిగి గుండెపోటు రావడానికి అవకాశం ఉంది . కావున మలం సాఫీగా వెళ్లేలా చూసుకొవడం అతి ముఖ్యం . వాత సంబంధ పదార్థాలు తినడం నిషిద్ధం . 


      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

_*శ్రీ గరుత్మంతుడి కధ -2

 _*శ్రీ గరుత్మంతుడి కధ -2 వ భాగం*_

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*శ్రీ గరుడ పురాణము పరిచయము :*


గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది . గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను, అతనిచరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్ప వచ్చును. దీనిలో అనేక విషయములున్నవి . అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు , పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి. ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువు కొనుటకు వీలుగా నున్నవే . నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.


*గరుడుని పుట్టుక:*

ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు సుఖమయం ..

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Panchaag


 

పదవీ విరమణ వ్యధ!!

 


పదవీ విరమణ వ్యధ!!


 వయసు రీత్యా  నేను 60 లోకి వచ్చినట్లు ప్రపంచానికి తెలిసిపోయింది..ఇదొక బ్రేకింగ్ న్యూస్ గా నలుగురి నోళ్ళలో నానడం రిటైర్ అయిన దానికంటే అత్యంత బాధాకరం. 


ఏజ్ 40 వస్తే ఓమూడునాలుగేళ్ళు 39గా మైంటైన్ చేయొచ్చు... బాటా చెప్పుల ధర లాగా! 

ఆనక 45 వస్తే 40ప్లస్ అని మరికొంతకాలం కప్పెట్టచ్చు వయసుని.


 50కి వచ్చినప్పుడు ఇంకా సర్వీస్ ఎంతకాలం ఉంది? అని ఆడిగితే... ఆ ప్రశ్నకి ఆశ్చర్యం నటిస్తూ, ఇప్పుడెక్కడ?ఇంకా 10ఏళ్ళు ఉందిగా..అంటూ “పదేళ్ళు” మీద గట్టిగా స్ట్రెస్ చేసి పలుకుతూ  సైకలాజికల్ గా ఎదుటివారిని మభ్యపెట్టడమో, హిప్నటైజ్ చేసి  వాళ్ళ చేత అయితే "చిన్నవారే" అనిపించుకోవడమో జరిగిపోయేది. ఆ విధమైన పరవంచన, స్వీయ మానసిక తృప్తి తో మరో ఐదారేళ్ళు లాగిపారేసా!


 కానీ విధి బలీయమైనది గా! 

"సూర్యుడు పడమర రాగా దిగిపోవును" అన్న సత్యంలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 60 ఏళ్ళు రాగానే ఉద్యోగంలో దిగిపోతాడు  అన్న విషయం సమాజానికి తెలుసు.


ఇక ఎంతమాత్రమూ నేను నా వయసుని కప్పెట్టలేనన్న భావన నన్ను చింతాక్రాంతుడిని చేసింది😣.

ఆ బాధతో తెల్ల గడ్డం పెంచి రిటైర్ అయినప్పుడు కప్పిన శాలువా చుట్టుకొని ఉండగా ఇప్పుడు వయసు 70 లా కనిపిస్తున్నారు ! అని మా పుత్రరత్నం అదిలించేటప్పటికి ఉలిక్కిపడి  ఆ ప్రయత్నం విరమించా! 


ఆఫీస్ లో తెలిసిందంటే పెద్ద బాధ లేదు కానీ నా ఈ బాధ  ఎక్కువవ్వడానికి మా వాడకట్టులో  నేను రిటైర్ అయినట్టు, 60 లో ఉన్నట్టు తెలిసిపోవడమే! 


ఇన్నాళ్లూ శమీవృక్షం మీద రహస్యంగా ఆయుధాలు దాచినట్టు దాచిన నా వయసు గుట్టు భళ్లుమనడమే!


శత్రువులు ఎక్కడో లేరు..మన ఎదురుగుండానో, మధ్యలో నో ఉంటారనేది  చరిత్ర మళ్లీ నిరూపించింది.


రోజూ మా ఎదురింటాయన ,నేను వెళ్ళేది ఒకటే టైం. ఆయనకి వాళ్ళావిడ ఎదురు రావడం సెంటిమెంట్. ఏదో ప్రైవేట్ జాబ్ అని తెలుసు.  నేను టక్ చేసుకుని కుసింత జాపత్రి పూసుకుని వీలైతే కారు లేదంటే బైక్ మీద స్టైల్ గా వెళ్తుంటే వాళ్లిద్దరూ చూసేవారు. 

ఆయన, నేను ఇద్దరం నవ్వుతూ విష్ చేసుకునేవాళ్ళం. కానీ ఆవిడ బాడీలాంగ్వేజ్ లో ఏదో ఆక్రోశం కనిపించేది. 


ఆవిడ చుట్టుపక్కల ఇళ్లల్లోగల అందరి గుట్టుమట్లు బాగా పసికడుతుందని మా పనిమనిషి ద్వారా సమాచారం అందింది. 


“ఫలానా వారి అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని, పక్కఇంట్లో ఆయన రాహుకాలంలో మందుకొడతాడని,  ఈచివరి ఇంటావిడ మణిప్పురం లో  గొలుసుపెట్టి వడ్డీలు కడుతుందని, మా ఇంట్లో కడియం నుంచి పూలమొక్కలు తెచ్చామని, ఆ పక్కావిడ తెనాలి బంగారంతో దుద్దులు చేయించు కుందని..”ఇలా.


అసలు నా అనుమానం ఆవిడ “ఇస్రో “ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని భారత ఉపగ్రహ వ్యవస్థని మా కాలనీ లో ఉపయోగించుకుంటుందేమో అని!! 

ఆ తరహాలోనే నేను కొంతకాలంగా  నియమిత సమయానికి ఆఫీస్ కి వెళ్లడం లేదని గ్రహించింది. తర్వాత పరిణామం నేను ఊహించిందే! 

వాళ్ళాయన మా ఇంటికి వచ్చేశాడు ఓరోజు. విషయం తెలుసు కాబట్టి ఇబ్బందిగానే పలకరించా. 


హోటల్లో ఏమున్నాయి? అని మనం ఆడిగినప్పుడు  సర్వర్ యాంత్రికంగా ఎలా చదువుతాడో ఆయన కూడా  మొహాన చిరునవ్వు వేసుకుని " ఎలా ఉన్నారు? పిల్లాడు బాగున్నాడా? ఎప్పుడొస్తాడు? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా?"  వంటి సాదాసీదా ప్రశ్నలు అడుగుతూ వాటికి నేనిచ్చిన జవాబుల్ని పెద్దగా లక్ష్య పెట్టకుండా అసలు ప్రశ్న వేసేసాడు!


" ఈ మధ్య ఆఫీస్ కి సెలవు పెట్టారా?? " వెళ్తున్నట్లు లేదు? అని అడిగాడు. ఇప్పటివరకు వేసిన ప్రశ్నల తాలూకు నిర్లిప్తత ఈ ప్రశ్నలో అకుంఠిత ఆసక్తి గా మారడం గ్రహించా! 


బైటకి చూసా.. రాత్రి పెట్టుకున్న జాజిచెండు  పై నుంచి విసిరితే చెట్టు పై కొమ్మలో చిక్కుకుని వేలాడుతున్నట్లు,   మేడ మీద వరండాలో ఈయన గారి శ్రీమతి బాల్కనీ లో నుంచొని ఉంది మా ఇంటివంక చూస్తూ.. ఈవిడ ప్రశ్నలకి వాళ్ళాయన జవాబులు ఎప్పుడు తెస్తాడోనని!


లాభం లేదు ఇంక.. నా పిచ్చిగానీ! ఆవిడ ఇప్పటికే మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేసి నేను రిటైర్ అయ్యినట్లు,  రిటైర్ అయ్యాక  నాకెంతవచ్చింది..పెన్షన్ ఎంత రాబోతోంది? ఇత్యాది ఆసక్తికర అంశాలు లాగేసి ఉంటుంది. 


జస్ట్ శంఖం లో పోస్తేనే కదా! అర్ధం కావడం కోసం వాళ్ళాయన్ని పంపింది.


"రిటైర్ అయ్యానండీ..అని ఏకలవ్యుడు ద్రోణుడికి ముఖ్యమైన బొటనవేలు సమర్పించినట్లు అతనికి ...అదే ..అతనిలో దాగి ఉన్న ఆవిడగారికి కావాల్సిన సమాధానం అర్పించా. 

మొబైల్ లో మెసేజ్ వస్తే వచ్చే వెలుగు లా అతని కళ్ళలో క్షణకాలం మెరుపు.తర్వాత ఏదో అన్నట్లు, గేటు ధబీలుమని వేసిన శబ్దం మాత్రమే నా మనసుకు తెలిసింది.


ఇక రేపు ఏరియా అంతా పాకిపోతుంది కాబోలు!

నా రిటైర్ ఆవిడకి సెటైర్ అన్న విషయం తెలుసు.


పర్యవసానమే మరుసటి రోజు నుంచి నన్ను చూడగానే సమాజం చేసే పలకరింత లో బోలెడు మార్పులు!


తెల్లవారుఝామున రోడ్లెక్కి పూలు దోచేసుకుందాం తోడు వస్తారా? అని ఒక వయో వృద్ధుడు ఆత్రత!


చేసే పనేం లేదుగా? శంకరమఠంలో వధూవరుల లిస్టు అప్ గ్రేడ్ చేద్దాం రమ్మని ఇంకో సగటు జీవి ఆహ్వానం!


కమీషన్ మీద రియల్ ఎస్టేట్ పాంఫ్లెట్స్ రోడ్డు మీద పంచుతారా...టైం పాస్ అవుతుందని ఒక  పైసాజీవి ఉచిత సలహా!


 రిటైర్ అయినవాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాం రమ్మని, ఆదివారం పెన్షనర్ గ్రీవన్సెస్ కి అట్టెండ్ అవ్వమని, శ్రీరాంచిట్స్ లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ ట, చేరకూడదూ అని ! సాయంత్రం పెద్దవాళ్ళందరూ పార్కులో మంచీ మాట చెప్పుకుందాం వస్తారా ?? అని, ..ఇలా వేధింపులు!


హతవిధీ!, ఇన్నాళ్ళు హీరో గ్లామర్ బండి, జీన్స్ పాంట్, నైకీ షూ తో వెలిగిన నేను నేనేనా?? సమాజం ఇంత సడన్ గా నన్ను వృద్ధుడిని చేసేసింది ??!! 


మీరు రిటైర్ అయ్యారుగా ఇప్పుడు లోన్ కష్టమని, సీనియర్ సిటిజన్ కాబట్టి వేరే లైన్ లో నుంచోమని, డ్రైవింగ్ లైసెన్స్ ఇంక ఐదేళ్లు మించి extend చేయమని, అబ్బే.. LIC పాలసీ ఇక ఇవ్వలేమని..ఇలా నాకు మానసికంగా కూడా వార్ధక్యం తెప్పించేస్తున్నారు!!😢


నేను బాగా ఉన్నానని, రక్తదానానికి ఇప్పటికీ రెడీ అని, కళ్ళజోడు లేకుండా డ్రైవింగ్ అర్ధరాత్రి ఐనా చేస్తానని, కృష్ణా నది అడ్డంగా ఈదగలనని చెప్పటమే కాక, 


"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు" అవ్వొచ్చు కానీ “కొంతమంది వృద్ధులు ఎప్పటికీ కుర్రవాళ్ళు “ అన్న విషయమే నేను చెప్పదల్చుకుంది, నిరూపించదల్చుకుంది.

అయినా, ప్రపంచం పట్టించుకోవడం లేదు!


అందుకే , రాజకీయ నాయకుల్లా రిటైర్మెంట్ అనేది  ఉద్యోగులకు కూడా ఉండకూడదని, "వాళ్ళంతకు వాళ్ళు ఇక చేయలేము మొర్రో" అంటేనో, లేదూ, ప్రభుత్వం, ఎవరినైనా తీసివేయదల్చుకుంటే " వయసు బహిర్గతం"  చేయకుండా తీసేయాలని, ఆసందర్భాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ గుట్టుచప్పుడుగా చేయాలని నా డిమాండ్. ఒకవేళ RTI ఆక్ట్ ప్రకారం ఫలానా వారి వయసు ఎంత? అని ఎవరైనా  పనికిమాలిన వాళ్లు అడిగినా "కాన్ఫిడెన్షియల్"  అని చెప్పి నిరాకరించాలి!😊


ఏది ఏమైనా, 40 వచ్చేటప్పటికి ఆడవాళ్లు,  60 వచ్చేటప్పటికి మగవారు పడే బాధ త్రాసులో తూస్తే సమానంగా ఉంటుంది. 

అంతిమంగా రిటైర్మెంట్ ఆపై "గోప్యత కోల్పోయిన వయసు"  తద్వారా వచ్చే బాధ పగవానికి కూడా వద్దనే ఈ మగవాని బాధ...😜!

నరకానికి వెళ్ళరు!*

 


         *వీళ్ళు నరకానికి వెళ్ళరు!*

                 ➖➖➖✍️


*మానవుణ్ణి  నరకం  నుండి తప్పించేవి వృక్షాలు.*


*మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని...                     “శ్రీ వరహా పురాణం“(172వ అధ్యాయం,36 వ శ్లోకం) పేర్కొంది.*


*శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı*

*ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı*


*ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.*



*పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు...*


*మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.* 


*అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.*


*వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది…*


*శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı*

*మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı*


*ఇతర పక్షుల   పీకలు  పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి.*


*వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి.* 


*జంతువులకు, పక్షులకు ఇతర జీవరాశులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.*


*వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి.*


*గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది.*


*మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి.*


*మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ధ్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం.* 


*ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..*


*మన మతాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా ‘పుక్కిట పురాణాలు’ అంటూ మన మనసుల్లో ‘సెక్యూలర్’ విషాన్ని ఎక్కించేశారు.*


*పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే,*

*గత డెభై సంవత్సరాలలో ఎంత ‘పెద్ద అడవి’ సృష్టించబడి ఉండేదో ఊహించుకోవచ్చు.*


*నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.*


*నూరు బావులకంటే ఒక చెరువు మేలు !*

*నూరు చెరువులకంటే ఒక సరస్సు మేలు !*

*నూరు సరస్సులకంటే ఒక కొడుకు మేలు !*

*నూరుగురు కొడుకులకంటే ఒక ‘చెట్టు’ మేలు !*

            *-మత్స్య పురాణం.*


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఆగష్టు,19, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🕉️ *సోమవారం*🕉️

 🌹 *ఆగష్టు,19, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి: పౌర్ణమి* రా 11.55 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : శ్రవణం* ఉ 08.10 *ధనిష్ఠ* రా 05.45 తె వరకు


*యోగం  : శోభన* రా 12.47 వరకు ఉపరి *అతిగండ*

*కరణం : భద్ర* మ 01.32 *బవ* రా 11.55 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 11.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*రా 08.24 - 09.50*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*


*వర్జ్యం : ప 11.46 - 01.12*

*దుర్ముహుర్తం  :మ 12.36 - 01.27 & 03.08 - 03.58*

*రాహు కాలం : ఉ 07.27 - 09.01*

గుళిక కాలం     :*మ 01.45 - 03.20*

యమ గండం   : *ఉ 10.36 - 12.11*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *మకరం/కుంభం* 

సూర్యోదయం :*ఉ 05.52* 

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల  :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం  :  *ఉ 05.52 - 08.24*

సంగవ కాలం  :*08.24 - 10.55*

మధ్యాహ్న కాలం:*10.55 - 01.27*

అపరాహ్న కాలం :*మ 01.27 - 03.58*

*ఆబ్ధికం తిధి       : శ్రావణ పౌర్ణమి*

సాయంకాలం :  *సా 03.58 - 06.30*

ప్రదోష కాలం  :  *సా 06.30 - 08.47*

నిశీధి కాలం    :*రా 11.48 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.07*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్🕉️*


శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !

శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !

శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !

శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II 


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

రక్షా బంధన్

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*


రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి)*


*రాఖీ కట్టేటప్పడు చదవాల్సిన శ్లోకం..* 


*"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః* 

*తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"* 


*అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని.. అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు.*


*హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా అద్దం పట్టే పండుగ  రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది.*


*రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు.*

దేవాలయాలు - పూజలు 15*

 *దేవాలయాలు - పూజలు 15*


సభ్యులకు నమస్కారములు.


సాధారణంగా హైందవ దేవాలయాలలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు సమయాలలో అనగా

 ప్రాతఃసంధ్య మరియు సాయం సంధ్యలలో పూజలు నిర్వహింప బడుతాయి. 

కొన్ని దేవాలయాలలో తెల్లవారు జామునుండి 

రాత్రి వరకు నిరంతర  పూజలు నిర్వహింపబడుతూనే ఉంటాయి. 

*గ్రహణ సమయాలలో మాత్రం శాస్త్ర నిబంధనల మేరకు దేవాలయాలు మూసివేయబడి ఉంటాయి*.


దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మన దారిలో దేవాలయములు ఉన్నప్పుడు *శిఖర దర్శనం* తప్పకుండా చేసుకోవాలి. *శిఖర దర్శనం  "చింత నాశనం" /  "శిఖర దర్శనం పాప నాశనం"* అనునది పెద్దల మాట. ఆలయ శిఖరం  అల్లంత దూరాన ఉన్నా  సరే, దర్శనం కాగానే  ఒకసారి *అంజలి ఘటించి దైవ స్మరణ* చేయాలి. 


ధ్వజ స్థంభం ఉన్న దేవాలయాలలో 

 *భక్తుల ఆత్మ ప్రదక్షిణ* శాస్త్రీయం *కాదు, కూడదు*. విష్ణాలయాలు మరియు విష్ణు దేవతా సంబంధమైన ఆలయాలలో  ప్రధాన మూర్తికి *అభిముఖంగా  గరుడ   స్వామి వారు  గాని, శ్రీ చక్రాలు, శివాలయాలలో స్వామి వారికి అభిముఖంగా నందీశ్వర స్వామి వారు గాని ఉంటే* మూల మూర్తికి *సాష్టాంగ నమస్కారములు కూడవు*.


ధ్వజ స్థంభం *వద్దనే* సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం..


భక్తి అనేది ఒక పవిత్ర భావన. ఇంకా చెప్పాలంటే *పవిత్ర ఆచరణ సహిత పవిత్ర భావన*. *భక్తి నవ విధములని* చెప్పబడింది. దేవాలయాల విషయం   వచ్చినప్పుడు  *దర్శనం* అని ప్రక్రియను జత చేసి *భక్తి దశ విధములు అని అందాము*.

వివరంగా ...

1) దర్శనం 

2) శ్రవణం 

3) కీర్తనం

 4) స్మరణం 

5) సేవనం 

6)  అర్చనం 

7) వందనం 

8) దాస్యం 

9) సఖ్యం 

10 )నివేదనం. 


ప్రహ్లాద చరిత్ర ఘట్టంలోని  ప్రామాణిక శ్లోకం జ్ఞప్తికి తెచ్చుకుందాము.

*శ్లోకం!!  శ్రవణం కీర్తనం విష్ణో:* *స్మరణం పాద సేవనం, అర్చక వందనం దాస్యం, సఖ్య మాత్మనివేదనం*


భక్తులు క్రమం తప్పకుండా పాటించాల్సిన *కనీస* నియమాలు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో దేవాలయ ప్రవేశం గావించాలి. భక్తులు సంప్రదాయ 

*తిలక, భస్మ ధారణ* *వస్త్రధారణ*... మరువరాదు. పురుషులు పంచె ,  ధోవతి, పై కండువా లేదా ఆ ప్రాంతపు సామాజిక,  సంప్రదాయ వస్త్ర ధారణ. ఏదైనా ఎబ్బెట్టుగా ఉండకుండా గౌరవం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండాలి. మహిళలు మరియు బాలికలు వారి వారి మంగళకరమైన చీర, పరికిణి, ఓణీలతోనే వస్తారు, రావాలి కూడా,.... ఇతర ప్రాంతాల వారు తమ ఆచార వ్యవహారాలననుసరించి మంగళకరంగా రావాలి. *మహిళలు, బాలికలు జుట్టు విరబోసుకుని దేవాలయ సందర్శన చేయరాదు*. అన్ని దేవాలయాలలో మహిళలు పువ్వులు అలంకరించుకొనవచ్చును గాని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పువ్వుల ధారణ నిషిద్ధము.


*గమనిక*

*దేవాలయ అర్చక స్వాములు, దేవాలయ యాజమాన్యము మరియు దేవాలయాల సంప్రదాయాల పరిరక్షణ చేస్తూ ఉండాలి,  అవసరమైన పరిశుభ్రతా సంబంధమైన సేవలు తప్పకుండా చేయడం....నియమాలు పాటించుటకు భక్తులను ఉత్తేజపర్చాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*

సంస్కృత భాషా దినోత్స‌వం

 _*ఈ రోజు సంస్కృత భాషా దినోత్స‌వం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శ్రావ‌ణ పూర్ణిమ రోజు ప్ర‌పంచ‌ సంస్కృత భాషా దినోత్స‌వం*


ప్ర‌తి ఏడాది ప్ర‌పంచ‌ సంస్కృత భాషాదినోత్స‌వాన్ని భార‌త క్యాలెండ‌ర్ ప్ర‌కారం శ్రావ‌ణ పూర్ణిమ నాడు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.


మ‌రుగ‌న‌ప‌డి ఉన్న సంస్కృత భాష వైభ‌వాన్ని పున‌రుద్ధ‌రించేలా చేయ‌డం , ఆ భాష ప్రాధాన్య‌త గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ముఖ్యోద్దేశంగా ఈ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు.


భారత దేశంలో గల ప్రాచీన భాషలలో అతి పురాతనమైన భాష సంస్కృతం. *'జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల'-* అన్ని ప్రధాన భాషలకూ సంస్కృతమే తల్లి వంటిదని మన పెద్దలు వక్కాణించి చెప్పినమాట. సంస్కృతం అంటే ఒక చోట చేర్చబడినది , బాగా సంస్కరించబడినది , ఎలాంటి లోపాలూ లేనిది , అనంతంగా విస్తరింపబడినది అని అర్థం. దీనికి *దేవభాష , అమరభాష* అని మరి రెండు పేర్లు కూడా ఉన్నాయి. మన ప్రాచీన సాహిత్యమంతా ఈ భాషలోనే నిక్షిప్తమై ఉంది. ఈ భాషకు వాడే లిపిని దేవనాగరలిపి అని , బ్రాహ్మీలిపి అని అంటారు. ఇది ఇండో ఆర్యన్‌భాషా కుటుంబానికి చెందినది అని అంటారు పెద్దలు. దక్షిణాసియా , తూర్పుఆసియా , ఆగ్నేయాసియాలపై సంస్కృతం వెదజల్లిన సంస్కృతీ ప్రభావం బలంగా కనబడుతుంది. భారతీయ భాషలన్నిటి పైనా , నేపాల్‌ భాషపైనా దీని ప్రభావం విశేషంగా ఉంది. అందుకే సంస్కృతం ఇండో ఇరానియన్‌ భాషాకుటుంబానికి చెందినది అని అంటారు. ఇండో ఇరానియన్‌ భాషలకు ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం పుట్టిల్లు. కనుక ఇండోఇరానియన్‌ భాషలను ఇండో యూరోపియన్‌ ఉపభాషా కుటుంబాలుగా లెక్కిస్తారు కనుక సంస్కృతాన్ని ఇండోయూరోపియన్‌ భాషా కుటుంబానికి దగ్గర సంబంధాలున్న భాషగా చెబుతారు. ప్రాచీన పెర్షియన్‌ , అఫ్గనిస్థాన్‌ భాషలకు కూడా సంస్కృతానికి బాగా దగ్గ‌రి పోలికలుంటాయని భాషావేత్తలు చెబుతారు. సంస్కృత పదధ్వనులు మరీముఖ్యంగా స్లావిక్‌ , బాల్టిక్‌భాషలకు , గ్రీక్‌భాషకు ఎంతో దగ్గరి పోలికలుంటాయని అంటారు. సంస్కృతాక్షరాలు లాటిన్‌ అక్షరాలకు చాలా సన్నిహితంగా ఉంటాయని కూడా వారు చెబుతుంటారు. హిందూ మతానికి చెందిన సమస్త వాఙ్మయం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధమత గ్రంథాలు కూడా దాదాపు సంస్కృతంలోనే కనబడతాయి. అతి పురాతన సంస్కృత భాషా సాహిత్యానికి మూలరూపం రుగ్వేదంలో కనబడుతుంది. ఇది క్రీ.పూ. 1500 సంవత్సరానికి చెందినది. ఇది ఉమ్మడి పంజాబ్‌ ప్రాంతంలో లభ్యమైంది. ఈ గ్రేటర్‌ పంజాబ్‌ దేశ విభజనకు ముందున్న పంజాబ్‌ అన్నమాట. ఇది ఆఫ్ఘనిస్థాన్‌కు దాదాపు సరిహద్దు ప్రాంతంలాంటిది. సంస్కృతం అందించిన వేదాల వల్లే అతిపురాతన కాలానికి వేదకాలమనే పేరు వచ్చింది. క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన పాణిని అష్టాధ్యాయి పేర 8 అధ్యాయాలతో సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. ఈయన వ్యాకరణం రాసేలోపు సామవేదం , యజుర్వేదం , అధర్వణవేదం , బ్రాహ్మణాలు , ఉపనిషత్తులు పుట్టాయి. వేదకాలం నాటికి పుస్తక రచన అనేది లేదు. అందువల్ల వేదాలను యథాతథంగా బట్టీయం వేయడం ద్వారా కాపాడుకున్నారు అప్పటివారు. ఇందువల్ల వాటి ఉచ్ఛారణతో సహా సాహిత్యం మనకు అందివచ్చింది. సంస్కృత భాష ద్వారా భారతీయులకే సొంతమనదగిన వేదాలు , వేదాంతాలు , వేదాంగాలు , సూత్రాలు , పురాణాలు , ఇతిహాసాలు , ధర్మశాస్త్రాలు , శాస్త్ర సాంకేతిక విషయాలు , తాత్విక అంశాలు , మత , ధార్మిక , ఆధ్యాత్మిక విషయాలు , మంత్రాలు , తంత్రాలు , నాటకాలు ఎన్నో సమాజానికి అందివచ్చాయి. కనుక వీటినిబట్టి సంస్కృత భాష పుట్టుకను అంచనావేయాల్సివస్తే అది కనీసం క్రీ.పూ. 1500 నాటిదని నిర్థారణగా చెప్పవచ్చు.


వేదవాఙ్మయం తరువాత సంస్కృత భాషలో వచ్చిన మార్పులకు అద్దం పట్టేవి ఉపనిషత్తులు. భారతీయపురాణాలైన రామాయణ , మహాభారతాలలో కనిపించే భాష మరింతగా మార్పుచెందింది. పురాణాలలో కనిపించే భాషలో ప్రాకృత శబ్దాల ప్రభావం కలిగిన సంస్కృతం కనబడుతుంది. పాణిని వ్యాకరణం వచ్చిన తరువాత సంభవించిన మార్పులు వీటిలో ప్రస్ఫుటంగా కనబడతాయి. సంస్కరించబడిన భాష నుంచి పక్కకు తప్పుకున్న భాషా పదాలు ప్రాకృత పదాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ పదాల వాడకం రామాయణ , మహాభారతాలలో బాగా కనబడతాయి. సహజత్వం చెడని సంస్కృత భాషను ఆర్షభాషగా వింగడించడం అప్పుడే ప్రారంభమైంది. సంస్కృతంలోనూ మాండలికాలు ఉన్నాయి. పశ్చిమోత్తరి , మధ్యదేశి , పూర్వి , దక్షి మాండలికాలుగా వాటిని విభజించారు. వీటిలోనూ పశ్చిమోత్తరి మాండలికంలో సంస్కృతం స్వచ్ఛతను ఎక్కువగా నిలబెట్టుకుందని చెబుతారు. ఒకనాడు దేశమంతటా మారుమోగిన భాష సంస్కృతం. వేదాలలోనే కాదు , జన వ్యవహారంలోనూ బాగా వినియోగంలో గల భాష సంస్కృతం. వాల్మీకి , వ్యాసుడు , భాసుడు , బాణుడు , భారవి , భామహుడు , మాఘుడు , శ్రీహర్షుడు , శూద్రకుడు , అశ్వఘోషుడు , హాలుడు , కాళిదాసు వంటి వారు తమ రచనలతో సంస్కృతభాషను సుసంపన్నం చేశారు.


సంస్కృతమే లేకపోతే మనం ఈనాడు సగర్వంగా చెప్పుకునే రామాయణం , భారతం , భాగవతం , రఘువంశం , అభిజ్ఞానశాకుంతలం , మేఘసందేశం , కుమారసంభవం , మృచ్ఛకటికం , కిరాతార్జునీయం , నాగానందం , హర్షనైషథం , విక్రమార్కచరిత్ర , శుకసప్తశతి , గాధాసప్తశతి , ప్రతాపరుద్రీయం , చరకసంహిత , పంచతంత్రకథలు , హితోపదేశ కథలు , కథాసరిత్సాగరం , కౌటిల్యుని అర్థనీతి , భర్తృహరి సుభాషితాలు , ఏవీ మనకు అందివచ్చేవికావు. అలాగే విష్ణుసహస్రనామాలు , లలితా సహస్రనామాలు , దేవీ స్త్రోత్రాలు , ఆదిశంకరుని భజగోవిందం , జయదేవుని గీతగోవిందం , సౌందర్యలహరి , శివానందలహరి , బ్రహ్మసూత్రాలు , నారదభక్తిసూత్రాల వాత్సాయనుని కామసూత్రాల వంటివెన్నో మనకు లేకుండా పోయేవి. ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి లేకుండా పోయేది. మన రాజనీతి , అర్థనీతి , సమాజనీతి అంతా సంస్కృతం వల్లే మనదాకా వచ్చాయి. ఆది దేవుళ్ళేకాదు , ఆదిమ మానవుల చరితలు సైతం సంస్కృతం తెలియకుంటే తెలిసే అవకాశమేలేదు.


*పుస్త‌కాల‌కే ప‌రిమిత‌మైన మృతభాష:*


ఆ తరువాతి కాలంలో సంస్కృతం పుస్తకాలకే పరిమితమై వ్యవహారంలో లేకుండా పోయింది. లౌకికభాషగా మిగలలేదు కనుక దాన్ని కొందరు మృతభాషగా పరిగణించారు. సంస్కృతం జీవద్భాష అని ఘనంగా వాదించే వారెలా ఉన్నారో మృతభాష అని ఘంటాపథంగా వాదించేవారూ అంత గట్టిగానే ఉన్నారు. పరమ ప్రాచీనమైన భాషగా పేరొందిన లాటిన్‌లాగే సంస్కృతం కూడా వాడేవాడు లేక చచ్చిపోతోందని పోలక్‌ అనే భాషావేత్త వ్యాఖ్యానించాడు. రాజభాషగా ఒక వెలుగు వెలిగిన సంస్కృతం క్రమంగా పోషకులులేక , వాడకందారులులేక క్షీణించిపోవడం ప్రారంభించింది. భూమిపొరలలో శిలాజాలు ఉన్నట్టే ఇతర భాషలలో సంస్కృత భాషావశేషాలు మిగిలి ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 100కోట్ల పైచిలుకు ఉంటే అందులో 14,135 మంది మాత్రమే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడేవారున్నారంటే సంస్కృతభాష వ్యవహారంలో ఎంతగా లుప్తమైపోతోందో అర్థం చేసుకోవచ్చు.


*సంస్కృత భాష ప్రాధాన్య‌త‌:*


ఆంగ్లేయ విద్యావిధానం వల్ల సంస్కృతానికి తీరని హాని జరిగింది. ఈ విద్యావిధానంలో మన ప్రాచీన విజ్ఞానానికి సరైన ఆలంబన లభించట్లేదు. ఉదాహరణకు పిల్లలకు నైతిక విలువలను నేర్పటానికి ఇతిహాసాలను మించినవి లేవనే విషయాన్ని అందరూ అంగీకస్తున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని ముందుకు నడపటానికి భగవద్గీతకు మించిన గ్రంథం వేరే ఉంటుందా ?  వీటికి సంబంధించిన అంశాలేవీ ఇప్పటి దాకా మన విద్యావిధానంలో భాగం కాదు. సంస్కృతాన్ని పాఠశాలల్లో పిల్లలకు నేర్పాలి. దీనివల్ల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మన శరీరంలో ఉన్న 72వేల నాడులు చక్కగా పనిచేస్తాయి. సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

                   స్వస్తి!🙏🙏🙏


*నేడు సంస్కృతభాషాదినోత్సవము*


ఉ॥

సంస్కృతభాషయే భరతజాతికి మూలము నాటపట్టుయున్ 

సంస్కృతభాషయే భరత సంస్కృతి కంతటి కాలవాలమున్ 

సంస్కృతభాష లేని యెడ సత్కృతి సంస్కృతి లేవులేవెటన్ 

సంస్కృతభాషయే యఖిల సంస్కృతి కభ్యుదయమ్ము నిచ్చెడిన్ 


మత్తకోకిల:

వేదవాఙ్మయరాశి కంతయు వేదికయ్యెను సంస్కృత

మ్మాది నుండియు జీవభాషగ నైకమత్యత నింపెడిన్ 

కాదు వద్దని సంస్కృతమ్మును కాలదన్నిన నందఱున్ 

బూదిగొట్టుకపోవుటన్నది మూడుమూర్తుల సత్యమౌ 


మత్తకోకిల:

భారతావని మాటలాడెడి భాషలన్నిటి నందునన్ 

భూరిపాత్రత గల్గి యున్నది పూతసంస్కృతభాషయే 

తేరి జూడగ విశ్వభాషల తీరి యున్నది సంస్కృత 

మ్మారితేరెను విశ్వసంస్కృతి యార్షవాఙ్మయ విద్యలన్ 

*~శ్రీశర్మద*

రక్షాబంధన

 *రక్షాబంధన శుభాకాంక్షలతో...*


ఉ॥

అన్నకు చెల్లి రక్షగట్టు మరి యా భగినిం దను రక్షసేయగా 

నన్నయె రక్షయై నిలచు నన్నిట దానుగ జన్మమంతటన్ 

బన్నములందు నాదుకొన పాడిని దప్పక గాచుటందునన్ 

క్రొన్ననదాల్చె డీరమటు కోటి ముదమ్ములు బూయ నిత్యమై 

సీ॥

కష్టసుఖములందు గాచుకొనెడు స్ఫూర్తి 

ప్రేమ బంచుకొనెడు ప్రియగుణమ్ము 

నార్థికాంశములందు నాదుకొనెడు నీతి 

యండదండల నొసగు నతుల చిత్త 

మమ్మనాన్నల యందు కమ్మని భక్తియున్ 

బాధ్యత మరువని భావజాల 

మిహపరచింతనా సహజాతగుణములు 

తోడునీడగనుండు దూరదృష్టి 

గీ॥

చేతిలో చెయ్యి పెనవేసి చేదువిధము 

లన్న చెల్లెళ్ళ యనుబంధ మెన్నదగునె 

రక్షగట్టెడు పున్నమి శ్రావణాన 

చూచు వారలె ధన్యులు సుమ్ము ధరణి 

*~శ్రీశర్మద*

అనర్ఘరత్నం

 !


శ్రీకృష్ణా!యదుభూషణా!నరసఖా

శృంగార రత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా,!లోకేశ్వరా!దేవతా

నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా!!నిర్వాణ సంధాయకా!

నీకున్మ్రొక్కెద, ద్రుంపవే భవలతల్,నిత్యాను కంపానిధీ!!

భావం:-

      కృష్ణుని అంతర్బహిస్స్వరూపాలను ఆవిష్కృతం చేసిన ఈపద్యం అనర్ఘరత్నం.

        యాదవకులానికి భూషణాయమానుడట కృష్ణయ్య!నిజమే ద్వాపరంలో యదుకులానికి ఇంచుక గౌరవహీనతకలదు.కృష్ణయ్య జననంతో ఆకులానికి గూడా మాన్యతలభించింది.అందుచేత యదుకులానికి భూషణుడే!

     నరుడు -అర్జనుడు.నారాయణుడు కృష్ణుడు. అర్జనునకుప్రియసఖుడు.భారతకథను తడవితే ప్రతిసందర్భంలోను ఆమాట నిజమని తేలుతుంది.

       16,108 మంది భామలతో రాసక్రీడలాడిన కృష్ణయ్య శృంగారంలో రత్నాకరుడే!సందేహంలేదు.

   లోకద్రోహులైన రాజన్యుల వంశములను గహించినవాడే!(ఇటవంశశబ్దమున శ్లేష, వంశము కులము,తెగ, వంశము-వెదురు) ఎండినవెదురిపొదలను గహించినట్లు ప్రజాకంచకులను నిర్వెశ్యులనొనరించినాడన్నమాట!

      చివరి విశేషణం.నిర్వాణసంధాయకా! ముక్తిప్రదాత! అదే అవతారస్వరూపము.కేవలము నరావతారమున గాన్పించు నారాయణుడే!

        ఇట్లీపద్యము సార్ధక విశేషణములతో నిండి.శ్రీకృష్ణుడు అవతారస్వరూపుడని నిరూపించు చున్నది .

     సాభిప్రాయ విశేషణ సంయుతమౌట నీపద్యమున,

 "పరికరాంకురాలంకారము"-గలదు.👏

విష్ణుపాదుని దివ్యకథ

 విష్ణుపాదుని దివ్యకథ

గోవింద అంటే స్తుతింపబడినవాడు అని అర్ధం. ఈ సృష్టి మొత్తంలో శ్రీమన్నారాయణుల వారికంటే స్తుతించదగినవాడు ఎవరుంటారు. అందుకే సమస్త ప్రాణికోటి నిత్యం ఆ స్వామినే కీర్తిస్తుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఆ పరబ్రహ్మమూర్తిని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులని, దివ్యభోగ భాగ్యాలను వివరిస్తున్నాయి.

తిరుమల కొండలలో ఈ గోవిందనామమే నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి గోవిందనామ స్మరణతో ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి.

పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనందనిలయంలో ఉన్న హుండీ ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది. అది ఎటూ కదలక భక్తులను చూస్తూ అక్కడే ఉంది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించుకుని అటు తరువాత ప్రక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు. అలా ప్రతిభక్తుడు ఒక్క క్షణం చిలుకవద్దనే నిల్చుని ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నాడు. ఆ చిలుకకు ఒకే కన్ను ఉండటం భక్తులలో కొందరు గమనించారు. రెండవ వైపు కన్ను మూసుకునే ఉన్నది. ఆ ఒంటికన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు నెమ్మదిగా దానిని నిమరగా బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకుని ప్రతి భక్తుడు అదే పని చేయసాగాడు. 

ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఈ చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది భక్తులు దానిని ముట్టుకుంటున్నా అది అసలు ఎటూ ఎగరటం లేదు ఎందుకని. వారెవరికి అర్ధం కాలేదు.

అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుక మాత్రం అక్కడనుండి కదలలేదు. రాత్రి చీకటి పడిన తరువాత బహుశా ఏ పండో తినడానికి ఎగిరి వెళుతోంది. తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడకే వచ్చి అదేచోట నిలుస్తోంది.

ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్ధమై ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ గలవాడని అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు చెప్పుకున్నారు. ఇది విన్న అర్చకులు ఆలయంలోని చిలుక గురించి చెప్పారు.

అప్పుడు ఆ సాధువు స్వామిని దర్శించుకొన్న తరువాత హుండీ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు. వెంటనే ఆ చిలుక రెండవ కన్ను తెరుచు కున్నది...

అప్పుడు ఆ చిలుక ఆ సాధువుతో ఇలా అన్నది. స్వామీ! తమరు మహానుభావులలాగా ఉన్నారు. నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెప్తాను వినండి.

కిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాపకార్యాలు చేయడం వలన ఈ జన్మలో ఇలా పక్షిరూపం ధరించాను. అది కూడా పుట్టు గుడ్డిగా జన్మించాను. కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై, ఈ చెట్టుపై వాలుతూ దొరికిన ఫలాలను తింటూ కాలం గడిపాను. అలా ఎక్కడెక్కడో ఎగురుతూ ఈ కొండపైకి చేరాను. వారం రోజులక్రితం ఈ ఆలయసమీపంలోనికి వచ్చాను.

ఇది ఆలయం అని నాకు తెలియదు. ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను. అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యివేసి నెమ్మదిగా నిమిరి వెళ్లిపోయాడు. అంతే! క్షణంలో నాకు ఆ భక్తుడు నిమిరినవైపు కంటిచూపు వచ్చింది. నేనున్న ప్రదేశం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుని ఆలయంగా గ్రహించాను. నన్ను ఆవిధంగా నిమిరిన ఆ భక్తుడు ఏ అహంకారం లేక స్వామినే సర్వంగా భావించి, ఆరాధించేవాడు. సర్వకాల సర్వావస్థలయందు ఆ స్వామినే స్మరిస్తూ ఏపని చేసినా అది శ్రీ వేంకటేశ్వర ప్రీత్యర్థంగా భావించి చేసేవాడు. 

రోజూ ఉదయాన లేవగానే, తిరిగి రాత్రి పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలనే స్మరించేవాడు. ఎవ్వరినీ తరచు మాటలతో నిందింపడు. ఎటువంటి చెడు ఆలోచనలూ చేయదు. దేనికీ తొణకడు. అంతటి అసమాన్య భక్తుని స్పర్శ తగలడంతో నాకు కంటిచూపు వచ్చింది. నా రెండవ వైపు కూడా నిమిరితే రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనికై చూశాను. కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది.

ఆ చిలుక ఆ సాధువుతో ఇంకా ఇలా చెప్పసాగింది. 'ఈ ఆలయంలో

రోజూ ఎందరో భక్తులు స్వామి దర్శనార్ధమై రావటం గమనిస్తున్నాను. _ వీరిలో

ఒక్కరైనా అంతటి పుణ్యాత్ములు ఉండకపోతారా అని చూస్తున్నాను. అందువలననే

ఎటూ ఎగరకుండా రోజంతా ఇక్కదే ఉంటున్నాను. అంతటి నిస్వార్థ భక్తుడికోసం

వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో వేలమంది ఇప్పటిదాకా నన్ను

స్పృశించి వెళ్లారు. కానీ నా రెండవకంటి చూపు రాలేదు. ఇంకా ఎన్నాళ్ళిలా

వేచి ఉండాలా, ఎప్పటికి అంతటి భక్తుడు వస్తాడా అని అనుకుంటున్నాను ...ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు... అని

అన్నది. ఆ చిలుక చెప్పినదంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న అర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు.

తిరుమల వచ్చేవారిలో చాలామంది విహారానికి వచ్చినట్లు వస్తారు. వచ్చినవారిలో కూడా చాలామంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టరు. రెండుసార్లు దర్శించుకున్నానని, మూడు సార్లు దర్శించుకున్నానని గొప్పలుగాచెప్తారు. తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు. 

ఆ స్వామికి కావలసింది అచంచలభక్తి. _ అంతేకానీ, హంగు, ఆర్భాటాలు కావు. ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్నవదనంతో ఉంటూ తోటివారిలో ఆ స్వామినే చూస్తూ గడుపుతారు. వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమౌతాడు.

ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో వారి బాధ్యత తానే వహిస్తానంటాడు ఆ స్వామి. కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనే మూడుగా ఉంటాయి. శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే మనం పూర్వజన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబదడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూదిపింజలకంటే తేలికగా ఉందేలా అనుగ్రహిస్తాడు. 

అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర, ప్రారబ్ధ కర్మఫలాలను కూదా దివ్య సుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ అమృతమూర్తి ఒక్కడే. ఓ శ్రీ వేంకటేశ్వరా! నీవేమా కల్పతరువు, నీవే మా ఆప్తుడవు, నీవే మా సర్వస్వమూ. .నీకివే మా నమస్కారములు. ఓ జగన్నాథా! నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షకా నీకివే మా నమస్కారములు.

శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్‌

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు...

దొంగతనం

 దొంగతనం 


మనయూరిలోనో మన కాలనీలోనో ఎక్కడో ఎవరింట్లోనో దొంగతనం జరిగింది అని తెలిసిన వెంటనే మనం జాగరూకులవటం సర్వ సాధారణం వెంటనే మన ఇంటి గడియలను సరి చేసుకుంటాము, ఇనపపెట్టె సరిగా ఉన్నదా లేదా అని చూసుకుంటాము. మనం తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము.  నిజానికి ఒకసారి ఒక ఇంట్లో దొంగతనం చేసిన వాడు వెంటనే ఆ సమీపంలోని ఇంకో  ఇంట్లో దొంగతనం చేయడు, కొంతకాలం అందరు మరచిన తరువాత తిరిగి తన పని మొదలు పెడతాడు.  కానీ మనం మాత్రం వెంటనే స్పందించి మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎక్కడికైనా వీళ్ళవలసి వస్తే మన పెట్టెలో వున్నవిలువైన వస్తువులను బ్యాంకు లాకరులో ఉంచి వెళ్ళటం కద్దు. 


బౌతికంగా జరిగే దొంగతనాలను మనం మన జాగ్రత్తలతో కొంతవరకు ఆపగలుగుతున్నాము.  కానీ ఇంకొక దొంగ అనాదిగా అందరి ఇళ్లలో పడి మనుషులను ఎత్తుకొని పోతున్నాడు. మనం నిత్యం మనుషులను మోసుకొని పోవటం చూస్తున్న అయ్యో పాపం అని వూరుకుంటున్నాం కానీ ఆదొంగ నా  ఇంటికి వస్తాడని నన్ను కూడా ఎత్తుకొని పోతాడని మాత్రం మనం తలవం. ఇంట్లో పడిన దొంగమీద పొలిసు స్టేషనులో ఫిరియాదు చేస్తాము వాడిని కోర్టులు విచారించి శిక్షిస్తాయి. కానీ ఈ రెండో రకం దొంగ మీద ఎలాంటి ఫిరియాదులు లేవు, చేయలేరు వాడిమీద ఫిరియాదుచేస్తే పోలీసులు తీసుకోరు, కోర్టులు వాడిని దండించవు. ఎందుకంటె ఈ దొంగ మన లోకపు వాడు కాదు వాడు వేరే లోకం వాడు అంటే యమలోకం వాడు.   కానీ ఒక్కటిమాత్రము నిజం వాడు ప్రతి వాని జీవితంలో ఆఖరుకి వస్తాడు. ప్రతి మనిషిని తీసుకొని  పోతాడు. వాడికి స్త్రీ పురుష భేదం లేదు చిన్న పెద్ద విచక్షణ లేదు. వాడు నిర్దయుడు. మరి ఈ దొంగనుంచి మనలను మనం కాపాడుకోవటం ఎలా, ఎలా అని మన మహర్షులు అనాదిగా ఎంతో కాలం ప్రయత్నించి మనకు ఒక చక్కని ఉపాయం చెప్పారు అదేమిటో యిప్పుడు చూద్దాం. 


మనం  పెట్టెలో ద్రవ్యాన్ని వుంచామనుకోండి ఆ పెట్టెని దొంగ ఎత్తుకొని పొతే పెట్టెతోపాటు ఆ ద్రవ్యం కూడా పోతుంది కాబట్టి తెలివయిన వాడు పెట్టెని ఇంట్లో భద్రంగా ఉంచి తాళం వేసి అందులోని విలువైన ద్రవ్యాన్ని మాత్రం బ్యాంకు లాకరులో ఉంచుతాడు దొంగ పెట్టెని తస్కరించినా ద్రవ్యం మాత్రం మనదగ్గరే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచనే మన ఋషులు చేశారు పెట్టెలోని ద్రవ్యాన్ని (ఆత్మను) బ్యాంక్ లాకరులో (ఈశ్వరుని సన్నిధిలో) ఉంచితే దొంగ పెట్టెని (దేహాన్ని) ఎత్తుకొని పోయిన ద్రవ్యం (ఆత్మ ) పరమేశ్వరుని సన్నిధిలో క్షేమంగా ఉంటుంది (మోక్షప్రాప్తి) కానీ ఇది చెప్పినంత సులువు కాదు సాధించటం మరి ఎలా సాధ్యం. (ఇక్కడ దేహం పెట్టెతో దేహి ద్రవ్యంగా పోల్చి చెప్పటం జరిగింది) . 


రోజులో కేవలం 24 గంటలు ఈశ్వర సన్నిధిలో ఉంటే మాత్రమే అది సాధ్యం..  నీకేమైనా పిచ్చి పట్టిందా రోజుకు ఉండేది కేవలం 24 గంటలు మాత్రమే కదా ఆ 24 గంటలు ఈశ్వరుని సన్నిధిలో ఎలా ఉంటాము అది పూర్తిగా అసాధ్యం అని మీరు  అనవచ్చు. కానీ మనసుపెట్టి పనిచేస్తే అది పూర్తిగా సాధ్యం. ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను రోజు నా నిత్యవృత్తులకోసం పనిచేయాలి అలాంటప్పుడు ఎల్లప్పుడు ఈశ్వర సాన్నిధ్యంలో ఉండటం ఏల కుదురుతుంది.  దీనికి మన జ్ఞ్యానులు ఇలా చెప్పారు మీరు ఉషోదయ కాలంలోనే నిద్ర లేవండి.  మీ కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వెంటనే సంకల్పం చేయండి యేమని అంటే ఈ రోజు నేను తీసుకునే శ్వాస (ఉచ్వాస నిశ్వాస) రెండు కూడా ఈశ్వర జపంగా అనుకుంటూ చేస్తాను.  (ఈ జపాన్ని అజపాజపం అంటారు) మరుసటి రోజు అదే సమయానికి నిన్న చేసిన అజపాజపమును ఈశ్వరార్పణ గావించాలి తిరిగి మరుసటి రోజుకి అజపాజపానికి సంకల్పం చేయాలి.  ఇలా చేస్తే ఒక రోజు నీవు తీసుకున్న ఉచ్వాస నిశ్వాసలు ఈశ్వర జపంగా మారి ఈశ్వరార్పణం చెందుతాయి.  చూసారా మీరు ఏరకంగా జపంచేయకుండా జప ఫలితాన్ని పొందారు. అంటే మీరు రోజులోని 24 గంటలు ఈశ్వర జపం చేశారన్నమాట. 


ఇక జీవన వ్యాపారాల గూర్చి తెలుసుకుందాము. మనం నిత్యం అనేక జీవన వ్యాపారాలు అంటే పనులు చేస్తుంటాము అంటే మన ఇంద్రియాలతో అనేక వ్యాపారాలు (వృత్తులు అంటే పనులు) చేస్తుంటాము. చూస్తుంటాము, వింటుంటాము, మాట్లాడుతుంటాము, తింటుంటాము తాగుతుంటాము ఇలా అనేకానేక పనులు చేస్తుంటాము మరి అవి అన్నీకూడా ఈశ్వరపరంగా మనం చేయము కదా మరి వాటి సంగతి యెట్లా?. ఉషోదయకాలంలో ఒక సంకల్పం చేయాలి అదేమిటంటే ఈ రోజు నేను చూసేది పూర్తిగా భగవత్ రూపాన్నే, వినేది ఈశ్వర వాణినే,  మాట్లాడేది ఈశ్వర పరమైనదే నేను తినే తిండి తాగే నీరు కేవలం ఈశ్వర తీర్ధ ప్రసాదాలు మాత్రమే నేను స్నానం చేస్తున్నాను అంటే ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నాను అని, నేను మల, మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే ఈశ్వరుని మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని నేను నిద్రిస్తున్నాను అంటే ఈశ్వరుడు నిద్రిస్తున్నాడు అని, నాకు ఎవరిదగ్గరినుండి ఐనా ద్రవ్యం వచ్చిందంటే అది ఈశ్వరుడు  ప్రసాదించింది. నాకు కలిగే సుఖము, దుఃఖము కేవలము అది ఈశ్వరుని అనుగ్రహంగా భవిస్తూ జీవితాన్ని  గడపాలి. రోజులో ఒక్క క్షణం కూడా ఇది నేను, ఇది నాకు అనే భావన మనసులోకి రానియ్యకూడదు. ఇలా చేసినవాడు నిత్య  ముక్తుడు అవుతాడు.ఇలా చేస్తే నీకుతెలియకుండానే నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆహార విహారాదులలో పూర్తిగా మార్పు వస్తుంది.  నీవు తినేది ప్రతిదీ ఆ ఈశ్వరుని ప్రసాదంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు ఈశ్వరుని ప్రసాదానికి అర్హమైన పదార్ధాన్ని మాత్రమే భుజిస్తావు అంటే పూర్తిగా సాత్విక ఆహారమే   తత్ ద్వారా నీకు తెలియకుండానే నీవు సాత్వికునిగా మారుతావు, నీవు చూసేది పూర్తిగా ఈశ్వర స్వరూపంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు ఏ మనిషి మీద లేక వస్తువు మీద మోహము కలుగదు.  ఉదాహరణకు నీకు ఒక అందమైన స్త్రీ కనపడినది అనుకో ఆమెను  నీ దృష్టిలో ఈశ్వరుని స్వరూపం భావిస్తావు అంటే ఆ తల్లి మీద నీకు కేవలము ఈశ్వరుని మీద కలిగే ప్రేమే ఉంటుంది తప్ప తత్ భిన్నంగా ఐహికమైన మొహం కలుగదు.  అంటే ఆ స్త్రీ సాక్షాతూ ఈశ్వరుడే.  నీ మనస్సు ప్రశాంతంగా పరి శుద్ధంగా ఉంటుంది.  అన్ని వస్తువులలోను, అందరిలోనూ నీకు కేవలం ఈశ్వరుడే కనపడతాడు.  నీవు ఎలాంటి పరిస్థితిలోను ఆవేశానికి, కోపానికి గురికావు నీ వదనం ప్రశాంతంగా ఉంటుంది.  నిన్ను పొగిడే వాడు నిన్ను దూషించే వాడు నీకు ఒకేవిధంగా కనపడతాడు.  ఎవరి పట్ల మమకారం కానీ ద్వేషం కానీ కలుగవు. నీకు తెలియకుండానే నీ జీవన సరళి మారుతుంది నీవు పూర్తిగా సాత్వికుడిగా మారతావు, తరువాత సుద్ధసత్వ గుణం కలిగి ఈశ్వర సన్నిదానాన్ని (మోక్షాన్ని) పొందుతావు.ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే సాధన మొదలిడు. 


గమనిక ఇది వ్రాసిన వాడు కూడా ఒక దొంగే వాడు ఇది చదివిన వాళ్ళను ఏమార్చి వాళ్ళ మనస్సులను దోచి ఈశ్వరుని పరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  తస్మాత్ జాగ్రత్త. 


ఓం తత్సత్

మోక్షం

 మోక్షం 


మన హిందూ ధర్మం ప్రతి మనిషి ఎందుకు జన్మించాడు అనే విషయన్ని కూలంకుషంగా పరిశీలించి ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏమి ఏమి చేయాలో పేర్కొనటం జరిగింది.  అదే పురుషార్ధంగా తెలిపారు అంటే పురుషుడు (ఇక్కడ పురుషుడు అంటే కేవలం పురుషులని కాదు అది మనుషుల అందరికి వర్తిస్తుంది) సాధించవలసిన విషయాలు అవి 1) ధర్మం,2) అర్ధం, 3) కామం, 4) మోక్షం 


1)  ధర్మం,: ప్రతి మనిషి తనకు నిర్ధేశించిన ధర్మాన్ని ఆచరించాలి.  కృష్ణ భగవానులు గీతలో నీ ధర్మం సరిగా అనుష్టానించదగినది కాక పోయిన ఇతరుల ధర్మం మేలైనది ఐయినా నీవు నీ ధర్మాన్ని ఆచరించాలి అని పేర్కొన్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।। 


గీత అధ్యాయం 3 శ్లోకం .35: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.అనగా ఉదా : ఒక వ్యాపారస్తుడు వున్నదనుకోండి అతను వ్యాపారమే చేయాలి అంతే కానీ చక్కగా వున్నదని ఇతరులకు నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తన బాధ్యతను తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించటం ఉత్తమం.  ఇతరుల బాధ్యతను స్వేకరించకూడదు. 


ఒక చిన్న కథతో ఈ విషయాన్ని విశదీకరిద్దాం ఒక చాకలి వానికి ఒక కుక్క మరియు గాడిద వున్నాయట.  ఆ రెంటిని  అతను వాని ఇంటి ముందు కట్టి వేసి ఉంచాడట.  ఒక రాత్రి వేళ చాకలి ఇంటికి ఒక దొంగ ప్రేవేశించాడట అది ఆ రెండు చూశాయి.  అప్పుడు గాడిద ఓ కుక్క మిత్రమా మన యజమాని ఇంటిలోనికి దొంగ ప్రవేశించాడుగా నీవు మిన్నకున్నావు ఎందుకు నీవు చూడలేదా అని అడిగింది.  దానికి కుక్క మన యజమాని నన్ను సరిగా చూసుకోవటం లేదు కావట్టి నేను మొరగను అని మొరాయించింది.  యజమానిమీద ప్రేమ వున్న గాడిద నీవు మొరగక పోతేనేమి నేను మన యజమానికి నష్టం జరిగితే నేను ఊరుకోను అని పెద్దగా అరవటం మొదలు పెట్టింది.  ఆ అరుపులకు నిద్రా భంగం అయిన ఆ చాకలి కోపంగా వచ్చి ఒక కర్రతో గాడిదను కొట్టాడు.  ఆ దెబ్బలకి గాడిద  చనిపోయింది. యజమానికి మేలు చేద్దామనుకున్న గాడిద తన చావు తానె కొనితెచ్చుకుంది.  అదే కుక్క మొరిగితే యజమాని జాగ్రత్త పడేవాడు తన సొమ్మును కాపాడుకునే వాడు.  కానీ గాడిద ప్రయతనం ఫలించక పోగా తన చావుకు తానే కారణం అయ్యింది.  ఈ కధ మనకు భగవానులు చెప్పిన శ్లోకానికి అద్దం పట్టినట్లు వుంది. 


2) అర్ధం: అనగా ధన సంపాదన చేయటం. ప్రతి మనిషి కూడా ధర్మంగా వుంటూ తనకు యోగ్యమైన దానినే పరిగ్రహిస్తూ ఉన్న దానింతో తృప్తి చెందుతూ జీవనం చేయాలి.


3) కామం: అంటే కోరికలు ధనం తో కోరికలను తీర్చుకోవచ్చు కానీ తన స్థాయిని మించిన వాటిని ఆశించకుండా ఒక ప్రణాళికా బద్దంగా కోరికలను తీర్చుకోవాలి.


4) మోక్షం:  ముందు మూడు పురుషార్ధాలను ఆచరించి చివరిదయిన మోక్షాన్ని కోరుకోవాలి.  నిజానికి మానవ జన్మ అంతిమ లక్ష్యమే మోక్షం.  ఇతర జీవులకు లేనిది మనుషులకు వున్నది బుద్ది అంటే మంచి చెడులను విచేక్షించే లక్షణం.  అది ఉండటం వలననే మనుషులు తమ విచక్షణతో తన జన్మకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగలరు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే   మన మహర్షులు వారి అద్వితీయ, అపార జ్ఞ్యాన సంపదతో తెలుసుకున్న జీవిత పరమావధి మోక్షం. 


మోక్షం కోసం మనిషి మనస్సు వేదాంతం వైపు మళ్ళాలి, వేదాంతం అంటే వేదాలకు చివరన వున్న  జ్ఞ్యానం. అవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మోక్ష జ్ఞ్యానాన్ని మనకు ప్రసాదించాయి. అవి ఆత్మానాత్మ విచేక్షణ చేసి సాధకుడు ఎలా మోక్షాన్ని సాధించాలో తెలియపరచారి 


మోక్షాన్ని కోరేవారు ముందు అనుసరించవలసినది సాధన చతుష్టయం. అవి 1. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము 2. శమదమాది షట్క సంపత్తి 3. ఇహముష్మిక ఫల భోగ విరాగం 4. వైరాగ్యము. మొదటి మూడింటిని అనుభవంలోనికి తెచ్చుకుంటే నాల్గవదైన వైరాగ్యము కలుగుతుంది.


వైరాగ్యం స్థిరంగా ఉండాలంటే ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవం కావాలి. ప్రత్యక్షానుభవం కలగడానికి ఆత్మ వస్తువు కాదు. గురువు వలన తెలుసుకొన వచ్చును గదా అంటే అది పరోక్షానుభుతి అవుతుందిగాని స్వానుభవం కాదు. అట్లని గురువు అవసరం లేదా అంటే అదీ కుదరదు. తమస్సు నుండి జ్యోతిస్సు లోనికి తీసుకొని వెళ్ళేవాడే గురువు. అట్టి గురువులకు గురువైన జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన అపరోక్షానుభూతిని పొందాలి. పరోక్షానుభూతి అంటే పంచదార తియ్యగా ఉంది అని ఎవరో చెఫ్పితే నమ్మినట్లు. ఆ పంచదారను మనమే తింటే తియ్యదనం మన అనుభవంలో ఉంటుంది. కాబట్టి గురువు చెప్పిన, చూపిన మార్గంలో స్వయంగా విచారణ చేసి పొందిన స్వానుభవమే అపరోక్షానుభూతి. అది పొందాలి. దానిని స్థిరంగా ఉంచటమే మోక్షం. 


మనకు కలిగే జ్ఞ్యానం పూర్తిగా పరోక్షమైనదే అదెలా అంటే నీవు ఒక విషయాన్ని గూర్చిన జ్ఞ్యానాన్ని పొందవనుకో అది ఏ విషయమైనా కానీ అది నీ కన్నా భిన్నంగా వున్నదే.  కానీ అనుభూతులు మాత్రం ఎవరివి వారివే. ఆలా కాకుండా విషయం దానిని తెలుసుకునే వాడు ఒక్కటే అయితే అదే అపరిక్షానుభూతి అంటే అనుభూతి పొందేవాడు అనుభూతిని ఇచ్చే వస్తువు ఒకటి  అవటం. ఇది తెలుసుకోవటం చెప్పినంత సులువు కాదు.  సాధకుడు తన నిరంతర సాధనతో తెలుసుకోవలసినది మాత్రమే. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతిశాంతిహి 


మీ భార్గవ శర్మ

సంపాదనపరుడవై వున్నంత వరకు

 యావద్విత్తోపార్జన సక్త స్తావన్నిజపరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహె||”


“నువ్వు సంపాదనపరుడవై వున్నంత వరకు ‘నీ వారు’ అనబడే పరివారమంతా నిన్ను ఆశ్రయించే వుంటారు. వృద్ధాప్యంలో నీ దేహం శిథిలమై శక్తి హీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలం అడుగరు.”


“రక్తసంబంధాలు అన్నీ నూటికి 99 పాళ్ళు ఆర్థిక సంబంధమైనవిగానే ఉన్నాయి. ఒకానొక మనిషి ధనాన్ని సంపాదిస్తున్నంత వరకే అతనికి కుటుంబంలో గౌరవం ఉంటుంది. శరీరధారుడ్యం తగ్గి డబ్బులు సంపాదించలేనప్పుడు అతనికి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ కించిత్ మాత్రమైనా విలువలేకుండా ఉంటుంది.


“కనుక, మనిషి కేవలం తన సంపాదనలోనే ఆమరణ పర్యంతం నిమగ్నం అయి ఉండాల్సి వస్తోంది. అలానే జీవించేస్తున్నాడే కానీ, ‘మరణం తరువాత ఏమిటి?’ అని ఆలోచించలేకపోతున్నాడు. ‘ధనలేమి’ లో కూడా విలువనిచ్చేది ఒక్క ‘జ్ఞాన బలమే‘. కనుకనే శంకరాచార్యుల వారు ‘ధ్యానం’ అంటున్నారు.”

అపరోక్షము

 అపరోక్షము



ప్రమాణ విచారణలో ప్రమాత - ప్రమాణము - ప్రమేయము అన్న మూడు అత్యంత కీలకమైనవి. సాంప్రదాయంలో వీటినే త్రిపుటి అని అంటారు. ప్రమాత అంటే తెలుసుకొనే వాడు అని. జ్ఞాత, విషయి, ద్రష్ట అన్న పదాలూ తెలుసుకునే వానికి వర్తించే పదాలే. చూచేవాడు, తెలుసుకునే వాడు అన్నవి సమానార్థకాలు. తెలుసుకునే సామర్ధ్యం కలిగి, తనను - తనకన్యమైన వాటినీ కూడా తెలుసుకుంటాడితడు. తనకు అన్యమైన వాటిని గురించి తెలుసుకోడానికైతే ప్రమాతకు ఆ పనికి అవసరమైన పరికరాలు, పద్ధతులు అవసరమవుతాయి. వాటినే ప్రమాణాలు (జ్ఞాన సాధకాలు) అంటారని ముందే చెప్పుకున్నాం. ఇకపోతే తన గురించి తాను ఎరుక కలిగి ఉండడానికి ప్రమాణావశ్యకత లేదుగనుక, ప్రమాతకు సంబంధించిన ఏ విషయాలైనా త్రిపుటితో పనిలేకుండానే తనకు తనకుగానే తెలుస్తూ ఉంటాయి. కనుకనే ఈ భాగానికి సంబంధించిన తెలివిని (జ్ఞానాన్ని లేదా ఎరుకను) అపరోక్షజ్ఞానం అంటున్నాము.


దీనికి సంబంధించిన క్షేత్ర దర్శనం


ఒక్కసారి నిద్రనుండి మెలకువలోకి వచ్చే సందర్భాన్ని గుర్తుచేసుకోండి. మెలుకువ వచ్చిందని తెలుస్తుంది మొదట. గమనించడం ఆరంభమైందని దానర్ధం. నేను అన్న భావన కూడా పుట్టకముందే ఎరుకలోకి రావడం జరుగుతుంది. అంటే గమనించడం మొదలైంది. ఆ క్షణంలో గమనిస్తున్నాను అన్న స్పృహకూడా ఉండదు. రెండో దశలో నేను అన్న భావన, నేను గమనిస్తున్నాను అనిగాని, నాకు మెలుకువ వచ్చింది అనిగాని అనిపిస్తుంది లేదా తెలుస్తుంది. తెలుసుకునే దానికి / వానికి తనకు అన్యమైన వాటి గురించి తెలుసుకునేందుకున్న విధానాలు, సాధనాలనే ప్రమాణాలనుకున్నాం కదూ! ఒక ముఖ్యమైన విషయమేమంటే త్రిపుటిలోని ప్రమాణాలు, ప్రమేయాలూ కూడా ప్రమాతకు అన్యమైనవే అవుతాయి. ఆ దృష్టినుండి చూస్తే; తెలుసుకునే వాడు, తెలియబడేటివి అన్న రెండుగానే వీటిని అర్థంచేసుకోవచ్చు.


ఓ   జ్ఞాత (ప్రమాత) : ఎవరన్న విషయంలో రకరకాల 'సిద్ధాంతాలు - రాద్ధాంతాలు' ఉనికిలో ఉన్నా శరీరంలో తెలుసుకునే పని జరుగుతూనే ఉందనీ, మనందరికీ ఆ పని మనమే చేస్తున్నామని అనిపిస్తుంటుందనీ అనేంతవరకు ఏకాభిప్రాయమే ఉంటుంది. నేనే తెలుసుకుంటున్నాను. ఈ శరీరంలో తెలుసుకుంటున్నది 'నేనే' అని మనందరికీ అనిపిస్తుంటుంది. తెలుసుకునే పని తలలో జరుగుతుంటుందనీ మనందరకూ తెలుసు. భారతీయ ఆస్తిక సాహిత్యంలో జ్ఞాన లక్షణం ప్రకృతికి, ప్రకృతి సంబంధితాలకూ ఉండదన్న దృష్టిఉండడంతో, శరీరభిన్నము (జడ భిన్నము) అయినది ఒకటుండక తప్పదనీ, దానినే ఆత్మ అంటారని, కనుక తెలుసుకునే నీవే ఆ ఆత్మవు అనీ చెప్పబడింది. మన ప్రస్తుతాంశం శరీర భిన్నమైన ఆత్మ ఉందా లేదా? అన్నది కాదు. ఈ శరీరంలో నేను అన్న భావనతో కూడి తెలుసుకునే పని చేస్తున్నదొకటి ఉందని, అది మనందరికి, ఆ తెలుసుకుంటున్నది నేనేనని అనిపిస్తుంటుందని, సందేహ రహితంగా తెలుసు. కనుక తెలుసుకునేది ఏది? లేక ఎవరు? అన్నది ప్రస్తుతానికి ప్రక్కనుంచుదాం.


అంటే; జ్ఞాతను నేనే. తెలుసుకునే లక్షణము గల నేను పరిమిత సామర్ధ్యముతో తెలుసుకుంటుంటాను. నన్ను నేను తెలుసుకుంటూ, నాకు సంబంధించిన విషయాలూ తెలుసుకుంటూ, నాకితరమైన వాటిని వివిధ పరికరాలూ, పద్ధతులాధారంగా తెలుసుకుంటూ ఉంటాను. ఇంతవరకు ఇదంతా మీమీ అనుభవం (ఎరుక)లో ఉందో లేదో ఎవరికి వారుగా, మీమీ అనుభవాలను తరచిచూసుకోండి. తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు మనకెవ్వరికీ అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. కనుక నేను ఉన్నాను, తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు ప్రమాణాపేక్ష లేకుండానే తెలుస్తుంటుంది.


ఈ ప్రమాత లేదా జ్ఞాత (అహం) కు సంబంధించిన తెలివినే (ఎరుకనే) అపరోక్షం అనంటారు. జ్ఞాన సాధకాల తీరుతెన్నులను విచారించుకునే సందర్భంలోనూ, ఏఏ జ్ఞాన సాధకాల అంటే ఏఏ పరికరాల, పద్ధతుల ద్వారా ఏ రకమైన జ్ఞానం కలుగుతుంటుందో విచారించే సందర్భంలోనూ ఈ ప్రమాత స్వరూప స్వభావాల విచారణ అంత ప్రధానం కాదు. అయినా మనకు కలిగిన జ్ఞానరాశినంతటినీ పరిశీలించి చూస్తే. మూడు ప్రమాణాల ద్వారా కలిగిన జ్ఞానం కాక, మరికొంత జ్ఞానమూ ఉన్నట్లు తేలుతుంది. ఆ జ్ఞానానికి మనం ప్రమాణాల పేరిట చెప్పుకున్న పరికరాలు గానీ, పద్ధతులు గాని అవసరపడలేదని తెలుస్తుంది. అదిగో ఆ భాగాన్నే అపరోక్షం అనంటున్నాం. ఇదంతా ఇక్కడెందుకు విచారించు కుంటున్నామంటే ప్రమాణబద్ధమైన జ్ఞానానికీ, అది ఒప్పు జ్ఞానం కావచ్చు, తప్పు జ్ఞానం కావచ్చు, అపరోక్ష జ్ఞానానికీ, అంటే ప్రమాణాల క్రింద చెప్పుకున్న పరికరాలు, విధానములన్న వాటి ప్రమేయము లేకుండనే కలిగే జ్ఞానానికి తేడా ఉందని గమనించి, ఆ అపరోక్ష జ్ఞాన రాశిని విడిగా ఉంచడానికే.  ముందుగా ఆ పని చేసుకుంటేనే ప్రమాణాల విషయాన్ని వివరంగా పరిశీలించగలుగుతాం. మరి 1, 2 ఉదాహరణలు చెబుతాను. అపరోక్ష జ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోడానికి (స్పష్టత రావడానికి) ప్రత్యక్షం ద్వారా ఏదో ఒక విషయానికి చెందిన అనుభూతి కలుగుతుందను కుందాం. అంటే ఏదో ఒక దానిని గురించి ఏదో ఒకటి అనిపించింది. ఇంతవరకు ఇది ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమే. ఆ తరువాత ఆ విషయం మనకు తెలిసిందని తెలుస్తుంటుంది. ఒక విషయం తెలియడం - అది తెలిసిందని తెలియడం ఇది మీమీ అనుభవాలలో ఉందో లేదో చూసుకోండి. తెలిసిందని తెలియడానికి మూడు ప్రమాణాలలో ఏ ప్రమాణంతోనూ పనిలేదు. అది తెలుసుకునే మనకు, మనకుగానే తెలుస్తుంది. దానితో పాటు తెలుసుకుంటున్నాను అన్న తెలివీ కలుగుతుంటుంది. ఈ జ్ఞాన భాగాన్ని అపరోక్ష జ్ఞానమనే అనాలి. ఇక ప్రమాణజన్య జ్ఞానమంతా ప్రమాతకు - ప్రమేయ స్థానంలో ఉన్న విషయానికి సంబంధం ఏర్పరిచే వ్యవహారం జరిగి ఏర్పడ్డదై ఉంటుంది. ప్రస్తుతానికీ వ్యత్యాసాన్ని గమనించుకొని ప్రమాణాలను, తద్వారా కలిగే వివిధ రకాల జ్ఞానాలను వివరించుకుందాం.


అపరోక్షాన్ని మినహాయించితే, మిగిలిన జ్ఞాన రాశీ, అదేర్పడేందుకు అవసరమైన పరికరాలు, పద్ధతుల విచారణే ప్రమాణ విచారణంతా. అదిన్నూ ప్రత్యక్షమూ - పరోక్షమూ అన్న రెండు రాశులుగానూ, ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న భేదంతోటీ ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిననుసరించి కలిగే జ్ఞానం ఇంద్రియాల తేడావల్ల మరల 6 విధాలుగా ఉంటుంది. ఇక పరోక్ష జ్ఞానం అనుమాన పద్ధతిన, భాషనాధారం చేసుకునీ, రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది. భాషనాధారం చేసుకునేదంతా మానవుడు తమారుచేసుకున్నదే. అదికాక మిగిలిన రెండూ అంటే ప్రత్యక్షమూ - అనుమానమూ అన్న రెండూ శరీర నిర్మాణంలోనే అమరిఉన్న వ్యవస్థ రూపాలు. కనుకనే మండలి అవైవున్న ప్రమాణాలు రెండనీ, భాష ఆధారంగా మనిషి చేసుకున్నదొకటనీ అంటూ ప్రమాణ పద్దతులు మూడని నిష్కర్షిస్తోంది. మొత్తంమీద, మానవ జీవితానికి ముడిపెట్టి చూసుకుంటే, మూడు విధానాలను వాడుకోకుంటే జీవితంలో జ్ఞానపరంగా లోటుఏర్పడుతుంటుందనీ, నాలుగో ప్రమాణంతో పనిలేదని, మూటికంటే అధిక సంఖ్యలో ప్రమాణాలున్నాయనే వారంతా ఉన్న వాటినే అనవసరంగా అధిక భాగాలు చేసి సంఖ్యను పెంచే పనిచేసినట్లేనని మండలి సిద్ధాంతీకరిస్తోంది.

ఉదర నిమిత్తం

 3, అక్టోబర్ 2022, సోమవారం ఉదర నిమిత్తం బహుకృత వేషః

TV

ఆది శంకరాచార్యులవారు  దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ళ క్రితం చెప్పిన శ్లోకం ఇప్పటి మన సమాజంలో మనం చూస్తున్న విషయాలకు అద్దంపట్టినట్లు ఉన్నదంటే అతిశయోక్తిలేదు. ఈ రోజులల్లో మనకు చాలామంది సత్గురువులు తారసపడుతున్నారు.  వారి ఆకారాలు, వస్త్రధారణలు మనలను వారు సాక్షాతూ భగవానుని అవతారం అనేవిధంగా మభ్యపెడుతున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని, ఖరీదయిన భావంతులలో సకల భోగాలను అనుభవిస్తూ, మనలకు వేదాన్తభోదనలను చేస్తున్నారు.  వారి శిష్యగణం అంతా అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు, ఇంకా ఇతర ధనికవర్గానికి చెందిన గొప్పవారు. వారి దర్శనానికి టికెట్, వారి పాద ప్రక్షాళణానికి టికెట్, మనఇంట్లో వారి పాదాలనుమోపితే టికెట్ ఇలా ప్రతి దానికి ఎంతో ఖరీదైన టికెట్లను వసూలు చేస్తూ వారి పబ్బాలను గడుపుకొని మనలను ఉద్ధరిస్తున్నామని చెప్పుతున్నారు. వారిని చుస్తే  "పైన పటారం లోన లొటారం" అన్న సామెతకు సారూప్యంగా వుంటున్నారు. ఒక స్వామిజి విభూతి ఇస్తారు, ఒక స్వామిజి కుంకుమ ఇస్తారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ దీవెనలు ఇస్తూ సామాన్యుల ధనాన్ని దోచుకుంటున్నారు. కొందరు గుండు చేసుకొని దర్శనమిస్తే కొందరు మీసాలకు,  గడ్డాలకు  కూడా రంగు వేసుకొని దర్శనమిస్తున్నారు, మరికొందరు జడలు పెంచుకొని వుంటున్నారు.  కొందరు ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరిస్తే, కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు.  ఏదో ఒక ప్రేత్యేక గుర్తింపు కలిగి వారే పరమేశ్వరుని అవతారాలని లేక ఈశ్వరుని దూతలమని చెప్పుకొంటూ అనేక విధాలుగా మన మనస్సులను వారి వశం చేసుకొని మననుంచి ద్రవ్యాన్ని కాజేస్తున్నారు.  వారి శిష్యులకు ఆ పని జరిగింది ఈ పని జరిగింది అని ప్రచారాలు చేస్తూ అమాయక సామాన్య ప్రజలను వారి శిష్యగణంలో చేర్చుకొని వలసినంత దండుకుంటున్నారు.  సమశ్యలలో మునిగి తేలే సగటు మధ్యతరగతి మానవులు వారి ప్రసంగాలకు, వారిగూర్చి ఇతరులు చేసే ప్రచారాలకు లొంగి వారికేదో మేలు జరుగుతుందని భ్రమపడి అప్పులు చేసి మరి వారి దర్శనానికి వెళ్లి వారి వలలో పడుతూ తమ  జీవితాలను ఇక్కట్ల పాలు చేసుకుంటున్నారు. 


సముద్రంలో కొట్టుకొని వెళ్లే వాడికి చిన్న గడ్డిపరక దొరికినా ఎంతో ఊరట కలిగిస్తుంది అన్నట్లు నిత్యం సమశ్యలలో చిక్కుకొని అనేక కస్టాలు పడే సగటు మానవులకు ఈ దొంగ స్వాములు, గురువులు, దేవతా అవతారమూర్తులు చేసే ప్రసంగాలు, మాటలు వారికి ఎంతో ఆశను కలిగిస్తాయి. అందుకే వారికి ఏదో ఉపశమనం కలుగుతుందనే ఆశతో వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియకుండా వారి వశమవుతున్నారు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో భగవంతుని అవతారం ఎత్తే సమయం ఇంకా రాలేదని తత్వవిదులు చెపుతున్నారు. నిజానికి భగవంతుడు ఈ భూమి మీద అవతారం ఎత్తితే సమాజాన్ని ఒక శ్రీ రాముడి లాగ లేక ఒక శ్రీకృష్ణుని లాగా ఉద్ధరిస్తారే కానీ వారి వారి స్వార్ధానికి మనలను దోచుకోరనే చిన్న నిజం తెలిస్తే ఎవ్వరు మోసపోరు. శ్రీ రామచంద్రులవారు ఒక సార్వభౌమ కుటుంబంలో జన్మించి కూడా అతి సామాన్యుని వలె నారవస్త్రాలను (చౌకబారు బట్టలు) ధరించి తన భార్య తమ్మునితో అడవిలో గుడిసెలలో (పర్ణశాలలో) నివసించి ఆకులు, అలమలు తిని మనకు తండ్రి మాటను నిలపెట్టుకోవటమే కుమారుని ధర్మం అని బోధించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మగారు ఇప్పటికి నిత్యనూతనము సదా ఆచరణీయం అయిన శ్రీమత్ భగవత్గీతను మనకు ప్రసాదించారు.  ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో మనకు కనబడే బాబాలు, స్వామీజీలు వారి ముందు ఏపాటివారో. 


నిజానికి భగవంతుని ఆరాధించటానికి, భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన మనస్సు, అకుంఠితమైన దీక్ష, శ్రర్ధ  మాత్రమే. అవిలేకుండా ఎవ్వరు భగవంతుని కృప కటాక్షాలను పొందలేరు.  ధనంతో కొనలేనిది కేవలం భగవంతుడు మాత్రమే.  ఇక శ్రీ శంకరాచార్యుల వారు నుడివిన శ్లోకాన్ని పరికిద్దాం. 


“జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః| 


పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||”


“ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”


“జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడం – ఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.


“జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్ను’ అంటే ‘దివ్యచక్షువు’ ఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నా ‘అంధులు’ గా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.


కాబట్టి ప్రతి సాధకుడు తాను తన సాధన వలన మాత్రమే భగవంతుని కృపకు పాత్రుడు కావలి కానీ ఇతరత్రా ఎంతమాత్రం కాదు అనే యదార్ధాన్ని తెలుసుకోవాలి. 


ఓం తత్సత్ 


ఓ శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ