19, నవంబర్ 2022, శనివారం

రాముడు రాక్షసంహారం

 రాముడు రాక్షసంహారం కోసం జన్మించినా , ఆయన అంతటి భార్యా వియోగాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి  ?

- లక్ష్మీరమణ 


యోగ వాసిష్ఠం లో రాముడికి కలిగిన సందేహాలకు వసిష్ఠ మహర్షి చేసే తత్వబోధ ఉంటుంది. అందులో విష్ణుమూర్తి మానవుడిగా ఎలా అవతరించారు ?  మోయలేని  భార్యా వియోగం ఎలా కలిగింది, అందుకు కారణమైన 4 శాపాల వివరణ  వున్నాయి. అయితే, వాటిల్లో  3 శాపాలు భార్యా వియోగానికి కారణమైనవి. వాటిని గురించి తెలుసుకుంటే, ఆ నీలమేఘశ్యాముని కరుణాద్ర హృదయం యెంత విశాలమో అర్థమవుతుంది . 



1. దేవదానవ సంగ్రామం హోరాహోరీగా జరుగుతోంది.  ఆ యుద్ధంలో  విష్ణుమూర్తి దేవతల పక్షాన పోరాడుతూ, రాక్షసులను తరుముతున్నారు . ఆ అసురులు  భృగు మహర్షి భార్యని శరణువేడారు. ఆమె వారిని తన ఇంట్లో దాచి ఉంచింది .  శ్రీహరి ఇంట్లోకి పోవడానికి వీల్లేదని అడ్డగించింది.  రాక్షసులంతా ఒకేచోట దొరికారు, ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాల ఉపద్రవం తెస్తారు. లోకాలన్నిటికీ ముప్పు కలిగించేకంటే, ఋషిపత్నిని అడ్డుతొలగించి , ఆ పాప ఫలాన్ని అనుభవించడం న్యాయం అనుకున్నారు శ్రీమహావిష్ణువు . అంతే , భృగుపతిని సంహరించి, అదే ఉదుటన ఆ రాక్షసులందరినీ మత్తు పెట్టాడు . భృగు మహర్షికి కోపం ఎక్కువ . తన పత్నిని మట్టుపెట్టాడన్న క్షణిక కోపాన్ని జయించలేక , దుఃఖంతో ఒళ్ళు తెలియక "శ్రీహరి! నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక!" అని శపించాడు. ఇదీ మొదటి శాపం . 



2. ఆ తర్వాత బృంద అనే గోలోక కన్య శ్రీహరి పొందు కావాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు, అది విని రాధాదేవి ఆగ్రహించింది.  రాక్షసకన్యవి కమ్మని శపించింది. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృంద నే .  ఆమె జాలంధురుడు అనే రాక్షసుడికి ఇల్లాలయ్యింది . మహాపతివ్రతగా ఉండేది. జాలంధురుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ బృందయొక్క పాతివ్రత్య మహిమ వాడికి చావు లేకుండా చేసింది .  వాడి పీడని లోకానికి వదిలించాలంటే, ముందు బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయాల్సిన అవసరం రక్షకుడైన శ్రీహరికి కలిగింది . 



పూర్వ జన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక, ఆమె కోరిక తీర్చేందుకు ఇప్పుడు జాలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేసాడు శ్రీహరి . ఆమె పాతివ్రత్య భంగం జరగగానే జాలంధురుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశానికి లోనయ్యింది . అది తాను పూర్వజన్మలో చేసిన పొరపాటని గుర్తించలేకపోయింది . తప్పంతా శ్రీహరిదే అని భావించి, "నాకు భర్త్రువియోగం కలిగినట్లే, నీకూ భార్యావియోగం కలుగుగాక!" అని శపించింది. ఇదీ రెండవ శాపం . 



3. పూర్వం పయోష్ణీ నదీ తీరాన దేవదత్తుడు అనే గృహస్తు నరసింహోపాసన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తపస్సుకి సంతోషించి నృసింహ స్వామి మంచి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరు తపస్సు చేసారో వారికి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకి కూడా కనిపించింది. అసలే సింహ స్వరూపుడేమొ , మహా అట్టహాసంగా దర్శనమిచ్చేసరికి ఆ సున్నిత మనస్కురాలు తట్టుకోలేకపోయింది . స్వామి  భయంకర ఆకారాన్ని చూసి గుండె ఆగి మరణించింది. దేవదత్తుడు నృసింహ సాక్షాత్కార మహానందంలో మునిగి, కొంతసేపటికి ఇహలోకంలో వచ్చాడు. వస్తూనే ఈ సాక్షాత్కారం వల్ల తన భార్య మరణించింది అని గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి, వివేకం కోల్పోయాడు .  "విష్ణుదేవా! నీకు కూడా నాకుమల్లే భార్యావియోగం సంభవించుగాక!" అని శపించాడు. ఇది మూడవ శాపం . 



ఈ 3 శాపాలు శ్రీ మహావిష్ణువికి భార్యావియోగాన్ని కలిగించేవి. ఈ ముగ్గురి మీదా ప్రేమవల్ల, వారి శాపాలని మన్నించాడే  తప్ప తిరిగి ప్రతిశాపమియ్యలేదు . వారి కోసం మానవుడై జన్మించి 3 సార్లు భార్యావియోగాన్ని అనుభవించాడు. 

 

రావణుడు సీతాపహరణం చేసినప్పుడు ఒకసారి భార్యావియోగం .  తర్వాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండోసారి భార్యని కానలకు  పంపి స్వయంగా ఆమెకి దూరమయ్యారు .  మళ్ళీ లవకుశుల జననానంతరం అశ్వమేధ యజ్ఞ సందర్భంలో  కలిసాక, ఈసారి సీతాదేవి భూప్రవేశం చేయడంతో శ్రీరాముడికి మూడోసారి భార్యావియోగం. ఇలా తన భక్తులు ఇచ్చిన 3 శాపాలు చెల్లించాడు మహానుభావు డైన శ్రీ హరి. 🙏

మొక్కలు మహాశక్తివంతం

 ప్రియమితృలకు నమస్కారం , 


     ఆయుర్వేదం నందు మూలికలు ప్రధాన ఔషదాలుగా ఉపయోగపడుతున్నాయి . కొన్ని రకాల మొక్కలకు కొన్ని ప్రత్యేక సమయాలలో మొక్కలు మహాశక్తివంతం గా ఉంటాయి . వాటిగురించి కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో మరియు తాంత్రిక గ్రంథాలలో విపులంగా వివరించారు . 


                మీకు ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే "తెల్ల జిల్లేడు " దీనిని శ్వేతార్కం 

అంటారు . ఈ శ్వేతార్కం యొక్క వయస్సు 12 సంవత్సరాలు దాటిన తరువాత దీనియొక్క ప్రధాన వేరు వినాయకుడిగా రూపాంతరం చెందుతుంది. మామూలు సమయంలో ఈ చెట్టుకు ఎటువంటి ప్రత్యేక శక్తి ఉండదు. కాని ఆదివారం పుష్యమీ నక్షత్రం లేదా గురువారం పుష్యమీ నక్షత్రం ఈ రెండు ముహూర్త సమయాల్లో మాత్రమే ఈ చెట్టు యొక్క ప్రధాన వేరు గ్రహించాలి. శాస్త్రబద్ధంగా గ్రహించిన వేరు వినాయకుడి రూపంలో ఉంటుంది. లేనిచో దానిని చెక్కించి ఒక శుభముహూర్తాన బ్రాహ్మణుడితో ప్రాణప్రతిష్ట గావించి ఎర్రటి వస్త్రంలో ఉంచి పూజగదిలో ప్రత్యేక స్థానం నందు ఉంచి ప్రతిదినం బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి శ్రద్ధతో ఆ విఘ్నేశ్వరుని కొలిచిన సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు ఇంటియందు కొలువై ఉంటారు . దుష్టశక్తులు రాలేవు.   ఇటువంటి అద్బుత లక్షణాలు కొన్ని ప్రత్యేక మొక్కలకు కలవు . 


              నల్లవావిలి అని మరొక ప్రధాన మైన మొక్క కలదు. ఇది మహాశక్తివంతం అయిన మొక్క ఈ మొక్క చీకటి నలుపు కూడుకుని ఉంటుంది. దీనిని రసవాదంలో వాడతారు. ఈ చెట్టు పైన మిన్నాగులు ఉంటాయి . మిన్నాగులు అనగా కేవలం ఒక జానెడు మాత్రమే ఉంటాయి. ఇది కేవలం కనుబొమ్మల మధ్యనే కాటువేస్తుంది. ఔషదం తీసుకునే సమయం కూడా ఉండదు. మరణం తప్పదు. ఇది ఎగరగలదు.  


                 నల్లపసుపు , ఎర్రచిత్రమూలం వంటి మొక్కలు కూడా మహాశక్తివంతాలే . ఎర్రచితమూలం అమావాస్య రోజు మహాశక్తివంతంగా ఉంటుంది. దీనిని మాంత్రిక విద్యలు , రసవాదం నందు ఉపయోగిస్తారు.   


          వరంగల్ , కరీంనగర్ , ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో కొన్నిసార్లు భూగర్భాలలో కుండల్లో మూడు రకాల పౌడర్లు ఒకే దగ్గర కుండలలో నింపి ఉంటాయి . ఆ పౌడర్లు నల్లవావిలి , ఎర్రచిత్రమూలం , తెల్ల మోదుగ మొదలగు చెట్ల నుంచి తయారు చేసినవి . వీటిని దాచిన ప్రదేశానికి సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక శాసనం మరియు ఒక చిన్న పిడత ఉంటుంది . ఆ పిడత లొపలికి గాలి పోకుండా అత్యంత పటిష్టంగా బంకమన్నుతో సీల్ చేయబడి ఉంటుంది . ఆ శాసనం ఎక్కువుగా రాగి లేదా ఇత్తడి ప్లేట్ అయ్యి ఉండి దానిపైన ఈ పౌడర్లను ఎంత మోతాదులో కలుపుకోవాలి అన్నది వివరంగా రాసి ఉంటుంది. ఆ పసరు ఈ పౌడర్లలో ఎలా ఉపయోగించాలో కూడా వివరంగా ఉంటుంది.  ఆ యొక్క పసరును "పరుసవేది " అంటారు.  


             కొన్ని గ్రంథాలలో ఉడుగ చెట్టు శక్తి  గురించి రాసి ఉన్నది. ఉడుగ చెట్టు నుంచి రాలిపడిన విత్తనాలు మరలా చెట్టు వైపు పయనించి కాండంలో విలీనం అవుతాయి అని కూడా ఉంది . వర్షం పడ్డప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన విత్తనాల ద్వారా మాత్రమే ఆ వృక్షజాతి అభివృద్ధి అగును. 


                     ఉడుగ చెట్టు విత్తనాల నుంచి తైలం తీయుట మహా దుర్లభం . కేవలం ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన పాతాళ యంత్రం ద్వారా మాత్రమే తీయవచ్చు. మరోక పద్దతి చెప్పారు కాని అంత స్వచ్ఛత లేదు .

ఈ అంకోలా తైలంతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ తైలాన్ని మహేంద్రజాల విద్యల్లో ఎక్కువ వాడతారు.  ఉదాహరణకి ఈ అంకోలా తైలంలో 11 దినములు మామిడి విత్తనాలను నానబెట్టి 12 వ దినము నందు పుట్టమట్టిలో ఆ విత్తనాలు నాటి నీళ్లు చల్లిన అప్పటికప్పుడే ఆ మొక్క వృక్షంలా మారి చిగుర్లు , పండ్లు , పుష్పాలతో కూడి ఉండును అని తెలియచేశారు.  


             ఈ విధంగా అద్భుతశక్తులు కొన్ని మొక్కలకు మాత్రమే ఉండును.ఈ మొక్కలు సాధారణ మనుష్యులు తిరిగే ప్రదేశాలలో ఉండవు. నరసంచారం లేని దట్టంగా అడవుల్లోనే ఉంటాయి. నరుడు నడిచే చోట గడ్డికూడా పుట్టదు. 


         అదే విధముగా భూచక్రగడ్డ         అని ఒక మహామాన్వితమైన గడ్డజాతి కలదు . ఈ గడ్డ భూమియందు బండిచక్రం వెడల్పుతో ఉండును . ఇది ఎక్కువుగా ఈతచెట్ల కింద ఏర్పడును . చెట్టుపైన తీగ పాకి ఉండును . పైన ఉన్న తీగకు భూమియందు ఉన్న గడ్డకు ఎటువంటి సంబంధం ఉండదు. వాటిమధ్య ఒక బలమైన అయస్కాంత శక్తి ఉండును. దీనిని సర్వరోగ నివారణిగా పిలిచెదరు . ఆయుర్వేదంలో కాయచికిత్స అనగా శరీరపు వయస్సు పెరగకుండా నిలుచుటకు వాడెదరు . దీనిని తవ్వితీయుట కూడ అత్యంత జాగ్రత్తగా తీయవలెను . తీయునప్పుడు భూమి అదిరిన దొరకదు అని చెప్పెదరు. రహదారుల పైన భూచక్రగడ్డ పేరుతో అమ్మేవి నిజానికి అది కాదు . ఇది దొరుకుట అత్యంత అదృష్టము .ఈ గడ్డ గురించి ఆయుర్వేద గ్రంథాల కంటే పురాతన తాంత్రిక గ్రంథాల యందు వివరణ ఉన్నది .        


  మొక్కల యొక్క శక్తి ఎలా ఉంటుందో మీకో వీడియో చూపిస్తాను . తప్పకుండా చూడండి.



      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

తలపులోకి కూడా రానీయకు

 *భార్యా భర్తలమధ్య అభిప్రాయ బేధాలు, పోట్లాటలు పొరపొచ్చాలు ఎందుకు వస్తాయి ? వస్తే  పరిష్కార మార్గాలేమిటి?*

 

గొప్ప గొప్ప  రచయితలను అడిగి  వారి సంసారాలలో వచ్చే బేధాభిప్రాయాలను  ఎలా పరిష్కరించుకున్నారో తెలుసుకుందామనే 

ప్రయత్నం……


*ఇంద్రగంటి హనుమశ్ఛాస్త్రి* …..

మీ సంసారంలో భేదాభిప్రాయాలు వస్తే ఏంచేస్తారు? అన్నాను.

“నా అభిప్రాయం చస్తే చెప్పను.” అన్నాడు.


*ముళ్ళపూడి …*

“మీరూ మీ ఆవిడా మాటామాటా అనుకుంటారుట కదా? 

“నేను అనుకుంటాను.. ఆవిడ అంటుందండి!”



*కాటూరి………*

లేదు పోట్లాడుకోం, అన్నాడు. 

అంటే, మీరు చెప్పినట్లు ఆవిడ వింటుందా? అన్నాను. 

నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని చెప్పానా? కోపంతో అరిచినంత పని చేశాడు.


*మునిమాణిక్యం....*

అమ్మో.. ఆమె అశ్రుధారాస్త్రాలను చూడలేను ఎన్ని తిట్లు తిన్నా.. నవ్వుతూ ఉండడమే. అన్నాడు.


*వేదుల....*

వున్నాయి కానీ నా బాధ ఎవరికీ చెప్పను.

కనుల  రానీయను  బాధను . “  అన్నాడు.


*మొక్కపాటి….*

నేను మద్రాసులో, ఆవిడ వైజాగ్ లో

ఫోనులో  దెబ్బలాడుకోవటం కుదరదు. పైగా డబ్బు ఖర్చు దండుగ కూడానూ, అన్నాడు.


*గిడుగు...* 

ఆవిడ అరిచి చచ్చినా నాకు వినపడదు.

నేను మాట్లాడటమే లేదు. మాట్లాడినా….సవర భాషలో మాట్లాడతాను, అన్నాడు.

( సవర " దక్షిణ  ముండా భాష .  మనదేశంలో 

మొట్టమొదట  ముండా భాషను శాస్త్రీయంగా 

పరిశీలించి ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 

సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు 

గిడుగు రామమూర్తి)


*వేలూరి …..*

వినపడనంత దూరంగా వెడతాను.”


*బుచ్చిబాబు…*

ఆవిడ విజ్ఞానఖని, విజ్ఞాన సర్వస్వం,

విజ్ఞాన భాండాగారం, అని తెలిసి నోరు మూసుకున్నా. ఎందుకంటే….ఎప్పుడు నేను నోరు విప్పబోతున్నా, ఆవిడ మీకేమీ   తెలియదు వూరుకోండి. మీకీ మాత్రం కూడా తెలియదేమిటండీ? అంటూ 

వుంటుందిలెండి.


*నారాయణబాబు……* "పెళ్ళికూతురిని చూడండి. చేసుకున్న 

తరువాత ఎలా వుంటుందో చూసి 

చెబుతాను" అన్నాడు.

(ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపాడు)


*పండితరాజు …….* 

కావ్యానికే కాదు ధ్వని, అసలు ధ్వనితత్వం మా ఆవిడకి  తెలిసినట్లు 

ఆనందవర్ధనుడికి కూడా తెలియదేమో అన్నాడు.


*మధునాపంతుల……*

ఎన్ని అభిప్రాయబేధాలొచ్చినా

“ఆలి కుడిచేతి వేలికొసలు రాజుకొనువేళ 

రసఝరి వుప్పొంగు" అన్నాడు. 


*దేవులపల్లి....*

"పోట్లాట భరించలేను ఏడుపొస్తుంది.”

అన్నాడు.


*గరికపాటి...*

భార్యాభర్తలు రోజూ మనసు విప్పి కనీసం అరగంట  అయినా మాట్లాడు కోవాలి. అర్ధ గంటదాటితే మాత్రం మాట్లాడటం ఆపెయ్యాలి. లేకపోతే అనవసర విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అరగంట దాటితే  పని వుందని 

చెప్పి లేచి వెళ్ళిపోవాలి. కావాలంటే  మరల రెండోsitting వెయ్యాలి. వీలైనంత వరకు శ్రోతగా వుండటమే .

 

*అభ్యుదయ కవి…*

"అభ్యుదయ మార్గాన నడిచి చాల ముందు కొచ్చేశాను. ఇప్పుడు మా మధ్య దూరం బాగా ఎక్కువైంది" అన్నాడు.


*స్వామీజీ!...*

పోట్లాటలు ఎందుకు వస్తాయి, స్వామీ! తప్పించుకునే మార్గం ఏది? అని అడిగాను. 

“ఇది అనాది నుంచీ వస్తున్న సదాచారం నాయనా!! అనుకూలవతి అంటే ఏమీ

మాట్లాడకుండా వుండటం కాదు. 

తప్పించుకోవాలంటే నువ్వు రెండు మార్గాలు అనుసరించాలి…

1— విధేయత

2–సన్యాస స్వీకరణ.

*చివరగా ఓ మంచి ముక్క….“కొంపలో ఎప్పుడూ నీమాటే చెల్లాలని ఎట్టి  పరిస్థితుల్లోనూ అస్సలు అనుకోకు. తలపులోకి కూడా రానీయకు..."* 😁

🙏💐🙏శుభోదయం 🙏💐🙏