20, మే 2021, గురువారం

వకుళః

 వకుళః ’ అంటారు. ‘రోగాలను పోగొట్టేది’ అని దీని అర్థం.సంస్కృతంలోనే దీనికి ‘కేసరః’ అనే మరో పేరుంది. ‘మంచి ఆకారం, సుగంధం కలిగి శిరస్సున ధరించేది’ అని దీని అర్థం. దీనినే కొందరు ‘సింహ కేసర’ అనీ అంటున్నారు. శ్రీకృష్ణుడికి పొగడ పూలంటే అమిత ఇష్టమట. బృందావనంలోని పొగడ చెట్ల నీడలలోనే గోపికలతో ఆయన ఆటపాటలన్నీ సాగేవట.


వకుళా దేవి ఐతిహ్యం


తిరుమల కొండలపై అనాథ బాలుడైన శ్రీనివాసుడిని తన ఆశ్రమంలో పెంచి, పెద్దచేసి, పద్మావతితో ఆయన వివాహం జరిపించిన వకుళాదేవి తనను తాను శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘వకుళా’ పుష్పం యొక్క మారురూపంగా భావించేదట. రోజూ పొగడపూల మాలలు గుచ్చి కృష్ణుని విగ్రహానికి అలంకరించేదట ఆ భక్తురాలు. కేవలం భక్తురాలిగానే కాక, కృష్ణుడిని పెంచిన తల్లి యశోదగా కూడా తనను తాను ఊహించుకునేదట ఆమె. ద్వాపర యుగంలోని ఆ యశోదే కలియుగంలో వకుళాదేవిగా జన్మించిందని కొందరి విశ్వాసం. శ్రీకృష్ణుడు విదిషను పాలించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకెళ్ళి, రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నప్పుడు యశోద కృష్ణుడితో, ‘ నీ పెళ్లి నా చేతులమీదుగా జరిపించాలని నాకు కోరికగా ఉంది,’ అన్నదట. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ యశోదతో, ‘ నీ కోరిక ఈ జన్మలో మాత్రం తీరేది కాదు. వచ్చే జన్మలో నీవు వకుళాదేవిగా జన్మించి, తిరుమల కొండల మీద నివసించేటప్పుడు నేను ఒక అనాథ బాలుడిగా నీ ఆశ్రమానికి వచ్చి, నీచే చేరదీయబడి, నీ చేతులమీదుగా ( పద్మావతిని) వివాహమాడి, నీ ముచ్చట తీరుస్తాను’, అన్నాడట. శ్రీకృష్ణుని రాకకోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసిన ఆమె అనాథ బాలుడైన శ్రీనివాసుడిలోనే శ్రీకృష్ణుడిని చూసుకునేదట. తిరుపతి – చంద్రగిరి మార్గంలోని పేరూరులోని ఒక చిన్న కొండపై కొందరు భక్తులు కట్టించిన వకుళా మాత ఆలయం నేటికీ ఉంది

కామెంట్‌లు లేవు: