23, జులై 2024, మంగళవారం

నడిచే దేవుడు…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

230724-2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀499. పరమాచార్య పావన గాధలు…



*స్వామి అల్లిన మాలలు -*

           *దంపతుల మహద్భాగ్యం!*

                 ➖➖➖✍️


```

కాంచీపురంలోని కామకోటి పీఠంలో మహాపెరియవాను దర్శించి, ఆశీర్వాదం పొందడానికై ఒకనాటి సాయంత్రం వృద్ధ దంపతులొకరొచ్చారు. 


నూతన వస్త్రాలు ధరించియున్న వారు స్వామివారి ముందు ప్రణమిల్లారు. 


"అంతా సవ్వంగా జరిగిందా?", అని స్వామివారు అడిగారు. 


ఆ వృద్ధ మహిళ కన్నీటి పర్యంతమైంది. 


స్వామివారు వారినక్కడ కూర్చోమని ఆదేశించి వారితో సంభాషణారంభించారు. 


వారితో మాట్లాడుతూనే రెండు పూలమాలలను కట్టి, ఆ దంపతులకిచ్చి దండలు మార్చుకోమన్నారు. 


మహాస్వామి ఆదేశించడంతో అక్కడున్న వేదపండితులు కూడా మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. 


కన్నులవెంట నీరు కారుతుండగా, "సర్వేశ్వరా,సర్వేశ్వరా",అని ఆ మహిళ మౌనంగా జపిస్తోంది. 


కొద్దిసేపటి తరువాత స్వామివారు వారిద్దరినీ ఆశీర్వదించి పంపించారు.


స్వామివారు తానే స్వయానా ఎందుకు పూలమాలలు కట్టి 

ఆ దంపతులను ఆశీర్వదించారన్న ఉత్సుకత అక్కడున్న కొద్దిమంది భక్తులకు కలిగింది. 


తాము బెంగుళూరు వాస్తవ్యులమని, డెబ్బై సంవత్సరాలు  పూర్తైన తరువాత చేసే 'భీమరథ శాంతి' అనే వేడుక పూర్తిచేసుకొని మధ్యాహ్నం బెంగుళురుకు తిరుగు ప్రయాణమయ్యామని, ఆ మహిళ అక్కడున్న ఒక భక్తరాలికి చెప్పింది. 


తిరుగుప్రయాణంలో మహాస్వామి దర్శనం చేసుకొని, ఆశీర్వాదం తీసుకోవాలనుందన్న కోరిక ఆవిడ కొడుకుకి వెలిబుచ్చారు. 


మరుసటి రోజు తనకు బెంగళూరులో పని ఉందని, అందుకని అదే రోజు వెళ్ళడం అవ్వదని ఆవిడ కొడుకు అన్నాడు. 


కాకపోతే ఒక రెండు రోజుల్లో ఆవిడను కంచికి పంపడానికి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. 


మనస్సులో మౌనంగా మహాస్వామిని ప్రార్థించడం తప్ప ఆవిడకి వేరే గత్యంతరం లేకపోయింది.


చెన్నై నుండి కుటుంబం మొత్తం రెండు కార్లలో బయలుదేరారు. వెల్లోర్ కి చేరుకున్నారు. అక్కడ నుండి బెంగళూరుకు మళ్ళుదామనే సమయంలో కారు బ్రేక్ డౌన్ అయింది. కారు రిపేరు చెయ్యడానికి రెండు గంటలు పడుతుందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ నుండి కాంచీపురం దగ్గరే కాబట్టి, కారు రిపేరయ్యేలోపల వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వీలుపడుతుందా అని ఆవిడ కొడుకును అడిగారు. కొడుకు అభ్యంతరం చెప్పలేదు. 

ఆ దంపతులిరువురు మరొక కారులో కాంచీపురం పయనమయ్యారు. ఆ దంపతులకు దక్కిన మహద్భాగ్యం మనకు తెలిసినదే. స్వామివారి స్వహస్తాలతో అల్లిన పూలమాలను ప్రసాదంగా పొందిన ఆ దంపతులు ఎంత అదృష్టవంతులో కదా‌!


మహాస్వామి తన భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ వర్షిస్తారని తెలిపే మరొక నిదర్శనమే ఇది.✍️```



అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కామెంట్‌లు లేవు: