20, మే 2021, గురువారం

కరోనా వ్యాధి

 కరోనా వ్యాధి గురించి నా సంపూర్ణ విశ్లేషణ  - 



      ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని కరోనా      గడగడలాడిస్తుంది. నిజానికి ఇది కఫసంబంధ దోష సమస్య . ఎప్పుడైతే కరోనా వైరస్ మనిషిలోనికి ప్రవేశిస్తుందో శరీరంలో కఫ సంబంధ దోషం విపరీతంగా పెరుగుతుంది . దానివల్ల ఊపిరిత్తితుల్లో ఇన్ఫెక్షన్ , ఆయాసం , దగ్గు , తుమ్ములు వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి . చిన్నగా జ్వరము మొదలవుతుంది. ఇవన్నీ మనిషి శరీరంలో వైరస్ సంఖ్య పెరుగుతున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 


                    ఈ వైరస్ యొక్క ప్రభావం అన్నది మనిషి యొక్క రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలముగా ఉన్నవారి పైన  కొంత తక్కువ ప్రభావం ఉంటుంది. ఆయుర్వేదంలో వైరస్ మరియు బ్యాక్టీరియాలకు చేయు చికిత్సలకు " భూతవైద్యం " అనే ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. ఇక్కడ భూతాలు అంటే మరేవో కావు కంటికి కనిపించకుండా మనిషిని రోగాలపాలు చేయు బ్యాక్టీరియా మరియు వైరస్ లు మాత్రమే . కరోనా సోకినప్పుడు  ధైర్యముగా ఉండవలెను ఏ మాత్రం భయానికి లోనుకావొద్దు. మీ భయమే మీలోని రోగనిరోధక శక్తిని తగ్గించును . శరీరం ఏమాత్రం బలహీనపడకుండా మంచి బలమైన ఆహారం తీసుకుంటూ సరైన ఔషధాలను తీసుకున్న అత్యంత త్వరితముగా సమస్య నుంచి బయటపడగలరు . 


           నేను కొంత మంది కరోనాతో ఇబ్బంది పడినవారికి "చ్యవనప్రాశ " ఉదయం ఒక స్పూన్ మరియు సాయంత్రం ఒక స్పూన్ మోతాదులో తీసుకుని అశ్వగంధ కలిపిన పాలు తాగమని సలహా ఇవ్వడం జరిగింది. అదే విధముగా " జిందా తిలిస్మాత్ " మూడు పూటలా ఆవిరి పట్టించమని సలహా ఇవ్వడం జరిగింది. వారందరు అతి త్వరగా కరోనా నుంచి కోలుకున్నారు. ముఖ్యముగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా "కివి డ్రై ఫ్రూట్ " మరియు  "అంజీర " తినమని చెప్పడం జరిగింది.  నేను సూచించిన నియమాలు పాటించినవారు ఇంట్లో ఉండే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు .  



        మీ అందరికి ప్రధానంగా ఒక్క విషయం స్పష్టం చేయదలచుకొన్నాను . కరోనా వచ్చి తగ్గినవారు తమ ఆరోగ్యం పట్ల పూర్తి దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా మంచిది మరియు రోగనిరోధక శక్తిని పెంచే బలవర్థకమైన ఆహరం తీసుకోవడం అత్యంత ముఖ్యసూచన . దీనికి ప్రధాన కారణం ఒకసారి కరోనా మన శరీరంలొకి ప్రవేశించాక అది పోవడం అంత త్వరగా జరగదు . ఇప్పుడు మీరు తీసుకునే ఔషదాల వలనో దేనివలన అయినా అది నిద్రావస్థలోకి వెళ్లి ఏదో ఒకరోజు మరలా మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గాక విజృంభించవచ్చు . కావున మీ రోగనిరోధకా శక్తిని పెంచుకొనుట మీద దృష్టి పెట్టడం మంచిది . 


      అదేవిధముగా కరోనా నియంత్రణకు , మీలోని రోగనిరోధక శక్తిని పెంచు ఔషధాల గురించి మీకు వివరిస్తాను . వీటిని ఈ సమయంలో ఆహరంలో మరియు ఔషధాలుగా వాడుటకు ప్రయత్నించండి. 


  ఔషధాలు  -


   అంజీర పండు , ఇంగువ , ఉత్తరేణి , ఉశిరిక , ఉలవలు , కరివేపాకు , కలబంద , కరక్కాయ , కానుగ , తిప్పతీగ , గనుసుగడ్డ , గోమూత్రం , జిల్లేడుపువ్వు , జాజికాయ , పటికపంచదార , తెల్లవాలు , త్రిఫలములు , దాల్చిన చెక్క , నల్ల ఉమ్మెత్త ( శుద్ది చేయవలెను ) , నీరుల్లి , పచ్చ కర్పూరం , పసుపు , పుగాకు , పుదినపువ్వు , పెద్ద పల్లేరు , అశ్వగంధ , చ్యవనప్రాశ , బూడిదగుమ్మడి , మిరియాలు , వెల్లుల్లి , వేప జిగురు , వేపాకు , శొంఠి , సౌవర్చ లవణము , శెనగలు , అక్కలకర్ర .


        పైన చెప్పినవన్నీ ఈ కరోనా సమయములో ఔషధాలుగా పనిచేయును . 


    

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                          9885030034 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

కామెంట్‌లు లేవు: