*దైవాంశ అయిన ఆత్మ, ప్రాణ, మనసు మన దేహములో వున్నా ! మానవునికి ఎందుకీ దుఃఖం?*
🕉️🌞🌏🌙🌟🚩
పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, ప్రాణ, మనసు మనదేహములో ఉన్నప్పటికీ కూడా మానవులు దుఃఖానికి గురికావడం ఏమిటి—? అని మనం చర్చించు కుందాం.
1.) ఆత్మ అనునది బ్రహ్మపురిలో సుప్తావస్థలో ఉంటుంది. అంటే మన మెదడులో థర్డ్ వెంట్రికల్ లో నిక్షిప్తమై వుండి ఈ దేహ సామ్రాజ్యాన్ని ఏలడం కోసం ‘ప్రాణ,” “మనసు” ని కిందికి దింపి తను యధాస్థానములో కూర్చొని స్వయంప్రకాశమై ఉంటు అన్నింటికి ద్రష్ట అయి కూర్చున్నది. రాబడినటువంటి
2 ) ” ప్రాణ” (PRANA):— ప్రాణకు అనుచరగణమైన పంచ ప్రాణాలు
1. ప్రాణ,
2.అపాన,
3.వ్యాన,
4.ఉదాన,
5. సమాన వాయువులు , వీటితో పాటు ఉపవాయువులు 1.నాగదత్త,
2.కూర్మ,
3. కృకర,
4.దేవదత్త,
5. ధనంజయల తో కలసి ఈ దేహసంరక్షణలో ఇవి తోడ్పడుతూ తమ తమ విధులను నిర్వహిస్తాయి. దేహములో వుండబడిన కోటానుకోట్ల జీవకణాలకు కావలసిన గాలి, నీరు, ఆహారాన్ని రక్తం ద్వారా అందిస్తుంది.———
* ప్రాణ బ్రెయిన్ రీజన్ లో “ఫోర్త్ వెంట్రికల్” లో వుండి రెస్పరేటరీ systam ద్వారా అన్నింటిని ఆక్టివ్ చేస్తూ తమలో ఉష్ణం తగ్గకుండా 98 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ గా ఉంచుతూ తన విధి నిర్వహణలో ఎలాంటి అలసట ఎరుగక జాగ్రత్, సుషుప్తా అవస్ఠలల్లో కూడా పని చేస్తూ సజీవంగా వుండునట్లు తన విధిని నిర్వహిస్తుంది. దేహము ఈ రకముగా నిలవడానికి కారణం ఈ ప్రాణయే ! దీనినే “క్రియాశక్తి” అంటారు.
3.) మూడవ శక్తి అయినటువంటి మనసు (ఇచ్ఛాశక్తి) ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తూ తన ఇష్టారాజ్యంగా అజ్ఞానముతో తమోగుణ స్థితిలో చేయరాని కర్మలు చేస్తూ,దాని ఫలితాలను , జీవాత్మకు అంటగడుతూ అనేక జన్మలకు నెలవవుతుంది. బంధానికి మోక్షానికి కారణభూత మవుతుంది (మన ఏవ మనుష్యానామ్…)
4.) అన్ని జన్మలలోను మానవ జన్మయే ఉత్తమోత్తమమైనది. జన్మలు తన కర్మానుసారాన్ని బట్టి మారుతుంటాయి. అసలు జన్మలు మూడు రకములు.
దేవ జన్మ, 2. మానవ జన్మ 3.జంతు జన్మ.
ఇందులో కర్మల ఫలితాలను బట్టి జన్మ లెత్తుతుంటారు. కర్మలు ఆ జీవునితోపాటుగా కలిసి ప్రయాణిస్తాయి. అదే శరీరమనే బంధనము. ఈ బంధనము తోనే మనిషి ఈ లోకములోకి వస్తున్నాడు.
5.) ఈ దుఃఖానికి నిలయ మైనటువంటి శరీరాన్ని ధరించడం వల్ల ఈ దుఃఖబాధలు అనుభవించాల్సివస్తుంది.
6.) జన్మ జన్మాన్తరాలలో మనము చేసుకున్న కర్మలవల్ల, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం జన్మ అనేది ఎత్తవలసి వస్తుంది. అంటే శరీరాన్ని ధరించాల్సి వస్తుంది.
7.) మనం చేసే కర్మలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి. ఈ జన్మలోనే కాకుండా వెనుకటి జన్మలలో కూడా కర్మలు చేసి వుంటాము. ఆ కర్మలే శరీరానికి బంధనాలు అవుతాయి. అంటే మనము చేసే శుభాశుభ కర్మల యొక్క సంస్కారముతో బంధింపబడి ఉన్నదన్నమాట.
8.) పూర్వ కర్మల ఫలితానుసారంగా వచ్చిన ఈ శరీరముతో మళ్ళీ మళ్ళీ చేయకూడని కర్మలు చేస్తూ ఈ శరీరాన్ని ఇంకా బంధించు కుంటున్నాము. మనలో ఉన్న స్థూల మనసుతో బాహ్యవిషయాల యందు ప్రలోభపడి , స్థాయికి మించిన కోరికలతో అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని అనుభవించ టానికి అనేక జన్మలు పొందుతూ—చస్తూ జనన మరణాలనే చక్రములో తిరుగుతుంది.
9.) అందుకే జన్మ అనేది ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నకు మనము చేయు కర్మల ఫలితాలే. ఈ జన్మలో కూడా ఇంకా ఇంకా కర్మలు చేస్తూ మనను మనమే బంధించు కుంటున్నాము. ఈ కర్మ శృంఖలాలా నుండి విముక్తి పొందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ శరీరమనేది కర్మఫల స్వరూపమే.
10.) మనసు ఈలాంటి కర్మ చేయడానికి కారణం మనసులో పుట్టు తృష్ణ (కోరిక) వల్లనే . తృష్ణ చేత ప్రేరేపించబడి ఏ వస్తువు అయిన నాది, అధికారము నాదే అని, ఇది నాకోసమే అని, ఉన్నాదల్లా నాకే అని, అంతా నేనే నని, అంతా నాకోసమేనని, అహంకారము పుడుతుంది. దీనికి కారణం అవివేకమే, విచారణాశక్తి లేకపోవడమే.ఈ వివేకశక్తి లేని వారికి “అంతర్ దృష్టి ” ఉండదు.
11.) అవివేకము అనేది అజ్ఞానము వల్ల కలుగుతుంది, అజ్ఞానము వల్ల దుఃఖము కలుగుతుంది. ఒకదానికొకటి సంభంధం కలిగివున్నాయి. ఎలాగంటే, చెట్టు బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది —- ఆ బీజమే మళ్ళీ చెట్టును ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే అజ్ఞానము దుఃఖానికి కారణమైతే —- ఆ దుఃఖమే అజ్ఞానానికి కారణమౌతుంది. ఆ విధంగానే ఈనాడు మనము చేస్తున్న కర్మలన్ని పూర్వజన్మ సంస్కారం యొక్క ఫలితాలే గదా !
12.) ఈ విధమైన కార్యాకారణ ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. దీనికి మూలమేమిటి అవిద్యాత్మక మైన (బ్రహ్మవిద్య లేక) అజ్ఞానము. ఈ అజ్ఞాన స్థితిలో దుఃఖము కలగటం అనేది తప్పనిసరి. కాబట్టి దుఃఖము అజ్ఞానము అనే రెండు ఒకదానినొకటి కారణాలుగా వున్నాయి. అజ్ఞానము వున్న చోట దుఃఖము తప్పదు.
13.) అజ్ఞానమనగా ఆ పరాత్పరుని నుంచి వచ్చిన ఆ మూడు శక్తులను ఏకము చేయక పోవడమే ప్రథమ అజ్ఞానము. విడదీసి పంపడమే దుఃఖానికి కారణం. దానివల్ల కర్మఫలితాలు అనుభవిస్తు జీవితములో గందరగోళ పరిస్థితులు ఏర్పడి. అస్తవ్యస్త మైన జీవనముతో సుడిగుండములో చిక్కుకున్న నావ లాగా పరిస్థితి ఏర్పడింది.
14.) నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నము చేయక గత జన్మల లాగానే ఈ జన్మలో అశ్రద్ధ చేస్తే ఇంకా ఈ శరీర బంధనము లో ఇరుక్కోని ,” పునరఫి జననం,” “పునరఫి మరణం” పొందుతున్నాము.
15.) వచ్చినవి దైవీశక్తులు అయినప్పటికి , వాటిని దైవీ శక్తులుగా గమనించక, తేలిక భావముతో, తృణప్రాయముగ ఎంచి , వాటి బాగోగులు చూడక, సరయిన విధానములో జీవనము గడపక , తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం కూడా ఈ దుఃఖానికి ఒక కారణం.
ఉదా:- పది లక్షలు వెచ్చించి ఒక కారును తీసుకొని దానిని సరి అయిన విధానములో నడుపక మందు మత్తులకు బానిసయై ఆ వాహనాన్ని లోయలో పడేసినచో కంపెనీ వారిది తప్పగునా—? లేక డ్రైవరు నిర్లక్షమా –? మనము బట్టల కొట్టులో తెల్లటి వస్త్రము తెచ్చుకొని ధరించి దానిపై పడు మురికిని తొలగించుకోకపోవడం మన పొరపాటా–? లేదా కంపనీ పొర పాటా–? దీని బాధ్యత ఎవరిది—?
16.) అదేవిధంగా పవిత్రమైన దైవీ శక్తులను అపవిత్రంగా తయారు చేసుకొని చిందర వందర జీవితము గడుపుతున్న ఈ మానవుని నిర్లక్ష్యమే కాదా ! దాని వల్ల జీవితాలు వ్యర్ధమై పోతున్నాయనేది నిర్వివాదాంశము కాదా !
17.) జీవాత్మ , పరమాత్మలో ఐఖ్యము చెందితే తప్ప దుఃఖ నివృత్తి అనేది అసంభవము జీవాత్మ పరమాత్మ ఐక్యతకు మూలము ఈ సాధనయే.(బ్రహ్మవిద్యయే)
18.) భగవంతునిలో ఈ జీవాత్మని ఐక్యము చేసి మోక్షము ఇప్పించ గలిగే ఈ సాధనకు ఎంతో ప్రాముఖ్యత వున్నది. దానిని విజ్ఞులయిన మీరు తేలిక భావముతో చూడగూడదు . దాని యెడల నిర్లక్ష్యము వహించ కూడదు. నీ కర్మలు నీవు ఇక్కడే కాల్చుకోవచ్చని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి ఒక్కాణించారు “ప్రయత్నా ద్యత మానస్తు, యోగి సంశుద్ధ కిల్భష:” అనే శ్లోకం ద్వారా ప్రజానికానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు.
🕉️🌞🌏🌙🌟🚩