20, మే 2021, గురువారం

జై శ్రీరామ్

 నమస్తే


ఏకాక్షర నిఘంటువుల్లో


జ అనగా పుట్టుట

ద అనగా ఇచ్చుట

హ అనగా హరించుట 

జా అనగా పుట్టించుట

జ్ఞ అనగా తెలుసుకొనెను


జై అనగా ఇంద్రియములను జయించుట


శ్రీ  అనగా ఐశ్వర్యం


రా అనగా జ్ఞానము


మ్ అనగా ధైర్యము



జై శ్రీరామ్ అనగా 


ఇంద్రియములను జయించి ఐశ్వర్యవంతుడవై జ్ఞానవంతుడవై ధైర్యవంతుడవై ఉండుము అని అర్థము


ఇప్పుడు మనం జై శ్రీరామ్ అన్న వెంటనే 


ఇది ఒక మతమునకు దేశమునకు పార్టీలకు సంబంధించిన దానిగా భావించడం జరుగుతుంది


భగవద్ సంకల్పముచే ఆవిర్భవించిన  సంస్కృతభాషా పాంచభౌతికసమభాష


వాస్తవంగా భగవత్ నిర్మితమైన

సంస్కృతభాషా అక్షరాలకు పదాలకు వాక్యాలకు కుల మత వర్గ ప్రాంత పరమైన అర్థాలు ఉండువు


మనిషి తనకు తోచినవిధముగా తన భావాలకు అనుగుణంగా 


ఆ అక్షరములను పదములను వాక్యములను సాధనముగా చేసుకొని భావారోపన చేసాడు చేస్తున్నాడు


అందుకే  ఏ అక్షరము పదము వాక్యము అనుచ్ఛార్యము అనుపయోగము కాదు


మనం గ్రహించే విధానమే ప్రధానము


అందుకే ఎలాంటి సందేహములు ఇతర ఆలోచనలు లేకుండా


జై శ్రీరామ్ అందాం 


ఆపదములో ఉన్న అక్షరార్ద  లాభములను పొందుదాం


జై శ్రీరామ్


(సంభాషణసంస్కృతమ్)

కామెంట్‌లు లేవు: