21, డిసెంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 116*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                               *ధార్మికగీత - 116*

                                         *****

             *శ్లో:- యో ధ్రువాణి పరిత్యజ్య ౹*

                    *అధ్రువం   పరి షేవతే ౹*

                    *ధృవాణి తస్య నశ్యంతి ౹*

                    *అధ్రువం నష్ట మేవ చ౹౹*

                                        *****

*భా:- లోకంలో స్థిరములు, ప్రయోజన కరములు, హిత కరములు అయిన వానిని వదలి పెట్టి, అస్థిరములు, నిష్ప్రయోజకములు, అప్రియకరములు అయిన వానిని ఆశ్రయిస్తే;  స్థిరములు ఎలాగూ కావాలని వదలడం వల్ల లభ్యం  కాకపోగా,  అస్థిరమును పట్టుకున్నా, దొరికినట్లే దొరికి, సహజంగానే చేజారి పోతుంది. చివరికి రెంటికిని చెడ్డ రేవడి కావలసి వస్తుంది. పార్థుడు నిత్యుడైన పరమాత్ముని కోరుకొని విజయపథంలో నిలువగా, రారాజు అనిత్యమైన సేనాబలగాన్ని కోరి సాధించింది ఏముంది? కర్ణుడు ధర్మాన్ని వదిలి, అధర్మాన్ని ఆశ్రయించి, కొమ్ము గాచి సాధించింది ఏముంది? ప్రహ్లాదుడు మహత్తర  నారాయణ మంత్రమునే నమ్ముకొని దైవానుగ్రహాన్ని పొందితే, తండ్రి ఆ మంత్రాన్ని ద్వేషించి సాధించిందేముంది? రావణుడు కామాంధకారంలో ధర్మాన్ని త్రోసిరాజని, సీతను అన్యాయంగా చెరబట్టి సాధించిందేముంది? వినాశనం తప్ప. ఏనాటికైనా శాశ్వతమైన దానినే ఆలంబనగా చేపట్టాలి. పట్టిన పట్టును కడదాకా వీడకుండా  జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలి. నశ్వరమైన దానిని సేవించి, సముద్రంలో మునిగే నవలా తాను, తనను నమ్ముకొన్నవారిని కూడా నట్టేట ముంచడం ముమ్మాటికి తగదని  సారాంశము*.

                                   *****

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: