20, మే 2021, గురువారం

కరోనా వ్యాధి

 కరోనా వ్యాధి గురించి నా సంపూర్ణ విశ్లేషణ  - 



      ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని కరోనా      గడగడలాడిస్తుంది. నిజానికి ఇది కఫసంబంధ దోష సమస్య . ఎప్పుడైతే కరోనా వైరస్ మనిషిలోనికి ప్రవేశిస్తుందో శరీరంలో కఫ సంబంధ దోషం విపరీతంగా పెరుగుతుంది . దానివల్ల ఊపిరిత్తితుల్లో ఇన్ఫెక్షన్ , ఆయాసం , దగ్గు , తుమ్ములు వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి . చిన్నగా జ్వరము మొదలవుతుంది. ఇవన్నీ మనిషి శరీరంలో వైరస్ సంఖ్య పెరుగుతున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 


                    ఈ వైరస్ యొక్క ప్రభావం అన్నది మనిషి యొక్క రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలముగా ఉన్నవారి పైన  కొంత తక్కువ ప్రభావం ఉంటుంది. ఆయుర్వేదంలో వైరస్ మరియు బ్యాక్టీరియాలకు చేయు చికిత్సలకు " భూతవైద్యం " అనే ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. ఇక్కడ భూతాలు అంటే మరేవో కావు కంటికి కనిపించకుండా మనిషిని రోగాలపాలు చేయు బ్యాక్టీరియా మరియు వైరస్ లు మాత్రమే . కరోనా సోకినప్పుడు  ధైర్యముగా ఉండవలెను ఏ మాత్రం భయానికి లోనుకావొద్దు. మీ భయమే మీలోని రోగనిరోధక శక్తిని తగ్గించును . శరీరం ఏమాత్రం బలహీనపడకుండా మంచి బలమైన ఆహారం తీసుకుంటూ సరైన ఔషధాలను తీసుకున్న అత్యంత త్వరితముగా సమస్య నుంచి బయటపడగలరు . 


           నేను కొంత మంది కరోనాతో ఇబ్బంది పడినవారికి "చ్యవనప్రాశ " ఉదయం ఒక స్పూన్ మరియు సాయంత్రం ఒక స్పూన్ మోతాదులో తీసుకుని అశ్వగంధ కలిపిన పాలు తాగమని సలహా ఇవ్వడం జరిగింది. అదే విధముగా " జిందా తిలిస్మాత్ " మూడు పూటలా ఆవిరి పట్టించమని సలహా ఇవ్వడం జరిగింది. వారందరు అతి త్వరగా కరోనా నుంచి కోలుకున్నారు. ముఖ్యముగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా "కివి డ్రై ఫ్రూట్ " మరియు  "అంజీర " తినమని చెప్పడం జరిగింది.  నేను సూచించిన నియమాలు పాటించినవారు ఇంట్లో ఉండే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు .  



        మీ అందరికి ప్రధానంగా ఒక్క విషయం స్పష్టం చేయదలచుకొన్నాను . కరోనా వచ్చి తగ్గినవారు తమ ఆరోగ్యం పట్ల పూర్తి దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా మంచిది మరియు రోగనిరోధక శక్తిని పెంచే బలవర్థకమైన ఆహరం తీసుకోవడం అత్యంత ముఖ్యసూచన . దీనికి ప్రధాన కారణం ఒకసారి కరోనా మన శరీరంలొకి ప్రవేశించాక అది పోవడం అంత త్వరగా జరగదు . ఇప్పుడు మీరు తీసుకునే ఔషదాల వలనో దేనివలన అయినా అది నిద్రావస్థలోకి వెళ్లి ఏదో ఒకరోజు మరలా మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గాక విజృంభించవచ్చు . కావున మీ రోగనిరోధకా శక్తిని పెంచుకొనుట మీద దృష్టి పెట్టడం మంచిది . 


      అదేవిధముగా కరోనా నియంత్రణకు , మీలోని రోగనిరోధక శక్తిని పెంచు ఔషధాల గురించి మీకు వివరిస్తాను . వీటిని ఈ సమయంలో ఆహరంలో మరియు ఔషధాలుగా వాడుటకు ప్రయత్నించండి. 


  ఔషధాలు  -


   అంజీర పండు , ఇంగువ , ఉత్తరేణి , ఉశిరిక , ఉలవలు , కరివేపాకు , కలబంద , కరక్కాయ , కానుగ , తిప్పతీగ , గనుసుగడ్డ , గోమూత్రం , జిల్లేడుపువ్వు , జాజికాయ , పటికపంచదార , తెల్లవాలు , త్రిఫలములు , దాల్చిన చెక్క , నల్ల ఉమ్మెత్త ( శుద్ది చేయవలెను ) , నీరుల్లి , పచ్చ కర్పూరం , పసుపు , పుగాకు , పుదినపువ్వు , పెద్ద పల్లేరు , అశ్వగంధ , చ్యవనప్రాశ , బూడిదగుమ్మడి , మిరియాలు , వెల్లుల్లి , వేప జిగురు , వేపాకు , శొంఠి , సౌవర్చ లవణము , శెనగలు , అక్కలకర్ర .


        పైన చెప్పినవన్నీ ఈ కరోనా సమయములో ఔషధాలుగా పనిచేయును . 


    

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                          9885030034 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

Pseudo" Glucose

*Cheating the Cheater-DRDO magic*


The Chemistry of Corona drug developed by DRDO is said to be a big game changer. It is 2-Deoxy-D+Glucose (2-DG) which is likely to be  marketed very soon. The hero behind this discovery is said to be the Scientist, Dr. Anil Kumar Mishra who hails from Balia (UP), obtained his M.Sc.(Chemsitry) degree from Gorakhpur University in 1984 and Ph.D degree in 1988 from Banaras Hindu University. His research is mainly based on Molecular Biology and Organic synthesis. After doing the post doctoral research, he has worked as visiting Professor in different  foreign countries like France, California (USA) and Max Plank, Germany. He joined DRDO as Sr. Scientist in the year 1997.

2-DG is a mimic of D-Glucose prepared by replacing -OH group  at C2 by H-atom. Hence, the name 2-Deoxy-D-Glucose meaning removal of oxygen from 2nd carbon. Being mimic of D- Glucose,  it gets easy passage into the cells where Corona virus is already present.

Glucose breaks down into two three carbon compounds one of them being pyruvate anion (CH3COCOO-) with release of energy. It is a metabolic process called Glycolysis. It is this energy on which all living organism survive. Corona virus also survives on this energy. Unlike D-Glucose, 2-DG is unfit for glycolysis.No energy is evolved. The sustaining of life becomes difficult and as such Corona virus dies within a week in want of energy. It is said that this drug also lowers the oxygen dependence of patients.This drug is also antitumour/anticancer by the same mechanism.If it is able to destroy killer Corona virus, crores of precious lives will be saved.Thank you DRDO.


The science behind the 2DG drug for Covid-19 developed by DRDO: 10,000 doses of 2DG by DRDO is expected to be released today evening or by tomorrow! Hopefully, Mass-scale production is ramping up will start soon at Hyderabad and likely at other centers! The principle of operation is simple: "Cheat the Cheater"! You know that any virus, once inside the body, makes its own copies by cheating our human cells and takes their protein to multiply itself! *The brilliant thought process by Indian scientists was simple! For every doubling of virus cell, it needs energy (glucose!). So, the medicine is simply a       "Pseudo" Glucose which the multiplying virus intakes but actually, this glucose makes it neuter (unable to multiply!). Thus 'Cheating the cheater'  once the rapid multiplication of virus is halted, our own anti bodies can readily combat it and overpower within hours!* Simply Geneious! Be proud of Indian scientists!

ప్రపంచ దేశాలు

 ప్రపంచ దేశాలు జనసంఖ్య.

అమెరికా 33.1 కోట్లు 

రష్యా 14.6 కోట్లు

జర్మనీ 8.5 కోట్లు

టర్కీ 8.4 కోట్లు

యూకే 6.8 కోట్లు

ఫ్రాన్స్ 6.5 కోట్లు

ఇటలీ 6.1 కోట్లు

స్పెయిన్ 4.7 కోట్లు

పోలెండ్ 3.8 కోట్లు

రొమానియా 1.9 కోట్లు

నెదర్ ల్యాండ 1. 7 కోట్లు, 

బెల్జియం 1.2 కోట్లు, 

చెక్ రిపబ్లికన్ 1.1 కోట్లు, 

పోర్చుగల్ 1.1 కోట్లు, 

స్వీడన్1, కోటి, 

హంగేరి 1 కోటి, 

స్విజర్లాండ్ 0.9 కోట్లు, 

బల్గేరియా 0.7 కోట్లు, 

డెన్మార్క్ 0.6 కోట్లు, 

బ్రెజిల్ 21.2 కోట్లు, 

అర్జున్ టీనియా 24. 45 కోట్లు,

యూరోప్ లోని మిగిలిన చిన్న చిన్న దేశాల 

జనసంఖ్య 6 కోట్లు, 

మొత్తం కలిపి 136.95 కోట్లు.

ఒక్క భారతదేశ జనాభా 139 కోట్లు.

ఇప్పుడు ఆలోచించండి covid-19 ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎంత పని చేస్తున్నాయో అంత పని భారతదేశం ఒక్కటే చేస్తున్న ది. కరోనా ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయింది అనడం చాలా సులువు కానీ ప్రపంచ దేశాలకు సాటిగా ధీటుగా నిలబడడానికి నీ వంతు సహకారం అందించు. మీరేమి మీ ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం లేదు ఈ లాక్ డౌన్ ను విజయవంతం చేయండి. కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించండి. ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇతరులను కాపాడండి ఇది మీరు దేశానికి చేసే చిన్న సేవ.

భారతదేశాన్ని నవ్వుల పాలు చేయాలనుకునే దేశద్రోహులకు మరియు శత్రువులకు ఏ చిన్న అవకాశం ఇవ్వవద్దు.

జై హింద్🙏🙏😷

జై శ్రీరామ్

 నమస్తే


ఏకాక్షర నిఘంటువుల్లో


జ అనగా పుట్టుట

ద అనగా ఇచ్చుట

హ అనగా హరించుట 

జా అనగా పుట్టించుట

జ్ఞ అనగా తెలుసుకొనెను


జై అనగా ఇంద్రియములను జయించుట


శ్రీ  అనగా ఐశ్వర్యం


రా అనగా జ్ఞానము


మ్ అనగా ధైర్యము



జై శ్రీరామ్ అనగా 


ఇంద్రియములను జయించి ఐశ్వర్యవంతుడవై జ్ఞానవంతుడవై ధైర్యవంతుడవై ఉండుము అని అర్థము


ఇప్పుడు మనం జై శ్రీరామ్ అన్న వెంటనే 


ఇది ఒక మతమునకు దేశమునకు పార్టీలకు సంబంధించిన దానిగా భావించడం జరుగుతుంది


భగవద్ సంకల్పముచే ఆవిర్భవించిన  సంస్కృతభాషా పాంచభౌతికసమభాష


వాస్తవంగా భగవత్ నిర్మితమైన

సంస్కృతభాషా అక్షరాలకు పదాలకు వాక్యాలకు కుల మత వర్గ ప్రాంత పరమైన అర్థాలు ఉండువు


మనిషి తనకు తోచినవిధముగా తన భావాలకు అనుగుణంగా 


ఆ అక్షరములను పదములను వాక్యములను సాధనముగా చేసుకొని భావారోపన చేసాడు చేస్తున్నాడు


అందుకే  ఏ అక్షరము పదము వాక్యము అనుచ్ఛార్యము అనుపయోగము కాదు


మనం గ్రహించే విధానమే ప్రధానము


అందుకే ఎలాంటి సందేహములు ఇతర ఆలోచనలు లేకుండా


జై శ్రీరామ్ అందాం 


ఆపదములో ఉన్న అక్షరార్ద  లాభములను పొందుదాం


జై శ్రీరామ్


(సంభాషణసంస్కృతమ్)

*సతీదేహ త్యాగము

 _*వైశాఖ పురాణం - 9 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*సతీదేహ త్యాగము*


☘☘☘☘☘☘☘☘☘



అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ ! ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను , జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా ! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను , పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా ! వినుము , ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబందము , పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ , అన్నసేవ , ఔషధసేవయని ఇహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును ఇహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ , విష్ణుసేవ , ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.


ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ ఇహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు , విష్ణు , ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతీ ! యీ  కథ పాపములను పోగొట్టును , వినువారికి ఆశ్చర్యమును , ఆనందమును కలిగించును.


పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి *"నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను , చంద్రుడు , ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు , ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను , పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా ! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు , సర్వోత్తముడు , దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ , భార్యను జూచి భర్త లేచినట్లుగ , సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు , ధనము , కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను , మామగారుగా పూజ్యుడైనను , దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.


కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని , ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే ఇట్లనెను. ఓహో ! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము ! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా ! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా ! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును , యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును ?   లోకములు , శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది ఇతని యైశ్వర్యము. ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. *'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు , ప్రేతములు , పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు"* అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని , అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.


యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ , విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు/, చారుణులు , గంధర్వులు , యక్షులు , రాక్షసులు , కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.


పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా ! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.


యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.


తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రీ ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త - లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా ?  ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా ? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి ? విధివిధానము వీరికి విముఖమైయున్నదా ? అని సతీదేవి పలికెను.


సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను , తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు , సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను , శివుని బహువిధముల నిందించెను.


రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.


*వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం*

భక్తుల సంబంధ 46 పుస్తకాలు(PDF) ఒకేచోట

 *భక్తుల సంబంధ 46  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1 www.freegurukul.org/g/Bhakthulu-1


నాయన్మారులు-63 శివ భక్తుల చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-2


భక్త కనకదాస్ www.freegurukul.org/g/Bhakthulu-3


కక్కయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-4


పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు www.freegurukul.org/g/Bhakthulu-5


మహా భక్త విజయము www.freegurukul.org/g/Bhakthulu-6


భక్త మందారము-విష్ణు భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-7


బాల వీరులు www.freegurukul.org/g/Bhakthulu-8


కుచేలుడు www.freegurukul.org/g/Bhakthulu-9


ద్వాదశసూరి చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-10


మహా భక్త విజయము-46 భక్తుల కథలు www.freegurukul.org/g/Bhakthulu-11


నచికేతుడు www.freegurukul.org/g/Bhakthulu-12


చొక్కనాధ చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-13


వళ్ళలార్-జ్యోతి రామలింగస్వామి www.freegurukul.org/g/Bhakthulu-14


భక్తమందారం www.freegurukul.org/g/Bhakthulu-15


శివదీక్షాపరులు www.freegurukul.org/g/Bhakthulu-16


దాక్షిణాత్య భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-17


ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు www.freegurukul.org/g/Bhakthulu-18


భక్త కబీర్ www.freegurukul.org/g/Bhakthulu-19


పురందరదాసు www.freegurukul.org/g/Bhakthulu-20


భక్త నరసింహ మెహతా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-21


భక్త మల్లమ్మ www.freegurukul.org/g/Bhakthulu-22


భక్త తిన్నడు www.freegurukul.org/g/Bhakthulu-23


సిద్దయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-24


12 ఆళ్వార్ల  చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-25


భక్త రవిదాసు www.freegurukul.org/g/Bhakthulu-26


భక్త కనకదాసు www.freegurukul.org/g/Bhakthulu-27


చైతన్య చరితావళి-2 www.freegurukul.org/g/Bhakthulu-28


తేజోవలయాలు www.freegurukul.org/g/Bhakthulu-29


గుహుడు www.freegurukul.org/g/Bhakthulu-30


నమ్మాళ్వార్ www.freegurukul.org/g/Bhakthulu-31


నాగమహాశయుని జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-32


ఆదర్శ భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-33


ఆచార్య సూక్తి ముక్తావళి www.freegurukul.org/g/Bhakthulu-34


పెరుమాళ్ తిరుమొళి www.freegurukul.org/g/Bhakthulu-35


భక్త ఉద్దవ www.freegurukul.org/g/Bhakthulu-36


తుకారామస్వామి చరిత్రము www.freegurukul.org/g/Bhakthulu-37


భక్త పంచ రత్నాలు www.freegurukul.org/g/Bhakthulu-38


భక్త బృందము-1 www.freegurukul.org/g/Bhakthulu-39


భక్త ద్రువుడు www.freegurukul.org/g/Bhakthulu-40


భక్త లీలామృతము అను భక్త విజయ గ్రంధము www.freegurukul.org/g/Bhakthulu-41


సంపూర్ణ భక్త విజయము -1 www.freegurukul.org/g/Bhakthulu-42


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-43


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-44


భాగవత పంచ రత్నములు www.freegurukul.org/g/Bhakthulu-45


భక్త నందనార్ www.freegurukul.org/g/Bhakthulu-46


*To get this type of messages daily, join in WhatsApp group by below link*

  www.freegurukul.org/join


భక్తుల గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

పాజిటివ్ వచ్చింది

 😌మా  పక్క ఇంటి ఆయన.

వచ్చి బైక్ అడిగాడు

హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వస్తాను అన్నాడు!

బైక్ కీ ఇచ్చాను. ఒక గంట తరువాత వచ్చాడు. రాగానే కీ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి ,బండి ఇచ్చినందుకు, గట్టిగ కౌగలించుకుని

వెళ్ళాడుi!

వాళ్ళావిడ గుమ్మం లోనే  ఎదురొచ్చి

"ఏమయ్యింది రిపోర్ట్?"

అని ఆదుర్దాగా అడిగింది!


ష్ ..అసలే ఎండ లో వచ్చాను..

కాసిని మంచి నీళ్లు ఇచ్చి అడగొచ్చుగా అంటూ, కుర్చీ లో కూలబడుతూ ..

పాజిటివ్ వచ్చింది" అన్నాడు! 


ఆ మాట నా చెవిన పడింది??

దెబ్బకి గుండెల్లో రాయి పడింది!


గబా గబా , 

బాత్రూంలోకెళ్ళి , 

డెట్టాల్ సబ్బు తో స్నానం రెండు సార్లు చేసాను!

బండి మొత్తం లైజాల్ తో కడిగాను!!

బైక్  కీ ని  , శానిటైజర్ తో ముంచేసాను!


అయినా , ఇంట్లోవాళ్ళు సణుగుతూనే వున్నారు ...

నన్ను అనుమానం గ చూస్తున్నారు!

ఎవరి కి పడితే వాళ్లకి బైక్ ఇచ్చెయ్యడమేనా?? అని శ్రీమతి ఇస్తే ఇచ్చారు , ఆయనికి షేక్ హాండ్స్ ఎందుకిచ్చారు" , అని కొడుకు!మీకు అతి వేషాలు, 

మొహమాటాలు ఎక్కువయ్యాయి" ,అని మా అమ్మాయి ...

సణుగుతూనే వున్నారు !!!


నాకు,కోపం, చికాకు అన్నీ హై లెవెల్ లో వచ్చేసాయి !!

వెంటనే  పక్కింటికెళ్లి , ఆయన్ని దులిపేసాను !!

కొంచెం మీరు మ్యానెర్స్  నేర్చుకోండి సర్ ...

మీ రిజల్ట్  పాజిటివ్ వచ్చిందని తెలిసినా , 

నాకు షాక్ హ్యాండ్ ఇవ్వడం ,

కౌగిలించుకోవడం ...

ఇవి శాడిస్ట్ లక్షణాలు !!

మీ లాంటి వారి కి , 

హెల్ప్ చెయ్యడం నాది బుద్ధి తక్కువ ",...


అని గట్టి గా ఆరిచేసి ,వచ్చేస్తుంటే ,...


వాళ్ళావిడ , లోపలి నుండి వచ్చి ..

నా చేతులు పట్టు కుని ...


"అయ్యో అంకుల్ , 

అలా తప్పుగా అనుకోవద్దు మమ్మల్ని" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది!

అవును అంకుల్...

ఆ రిజల్ట్ మా యావిడది" అన్నాడు వాళ్ళ ఆయన!!


Again shocked--ఓయ్ బాబోయ్ ....

నేను మళ్ళీ స్నానం చెయ్యాలరా బాబూ ...

ఇప్పుడు ఈవిడ కూడా నా చేతులు పట్టుకుంది గా ???

నా ఖర్మ...

అనుకుంటూ, నేను కళ్ళ  నీళ్లు పెట్టుకోవడం చూసి.

అవును అంకుల్...

ఆ టెస్ట్ రిజల్ట్ మా యావిడది...పాజిటివ్ వచ్చిన మాట నిజమే...కానీ...కానీ..

అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అంకుల్!

అన్నాడు ఆ పక్కింటి పెద్ద మనిషి ! 😋😂😆😉😁

ఈ విపత్కర కాలంలో నవ్వుకోండి. భయాన్ని వదిలేయండి.

సర్వేజనా సుఖినోభవంతు🙏

దాశరథి రంగాచార్య

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

28 ఏప్రిల్ 1963 నాటి పత్రికలో దాశరథి రంగాచార్యకు విశ్వనాథ సన్మానం అనే వార్త ... ఆ తరువాత సభ విశేషాలు:

.... "వాడున్నాడు చూడు, దాశరథి, వాడు నీకు అన్నయ్యా, తమ్ముడా?" అడిగారు విశ్వనాథ.

"అగ్రజులండీ"

"వాడి వలన నువ్వేమన్నా ఎక్లిప్స్ అవుతున్నావా?"

"గురువుగారూ, నాకు ప్రతిభ మీద విశ్వాసం. ప్రతిభకు గ్రహణం ఉంటుందనుకోను!"

"ఎందుకడిగానంటే, నా తమ్ముడు వెంకటేశ్వర్లు నాకన్నా ప్రతిభావంతుడు. నా వలన రాణించలేకపోతున్నాడు!"


ఇంతలో సభ ప్రారంభమయింది. మంచి వెన్నెల. లైట్లు లేవు. మైకు కూడా లేదు.

విశ్వనాథవారు అధ్యక్షత వహించారు. నేను రామాయణము  గురించి గంటన్నర ఉపన్యసించాను. రాముని వాల్మీకి నరునిగానే చెప్పాడు అన్నాను. వాల్మీకే లేకుంటే రాముడు ఉండేవాడు కాదన్నాను.

విశ్వనాథవారు ఉపన్యాసం ప్రారంభించారు.  నా గుండె దడదడలాడింది. 

"రంగాచార్యులు చెప్పిన వాటిలో దేనితోనూ నేను ఏకీభవించను. రామునిది భగవదవతారము. ఆయన కరుణా కటాక్షము వల్లనే వాల్మీకి రామాయణము రచించ గలిగాడని నమ్ముతాను నేను. మా ఉభయులవి భిన్న దృక్పథములు.    అయినాను రంగాచార్యుల ఆలోచనా విధానము వంటిది అవసరమని నాకు తోచుచున్నది" అనడముతో సభలో చప్పట్లు మారుమ్రోగాయి. విశ్వనాథవారు 90 నిముషాలు రామాయణం మీద మాట్లాడారు. ఎక్కడా నన్ను నిరసించలేదు. పైగా అశీర్వదించారు.

అనంతరం ఆయన నాకు శాలువా కప్పి సన్మానించారు. అది నా అదృష్టం. అప్పుడు విశ్వనాథవారు నన్ను కౌగిలించుకున్నారు. చెవిలో మెల్లగా అడిగారు - "రంగాచార్యులూ, నీకు రామాయణం అర్థం అయిందా?"  

"ఏమీ అర్థం కాలేదు గురువుగారూ!"

"దానిమీద ముఫ్ఫై యేళ్ళు యేడిచిన  ముండావాడిని, నాకే అర్థం కాలేదు. నీకేమి అర్థం అవుతుంది" అంటూ నన్ను భుజం మీద చెయ్యి వేసి మెట్లు దింపారు.

అవి నాకు అమృత ఘడియలు. విశ్వనాథ ఆకాశమంత ఎత్తై కనిపించారు.

నేను వారికి పాదాభివందనము చేశాను. వారు నన్ను లేవనెత్తారు. కారులో కూర్చుండబెట్టారు. మా ఇంటిని పావనము చేశారు. మా కమలను, పిల్లలను ఆశీర్వదించారు.

ఆయనకి   జ్ఞానపీఠ ప్రకటన జరిగిన నాడు నేను హైదరాబాదు ఆకాశవాణిలో ఉన్నాను. పన్యాల రంగనాథ రావు పరుగెత్తుకుని వచ్చి పొంగిపోతూ చెప్పాడు "గురువుగారికి   జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది, నేనే ఆ వార్త చదువుతాను"

"గురువుగారికి జ్ఞానపీఠ పురస్కారం అక్కరలేదు. అయినా అది తెలుగువారికి గర్వకారణం" అన్నాను.

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు  జ్ఞానపీఠ పురస్కారం వలనగాని, పీవీ నరసింహ రావు గారి వేయిపడగల అనువాదం వలనగానీ అమరులు కారు.

"జయన్తితే సుకృతినో 

రససిధ్ధా: కవీశ్వరా:

నాస్తి తేషాం యశః కాయే 

జరామరణజం  భయం!"    


[దాశరథి రంగాచార్యులవారి "అక్షర మందాకిని" నుండి]

సేకరణ: వాట్సాప్ సందేశం.

ఆరోగ్య సూత్రములు🍁*

 *🍁సనాతన ఆరోగ్య సూత్రములు🍁*


*భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే, అన్నసంఘాత శైథిల్యం, గ్రీవాజానుకటీ సుఖమ్. భుక్తోప విశత స్తుందం, శయానస్య తు పుష్టతా, ఆయుశ్చం క్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః*


తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్తస్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును.భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును; పండుకొన్న వారికి కొవ్వు పెరుగును; మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును; పరుగెత్తినచో ఆయుఃక్షీణము.


*భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్, వామపార్శ్వేతు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.*


తా:  భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? (ఆరోగ్యవంతుడై యుండునని భావము.)


*అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః, రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతిహి.*


తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే  సర్వరోగములకును మూలము. (మానవులు ఆ యా వేళలయందే మితముగా భుజించవలెను.)


*భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన, జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.*


తా: భోజనసమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధాప్రసంగములు  చేయరాదు, విననూ రాదు..


*🌾సర్వేజనాఃశుఖినోభవంతు🙌🏼సమస్త సన్మంగళానిభవంతు🎋*


(సేకరణ)

సామెతల్లో

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

#సామెతల్లో #ఆయుర్వేదం


"తల్లిని చేసినవాడే #కాయమూ #పిప్పళ్ళు తెస్తాడు" అని..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !


"పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియకపోతే #అశ్వగంధ పెద్ద మందు !"


త్రిదోషహరం #తిప్పతీగ అని సామెత !


"#ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం #మారేడు, కనీసం #కందిపుల్ల" ...ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట..


"వాస్తే #వాయిలాకు పాస్తే #పాయలాకు"


అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే  ...."కొడితే చిన్నప్పుడు తాగిన #దొండాకు పసరు కక్కుతావు "


పుండుమీదకు #ఉమ్మెత్త ,#నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ..

సామెత ..."పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..


."#ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "


వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది. సామెత ...ఇలా ..."ఆశపడి #వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "


#కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలను హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత 


ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "


"ఒక పూట తింటే యోగి

రెండు పూటలా తింటే భోగి

మూడు పూటలా తింటే రోగి "


అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...


ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి ! 

పిల్లవాడు మాతృభాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?  సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ? అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది! జాతి జీవనాడి నశిస్తుంది!

🌹🌹🌷🌷🌹🌹

జపతో నాస్తి పాతకం✡*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

    *వింజమూరి వెంకట*   

   *అప్పారావుగారి పోస్టు*

               🌷🌷🌷

*✡జపతో నాస్తి పాతకం✡* 

ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి, అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మెదలుపెట్టాడు.  అతను నిర్మించుకున్న పర్ణశాలను  చూసి దారినపోయె ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు.  అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయటపెట్టి అయ్యా ... అని అరిస్తే, ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబుని బయట ఇచ్చే వాడు. 

రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు.  అయినా అమ్మ దర్శనం కాలా విసుగెత్తిపోయాడు.  ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసంపక్కన వున్న అడవికి వెళ్ళాడు.

ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడపెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు.  ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు.  ఆయన్ని చూసి అడిగాడు గొల్లవాడు ఏంస్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ వుందని నాకు చెప్పలేదు.

ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు?  అని కోపంతో ఊగిపోయాడు.

అందుకు గొల్ల వాడు మీరు అబద్దం చెపుతున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు తీసుకేళ్ళింది అన్నాడు

అదిరిపోయిన స్వామి నువ్వు అమ్మను చూశావా?  అని అడిగాడు అందుకు గొల్ల వాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది, నాఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది, అన్నాడు.

ఆ చేతి ని వర్ణించ మన్నాడు స్వామి గొల్ల వాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా వుంది.వళ్ళు పులకరించిన స్వామి లోనికి పరుగేత్తేడు గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు.

లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా వుంది.  చూసావా స్వామి మీరు అబద్దం చెపుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్ల వాడు. ఏడ్చాడు స్వామి.  ఇంత దయలేదా నామీద మాతా అని భోరున విలపించాడు.

అప్పుడు జగన్మాత వాక్కు ఇలా  వినిపించింది  "నువు చేసిన పాప ప్రక్షాళనికే ఇన్నేళ్ళు పట్టింది. అది తీరిపోయింది ఇక నీకు దర్శనమౌతుంది. మరలా నా మంత్ర జపం చేయి" అని అంది అమ్మ.

బయట వున్న గొల్ల వాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళి పోయాడు.

 *జపతో నాస్తి పాతకం* 

*ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః* 

✡✡✡✡✡✡✡✡

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆచారవ్యవహారాల పై వివరణ..*


*(ముప్పై మూడవ రోజు)*


శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడింది..ఆ దంపతుల ఇంట్లో రమారమి 21 రోజుల పాటు శ్రీ స్వామివారు బస చేశారు..ఎన్నో బోధలు చేశారు..అలాగే శ్రీధరరావు గారి తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారి పై అచంచల విశ్వాసం కుదిరింది..రోజూ శ్రీ స్వామివారు చెపుతున్న విషయాలకు ఆవిడగారు విపరీతంగా ఆనందపడేవారు.."నాయనా!..నువ్వు ఇక్కడికి రాకపోతే..నాకెవరు ఇన్ని సంగతులు చెపుతారు?.." అనేవారు వాత్సల్యంతో..


"అమ్మా..మృత్యువు పెద్దపులిలా పొంచివుంది..ఎప్పుడూ రామనామం జపిస్తూ వుండు!.." అని చెప్పారు శ్రీ స్వామివారు..శ్రీధరరావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు ఆవిడ గురించి..ఎక్కువ సమయం లేదని కూడా అన్నారు..


ఈలోపల ప్రభావతి గారు బహిష్టు అయ్యారు..ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది..శ్రీ స్వామివారికి ఏర్పాట్లు, వంట ఎలా జరగాలి?..ఆయన యోగి..సిద్ధ పురుషుడు..అలాంటి వారికి మైల తో కూడిన ఆహారం పంపకూడదు..శ్రీధరరావు గారు కూడా మధనపడుతూ.. నేరుగా శ్రీ స్వామివారిని కలిసి..సమస్య చెప్పి.."మీకు అపవిత్రత జరుగుతుందేమో..మిమ్మల్ని ఈ నాలుగు రోజులూ మాలకొండలో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తాను..ఐదవ రోజు ప్రభావతి స్నానం అయ్యాక..మిమ్మల్ని మరలా ఇక్కడికి పిలిపిస్తాను..కొద్దిగా సహకరించండి.." అన్నారు ప్రాధేయపూర్వకంగా..


శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు.."అమ్మ ఎక్కడుంది?.." అన్నారు..


"పెరట్లో కూర్చుని ఉంది..అక్కడే భోజనం చేస్తుంది..అక్కడే పడుకుంటుంది..మీకేమీ ఇబ్బంది ఉండదు..ఈపూటకు మీ స్నానానికి నీళ్లు అవీ పని వాళ్ళ చేత నేను పెట్టిస్తాను.." అన్నారు..


"అమ్మ దగ్గరకు పోదాం పదండి.." అంటూ శ్రీధరరావు గారిని వెంటపెట్టుకుని..ప్రభావతి గారున్న చోటికి వచ్చారు..కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిలుచున్నారు..


"అమ్మా!..నెలసరి అయితే..మీ పనులు మీరు చేసుకోకుండా..నాకేదో అపవిత్రం జరుగుతుందని..చాటుగా వెళ్లి కూర్చున్నావా?..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..నీవు స్వయంగా నా పనులు చేయవద్దు..ఈ సమయంలో అది మంచి నిర్ణయం..కానీ నీవు నాకుఎదురుపడినా..నీవు సహజంగా చేసుకునే ఇంటిపనులు చేసుకుంటున్నా..నాకు అపవిత్రం అని ఎవరన్నారు?..నీకెవరు చెప్పారు?..ముందు ఇంట్లోకి వెళ్లి..నీవు చేసుకునే అన్ని పనులూ చేసుకో..ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి.."అన్నారు నవ్వుతూనే..


శ్రీధరరావు గారు..ఆయన వెనుకాల ప్రభావతి గారూ..వారిద్దరి కంటే ముందు శ్రీ స్వామివారు..ఇంట్లోకి వచ్చారు..అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చుని వున్నారు..ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమో నని భయపడుతూ వున్నారు..


ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి.."అమ్మాయి దూరంగా వుంది నాయనా!.." అని చెప్పబోతున్నారు..శ్రీ స్వామివారు చేయెత్తి ఆవిడను వారించి.."అమ్మా!..ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఇక్కడకు వచ్చానమ్మా.." అన్నారు..


శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని..కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు..కళ్ళు తెరచి..ఆ ముగ్గురిని నిశితంగా చూసారు..ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది..ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు..ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు..


"అమ్మా!..అందరూ శ్రద్ధగా వినండి.." అంటూ..మొదలుపెట్టారు..


ఋతుక్రమం..ఊర్ధ్వ అధో లోకాలు..అజ్ఞాన నివృత్తి..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

వకుళః

 వకుళః ’ అంటారు. ‘రోగాలను పోగొట్టేది’ అని దీని అర్థం.సంస్కృతంలోనే దీనికి ‘కేసరః’ అనే మరో పేరుంది. ‘మంచి ఆకారం, సుగంధం కలిగి శిరస్సున ధరించేది’ అని దీని అర్థం. దీనినే కొందరు ‘సింహ కేసర’ అనీ అంటున్నారు. శ్రీకృష్ణుడికి పొగడ పూలంటే అమిత ఇష్టమట. బృందావనంలోని పొగడ చెట్ల నీడలలోనే గోపికలతో ఆయన ఆటపాటలన్నీ సాగేవట.


వకుళా దేవి ఐతిహ్యం


తిరుమల కొండలపై అనాథ బాలుడైన శ్రీనివాసుడిని తన ఆశ్రమంలో పెంచి, పెద్దచేసి, పద్మావతితో ఆయన వివాహం జరిపించిన వకుళాదేవి తనను తాను శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘వకుళా’ పుష్పం యొక్క మారురూపంగా భావించేదట. రోజూ పొగడపూల మాలలు గుచ్చి కృష్ణుని విగ్రహానికి అలంకరించేదట ఆ భక్తురాలు. కేవలం భక్తురాలిగానే కాక, కృష్ణుడిని పెంచిన తల్లి యశోదగా కూడా తనను తాను ఊహించుకునేదట ఆమె. ద్వాపర యుగంలోని ఆ యశోదే కలియుగంలో వకుళాదేవిగా జన్మించిందని కొందరి విశ్వాసం. శ్రీకృష్ణుడు విదిషను పాలించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకెళ్ళి, రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నప్పుడు యశోద కృష్ణుడితో, ‘ నీ పెళ్లి నా చేతులమీదుగా జరిపించాలని నాకు కోరికగా ఉంది,’ అన్నదట. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ యశోదతో, ‘ నీ కోరిక ఈ జన్మలో మాత్రం తీరేది కాదు. వచ్చే జన్మలో నీవు వకుళాదేవిగా జన్మించి, తిరుమల కొండల మీద నివసించేటప్పుడు నేను ఒక అనాథ బాలుడిగా నీ ఆశ్రమానికి వచ్చి, నీచే చేరదీయబడి, నీ చేతులమీదుగా ( పద్మావతిని) వివాహమాడి, నీ ముచ్చట తీరుస్తాను’, అన్నాడట. శ్రీకృష్ణుని రాకకోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసిన ఆమె అనాథ బాలుడైన శ్రీనివాసుడిలోనే శ్రీకృష్ణుడిని చూసుకునేదట. తిరుపతి – చంద్రగిరి మార్గంలోని పేరూరులోని ఒక చిన్న కొండపై కొందరు భక్తులు కట్టించిన వకుళా మాత ఆలయం నేటికీ ఉంది