5, ఆగస్టు 2022, శుక్రవారం

 చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని


బునే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి RO


మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వ స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే " నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!" అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీ దేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చేసి వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ


యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు


వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.

ఎంత మంది VIP లు వున్నారు?

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


[  *సేకరణ : from -> Rama*]


♦️ *భారత దేశంలో ఎంత మంది VIP లు వున్నారు? వాళ్లకు అయ్యే ఖర్చెంత*♦️


▪️బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!*


▪️ *ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!*


▪️ *జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!*


మరియు :


▪️ *జర్మనీలో 142 ఉన్నాయి!*


▪️ *USAలో మొత్తం VIPల సంఖ్య 252!*


▪️ *రష్యా 312!*


మరియు :


▪️ *చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!*, కానీ 


♦️ *భారతదేశంలో మొత్తం 5,79,092 VIPలు ఉన్నారు!!*


▪️ఈ VIP లకు కల్పించే : 


▪️ *సెక్యూరిటీ, ఫ్లైట్ బిల్లులు, విదేశీ ప్రయాణం & వెకేషన్, రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, క్యాంటీన్లు & ఇతర పెర్క్‌లలో-  రాయితీతో కూడిన అధిక నాణ్యత గల-  ఆహారం యొక్క  బిల్లులను- వాటికి అయ్యే ఖర్చులను ఊహించు కోండి!*


♦️ *బాధగా ఉంది కదూ !*


▪️ *ఈ సంఖ్యను వెంటనే 300 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం, అంతే కాకుండా ఇది మన దేశానికి కావలసిన ఉత్తమమైన సంస్కరణ!*


▪️ *ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఉద్దేశించవలసిన  విలువైన జాతీయ వనరులను- యిలా వృథా చేస్తున్న రాజకీయ VIPల భారీ సైన్యాన్ని- ఒక్కసారి గుర్తుంచుకోండి!*


▪️ *ఈ హాస్యాస్పదమైన అసంబద్ధతకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించ డానికి - ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి!*


♦️▪️ఈ వాస్తవాన్ని దేశమంతా వ్యాప్తి చేసి మీ నైతిక బాధ్యతను నిర్వర్తించండి ?


▪️ఈ సందేశాన్ని మీ అన్ని సమూహాలు మరియు పరిచయాలకు షేర్ చేయండి.


▪️ఈ మార్పు తప్పకుండా జరిగేలా, ఆమార్పును చేయగల దేశం యొక్క-  నిర్దిష్ట అధికారులకు ఈ సందేశం చేరనివ్వండి/ చేరవేయండి.


♦️అనవసరపు విషయాలు మాత్రమే ప్రస్తావించే పత్రికలు, ప్రచార మాధ్యమాలు - ఈ దేశ సంక్షేమం ఎప్పుడో వదిలి వేసాయి. కాబట్టి, ఆబాధ్యత మనమే తీసుకుందాం. *Please share to maximum people*.


హరిః ఓమ్. హరిః ఓమ్.

రాముని గుణగణాల వర్ణన

 శ్లోకం:☝️

*స చ నిత్యం ప్రశాంతాత్మా*

   *మృదు పూర్వంతు భాషతే |*

*ఉచ్య మానోపి పరుషం*

   *నోత్తరం ప్రతిపద్యతే ||*


భావం:  అయోధ్యాకాండ తొలి సర్గలో రాముని గుణగణాల వర్ణన. శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు. 

    అతడు నిత్యమూ ప్రశాంతమగు మనసు కలవాడు. ఆతని మనసులో ఎన్నడునూ కామముగాని , క్రోధము గాని , లోభము గాని చోటు చేసుకొనవు. అందుకే నిశ్చలముగా ఉండును. మనసున ప్రశాంత స్థితి కలిగి ఉండుట మానవునకు ప్రధానముగా ఉండవలెను. 

    రెండవది శ్రీరాముడు ఎల్లప్పుడూ ఎదుటివారి మనసునొప్పించకుండ వినుటకు ఇంపుగా సుకుమారముగా , మధురముగా మాట్లాడేవాడు. ఎవరైనా తనను గూర్చి పరుషముగ మాటలాడినా కూడా దానికి బదులు చెప్పేవాడు కాదు. బదులు చెప్పక పోవుట సమాధానము చెప్పే శక్తి లేక కాదు. ప్రశాంతమైన మనసు కలవాడు అగుటచే ఎదుటివారు మాట్లాడిన మాటకు ఆతని మనసున కోపము కలిగేదికాదు. కోపము కలిగిన నాడు మాట పరుషముగా వచ్చును. ఆతనికి కోపమే రాకపోవుటచే పరుషమైన మాట వచ్చేదికాదు. ఎవరైనా పరుషమైన మాటలు ఆడిననూ వారితో మృదువుగా మాట్లాడేవాడు గాని పరుషముగా మాట్లాడేవాడుకాదు.

    ఈస్థితిని మానవులు అలవరచుకోవలెను అని భావం.🙏

*ఫల ప్రదో భవేత్ కాలే....*

 ఇది కథా…నిజమా…?


          *ఫల ప్రదో భవేత్ కాలే....*


*"విశాఖపట్టణం నుండి పలాసపోవు ప్యాసింజర్ మరి కొద్ది సేపట్లో 5వ నెంబర్ ప్లాట్‌ఫాం నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉంది" అని మైకులో వినబడుతుంటే రామనాథం మాస్టారు గబగబా పరుగెత్తి వెళ్ళి రైల్లో కూర్చున్నారు.


*రామనాధంగారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేసారు; ఎందరో విద్యార్థులకు విద్య గరపారు. మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన్ని గురించి. ఎందరో పేద విద్యార్థులకు చేయూత నందించిన వ్యక్తిత్వం ఆయనది.


*రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన మనసు గతం లోకి పరుగులు పెడుతోంది. చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు. తమ ఊరి పొలాలు, చెరువు గట్టు, శివుడి కోవెల, తను చదివిన బడి.. అన్నీ గుర్తొస్తున్నాయి. తన చిన్ననాటి తెలుగు మాస్టారు చెప్పిన "చేసిన మేలు ఊరకన్ పోదు" అనే మాట ఇప్పటికీ చెవుల్లో వినబడుతోంది. ఆ మాటే తనని ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది.


*రైలు విజయనగరం చేరుతోంది. ఎవరో భిక్షగాడు "జీవము నీవే కదా..దేవా" అని పాడుకుంటూ వస్తున్నాడు. రాంనాథం గారు ఒక ఐదు రూపాయల బిళ్ళ అతని చేతిలో పెట్టారు.


*రైలు విజయనగరంలో ఆగింది. రామనాథం గారు ఓమాటు రైలు దిగారు. ఆ రోజు దినపత్రిక కొని, మళ్లీ రైలెక్కారు. పేపరు చదువుతుండగా వినబడింది.. "టికెట్ టికెట్" అని! తల త్రిప్పి చూశారు. ఎదురుగా రెండు మూడు వరసల ముందునించి టికెట్‌లు తనిఖీ చేస్తూ వస్తున్న అధికారి కనబడ్డాడు. రాంనాథం గారు లేచి నిల్చున్నారు. టికెట్ తీసుకుందామని తన లాల్చీ జేబులో చెయ్యిపెట్టారు. జేబు ఖాళీగా చేతికి తగిలింది!


*మాస్టారుగారికి దిక్కు తోచలేదు. "పర్సు ఏమైంది?! తన పర్సులోనే పెట్టుకున్నాడే, డబ్బులు టికెట్ కూడానూ?! పర్సు జేబులో లేదు!" రెండు జేబులూ తడుముకొని చూసుకున్నాడు. రెండూ ఖాళీనే! దేవుడా, ఏం చేసేది?.. టికెట్ లేదు; డబ్బులు లేవు. వెళ్లేది అమ్మాయి పెండ్లికి!.


*రామనాధం గారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టికెట్.. టికెట్..' శబ్దం ముందు ముందుకు వస్తోంది.


*'నాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితిరాలేదు: ఈ వయస్సులో ఇంతమంది ముందు దోషిగా నిలబడతానే, ఏం చేసేది?" రామనాథం గారి మనసు పరిపరివిధాల పోతోంది.. "విజయనగరంలో దిగి పేపరు కొన్నాను. గాబరాగా పర్సు జేబులో పెట్టుకొని రైలెక్కేసాను.. బహుశా అప్పుడే అది బయట పడిపోయి ఉంటుంది. ఇప్పుడెలాగ?" రామనాధంగారి కళ్ళు మూసుకుపోయాయి.


*"టికెట్..టికెట్..." శబ్దం మరింత దగ్గరకు వచ్చింది.. తన ఎదురుగా ఉన్నవాళ్లని ప్రశ్నిస్తోంది. రామనాథం గారికి చెమటపడుతోంది.


*"ఇప్పుడు ఏం చేయాలి? చేతిలో నయాపైసా అయినా లేదు.. తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు ఈ రైల్లో.." రాంనాథం గారు తలవంచుకుని కూర్చున్నారు. "టికెట్.. టికెట్.." శబ్దం తన పక్క వారిని ప్రశ్నిస్తోంది.......'పరీక్షలో‌ జవాబులు తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాసే విద్యార్థిలాగా ఉంది రాంనాధం గారి పరిస్థితి. "జీవితంలో ప్రతివాడూ ఎల్లప్పుడూ విద్యార్థే......" తాను పిల్లలకు చెప్పిన మాటలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. "తనూ ఇప్పుడో 'అర్థే'.." రామనాధం గారు ముడుచుకు పోతున్నారు.


*"ఏమండీ.. మీ టికెట్ చూపిస్తారా?" ఆ గొంతు తననే ప్రశ్నిస్తోంది.. రాంనాథం గారు తటాలున లేచి నిల్చున్నారు. అతని వేపు చూసారు.. ఒక్క క్షణం నిశ్శబ్దం…


*ఏం చెప్పాలో పాలుపోలేదు..

"ఏమని చెప్పను?.. టికెట్ లేదనేదా?.. నన్ను జైల్లో పెట్టమనేదా?.."


*రైల్వే అధికారి ఏదో అంటున్నారు. రాంనాధం గారికి అది సగం సగమే వినబడుతున్నది.. "నమస్కారం మాస్టారూ, నేను మీ దగ్గర చదువుకున్న గోపాల్‌ని. గుర్తున్నానో లేదో.. నాకు మీరు చాలా సార్లు సాయం చేసారు. విజయనగరంలో రైలు ఎక్కబోతుంటే నాకు ఒక పర్సు దొరికింది. 'ఎవరిదా' అని చూస్తే దానిలో మీ ఫోటో ఉంది.. అక్కడినుండీ నేను మీ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను.


*ప్రస్తుతం రైల్వేలో టి.టి.యీ. గా పనిచేస్తున్నాను మాస్టారూ. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది....ఇదిగోండి, మీ పర్సు తీసుకోండి.. ఇందులో టికెట్ కూడా ఉంది" అని పర్సు అందించి, రాంనాథం గారికి గౌరవంగా నమస్కరించాడు గోపాల్.


*రాంనాథం గారి సంతోషానికి అవధులు లేవు. తన పర్సు దొరకడం ఒక వంతు అయితే, తన విద్యార్థి ప్రయోజకుడై తన ముందు నిలబడి ఉండటం మరొకటి. రాంనాధం గారు ఆలోచనల్లో ఉండగానే గోపాల్ చెబుతున్నాడు.. "మీరు మాకు ఎన్నో నీతి శ్లోకాలు చెప్పారు, అందులో ఒకటి ఇప్పటికీ గుర్తుంది:


*యథా బీజాంకుర: సూక్ష్మ: ప్రయత్నేన అభిరక్షిత:।

ఫలప్రదో భవేత్ కాలే-తద్యల్లోకో సురక్షిత:॥


*విత్తనం‌ నుండి వచ్చిన మొలక చాలా చిన్నది. అయినా దానిని మనం నీరుపోసి జాగ్రత్తగా రక్షిస్తే, అది పెరిగి పెద్దదై, సరైన సమయంలో మనకు ఫలాలను అందిస్తుంది. ఈ లోకం కూడా అలాంటిదే. మనం తోటి వారికి చేసిన సాయం వృధా పోదు. ఏదో ఒకనాడు అది మనకు సహాయమై తిరిగి వస్తుంది.' అని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మేము మీ దగ్గర పెరిగిన పూల మొక్కల లాంటి వాళ్లమే. నమస్కారం. నేను వెళ్ళొస్తాను, అని వెళ్లి పోయాడు.


*"పుస్తక జ్ఞానాన్ని, జీవిత పాఠాలు చెప్పిన గురువులు అందరికీ శుభ నమస్సులు"

                                               

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

సేకరణ.

ఏక శ్లోకి -

 ----శ్రీమాత్రేనమః ---

   ------ఏక శ్లోకి -----

************************

కిం  జ్యోతిస్తవ భానుమానహని మే  రాత్రౌ ప్రదీపాదికం 


స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే 


చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం  దీర్దియో దర్శనే 


కిం తత్రాహమతో భవాన్పరమకిం జ్యోతిస్తదస్మిప్రభో 


( జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు ) 

ప్ర :- తవకింజ్యోతి: ? = నీకు జ్యోతిస్సు ఏది ? 

స :- మే అహని భానుమాన్ , రాత్రౌ ప్రదీపాదికమ్ = నాకు పగలు సూర్యుడు , రాత్రి దీపాదులు. జ్యోతిస్సు 

ప్ర ;- స్యాదేవం ----- మే = అదిసరియే సూర్య దీపాదులగూర్చి తెలుసుకొనడానికి నీకు ఏది జ్యోతిస్సో చెప్పుము. 

స :- చక్షు : = అందుకు నేత్రమే జ్యోతిస్సు. 

ప్ర :- తస్య నిమీలిత సమయే కిమ్ = అది మూసుకోవడం వంటి పరిస్థితుల్లో నీకు జ్యోతిస్సుయేది ? 

 స:- ధీ : = బుద్ది తేజస్సు. 

ప్ర :- ధియో దర్శనే కిమ్ ? = బుద్ధినిగూర్చి తెలుసుకోవడానికి ఏది ? 

స :- తత్ర అహం = అందుకు నేనే జ్యోతిస్సును. 

గురువు :- అతోభవాన్ పరమకం జ్యోతి : = అందుచేత నీవే ( అనగా ఆత్మయే ) పరమమైన తేజస్సు అని తెలిసికొనుము. 

శిష్యుడు :- ప్రభో ! తత్ అస్మి = ఓ గురూత్తమా ! తెలిసినది. ఆ పరమ తేజస్సు నేనే. 

           ఈ శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్నంతటిని ఎలా సంగ్రహించి బోధించారో అది సహృదయైక వేద్యమైన విషయం.