23, జులై 2024, మంగళవారం

పద్యఛందములు

 _*🌸మన తెలుగు పద్యఛందములు🌸*_


_*సీసపద్యము.*_

చంపకోత్పలముల చతురసౌరభములు

     లలిత భావములకు నెలవనంగ!

శార్దూల మత్తేభ ఛందమ్ము లలరంగ

     గంభీరసాదృశ్య కవనములకు

తరువోజ తరలమ్ము తళుకులీనుచునుండు!

     అలతి పదములందు అక్కరలును!

తేటితేనెలు చిల్కు తేటగీతుల యందు!

     ఆటవెలదు లందు అందమొలుకు!

చేవగల్గిన ఠీవి సీసపద్యము సొత్తు!

     దేశికవితలందు ద్విపద లెస్స!

వృత్తపద్యములొప్పు నుత్తమశైలితో!

     జాత్యుపజాతుల శైలి మృదువు!    


_*ఆటవెలది.*_

కొండ అద్దమందు కొంచెమై యున్నట్లు

నెంత భావమైన నిముడునట్టి

అందమైన నడక కందపద్యపు సొమ్ము!

కంద మెపుడు తెల్గు కందమనగ!  2

బ్రహ్మేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 387*


⚜ *కర్నాటక  : కిక్కిరి - మండ్యా*


⚜ *బ్రహ్మేశ్వర ఆలయం*



💠 బ్రహ్మేశ్వర ఆలయం , బ్రహ్మేశ్వర లేదా బ్రహ్మేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.

 ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని కిక్కేరి గ్రామంలో హోయసల వాస్తుశిల్పంతో 12వ శతాబ్దపు హిందూ దేవాలయం. 


💠 గ్రామంలోని మరో రెండు ప్రధాన చారిత్రాత్మక దేవాలయాలతో పాటు, శ్రావణబెళగొళలోని ప్రసిద్ధ స్మారక కట్టడాలకు సమీపంలోని కిక్కేరి ప్రాంతంలో చెప్పుకోదగ్గ కళాకృతులతో కూడిన అనేక ప్రధాన శిధిలమైన దేవాలయాలలో బ్రహ్మేశ్వర ఆలయం ఒకటి . 



💠 బ్రహ్మేశ్వర ఆలయం, 12వ శతాబ్దానికి చెందిన హొయసల తరహా ఆలయం.

శివునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హిందూ మతంలోని అన్ని ప్రధాన సంప్రదాయాలు - శైవ మతం, వైష్ణవం మరియు శక్తిమతం, వేద దేవతలతో పాటు దాని ఏకీకరణకు ప్రసిద్ధి చెందింది.


💠 తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో కర్ణాట హిందూ వాస్తుశిల్పంలోని అనేక ఆవిష్కరణలు ఉన్నాయి, అవి  మేష-మకర-పట్టిక ,  నవరంగ మండపం , అనేక విగ్రహాలలోని అధునాతన వివరాలు మరియు లోపల చెక్కబడిన శాస్త్రీయ భారతీయ నృత్య భంగిమలు. 


💠 ఇది 1171 లో హొయసల రాజు నరసింహ I పాలనలో బమ్మవే నాయకితి అనే మహిళ ద్వారా పూర్తి చేయబడింది . 

ఆలయం లోపల మరియు వెలుపల కళాకృతిలో గణనీయమైన భాగం పాడు చేయబడింది, ఉద్దేశపూర్వకంగా వికృతీకరణకు సంబంధించిన సంకేతాలను చూపుతుంది.

 

💠 ప్రధాన ఆలయానికి సమీపంలో దేవి మందిరం ఉంది. దేవి మందిరం కొన్ని దశాబ్దాల తర్వాత నిర్మించబడి ఉండవచ్చు. 

ఈ ఆలయాన్ని కర్ణాటక రాష్ట్రంలోని పురావస్తు, మ్యూజియంలు మరియు వారసత్వ శాఖ (స్మారక చిహ్నం S-KA-543) నిర్వహిస్తుంది 



💠 కిక్కేరికి తూర్పున ఒక చారిత్రక మానవ నిర్మిత జలాశయం ఉంది, దీనిని ఇప్పుడు కిక్కేరి సరస్సు అని పిలుస్తారు. 

ఈ సరస్సు ఒడ్డున మూడు ప్రధాన హిందూ దేవాలయాల (మల్లేశ్వర ఆలయం, బ్రహ్మేశ్వర ఆలయం మరియు జనార్దన దేవాలయం) చారిత్రక శిధిలాలు ఉన్నాయి. 


💠 ఈ గ్రామంలో చారిత్రాత్మకమైన నరసింహ దేవాలయం  కూడా ఉంది, ఇది తరువాతి కాలానికి చెందినది మరియు అందంగా చెక్కబడినది, కిక్కెరమ్మ అని పిలువబడే దేవి ఆలయం (శక్తి, దుర్గా విగ్రహం), మరియు బసవన్న ఆలయం (లింగాయత్). బ్రహ్మేశ్వర ఆలయం గ్రామం యొక్క తూర్పు-ఈశాన్య వైపున ఉంది, జనార్దనకు అంకితం చేయబడిన మరింత చిన్న మరియు నిర్లక్ష్యం చేయబడిన హోయసల ఆలయానికి ఉత్తరాన కొన్ని వందల అడుగుల దూరంలో ఉంది. 


💠 బ్రహ్మేశ్వర ఆలయం చాలా చిన్న దేవి మందిరంతో పాటు కాంపౌండ్‌లో ఉంది. 

ఇది ఒక గర్భగుడిని కలిగి ఉంది ( ఎకకూట ) మరియు ఇది తూర్పు ముఖంగా ఉంది. 


💠 జగతిపై ఉన్న ఇతర పెద్ద హొయసల దేవాలయాల మాదిరిగా కాకుండా  ఈ ఆలయం నేరుగా నేలపై అమర్చబడి ఉంటుంది. 

దీనికి ఉత్తరం మరియు దక్షిణం నుండి ఒకదానికొకటి ఎదురుగా రెండు ప్రవేశాలు ఉన్నాయి.

ఈ ప్రవేశాల తర్వాత ఒక వైపు శివ వాహనంతో కూడిన నంది మండపం ఉంది . మరొక వైపు నవరంగ మండప (యాత్రికుల సమావేశ మందిరం)లోకి ప్రవేశిస్తుంది, ఇది ఒక అంతరాలయము తో అనుసంధానించబడి గర్భగృహం  ఉంటుంది.


💠 ఆలయ గోడలు వాస్తుశిల్పంపై పాఠ్య పుస్తకంలో దృష్టాంతాలను వర్ణిస్తున్నట్లుగా తోరణాలు కూడా వైవిధ్యాలను చూపుతాయి. విమానం యొక్క గూళ్ళలో, అదేవిధంగా, అన్ని ప్రధాన హిందూ సంప్రదాయాల నుండి ఉపశమనాలు ఉన్నాయి. 

ఉదాహరణకు, శైవమతానికి చెందిన నటరాజు, దక్షిణామూర్తి మరియు అర్ధనారీశ్వరుడు ఉన్నారు; 

తర్వాత విష్ణువు మరియు వైష్ణవుల కృష్ణ-లీల అవతారాలు; 

దుర్గ, లక్ష్మి, సరస్వతి మరియు శక్తి యొక్క చండీ; 

బ్రహ్మ, సూర్యుడు, వేద సర్వదేవతలకు చెందిన చంద్రుడు; అలాగే హరిహర (సగం శివుడు, సగం విష్ణువు) వంటి మిశ్రమాలు. 


💠 భారతదేశం అంతటా అనేక చారిత్రాత్మక హిందూ దేవాలయాలు 3 సంప్రదాయాలను కలిగి ఉండగా, కిక్కేరిలోని బ్రహ్మేశ్వర ఆలయం దాని సమతుల్యత మరియు కళాకృతిలోని వివరాలకు ప్రసిద్ది చెందింది. 


💠 ప్రధాన మండపం లోపల శైవం, వైష్ణవం మరియు శక్తి మతాల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఇవి ఉన్నాయి: 

పడమటి వైపు వినాయకుడు వసారాకు ప్రక్కగా ఉన్నాడు

పడమటి వైపు గూడలో దుర్గ

కార్తికేయ (స్కంద, మురుగన్) దక్షిణ భాగంలో వసారాకు ఆనుకుని ఉన్నాడు

నవరంగ మండపం యొక్క పెద్ద భద్ర గూళ్ళలో నాలుగు అడుగుల శివుడు మరియు నాలుగు అడుగుల విష్ణువు

ఆలయానికి తూర్పు వైపున ఉన్న నంది మండపంలో రత్నాలతో కూడిన నంది.

నంది దగ్గర సూర్యుడు, వీరి కోసం నంది మండపాన్ని విస్తరించారు

Panchaag


 

గురు స్తుతి*

 *గురు స్తుతి*


ఎవ్వాని రూపంబు నించుక చూడగా

యగుపించు మాత గాయత్రి మూర్తి!


ఎవ్వాని మాటలే 

ఇసుమంత విన్నచో 

ఇహపర సౌఖ్యాల 

సహజ స్ఫూర్తి!


ఎవ్వాని ముఖమందు  నవ్వులో తలపించు  

సంగీత సాహిత్య చక్రవర్తి!


ఎవ్వాని సాంగత్య మిష్టపూర్వక సేవ

జగతిలో నిచ్చు 

సంచలిత కీర్తి!


అట్టి పురుషోత్తమానంద యమృత మూర్తి!


మమత కారుణ్య మూర్తి! యతి మహిత కీర్తి!


ఇలను ప్రభవమ్ము నొందె,  యీ కలువకొలను


చతురతామూర్తి! 

శ్రీరామచంద్రమూర్తి!


*ముత్య రామకృష్ణ*

*రాజమహేంద్రవరం*


కవుల కలములు

*తే.గీ.* 

కవుల కలములు కమనీయ కవితలల్ల!

పద్యరచనలు విరివిగ పదనుగూర్ప!

భావపరిమళ సొగసులు పంచుడయ్య!

పద్యలహరి సమూహ వైభవము నిచట!

శివుని పాదసేవ

 

: శివుని పాదసేవ చిత్తమందున జేసి

చదువు లమ్మ ఒడిని చక్క నాడి

గంగ‌నీట‌మునిగి గట్టు కూతునుగొల్చె 

పుణ్యమూర్తి యంచు పొగడ వలయు.


: తూములూరి మహాలక్ష్మీ భ్రమరాంబిక.

శ్రీమదాంధ్ర మహాభారతము

 *శ్రీమదాంధ్ర మహాభారతము*


సీ. నన్నయభట్టుతో నయముగా మొదలయ్యు 

                నాంధ్రభారతకావ్య మవని సాగె 

     నిరుపర్వ భాగమే పరిపూర్ణమయ్యును 

                నంతలో నా కావ్య మాగిపోయె 

     తదుపరి నిన్నూఱు సంవత్సరములకు 

                పుణ్యుడౌ తిక్కన పుడమి బుట్టి 

      పర్వంబునాల్గుతో ప్రారంభ మొనరించి 

                 పరిపూర్తి గావించె పదియునైదు 

      పిదపను నూఱేండ్లు సదమల కావ్యమ్ము 

                  నుండెను కొరతతో నుర్వి పైన

      నన్నయ్య వీడిన నవకంపు భాగమ్ము 

                 పూరించె నెఱ్ఱన పూర్తిగాను 

తే. భవ్యమైన శ్రీమదాంధ్ర భారతంబు 

     గడచి మున్నూఱువత్సరకాల మరయ 

     కవులు మువ్వురి కృతమౌచు ఘనము గాను

     తెలుగుజాతికి లభియించె దివ్యముగను      


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


మూడువన్నెల జెండాను

 సీ ॥

దేశభారతి యొక్క క్లేశమంతయు బాప 

సాగించి యుద్ధమ్ము త్యాగనిరతి 

స్వాతంత్ర్యమును దెచ్చి బావుటా నెగిరించి 

మువ్వన్నెలను బూసి మురియజేసి 

మనకింత స్వేచ్ఛను మమతతో పంచిన 

వీరసైనికులలో పేరుబడసి 

వెంకయార్యుడు మించె పింగళి వంశంపు 

రాకాశశాంకుడై రాణకెక్కి 

తే.గీ. 

సంస్మరించెద మీనాడు సన్నుతించి 

వెంకయార్యుని భక్తితో వంకలేక 

కేతన మ్మెగిరించిన నేడు ప్రీతినొంది 

మూడువన్నెల జెండాను మోయుదమ్ము 

*~శ్రీశర్మద*

దత్తపది* *జీవావిర్భావం*

 *దత్తపది*  *జీవావిర్భావం* 


*ఆ.వె.* 

*అండము* నిను గర్భమందు రూపిని జేయ!

*ఖండము* లది గాక పిండమయ్యె!

*గండము* మరిదప్పి కాయ మేర్పడజేయ!

*దండము* నిడు తల్లిదండ్రి కెపుడు!

ఫీజులు

 💸 *ఫీజులు ...గుండెలు గుభిల్లు`*


✍️ *దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యావ్యయం ...ఐఐటి ల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు ఫీజుల పెంపు, ప్రభుత్వం ప్రకటించే ఫీజుకన్నా రకరకాల గా అదనంగా వసూలు చేస్తున్న ప్రవేటు కాలేజీలు. వాటిపై పర్యవేక్షణ చేయని యంత్రాంగం. ఫీజుల వసూలులో ఆన్ లైన్ చెల్లింపు కన్నా ,క్యాష్ చెల్లింపులే ఎక్కువ. అదనపు వసూళ్ళు కు తోడు పాకెట్ మనీ పేరుతో ,పుస్తకాలు పేరుతో , ఏసీల పేరుతో ,హాస్టల్ పేరుతో... ఇష్టానుసారంగా వసూళ్ళు .డిమాండ్ మేరకు ప్రభుత్వ కాలేజీల సంఖ్యా పెరగాల్సిందిపోయి ప్రవేటు కాలేజీ లకు అనుమతుల వెల్లువ.. గ్రౌండ్లు ఉండవు ,కనీస  వ్యాయామం ఉండదు, నెలల పొడవునా కనీసం సూర్యరశ్మి తగలని పరిస్థితి ల్లో విధ్యార్థులను యంత్రాల్లా చూస్తున్న దారుణ పరిస్థితి లు ఉంటున్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు కు కారణమౌతున్న దుస్థితి లను చక్కదిద్దే చర్యలు బహు అరుదే `*

మనసుననూగు కోరికలు

 చంపకమాల:

********

మనసుననూగు కోరికలు,మాలతిమాధవమైసుఖించగా!

ఘనము కుటుంబ బాధ్యతలు,గారవమందగసాగగోరుచున్!

తనమనసంతనొక్కటిగ,దాసిగజూడకనుండు భర్తయే!!

గుణమును మెచ్చగావలెను,గుట్టుగసాగెడువీరిబంధమే!

++++++++++

రావెల పురుషోత్తమరావు

(అమెరికా)

శిశుపాలు

 సీ||

శివుని త్రిశూలమ్ము ఛిద్రమ్ము జేయును

        ప్రల్లదముల బల్కు పాశవికుల;

శ్రీకృష్ణ చక్రమ్ము ఛేదించునే గదా

శిశుపాలు బోలెడి చెనటి తతిని;

ఆంజనేయుని చేతి ఆయుధమ్మౌ గద

   మొరకు రాక్షసులను మోదగలదు;

అమరేంద్రు చేతిలో యమరిన యా పవి

     ముక్కలుగా నఱకు ముష్కరులను;

తే.గీ.

శిష్టరక్షణ జేయంగ జేతులందు

నాయుధమ్ముల దాల్చిరి అమరగణము;

హైందవమ్మును జూచుచో నల్పముగను

చేటు గొని తెచ్చుకొనుటయే చేతులార!


--------కోడూరి శేషఫణి శర్మ

ఆరోగ్యమును వ్యసనము హరించును.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏼


శ్లో.  ఆరోగ్యం వ్యసనం హన్తి - తద్ధన్తి రుగ్మతా తాం చ| 

మృత్యుర్వై హన్తి తం హరః - తస్మాత్ హరం భజాऽనిశమ్|| 

రచన- సదాశివానందనాథః (ఆచార్య రాణి సదాశివ మూర్తిః)


తే.గీ.  వ్యసన మారోగ్యమును చంపు, వ్యసనమదియు

రోగమునఁ జచ్చు, చచ్చును రోగమదియు

మృత్యు దేవత చేతిలో, మిత్తి శివుని

చేత చచ్చును, గొలువుమా శివుని సతము.


భావము. ఆరోగ్యమును వ్యసనము హరించును. వ్యసనమును రోగము హరించును. రోగమును మృత్యువు హరించును. మృత్యువును హరుడు హరించును. కనుక హరుని ఎల్లప్పుడూ సేవింపుము.

🙏🏼

చింతా రామకృష్ణారావు.

నమస్కరిస్తున్నాను

 కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం | 

ఆరుహ్య కవితాశాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్ ||


భావము:

కవిత్వమనే కొమ్మనెక్కి తియ్యనైన అక్షరములు గల 'రామ రామ' అనే పేరును చెవుల కింపుగ పలుకుచున్న వాల్మీకి మహర్షి అను కోయిలను గూర్చి నమస్కరిస్తున్నాను.


అవ్యకే శబ్దే కూజతి -  కూయుట.

ఆరుహ్య = ఎక్కి

నడిచే దేవుడు…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

230724-2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀499. పరమాచార్య పావన గాధలు…



*స్వామి అల్లిన మాలలు -*

           *దంపతుల మహద్భాగ్యం!*

                 ➖➖➖✍️


```

కాంచీపురంలోని కామకోటి పీఠంలో మహాపెరియవాను దర్శించి, ఆశీర్వాదం పొందడానికై ఒకనాటి సాయంత్రం వృద్ధ దంపతులొకరొచ్చారు. 


నూతన వస్త్రాలు ధరించియున్న వారు స్వామివారి ముందు ప్రణమిల్లారు. 


"అంతా సవ్వంగా జరిగిందా?", అని స్వామివారు అడిగారు. 


ఆ వృద్ధ మహిళ కన్నీటి పర్యంతమైంది. 


స్వామివారు వారినక్కడ కూర్చోమని ఆదేశించి వారితో సంభాషణారంభించారు. 


వారితో మాట్లాడుతూనే రెండు పూలమాలలను కట్టి, ఆ దంపతులకిచ్చి దండలు మార్చుకోమన్నారు. 


మహాస్వామి ఆదేశించడంతో అక్కడున్న వేదపండితులు కూడా మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. 


కన్నులవెంట నీరు కారుతుండగా, "సర్వేశ్వరా,సర్వేశ్వరా",అని ఆ మహిళ మౌనంగా జపిస్తోంది. 


కొద్దిసేపటి తరువాత స్వామివారు వారిద్దరినీ ఆశీర్వదించి పంపించారు.


స్వామివారు తానే స్వయానా ఎందుకు పూలమాలలు కట్టి 

ఆ దంపతులను ఆశీర్వదించారన్న ఉత్సుకత అక్కడున్న కొద్దిమంది భక్తులకు కలిగింది. 


తాము బెంగుళూరు వాస్తవ్యులమని, డెబ్బై సంవత్సరాలు  పూర్తైన తరువాత చేసే 'భీమరథ శాంతి' అనే వేడుక పూర్తిచేసుకొని మధ్యాహ్నం బెంగుళురుకు తిరుగు ప్రయాణమయ్యామని, ఆ మహిళ అక్కడున్న ఒక భక్తరాలికి చెప్పింది. 


తిరుగుప్రయాణంలో మహాస్వామి దర్శనం చేసుకొని, ఆశీర్వాదం తీసుకోవాలనుందన్న కోరిక ఆవిడ కొడుకుకి వెలిబుచ్చారు. 


మరుసటి రోజు తనకు బెంగళూరులో పని ఉందని, అందుకని అదే రోజు వెళ్ళడం అవ్వదని ఆవిడ కొడుకు అన్నాడు. 


కాకపోతే ఒక రెండు రోజుల్లో ఆవిడను కంచికి పంపడానికి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. 


మనస్సులో మౌనంగా మహాస్వామిని ప్రార్థించడం తప్ప ఆవిడకి వేరే గత్యంతరం లేకపోయింది.


చెన్నై నుండి కుటుంబం మొత్తం రెండు కార్లలో బయలుదేరారు. వెల్లోర్ కి చేరుకున్నారు. అక్కడ నుండి బెంగళూరుకు మళ్ళుదామనే సమయంలో కారు బ్రేక్ డౌన్ అయింది. కారు రిపేరు చెయ్యడానికి రెండు గంటలు పడుతుందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ నుండి కాంచీపురం దగ్గరే కాబట్టి, కారు రిపేరయ్యేలోపల వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వీలుపడుతుందా అని ఆవిడ కొడుకును అడిగారు. కొడుకు అభ్యంతరం చెప్పలేదు. 

ఆ దంపతులిరువురు మరొక కారులో కాంచీపురం పయనమయ్యారు. ఆ దంపతులకు దక్కిన మహద్భాగ్యం మనకు తెలిసినదే. స్వామివారి స్వహస్తాలతో అల్లిన పూలమాలను ప్రసాదంగా పొందిన ఆ దంపతులు ఎంత అదృష్టవంతులో కదా‌!


మహాస్వామి తన భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ వర్షిస్తారని తెలిపే మరొక నిదర్శనమే ఇది.✍️```



అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

వయస్సు డెబ్భై

 మేము  వయస్సు డెబ్భై అయినా ,  ఉత్సాహంలో ఇరవై మాత్రమే.


పచ్చగా మెరిసే పండుటాకులమే గాని చప్పుడు చేసే ఎండు టాకులం కాదు

కలలు పండినా పండకపోయినా

మేము తలలు పండిన తిమ్మరుసులం


కొరవడింది  కంటి చూపు గాని

మందగించలేదు ముందు చూపు


అలసిపోయింది  దేహమే గాని

మనసుకు లేనే లేదు సందేహం


ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా

ఈ భూమికి కాబోము భారం


వయస్సు రీత్యా డెబ్భై లో ఇరవై కాకున్నా అందని ద్రాక్ష కై అర్రులు చాచం


కుందేళ్ళమై పరుగులు తీయకున్నా

తాబేళ్లమై గెలుపు బాట చూపగలం


చెడుగుడు కూతల సత్తా లేకున్నా

చదరంగపు ఎత్తులు నేర్పగలం


సమయం ఎంతో మాకు లేకున్నా

సమయమంతా మీకు సమర్పిస్తాం


అనుకోకుంటే అధిక ప్రసంగం

అనుభవ సారం పంచుకుంటాం


వాడిపోయే పూవులమైనా

సౌరభాలు వెదజల్లుతాం


రాలిపోయే తారలమైనా

 కాంతి పుంజాలు వెదజల్లుతాం


DEDICATED TO SENIOR CITIZENS.

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

ముత్యాల అవసరమే లేదు.

 ఓం శ్రీమాత్రే నమః🙏🏼


శ్లో. ముక్తాఫలైః కిం మృగపక్షిణాం చ 

మృష్టాన్న పానం కిము గార్దభానామ్। 

అంధస్య దీపో బధిరస్య గీతం 

మూర్ఖస్య కిం ధర్మకథాప్రసంగః|| (నీతి చంద్రిక)


తే.గీ.  అల మృగములు పక్షులకు ముత్యములవేల?

మధురమైనట్టి భుక్తి గాడిదలకేల?

నంధ బధిరులకును దీప, సుందర నుత

గీతమేల? ద్రాబకు ధర్మ గీతులేల?


భావము.  మృగాలకుగానీ పక్షులకుగానీ ముత్యాల అవసరమే లేదు. గాడిదలకు మధురమైన భోజనము గానీ, మధురపానీయము గానీ అవసరమే లేదు. గ్రుడ్డివానికి దీపముతో పని లేదు. చెవిటివానికి సంగీత మవసరము లేదు. మూర్ఖునికి ధర్మబోధలతో ప్రయోజనము లేదు.

🙏🏼

చింతా రామకృష్ణారావు.

ప్రాప్తించిన దానితో

 *ప్రాప్తించిన దానితో సంతృప్తితో జీవించాలి* 


కోరికలు కష్టాలకు దారితీస్తాయని గ్రహించిన తర్వాత, వివేచన ఒక్కటే దానిని మార్చుకోగల ఏకైక మార్గం.  కాబట్టి, నిరుపేదలు కూడా ఎలాంటి వస్తువులను కోరుకోకూడదు.  తనకు లభించిన దానితో సంతృప్తి చెందాలి.  భగవత్పాదులు ఇలా

 *విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యతం* 

(విదివశాత్ నుండి పొందిన దానితో మాత్రమే సంతృప్తి చెందండి) అన్నారు.  

భగవంతుడు ఏది ఇవ్వాలంటే అదే మనకు లభిస్తుంది.  విధి యొక్క శక్తి అలాంటిది. ఆ విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. మనం మనుషులు లేని దేశంలో ఉన్నా, అదే జరుగుతుంది. 

 *ద్వీపదాన్యస్మాధాభి మధ్యాదభి జలనిధర్తిసోప్యన్త I* 

 *అనేయా జడితి కడయతి విదిరభిమదమపిముమకీభూత:   II* 

"రెండు విషయాలు కలిసి రావాలని అనుకుంటే, అవి వేర్వేరు ద్వీపాల నుండి, సముద్రం యొక్క కడుపులో లేదా చాలా దూరం నుండి వచ్చినప్పటికీ, విధి వాటిని ఒకచోట చేర్చుతుంది." 

కాబట్టి మనం కోరికలకు ఆస్కారం ఇవ్వకుండా భగవత్ గీత ద్వారా ఆ పవిత్ర బోధనలను అనుసరించి జీవిత లక్ష్యాన్ని సాధించాలి.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ఆవుతో సేంద్రియ వ్యవసాయం -

 ఆవుతో సేంద్రియ వ్యవసాయం - 


 పశువులలో గోవు , మనిషికి ముఖ్యంగా రైతుకి ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది. ఆవుపాలు , నెయ్యి, మజ్జిగ, పెరుగు, మూత్రము , పెడ, కొమ్ములు గిట్టలు అన్ని వ్యవసాయ రంగానికి ఉపకరించేవి.


 ఆవుపాల విశిష్టత - 


 ఆవుపాలకు వ్యాధికారక వైరస్ ని నిరోధించే శక్తి ఉంది. విత్తనాలను ఈ పాలతో శుద్ది చేయడం శ్రేయస్కరం.వీటితో భూసారాన్ని పెంచవచ్చు.


 పంచగవ్య విశిష్టత - 


 పుజాకాలలో పంచామృతాల పేరుతో ఆవుపాలు , పెరుగు, నెయ్యి, తేనే , కొబ్బరినీళ్ళు  వాడతారు. వీటిని పవిత్రముగా చెబుతారు. అలాగే వ్యవసాయానికి సంబందించి ఆవుపాలు , పెరుగు , నెయ్యి, మూత్రము , పెడ , కలిపి పంచగవ్య అంటారు. వీటన్నిటిని నిర్దిష్ట పరిమాణంలో  మిశ్రమం చేయాలి . ఈ మిశ్రమం పంటల పెరుగుదలకు, యాంటి వైరస్ గా , యాంటి బ్యాక్టీ రియల్ గా పనిచేస్తుంది. 


 గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు విశిష్టత - 


 గోవు సహజంగా మరణించిన తరువాత దాని శరీరం నుండి తీసిన గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు, వీటన్నిటిని కలిపి కాల్చిన పిడక పై వేస్తే పొగ వస్తుంది. దీనిని ప్యుమింగ్ అంటారు. కూరగాయల చెట్లకు ఈ పొగ పెడితే వాటికి కీడు చేసే సూక్ష్మ క్రీములు ఎగిరిపోతాయి, లేదా చనిపోతాయి. చచ్చుబడి మడతలతో వంకరగా తయారైన ఆకుకూరలు దీనివల్ల చక్కగా పొడుగ్గా ఎదుగుతాయి.


 కొమ్ముల విశిష్టత - 


 మరణించిన గొవుల నుండి కొన్ని కొమ్ములు సేకరించి వాటిని ఆవుపేడతో నింపి భుమిలొ పుడ్చిపెట్టాలి. ఆరునెలల తరువాత ఈ కొమ్ములు బయటకు తీసి వాటితో ఒక కొమ్ము పేడను ఒక ఎకరం భూమిని సమస్కరించడానికి , సారవంతం చేయడానికి వినియోగించవచ్చు 


 ఆవుముత్రం తో అధిక దిగుబడి. -


 ఆవుముత్రం 5 రకాలు అవి 


 1. వట్టిపోయిన ఆవు ముత్రము 2. పాలిచ్చే ఆవుముత్రం . 3. చూడి ఆవుముత్రం . 4. ఎద్దు ముత్రము . 5. ఆవుజాతి పశువుల ముత్రము 


 మొక్కల ఎదుగుదలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది . పురుగులను చెట్ల ధరిచేరనివ్వదు.

 వరి నాట్లు పూర్తి అయిన తరువాత 20 రోజులకు ఒక లీటరు దేశవాళి మాములు ఆవుముత్రానికి 10 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రె చేస్తే అద్బుత ఫలితాలు కనిపిస్తాయి. తరువాత 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి స్ప్రే చేయాలి . మరలా 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని లీటరుకు 50 గ్రాములు వాయు విడంగాల పొడిని కలిపి 24 గంటలు నానబెట్టి చల్లాలి. నాలుగో సారి అంటే నాట్లు వేసిన  80 రోజుల తరువాత సాదారణంగా స్ప్రే అవసరం లేదు . అవసరం అనిపిస్తే పైన పేర్కొన్నట్టు స్ప్రే చేయాలి . మనం సహజ పద్ధతిలో చేసే వ్యవసాయం కంటే దీనివల్ల మూడు నుండి ఆరు క్వింటాళ్ళ ధాన్యం అదనంగా పండించవచ్చు.


 గోముత్రంలో వాయు విడంగాలను 15 రోజులు మురగబెట్టి, పైరు పూత పూసే సమయానికి ముందు ఆకులపై స్ప్రే చేస్తే మాములుగా పంట కన్నా రెండింతలు దిగుబడి అధికంగా వస్తుంది.


 ఇదే విధంగా ఉడుగ చెట్టు ఆకులు, కాయలు గొముత్రంలో పదిహేను రోజులు మురగబెట్టి చల్లినా కుడా రెండింతలు దిగుబడి అదనంగా పొందవచ్చు. అయితే కాయలు మాత్రమే మురగబెట్టినప్పుడు ఒక విధమైన ఫలితం. ఆకులు మాత్రమే మురగబెట్టినప్పుడు   ఒక విధమైన ఫలితం కలుగుతుంది.


 గొముత్రంతో ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి 


 ఆవుపేడ నే కాదు ముత్రాన్ని కుడా ఎరువుగా వినియోగించుకోవచ్చు . ఆవు ముత్రం సాధారణగా వృధా పొతుంది.అక్కడ ఒక తొట్టె కట్టాలి. ఆ తొట్టెలో ప్రతిరోజు ఉదయం మట్టిని వేసి మరుసటి రోజు తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా తీసిన మట్టిని మొక్కకు ఒక తట్ట చొప్పున వేస్తే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు . మంచి దిగుబడి వస్తుంది.


 జీవద్రవం తయారి విధానం - 


 ఆవు ఈనబోయే ముందు ఉచ్చ బు డ్డ కనపడుతుంది . ఒక సంచిలో నీళ్లు ఉన్న విదంగా అది గుండ్రంగా ఉంటుంది.దీనికి రంద్రం చేసి జీవ ద్రవాన్ని బకెట్ లొ పట్టుకొవాలి. దానిలొ ఒక నిమ్మకాయ రసాన్ని పిండితే ఇది 3 నెలలు నిలువ ఉంటుంది. 

           ఈ జీవద్రవాన్ని లీటర్ కి పది లీటర్ల నీళ్లు కలిపి మొగ్గదశకు ముందే ఏ పంటపైన అయినా చల్లితే పూత , పంట ఎక్కువగా వస్తాయి.నారుమల్లు వేసిన 10 రోజులకు దీనిని స్ప్రే చేస్తే ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని నారుమడి సాధించవచ్చు.

 

 విత్తనాలు, విత్తనశుద్ధి -


 విత్తనశుద్ది కొసం ఒక క్వింటా విత్తనాల పై ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల పైన తెలిపిన జీవద్రవాన్ని చల్లి బాగా కలిపి ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి. ఏ రకం విత్తనాలనైన విత్తడానికి సిద్దం చేసుకున్న తరువాత ఆవుపాలు ఒక భాగం నీళ్లు 9 భాగాలు కలిపి విత్తనాలపై చల్లి నీడలో ఆరనిచ్చి విత్తుకోవాలి.

             ఎద్దులు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చిన తరువాత పోసే ముత్రాన్ని సేకరించి క్వింటా విత్తనాలకు ఒకటి లేదా రెండు లీటర్లు కలిపి నీడలో ఒకరొజు ఆరనిచ్చి నాటాలి.


  

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

అద్భుతాన్ని గమనించండి

 ShareChat


@సూర్య ప్రకాష్ సా...


అద్భుతాన్ని గమనించండి మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది


తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీః||


శ్రీయాదవం భవ్యభతోయ దేవం సంహారదాముక్తిముతాసుభూతం॥


మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి


ఇది ఒక్క సనాతన ధర్మంలోనే సాధ్యం

జూలై 23, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁

  🌹*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁

  🌹 *జూలై 23, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*

                  

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : విదియ* ఉ 10.23 వరకు ఉపరి *తదియ*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : ధనిష్ఠ* రా 08.18 వరకు ఉపరి *శతభిషం*


*యోగం : ఆయుష్మాన్* మ 02.36 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం : గరజి* ఉ 10.23 *వణజి* రా 08.56 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 11.00 - 01.00  మ 02.00 - 03.30*

అమృత కాలం :*ఉ 10.47 - 12.15*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*

*వర్జ్యం :  రా 02.53 - 04.21 తె*

*దుర్ముహుర్తం : ఉ 08.21 - 09.13 రా 11.08 - 11.52*

*రాహు కాలం : మ 03.28 - 05.05*

గుళిక కాలం :*మ 12.14 - 01.51*

యమ గండం :*ఉ 09.00 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.45 - 08.21*

సంగవ కాలం :*08.21 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.07*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ బహుళ తదియ*

సాయంకాలం :*సా 04.07 - 06.42*

ప్రదోష కాలం :*సా 06.42 - 08.55*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.02*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

*_గోమాతను 🐄పూజించండి_*

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🚩 *శ్రీ  ఆంజనేయం*🚩


🌹ఆర్తులను రక్షిస్తూ, ఆంజనేయా అని తలచిన అందరినీ ప్రజ్ఞా దైర్యవంతులను చేస్తూ... 

తనని స్మరించినంత మాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే *#ఆపద్భాందవుడు ఆంజనేయుడు*🙏


🌹తన ప్రభువు అయిన సుగ్రీవునకు,అవతార మూర్తులైన సీతారాములకు

హితాన్ని కూర్చిన మహామహిమోపేతుడు

*హనుమంతుడు*🙏


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

                  

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : విదియ* ఉ 10.23 వరకు ఉపరి *తదియ*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : ధనిష్ఠ* రా 08.18 వరకు ఉపరి *శతభిషం*


*యోగం : ఆయుష్మాన్* మ 02.36 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం : గరజి* ఉ 10.23 *వణజి* రా 08.56 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 11.00 - 01.00 మ 02.00 - 03.30*

అమృత కాలం :*ఉ 10.47 - 12.15*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*

*వర్జ్యం : రా 02.53 - 04.21 తె*

*దుర్ముహుర్తం : ఉ 08.21 - 09.13 రా 11.08 - 11.52*

*రాహు కాలం : మ 03.28 - 05.05*

గుళిక కాలం :*మ 12.14 - 01.51*

యమ గండం :*ఉ 09.00 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.45 - 08.21*

సంగవ కాలం :*08.21 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.07*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ బహుళ తదియ*

సాయంకాలం :*సా 04.07 - 06.42*

ప్రదోష కాలం :*సా 06.42 - 08.55*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.02*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

*_గోమాతను 🐄పూజించండి_*

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🚩 *శ్రీ ఆంజనేయం*🚩


🌹ఆర్తులను రక్షిస్తూ, ఆంజనేయా అని తలచిన అందరినీ ప్రజ్ఞా దైర్యవంతులను చేస్తూ... 

తనని స్మరించినంత మాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే *#ఆపద్భాందవుడు ఆంజనేయుడు*🙏


🌹తన ప్రభువు అయిన సుగ్రీవునకు,అవతార మూర్తులైన సీతారాములకు

హితాన్ని కూర్చిన మహామహిమోపేతుడు

*హనుమంతుడు*🙏


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ -  ధనిష్ఠ -‌‌ భౌమ వాసరే* (23.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/CIZGIvt6gpE?si=Kh1TjRaj4Gjv2xFbhttps://youtu.be/CIZGIvt6gpE?si=Kh1TjRaj4Gjv2xFb


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

తెలివి కల రాజు

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏼


శ్లో.  ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా  -  విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।

తురఙ్గమః శస్త్రనిపాతధీరః"  -  భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥ 


తే.గీ.  తెలివి కల రాజు నీవిని కలుగు ధనుఁడు,

నుత విరాగియౌ చదువరి, క్షితి సుశీల

వనిత, యుద్ధముననిలుచు ఘనతరాశ్వ

మనెడి యైదును ధాత్రికి కనగ నగలు. 


భావము. తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు." 

🙏🏼

చింతా రామకృష్ణారావు.

సమస్య పూరణ

 

ఇచ్చిన సమస్య:గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


నా పూరణ (చంపక మాల):


సుర రిపు వారమున్ సెలవు, చూడగ శ్రావణ శుక్రవారమౌ,

మరి యొక నాల్గు రోజులును మాకును గావలె పెండ్లి వేడ్కకున్,

దొరలకు విన్నవించెదను, తోషము గూర్చుచునొప్పుకొన్నచో,

గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


భావము: ఒక కుర్రాడు పెళ్ళి చేసుకోవాలి. దానికి సెలవలు కావాలి. శుక్రవారం ఎలాగూ శ్రావణ శుక్రవారం సెలవిచ్చారుట.

         మిగిలిన నాలుగు రోజులు (మంగళ, బుధ, గురు, శని) సెలవలు దొరికితే పెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి "దొరలకు" (పై అఫీసర్లకు) విన్నవించి, ఆ సెలవలు దొరికితే, మంగళవారం తాళి కట్టడం, తరువాత ఐదు రోజులు వేడుకలూను)

బూడిదనిచ్చే స్వామి

 *🟢బూడిదనిచ్చే స్వామి  మాటిచ్చాడు,నా తోడు వస్తానన్నాడు.*


*🔵గౌరీ పతి నా పక్షమన్నాడు,నన్ను కాస్థానన్నాడు.*


*🟠గంగాధారి తను నాకే సొంతం అన్నాడు.*


*🟤భోళా శంకరుడు నా పక్షమే వహిస్తానని మరీ,మరీ చెప్పాడు.*


*🟠ఏమైందో ఏమో ఎంతవేతికిన అడ్రస్సు చిక్కడం లేదు*

.

*🔵దారి తప్పాడో,ఇచ్చిన మాటే మరిచాడో జంగం దేవరుడు*


*🟡నువ్వు వచ్చేవరకు నేనిక్కడే.*

*నీ తోనే నా ప్రయాణం*


*⚫నన్ను నమ్ము స్వామి,నిన్నేమీ కోరనులే,నాకేమీ ఇవ్వద్దులే*.


*🟣ఒక్కసారి నీ స్పర్శ చాలు,నీ చల్లటి చూపు చాలు,అదే వంద వేలు.*


✍✍మూర్తి's కలం

కాలమిస్ట్,కవి.

9985617100.

ఆషాఢ మాసం - ప్రత్యేకత

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII    



ॐ  కొత్త దంపతులు 


    ఆషాఢ మాసంలో కొత్త కోడలూ, కొత్త అల్లుడూ వారివారి అత్తిళ్ళ గడపలు దాటకూడదు అంటారు. 

   దీని అసలు కారణాలు వెనక్కి వెళ్ళిపోయి, గడపలు దాటకుండా, మిగతా వ్యవహారాలు మాత్రం సాగిపోతున్నాయి. 

    ఈ ఆచారానికి అసలు కారణాలు 


1.మనది ప్రధానంగా వ్యావసాయక దేశం. ఆషాఢ మాసం ప్రారంభంనుంచీ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. 

     కాబట్టి వాటిమీద దృష్టి పెట్టాలి. 


2.నూతన దంపతులు ఆషాఢ మాసంలో కలిసి, స్త్రీ గర్భవతి అయితే, పురుడు వేసవి మధ్య కాలంలో వస్తుంది. స్త్రీకి మొదటి కానుపుకు ఆకాలం అనుకూలం కాదు. 

    అందుకనే దంపతులని ఆ నెల దూరంగా ఉంచడం. 

    కొద్దిరోజుల దూరం మరింత దగ్గరచేస్తుంది కూడా కదా! 


3.అత్తింటి దగ్గర కొత్త కోడలుగా ఉండి, పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అత్తింటి - పుట్టింటి ఆచార వ్యవహారాలవంటివన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ, సమన్వయ పరచుకునే వెసులుబాటు ఆషాఢమాసం వలనే. 

  (ప్రస్తుత residential విద్యా సంస్థల్లో, చేరిన పిల్లలకి మొదట్లో home sick అని సెలవులిస్తారు కదా!)


    పెద్దలు ఎంతో ఆలోచించి, మన శ్రేయస్సుకై అందిచ్చిన ఆచారాలను, యథాతథంగా కొనసాగించాలి కదా! 


                       సమాప్తం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

బ్రహ్మ*....*సృష్టి కర్త

 *🟠బ్రహ్మ*....*సృష్టి కర్త*.....నీకు గుడి లేదు,గోపురం లేదు,నైవేద్యం లేదు,అష్టోత్తరం లేదు,ఒక పండగ లేదు,పబ్బం లేదు.


*🟤శివయ్య*....*స్మశాన సంచారి*.....నీ రూపం తో పూజలు అందుకోలేవు,ఒక లింగాకారం మాత్రమే పూజించ బడుతోంది. నీ రూపు,రేఖలు తెలియవు.


*🟢విష్ణువు*...*వైకుంఠవాసి*......నిన్ను దశావతారాల్లో పూజించడమే గానీ, లక్ష్మీ తో కలసి నారాయణుడు గా కోవెల లేదు.

నిన్ను వివిధ అవతారాల్లో కొలుస్తాం.


🔴పూజ,పునస్కారాలు లేనివాడు, ఆకారం లేని వాడు,సొంత రూపం తప్ప వివిధ రూపాల్లో పూజలు, సేవలు అందుకునే మీరు ముగ్గురు ముగ్గురేనయ్య..


⚫మమ్మల్ని సక్రమంగా సాకి,అందర్నీ కాపాడండయ్యా,మాకు మాత్రం రంగు,రుచి, వాసన,బుద్ధి అన్ని వున్నాయి.

*సాటి వార్కి మంచి చేయలనే ఒక ఆలోచన తప్ప*.


✍మూర్తి's కలం .....

కాలమిస్ట్,9985617100.

చదువు...జ్ఞానం*..

 *చదువు...జ్ఞానం*...


🔴చదువంటే తపస్సు,క్రమశిక్షణ,నియమ,

నిష్టలు,కఠోర శ్రమ,సాధన ద్వారా మాత్రమే పొందగలిగే యోగం..


⚫దురదృష్టవశాత్తు నేడు అర్థం మారిపోయిన చదువులు..

పరీక్షల్లో పాస్ అయితే చదువు వచ్చినట్లే..


🟠నాలుగు ప్రశ్నలు ముక్కున పట్టి,ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బట్టి పడితే పాస్ అవుతారేమో కానీ జ్ఞానం అంటదు.


🟢చదువు అంటే సంస్కార వంత భాషణ,నలుగురితో మంచి నడవడిక,పెద్దల యందు గౌరవం,సమాజం పట్ల బాధ్యత వెరసి చదువు.


🔵ఉపయోగం లేని మార్కులు,పనికిరాని ర్యాంకులు,జీవిత గమ్యం చేర్చలేని పాఠాలు,మోయలేని బరువు గల పుస్తకాలు.


🟤తల్లిదండ్రుల జేబులకు చిల్లు తప్ప ఏ మాత్రం జీవితం లో అక్కరకు రాని చదువు.


✍✍ *మూర్తి's కలం*....

కాలమిస్ట్,కవి,లెక్చరర్.

9985617100.

నైవేద్య విశిష్టత,

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

     *నైవేద్య విశిష్టత, పద్ధతి*

  *నైవేద్యం పెట్టేటప్పుడు శ్లోకం*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం.*


*ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.*


*ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతి మాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు.*


*ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి.*


*దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.*


*ఒకసారి హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.*


*"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.  భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపార నిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామ దేవతలకైతే చద్దెన్నం మహా ప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క తప్పనిసరి.*


*నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి.*


*ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...*


**ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--*


*ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా | అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.*


*దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.*


*ఓం నమః శివాయ॥*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

సాంబారులో చందమామలు.

 నేటి తెలుగు వెలుగులో ఉషాకిరణాలు                               🧡 *జిహ్వకో రుచి* 🧡                                   Suguna Rupanagudi 


భోజన ప్రియులకు మాత్రమే!

సాంబారులో చందమామలు.


తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. 


అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. 


వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. 


భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం.


 కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ 


అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. 


చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. 


‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.


మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం.


 ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది!


 తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. 


‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. 


ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. 


విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. 


తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.


వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. 


పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! 


సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. 


‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. 


ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!


(తెలుగు వెలుగు  మాసపత్రిక సౌజన్యముతో)

భక్తుల సంబంధ 46 పుస్తకాలు

 *భక్తుల సంబంధ 46  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1 www.freegurukul.org/g/Bhakthulu-1


నాయన్మారులు-63 శివ భక్తుల చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-2


భక్త కనకదాస్ www.freegurukul.org/g/Bhakthulu-3


కక్కయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-4


పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు www.freegurukul.org/g/Bhakthulu-5


మహా భక్త విజయము www.freegurukul.org/g/Bhakthulu-6


భక్త మందారము-విష్ణు భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-7


బాల వీరులు www.freegurukul.org/g/Bhakthulu-8


కుచేలుడు www.freegurukul.org/g/Bhakthulu-9


ద్వాదశసూరి చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-10


మహా భక్త విజయము-46 భక్తుల కథలు www.freegurukul.org/g/Bhakthulu-11


నచికేతుడు www.freegurukul.org/g/Bhakthulu-12


చొక్కనాధ చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-13


వళ్ళలార్-జ్యోతి రామలింగస్వామి www.freegurukul.org/g/Bhakthulu-14


భక్తమందారం www.freegurukul.org/g/Bhakthulu-15


శివదీక్షాపరులు www.freegurukul.org/g/Bhakthulu-16


దాక్షిణాత్య భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-17


ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు www.freegurukul.org/g/Bhakthulu-18


భక్త కబీర్ www.freegurukul.org/g/Bhakthulu-19


పురందరదాసు www.freegurukul.org/g/Bhakthulu-20


భక్త నరసింహ మెహతా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-21


భక్త మల్లమ్మ www.freegurukul.org/g/Bhakthulu-22


భక్త తిన్నడు www.freegurukul.org/g/Bhakthulu-23


సిద్దయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-24


12 ఆళ్వార్ల  చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-25


భక్త రవిదాసు www.freegurukul.org/g/Bhakthulu-26


భక్త కనకదాసు www.freegurukul.org/g/Bhakthulu-27


చైతన్య చరితావళి-2 www.freegurukul.org/g/Bhakthulu-28


తేజోవలయాలు www.freegurukul.org/g/Bhakthulu-29


గుహుడు www.freegurukul.org/g/Bhakthulu-30


నమ్మాళ్వార్ www.freegurukul.org/g/Bhakthulu-31


నాగమహాశయుని జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-32


ఆదర్శ భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-33


ఆచార్య సూక్తి ముక్తావళి www.freegurukul.org/g/Bhakthulu-34


పెరుమాళ్ తిరుమొళి www.freegurukul.org/g/Bhakthulu-35


భక్త ఉద్దవ www.freegurukul.org/g/Bhakthulu-36


తుకారామస్వామి చరిత్రము www.freegurukul.org/g/Bhakthulu-37


భక్త పంచ రత్నాలు www.freegurukul.org/g/Bhakthulu-38


భక్త బృందము-1 www.freegurukul.org/g/Bhakthulu-39


భక్త ద్రువుడు www.freegurukul.org/g/Bhakthulu-40


భక్త లీలామృతము అను భక్త విజయ గ్రంధము www.freegurukul.org/g/Bhakthulu-41


సంపూర్ణ భక్త విజయము -1 www.freegurukul.org/g/Bhakthulu-42


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-43


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-44


భాగవత పంచ రత్నములు www.freegurukul.org/g/Bhakthulu-45


భక్త నందనార్ www.freegurukul.org/g/Bhakthulu-46


🙏💐🌻🌷🪷🌸🌹🌼🌺🌞🌝🎍

పంచాంగం



కాలం అన్నింటికంటే విలువైనది గొప్పది. అందుకే మనకి ఏదైనా బాధ ఎదుటి వ్యక్తి ప్రవర్తన వల్ల కానీ మాట వల్ల కానీ కలిగితే మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పేది కరెక్ట్ గా ఉంటుంది. ఓపిక పట్టి చూడాలి ఓపిక చాలా గొప్ప భూషణం.


🌹 నేటిమంచిమాట 🌹


మన జీవితమే చిన్నది బ్రతికినంతకాలం ఏం బ్రతుకురా వీడిది అని కాకుండా అబ్బా ఏం బ్రతికాడురా వీడు అనిపించుకునేట్లు బ్రతికితే వారి హృదయం లో స్థానం సంపాదించుకున్నట్లే. పంతాలకు పట్టింపులకు పోయి ఏమీ సాధించలేము .


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌷పంచాంగం🌷

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 23 - 07 - 2024,

వారం ...  భౌమ వాసరే ( మంగళవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం -  బహళ పక్షం,


తిథి      :  విదియ మ12.51 వరకు,

నక్షత్రం  :  ధనిష్ఠ రా11.46 వరకు,

యోగం :  ఆయుష్మాన్ సా6.27 వరకు,

కరణం  :  గరజి మ12.51 వరకు,

         తదుపరి వణిజ రా11.47 వరకు,


వర్జ్యం                :  ఉ.శే.వ6.17 వరకు,

దుర్ముహూర్తము :  ఉ8.13 - 9.05,

                              మరల రా10.59 - 11.43,

అమృతకాలం     :  మ1.53 - 3.25,

రాహుకాలం        :  మ3.00 - 4.30,

యమగండం       :  ఉ9.00 - 10.30,

సూర్యరాశి          :  కర్కాటకం,

చంద్రరాశి            :  మకరం,

సూర్యోదయం     :  5.39,

సూర్యాస్తమయం:  6.33,


              *_నేటి మాట_*


*ప్రారబ్దం అంటే ఏమిటి - దీనిని వదిలించు కునే మార్గం ఎలా???*

ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే...

అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక 

వదిలి పెడుతూ దేహాన్ని వదిలి వేస్తె అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావే అని 

దుఃఖిస్తూ కొందరు ఉంటే..

క్రొత్తగా నువ్వు వస్తున్నావు 

అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు .. రాక పోకల మధ్య నువ్వు 

మంచో  చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు . 


కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బేలెన్స్ చేస్తావు ఆబ్యాగ్ *సంచిత కర్మలు* ,,


అవి పెరిగి పెద్దవి అయి మేరు పర్వతాన్ని మించి 

కరడు గట్టిన ఓ కొండ గుట్టగా తయారు అవుతాయి . ‘’అవే *ప్రారబ్దం* . ఆ ప్రారబ్దం అనే బరువును నెత్తిన పెట్టుకుని ఇపుడు ఈ జన్మ తీసుకుంటావు . 

ఈ ప్రారబ్దం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు .🙇🏻‍♀️ (సుఖము దుఃఖము.. ఐశ్వర్యము ఆకలి రోదనలు ,,, 

ఇలా  రెండు ఇనుప బంగారు రెండు సంకెళ్ళే).


మరి ప్రారబ్దం కరిగించుకునే మార్గం :??


నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతి కర్మ 

నిన్ను అంటుకునే ఉంటుంది . 

మరి ఇక ఈ దేహం వదిలివేస్తే..అది కరెక్ట్ కాదు. ‘

నీ ప్రారబ్దం నిన్ను వదలదు . 

మట్టి కుండలో మంచి నిరు దాహం తీరుస్తుంది . 

కాబట్టి కుండ పగలకుండా జాగ్రత్త చేసుకోవాలి .

లేనిచో దాహం తీరదు . 

ఈ దేహాన్ని ఆధ్యాత్మిక భోదకు యోగ సాధనకు 

జాగ్రత్త చేసుకోవాలి .


ఈ పరికరంతోనే ఏదైనా చేయగలవు . 

ఇది లేకుంటే ఏది చెయ్యలేవు . 

ఎపుడు ఎరుకతో ఉంటూ... “ *జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి* “ ఎందుకంటే జ్ఞానం వలన క్రొత్త కర్మలు ఏర్పడవు . 

కానీ ప్రారబ్దం మాత్రం అనుభవించాలిసిందే ‘’ 🙇🏻‍♀️

ఇది ఎవరూ తప్పించ లేరు’ 

కాని’అన్యాదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మమ’’  అంటూ వాని పాదాలు పట్టుకుంటే తలకు తగలవలసిన దెబ్బ తలపాగాకు తగిలి వెళ్ళిపోతుంది....


చేసే ప్రతి పని నిష్కామంగా చేస్తూ ఉంటావో 

ఇదేదీ నాది కాదు’’ అసలు నేను ఇది కాదు ‘’ 

అనే భావంతో సంసారంలో ఉంటావు కాని 

సంసారం నీలో ఉండ కూడదు .

నావ సంద్రంలో ఉండాలి కాని సంద్రం నావలో 

ఉండ కూడదు . 

నీటి కోడి నీటిలో ఉన్నా దాని రెక్కలకు తడి అంటనట్లు , .. ఇలా ఉండటం సాధ్యమా ? నీకు నువ్వు ప్రశ్నించు కో ! 


ఆ మార్గంలో ఆ స్దితిలో నువ్వు వెళుతున్నావు అంటే 

ఇక నీ కర్మలు క్లియర్ అవుతున్నట్లే . 

దీనికి నువ్వే న్యాయ నిర్నేతవు .. 

బయట వాళ్ళు ఎవరూ మార్కులు వేయరు.

నీ మనస్సాక్షి నీకు మార్కులు వేస్తుంది.


ఈ స్దితికి నువ్వు ఎదిగినపుడు ఇక 

ఆగామి లేదు సంచితం లేదు ప్రారబ్దం లేదు ..

నువ్వు కేవలం *సాక్షివి* మాత్రమే.! 


               *_🌷శుభమస్తు🌷_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

ఆభరణములు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝  *ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా*

          *విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా*।

          *తురఙ్గమః శస్త్రనిపాతధీరః"*

          *భూమణ్డలస్యాభరణాని పఞ్చ*॥ 


తా𝕝𝕝 *తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."* 


 ✍️🌷💐🌹🙏