5, ఆగస్టు 2022, శుక్రవారం

ఏక శ్లోకి -

 ----శ్రీమాత్రేనమః ---

   ------ఏక శ్లోకి -----

************************

కిం  జ్యోతిస్తవ భానుమానహని మే  రాత్రౌ ప్రదీపాదికం 


స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే 


చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం  దీర్దియో దర్శనే 


కిం తత్రాహమతో భవాన్పరమకిం జ్యోతిస్తదస్మిప్రభో 


( జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు ) 

ప్ర :- తవకింజ్యోతి: ? = నీకు జ్యోతిస్సు ఏది ? 

స :- మే అహని భానుమాన్ , రాత్రౌ ప్రదీపాదికమ్ = నాకు పగలు సూర్యుడు , రాత్రి దీపాదులు. జ్యోతిస్సు 

ప్ర ;- స్యాదేవం ----- మే = అదిసరియే సూర్య దీపాదులగూర్చి తెలుసుకొనడానికి నీకు ఏది జ్యోతిస్సో చెప్పుము. 

స :- చక్షు : = అందుకు నేత్రమే జ్యోతిస్సు. 

ప్ర :- తస్య నిమీలిత సమయే కిమ్ = అది మూసుకోవడం వంటి పరిస్థితుల్లో నీకు జ్యోతిస్సుయేది ? 

 స:- ధీ : = బుద్ది తేజస్సు. 

ప్ర :- ధియో దర్శనే కిమ్ ? = బుద్ధినిగూర్చి తెలుసుకోవడానికి ఏది ? 

స :- తత్ర అహం = అందుకు నేనే జ్యోతిస్సును. 

గురువు :- అతోభవాన్ పరమకం జ్యోతి : = అందుచేత నీవే ( అనగా ఆత్మయే ) పరమమైన తేజస్సు అని తెలిసికొనుము. 

శిష్యుడు :- ప్రభో ! తత్ అస్మి = ఓ గురూత్తమా ! తెలిసినది. ఆ పరమ తేజస్సు నేనే. 

           ఈ శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్నంతటిని ఎలా సంగ్రహించి బోధించారో అది సహృదయైక వేద్యమైన విషయం.

కామెంట్‌లు లేవు: