20, మే 2021, గురువారం

జపతో నాస్తి పాతకం✡*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

    *వింజమూరి వెంకట*   

   *అప్పారావుగారి పోస్టు*

               🌷🌷🌷

*✡జపతో నాస్తి పాతకం✡* 

ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి, అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మెదలుపెట్టాడు.  అతను నిర్మించుకున్న పర్ణశాలను  చూసి దారినపోయె ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు.  అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయటపెట్టి అయ్యా ... అని అరిస్తే, ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబుని బయట ఇచ్చే వాడు. 

రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు.  అయినా అమ్మ దర్శనం కాలా విసుగెత్తిపోయాడు.  ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసంపక్కన వున్న అడవికి వెళ్ళాడు.

ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడపెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు.  ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు.  ఆయన్ని చూసి అడిగాడు గొల్లవాడు ఏంస్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ వుందని నాకు చెప్పలేదు.

ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు?  అని కోపంతో ఊగిపోయాడు.

అందుకు గొల్ల వాడు మీరు అబద్దం చెపుతున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు తీసుకేళ్ళింది అన్నాడు

అదిరిపోయిన స్వామి నువ్వు అమ్మను చూశావా?  అని అడిగాడు అందుకు గొల్ల వాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది, నాఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది, అన్నాడు.

ఆ చేతి ని వర్ణించ మన్నాడు స్వామి గొల్ల వాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా వుంది.వళ్ళు పులకరించిన స్వామి లోనికి పరుగేత్తేడు గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు.

లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా వుంది.  చూసావా స్వామి మీరు అబద్దం చెపుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్ల వాడు. ఏడ్చాడు స్వామి.  ఇంత దయలేదా నామీద మాతా అని భోరున విలపించాడు.

అప్పుడు జగన్మాత వాక్కు ఇలా  వినిపించింది  "నువు చేసిన పాప ప్రక్షాళనికే ఇన్నేళ్ళు పట్టింది. అది తీరిపోయింది ఇక నీకు దర్శనమౌతుంది. మరలా నా మంత్ర జపం చేయి" అని అంది అమ్మ.

బయట వున్న గొల్ల వాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళి పోయాడు.

 *జపతో నాస్తి పాతకం* 

*ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః* 

✡✡✡✡✡✡✡✡

కామెంట్‌లు లేవు: